బసవరాజు అప్పారావు గీతములు/చలి పిడుగు
చలి పిడుగు
ప్రళయాంతాభీలనభో
దళన ఫెళ ఫెళారవముల
జలిపిడుగా ! గర్జింపకు
నిలిచి నాదు మనవి వినుము
బంగారపుబొమ్మ నాదు
మంగళప్రదమ్మ యొంటి
రుద్రభూమి గటిక నేల
నిద్ర్ంచెడు నొడలు మరచి.
చూపబోకు మచట నీప్ర
తాప మెల్ల పిడుగా ? నా
కన్న తల్లి యడిలి లేచి
కక్కటిల్లి యేడ్వగలదు !
కడుపుమంట గనలి పొక్కు
కన్న తండ్రి నైననాదు
పలువరింతమాటలకును
నలుక బూన కయ్య మదిని !
ప్రళయాం తాభీలనభో
దళన ఫెళఫెళా రవముల
జలిపిడుగా ! గర్జింపకు
నిలిచి నాదుమనవి వినుము !
------
దోపిడి
కత్తి బెట్టీ పొడిచినావోయ్ దేవా !
గాయ మింకా మానలేదోయ్ దేవా !
నిలువూన యిల్లు దోచేశావ్ దేవా !
వెలలేనిమణిని కాజేశావ్ దేవా !
అమృతపాత్రము దొంగిలించావ్ దేవా !
అందులో విషము తారించావ్ దేవా !
----
శాస్తి
ఏనాడు నాటితినొ
యీ వలపుమాను ?
చిట్టి ! లతలా నన్ను
చుట్టుకున్నావు !
వెనకజన్మలో యేమి
పెట్టి పుట్టితిమొ ?
బంగారుపండంటి
పసిబాల కలిగె !
పెట్టి యెవరిని యేమి
తిట్టుకున్నామొ?
ఇచ్చిన్న దైవమూ
మర్చిపోడాయె !
--
నిర్వాణసుఖము
నామంగళప్రదా ! నా చిన్నతల్లి !
మరువలేదే నిన్ను మాకన్నతల్లి !
ఉదయాన సూర్యు డీ సదనకాంతులలో
బంగారు నీమేనిచాయలే గందు !
మల మలా మాడ్చేటి మధ్యాహ్న వేళా
గల గలా గలమని క్రింద్ రలేటి