పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/భరతుని చరిత్ర

భరతుని చరిత్ర

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/భరతుని చరిత్ర)
రచయిత: పోతన



(భా-9-623-వ.)

మార్చు
ఇవ్విధంబున నమోఘవీర్యుండగు నా రాచపట్టి, దపసిరాచూలికిఁ 1
జూలు నెక్కొలిపి, మఱునాఁడు తన వీటికిం జనియె; న య్యింతియుఁ 2
గొంతకాలంబునకుఁ గొడుకుం గనినఁ గణ్వమునీంద్రుం డా రాచపట్టికి 3
జాతకర్మాది మంగళాచారంబు లొనర్చె నా డింభకుండును దినదినం 4
బునకు బాలచంద్రుఁడునుం బోలె నెదుగుచు. 5

(భా-9-624-క.)

మార్చు
కుంఠితుఁడుగాక వాఁడు 1
త్కంఠం దన పిన్ననాఁడె కణ్వవనచర 2
త్కంఠీరవ ముఖ్యంబుల 3
కంఠములం బట్టి యడుచుఁ; గట్టున్; విడుచున్. 4

(భా-9-625-వ.)

మార్చు
అంత నా కణ్వమునీంద్రుండు బాలకుం జూచి శకుంతల కిట్లనియె. 1

(భా-9-626-ఉ.)

మార్చు
పట్టపురాజు నీ మగఁడు; పాపఁడు నన్నిట నెక్కు డంతకుం; 1
బట్టపుదేవివై గఱువ బాగున నుండక పాఱువారితో 2
గట్టువనంబులో నవయఁగాఁ బనిలే దిటఁ దర్లిపోఁగదే 3
పుట్టిన యిండ్ల మానినులు పోరచిగా ననిశంబు నుందురే? 4

(భా-9-627-వ.)

మార్చు
అనిన నియ్యకొని. 1

(భా-9-628-క.)

మార్చు
ఆ పినవాని నతుల 1
వ్యాపారు నుదారు వైష్ణవాంశోద్భవునిం 2
జూపెద నంచు శకుంతల 3
భూపాలునికడకు వచ్చెఁ బుత్రుని గొనుచున్. 4

(భా-9-629-వ.)

మార్చు
వచ్చి దుష్యంతుండున్న సభామండపంబునకుం జని నిలిచి 1

|}

(భా-9-630-మ.)

మార్చు
వల కేలన్ గురుచక్రరేఖయుఁ బదద్వంద్వంబునం బద్మరే 1
ఖలు నొప్పారఁగ నందు వచ్చిన రమాకాంతుండు నాఁ గాంతి న 2
గ్గలమై యున్న కుమారు మారసదృశాకారున్ విలోకించి తాఁ 3
బలుకం డయ్యె విభం డెఱింగి సతి విభ్రాంతాత్మ యై యుండగన్. 4

(భా-9-631-వ.)

మార్చు
ఆ సమయంబున. 1

(భా-9-632-మ.)

మార్చు
అదె నీ వల్లభ; వాఁడు నీ సుతుఁడు; భార్యాపుత్రులం బాత్రులన్ 1
వదలంగా; దలనాఁటి కణ్వవనికా వైవాహికారంభముల్ 2
మది నూహింపు; శకుంతలావచనముల్ మాన్యంబుగా భూవరేం 3
ద్ర! దయం జేకొను మంచుం మ్రోసెను వియద్వాణీవధూవాక్యముల్. 4

(భా-9-633-వ.)

మార్చు
ఇ ట్లశరీరవాణి సర్వభూతంబులకుఁ దేటపడ భరింపు మని పలికిన, 1
నా కుమారుండు భరతుండయ్యె; నంత నా రాజు రాజవదన నంగీక 2
రించి తనూభవుం జేకొని కొంతకాలంబు రాజ్యంబు జేసి పరలోకం 3
బునకుం జనియె; తదనంతరంబ. 4

(భా-9-634-క.)

మార్చు
రెండవహరి క్రియ ధరణీ 1
మండలభారంబు నిజసమంచితబాహా 2
దండమున నిలిపి తనకును 3
భండనమున నెదురులేక భరతుం డొప్పెన్. 4

(భా-9-635-వ.)

మార్చు
మఱియునా దౌష్యంతి, యమునాతటంబున దీర్ఘతపుండు పురో 1
హితుండుగా డెబ్బదియెనిమిదియును, గంగాతీరంబున నేఁబది 2
యయిదును, నిట్లు నూటముప్పదిమూఁడశ్వమేధయాగంబులు 3
సదక్షిణంబులుగానొనర్చి; దేవేంద్రవిభవంబున నతిశయించి, పదు 4
మూఁడువేలునెనుబదినాలుగు కదుపుధేనువులుగలయది ద్వం 5
ద్వంబనం బరఁగు, నట్టి వేయి ద్వంద్వంబుల పాఁడిమొదవులఁగ్రేపు 6
లతోడ నలంకారసహితలం జేసి వేవురు బ్రాహ్మణుల కిచ్చి, మష్కార 7
తీర్థకూలంబున విప్రముఖ్యులకుఁ బుణ్యదినంబున గనక భూషణ 8
శోభితంబులయి ధవళదంతంబులు గల నల్లని యేనుంగులం బదు 9
నాలుగులక్షలనొసంగె; దిగ్విజయకాలంబున శక, శబర, బర్బర, కష, 10
కిరాతక, హూణ, మ్లేచ్ఛ దేశంబుల రాజులఁ బీచం బడంచి, రసాతలం 11
బున రాక్షస కారాగృహంబులందున్న వేల్పుల గరితలం బెక్కండ్ర 12
విడిపించి తెచ్చి, వారల వల్లభులం గూర్చె; త్రిపురదానవుల జయిం 13
చి, నిర్జరుల నిజమందిరంబుల నునిచె; నతని రాజ్యంబున గగన
14
ధరణీతలంబులు ప్రజలుగోరిన కోరిక లిచ్చుచుండె; ని వ్విధంబున. 15

(భా-9-636-ఆ.)

మార్చు
సత్యచరితమందుఁ జలమందు బలమందు 1
భాగ్యమందు లోకపతులకంటె 2
నెక్కుడైన పేర్మి నిరువదియేడువే 3
లేండ్లు ధరణి భరతుఁ డేలె నధిప! 4

(భా-9-637-క.)

మార్చు
అర్థపతికంటెఁ గలిమిఁ గృ 1
తార్థుండై యతుల శౌర్య మలవడియు నతం 2
డర్థములను బ్రాణములను 3
వ్యర్థము లని తలఁచి శాంతుఁ డయ్యె నరేంద్రా! 4

(భా-9-638-క.)

మార్చు
భరతుని భార్యలు మువ్వురు 1
వరుసం బుత్రకులఁ గాంచి వల్లభుతోడన్ 2
సరిగారని తోడ్తోడను 3
శిరములు దునుమాడి రాత్మ శిశువుల నధిపా! 4

(భా-9-639-వ.)

మార్చు
ఇట్లు విదర్భరాజపుత్రికలు శిశువులం జంపిన భరతుం డపుత్ర 1
కుండై మరుత్ స్తోమం బను యాగంబు పుత్రార్థి యై చేసి, దేవతల 2
మెప్పించెను; అ య్యవసరంబున. 3

(భా-9-640-సీ.)

మార్చు

(భా-9-640.1-ఆ.)

మార్చు
అన్న యిల్లాలిఁ జూలాలిని మమతాఖ్యఁ 1
జూచి బృహస్పతి సురతమునకుఁ
2
దొరఁకొని పైబడ్డఁ దొల్లి గర్భంబున 3
నున్న బాలుఁడు భయం బొదవి వలదు
4
తగదని మొఱజేయఁదమకంబుతో వాని 5
నంధుండ వగుమన్న నలిగి వాఁడు
6
యోనిలోపలి వీర్య మూడఁ దన్నిన నేలఁ 7
బడి బిడ్డఁడై యున్నఁ బాయ లేక
8
నితని పెంపు; కొడుకు లిరువురు జన్మించి 9
రనుచు వెలయఁ జేయు మనిన మమతఁ 10
బెంపఁజాల; నీవ పెంపు; భరింపు; మీ 11
ద్వాజు ననుచుఁ జనియె దాని విడిచి. 12

(భా-9-641-వ.)

మార్చు
ఇట్లు చథ్యుని భార్య యగు మమతయు బృహస్పతియు శిశు 1
వుం గని, ద్వాజుండైన వీని నీవ నీవ భరింపుమని, వదినె మఱఁ 2
దులు దమలో నొండొరువులం బలికిన కారణంబున వాఁడు భరద్వా 3
జుండయ్యె; గర్భస్థుండయిన వాఁడు బృహస్పతి శాపంబున దీర్ఘ 4
తముం డయ్యె; నంత నా బృహస్పతియు మమతయు నుదయిం 5
చిన వాని విడిచి నిజేచ్ఛం జనిన, మరుత్తులు వానిం బోషించి పుత్రా 6
ర్థి యయిన భరతున కిచ్చిరి; భరతుండు వానిం జేకొనియె; వితథం 7
బయిన భరతవంశంబునకు నా భరద్వాజుండు వంశకర్త యగుటం 8
జేసి వితథుండనం బరఁగె నా వితథునికి మన్యువు, మన్యువునకు 9
బృహత్క్షత్త్ర జయ మహావీర్య నర గర్గు లను వారేవురు సంభవించి; 10
రందు నరునికి సంకృతి, సంకృతికి గురుండు, రంతిదేవుం డన 11
నిరువురు జన్మించిరి; అందు. 12