బసవరాజు అప్పారావు గీతములు/స్వాగతము
స్వాగతము
(మా మంగళప్రద జన్మకథ)
అమ్మా! ఓ లోకమాత
కొమ్మా నా స్వాగతమ్ము|| అమ్మా||
ఎల్ల జగమ్ముల నేలెడు
తల్లి మా యింట చిట్టి
పిల్లవుగా జన్మింపగ
నుల్లమునన్ గోరి వచ్చి
తమ్మా ఓ లోకమాత!
కొమ్మా నా స్వాగతమ్ము.
సకల చరాచర ప్రపం
చము లెల్ల జరించి వచ్చి
తల్లి! దయను నేటికి నా
యిల్లి పావనమ్ము జేసి
తమ్మా! ఓ లోకమాత!
కొమ్మా నా స్వాగతమ్ము.
నా తపమ్ము ఫలియించెను
నా జన్మము ధన్య మయ్యె
నో తల్లీ! నేటికి నీ
వుదయ మౌట నా యింటను
నమ్మా! ఓ లోకమాత!
కొమ్మా నా స్వాగతమ్ము.
- _______________
కడుపు తీపి
ఆకసమ్ము చిల్లి పడ్డ
యట్లు వర్ష మేకధార
కుండపోత బోసి కొట్టి
కుమ్మరించి దిమ్మరించె
క్రూరపు నీకాళరాత్రి
ఘోరమైన రుద్రభూమి
దల్లీ! నా మ్ంగళప్ర
దా! తడియుచు వడకుచుంటె?
ప్రణయసామ్రాజ్యపట్ట
భద్రుడవై నిద్రాళుల