ప్రపంచ చరిత్ర/ఆసియా : యూరోపు



4

ఆసియా : యూరోపు

జనవరి 8, 1931

ప్రతివస్తువును నిరంతరమును మారుచుండునని వెనుకటిజాబులో నేను చెప్పియుంటిని. అసలు చరిత్ర యనగా నేమి? — పరివర్తన వృత్తాంతమేగదా! గతకాలమున కొద్ది మార్పులే జరిగియున్నట్లయిన, వ్రాయదగ్గ చరిత్ర కొద్దిగానే యుండెడిది.

మనము బడులలోను, కళాశాలలలోను నేర్చుకొను చరిత్ర సామా న్యముగా హెచ్చుగా నుండదు. ఇతరుల సంగతి నాకు అట్టే తెలియదు. కాని నా సంగతి చెప్పవలసివచ్చిన ఆదిలో నేను నేర్చుకొన్న చరిత్ర బహుకొద్ది, హిందూ దేశచరిత్రను కొద్దిగా, బహుకొద్దిగా నేర్చుకొంటిని. ఇంగ్లాండు దేశ చరిత్ర కొద్దిగా నేర్చుకొంటిని. నేను నేర్చుకొన్న హిందూ దేశచరిత్రయైనను చాల భాగము తప్పు లేదా వికృత రూపము ధరించినది. దానిని వ్రాసినవారు మన దేశముపై సవతితల్లి ప్రేమ కలవారు. ఇతరదేశముల చరిత్రను గురించి నేను నేర్చుకొన్నది అంతంత. కళాశాలను వదలిపెట్టిన పిమ్మటనే యథార్థ చరిత్రమును కొంత నే సభ్యసించితిని. అదృష్టవశమున నా జ్ఞానమును వృద్ధిచేసికొనుటకు సావకాశము నాకు నా కారాగారవాస మొసగెను.

ఇండియా ప్రాచీననాగరికతను గురించియు, ద్రావిడులను గురించియు, ఆర్యుల యాగమనమును గురించియు ఇదివరలో నీకు వ్రాసిన జాబులలో చెప్పియుంటిని. ఆర్యులరాకకు ముందున్న కాలమునుగురించి నేను వ్రాయలేదు. నాకు దానిని గురించి అట్టే తెలియదు. ఈ మధ్యను కొద్ది సంవత్సరములకు లోపుగనే, మిక్కిలి ప్రాచీన నాగరికతా శిథిలములు ఇండియాలో కనుగొనబడినవన్న విషయము నీ కుత్సాహము కలిగించవచ్చును. ఇవి ఇండియాకు వాయవ్యదిశను 'మొహంజొదారొ అనే గ్రామ పరిసరముల నున్నవి. బహుశా 5000 సంవత్సరములకు పూర్వమందున్న కాలమునకు సంబంధించిన ఈ శిధిలములను త్రవ్వితీసిరి, ఈజిప్టులోని రక్షిత మానవకళేబరములవంటి కళేబరములుకూడ కనుగొనబడినవి. ఇదంతయు ఆర్యులు వచ్చుటకు పూర్వము - వేలకొద్ది సంవత్సరముల క్రితమసుమా! అప్పుడు యూరోపు ఒక అరణ్యమై యుండును.

నేడు యూరోపు బలముగాను, శక్తివంతముగాను ఉన్నది. అందలి ప్రజలు ప్రపంచమునందంతలోను నాగరీకులమనియు, విజ్ఞానవంతుల మనియు ననుకొనుచున్నారు. ఆసియాయన్నను, ఆసియాలోని ప్రజలన్నను వారికి ఈసడింపు. ఆసియా ఖండమందలి దేశములకు వచ్చి చేత చిక్కిన దెల్ల వారాదేశములనుండి గ్రహించుచున్నారు, కాల మెట్లు మారినది: యూరోపును, ఆసియాను పరిశీలించి చూతము. అట్లాసును తెరిచిచూడుము. పెద్దదగు ఆసియాఖండమున కంటుకొని చిన్నదగు యూరోపు ఎట్లున్నదో చూడుము. ఆసియా కొద్దిగా విస్తరించుటవల్ల యూరోపు తయారై నట్లున్నది. నీవు చరిత్ర చదివినప్పుడు నీకు విశదమగు విషయ మేమనగా...దీర్ఘ మగు కొన్ని కాలములపాటు ఆసియా ప్రబలముగా నుండెను. ఆసియాప్రజలు తడవులు తడవులుగా వెళ్ళి యూరోపును జయించిరి. యూరోపునువారు ధ్వంసముచేసిరి. యూరోపునకు వారు నాగరీకము నిచ్చిరి. ఆర్యులు, సిథియనులు, హూణులు, అరబ్బులు, మంగోలులు, తురుష్కులు -- వీరందరును ఆసియా ఏమూలనుండియో వచ్చి ఆసియాయూరోపులను క్రమ్ముకొనిరి. జట్టిమిడుతలవలె అధిక సంఖ్యాకులగు వీరిని ఆసియా ఉత్పత్తిచేసినది. నిజమునకు యూరోపు చిరకాలము ఆసియావలసభూమిగా నుండెను. నేటి యూరోపులో నున్న ప్రజలు పెక్కురుఆసియానుండి దండెత్తి పోయినవారి సంతానమే. కాళ్లు చేతులు చాపుకొని పడియున్న గొప్ప ఎడ్డెరాక్షసుని మాదిరి దేశపటమున కడ్డముగా ఆసియా వ్యాపించియున్నది. యూరోపు చిన్నది. ఇట్లనిన పరిమాణమునుబట్టి ఆసియా గొప్పదనియు, యూరోపు పరిగణింపదగ్గది కాదనియు అర్ధము చేసికొనరాదు. ఒక మానవుని యొక్కగాని, దేశముయొక్క గాని ఘనతను నిర్ణయించుటకు పరిమాణము తుచ్ఛసాధన మగు చున్నది. ఖండములలో కెల్ల చిన్నదైనను యూరోపు నేడు ఉన్నత స్థితిలో నున్నదని మనకు తెలియును. ఆఖండమందలి దేశము లనేకములకు దివ్యమగు చరిత్రభాగము లుండినవనికూడ మనకు తెలియును . ఆదేశములలో గొప్పశాస్త్రజ్ఞులు పుట్టిరి. వారు కొత్త విషయములు కనిపెట్టుటవల్లను, నూతనసాధనములుకల్పించుటవల్లను మానవ నాగరీకమును అత్యుచ్ఛస్థితికి తెచ్చిరి. కోట్లకొలది స్త్రీ పురుషుల జీవితభారమును తగ్గించిరి. ఆదేశములలో గొప్ప గ్రంథకర్తలు, తత్త్వజ్ఞులు, చిత్ర కారులు, గాయకులు, కార్యశూరులు ఉద్భవించిరి. యూరోపు ఘనతను ఒప్పుకొనకుండుట తెలివితక్కువ..

కాని ఆసియాఘనతను మరచిపోవుటకూడ అంతటితెలివితక్కువే. యూరోపు తళుకుబెళుకులు కొద్దిగాచూచి మనము మోసపోయి, గతమును విస్మరించవచ్చును. ఆసియాలోనే తత్త్వజ్ఞులు తలచూపిరి. లోకమున వారిప్రభావ మప్రతిమానమైనది. ప్రధానమతములను స్థాపించిన ఆచార్యపురుషులు వారు. ఈ విషయము మనము మరచిపోరాదు. నేడున్న మతము లన్నింటికన్న ప్రాచీనమైన హిందూమతమునకు జన్మభూమి ఆసియా, నేడు చీనా దేశములోను, జపాను, బర్మా, టిబెట్టు, సిలోను చేశములలోను కాలు నిలువద్రొక్కుకొన్న సోదరమతము బౌద్దముకూడ ఆసియాలో జన్మించినదే. యూదుల మతము, క్రైస్తవమతముకూడ ఆసియాలో పుట్టినవే. ఆసియాకు పశ్చిమతీరమందున్న పాలస్తీనాలో అవి తలయెత్తినవి. పారశీకుల మతమగు జొరోష్ట్రియన్ మతము పర్షియాలో ప్రారంభమైనది. అరేబియా దేశములోని మక్కా పట్టణమున మహమ్మదు ప్రవ క్త జన్మించెను. కృష్ణుడు, బుద్ధుడు, జొరాష్ట్రరు, క్రీస్తు, మహమ్మదు, చీనా దేశ తత్త్వజ్ఞులగు కంప్యూసియసు, లావోచే - ఆసియాలో పుట్టిన తత్త్వజ్ఞుల పేళ్ళతో పేజీలు నింపవచ్చును. ఆసియాలోని కార్యవాదుల పేళ్ళతోకూడ పేజీలు నింపవచ్చును. ప్రాతకాలములో ఈ మన ప్రాతఖండము ఎంత గొప్పగా, వీర్యవంతముగా నుండెడిదో ఇంకను అనేక విధములుగా నేను చెప్పగలను.

కాల మెట్లు మారినదో ! మన కన్నులయెదుట కాలము మరల మారుచున్నది. సామాన్యముగా శతాబ్దులగుండ చరిత్ర మెల్లగాపనిచేయుచు పోవును. అప్పుడప్పుడు తొందరగా పోవుట, ఉత్పాతము పుట్టుటకూడ కద్దు. అయినను నేడు ఆసియాలో అది తొందరగా పోపుచున్నది. - ధీర్ఘ నిద్రనుండి ఈ ప్రాతఖండము మేల్కొనుచున్నది. ప్రపంచము దానిని పరికించుచున్నది. ఎందుకనగా భావికాలమున ఆసియా ప్రాముఖ్య మధికముగా వహింపబోవుచున్నదని యందఱికిని తెలియును,

5

ప్రాతనాగరికతలు : మన వారసత్వము

జనవరి 9, 1931

వారమునకు రెండుసారులు బాహ్యప్రపంచవర్తమాసములు కొన్ని హిందీవార్తాపత్రికయగు “భారత్" మాకందిచ్చుచుండును. మలక్కా చెరసాలలో అమ్మను సరిగా చూచుటలేదని నిన్న ఆ పత్రికలో చదివితిని. నాకు కొద్దిగా కోపము వచ్చినది. మనస్సు వికలమైనది. " భారత్ "లో ప్రకటించిన వదంతి యథార్థము కాదేమో? దానినిగురించి సందేహములో పడుటకూడ మంచిది కాదు. ఆత్మార్థము, బాధ, ఇబ్బంది సహించుట సులభమే. అది అందఱికిని మంచిదే. లేకున్న మనము మరీ మెత్తని మనస్సుకల వారమగుదుము. ప్రేమాస్పదులగు మనవారు పడుచున్న బాధలను తలచుకొనుట - అందు ముఖ్యముగా మన మేమియు చేయలేని స్థితిలో నున్నప్పుడు సులభమునుకాదు, సుఖకరమునుకాదు. “భారత్"