పోతన తెలుగు భాగవతము/పంచమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/పూర్ణి


తెభా-5.2-165-చ.
జభవాది దేవ ముని న్నుత తీర్థపదాంబుజాత! ని
ర్మ నవరత్న నూపుర విరాజిత! కౌస్తుభ భూషణాంగ! యు
జ్జ్వ తులసీ కురంగ మదవాసనవాసిత దివ్యదేహ! శ్రీ
నియ శరీర! కృష్ణ! ధరణీధర! భాను శశాంకలోచనా!

టీక:- జలజభవాదిదేవమునిసన్నుత = శ్రీకృష్ణా {జలజభవాది దేవ ముని సన్నుతుడు -జలజభవ (బ్రహ్మ) ఆది (మొదలైన) దేవతలు మునులు చే (సన్నుతుడు) స్తుతింపబడువాడు, కృష్ణుడు}; తీర్థపదాంబుజాత = శ్రీకృష్ణా {తీర్థ పదాంబుజాతుడు - తీర్థ (పుణ్య గంగానదికి నిలయమైన) పద (పాదములు అనెడి) అంబుజాతుడు (పద్మములు కలవాడు), కృష్ణుడు}; నిర్మలనవరత్ననూపురవిరాజిత = శ్రీకృష్ణా {నిర్మల నవరత్న నూపుర విరాజితుడు - నిర్మల (స్వచ్ఛమైన) నవరత్నములు పొదిగిన నూపుర (అందెలు)తో విరాజిల్లువాడు, కృష్ణుడు}; కౌస్తుభభూషణాంగ = శ్రీకృష్ణా {కౌస్తుభ భూషణాంగుడు - కౌస్తుభమణిచే భూషణ (అలంకరింపబడిన) అంగుడు (దేహము కలవాడు), కృష్ణుడు}; ఉజ్జ్వలతులసీకురంగమదవాసనవాసితదివ్యదేహ = శ్రీకృష్ణా {ఉజ్జ్వల తులసీ కురంగమద వాసన వాసిత దివ్య దేహుడు - ఉజ్జ్వలమైన తులసి యొక్క కురంగ మదము (కస్తూరి యొక్క) సువాసనలచే వాసిత (పరిమళించుతున్న) దేహుడు (శరీరముగలవాడు), కృష్ణుడు}; శ్రీనిలయశరీర = శ్రీకృష్ణా {శ్రీనిలయశరీరుడు - శ్రీ (సంపదలకు) నిలయమైన శరీరముగలవాడు, కృష్ణుడు}; కృష్ణ = శ్రీకృష్ణా {కృష్ణ - కృష్ణుడు}; ధరణీధర = శ్రీకృష్ణా {ధరణీధరః - ధరణి (భూమిని) ధరుడు (మోయువాడు), విష్ణువు, విష్ణుసహస్రనామములు శ్రీశంకరభాష్యం 235వ నామం};
భావము:- బ్రహ్మ మొదలైన దేవతలు, మునుల చేత స్తుతింపబడేవి, పుణ్య గంగా తీర్థమునకు నెలవైన పాదపద్మములు కలవాడా! స్వచ్ఛమైన నవరత్నాలతో ప్రకాశించే కాలి అందెలు కలవాడా! కౌస్తుభ మణి భూషణంగా కలవాడా! గొప్పనైన తులసీదళాల, కస్తూరి సుగంధాలు గుబాళించే దివ్యదేహం కలవాడా! లక్ష్మీదేవికి నిలయమైన శరీరం కలవాడా! భూభారాన్ని వహించేవాడా! సూర్య చంద్రులే కన్నులుగా గలవాడా! కృష్ణా!

తెభా-5.2-166-క.
శ్రీ రుణీ హృదయస్థిత!
పాకహర! సర్వలోకపావన! భువనా
తీగుణాశ్రయ! యతి వి
ఖ్యా! సురార్చిత పదాబ్జ! కంసవిదారీ!

టీక:- శ్రీతరుణీహృదయస్థిత = శ్రీకృష్ణా {శ్రీతరుణీ హృదయ స్థితుడు - శ్రీతరుణీ (లక్ష్మీదేవిని) హృదయమందు స్థితుడు (నిలుపుకున్నవాడు), కృష్ణుడు}; పాతకహర = శ్రీకృష్ణా {పాతక హరుడు - పాతక (పాపములను) హరుడు (హరించువాడు), కృష్ణుడు}; సర్వలోకపావన = శ్రీకృష్ణా {సర్వలోక పావనుడు - సర్వ (అఖిలమైన) లోకములను పావనుడు (పవిత్రుజేయువాడు), కృష్ణుడు}; భువనాతీతగుణాశ్రయ = శ్రీకృష్ణా {భువనాతీత గుణాశ్రయుడు - భువన (లోకములు అన్నిటికిని) అతీతమైన గుణములకు ఆశ్రయుడు (నిలయమైనవాడు), కృష్ణుడు}; అతివిఖ్యాతసురార్చితపదాబ్జ = శ్రీకృష్ణా {అతి విఖ్యాత సురార్చిత పదాబ్జ - అతి (మిక్కిలి) విఖ్యాత (ప్రసిద్దిచెందిన) సురా (దేవతలచే) అర్చిత (పూజింపబడెడి) పద (పాదములు యనెడి) అబ్జుడు (పద్మములు కలవాడు), కృష్ణుడు}; కంసవిదారీ = శ్రీకృష్ణా {కంస విదారి - కంసుని విదారి (సంహరించివాడు), కృష్ణుడు};
భావము:- లక్ష్మీదేవి హృదయంలో నిలుపుకున్నవాడా! పాపాలను హరించేవాడా! సర్వలోకాలను పవిత్రం చేసేవాడా! అలౌకిక గుణాలకు ఆశ్రయమైనవాడా! మిక్కిలి ప్రసిద్ధి పొందినవాడా! దేవతలచేత పూజింపబడే పాదపద్మాలు కలవాడా! కంసుని సంహరించినవాడా!

తెభా-5.2-167-మత్త.
దండితారిసమూహ! భక్తనిధాన! దాసవిహార! మా
ర్తాంమండల మధ్యసంస్థిత! త్త్వరూప! గదాసి కో
దం శంఖ సుదర్శనాంక! సుధాకరార్క సునేత్ర! భూ
మంలోద్ధరణార్త పోషణ! త్తదైత్య నివారణా!

టీక:- దండితారిసమూహ = శ్రీకృష్ణా {దండితారి సమూహుడు - దండిత (శిక్షింపబడిన) అరి (శత్రువుల) సమూహము గలవాడు, కృష్ణుడు}; భక్తనిధాన = శ్రీకృష్ణా {భక్త నిధానుడు - భక్తులకు నిధానుడు (నిధియైనవాడు)}; దాసవిహార = శ్రీకృష్ణా {దాస విహారుడు - దాస (దాసుల యందు) విహారుడు (విహరించెడివాడు), కృష్ణుడు}; మార్తాండమండలమధ్యసంస్థిత = శ్రీకృష్ణా {మార్తాండమండల మధ్య సంస్థితుడు - మార్తాండ (సూర్య) మండలమునకు మధ్యన సంస్థిత (స్థిరముగ నుండువాడు), కృష్ణుడు}; తత్త్వరూప = శ్రీకృష్ణా {తత్త్వరూపుడు - పరతత్త్వమే రూపుడు (తన స్వరూపమైనవాడు), కృష్ణుడు}; గదాసికోదండశంఖసుదర్శనాంక = శ్రీకృష్ణా {గదాసి కోదండ శంఖ సుదర్శనాంకుడు - గదను అసి (కత్తిని) కోదండ (విల్లు)ను శంఖమును సుదర్శనచక్రమును అంకుడు (పార్శ్వమున కలవాడు), కృష్ణుడు}; సుధాకరార్కసునేత్రా = శ్రీకృష్ణా {సుధాక రార్క సునేత్రుడు - సుధాకర (చంద్రుడు) అర్క (సూర్యుడు) సు (చక్కగా) నేత్రుడు (కన్నులుగా కలవాడు), కృష్ణుడు}; భూమండలోద్ధరణా = శ్రీకృష్ణా {భూమండ లోద్ధరణుడు - భూమండలమును ఉద్దరించినవాడు, కృష్ణుడు}; ఆర్తపోషణ = శ్రీకృష్ణా {ఆర్త పోషణుడు - ఆర్తులను (దుఃఖమును పొందినవారిని) పోషణ (రక్షించువాడు), కృష్ణుడు}; మత్తదైత్యనివారణా = శ్రీకృష్ణా {మత్తదైత్య నివారణడు - మత్త (మదించిన) దైత్య (రాక్షసులను) నివారణుడు (తొలగించెడివాడు), కృష్ణుడు};
భావము:- శత్రు బృందాలను దండించినవాడా! భక్తుల పాలిటి పెన్నిధి ఐనవాడా! దానశీలా! సూర్యమండలం మధ్య ఉండేవాడా! తత్త్వస్వరూపా! గద, కత్తి, ధనుస్సు, శంఖం, సుదర్శన చక్రం అనే పంచాయుధాలు కలవాడా! చంద్రసూర్యులు కన్నులుగా గలవాడా! భూమండలాన్ని ఉద్ధరించినవాడా! ఆర్తులను పోషించేవాడా! మదించిన రాక్షసులను అణచినవాడా!

తెభా-5.2-168-గ.
ఇది శ్రీ సకల సుకవిజనానందకర బొప్పనామాత్యపుత్ర గంగనార్య ప్రణీతంబైన శ్రీమద్భాగవత మహాపురాణంబునందు భరతాత్మజుం డైన సుమతికి రాజ్యాభిషేకంబును, పాషండదర్శనంబును, సుమతి పుత్ర జన్మ విస్తారంబును, గయుని చరిత్రంబును, గయుని సంస్తుతియు, భూ ద్వీప వర్ష సరిదద్రి నభస్సముద్ర పాతాళ దిఙ్నరక తారాగణ సంస్థితియు నను కథలు గల పంచమస్కంధంబు నందు ద్వితీయాశ్వాసము సమాప్తము.
టీక:- ఇది = ఇది; శ్రీ = శుభకరమైన; సకల = సమస్తమైన; సు = మంచి; కవి = కవులైన; జన = వారికి; ఆనంద = ఆనందమును; కర = కలిగించెడి; బొప్పనామాత్య = బొప్పనామాత్యుని; పుత్ర = పుత్రుడు; గంగన = గంగన యనెడి; ఆర్య = ఉత్తమునిచే; ప్రణీతంబు = సంస్కరింపబడినది; ఐన = అయినట్టి; శ్రీమత్ = శ్రీమంతమైన; భాగవత = భాగవతము యనెడి; మహా = గొప్ప; పురాణంబున్ = పురాణము; అందున్ = లోని; భరత = భరతుని యొక్క; ఆత్మజుండు = పుత్రుడు; ఐన = అయిన; సుమతి = సుమతి; కిన్ = కి; రాజ్య = రాజ్యాధికారమున; అభిషేకంబును = పట్టాభిషేకమును; పాషాండదర్శనంబును = పాషాండమత దర్శనము; సుమతి = సుమతి యొక్క; పుత్ర = పుత్రుల; జన్మ = జన్మములు; విస్తారంబును = విస్తరించుటలు; గయుని = గయుని యొక్క; చరిత్రంబును = చరిత్ర; గయుని = గయుని యొక్క; సంస్తుతియు = స్తుతులు; భూ = భూమండలము; ద్వీప = ద్వీపములు; వర్ష = వర్షములు; సరిత్ = నదులు; అద్రి = పర్వతములు; నభస్ = ఆకాశము; పాతాళ = పాతాళము; దిక్ = దిక్కులు; నరక = నరకములు; తారా = తారల; గణ = సమూహముల; సంస్థితియున్ = సుస్థిర స్థానములు; అను = అనెడి; కథలు = కథనములు; కల = కలిగిన; పంచమ = ఐదవ (5); స్కంధంబున్ = స్కంధము; అందున్ = లో; ద్వితీయ = రెండవ (2); ఆశ్వాసము = ఆశ్వాసము; సమాప్తము = సంపూర్ణము;
భావము:- ఇది సకల సుకవులకు ఆనందాన్ని కలిగించేవాడు, బొప్పనామాత్యుని పుత్రుడు అయిన గంగనార్యుని చేత రచింపబడ్డ శ్రీమద్భాగవత పురాణంలో భరతుని కుమారుడైన సుమతికి రాజ్య పట్టాభిషేకం, పాషండ దర్శనం, సుమతి పుత్రుల జననంతో వంశ విస్తారము, గయుని చరిత్ర, గయుడు చేసిన సంస్తుతి, భూమిమీది ద్వీపాలు, వర్షాలు, నదులు, పర్వతాలు, ఆకాశం, సముద్రాలు, పాతాళం, దిక్కులు, నరకాలు, నక్షత్రాలు మొదలైనవాటి స్థితిగతులు అనే కథలున్న పంచమస్కంధం యొక్క ద్వితీయాశ్వాసం సుసంపూర్ణం.


ఓం నమో భగవతే వాసుదేవాయ!!
ఓం! ఓం! ఓం!
ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!
సర్వే జనా స్సుఖినో భవతు!!