పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/నారదునికి దేవుడుదోచుట


తెభా-1-124-శా.
నందాశ్రులు గన్నులన్ వెడల, రోమాంచంబుతోఁ, దత్పద
ధ్యానారూఢుఁడ నైన నా తలఁపులో ద్దేవుఁడుం దోఁచె నే
నానందాబ్ధిగతుండనై యెఱుఁగలేనైతిన్ ననున్నీశ్వరున్,
నానాశోకహమైన యత్తనువు గానన్ లేక యట్లంతటన్.

టీక:- ఆనందాశ్రులు = ఆనందబాష్పములు; కన్నులన్ = కళ్లవెంట; వెడల = కారగ; రోమాంచంబు = వెంట్రుకల గగుర్పాటు; తోన్ = తో; తత్ = వాని; పద = పాదముల; ధ్యాన = ధ్యానములో; ఆరూఢుఁడన్ = మునిగినవాడను; ఐన = అయిన; నా = నా; తలఁపు = భావము; లోన్ = లో; ఆ = ఆ; దేవుఁడున్ = దేవుడు; తోఁచెన్ = తోచెను; నేన్ = నేను; ఆనంద = సంతోష; అబ్ధి = సాగరములో; గతుండన్ = మునిగినవాడను; ఐ = అయి; ఎఱుఁగ = తెలిసికొన; లేనైతిన్ = లేకపోతిని; ననున్ = నన్నూ; ఈశ్వరున్ = ఈశ్వరుని; నానా = సమస్త; శోక = శోకములను; అహము = పోగొట్టునది; ఐన = అయినట్టి; ఆ = ఆ; తనువున్ = రూపమును; కానన్ = చూడ, కనుగొన; లేక = లేక; అట్లు = ఆవిధముగ; అంతటన్ = అప్పుడు.
భావము:- నా కళ్ళల్లో ఆనందబాష్పాలు పొంగిపొర్లాయి. నా శరీరమంతా పులకించింది. ఆ భక్తి పారవశ్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు. నేను కన్నులు తెరచి చూచేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచలు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైపోయింది.

తెభా-1-125-వ.
లేచి నిలుచుండి, క్రమ్మఱ నద్దేవుని దివ్యాకారంబుఁ జూడ నిచ్ఛించుచు, హృదయంబున నిలుపుకొని యాతురుండునుంబోలె జూచియుం గానలేక, నిర్మనుష్యం బైన వనంబునం జరియించుచున్న నన్ను నుద్దేశించి వాగగోచరుం డైన హరి గంభీర మధురంబులైన వచనంబుల శోకం బుపశమింపం జేయు చందంబున నిట్లనియె.
టీక:- లేచి = లేచి; నిలుచుండి = నిలబడి; క్రమ్మఱన్ = మరల; ఆ = ఆ; దేవుని = దేవుని యొక్క; దివ్య = దివ్యమైన; ఆకారంబున్ = ఆకారమును; చూడన్ = చూచుటను; ఇచ్ఛించుచున్ = కోరుతూ; హృదయంబున = హృదయములో; నిలుపుకొని = నిలుపుకొని; ఆతురుండునున్ = ఆతురతతో యున్నవాడు; పోలెన్ = వలె; చూచియున్ = వెతికి చూచి కూడ; కాన = కనుగొన; లేక = లేక; నిర్మనుష్యంబు = మనుష్య సంచారము లేనిది; ఐన = అయినట్టి; వనంబునన్ = అరణ్యములో; చరియించుచున్న = తిరుగుతున్న; నన్నున్ = నన్ను; ఉద్దేశించి = ఉద్దేశించి; వాక్ = వాక్కువలన {వాగగోచరుడు - వాక్కు వలన తెలియరానివాడు}; అగోచరుండు = తెలుప సాధ్యం కాని వాడు; ఐన = అయినట్టి; హరి = హరి; గంభీర = గంభీరమైనవియును; మధురంబులు = మధురమైనవియును; ఐన = అయినట్టి; వచనంబులన్ = మాటలతో; శోకంబున్ = విచారమును; ఉపశమింపన్ = ఉపశమించునట్లు; చేయు = చేయు; చందంబునన్ = విధముగ; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.
భావము:- నేను విచారంతో లేచి నిల్చున్నాను. మళ్లీ ఆ దేవదేవుని దివ్యస్వరూపాన్ని దర్శించాలనే ఉత్కంఠతో నిర్మానుష్యమైన ఆ అరణ్యంలో అటూ ఇటూ తిరుగసాగాను. కాని నాకు తిరిగి ఈశ్వర సాక్షాత్కారం కలుగలేదు. అంతలో మాటలలో వివరించ సాధ్యం కాని వాడు అయిన శ్రీహరి మధుర గంభీర వచనాలు నా శోకాన్ని ఉపశమింపజేస్తూ నన్ను ఓదారుస్తూ ఈ విధంగా వినవచ్చాయి.

తెభా-1-126-ఉ.
" కుమార! శోషిలఁగ? నీ జననంబున నన్నుఁ గానఁగాఁ
జావు నీవు, కామముఖట్కము నిర్దళితంబు సేసి ని
ర్మూలితకర్ములైన మునిముఖ్యులు గాని, కుయోగిఁ గానఁగాఁ
జాలఁడు, నీదు కోర్కి కొనసాఁగుటకై నిజమూర్తిఁ జూపితిన్.

టీక:- ఏల = ఎందుకు; కుమార = కుమారా; శోషిలఁగన్ = అయాసపడుట; ఈ = ప్రస్తుత; జననంబునన్ = జన్మలో; నన్నున్ = నన్ను; కానఁగాఁన్ = దర్శించ; చాలవు = లేవు, సరిపడవు; నీవు = నీవు; కామ = కామము {కామముఖషట్కము - అరిషడ్వర్గములు -శత్రువులు 6 - కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య, మోహములు)}; ముఖ = మొదలగు; షట్కమున్ = ఆరుగురు; నిర్దళితంబున్ = ఖండితముగ; చేసి = చేసి; నిర్మూలిత = నిర్మూలింపబడిన; కర్ములు = కర్మములుగలవారు; ఐన = అయినట్టి; ముని = మునులలో; ముఖ్యులు = ముఖ్యమైనవారు; కాని = కాని; కుయోగి = చెడ్డవాడైన యోగి; కానఁగాన్ = దర్శించను; చాలఁడు = సరిపోడు, చేయలేడు; నీదు = నీ యొక్క; కోర్కి = తపన, ఇచ్చ; కొనసాఁగుట = కొనసాగుట; కై = కై; నిజ = నాయొక్క; మూర్తిన్ = ఆకారమును; చూపితిన్ = చూపించితిని.
భావము:- “నాయనా! ఎందుకలా వృథాగా ఆయాసపడతావు. నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు. కామక్రోధాది అరిషడ్వర్గాన్ని జయించి నిర్మూలితకర్ములైన ముని ముఖ్యులే నన్ను చూడ గల్గుతారు. అంతే కాని జితేంద్రియులు కానివారు నన్ను దర్శించలేరు. అయినా నీ మనసులోని కోరికను కొనసాగించటం కోసం క్షణ కాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశాను.

తెభా-1-127-క.
నాలని కోర్కి యూరక
పోదు, విడిపించు దోషపుంజములను, మ
త్సేవం బుట్టును వైళమ
భావింపఁగ నాదు భక్తి బాలక! వింటే.

టీక:- నావలని = నామీద; కోర్కి = భక్తి; ఊరకన్ = ఊరికే; పోవదు = పోదు; విడిపించున్ = విడిపించును; దోష = పాపపు; పుంజములను = సమూహములను; మత్ = నాయొక్క; సేవన్ = సేవవలన; పుట్టును = కలుగును; వైళమ = శ్రీఘ్రముగ; భావింపఁగ = ఎంచిచూస్తే; నాదు = నాయొక్క; భక్తి = భక్తి; బాలక = కుమారా; వింటే = వింటున్నావా
భావము:- వత్సా! నా యందు లగ్నమైన నీ కోరిక వ్యర్థం కాదు. నీ సమస్త దోషాలూ దూరమౌతాయి. నన్ను సేవించటం వల్ల నాభక్తి అచిరకాలంలోనే నీమదిలో పదిలమౌతుంది.

తెభా-1-128-క.
నాయందుఁ గలుగు నీ మది
వాదు జన్మాంతరముల బాలక! నీ వీ
కాయంబు విడిచి మీఁదట
మా నుమతిఁ బుట్టఁగలవు ద్భక్తుఁడవై.

టీక:- నా = నా; అందున్ = మీద; కలుగు = కలుగును; నీ = నీ; మది = మనసు; పాయదు = విడువదు; జన్మ = జన్మముల; అంతరములు = ఇతరములుకును; బాలక = కుమార; నీవు = నీవు; ఈ = ఈ; కాయంబున్ = శరీరమును; విడిచి = విడిచిన; మీఁదటన్ = తరువాత; మా = మా యొక్క; అనుమతిన్ = అనుమతితో; పుట్టన్ = (మరల) పుట్ట; కలవు = కలవు; మత్ = నాయొక్క; భక్తుఁడవు = భక్తుడవు; ఐ = అయి.
భావము:- కుమారా నా యందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో కూడా నన్ను అంటిపెట్టుకొని ఉంటుంది. నీవు ఈ దేహాన్ని వదలిన అనంతరం నా అనుజ్ఞతో మరు జన్మలో నా భక్తుడివై ఉద్భవిస్తావు.

తెభా-1-129-మ.
విను; మీ సృష్టిలయంబు నొంది యుగముల్ వేయైన కాలంబు యా
మినియైపోయెడిఁ బోవఁగాఁ, గలుగుఁజూమీఁదం బునఃసృష్టి, యం
దు నిరూఢస్మృతితోడఁ బుట్టెదవు నిర్దోషుండవై నా కృపన్,
తం జెందెదు శుద్ధ సాత్త్వికులలో ణ్యుండవై యర్భకా!"

టీక:- విను = వినుము; ఈ = ప్రస్తుత; సృష్టి = సృష్టి (మొత్తము); లయంబున్ = అంతము (ప్రళయము); ఒంది = పొంది; యుగముల్ = యుగములు; వేయి = వెయ్యి; ఐన = అయిన; కాలంబు = కాలము; యామిని = రాత్రి (బ్రహ్మ); ఐపోయెడిన్ = అయిపోవుట; పోవఁగాన్ = (అది) గడిచిపోగా; కలుగుఁన్ = జరుగును; సుమీ = సుమా; మీఁదన్ = ఆపైన; పునః = మరల; సృష్టి = సృష్టి; అందున్ = అందు; నిరూఢ = గట్టి; స్మృతి = జ్ఞాపకశక్తి; తోడన్ = కలిగి; పుట్టెదవు = జన్మించెదవు; నిర్దోషుండవు = దోషములు లేనివాడవు; ఐ = అయి; నా = నాయొక్క; కృపన్ = కృప వలన; ఘనతన్ = గొప్పతనమును; చెందెదు = పొందెదవు; శుద్ధ = పరిశుద్ధమైన; సాత్త్వికుల = సత్త్వగుణసంపన్నులు; లోన్ = లో; గణ్యుండవు = గొప్పవాడవు; ఐ = అయి; అర్భకా = బాలకుడా.
భావము:- విను చిట్టితండ్రి! ఈ సృష్టి యావత్తూ లయమైపోయిన పిమ్మట వేయి యుగాలు చీకటి రాత్రిగా గడిచిపోతుంది. అప్పుడు తిరిగి సృష్టి ఏర్పడుతుంది. నీవు మళ్లీ జన్మిస్తావు. నీకు పూర్వస్మృతి ఉంటుంది. నా అనుగ్రహం వల్ల నీ దోషాలన్నీ నశించి సత్వ గుణసంపన్నులైన హరిభక్తులలో అగ్రగణ్యుడవై ప్రసిద్ధుడవు అవుతావు.”

తెభా-1-130-వ.
అని యిట్లాకాశంబు మూర్తియు, ఋగ్వేదాదికంబు నిశ్వాసంబునుగా నొప్పి, సర్వనియామకం బైన మహాభూతంబు వలికి యూరకున్న; నేను మస్తకంబు వంచి మ్రొక్కి, తత్కరుణకు సంతసించుచు, మదంబు దిగనాడి, మచ్చరంబు విడిచి, కామంబు నిర్జించి, క్రోధంబు వర్జించి, లోభమోహంబుల వెడల నడిచి, సిగ్గు విడిచి, యనంత నామంబులు పఠించుచుఁ, బరమ భద్రంబు లయిన తచ్చరిత్రంబులం జింతించుచు, నిరంతర సంతుష్టుండనై కృష్ణుని బుద్ధి నిలిపి, నిర్మలాంతఃకరణంబులతోడ విషయవిరక్తుండ నై, కాలంబున కెదురు సూచుచు భూమిం దిరుగుచు నుండ; నంతం గొంతకాలంబునకు మెఱుంగు మెఱసిన తెఱంగున మృత్యువు దోఁచినం, బంచభూతమయం బయి కర్మస్వరూపం బైన పూర్వ దేహంబు విడిచి హరికృపావశంబున శుద్ధసత్త్వమయం బైన భాగవతదేహంబు సొచ్చితి; నంతం ద్రైలోక్యంబు సంహరించి ప్రళయకాల పయోరాశి మధ్యంబున శయనించు నారాయణమూర్తి యందు నిదురవోవ నిచ్చగించు బ్రహ్మనిశ్వాసంబు వెంట నతని లోపలం బ్రవేశించితి; నంత సహస్ర యుగ పరిమితంబైన కాలంబు సనిన లేచి లోకంబులు సృజియింప నుద్యోగించు బ్రహ్మనిశ్వాసంబు వలన మరీచి ముఖ్యులగు మునులును నేనును జనియించితిమి; అందు నఖండిత బ్రహ్మచర్యుండనై యేను మూఁడు లోకంబుల బహిరంతరంబు లందు మహావిష్ణుని యనుగ్రహంబున నడ్డంబు లేక యీశ్వరదత్తమై బ్రహ్మాభివ్యంజకంబు లైన సప్తస్వరంబులు దమ యంతన మ్రోయుచున్న, యీ వీణాలాపన రతింజేసి నారాయణకథాగానంబు సేయుచుఁ జరియించు చుందు.
టీక:- అని = అని; ఇట్లు = ఈవిధముగ; ఆకాశంబు = ఆకాశము; మూర్తియు = రూపముగను; ఋగ్వేద = ఋగ్వేదము; ఆదికంబు = మొదలగునవి; నిశ్వాసంబునున్ = ఊపిరియును; కాన్ = కాగా; ఒప్పి = అమరి; సర్వ = సర్వమును; నియామకంబు = నియమించునది; ఐన = అయినట్టి; మహా = బృహత్; భూతంబు = ప్రకృతి; పలికి = పలికి; ఊరక = ఊరక; ఉన్నన్ = ఉండిన; నేను = నేను; మస్తకంబున్ = శిరస్సు; వంచి = వంచి; మ్రొక్కి = నమస్కరించి; తత్ = ఆయొక్క; కరుణ = దయ; కున్ = కు; సంతసించుచున్ = సంతోషించుచు; మదంబున్ = గర్వమును; దిగనాడి = వదిలివేసి; మచ్చరంబున్ = మాత్సర్యమును; విడిచి = విడనాడి; కామంబున్ = కామమును; నిర్జించి = అణచి; క్రోధంబున్ = కోపమును; వర్జించి = వదిలిపెట్టి; లోభ = లోభమును; మోహంబులన్ = మోహములను; వెడలనడిచి = గెంటి వేసి; సిగ్గున్ = సిగ్గును; విడిచి = విడిచి; అనంత = అనంతుని, భగవంతుని అనంతమైన; నామంబులున్ = నామములను; పఠించుచున్ = చదువుతూ; పరమ = అన్నిటికంటె ఉత్తమమైన; భద్రంబులు = క్షేమకరములు; అయిన = అయినట్టి; తత్ = అతని; చరిత్రంబులన్ = చరిత్రలను; చింతించుచు = తలుస్తూ; నిరంతర = ఎడతెగని; సంతుష్టుండను = సంతోషము కలవాడను; ఐ = అయి; కృష్ణుని = విష్ణువుని; బుద్ధిన్ = బుద్ధిలో; నిలిపి = స్థిరపరుచుకొని; నిర్మల = మలినములేని; అంతఃకరణంబుల = లోపలి ఇంద్రియముల {అంతఃకరణములు - శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసనలు వాని స్థానములు}; తోడన్ = తో; విషయ = విషయములమీద {విషయములు - ఇంద్రియాలకు సంబంధించినవి}; విరక్తుండను = ఆసక్తిలేనివాడను; ఐ = అయి; కాలంబు = (మరణ)కాలము; కున్ = కు; ఎదురు = ఎదురు; సూచుచు = చూస్తూ; భూమిన్ = భూమిమీద; తిరుగుచున్ = తిరుగుతూ; ఉండన్ = ఉండగా; అంతన్ = అంతట; కొంత = కొంత; కాలంబు = కాలము; కున్ = తరువాత; మెఱుంగు = మెరుపు; మెఱసిన = మెరిసిన; తెఱంగునన్ = విధముగ; మృత్యువు = మరణము; తోఁచినన్ = ప్రత్యక్షము కాగా; పంచభూత = పంచభూతములతో; మయంబు = కూడినది; అయి = అయినట్టి; కర్మ = కర్మము యొక్క; స్వరూపంబు = స్వరూపము; ఐన = కలిగిన; పూర్వ = పూర్వజన్మలోని; దేహంబు = దేహమును; విడిచి = విడిచిపెట్టి; హరి = హరియొక్క; కృపా = దయ; వశంబునన్ = వలన; శుద్ధ = పరిశుద్ధమైన; సత్త్వ = సత్త్వగుణముల; మయంబు = కూడినది; ఐన = అయినట్టి; భాగవత = భగవంతునియొక్క; దేహంబు = దేహము, రూపము; చొచ్చితిన్ = ప్రవేశించితిని, లీనమైతిని; అంతన్ = అంతట; త్రైలోక్యంబున్ = మూడు లోకములను; సంహరించి = నాశనము చేసి; ప్రళయ = కల్పాంత; కాల = కాలములో; పయోరాశి = సముద్ర; మధ్యంబున = మధ్యభాగమున; శయనించు = పండుకొను; నారాయణమూర్తి = విష్ణుమూర్తి; అందున్ = లోపల; నిదుర = నిద్ర; పోవ = పోవుటకు; ఇచ్చగించు = నిశ్చయించు; బ్రహ్మ = బ్రహ్మయొక్క; నిశ్వాసంబు = ఊపిరి; వెంటన్ = వెనకన; అతని = అతని; లోపలన్ = లోపలికి; ప్రవేశించితిన్ = చొచ్చితిని; అంత = అంతట; సహస్ర = వెయ్యి; యుగ = యుగముల; పరిమితంబు = పర్యంతము; ఐన = అయినట్టి; కాలంబు = కాలము; చనిన = గడచిన; లేచి = లేచి; లోకంబులున్ = లోకములను; సృజియింపన్ = సృష్టించవలెనని; ఉద్యోగించు = ప్రయత్నము చేయు; బ్రహ్మ = బ్రహ్మయొక్క; నిశ్వాసంబు = ఊపిరి; వలనన్ = ద్వారా; మరీచి = మరీచి; ముఖ్యులగు = మొదలగు; మునులును = మునులును; నేనును = నేనును; జనియించితిమి = పుట్టితిమి; అందున్ = వారిలో; అఖండిత = ఎడతెగని; బ్రహ్మచర్యుండన్ = బ్రహ్మచర్య వ్రతధారుడను; ఐ = అయి; ఏను = నేను; మూఁడు = మూడు; లోకంబులన్ = లోకముల యొక్క; బహిర్ = బయటి భాగములు; అంతరంబులు = లోపటి భాగములు; అందున్ = అందును; మహా = గొప్పవాడైన; విష్ణుని = భగవంతుని యొక్క; అనుగ్రహంబునన్ = అనుగ్రహము వలన; అడ్డంబు = అడ్డము; లేక = లేకుండగ; ఈశ్వర = ఈశ్వరునిచే; దత్త = ఇవ్వబడినది; ఐ = అయినట్టి; బ్రహ్మ = పరబ్రహ్మమును; అభివ్యంజకంబులు = అభివ్యక్తము చేయునవి; ఐన = అయినట్టి; సప్తస్వరంబులు = సప్తస్వరములు; తమయంతన = తమంతతామే; మ్రోయుచున్న = మ్రోగు; ఈ = ఈ; వీణ = వీణ; ఆలాపన = రాగముతో, నాదముతో; రతిన్ = కూడినదాని, ఆసక్తి; చేసి = వలన; నారాయణ = నారాయణుని; కథ = కథల; గానంబు = గానము; చేయుచున్ = చేయుచు; చరియించుచున్ = తిరుగుతూ; ఉందున్ = ఉందును;
భావము:- ఈ విధంగా చెప్పి విరమించిన సర్వవ్యాపి, సర్వనియంత, వేదమయమూ అయిన ఆ మహాభూతానికి నేను తలవంచి మ్రొక్కాను. భగవంతుని అనుగ్రహానికి ఆనందించాను. మదాన్ని వీడాను. మాత్సర్యాన్ని దిగనాడాను. కామాన్ని అణచిపెట్టాను. క్రోధాన్ని వదలిపెట్టాను. లోభాన్ని, మోహాన్ని వదలివేసాను. సంకోచం లేకుండా గొంతెత్తి అనంతుని అనంతనామాలు ఉచ్చరిస్తూ, పరమపవిత్రాలయిన హరి చరిత్రలను స్మరిస్తూ, నిత్యసంతుష్టుడనై వాసుదేవుని హృదయంలో పదిలపరచుకొన్నాను. ప్రశాంతమైన అంతఃకరణంతో వైరాగ్యాన్ని అవలంబించి కాలాన్ని నిరీక్షిస్తూ తిరుగసాగాను. కొన్నాళ్లకు మెరుపు మెరిసినట్లుగా మృత్యుదేవత నా ముందు ప్రత్యక్షమయింది. అప్పుడు నేను పంచభూతాత్మకమైన పూర్వదేహాన్ని పరిత్యజించి భగవంతుని దయవల్ల సత్త్వగుణాత్మకమైన భాగవతదేహంలో ప్రవేశించాను. తర్వాత కల్పాంతకాలంలో ఏకార్ణవమైన జలమధ్యంలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్న సమయాన, బ్రహ్మదేవుని నిశ్వాసంతో పాటు నేనూ భగవానుని ఉదరంలో ప్రవేశించాను. వెయ్యి యుగాలు గడిచిపోయిన తర్వాత లేచి లోకాలు సృష్టించ తలచెడి బ్రహ్మదేవుని నిశ్వాసం నుంచి మరీచి మొదలైన మునులు, నేను జన్మించాము. ఈ జన్మలో నేను అస్ఖలిత బ్రహ్మచారినై, భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారినై, పరబ్రహ్మముచేత సృష్టింపబడిన సప్తస్వరాలు తమంతతామే మ్రోగే ఈ మహతి అనే వీణమీద విష్ణు కథలు గానం చేస్తూ ఇలా విహరిస్తున్నాను.

తెభా-1-131-ఆ.
తీర్థపాదుఁడయిన దేవుండు విష్ణుండు
న చరిత్ర మేను విలి పాడఁ,
జీరఁబడ్డవాని చెలువున నేతెంచి
నుఁడు నామనమునఁ గానవచ్చు.

టీక:- తీర్థ = తరింపజేయు; పాదుఁడు = పాదములు గలవాడు; అయిన = అయినట్టి; దేవుండు = దేవుడు; విష్ణుండు = విష్ణువు; తన = తనయొక్క; చరిత్ర = చరిత్రను; మేను = శరీరము; దవిలి = పులకరించి; పాడన్ = పాడగా; చీరఁబడ్డవాని = పిలువబడినవాని; చెలువునన్ = విధంగా; ఏతెంచి = వచ్చి; ఘనుఁడు = గొప్పవాడు - భగవంతుడు; నా = నాయొక్క; మనమునన్ = మనసులో; కానవచ్చున్ = కనిపిస్తాడు.
భావము:- నేను విష్ణుమూర్తి లీలలను గానం చేసినప్పుడు, తీర్థపాదుడు, దేవాదిదేవుడు, వాసుదేవుడు అయిన హరి పేరు పెట్టి పిలిచినట్లుగా వచ్చి నా మనస్సులో దర్శనము ఇచ్చేవాడు.

తెభా-1-132-క.
విను మీ సంసారంబను
నిధిలో మునిఁగి కర్మవాంఛలచే వే
నఁ బొందెడువానికి వి
ష్ణుని గుణవర్ణనము తెప్ప సుమ్ము మునీంద్రా!

టీక:- వినుము = వినుము; ఈ = ఈ; సంసారంబు = సంసారము; అను = అనే; వననిధి = సముద్రము; లోన్ = లోపల; మునిఁగి = మునిగిపోయి; కర్మ = కర్మములందు; వాంఛల = కోరికల; చేన్ = చేత; వేదనన్ = బాధను; పొందెడువాని = పడేవాడి; కిన్ = కి; విష్ణుని = హరియొక్క; గుణ = గుణముల; వర్ణనము = కీర్తించుట; తెప్ప = పడవ; సుమ్ము = సుమా; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్ఠుడా.
భావము:- ఓ వ్యాసమహర్షీ! ఈ సంసార సముద్రంలో మునిగి తేలుతూ విషయవాంఛలచే క్రిందుమీదై బాధపడేవానికి గోవింద గుణకీర్తనం గట్టుకు చేర్చే తెప్ప లాంటిది.

తెభా-1-133-చ.
నియమాది యోగముల నాత్మ నియంత్రిత మయ్యుఁ, గామరో
ములఁ బ్రచోదితంబ యగు, శాంతి వహింపదు, విష్ణుసేవచేఁ
గ్రమున శాంతిఁ గైకొనిన కైవడి; నాదు శరీర జన్మ క
ర్మముల రహస్య మెల్ల మునిమండన! చెప్పితి నీవు గోరినన్."

టీక:- యమ = యమము; నియమ = నియమము; ఆది = మొదలగు; యోగములన్ = యోగాభ్యాస మార్గముల; ఆత్మ = ఆత్మ; నియంత్రితము = నియమింపపడినది; అయ్యున్ = అయినప్పటికిని; కామ = కామము; రోషములన్ = రోషములచే; ప్రచోదితంబు = ప్రేరేపింపబడినది; అగు = అగును; శాంతి = శాంతిని; వహింపదు = పొందదు; విష్ణు = హరియొక్క; సేవ = భక్తి; చేన్ = చేత; క్రమమున = క్రమముగా; శాంతిన్ = శాంతిని; కైకొనిన = పొందిన; కైవడిన్ = విధముగా; నాదు = నాయొక్క; శరీర = శరీరము; జన్మ = జన్మ; కర్మముల = కర్మముల (పుట్టుపూర్వోత్తరముల); రహస్యము = రహస్యము, మర్మము; ఎల్లన్ = అంతా; ముని = మునులకు; మండన = ప్రకాశించేవాడా; చెప్పితిన్ = చెప్పితిని; నీవు = నీవు; గోరినన్ = కోరగా.
భావము:- మునికులభూషణా! యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహారాది అష్టాంగముల ద్వారా మనస్సును ఎంత కట్టుదిట్టం చేసుకొన్నప్పటికీ కామం, రోషం మొదలైన వానిచే అది మాటిమాటికీ రెచ్చిపోతూనే ఉంటుంది. కానీ శాంతించదు. అట్టి శాంతి వాసుదేవుని సేవ వల్లనే క్రమంగా లభిస్తుంది. నా పుట్టు పూర్వోత్తరాల రహస్యమంతా నీవు కోరిన ప్రకారం నీకు వివరించి చెప్పాను.“

తెభా-1-134-వ.
అని యిట్లు భగవంతుం డగు నారదుండు వ్యాసమునీంద్రుని వీడ్కొని, వీణ వాయించుచు, యదృచ్ఛామార్గంబునం జనియె"నని,,సూతుం డిట్లనియె.
టీక:- అని = అనిచెప్పి; ఇట్లు = ఈవిధముగ; భగవంతుండు = భగవంతుడు; అగు = అయినట్టి; నారదుండు = నారదుడు; వ్యాస = వ్యాసుడు అనే; మునీంద్రుని = మునులలో శ్రేష్ఠుని; వీడ్కొని = సెలవు తీసుకొని; వీణ = వీణను; వాయించుచున్ = వాయించుచు; యదృచ్ఛా = స్వేచ్ఛా, ఇచ్చవచ్చిన; మార్గంబునన్ = మార్గమున; చనియెన్ = వెళ్ళెను; అని = అనిచెప్పి; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అని ఈ ప్రకారంగా భగవంతుడు అయిన నారదుడు వ్యాస మునీంద్రునితో పలికి వీడ్కోలందుకొని వీణను మ్రోగించుకుంటూ వెళ్లిపోయాడు. అనంతరం సూతమహాముని శౌనకాదులతో ఇలా అన్నాడు.

తెభా-1-135-క.
"వాయించు వీణ నెప్పుడు,
మ్రోయించు ముకుందగీతములు, జగములకుం
జేయించుఁ జెవుల పండువు,
మాయించు నఘాళి నిట్టి తి మఱి గలఁడే"

టీక:- వాయించున్ = వాయించును; వీణన్ = వీణను; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; మ్రోయించున్ = మ్రోగించును; ముకుంద = హరియొక్క; గీతములు = పాటలు; జగములు = లోకాల; కున్ = కు; చేయించుఁన్ = కలుగజేయును; చెవుల = చెవులకు; పండువు = పండుగ; మాయించున్ = మాయము చేయును; అఘాళిన్ = పాపములను; ఇట్టి = ఇటువంటి; మతి = బుద్ధిమంతుడు; మఱి = మరియొకడు; కలఁడే = ఉన్నాడా.
భావము:- “నారదమహర్షి సర్వదా మహతీ విపంచి వాయిస్తు, ముకుందగీతాలు మ్రోయిస్తు, సకల జగత్తులకు వీనులవిందు చేస్తు, లోకుల పాపసమూహాలను మాయిస్తు, సంచరించే మేటి భక్తుడు. ఆయనకు ఆయనే సాటి.”

తెభా-1-136-వ.
అని నారదుం గొనియాడిన సూతునిం జూచి ”నారదు మాటలు విన్న వెనుక భగవంతుండైన బాదరాయణుం డేమి సేసె?"నని శౌనకుం డడిగిన సూతుం డిట్లనియె ”బ్రహ్మదైవత్య యైన సరస్వతి పడమటితీరంబున ఋషులకు సత్రకర్మవర్ధనంబై బదరీ తరుషండ మండితం బయి ”శమ్యాప్రాసం"బనం బ్రసిద్ధంబగు నాశ్రమంబు గల; దందు జలంబుల వార్చి కూర్చుండి, వ్యాసుండు తన మదిం దిరంబు సేసికొని భక్తియుక్తం బయిన చిత్తంబునం బరిపూర్ణుం డయిన యీశ్వరుం గాంచి, యీశ్వరాధీన మాయావృతం బైన జీవుని సంసారంబుఁ గని, జీవుండు మాయచేత మోహితుం డయి గుణవ్యతిరిక్తుండయ్యు మాయాసంగతిం దాను ద్రిగుణాత్మకుం డని యభిమానించుచుఁ ద్రిగుణత్వాభిమానంబునం గర్తయు భోక్తయు నను ననర్థంబు నొందు ననియు; నయ్యనర్థంబునకు నారాయణభక్తియోగంబు గాని యుపశమనంబు వేఱొకటి లేదనియు నిశ్చయించి.
టీక:- అని = అని; నారదున్ = నారదుని; కొనియాడిన = స్తుతించిన; సూతునిన్ = సూతుని; చూచి = చూసి; నారదు = నారదుని; మాటలు = ఉపదేశములు; విన్న = ఆలకించిన; వెనుక = తరువాత; భగవంతుండు = భగవంతుడు; ఐన = అయిన; బాదరాయణుండు = వ్యాసుడు {బాదరాయణుడు - బదరీవనములో నుండు వాడు, వ్యాసుడు}; ఏమి = ఏమి; సేసెన్ = చేసెను; అని = అని; శౌనకుండు = శౌనకుడు; అడిగిన = ప్రశ్నించగా; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = చెప్పెను; బ్రహ్మదైవత్య = బ్రహ్మ తనకు అధిదైవముగాగలది; ఐన = అయినట్టి; సరస్వతి = సరస్వతీనది; పడమటి = పశ్చిమ; తీరంబునన్ = తీరమున; ఋషులు = ఋషులు; కున్ = కు; సత్ర = యాగములయొక్క; కర్మ = కర్మలను; వర్ధనంబు = వృద్ధిచేయునది; ఐ = అయి; బదరీ = రేగుపళ్ళ; తరు = చెట్ల; షండ = గుంపుతో; మండితంబు = అలంకరింపడినది; అయి = అయి; శమ్యాప్రాసంబు = శమ్యాప్రాసము {శమ్యాప్రాసము - శమము యను ఆహారము గలది}; అనన్ = అనేపేరుతో; ప్రసిద్ధంబు = ప్రసిద్ధమైనది; అగు = అయినట్టి; ఆశ్రమంబు = ఆశ్రమము; కలదు = ఉన్నది; అందున్ = అక్కడ; జలంబులన్ = నదిలో; వార్చి = సంధ్యవార్చి; కూర్చుండి = కూర్చొని; వ్యాసుండు = వ్యాసుడు; తన = తనయొక్క; మదిన్ = మనసును; తిరంబు = స్థిరముగ; చేసికొని = చేసికొని; భక్తి = భక్తితో; యుక్తంబు = కూడినది; అయిన = అయినట్టి; చిత్తంబునన్ = చిత్తములో; పరిపూర్ణుండు = పరిపూర్ణుడు; అయిన = అయినట్టి; ఈశ్వరున్ = ఈశ్వరుని; కాంచి = దర్శించి; ఈశ్వర = ఈశ్వరునియొక్క; అధీన = అధీనములో ఉండే; మాయ = మాయతో; ఆవృతంబు = కప్పబడినది; ఐన = అయినట్టి; జీవుని = జీవునియొక్క; సంసారంబున్ = సంసారమును; కని = చూసి; జీవుండు = జీవుడు; మాయ = మాయ; చేతన్ = చేత; మోహితుండు = మోహింపబడినవాడు; అయి = అయి; గుణ = గుణములకంటెను; వ్యతిరిక్తుండు = వేరైనవాడు; అయ్యు = అయినప్పటికిని; మాయ = మాయతో; సంగతిన్ = సహవాసము వలన; తాను = తాను; త్రి = మూడు; గుణ = గుణములు; ఆత్మకుండు = తనవిగా కలవాడు; అని = అనుకొని; అభిమానించుచున్ = (ఆ గుణములను) అభిమానించుచు; త్రి = మూడు; గుణత్ = గుణములయందు; అభిమానంబునన్ = అభిమానమువలన; కర్తయున్ = కర్తను; భోక్తయున్ = భోక్తను; అను = అను; అనర్థంబు = అనర్థమును (అర్థము లేని అభిప్రాయము); ఒందును = పొందును; అనియున్ = అనియూ; ఆ = ఆ; అనర్థంబు = అనర్థమున; కున్ = నకు; నారాయణ = భగవంతుని; భక్తి = భక్తి; యోగంబు = యోగము; కాని = తప్ప; ఉపశమనంబు = అణగింపగలది; వేఱొకటి = మరొకటి; లేదు = లేదు; అనియు = అనీ; నిశ్చయించి = నిర్ణయించి.
భావము:- అంటూ నారదమహర్షిని సూతుడు స్తుతించగా ”నారదుని మాటలు ఆలకించిన అనంతరం వ్యాసభగవానుడు ఏం చేసాడో చెప్ప” మని శౌనకుడు అడిగాడు. సూతుడు ఇలా చెప్పాడు. ”బ్రహ్మదేవతాకమైన సరస్వతీనది పడమటి తీరాన ఋషులు యజ్ఞాలు చేసుకోటానికి అనుకూలమై అనేక రేగుచెట్లతో నిండి శమ్యాప్రాసమనే ఆశ్రమం ఉంది. వ్యాసుడు ఆ ఆశ్రమానికి వెళ్లి తన చిత్తంలో భగవంతుణ్ణి దర్శించాడు. ఈశ్వరుని మాయ ఆవరించి ఉన్న జీవుని సంసారాన్ని చూశాడు. మాయా మోహితుడైన జీవుడు త్రిగుణాతీతుడై కూడా మయా ప్రభావం వల్ల గుణాభిమానం కలవాడై, తానే కర్తను భోక్తను అనే అనర్థభావనలు చేస్తాడని, ఈ అనర్థాన్ని ఉపశమింప చేయటానికి విష్ణుభక్తి అనే యోగం తప్ప మరొకటి ఏదీ లేదని నిశ్చయించాడు.

తెభా-1-137-మ.
నీచక్రములోన నే పురుషుఁ డే యామ్నాయమున్ విన్న మా
వుపై లోకశరణ్యుపై భవములం ప్పింపఁగాఁ జాలు భ
క్తివిశేషంబు జనించు నట్టి భువనక్షేమంకరంబైన భా
తామ్నాయము బాదరాయణుఁడు దాఁ ల్పించె నేర్పొప్పగన్.

టీక:- అవనీ = భూ; చక్రము = మండలము; లోనన్ = లోపల; ఏ = ఏ; పురుషుఁడు = పురుషుడైనా; ఏ = ఏ; ఆమ్నాయమున్ = వేదమును; విన్న = విన్నచో; మాధవు = విష్ణువు; పైన్ = మీద; లోక = లోకములకు; శరణ్యు = శరణమైనవాని; పైన్ = మీద; భవములన్ = మళ్ళీపుట్టుటలను; తప్పింపఁగాన్ = తప్పించుటకు; చాలు = సామర్థ్యములు కల; భక్తి = భక్తి యనే; విశేషంబు = విశిష్ఠమైనది; జనించున్ = పుడుతుందో; అట్టి = అటువంటి; భువన = లోకములకు; క్షేమంకరంబు = శ్రేయస్సును కలిగించునది; ఐన = అయినట్టి; భాగవత = భాగవతము అనే; ఆమ్నాయమున్ = వేదమును; బాదరాయణుఁడు = వ్యాసుడు; తాన్ = తాను; కల్పించెన్ = సృష్టించెను; నేర్పు = నేర్పు; ఒప్పగన్ = అమరగా.
భావము:- ఈ విశాల భూమండలంలో ఏ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రం చేతనే సంసారబంధాలు సమసిపోయి జగన్నాథుడైన నారాయణునిపై అచంచలమైన భక్తి ఆవిర్భవిస్తుందో, అట్టి లోకకల్యాణకరమైన మహాగ్రంథాన్ని, వేదస్వరూపమైన భాగవతాన్ని బాదరాయణ మహర్షి ఓర్పుతో నేర్పుతో రూపొందించాడు.

తెభా-1-138-వ.
ఇట్లు భాగవతంబు నిర్మించి మోక్షార్థియైన శుకునిచేఁ జదివించె"నని చెప్పిన విని శౌనకుండు ”నిర్వాణతత్పరుండును సర్వోపేక్షకుండును నైన శుకయోగి యేమిటికి భాగవతం బభ్యసించె?"ననవుడు; సూతుం డిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; భాగవతంబు = భాగవతమును; నిర్మించి = రచించి; మోక్ష = మోక్షమును; అర్థి = అర్థించువాడు; ఐన = అయినట్టి; శుకుని = శుకుని; చేన్ = చేత; చదివించెన్ = చదివించెను; అని = అని; చెప్పినన్ = చెప్పగా; విని = విని; శౌనకుండు = శౌనకుడు; నిర్వాణ = మోక్షమునందు; తత్పరుండును = నిష్ఠగలవాడును; సర్వ = సర్వము అందు; ఉపేక్షకుండును = ఉదాసీనత కలవాడును; ఐన = అయినట్టి; శుక = శుకుడు అను; యోగి = యోగి; ఏమిటి = ఎందు; కిన్ = కొరకు; భాగవతంబు = భాగవతమును; అభ్యసించెన్ = అధ్యయనము చేసాడు; అనవుడు = అనగా; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = అన్నాడు.
భావము:- ఈ విధంగా మహాభాగవత మనే సంహితను కల్పించి ముముక్షువైన శ్రీశుకునిచే చదివించాడు” అని సూతుడు చెప్పగానే శౌనకముని విని ”మోక్ష మందు మాత్రమే అపేక్ష కలిగి, సమస్త మందు ఉపేక్ష కల శుకయోగీంద్రుడు భాగవతాన్ని ఎందుకోసం అధ్యయనం చేసాడు” అని ప్రశ్నించగా సూతమహర్షి ఇలా అన్నాడు-

తెభా-1-139-క.
"ధీరులు, నిరపేక్షులు, నా
త్మారాములునైన మునులు రిభజనము ని
ష్కాణమ చేయుచుందురు;
నారాయణుఁ డట్టి వాఁ, డవ్యచరిత్రా!

టీక:- ధీరులు = విద్వాంసులు; నిరపేక్షులున్ = దేనియందు ఆపేక్షలేని వారు; ఆత్మారాములున్ = ఆత్మయందు ఆనందించువారును; ఐన = అయినట్టి; మునులు = మునులు; హరి = విష్ణువు యొక్క; భజనమున్ = సంకీర్తనమును; నిష్కారణమ = కారణమేదీ లేకుండానే; చేయుచున్ = చేస్తూ; ఉందురు = ఉంటారు; నారాయణుఁడు = నారాయణుడు; అట్టి = అటువంటి; వాఁడు = వాడు; అనవ్య = పురాతనమైన; చరిత్రా = చరిత్ర కలవాడా.
భావము:- “పురాణప్రవర్తకా! శౌనకా! జితేంద్రియులు, నిష్కాములు, ఆత్మారాములు అయిన మహామునులు ఫలాపేక్ష లేకుండానే కారణములేకనే భక్తితో శ్రీహరిని భజిస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణుడు సైతం భక్తుల విషయంలో కారణము లేకుండానే కటాక్షిస్తూ ఉంటాడు.

తెభా-1-140-క.
రిగుణవర్ణన రతుఁడై
రితత్పరుఁడైన బాదరాయణి శుభత
త్పతంబఠించెఁ ద్రిజగ
ద్వమంగళమైన భాగత నిగమంబున్.

టీక:- హరి = హరియొక్క; గుణ = గుణముల; వర్ణన = వర్ణన యందు; రతుఁడు = ఆసక్తి గలవాడు; ఐ = అయి; హరి = హరి యందు; తత్పరుఁడు = నిష్ఠగలవాడు {హరి తత్పరుడు - తను కానిది హరి మాత్రమే అని నడచువాడు}; ఐన = అయినట్టి; బాదరాయణి = శుకుడు {బాదరాయణి - బాదరాయణుని పుత్రుడు, శుకుడు}; శుభ = శుభమునందు; తత్పరతన్ = నిష్ఠతో; పఠించెన్ = చదివెను; త్రి = మూడు; జగత్ = లోకములకు; వర = శ్రేష్ఠమైన; మంగళము = శుభము; ఐన = అయినట్టి; భాగవత = భాగవతము అనే; నిగమంబున్ = వేదమును.
భావము:- శ్రీహరి గుణకీర్తన మందు ఆసక్తుడూ, ఉత్తమ విష్ణుభక్తుడూ అయిన శుకమహర్షి ముల్లోకాలకూ కల్యాణప్రదమైన భాగవతము అనే వేదమును విశ్వశ్రేయస్సును ఆకాక్షించి అధ్యయనం చేసాడు.

తెభా-1-141-క.
నిమములు వేయుఁ జదివిన
సుమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్.
సుమంబు భాగవత మను
నిమంబుఁ బఠింప ముక్తినివసనము బుధా!"

టీక:- నిగమములు = వేదములు; వేయున్ = వేలకొలది; చదివినన్ = పఠించినను; సుగమంబులు = సులభముగ అర్థము అగునవి; కావు = కావు; ముక్తి = ముక్తినిచ్చు; సుభగత్వంబుల్ = సౌభాగ్యములు; సుగమంబు = సులభము అగును; భాగవతము = భాగవతము; అను = అనబడే; నిగమంబున్ = వేదమును; పఠింప = చదివినచో; ముక్తి = ముక్తి; నివసనము = నివాసము, ఇల్లు; బుధా = జ్ఞానవంతుడా.
భావము:- జ్ఞానవంతుడా! వేలకొద్దీ వేదాలను ఎంత చదివినా మోక్షసంపదలు అందుకోడం అంత సుళువు కాదు. అదే భాగవతము, అనే వేదాన్ని పఠిచటం ద్వారా అయితే మోక్షం అతి సుళువుగా దొరుకుతుంది."