తెభా-5.1-66-సీ.
ఋషభుండు రాజ్యంబు చేయుచు నుండి-
యంతట నొక్కనాఁ డాత్మయందుఁ
లపోసి భూలోక ల మపేక్షింపక-
మోహంబు దిగనాడి పుత్రులకును
నరాజ్య మెల్ల నప్పన చేసి వెనువెంటఁ-
గొడుకులు మంత్రులుఁ గొలిచిరాఁగ
ల్లన యరిగి బ్రహ్మావర్త దేశంబు-
నందుల నపుడు మహాత్ములయిన

తెభా-5.1-66.1-తే.
ట్టి మునిజన సమ్ముఖంబందుఁ జేరి
నదు పుత్రుల నందఱ డాయఁ బిలిచి
రమ పుణ్యుండు ఋషభుండు ప్రణయ మొప్ప
ర్ష మందుచు నప్పు డిట్లనుచుఁ బలికె.

టీక:- ఆ = ఆ; ఋషభుండు = ఋషభుడు; రాజ్యంబున్ = రాజ్యమును; చేయుచునుండి = చేయుచూ; అంతటన్ = అంతట; ఆత్మ = మనసు; అందున్ = లో; తలపోసి = భావించి; భూలోక = భూలోకమునకు సంబంధించిన; ఫలమున్ = ఫలితములను; అపేక్షింపకన్ = ఆశించకుండగ; మోహంబున్ = మోహమును; దిగనాడి = వదలివేసి; పుత్రులు = కుమారుల; కునున్ = కు; తన = తనయొక్క; రాజ్యము = రాజ్యము; ఎల్లన్ = అంతటిని; అప్పనజేసి = అప్పజెప్పి; వెనువెంటన్ = కూడా; కొడుకులున్ = కుమారులు; మంత్రులున్ = మంత్రులు; కొలిచి = సేవించుతూ; రాగ = వస్తుండగా; అల్లన = మెల్లగా; అరిగి = వెళ్ళి; బ్రహ్మావర్త = బ్రహ్మావర్తము యనెడి; దేశంబున్ = దేశముల; అందులన్ = లో; అపుడున్ = అప్పుడు; మహాత్ములు = గొప్పవారు; అయిన = అయిన.
అట్టి = అటువంటి; ముని = మునులైన; జన = వారి; సమ్ముఖంబున్ = ఎదుటి; అందున్ = అందు; చేరి = చేరి; తనదు = తన యొక్క; పుత్రులన్ = కుమారులను; అందఱన్ = అందరిని; డాయన్ = దగ్గరకు; పిలిచి = పిలిచి; పరమ = అత్యుత్తమ; పుణ్యుండు = పుణ్యముగలవాడు; ఋషభుండు = ఋషభుడు; ప్రణయమొప్ప = ప్రేమయుప్పొంగగా; హర్షమున్ = సంతోషమును; అందుచున్ = పొందుతూ; అప్పుడున్ = అప్పుడు; ఇట్లు = ఈ విధముగ; అనుచున్ = అంటూ; పలికెన్ = పలికెను.
భావము:- ఆ ఋషభుడు రాజ్యపాలన చేస్తూ ఒకనాడు ఇహలోక ఫలాన్ని అపేక్షించక, మోహాన్ని వదలిపెట్టి, కొడుకులకు రాజ్యమంతా అప్పగించాడు. తరువాత కొడుకులు, మంత్రులు తనను అనుసరించగా బ్రహ్మావర్త దేశానికి బయలుదేరాడు. అక్కడ మహాత్ములైన మునిజనుల సమక్షంలో కుమారుల నందరినీ దగ్గరకు పిలిచి మహాపుణ్యాత్ముడైన ఋషభుడు సంతోషంతో ఇలా అన్నాడు.

తెభా-5.1-67-ఆ.
"నయులార! వినుఁడు రలోనఁ బుట్టిన
పురుషులకును శునకములకు లేని
ష్టములను దెచ్చుఁ గానఁ గామంబుల
లన బుద్ధి చేయలదు మీరు

టీక:- తనయులారా = కుమారులారా; వినుడు = వినండి; ధర = భూమి; లోనన్ = అందు; పుట్టిన = పుట్టిన; పురుషుల్ = పురుషుల; కునున్ = కు; శునకముల్ = కుక్కల; కున్ = కైనను; లేని = లేనట్టి; కష్టములన్ = కష్టములను; తెచ్చున్ = తీసుకువచ్చును; కాన = కనుక; కామంబులన్ = కోరికల; వలనన్ = వలన; బుద్ధి = మనసు; చేయవలదు = పడవద్దు; మీరు = మీరు.
భావము:- “కుమారులారా! ఈ భూమిమీద పుట్టిన మనుష్యులు కామానికి లొంగిపోతే కుక్కలకు కూడా రాని కష్టాలు వారికి ఎదురవుతాయి. అందువల్ల కోరికలకు మీరు దూరంగా ఉండాలి.

తెభా-5.1-68-చ.
రులకు నే తపంబు నననంత సుఖంబులు గల్గుచుండు, శ్రీ
మతి నా తపంబుఁ దగఁ గైకొని చేసిన బ్రహ్మసౌఖ్యముం
దిముగఁ గల్గు; వృద్ధులను దీనులఁ బ్రోవుఁడు; దుష్ట వర్తనన్
రుగుచునుండు కాముకుల సంగతిఁ బోకుఁడు; మీఁద మేలగున్.

టీక:- నరుల్ = మానవుల; కున్ = కు; ఏ = ఏ విధమైన; తపంబునన్ = తపస్సుతో; అనంత = అనంతమైన, అత్యధికమైన; సుఖంబులున్ = సుఖములు; కల్గుచుండున్ = కలుగుతూ యుండును; శ్రీ = శుభ; కర = కరమమైన; మతిన్ = మనసున; ఆ = ఆ; తపంబున్ = తపస్సును; తగన్ = అవశ్యము; కైకొని = చేపట్టి; చేసిన = చేసినట్టి; బ్రహ్మసౌఖ్యమున్ = బ్రహ్మానందము (ముక్తి); తిరముగన్ = స్థిరముగ; కల్గు = కలిగించెడి; వృద్ధులనున్ = ముసలివారిని; దీనులన్ = దీనులను; ప్రోవుడు = కాపాడండి; దుష్ట = చెడ్డ; వర్తనన్ = ప్రవర్తనతో; జరుగుచునుండు = నడచెడి; కాముకులన్ = కాముకుల; సంగతిన్ = సాంగత్యమునకు; పోకుడు = పోకండి; మీదన్ = రాబోవు కాలములో; మేలున్ = మంచి; అగున్ = అగును.
భావము:- ఏ తపస్సు వల్ల మానవులకు తరగని సుఖం లభిస్తుందో అలాంటి తపస్సును అవలంబిస్తే బ్రహ్మానందం తప్పక సిద్ధిస్తుంది. వృద్ధులను, దీనులను దయతో కాపాడండి. చెడు మార్గాలలో నడిచే కాముకుల సహవాసాన్ని పూర్తిగా వదలిపెట్టండి. మీకు శుభం కలుగుతుంది.

తెభా-5.1-69-వ.
మఱియు నంగనాసక్తులగు కాముకుల సంగంబు నిరయరూపం బయిన సంసారంబగు; మహత్సంగంబు మోక్షద్వారం బగు; నట్టి మహాత్ము లెవ్వ రనిన శత్రు మిత్ర వివేకంబు లేక సమచిత్తులును శాంతులును గ్రోధరహితులును సకలభూత దయాపరులును సాధువులును నగువారలు మహాత్ము లనందగుదు; రట్టి మహాత్ములు నా యందలి స్నేహంబె ప్రయోజనంబుగాఁ గలిగి యుండుటం జేసి విషయ వార్తాప్రవృత్తు లగు కుజనులందుఁ దమ దేహ గృహ మిత్ర దారాత్మజాదులందుఁ బ్రీతిలేక యుండుదురు; విషయాసక్తుఁ డయినవాఁడు వ్యర్థకర్మంబులం జేయు నట్టి దుష్కృత కర్మంబులం జేయువాఁ డెప్పుడును బాపకర్ముం డగుచుం గ్లేశదంబగు దేహంబు నొందుచుండుఁ; గావునఁ బాపమూలంబు లయిన కామంబులు గోరకుఁ; డీ జ్ఞానం బెంత కాలంబుఁ లేకయుండు నంతకాలంబు నాత్మతత్త్వం బెఱుంగంబడ; దా తత్త్వం బెఱుంగకుండుటజేసి దేహికి దుఃఖం బధికంబై యుండు; లింగదేహం బెంత దడ వుండు నంత దడవును మనంబు కర్మవశంబై జ్ఞానవంతంబుగాక యవిద్యం బాయకుండు; శరీరంబు గర్మమూలం బగుట వలనఁ గర్మంబులు చేయఁజనదు; వాసుదేవుం డగు నా యందుఁ బ్రీతి యెంత తడవు లేక యుండు నంతదడవును దేహధర్మంబులు బాధించు; విద్వాంసు డైనను దేహేంద్రియాదుల యందుఁ బ్రీతిచేసిన మిథునీభావ సుఖప్రధానం బగు గృహస్థాశ్రమంబు నంగీకరించి స్వరూప స్మృతి శూన్యుండై మూఢుం డగుచు, నందు సంసారతాపంబులఁ బొందుఁ; బురుషుండు స్త్రీతోడం గూడి యేకీభావంబు నొందుట దనకు హృదయ గ్రంథియై యుండు; నందు జనునకు గృహక్షేత్ర సుతాప్త విత్తంబులందు "నేను నాయది"యనియెడి మోహంబు గలుగు; నట్టి స్త్రీపురుష మిథునీ భావంబుచే సంతానంబు గలుగు; నా సంతాన కారణంబున గృహక్షేత్ర విత్తాదులు సంపాదింపంబడు; నందు మోహం బధికం బగుటంజేసి మోక్షమార్గంబు దవ్వగు; నిట్లు సంసారంబునం దుండియు మనంబున నెపుడు ముక్తిచింతం జేయు నప్పుడు సంసారంబును బాయు; మోక్షోపాయంబులు పరమగురుండనైన నా యందుల భక్తి చేయుటయు, విగతతృష్ణయు, ద్వంద్వ తితిక్షయు, సర్వలోకంబు లందుల జంతు వ్యసనావగతియు, నీశ్వరవిషయక జ్ఞానాపేక్షయుఁ, దపంబును, విగతేచ్ఛయు, మత్కృతకర్మంబులు మత్కథలు వినుటయు, నన్నె దైవంబు గా నెఱుంగుటయు, నస్మద్గుణ కీర్తనంబులును, నిర్వైరత్వసామ్యోపశ మంబులును, దేహగేహంబులందు నాత్మబుద్ధి జిహాసయు, నధ్యాత్మ యోగంబును, నేకాంతసేవయుఁ, బ్రాణేంద్రియాత్మలఁ గెలుచుటయుఁ, గర్తవ్యాపరిత్యాగంబును, సచ్ఛ్రద్ధయు, బ్రహ్మచర్యంబును, గర్తవ్యకృత్యంబు లందుల నప్రమత్తుండగుటయు, వాజ్ఞియమనంబును, సర్వంబు నన్నకా దలంచుటయు, జ్ఞానంబును, విజ్ఞాన విజృంభితంబైన యోగంబును, ధృత్యుద్యమంబును, సాత్త్వికంబును నాదిగాఁ గల తెఱంగుల చేత లింగదేహంబు జయించి దేహి కుశలుం డగుచు నుండవలయు.
టీక:- మఱియున్ = ఇంకను; అంగనా = స్త్రీల ఎడ; ఆసక్తులు = లాలస గలవారు; అగున్ = అయిన; కాముకులన్ = కాముకుల తోడి; సంగంబున్ = సాంగత్యము; నిరయ = నరక; రూపంబు = రూపమన ఉన్నది; అయిన = అయిన; సంసారంబు = సంసారము; అగున్ = అగును; మహత్ = గొప్పవారి తోడి; సంగంబున్ = సాంగత్యము; మోక్ష = ముక్తికి; ద్వారంబున్ = దారితీయించెడిది; అగున్ = అగును; అట్టి = అటువంటి; మహాత్ములు = గొప్పవారు; ఎవ్వరు = ఎవరు; అనినన్ = అన్నచో; శత్రు = శత్రువులు; మిత్ర = మిత్రులు; వివేకంబు = అనెడి ఆలోచన; లేక = లేకుండగ; సమ = సమత్వము గల; చిత్తులును = మనసు గలవారు; శాంతులును = శాంతస్వభావులు; క్రోధ = కోపము; రహితులును = లేనివారు; సకల = సర్వ; భూత = జీవుల ఎడ; దయాపరులును = దయ గలవారును; సాధువులును = సాధుస్వభావులును; అగు = అయిన; వారలు = వారు; మహాత్ములు = గొప్పవారు; అనన్ = అనుటకు; తగుదురు = తగినవారు; అట్టి = అటువంటి; మహాత్ములు = గొప్పవారు; నా = నా; అందలి = ఎడ; స్నేహంబె = ప్రీతి మాత్రమే; ప్రయోజనంబుగా = లాభముగా; కలిగి = కలిగి; ఉండుటన్ = ఉండుట; చేసి = వలన; విషయ = ఇంద్రియార్థముల యందు; వార్తా = వర్తించుట; ప్రవృత్తులు = ప్రవర్తనగా కలవారు; అగు = అయిన; కు = చెడ్డ; జనులు = వారు; అందున్ = ఎడల; తమ = తమ; దేహ = శరీరము; గృహ = ఇల్లు; మిత్ర = హితులు; దార = భార్య; ఆత్మజ = సంతానము; ఆదులు = మొదలగువారి; అందున్ = ఎడల; ప్రీతి = మిక్కిలి ఆసక్తి; లేక = లేకుండగ; ఉండుదురు = ఉంటారు; విషయ = ఇంద్రియార్థము లందు; ఆసక్తుడు = తగులుకొన్నవాడు; అయిన = అయినట్టి; వాడు = వాడు; వ్యర్థ = అనవసర; కర్మంబులన్ = కర్మములను; చేయున్ = చేయును; అట్టి = అటువంటి; దుష్కృత = చెడ్డపనులైన; కర్మంబులన్ = కర్మములను; చేయువాడు = చేసెడివాడు; ఎప్పుడునున్ = ఎప్పుడును; పాపకర్ముండు = పాపము చేసినవాడు; అగుచున్ = అగుచూ; క్లేశదంబున్ = చిక్కులను కలిగించెడివి; అగు = అయిన; దేహంబున్ = జన్మములను; ఒందుచుండు = పొందుచుండును; కావునన్ = అందుచేత; పాప = పాపమును; మూలంబులు = కలిగించునవి; అయిన = అయిన; కామంబులన్ = కామములను; కోరకుడు = కోరుకొనకండి; ఈ = ఈ విధమైన; జ్ఞానంబున్ = జ్ఞానము; ఎంతకాలంబున్ = ఎంతకాలమైతే; లేక = లేకుండగా; ఉండున్ = ఉండునో; అంతకాలము = అంతవరకు; ఆత్మతత్త్వంబున్ = ఆత్మతత్త్వము; ఎఱుంగబడదు = తెలియదు; ఆ = ఆ; తత్త్వంబున్ = తత్త్వము; ఎఱుంగకుండుట = తెలియకపోవుట; చేసి = వలన; దేహి = జీవుని {దేహి - దేహము ధరించినవాడు, జీవుడు}; కిన్ = కి; దుఃఖంబు = దుఃఖము; అధికంబున్ = ఎక్కువగా; ఐ = కలిగి; ఉండు = ఉండును; లింగదేహంబు = లింగదేహము {లింగదేహము - పూర్వసంస్కార రూపమైన దేహము}; ఎంతతడవున్ = ఎంత వరకు; ఉండున్ = ఉండునో; అంతతడవునున్ = అంత వరకు; మనంబున్ = మనసు; కర్మ = కర్మములకు; వశంబున్ = లొంగినది; ఐ = అయ్యి; జ్ఞానవంతంబున్ = జ్ఞానము గలిగినది; కాక = కాకుండగా; అవిద్యన్ = మాయను {అవిద్య - ఆత్మతత్త్వ విద్యకు అన్యమైనది, మాయ}; పాయకన్ = విడువడక; ఉండున్ = ఉండును; శరీరంబు = జన్మములు; కర్మ = కర్మములు; మూలంబులు = ఆధారభూతముగా కలవి; అగుటన్ = అగుట; వలనన్ = వలన; కర్మంబులున్ = కర్మములను; చేయన్ = చేయుట; చనదు = తగదు; వాసుదేవుండు = నారాయణుడు {వాసుదేవుడు - (సర్వభూతము లందు) వసించెడి దేవుడు, విష్ణువు}; అగు = అయిన; నా = నా; అందున్ = ఎడల; ప్రీతిన్ = భక్తిని; ఎంతతడవున్ = ఎంతవరకు; లేక = లేకుండగ; ఉండున్ = ఉండునో; అంతతడవునున్ = అంత వరకు; దేహ = శారీరక; ధర్మంబులు = ధర్మములు; బాధించున్ = బాధించును; విద్వాంసుడు = జ్ఞాని; ఐననున్ = అయినప్పటికని; దేహ = దేహము నందు; ఇంద్రియ = ఇంద్రియార్థముల; అందున్ = ఎడల; ప్రీతిన్ = మిక్కిలి ఆసక్తి; చేసిన = కలిగిన; మిథునీ = దాంపత్య; భావ = భావము నందలి; సుఖ = సుఖములు; ప్రధానంబు = ముఖ్య మగునవి; అగు = అయిన; గృహస్థాశ్రమంబున్ = గృహస్తు జీవితమును; అంగీకరించి = స్వీకరించి; స్వరూప = తన తత్త్వము యొక్క; స్మృతి = జ్ఞానము, తలపు; శూన్యుండు = లేనివాడు; ఐ = అయ్యి; మూఢుండున్ = తెలివి లేనివాడు; అగుచున్ = అగుచూ; అందున్ = దానిలో; సంసార = సాంసారిక; తాపంబులన్ = బాధలను; పొందున్ = పొందెడి; పురుషుండు = పురుషుడు; స్త్రీ = స్త్రీ; తోడన్ = తోటి; కూడి = కలిసి; ఏకీభావంబున్ = కలియుట; ఒందుట = పొందుట; తన = తన; కున్ = కు; హృదయగ్రంథి = హృదయ మనెడి బంధనము; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; అందున్ = దానిలో; జనున్ = మానవుని; కున్ = కి; గృహ = ఇల్లు; క్షేత్ర = భూములు; సుత = పుత్రులు; ఆప్త = బంధువులు; విత్తంబున్ = సంపదలు; అందున్ = ఎడల; నేను = నేను, అహంకారము; నాయది = నాది, మమకారము; అనియెడి = అనెడి; మోహంబున్ = మోహములు; కలుగును = ఏర్పడును; అట్టి = అటువంటి; స్త్రీపురుష = స్త్రీపురుషుల; మిథునీ = దాంపత్య; భావంబు = భావము; చేన్ = వలన; సంతానంబున్ = పిల్లలు; కలుగున్ = కలుగును; ఆ = ఆ; సంతాన = సంతానము; కారణంబునన్ = వలన; గృహ = ఇళ్ళు; క్షేత్ర = భూములు; విత్త = సంపదలు; ఆదులు = మొదలగునవి; సంపాదింపంబడు = సంపాదింపబడును; అందున్ = వాని ఎడ; మోహంబున్ = మోహము; అధికంబున్ = ఎక్కువ; అగుటన్ = అగుట; చేసి = వలన; మోక్ష = ముక్తికి చేరెడి; మార్గంబున్ = దారి; దవ్వగు = దూరము అగును; ఇట్లు = ఈ విధముగ; సంసారంబున్ = సంసారము; అందున్ = లో; ఉండియున్ = ఉండి కూడ; మనంబునన్ = మనసులో; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; ముక్తి = మోక్షమును గూర్చిన; చింతన్ = చింతనను; చేయున్ = చేయునో; అప్పుడున్ = అప్పుడు; సంసారంబునున్ = సంసారమును; పాయును = దూరము అగును; మోక్ష = ముక్తిని పొందెడి; ఉపాయంబులున్ = ఉపాయములు; పరమ = అత్యుత్తమ; గురుండను = గురువును; ఐన = అయిన; నా = నా; అందులన్ = ఎడల; భక్తి = భక్తిని; చేయుటయు = కలిగి ఉండుట; విగత = వదలివేసిన; తృష్ణయున్ = వాంఛలు; ద్వంద్వ = శీతోష్ణాది ద్వంద్వములను; తితిక్షయున్ = ఓర్చుకొనుట; సర్వ = అన్ని; లోకంబులన్ = లోకముల; అందులన్ = లోని; జంతు = జంతువుల; వ్యసన = బాధలను; అవగతియున్ = అర్థము చేసికొనుట; ఈశ్వర = భగవంతునికి; విషయక = చెందిన విషయముల యొక్క; జ్ఞాన = విజ్ఞానము నందు; ఆపేక్షయున్ = ఆసక్తి; తపంబునున్ = తపస్సు; విగత = విడిచిపెట్టిన; ఇచ్ఛయున్ = కోరికలు; మత్ = నా చేత; కృత = చేయబడెడి; కర్మంబులున్ = పనులు; మత్ = నా యొక్క; కథలు = కథలు; వినుటయున్ = వినుట; నన్నె = నన్ను మాత్రమే; దైవంబు = భగవంతుని; కాన్ = అగునట్లు; ఎఱుంగుటయున్ = తెలియుట; అస్మత్ = నా యొక్క; గుణ = సుగుణముల; కీర్తనంబులున్ = స్తుతించుటలు; నిర్వైరత్వ = వైరభావము లేకపోవుట; సామ్య = సమత్వభావము; ఉపశమంబులున్ = శాంతములు; దేహ = శరీరము; గేహంబులున్ = ఇళ్ళు; అందున్ = ఎడల; ఆత్మ = నాది, మమకారము; బుద్ధి = బుద్ధిని; జిహాసయున్ = విడుచుట; అధ్యాత్మ = ఆధ్యాత్మిక; యోగంబునున్ = యోగము; ఏకాంతసేవయున్ = అనన్య సేవయు; ప్రాణ = ప్రాణములు; ఇంద్రియ = ఇంద్రియములు; ఆత్మలన్ = ఆత్మలను; గెలుచుటయున్ = గెలుచుట; కర్తవ్య = చేయవలసిన పనులను; అపరిత్యాగంబును = విడువకుండుట; సత్ = మంచి యందు; శ్రద్ధయున్ = శ్రద్ద; బ్రహ్మచర్యంబును = బ్రహ్మచర్యము; కర్తవ్య = చేయవలసిన; కృత్యంబులు = పనులు; అందులన్ = లలో; అప్రమత్తుండు = ఏమరుపాటు లేకుండువాడు; అగుటయున్ = అగుట; వాక్ = మాటలను వాడుట యందు; నియమనంబును = సంయమనము; సర్వంబున్ = సమస్తమును; నన్న = నన్ను మాత్రమే; కాన్ = అగునట్లు; తలంచుటయున్ = భావించుట; జ్ఞానంబునున్ = జ్ఞానము; విజ్ఞాన = విజ్ఞానమువలన; విజృంభితంబు = అతిశయించినది; ఐన = అయిన; యోగంబునున్ = యోగము; ధృతి = ధైర్యము; ఉద్యమంబునున్ = వహించి యుండుట; సాత్వికంబున్ = సత్త్వగుణము కలిగి ఉండుట; ఆది = మొదలగునవి; కాగల = ఐయున్న; తెఱంగులన్ = విదానముల; చేతన్ = వలన; లింగదేహంబున్ = లింగదేహమును; జయించి = గెలిచి; దేహి = జీవుడు; కుశలుండు = క్షేమము గలవాడు; అగుచునుండవలయున్ = అగుచూ ఉండవలెను.
భావము:- ఇంకా స్త్రీ వ్యామోహంలో ఉండే కాముకులతో సంబంధం వల్ల సంసారం నరకమే అవుతుంది. మహాత్ముల సహవాసం మోక్షానికి దారి తీస్తుంది. అటువంటి మహాత్ములు ఎవరని అంటారా? శత్రు మిత్ర భేదభావం లేకుండా అందరిపై సమదృష్టి కలవారు, శాంతస్వభావులు, కోపం లేనివారు, సమస్త జీవుల పట్ల దయాస్వభావం కలవారు, సాధు స్వభావులు మహాత్ములని పిలువబడతారు. అలాంటి మహానుభావులకు నాయందే పరిపూర్ణ భక్తి ఉండడం వల్ల విషయ లంపటులైన దుర్మార్గుల పట్ల ప్రీతి, తమ దేహమన్నా, ఇల్లన్నా, మిత్రులన్నా, భార్యాపుత్రులన్నా వ్యామోహం ఏమాత్రం ఉండదు. ఇంద్రియ సుఖాలకు లోనైనవాడు పనికిరాని పనులు చేస్తూ ఉంటాడు. చెడ్డపనులు చేసేవాడు పాపం కొనితెచ్చుకుంటాడు. దుఃఖకారణమైన దేహాన్ని మోస్తూ ఉంటాడు. అందువల్ల మీరు పాపాలకు మూలాలైన కోరికలను కోరకండి. యథార్థ జ్ఞానం ప్రాప్తించనంత వరకు మీకు ఆత్మతత్త్వం బోధపడదు. ఆ తత్త్వం తెలియని కారణాన దేహికి దుఃఖం ఎక్కువవుతుంది. లింగదేహ మెంతకాలం ఉంటుందో అంతకాలం మనస్సు కర్మవశమై ఉంటుంది. జ్ఞానం లభించదు. అవిద్య వదలదు. శరీరం కర్మమూలం. అందుచేత కర్మలు చేయడం తగదు. వాసుదేవుడినైన నామీద ఆసక్తి కుదరనంత వరకు మిమ్మల్ని దేహధర్మాలు బాధిస్తాయి. ఎంత చదువుకున్న వాడైనా దేహేంద్రియ సుఖాలపట్ల ఆసక్తుడై సంభోగ సుఖ ప్రధానమైన గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు. మూఢుడై సంసార క్లేశాలకు లోనౌతాడు. సంసారికి ఇల్లన్నా, పొలాలన్నా, కొడుకులన్నా, ఆప్తులన్నా, ధనమన్నా నేను నాది అనే వ్యామోహం పెరుగుతుంది. స్త్రీ పురుషుల కలయిక వల్ల సంతానం కలుగుతుంది. ఆ సంతానం కోసం ఇల్లు కట్టడమో, పొలాలు కొనడమో, ధనం సంపాదించడమో జరుగుతుంది. వాటిపట్ల మోహం పెంచుకొనడంతో వానికి మోక్షమార్గం దూరమౌతుంది. సంసారంలో మునిగి ఉన్నవానికి ఎపుడయితే మోక్షాసక్తి కలుగుతుందో అపుడే అతడు సంసారాన్ని వదలి పెడతాడు. మోక్షోపాయం చెప్తాను. పరమేశ్వరుడనైన నా మీద భక్తి ఉండడం, కోరికలు లేకపోవడం, సుఖ దుఃఖాలలో సహనం, సమస్త జీవుల కష్టాలపట్ల సానుభూతి కలిగి ఉండడం, భగవద్విషయమైన జ్ఞానంపట్ల ఆసక్తి, తపస్సు, నా కథలను, లీలలను ఆలకించడం, నన్నే దైవంగా భావించడం, నా గుణాలను కీర్తించడం, ఎవరితోను విరోధభావం లేకుండడం, సర్వత్ర సమబుద్ధి కలిగి ఉండడం, శాంతితో జీవించడం, ‘నా గేహం, నా దేహం’ అనే బుద్ధిని వదలిపట్టడం, ఆధ్యాత్మయోగం అవలంబించడం, ఏకాంత భక్తిభావం, ఇంద్రియాలను జయించడం, కర్తవ్య పరాయణత్వం, సత్కార్యాలందు శ్రద్ధ, బ్రహ్మచర్యం, జాగరూకత, వాక్కులను సంయమనంతో వాడడం, అన్నిటిలో నన్నే చూడడం… ఇవి ముక్తి మార్గాలు. జ్ఞానంతో విజ్ఞాన విజృంభితమైన యోగంతో, గుండె దిటవుతో, సాత్త్వికమైన ప్రవృత్తితో లింగదేహాన్ని జయించి మానవుడు క్షేమాన్ని పొందాలి.

తెభా-5.1-70-ఆ.
రయఁ గర్మరూప గు నవిద్యాజన్మ
మైన హృదయబంధనాది లతల
ప్రమత్తయోగ ను మహాఛురికచేఁ
ద్రెంపవలయు నంతఁ దెంపుతోడ.

టీక:- అరయన్ = తరచి చూడగా; కర్మ = కర్మముల యొక్క; రూపము = స్వరూపము; అగు = అయిన; అవిద్యన్ = అవిద్యనుండి; జన్మము = పుట్టినది; ఐన = అయిన; హృదయ = హదయ మనెడి; బంధన = గ్రంథి; ఆది = మొదలగు; లతలన్ = అల్లుకొనెడి తీగలను; అప్రమత్త = ఏమరుపాటు లేకుండెడి; యోగము = యోగము; అను = అనెడి; మహా = గొప్ప; ఛురిక = చురకత్తి; చేన్ = తోటి; త్రెంపవలయున్ = కత్తిరించవలెను; అంతన్ = అంతట; తెంపు = తెగింపు; తోడన్ = తోటి; =
భావము:- అజ్ఞానం నుండి పుట్టిన హృదయ బంధనమనే తీగను యోగం అనే చురకత్తితో ధైర్యంగా తెంపివేయాలి.

తెభా-5.1-71-ఆ.
నర నిట్లు యోగయుక్తుండు గురుఁ డైన
భూపుఁ డైన శిష్యపుత్ర వరుల
యోగయుతులఁ జేయ నొప్పు గావలయును
ర్మపరులఁ జేయఁ గాదుకాదు.

టీక:- ఒనరన్ = తగినట్లు; ఇట్లు = ఈ విధముగ; యోగ = యోగము తోటి; యుక్తుండు = కలిసి ఉన్నవాడు; గురుడున్ = గురువును; ఐన = అయిన; భూపుడు = రాజు; ఐన = అయిన; శిష్య = శిష్యులలో; పుత్ర = పుత్రులలో; వరులన్ = ఉత్తములను; యోగ = యోగముతోటి; యుతులన్ = కలిగినవారిగా; చేయన్ = చేయుట; ఒప్పు = చక్కగా; కావలయును = కావలెను కాని; కర్మ = కర్మలందు; పరులన్ = లగ్నమైనవారినిగా; చేయన్ = చేయుట; కాదుకాదు = సరికానేకాదు; =
భావము:- ఇటువంటి యోగాన్ని అనుష్ఠించే వ్యక్తి గురువైతే శిష్యులను, తండ్రి అయితే బిడ్డలను, రాజు అయితే ప్రజలను తాను నేర్చిన యోగమార్గంలో పెట్టాలి కాని కర్మఫలాలపై ఆసక్తులను చేయకూడదు.

తెభా-5.1-72-సీ.
నులెల్ల నర్థ వాంలఁ జేసి యత్యంత;
మూఢులై యైహికంబులు మనంబు
లందును గోరుదు; ల్ప సౌఖ్యములకు-
న్యోన్యవైరంబు లంది దుఃఖ
ములఁ బొందుదురు; గాన మునుకొని గురుఁ డైన-
వాఁడు మాయామోహశుఁడు నెంత
డుఁడు నైనట్టి యా జంతువునందును-
య గల్గి మిక్కిలి ర్మబుద్ధిఁ

తెభా-5.1-72.1-ఆ.
న్ను లున్నవాఁడు గానని వానికి
దెరువుఁ జూపి నట్లు దెలియఁ బలికి
తుల మగుచు దివ్యమైన యా మోక్ష మా
ర్గంబుఁ జూప వలయు మణతోడ.

టీక:- జనులు = ప్రజలు; ఎల్లన్ = అందరు; అర్థ = ప్రయోజనములందలి; వాంఛలన్ = కోరికల; చేసి = వలన; అత్యంత = మిక్కిలి; మూఢులు = మూర్ఖులు; ఐ = అయ్యి; ఐహికంబులు = ఇహలోకపు ప్రయోజనములు; మనంబునన్ = మనసులు; అందునున్ = లలో; కోరుదురు = ఆశించెదరు; అల్ప = నీచమైన; సౌఖ్యముల్ = సుఖకరముల; కున్ = కొరకు; అన్యోన్య = వారిలోవారికి; వైరంబున్ = శత్రుత్వమును; అంది = చెంది; దుఃఖములన్ = దుఃఖములను; పొందుదురు = పొందుతారు; కాన = కావున; మునుకొని = పూనుకొని; గురుడున్ = గురువు; ఐన = అయిన; వాడు = వాడు; మాయా = మాయవలన; మోహ = మోహమునకు; వశుడున్ = లొంగిపోయినవాడూ; జడుడున్ = తెలివితక్కువవాడూ; ఐనట్టి = అయినటువంటి; ఆ = ఆ; జంతువున్ = పశుప్రాయుని; అందునున్ = ఎడల; దయ = కృప; కల్గి = కలిగి; మిక్కిలి = అధికమైన; ధర్మబుద్ధిన్ = ధర్మబుద్ధితో; కన్నులు = కళ్ళు; ఉన్నవాడు = కలవాడు; కాననివాని = అంధుని; కిన్ = కి; తెరువున్ = దారి; చూపినట్లు = చూపెడి విధముగా; తెలియన్ = తెలిసేటట్లు; పలికి = చెప్పి.
= = అతులము = సాటిలేనిది; అగుచున్ = అగుచూ; దివ్యము = దివ్యము; ఐన = అయిన; ఆ = ఆ; మోక్ష = ముక్తిని చెందించు; మార్గంబున్ = దారిని; చూపవలయున్ = చూపించవలెను; రమణ = ప్రీతి; తోడన్ = తోటి.
భావము:- ప్రజలంతా ఏవో ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మూర్ఖులై ఎల్లప్పుడూ మనసులో ఐహిక ఫలాలను కోరుతూ ఉంటారు. అల్పసుఖం కోసం ఒకరిపై మరొకకు వైరం పెంచుకుంటారు. అంతులేని దుఃఖంలో మునిగిపోతారు. అందుచేత గురువయినవాడు తానే ముందు నడిచి మాయా మోహాలకు లోబడిన మూర్ఖులైన జీవుల పట్ల సానుభూతి చూపాలి. కళ్ళున్నవాడు గ్రుడ్డివానికి దారి చూపిన విధంగా అజ్ఞానులకు బోధించి సహాయపడాలి. సాటి లేనిది, దివ్యమైనది అయిన మోక్షానికి మార్గం చూపాలి.

తెభా-5.1-73-వ.
మఱియుఁ బితృ గురు జననీ బంధు పతి దైవతంబులలో నెవ్వరైనను సంసార రూప మృత్యు రహితం బైన మోక్షమార్గంబుం జూపకుండిరేని వారెవ్వరును హితులు గా నేరరు; నాదు శరీరంబు దుర్విభావ్యంబు; నాదు మనంబు సత్త్వయుక్తంబును, ధర్మసమేతంబును, బాపరహితంబు నగుటంజేసి పెద్దలు నన్ను ఋషభు డండ్రు; గావున శుద్ధ సత్త్వమయం బైన శరీరంబునం బుట్టిన కుమారులైన మీర లందఱును సోదరుండును మహాత్ముండును నగ్రజుండును నైన భరతు నన్నెకాఁ జూచి యక్లిష్టబుద్ధిచే భజింపుం; డదియ నాకు శుశ్రూషణంబు; ప్రజాపాలనంబు చేయుట మీకును బరమధర్మం"బని మఱియు నిట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకను; పితృ = తండ్రి; గురు = గురువు; జననీ = తల్లి; బంధు = బంధువు; పతి = భర్త; దైవతంబుల్ = దైవత్వము గలవారల; లోన్ = అందు; ఎవ్వరైనను = ఎవరైన సరే; సంసార = సంసార యొక్క; రూప = రూపములో ఉన్న; మృత్యు = మృత్యువు; రహితంబు = లేనిది; ఐన = అయిన; మోక్ష = ముక్తిని చెందించు; మార్గంబున్ = దారిని; చూపకుండిరేని = చూపనిచో; వారు = వారు; ఎవ్వరును = ఎవరూ కూడ; హితులు = మంచి కోరువారు; కానేరరు = కాలేరు; నాదు = నా యొక్క; శరీరంబున్ = దేహము; దుర్విభావ్యంబున్ = భావింపలేనిది; నాదు = నా యొక్క; మనంబున్ = మనసు; సత్త్వ = సత్త్వగుణముతో; యుక్తంబునున్ = కూడినది; ధర్మ = ధర్మముతో; సమేతంబునున్ = కూడినది; పాప = పాపములు; రహితంబున్ = లేనిది; అగుటన్ = అగుట; చేసి = వలన; పెద్దలు = పెద్దవారు; నన్నున్ = నన్ను; ఋషభుడు = ఋషభుడు; అండ్రు = అనెదరు; కావునన్ = అందుచేత; శుద్ధ = పరిశుద్ధమైన; సత్త = సత్త్వగుణముతో; మయంబున్ = కూడినది; ఐన = అయిన; శరీరంబునన్ = దేహము నందు; పుట్టిన = జన్మించిన; కుమారులు = పుత్రులు; ఐన = అయిన; మీరలు = మీరు; అందఱును = అందరూ; సోదరుండును = సహోదరుడు; మహాత్ముండునున్ = గొప్పవాడు; అగ్రజుండునున్ = అన్నగారు {అగ్రజుడు – ముందు పుట్టినవాడు, అన్న}; ఐన = అయిన; భరతున్ = భరతుడిని; నన్నె = నేను; కాన్ = అగునట్లు; చూచి = చూసి; అక్లిష్ట = శిథిలము గాని; బుద్ధి = బుద్ధి; చేన్ = తోటి; భజింపుండు = సేవించండి; అదియ = అదే; నాకున్ = నాకు; శుశ్రూషణంబు = సేవించుట; ప్రజా = ప్రజలను; పాలనంబున్ = పరిపాలించుట; చేయుట = చేయుట; మీకునున్ = మీకు కూడ; పరమ = అతి ముఖ్యమైన; ధర్మంబున్ = ధర్మము; అని = అని; మఱియున్ = ఇంకనూ; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇంకా తండ్రి, గురువు, తల్లి, బంధువు ఎవరైనా సరే అక్షయమైన మోక్షమార్గం చూపలేక పోతే వారెవరూ హితులు కారు. నా శరీరం ఎలా ఏర్పడించో మీరు ఏమాత్రం ఊహించలేరు. నా మనస్సు సత్త్వగుణంతోను, ధర్మంతోను కూడి పాపరహితమైనట్టిది. అందువల్లనే ఆర్యులు నన్ను ఋషభుడు అన్నారు. శుద్ధ సాత్త్వికమైన నా శరీరంనుండి కుమారులై పుట్టిన మీరందరూ తోడబుట్టినవాడు, మీకు పెద్దవాడు, మహాత్ముడు అయిన భరతుణ్ణి నాలాగే భావించి సద్బుద్ధితో సేవించండి. అదే మీరు నాకు చేసే శుశ్రూష. ప్రజలను పరిపాలించడమే మీకు పరమధర్మం” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు.

తెభా-5.1-74-సీ.
భూతజాలములందు భూజముల్ వర్యముల్-
భూరుహముల కంటె భోగి కులము
భోగి సంతతి కన్న బోధనిష్ఠులు బోధ-
మాన్యుల కన్నను నుజవరులు
వీరికన్నను సిద్ధ విబుధ గంధర్వులు-
వారి కన్న నసురుల్ వారి కన్న
నింద్రాది దేవత లిందఱి కన్నను-
క్షాది సన్మును ల్దలఁప నెక్కు

తెభా-5.1-74.1-తే.
డంతకన్నను భర్గుఁ డా భవు కన్నఁ
మలభఁవుఁ డెక్కుఁ; డాతని కంటె విష్ణుఁ
ధికుఁ; డాతఁడు విప్రుల నాదరించుఁ
గాన విప్రుండు దైవంబు మానవులకు.

టీక:- భూత = ప్రాణి; జాలము = కోట్ల; అందున్ = లో; భూజముల్ = చెట్లు {భూజము - భూమి యందు జము (పుట్టినది), చెట్టు}; వర్యముల్ = ఉత్తమములు; భూరుహముల్ = చెట్ల {భూరుహము - భూమి యందు పుట్టినది, చెట్టు}; కంటెన్ = కంటె; భోగి = సర్పము, సుఖదుఃఖములు అనుభవించెడి జీవుల; కులము = సమూహములు; భోగి = భోగుల; సంతతి = కులము; కన్నన్ = కంటె; బోధనిష్ఠులు = తెలివిగలవారు; బోధమాన్యులు = తెలివిగలవారు; కన్నను = కంటె; మనుజవరులు = రాజులు; వీరి = వీరి; కన్నను = కంటె; సిద్ధ = సిద్ధులు; విబుధ = జ్ఞానులు; గంధర్వులు = గంధర్వులు; వారి = వాళ్ళ; కన్నన్ = కంటెను; నసురుల్ = రాక్షసులు; వారి = వారి; కన్నన్ = కంటె; ఇంద్ర = ఇంద్రుడు {ఇంద్రుడు - ఇంద్రియములకు అధిపతి, దేవేంద్రుడు}; ఆది = మొదలగు; దేవతలున్ = దేవతలు; ఇందఱి = వీరందరి; కన్నను = కంటెను; దక్ష = దక్షుడు; ఆది = మొదలగు; సత్ = సత్యమైన; మునుల్ = మునులు; తలపన్ = ఆలోచించిచూసిన; ఎక్కుడు = ఎక్కువ; అంతకన్నను = అంతకంటె.
భర్గుడు = శివుడు {భర్గుడు - భరించువాడు, శివుడు}; ఆ = ఆ; అభవున్ = శివుని {అభవుడు - భవము (పుట్టుక) లేనివాడు, శివుడు}; కన్నన్ = కంటె; కమలభవుడున్ = బ్రహ్మదేవుడు {కమలసంభవుడు - కమలమున సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; ఎక్కుడు = ఎక్కువ; ఆతని = అతని; కంటెన్ = కంటె; విష్ణుడు = విష్ణుమూర్తి; అధికుడు = గొప్పవాడు; ఆతడు = అతడు; విప్రులన్ = బ్రాహ్మణులను; ఆదరించున్ = గౌరవించును; కానన్ = కావున; విప్రుండు = బ్రాహ్మణుడు; దైవంబున్ = దైవము; మానవుల = మనుష్యుల {మానవులు - మనువు నుండి పుట్టినవారు, మనుష్యులు}; కును = కు.
భావము:- సమస్త జీవరాసులలో వృక్షాలు శ్రేష్ఠమైనవి. వృక్షాలకంటె సర్పాలు శ్రేష్ఠాలు. సర్పాలకంటె మేధావులు ఉత్తములు. వారికంటె రాజులు గొప్పవారు. రాజులకంటె సిద్ధులు, కింపురుషులు, గంధర్వులు శ్రేష్ఠులు. వారికంటె రాక్షసులు గొప్పవారు. వారికంటెను ఇంద్రాది దిక్పాలకులు గొప్పవారు. వారికంటె దక్షుడు మొదలైన మునులు గొప్పవారు. వారికంటె రుద్రుడు, రుద్రునికంటె బ్రహ్మ, బ్రహ్మకంటె విష్ణువు అధికులు. విష్ణువు బ్రాహ్మణులను ఆదరిస్తాడు. అందుచేత మానవులకు బ్రాహ్మణుడే దైవం.

తెభా-5.1-75-క.
భూసురులకు సరి దైవం
బీ చరాచరమునందు నెఱుఁగను; నాకున్
భూసురులు గుడుచు నప్పటి
యా సంతోషంబు దోఁప గ్నులయందున్.

టీక:- భూసురుల్ = బ్రాహ్మణుల; కున్ = కు; సరి = సాటి; దైవంబున్ = దైవమును; ఈ = ఈ; సచరాచరమున్ = ప్రపంచము {సచరాచరము - స (కలిసి యున్న) చర (కదలికగలవి) అచర (కదలికలేనివి) కలది, ప్రపంచ మంతయు}; అందున్ = లోను; ఎఱుగను = తెలియదు; నా = నా; కున్ = కు; భూసురుల్ = బ్రాహ్మణులు; కుడుచున్ = భుంజించెడి; అప్పటి = ఆ సమయము నందలి; ఆ = ఆ; సంతోషంబున్ = సంతోషము; తోపదున్ = తోచదు; అగ్నులన్ = అగ్నిహోత్రమున సమర్పించుట; అందున్ = అందు.
భావము:- ఈ చరాచర ప్రపంచంలో బ్రాహ్మణులకు సాటి అయిన దైవాన్ని నేనెరుగను. బ్రాహ్మణులు భోజనం చేస్తుంటే నాకు కలిగే సంతోషం విధి విహితంగా అగ్నులలో వేల్చే హవిస్సు వల్ల కలుగదు.

తెభా-5.1-76-సీ.
మంగళం బైన బ్రహ్మస్వరూపంబును-
వేరూపంబు ననాది రూప
గుచున్న నాదు దేము బ్రాహ్మణోత్తముల్-
రియింతు రెప్పుడుఁ త్త్వబుద్ధి
మదమానుగ్రహ త్యతపస్తితి-
క్షలు గల్గు విప్రుండు ద్గురుండు;
గాన మిక్కిలి భక్తిల్గి యకించను-
లైన భూసురుల దేముల వలన

తెభా-5.1-76.1-తే.
నందుచుండును నాదు దేహంబు గాఁగ
నెఱిఁగి వరులగు విప్రుల నెల్ల భక్తిఁ
బూజ చేయుటయే నన్నుఁ బూజ చేయు
నుచు వినిపించి మఱియు నిట్లనుచుఁ బలికె.

టీక:- మంగళంబున్ = శుభకరమైనది; ఐన = అయిన; బ్రహ్మ = పరబ్రహ్మ; స్వరూపంబును = స్వరూపము; వేద = వేదముల; రూపంబున్ = స్వరూపము; అనాది = మొదలులోనిది; రూపమున్ = స్వరూపమును; అగుచున్ = అగుచున్న; నాదు = నా యొక్క; దేహమున్ = శరీరము; బ్రాహ్మణ = బ్రాహ్మణులైన; ఉత్తముల్ = ఉత్తములు; ధరియింతురు = ధరించెదరు; ఎప్పుడున్ = ఎల్లప్పుడును; తత్త్వబుద్ధిన్ = తత్త్వస్వరూపమును తెలియు బుద్ధితో; శమ = శాంతి; దమ = నిగ్రహము; అనుగ్రహ = దయచూపుట; సత్య = సత్యము; తపస్ = తపస్సు; తితిక్ష = ఓర్పు; కల్గు = కలిగిన; విప్రుండు = బ్రాహ్మణుడు; సత్ = సత్యమైన; గురుండు = గురువు; కానన్ = కావున; మిక్కిలి = అదికమైన; భక్తి = భక్తి; కల్గి = కలిగి; అకించనులు = దరిద్రుడు; ఐనన్ = అయినను; భూసురుల = బ్రాహ్మణుల; దేహమున్ = శరీరము; వలన = వలన; అందుచుండును = అందుతూనుండును.
నాదు = నా యొక్క; దేహంబున్ = శరీరము; కాగ = అగునట్లు; ఎఱిగి = తెలిసి; వరులు = శ్రేష్ఠులు; అగు = అయిన; విప్రులన్ = బ్రాహ్మణులను; ఎల్లన్ = అందరను; భక్తిన్ = భక్తితో; పూజచేయుటయే = పూజించుటే; నన్నున్ = నన్ను; పూజచేయుట = పూజించుట; అనుచున్ = అనుచూ; వినిపించి = చెప్పి; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనుచున్ = అనుచూ; పలికె = పలికెను.
భావము:- నా దేహం శుభప్రదమైన పరబ్రహ్మ స్వరూపం, వేదమయం. దీనికి ఆది లేదు. అలాంటి వేదమయమైన నా దేహాన్ని బ్రాహ్మణోత్తములు ధరిస్తారు. సత్త్వగుణం కలిగినవాడు, జితేంద్రియుడు, దయాళువు, సత్యసంధుడు, తపస్వి, సహనశీలి అయిన బ్రాహ్మణుడే మంచి గురువు. అందుచేత నేను పరమభక్తులు, మహానుభావులు అయిన బ్రాహ్మణుల దేహంతో కనిపిస్తూ ఉంటాను. పైన చెప్పిన గుణాలు కలిగిన బ్రాహ్మణులను నా రూపంగా భావించుకొని పూజ చేయడం నన్ను పూజ చేయడమే అవుతుంది” అని మళ్ళీ ఇలా అన్నాడు.

తెభా-5.1-77-క.
తెఱఁగుఁ దెలిసి భూసుర
జాతిం బూజించునట్టి నుఁడును మాయా
తీతుండై నిక్కంబుగ
భూలమున మోక్షమార్గమును బొడగాంచున్.

టీక:- ఈ = ఆ; తెఱగున్ = విధమును; తెలిసి = తెలిసికొని; భూసురజాతిన్ = బ్రాహ్మణజాతిని; పూజించు = పూజించెడి; అట్టి = అటువంటి; జనుడును = మానవుడు; మాయా = మాయ యొక్క ప్రభావమునకు; అతీతుండు = అతీతమైనవాడు; ఐ = అయ్యి; నిక్కంబుగన్ = నిజముగ; భూతలమునన్ = భూమండలముపైన; మోక్ష = ముక్తి; మార్గమును = దారిని; పొడగాంచున్ = దర్శించగలుగును.
భావము:- ఈ రహస్యం తెలుసుకొని బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులను పూజించే మానవుడు మాయాతీతుడై భూలోకంలోనే మోక్షానికి మార్గాన్ని తెలుసుకుంటాడు.