పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/వసుదేవుని వంశము

వసుదేవుని వంశము

తెభా-9-715-ఉ.
ధీయశాలి యైన వసుదేవుఁడు పుట్టినవెంట మింటిపై
నాక దుందుభుల్ మొరసె చ్యుతుఁ డీతనికిం దనూజుఁడై
మానుగఁ బుట్టునంచు గరిమంబున దేవత లుబ్బ రాజపం
చాన! తన్నిమిత్తమున నానకదుందుభి యయ్యె వాఁడిలన్.

టీక:- ధీనయశాలి = గొప్పబుద్ధిమంతుండు; ఐన = అయిన; వసుదేవుడు = వసుదేవుడు; పుట్టిన = జన్మించిన; వెంటన్ = వెంటనే; మింటి = ఆకాశము; పై = మీద; ఆనకదుందుభులు = భేరీలు దుందుభలు; మొరసెన్ = మోగినవి; అచ్యుతుడు = విష్ణువు; ఈతని = ఇతని; కిన్ = కే; మానుగన్ = మనోజ్ఞముగా; పుట్టున్ = జన్మించును; అంచున్ = అనుచు; గరిమంబునన్ = ఉత్సాహముతో; దేవతలు = దేవతలు; ఉబ్బ = పొంగి; రాజపంచానన = రాజసింహుడ; తత్ = ఆ; నిమిత్తంబునన్ = కారణముచేత; ఆనకదుందుభి = ఆనకదుందుభి; అయ్యెన్ = అయ్యెను; వాడు = అతను; ఇలన్ = లోకమునందు.
భావము:- రాజసింహుడా! పరీక్షిత్తూ! మహానుభావుడు వసుదేవుడు పుట్టినప్పుడు విష్ణుమూర్తి ఇతనికే జన్మిస్తాడు అంటూ ఉత్సాహంతో దేవతలు పొంగిపోయి, ఆకాశంలో భేరీలు దుందుభులు మోగించారు. ఆ కారణంచేత ఆనకదుందుభి అని అతను లోకంలో ప్రసిద్ధి పొందాడు.

తెభా-9-716-క.
చెలికాఁడగు కుంతికిఁ
యులు లేకున్నఁ జూచి న తనయఁ బృథం
యఁగ నిమ్మన శూఁరుడు
యందలి మైత్రి నిచ్చె రణీనాథా!

టీక:- తన = తన; చెలికాడు = స్నేహితుడు; అగు = ఐన; కుంతి = కుంతిభోజుని; కిన్ = కి; తనయులు = పిల్లలు; లేకున్న = లేకపోవుట; చూచి = చూసి; తన = తన యొక్క; తనయన్ = పుత్రికను; పృథన్ = పృథను; తనయగన్ = కూతురుగాపెంచుకొన; ఇమ్ము = ఇమ్ము; అనన్ = అనగా; శూరుడు = జ్ఞాని; తన = అతని; అందలి = ఎడలి; మైత్రిన్ = స్నేహముకొలది; ఇచ్చెన్ = ఇచ్చెను; ధరణీనాథ = రాజా {ధరణీనాథుడు - భూమికి భర్త, రాజు}.
భావము:- రాజా! తన స్నేహితుడైన కుంతిభోజునికి పిల్లలు లేకపోవుట చూసి శూరుడు తన పుత్రిక పృథను దత్తత కూతురుగా పెంచుకొమ్ము అని అతని ఎడలి స్నేహభావం కొలది ఇచ్చాడు.

తెభా-9-717-వ.
అయ్యింతి కుంతిభోజునింటం బెరుగుచుండ, నొకనాఁడు దుర్వాసుం డరుగుదెంచిన, నమ్మహాత్మునకుఁ గొన్ని దినంబులు పరిచర్యలు చేసి వేల్పులం జేరంజీరు విద్యం బడసి, యా విద్య లావెఱుంగ నొక్కనా డేకాంతంబున వెలుంగుఱేని నాకర్షించిన నా దేవుండు వచ్చినం జూచి వెఱఁగుపడి, యిట్లనియె.
టీక:- ఆ = ఆ; ఇంతి = యువతి; కుంతిభోజుని = కుంతిభోజుని; ఇంటన్ = ఇంటిలో; పెరుగుచుండన్ = పెరుగుతుండగా; ఒక = ఒకానొక; నాడు = దినమున; దుర్వాసుండు = దుర్వాసమహర్షి; అరుగుదెంచినన్ = రాగా; ఆ = ఆ; మహాత్మున్ = గొప్పవాని; కున్ = కి; కొన్ని = కొంత; దినంబులు = కాలము; పరిచర్యలున్ = సేవలు; చేసి = చేసి; వేల్పులన్ = దేవతలను; చేరన్ = కవయుటకు; చీరు = పిలిచెడి; విద్యన్ = విద్యను; పడసి = పొంది; ఆ = ఆ; విద్య = విద్య యొక్క; లావున్ = శక్తిని; ఎఱుంగన్ = తెలిసికొనుటకు; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; ఏకాంతమునన్ = ఒంటరిగ; వెలుంగుఱేని = సూర్యుని {వెలుంగుఱేడు - వెలుగులరాజు, సూర్యుడు}; ఆకర్షించినన్ = పిలువగా; ఆ = ఆ; దేవుండు = దేవుడు; వచ్చినన్ = రాగా; చూచి = కనుగొని; వెఱగుపడి = అబ్బురపడి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఆ యువతి కుంతిభోజుని ఇంటిలో పెరుగుతుండగా ఒకనాడు దుర్వాసమహర్షి వచ్చాడు. ఆ మహానుభావునికి కొంత కాలం సేవలు చేసి, పిల్లల కోసం దేవతలను పిలిచెడి విద్యను పొందింది. ఆ విద్య యొక్క శక్తిని తెలిసికొనుటకు ఒక దినమున ఒంటరిగ సూర్యుని పిలువగా, ఆ దేవుడు రాగా కనుగొని అబ్బురపడి ఈ విధంగా అన్నది.

తెభా-9-718-క.
"మంత్ర పరీక్షార్థం బభి
మంత్రించితిఁ గాని దేవ! దనక్రీడా
తంత్రంబుఁ గోరి చీరను
మంత్రించిన తప్పు సైఁచి రలు దినేశా!"

టీక:- మంత్ర = మంత్రమును; పరీక్షా = పరీక్షించుట; అర్థంబు = కోసముమాత్రమే; అభిమంత్రించితిన్ = పిలిచితిని; కాని = అంతేతప్ప; దేవ = భగవంతుడ; మదనక్రీడతంత్రంబు = రతిని; కోరి = కోరుకొని; చీరను = పిలువలేదు; మంత్రించిన = మంత్రముప్రయోగించిన; తప్పు = తప్పును; సైచి = కాచి; మరలు = తిరిగివెళ్ళిపొమ్ము; దినేశా = సూర్యదేవ {దినేశుడు - పగటికి ప్రభువు, సూర్యుడు}.
భావము:- “సూర్యదేవ! భగవంతుడ! మంత్రం పరీక్షించడం కోసం మాత్రమే పిలిచాను. అంతే తప్ప, రతిని కోరుకొని పిలువ లేదు. మంత్రం ప్రయోగించిన తప్పును కాచి తిరిగి వెళ్ళిపొమ్ము.”

తెభా-9-719-వ.
అనిన నయ్యువిదకుఁ బద్మినీవల్లభుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; ఆ = ఆ; ఉవిద = యువతి; కున్ = కు; పద్మినీవల్లభుండు = సూర్యభగవానుడు {పద్మినీవల్లభుడు - పద్మములకు ప్రియుడు, సూర్యుడు} .
భావము:- అనగా ఆ కుంతికన్యకతో సూర్యభగవానుడు ఇలా అన్నాడు...

తెభా-9-720-మ.
"తెవా! నీ పలుకట్లయౌ నసదులే దేవోత్తమాహ్వానముల్
మొఱుఁగంబోలునె? వేల్పులం బడయుటల్ మోఘంబులే నీకు నీ
ఱి గర్భం బగుఁ బుత్రుఁడుం గలుగు; నీ తారుణ్యముం బూజ్యమౌ
వెవం గార్యములేదు; సిగ్గుదగునే? వ్రీడావినమ్రాననా!"

టీక:- తెఱవా = కాంతా; నీ = నీ యొక్క; పలుకు = మాటలు; అట్ల = అలా; ఔన్ = ఉండనిమ్ము; అసదులే = అల్పములా, కాదు; దేవతా = దేవతా; ఉత్తమ = శ్రేష్ఠులను; ఆహ్వానముల్ = ఆహ్వానించుట; మొఱుగన్ = కాదనుట; పోలునె = సాధ్యమా, కాదు; వేల్పులన్ = దేవతలను; పడయుటల్ = పొందుట; మోఘంబులే = వ్యర్థంబులా, కావు; నీ = నీ; కున్ = కు; ఈ = ఈ; తఱి = సమయమున; గర్భంబు = గర్భము; అగున్ = కలుగును; పుత్రుండున్ = కొడుకు; కలుగున్ = పుట్టును; నీ = నీ యొక్క; తారుణ్యమున్ = కన్యత్వము; పూజ్యమౌ = దూషితముకాదు; వెఱవన్ = బెదురుటకు; కార్యమున్ = పని; లేదు = లేదు; సిగ్గున్ = సిగ్గుపడుట; తగునే = తగునా, తగదు; వ్రీడా = సిగ్గుతో; వినమ్ర = వంచిన; అననా = ముఖీ.
భావము:- “ఓ యువతీ! లజ్జావతీ! నీ మాటలు అలా ఉండనీ. దేవతలను ఆహ్వానించడం అంటే అల్పమైన విషయమా? కప్పిపుచ్చ వచ్చునా? దేవతలను పొందుట వ్యర్థాలు కావు. అమోఘములు. నీవు ఇప్పుడు గర్భం ధరిస్తావు. కొడుకు పుడతాడు. కానీ నీ కన్యత్వం దూషితము కాదు. బెదురుటకు పని లేదు. సిగ్గుపడుట తగదు. సిగ్గుతో తల వంచుకో వద్దు.”

తెభా-9-721-చ.
ని తగ నియ్యకొల్పి లలితాంగికి గర్భము చేసి మింటికిం
నియె దినేశ్వరుం డపుడు క్కని రెండవసూర్యుడో యనం
రెడు పుత్రుఁ గాంచి కృప ప్పి జగజ్జనవాదభీతయై
యుని నీటఁ బోవిడిచి తా నరిగెం బృథ దండ్రి యింటికిన్.

టీక:- అని = అని; తగన్ = చక్కగ; ఇయ్యకొల్పి = ఒప్పించి; లలితాంగి = అబల; కిన్ = కి; గర్భమున్ = గర్భము; చేసి = చేసి; మింటికిన్ = ఆకాశమున; కిన్ = కి; చనియెన్ = వెళ్ళిపోయెను; దినేశ్వరుండు = సూర్యభగవానుడు; అపుడున్ = అప్పుడు; చక్కని = అందమైన; రెండవ = రెండవ; సూర్యుడో = సూర్యుడేమో; అనన్ = అనట్లుగ; తనరెడు = అతిశయించెడి; పుత్రున్ = కుమారుని; కాంచి = కని; కృపదప్పి = దయమాలి; జగత్ = లోకములోని; జన = ప్రజల; వాద = నిందలకు; భీత = భయపడినది; ఐ = అయ్యి; తనయుని = పుత్రుని; నీటన్ = నీటిప్రవాహమునందు; పోవిడిచి = వదలి; తాన్ = ఆమె; అరిగెన్ = వెళ్ళిపోయెను; పృథ = పృథ; తండ్రి = తండ్రి యొక్క; ఇంటి = నివాసమున; కిన్ = కు.
భావము:- అని చక్కగా ఒప్పించి ఆ అబల కుంతికి గర్భం చేసి, సూర్యభగవానుడు ఆకాశానికి వెళ్ళిపోయాడు. అప్పుడు, రెండవ సూర్యుడేమో అన్నట్లుగా ప్రకాశిస్తున్న అందమైన కుమారుని ఆమె కన్నది. దయమాలి లోకనిందకు భయపడి, ఆ పుత్రుని నీటిలో వదలి, పృథ తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది.

తెభా-9-722-వ.
అ య్యువిదను నీ ప్రపితామహుండైన పాండురాజు వివాహంబయ్యె; నయ్యంగనకుఁ బాండురాజువలన ధర్మజ, భీమార్జునులు పుట్టి; రమ్మగువ చెల్లెలగు శ్రుతదేవయనుదానిం గారూషకుం డైన వృద్ధ శర్మ పెండ్లియాడె; నయ్యిద్దఱకు మునిశాపంబున దంతవక్త్రుండను దానవుండు జన్మించె; దాని తోడంబుట్టువగు శ్రుతకీర్తిని గేకయరాజైన ధృష్టకేతుండు పెండ్లియాడె; నా దంపతులకుఁ బ్రతర్దనాదులేవురు పుట్టరి; దాని భగిని యైన రాజాధిదేవిని జయత్సేనుండు పరిణయంబయ్యె; నా మిథునంబునకు విందానువిందులు సంభవించిరి; చేదిదేశాధిపతి యైన దమఘోషుండు శ్రుతశ్రవసను బరిగ్రహించె; వారలకు శిశుపాలుం డుదయించె. వసుదేవుని తమ్ముఁడైన దేవభాగునికిఁ గంసయందుఁ జిత్రకేతుబృహద్బలు లిరువురు జనించిరి; వాని భ్రాతయగు దేవశ్రవుండనువానికిఁ గంసవతి యందు వీరుండును నిషుమంతుండును నుప్పతిల్లిరి; వాని సోదరుండయిన కంకునికిఁ గంక యనుదానికి బకుండు, సత్యజిత్తు, పురుజిత్తు, ననువారుద్భవిల్లిరి; వాని సహజుండయిన సృంజయునికి రాష్ట్రపాలి యందు వృషదుర్మర్షణాదు లావిర్భవించిరి; వాని యనుజాతుం డయిన శ్యామకునకు సురభూమి యందు హరికేశ హిరణ్యాక్షులు ప్రభవించిరి; వాని తమ్ముండైన వత్సుండు మిశ్రకేశియను నప్సరస యందు వృకాది సుతులం గనియె; వాని యనుజుండైన వృకుండు దూర్వాక్షి యందుఁ దక్ష పుష్కర సాళ్వాదుల నుత్పాదించె; వాని జఘన్యజుండయిన యనీకుండు సుదామని యనుదాని యందు సుమిత్రానీక బాణాదులయిన గొడుకులం బడసె; వాని యనుజుం డైన యానకుండు గర్ణికయందు ఋతుధామ జయులం గాంచె; వసుదేవునివలన రోహిణి యందు బలుండును గదుండును సారణుండును దుర్మదుండును విపులుండును ధ్రువుండును గృతాదులును, బౌరవి యందు సుభద్రుండును భద్రబాహుండును దుర్మదుండును భద్రుండును భూతాదులుం గూడ బన్నిద్దఱును, మదిర యందు నందోపనంద కృతక శ్రుత శూరాదులును గౌసల్య యందుఁ గేశియు, రోచన యందు హస్త హేమాంగాదులును, నిళ యందు యదు ముఖ్యులయిన యురువల్కలాదులును, ధృతదేవ యందుఁ ద్రిపృష్ఠుండును, శాంతిదేవ యందుఁ బ్రశ్రమ ప్రశ్రితాదులును, నుపదేవ యందుఁ గల్పవృష్ట్యాదులు పదుండ్రును, శ్రీదేవ యందు వసుహంస సుధన్వాదు లార్గురును, దేవరక్షిత యందు గదాదులు దొమ్మండ్రును, సహదేవయందుఁ బురూఢ శ్రుతముఖ్యు లెనమండ్రును, దేవకి యందుఁ గీర్తిమంతుండును సుషేణుండును భద్రసేనుండును ఋజువును సమదనుండును భద్రుండును సంకర్షణుండును నను వా రేడ్వురును బుట్టిరి; మఱియును.
టీక:- ఆ = ఆ; ఉవిదనున్ = యువతిని; నీ = నీ యొక్క; ప్రపితామహుండు = ముత్తాత; ఐన = అగు; పాండురాజు = పాండురాజు; వివాహంబు = పెండ్లి; అయ్యెన్ = ఆడెను; ఆ = ఆ; అంగన = స్త్రీ; కున్ = కి; పాండురాజు = పాండురాజు; వలనన్ = వలన; ధర్మజ = ధర్మజుడు; భీమ = భీముడు; అర్జునులున్ = అర్జునుడు; పుట్టిరి = జన్మించిరి; ఆ = ఆ; మగువ = స్త్రీ; చెల్లెలు = చిన్నసోదరి; అగు = ఐన; శ్రుతదేవ = శుతదేవ; అను = అనెడి; దానిన్ = ఆమెను; కారూషకుండు = కారూశదేశపురాజు; ఐన = అయిన; వృద్ధశర్మ = వృద్ధశర్మ; పెండ్లియాడెన్ = వివాహముచేసుకొనెను; ఆ = ఆ; ఇద్దఱి = ఇద్దరు (2); కున్ = కు; ముని = ఋషి; శాపంబునన్ = శాపమువలన; దంతవక్త్రుండు = దంతవక్త్రుడు; అను = అనెడి; దానవుండు = రాక్షసుడు; జన్మించెన్ = పుట్టెను; దాని = ఆమె యొక్క; తోబుట్టువు = సోదరి; అగు = ఐన; శ్రుతకీర్తిని = శ్రుతకీర్తిని; కేకయ = కేకయ దేశమునకు; రాజు = రాజు; ఐన = అయిన; ధృష్టకేతుండు = ధృష్టకేతుడు; పెండ్లి = వివాహము; ఆడెన్ = చేసికొనెను; ఆ = ఆ; దంపతుల్ = దంపతుల; కున్ = కు; ప్రతర్దన = ప్రతర్దనుడు; ఆదులు = మున్నగువారు; ఏవురున్ = ఐదుగురు; పుట్టిరి = జన్మించిరి; దాని = ఆమె యొక్క; భగిని = సోదరి; ఐన = అయినట్టి; రాజాధిదేవిని = రాజాధిదేవిని; జయత్సేనుండు = జయత్సేనుడు; పరిణయంబున్ = పెండ్లి; అయ్యెన్ = ఆడెను; ఆ = ఆ; మిథునంబున్ = దంపతుల; కున్ = కు; వింద = విందుడు; అనువిందులు = అనువిందుడు; సంభవించిరి = పుట్టిరి; చేది = చేది; దేశ = రాజ్యమునకు; అధిపతి = ప్రభువు; ఐన = అయిన; దమఘోషుండు = దమఘోషుడు; శ్రుతశ్రవసనున్ = శ్రుతశ్రవసను; పరిగ్రహించెన్ = పెండ్లాడెను; వారల = వారి; కున్ = కి; శిశుపాలుండు = శిశుపాలుడు; ఉదయించెన్ = పుట్టెను; వసుదేవుని = వసుదేవుని; తమ్ముడు = తమ్ముడు; ఐన = అయిన; దేవభాగుని = దేవభాగుని; కిన్ = కి; కంస = కంస; అందున్ = తో; చిత్రకేతు = చిత్రకేతుడు; బృహద్బలులు = బృహద్బలుడు; ఇరువురు = ఇద్దరు (2); జనించిరి = పుట్టిరి; వాని = అతని; భ్రాత = సోదరుడు; అగు = ఐన; దేవశ్రవుండు = దేవశ్రవుడు; అను = అనెడి; వాని = అతని; కిన్ = కి; కంసవతి = కంసవతి; అందున్ = తో; వీరుండును = వీరుడును; నిషుమంతుండును = నిషుమంతుడు; ఉప్పతిల్లిరి = పుట్టిరి; వాని = అతని; సోదరుండు = సహోదరుడు; అయిన = ఐన; కంకుని = కంకుని; కిన్ = కి; కంక = కంక; అను = అనెడి; దాని = ఆమె; కిన్ = కి; బకుండున్ = బకుడు; సత్యజిత్తు = సత్యజిత్తు; పురుజిత్తున్ = పురుజిత్తు; అను = అనెడి; వారు = వారు; ఉద్బవిల్లిరి = పుట్టిరి; వాని = ఆతని; సహజుండు = సోదరుడు; అయిన = ఐన; సృంజయుని = సృంజయుని; కిన్ = కి; రాష్ట్రపాలి = రాష్ట్రపాలి; అందున్ = తో; వృష = వృషుడు; దుర్మర్షణ = దుర్మర్షణుడు; ఆదులు = మున్నగువారు; ఆవిర్భవించిరి = పుట్టిరి; వాని = అతని; అనుజాతుండు = సోదరుడు; అయిన = ఐన; శ్యామకున్ = శ్యామకున; కున్ = కు; సురభూమి = సురభూమి; అందున్ = లో; హరికేశ = హరికేశుడు; హిరణ్యాక్షులు = హిరణ్యాక్షుడు; ప్రభవించిరి = పుట్టిరి; వాని = అతని; తమ్ముండు = తమ్ముడు; ఐన = అయిన; వత్సుండు = వత్సుడు; మిశ్రకేశి = మిశ్రకేశి; అను = అనెడి; అప్సరస = అప్సరస; అందున్ = ఎడల; వృక = వృకుడు; ఆది = మున్నగు; సుతులన్ = పుత్రులను; కనియెన్ = పుట్టించెను; వాని = అతని; అనుజుండు = సోదరుడు; ఐన = అయిన; వృకుండు = వృకుడు; దూర్వాక్షి = దూర్వాక్షి; అందున్ = ఎడల; దక్ష = దక్షుడు; పుష్కర = పుష్కరుడు; సాళ్వ = సాళ్వుడు; ఆదులన్ = మున్నగువారిని; ఉత్పాదించెన్ = పుట్టించెను; వాని = ఆతని; జఘన్యజుండు = సోదరుడు; అయిన = ఐన; అనీకుండు = అనీకుడు; సుదామని = సుదామని; అను = అనెడి; దాని = ఆమె; అందున్ = ఎడల; సుమిత్రానీక = సుమిత్రానీకుడు; బాణ = బాణుడు; ఆదులు = మున్నగువారు; అయిన = ఐన; కొడుకులన్ = పుత్రులను; పడసె = పొందెను; వాని = అతని; అనుజుండు = అనుజుడు; ఐన = అయిన; ఆనకుండున్ = ఆనకుడు; కర్ణిక = కర్ణిక; అందున్ = తో; ఋతుధామ = ఋతుధాముడు; జయులన్ = జయుడులను; కాంచె = పుట్టించెను; వసుదేవుని = వసుదేవుని; వలనన్ = వలన; రోహిణి = రోహిణి; అందున్ = తో; బలుండునున్ = బలుడు; గదుండునున్ = గదుడు; సారణుండునున్ = సారణుడు; దుర్మదుండును = దుర్మదుడు; విపులుండునున్ = విపులుడు; ధ్రువుండును = ధ్రువుడును; కృత = కృతుడు; ఆదులును = మున్నగువారు; పౌరవి = పౌరవి; అందున్ = తో; సుభద్రుండును = సుభద్రుడును; భద్రబాహుండును = భద్రబాహుడు; దుర్మదుండునున్ = దుర్మదుడు; భద్రుండునున్ = భద్రుడు; భూత = భూతుడు; ఆదులున్ = మున్నగువారు; కూడన్ = కలిసి; పన్నిద్ధఱున్ = పన్నెండుమంది (12); మదిర = మదిర; అందున్ = తో; నంద = నందుడు; ఉపనంద = ఉపనందుడు; కృతక = కృతకుడు; శ్రుత = శ్రుతుడు; శూర = శూరుడు; ఆదులును = మున్నగువారు; కౌసల్య = కౌసల్య; అందున్ = అందు; కేశియున్ = కేశి; రోచన = రోచన; అందున్ = తోటి; హస్త = హస్తుడు; హేమాంగద = హేమాంగదుడు; ఆదులునున్ = మున్నగువారు; ఇళ = ఇళ; అందున్ = అందు; యదు = యదువంశపు; ముఖ్యులు = ముఖ్యమైనవారు; అయిన = ఐన; ఉరువల్కల = ఉరువల్కలుడు; ఆదులునున్ = మున్నగువారు; ధృతదేవ = ధృతదేవ; అందున్ = అందు; త్రిపృష్ఠుండును = త్రిపృష్ఠుండును; శాంతిదేవ = శాంతిదేవ; అందున్ = అందు; ప్రశ్రమ = ప్రశ్రముడు; ప్రశ్రిత = ప్రశ్రితుడు; ఆదులునున్ = మున్నగువారు; ఉపదేవ = ఉపదేవ; అందున్ = అందు; కల్పవృష్ట = కల్పవృష్టుడు; ఆదులున్ = మున్నగువారు; పదుండ్రును = పదిమంది (10); శ్రీదేవ = శ్రీదేవ; అందున్ = అందు; వసుహంస = వసుహంసుడు; సుధన్వ = సుధన్వుడు; ఆదులు = ఆదులు; ఆర్గురును = ఆరుగుర (6); దేవరక్షిత = దేవరక్షిత; అందున్ = అందు; గద = గదుడు; ఆదులు = మున్నగువారు; తొమ్మండ్రును = తొమ్మిదిమంది; సహదేవ = సహదేవ; అందున్ = అందు; పురూఢ = పురూఢుడు; శ్రుత = శ్రుతుడు; ముఖ్యులు = మున్నగువారు; ఎనమండ్రును = ఎనిమిదిమంది (8); దేవకి = దేవకి; అందున్ = తోటి; కీర్తిమంతుండును = కీర్తిమంతుడు; సుషేణుండును = సుషేణుడు; భద్రసేనుండును = భద్రసేనుడు; ఋజువును = ఋజువు; సమదనుండును = సమదనుడు; భద్రుండునున్ = భద్రుడు; సంకర్షణుండునున్ = సంకర్షణుడు; అను = అనెడి; వారు = వారు; ఏడ్వురును = ఏడుగురు; పుట్టిరి = జన్మించిరి; మఱియును = ఇంకను.
భావము:- ఆ కుంతిని నీ ముత్తాత పాండురాజు పెండ్లాడాడు. ఆమెకి పాండురాజు వలన ధర్మజుడు, భీముడు, అర్జునుడు జన్మించారు; ఆమె చెల్లెలు శ్రుతదేవను కారూశదేశపురాజు వృద్ధశర్మ వివాహమాడాడు. వారికి ఋషి శాపం వలన దంతవక్త్రుడు అనె రాక్షసుడు పుట్టాడు; ఆమె సోదరి శ్రుతకీర్తిని కేకయ దేశపురాజు ధృష్టకేతుడు వివాహం చేసికొన్నాడు. వారికి ప్రతర్థనుడు మున్నగు ఐదుగురు జన్మించారు; ఆమె సోదరి రాజాధిదేవిని జయత్సేనుడు పెండ్లాడాడు. ఆ దంపతులకు విందుడు, అనువిందుడు పుట్టారు; శ్రుతశ్రవసను చేది రాజ్యాధిపతి దమఘోషుడు పెండ్లాడెను. వారికి శిశుపాలుడు పుట్టాడు; వసుదేవుని తమ్ముడు దేవభాగునికి కంసతో చిత్రకేతుడు, బృహద్బలుడు అని ఇద్దరు పుట్టారు; అతని సోదరుడు దేవశ్రవుడికి కంసవతితో వీరుడు, నిషుమంతుడు పుట్టారు; అతని సహోదరుడు కంకునికి భార్య కంక యందు బకుడు, సత్యజిత్తు, పురుజిత్తు పుట్టారు; ఆతని సోదరుడు సృంజయునికి రాష్ట్రపాలితో వృషుడు, దుర్మర్షణుడు మున్నగువారు పుట్టారు; అతని సోదరుడు శ్యామకునకు సురభూమితో హరికేశుడు, హిరణ్యాక్షుడు పుట్టారు; అతని తమ్ముడు వత్సుడు మిశ్రకేశి అనెడి అప్సరస ఎడల వృకుడు మున్నగు పుత్రులను పుట్టించాడు; అతని సోదరుడు వృకుడు దూర్వాక్షి ఎడల దక్షుడు, పుష్కరుడు, సాళ్వుడు మున్నగువారిని పుట్టించాడు; ఆతని సోదరుడు అనీకుడు సుదామని అనెడి ఆమె ఎడల సుమిత్రానీకుడు, బాణుడు మున్నగు పుత్రులను పొందాడు; అతని అనుజుడు ఆనకుడు కర్ణికతో ఋతుధాముడు, జయుడులను పుట్టించాడు; వసుదేవుని వలన రోహిణితో బలుడు, గదుడు, సారణుడు, దుర్మదుడు, విపులుడు, ధ్రువుడు, కృతుడు మున్నగువారు; పౌరవితో సుభద్రుడు, భద్రబాహుడు, దుర్మదుడు, భద్రుడు, భూతుడు మున్నగు పన్నెండుమంది; మదిరతో నందుడు, ఉపనందుడు, కృతకుడు, శ్రుతుడు, శూరుడు, మున్నగువారు; కౌసల్య అందు కేశి; రోచన తోటి హస్తుడు, హేమాంగదుడు మున్నగువారు; ఇళ అందు ఉరువల్కలుడు మున్నగువారు; ధృతదేవ అందు త్రిపృష్ఠుండు; శాంతిదేవ అందు ప్రశ్రముడు, ప్రశ్రితుడు మున్నగువారు; ఉపదేవ అందు కల్పవృష్టుడు మున్నగు పదిమంది (10); శ్రీదేవ అందు వసుహంసుడు, సుధన్వుడు ఆదులు ఆరుగురు; దేవరక్షిత అందు గదుడు మున్నగు తొమ్మిదిమంది; సహదేవ అందు పురూఢుడు, శ్రుతుడు, మున్నగు ఎనిమిదిమంది (8); దేవకి తోటి కీర్తిమంతుడు, సుషేణుడు, భద్రసేనుడు, ఋజువు, సమదనుడు, భద్రుడు, సంకర్షణుడు అనెడి వారు ఏడుగురు జన్మించాక.......