పోతన తెలుగు భాగవతము/షష్ఠ స్కంధము/షష్ఠ్యంతములు

షష్ఠ్యంతములు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/షష్ఠ స్కంధము)
రచయిత: సింగయ


తెభా-6-32-క.
శ్రీతికి మత్పతికి నుత
గోతికిఁ ద్రిలోకపతికి గురుజనబుధ సం
తా నివారణ మతికిని
బ్రాపితసనకాది తతికి హుతర ధృతికిన్,

టీక:- శ్రీపతి = నారాయణుడు {శ్రీపతి - శ్రీ (లక్ష్మీదేవి) పతి (భర్త), విష్ణువు}; కిన్ = కి; మత్ = నా యొక్క; పతి = దేవుడు; కిన్ = కి; నుత = స్తుతింపబడిన; గోపతి = కృష్ణుని {గోపతి - గోవులకు అధిపతి, కృష్ణుడు}; కిన్ = కి; త్రిలోకపతి = నారాయణుడు {త్రిలోక పతి - ముల్లోకములకు భగవంతుడు, విష్ణువు}; కిన్ = కి; గురుజనబుధసంతాపనివారణమతికి = నారాయణుడు {గురుజన బుధ సంతాప నివారణ మతి - గురుజన (గొప్పవారి) బుధ (జ్ఞానుల) సంతాపములను నివారణ (పోగొట్టెడి) మతి (మనసు గలవాడు), విష్ణువు}; కిన్ = కి; ప్రాపితసనకాదితతి = నారాయణుడు {ప్రాపిత సనకాది తతి - ప్రాపిత (తనను పొందిన) సనక (సనకుడు) ఆది (మొదలగువారి) తతి (సమూహము గలవాడు), విష్ణువు}; కిన్ = కి; బహుతరధృతి = నారాయణుడు {బహుతరధృతి - బహుతర (అనేకమైన) ధృతి (ధీరత్వం కల వాడు), విష్ణువు}; కిన్ = కి.
భావము:- లక్ష్మీదేవికి పతి అయినవాడు, నాకు ఈశ్వరుడైనవాడు, ఇంద్రునిచేత నుతింపబడినవాడు, ముల్లోకాలకు అధిపతి అయినవాడు, గొప్పవారైన పండితుల సంతాపాన్ని నివారించేవాడు, సనక సనందాది మహర్షులకు ఆశ్రయమైనవాడు, గొప్ప ధీరుడు అయిన శ్రీకృష్ణునికి...

తెభా-6-33-క.
రికి గురు కలుషకుంజర
రికి బలాభీలహరికి నంతస్థ్సిత గ
హ్వరికి నరహరికి రక్షిత
రికిఁ గరాగ్రస్థగిరికి నతరకిరికిన్.

టీక:- హరి = నారాయణుడు {హరి - కల్మషములు హరించు వాడు, విష్ణువు}; కిన్ = కి; గురుకలుషకుంజరహరి = నారాయణుడు {గురు కలుష కుంజర హరి - గురు (పెద్ద పెద్ద) కలుష (పాపము లనెడి) కుంజర (ఏనుగులను) హరి (సంహరించెడి వాడు), విష్ణువు}; కిన్ = కి; బలాభీలహరి = నారాయణుడు {బలాభీల హరి - బలుడు అభీలుడను రాక్షసులను హరి (సంహరించిన వాడు), విష్ణువు}; కిన్ = కి; అంతస్థ్సితగహ్వరి = నారాయణుడు {అంతస్థ్సిత గహ్వరి - అంత (అంతరంగములో) స్థిత (ఉన్నట్టి) గహ్వరి (గుహ లందుండు వాడు), విష్ణువు}; కిన్ = కి; నరహరి = నారాయణుడు {నరహరి - నరసింహమూర్తి యైనవాడు, విష్ణువు}; కిన్ = కి; రక్షితకరి = నారాయణుడు {రక్షిత కరి - రక్షిత (కాపాడబడిన) కరి (గజేంద్రుడు గలవాడు), విష్ణువు}; కిన్ = కి; కరాగ్రస్థగిరి = నారాయణుడు {కరాగ్రస్థ గిరి - కర (చేతి) అగ్ర (పైన) గిరి (కొండ (గోవర్దనగిరి) గలవాడు), కృష్ణుడు}; కిన్ = కి; ఘనతరకిరి = నారాయణుడు {ఘనతర కిరి - ఘనతర (మిక్కిలి గొప్పదైన) కిరి (వరాహావతారు డైన వాడు), విష్ణువు}; కిన్ = కి.
భావము:- పాపసంహారకుడు, భయంకర పాపాలనబడే ఏనుగులకు సింహం వంటివాడు, ఇంద్రుని గర్వాన్ని అణచినవాడు, బలుడు అభీలుడు అనే రాక్షసులను సంహరించినవాడు, జనుల హృదయాంతరాలలో నివసించేవాడు, నరసింహ స్వరూపుడు, గజేంద్రుని కాపాడినవాడు, కొనగోటిపై గోవర్ధన పర్వతం కలవాడు, ఆది వరాహమూర్తి అయిన శ్రీకృష్ణునికి...

తెభా-6-34-క.
గుణికి సమాశ్రిత చింతా
ణికి మహేంద్రాది దివిజమండల చూడా
ణికిఁ బ్రకల్పితశయ్యా
ణికి నురోభాగ కౌస్తుప్రియమణికిన్,

టీక:- గుణి = నారాయణుడు {గుణి - సుగుణముల స్వరూపమైనవాడు, విష్ణువు}; కిన్ = కి; సమాశ్రితచింతామణి = నారాయణుడు {సమాశ్రిత చింతామణి - సమ (చక్కగా) ఆశ్రిత (ఆశ్రయించిన వారికి) చింతామణి (కోరిన కోరిక లనుగ్రహించు మణి వంటి వాడు), విష్ణువు}; కిన్ = కి; మహేంద్రాదిదివిజమండలచూడామణి = నారాయణుడు {మహేంద్రాది దివిజ మండల చూడామణి - మహేంద్ర (ఇంద్రుడు) ఆది (మొదలగు) దివిజ (దేవతల) మండలి (సమూహ మంతటికి) చూడామణి (తలమానిక మణి వంటివాడు), విష్ణువు}; కిన్ = కి; ప్రకల్పితశయ్యాఫణి = నారాయణుడు {ప్రకల్పిత శయ్యా ఫణి - ప్రకల్పిత (చక్కగా ఏర్పరుపబడిన) శయ్య (పడక యైన) ఫణి (ఆదిశేషుడు గలవాడు), విష్ణువు}; కిన్ = కి; ఉరోభాగకౌస్తుభప్రియమణి = నారాయణుడు {ఉరోభాగ కౌస్తుభ ప్రియ మణి - ఉరోభాగ (వక్షస్థలమున) కౌస్తుభ (కౌస్తుభమనెడి) ప్రియ (ఇష్టమైన) మణి (మణి గలవాడు), విష్ణువు}; కిన్ = కి.
భావము:- సద్గుణవంతుడు, ఆశ్రితుల కోరికలు తీర్చే చింతామణి అయినవాడు, ఇంద్రుడు మొదలైన దేవతలకు శిరోరత్నమైనవాడు, ఆదిశేషుని పాన్పుగా చేసికొన్నవాడు, వక్షఃస్థలం మీద కౌస్తుభమణి కలిగినవాడు అయిన శ్రీకృష్ణునికి...

తెభా-6-35-క.
కంసాసుర సంహారున
కంసాంచిత కర్ణకుండ లాభరణునకున్
హింసాపర పరమస్తక
మాంకరాళిత గదాభిత హస్తునకున్.

టీక:- కంసాసురసంహారున్ = నారాయణుడు {కంసాసుర సంహారు - కంస (కంసు డనెడి) అసుర (రాక్షసుని) సంహారు (సంహరించిన వాడు), కృష్ణుడు}; కిన్ = కి; అసాంచితకర్ణకుండలాభరణున్ = నారాయణుడు {అంసాంచిత కర్ణకుండ లాభరణుడు - అంస (మూపులపై) అంచిత (అలంకరింప బడిన) కర్ణకుండలములు ఆభరణములుగా గలవాడు, విష్ణువు}; కిన్ = కి; హింసాపరపరమస్తకమాంసకరాళితగదాభిమతహస్తున్ = నారాయణుడు {హింసా పర పరమస్తక మాంస కరాళిత గదాభిమత హస్తుడు - హింసపర (హింస యందు లగ్నమైన) పర (శత్రువుల) మస్తక (శిరస్సు లందలి) మాంస (మాంసము) కరాళిత (క్రూరము గల) గద (గదాయుధమును) అభిమత (కోరి ధరించిన) హస్తున్ (హస్తము గలవాడు), విష్ణువు}; కిన్ = కి.
భావము:- కంసుడనే రాక్షసుని సంహరించినవాడు, భుజాలు తాకే కర్ణకుండలాలు భూషణాలుగా కలవాడు, హింసాపరులైన విరోధుల శిరస్సులను చితుకబాదగా ఆ మాంసఖండాలతో నిండిన గదాదండాన్ని చేత ధరించినవాడు అయిన శ్రీకృష్ణునికి...

తెభా-6-36-క.
యోగిమాన సాంతః
ణ సుధాంభోధి భావల్లోల లస
త్పతత్త్వశేషశాయికిఁ
జిదాయికి సకలభక్తచింతామణికిన్

టీక:- వరయోగిమానసాంతఃకరణసుధాంభోధిభావకల్లోలలసత్పరతత్త్వశేషశాయి = నారాయణుడు {వర యోగి మానసాంతఃకరణ సుధాంభోధి భావకల్లోలల సత్పరతత్త్వ శేషశాయి - వర (ఉత్తమ) యోగి (యోగుల) మానస (మనసుల) అంతఃకరణములు యనెడి సుధాంభోధి (పాలసముద్రము నందలి) భావము లనెడి కల్లోల (కెరటములపై) లసత్ (ప్రకాశించుతున్న) పరతత్త్వ (పరబ్రహ్మ స్వరూపుడైన) శేష (ఆదిశేషుడు) శాయి (శయ్యగ గలవాడు), విష్ణువు}; కిన్ = కి; సకలభక్తచింతామణి = నారాయణుడు {సకల భక్త చింతామణి - సకల (సమస్తమైన) భక్త (భక్తులకు) చితామణి (కోరిన కోరికల నిచ్చు మణి వంటివాడు), విష్ణువు}; కిన్ = కి.
భావము:- పరమ యోగీంద్రుల అంతఃకరణమనే పాలసముద్రంలో భావ తరంగాలలో తేలియాడే శేషతల్పంపై శయనించే పరతత్త్వం, భక్తుల పాలిటి చింతామణియై శాశ్వతమైన మేలును కలిగించేవాడు అయిన శ్రీకృష్ణునికి (ఈ కృతిని సమర్పిస్తున్నాను).