బసవరాజు అప్పారావు గీతములు/కడుపు తీపి
నో తల్లీ! నేటికి నీ
వుదయ మౌట నా యింటను
నమ్మా! ఓ లోకమాత!
కొమ్మా నా స్వాగతమ్ము.
- _______________
కడుపు తీపి
ఆకసమ్ము చిల్లి పడ్డ
యట్లు వర్ష మేకధార
కుండపోత బోసి కొట్టి
కుమ్మరించి దిమ్మరించె
క్రూరపు నీకాళరాత్రి
ఘోరమైన రుద్రభూమి
దల్లీ! నా మ్ంగళప్ర
దా! తడియుచు వడకుచుంటె?
ప్రణయసామ్రాజ్యపట్ట
భద్రుడవై నిద్రాళుల
పరమ కృపా పూర్ణ దృష్టి
బాలించెడు పరమేశా!
రుద్రభూమి నేకాకిగ
నిద్రంచెడు మమ్ము గన్న
మంగళప్రదను నిద్రా
భంగ మొదవకుండ గాచి
కరుణామృతధారల నా
కలిదప్పుల బాధ దీర్చి
చల్లనైన జోల పాడి
మెల్ల మెల్ల జోకొట్టుమ!
ఈ సాయము జేయుము నీ
ఋణము దీర్చికొందుమయ్య
ఈ జన్మను గాకున్నను
నింకొక జన్మముననైన!!
చలి పిడుగు
ప్రళయాంతాభీలనభో
దళన ఫెళ ఫెళారవముల
జలిపిడుగా ! గర్జింపకు
నిలిచి నాదు మనవి వినుము
బంగారపుబొమ్మ నాదు
మంగళప్రదమ్మ యొంటి
రుద్రభూమి గటిక నేల
నిద్ర్ంచెడు నొడలు మరచి.
చూపబోకు మచట నీప్ర
తాప మెల్ల పిడుగా ? నా
కన్న తల్లి యడిలి లేచి
కక్కటిల్లి యేడ్వగలదు !
కడుపుమంట గనలి పొక్కు
కన్న తండ్రి నైననాదు
పలువరింతమాటలకును
నలుక బూన కయ్య మదిని !