పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/ఋశ్యశృంగుని వృత్తాంతము

ఋశ్యశృంగుని వృత్తాంతము

తెభా-9-684-క.
సంతిలేనితనంబునఁ
జింతించుచునుండ నతని చెలికాఁ డగు ధీ
మంతుఁడు దశరథుఁ డతనికి
సంతిగా నిచ్చె నాత్మను శాంతాఖ్యన్.

టీక:- సంతతి = పిల్లలు; లేనితనంబునన్ = లేకపోవుటచేత; చింతించుచుండన్ = విచారించుతుండగ; అతని = అతని; చెలికాడు = స్నేహితుడు; అగు = ఐన; ధీమంతుడు = బుద్ధిశాలి; దశరథుడు = దశరథుడు; అతని = అతని; కిన్ = కి; సంతతికాన్ = పెంపకమునకు; ఇచ్చెన్ = ఇచ్ఛెను; ఆత్మజను = కుమార్తెను; శాంత = శాంత; ఆఖ్యన్ = పేరు గలామెను.
భావము:- ఆ రోమపాదుడు పిల్లలు లేకపోడంతో విచారిస్తుంటే అతని స్నేహితుడు దశరథుడు తన కుమార్తె శాంతను అతనికి పెంపకానికి ఇచ్చాడు.

తెభా-9-685-వ.
అంత రోమపాదుండు, దన కూఁతురు శాంత యని కైకొని మెలంగుచుండ, నా రాజు రాజ్యంబునఁ గొంతకాలంబు వర్షంబు లేమికిం జింతించి, విభాండకసుతుండైన ఋశ్యశృంగుండు వచ్చిన వర్షంబు గురియు నని పెద్దలవలన నెఱింగి.
టీక:- అంతన్ = అంతట; రోమపాదుండున్ = రోమపాదుడు; తన = తన; కూతురు = పుత్రిక; శాంత = శాంత; అని = అని; కైకొని = దత్తతచేకొని; మెలంగుచుండన్ = వర్తింస్తుండగా; ఆ = ఆ; రాజు = రాజు; రాజ్యంబునన్ = రాజ్యములో; కొంత = కొంత; కాలంబున్ = కాలము; వర్షంబున్ = వర్షము; లేమి = లేకపోవుట; కిన్ = కి; చింతించి = విచారించి; విభాండక = విభాండకముని యొక్క; సుతుండు = కుమారుడు; ఐన = అయినట్టి; ఋశ్యశృంగుండు = ఋశ్యశృంగుడు; వచ్చినన్ = వచ్చినచో; వర్షంబున్ = వర్షములు; కురియున్ = కురియును; అని = అని; పెద్దల = పెద్దవారి; వలనన్ = వద్ద; విని = విని.
భావము:- అంతట రోమపాదుడు దశరథ పుత్రిక శాంతను దత్తత చేసుకొని వర్తిస్తుండగా, రాజ్యంలో కొంత కాలం వర్షాలు కురవక బాధపడ సాగాడు. విభాండక ముని కుమారుడు ఋశ్యశృంగుడు వస్తే వర్షాలు కురుస్తాయి అని పెద్దవారి వద్ద విన్నాడు.

తెభా-9-686-క.
రాజు ఋశ్యశృంగుని
ఘోతపోనియముఁ దెచ్చుకొఱకై పనిచెన్
వాసతుల నేర్పరుల ను
దాస్తనభారభీరురమధ్యగలన్.

టీక:- ఆ = ఆ; రాజు = రాజు; ఋశ్యశృంగుని = ఋశ్యశృంగుని; ఘోర = గట్టి; తపస్ = తపస్సు; నియమమును = నియమములు కలవానిని; తెచ్చు = తీసుకొచ్చుట; కొఱకున్ = కోసము; ఐ = అయ్యి; పనిచెన్ = పంపించెను; వారసతులన్ = వేశ్యలను; నేర్పరులను = నెఱజాణలైనవారిని; ఉదార = గొప్ప; స్తన = కుచ; భార = భారముచే; భీరుతర = మిక్కిలి చిక్కిన,సన్నని; మధ్యగలన్ = నడుములు కలవారిని.
భావము:- ఆ రాజు గొప్ప నియమాలతో తపస్సు చేసుకుంటున్న ఋశ్యశృంగుని తీసుకురావడం కోసం అందమైన నెఱజాణలను పంపించాడు.

తెభా-9-687-వ.
వారలుఁ జని.
టీక:- వారలున్ = వారు; చని = వెళ్ళి .
భావము:- ఆ నెఱజాణలు ఋశ్యశృంగుడు ఉన్న ఆశ్రమానికి వెళ్ళి.....

తెభా-9-688-తే.
"కాంతలార! మెకము న్నది మొదలుగా
నాఁడువారి నెఱుఁగఁ డవిలోన
గోఁచి బిగియఁగట్టుకొనిన యా వడుగని
త్తికాని రతికి రపవలయు."

టీక:- కాంతలారా = వనితలు; మెకము = లేడి; కన్నది = గర్భమున కన్నది; మొదలుగాన్ = అప్పటినుండి; ఆడువారిని = స్త్రీలను; ఎఱుగడు = తెలియనివాడు; అడవి = అడవి; లోనన్ = అందు; గోచి = గోచీగుడ్డ {గోచీ - పురుషావయవము కనబడకుండ కట్టుకొను సన్నని పొడవైన గుడ్డ}; బిగియగట్టుకొనిన = గట్టిగాకట్టుకొన్నట్టి {గోచీబిగియగట్టు - స్త్రీ సౌఖ్యమునకు బాగా దూరముగా నుండు}; ఆ = ఆ; వడుగని = బ్రహ్మచారిని; మత్తికాని = కాముకుని; రతి = మన్మథక్రీడ; కిన్ = కు; మరపవలయున్ = మరుగునట్లు చేయవలెను.
భావము:- "ఆ వనితలు అక్కడ లేడి కడుపున పుట్టిననాటి నుండీ ఆడవారిని చూడని ఋశ్యశృంగుని చూసారు. అతను కటిక బ్రహ్మచారి. గోచీ మాత్రం కట్టుకొనువాడు. అతనిని కామక్రీడకు మరుగునట్లు చేయాలి"అనుకుంటూ...

తెభా-9-689-వ.
అని పలుకుచు.
టీక:- అని = అని; పలుకుచున్ = మాట్లాడుకొనుచు .
భావము:- వారిలో వారు ఈ బ్రహ్మచారిని సాంసారిక మార్గంలోకి ఎలా తేవాలి అని ఆలోచించసాగారు.

తెభా-9-690-క.
డుచుఁ జెవులకు నింపుగఁ
బాడుచు నాలోక నిశితబాణౌఘములన్
వీడుచు డగ్గఱ నోడుచుఁ
జేడియ లా తపసికడకుఁ జేరిరి కలఁపన్.

టీక:- ఆడుచున్ = నటనలుచేయుచు; చెవుల్ = చెవుల; కున్ = కు; ఇంపుగ = ఆనందముకలుగునట్లు; పాడుచున్ = పాటలు పాడుతు; ఆలోక = చూపులనెడి; నిశిత = వాడియైన; బాణ = బాణముల; ఓఘములన్ = పరంపరరలను; వీడుచున్ = వదులుతు; డగ్గఱన్ = దగ్గరగా; ఓడుచున్ = తిరుగుతు; చేడియలు = కాంతలు; ఆ = ఆ; తపసి = ఋషి; కడ = దగ్గర; కున్ = కు; చేరిరి = చేరిరి; కలపన్ = కలయుటకోసము .
భావము:- మనోహరమైన ఆటపాటలతో వాడి చూపులతో దగ్గరగా మెలగుతూ జంకుతూ కాంతలు ఆ ఋషి దగ్గరకు చేరారు.

తెభా-9-691-వ.
అయ్యవసరంబున వారలం జూచి.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు; వారల్ = వారిని; చూచి = చూసి .
భావము:- అలా ఆ యువతులు శృంగారచేష్టలతో దరిచేరుతున్న ఆ సమయంలో వారిని ఋష్యశృంగుడు చూసి.

తెభా-9-692-సీ.
మిళితాళినీల ధమ్మిల్లభారంబులు-
చారుజటావిశేషంబు లనియు,
ర్మాంచ లోజ్వలప్రభ దుకూలంబులు-
తచర్మవస్త్రభేదంబు లనియు,
హు రత్నకీలిత భాసురహారంబు-
ధికరుద్రాక్షమాలాదు లనియు,
లయజ మృగనాభి హిత లేపంబులు-
హువిధ భూతి లేపంబు లనియు,

తెభా-9-692.1-తే.
ధురగానంబు శ్రుతియుక్తమంత్రజాతు
నియు, వీణెలు దండంబు నియు, సతుల
మూర్తు లెన్నఁడు నెఱుఁగని ముగుద తపసి
వారిఁ దాపసులని డాయచ్చి మ్రొక్కె.

టీక:- మిళితా = తుమ్మెదలవంటి; నీల = నల్లని; ధమిల్ల = కొప్పుల; భారంబులన్ = దట్టమైనవానిని; చారు = మనోహరమైన; జట = జటలలోని; విశేషంబులు = రకములు; అనియున్ = అని; భర్మ = బంగారపు; అంచల = జరీతో; ఉజ్వల = ప్రకాశవంతమైన; ప్రభ = మెరుపుకల; దుకూలంబులున్ = శ్రేష్ఠమైన వలువలు; తత = మెత్తని; చర్మవస్త్ర = మృగచర్మపు బట్టలలో; భేదంబులు = రకములు; అనియున్ = అని; బహు = అనేక; రత్న = రత్నములు; కీలిత = పొదగిన; భాసుర = ప్రకాశవంతమైన; హారంబులు = దండలు; అధిక = గొప్ప; రుద్రాక్ష = రుద్రాక్షల; మాల = మాలలు; ఆదులు = మున్నగునవి; అనియున్ = అని; మలయజ = చందనము; మృగనాభి = కస్తూరి; మహిత = గొప్ప; లేపంబులున్ = మైపూతలు; బహు = అనేక; విధ = రకముల; భూతి = విభూతి; లేపంబులున్ = పూతలు; అనియున్ = అని.
మధుర = తియ్యని; గానంబు = పాటలు; శ్రుతి = శ్రుతి; యుక్త = బద్ద; మంత్ర = వేదమంత్రములు; జాతులు = జతులు; అనియున్ = అని; వీణెలు = వీణలు; దండంబులు = యోగదండములు; అనియున్ = అని; సతుల = స్త్రీల; మూర్తులన్ = పొడలు; ఎన్నడున్ = ఎప్పుడును; ఎఱుగని = తెలియని; ముగుద = మగ్ద; తపసి = ఋషి; వారిన్ = వారిని; తాపసులు = మునులు; అని = అనుకొని; డాయన్ = దగ్గరకుచేర; వచ్చి = వచ్చి; మ్రొక్కెన్ = నమస్కరించెను.
భావము:- స్త్రీల పొడ ఎరుగని ముగ్ధ ఋషి వారిని చూసి, తుమ్మెదల వంటి నల్లని దట్టమైన కొప్పులని చూసి వాటిని మనోహరమైన జటలలో రకాలు అనుకున్నాడు. బంగారపు జరీతో ప్రకాశవంతమైన మెరుస్తున్న మేలిమి వలువలు, మెత్తని మృగచర్మాలలో రకాలు అనుకున్నాడు. బహు రత్న ఖచితమైన మెఱుగు దండలను, గొప్ప రుద్రాక్ష మాలలు వంటివి అనుకున్నాడు. చందనం కస్తూరి వంటి గొప్ప మైపూతలను, రక రకాల విభూతి పూతలు అని. తియ్యని పాటలను, శ్రుతి బద్ద వేదమంత్రాలని జతులని, వీణలను యోగదండాలు అని అనుకుని ఆశ్చర్యంగా చూసాడు. వారిని మునులు అనుకొని దగ్గరకు వచ్చి నమస్కరించాడు.

తెభా-9-693-వ.
ఇట్లు వచ్చి మ్రొక్కిన ఋశ్యశృంగుం జూచి, నగుచు డగ్గఱి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; వచ్చి = వచ్చి; మ్రొక్కిన = నమస్కరించగా; ఋశ్యశృంగున్ = ఋశ్యశృంగుని; చూచి = కనగొని; నగుచున్ = నవ్వుతు; డగ్గఱి = దగ్గరచేరి .
భావము:- ఈ విధంగా వచ్చి నమస్కరించిన ఋశ్యశృంగుని చూసి ఆ పడతులు నవ్వుతు దగ్గర చేరి.

తెభా-9-694-సీ.
"క్షేమమే" యని సతుల్ చేతుల గ్రుచ్చి క-
ర్కశకుచంబులు మోవఁ గౌఁగలించి
"చిరతపోనియతి డస్సితిగదా" యని మోముఁ-
గంఠంబు నాభియుఁ లయఁ బుడికి
"క్రొత్తదీవన లివి గొను"మని వీనుల-
పొంత నాలుకలఁ జప్పుళ్ళు చేసి
"మా వనంబుల పండ్లు మంచివి తిను"మని-
పెక్కు భక్ష్యంబులు ప్రీతి నొసఁగి

తెభా-9-694.1-ఆ.
"నూతనాజినంబు నునుపిది మే"లని
గోఁచి విడిచి మృదు దుకూలమిచ్చి
మౌని మరగఁజేసి "మా పర్ణశాలకుఁ
బోద" మనుచుఁ గొంచుఁబోయి రతని.

టీక:- క్షేమమే = కులాసా ఉన్నావా; అని = అని; సతుల్ = కాంతలు; చేతులన్ = చేతులలో చేతులను; గ్రుచ్చి = కలిపి నొక్కి; కర్కశ = గట్టివైన; కుచంబులున్ = స్తనములు; మోవన్ = ఒత్తునట్లుగా; కౌగలించి = కొగలించుకొని; చిర = అధికమైన; తపః = తపస్సు నందు; నియతిన్ = లగ్నమగుటచేత; డస్సితికదా = అలసిపోతివి; అని = అని; మోమున్ = ముఖమును; కంఠంబున్ = మెడ; నాభిన్ = బొడ్డు; కలయ = తాకుతు; పుడికి = పుణికి; క్రొత్త = కొత్తరకమైన; దీవనలు = ఆశీస్సులు; ఇవి = ఇవి; కొనుము = తీసికొనుము; అని = అని; వీనుల = చెవుల; పొంతన్ = దగ్గర; నాలుకలన్ = నాలుకలతో; చప్పుళ్ళు = చప్పుడులు; చేసి = చేసి; మా = మా యొక్క; వనంబులన్ = ఆరామము లందలి; పండ్లు = పళ్ళు; మంచివి = మంచివి; తినుము = ఆరగించుము; అని = అని; పెక్కు = అనేక; భక్ష్యంబులున్ = తినుబండారములను; ప్రీతిన్ = ప్రేమగా; ఒసగి = పెట్టి.
నూతన = కొత్తరకమైన; అజినంబున్ = జింకచర్మము; నునుపిది = నున్నటిది; మేలు = బాగుంటుది; అని = అని; గోచిన్ = గోచీని; విడిచి = బదులుగా; మృదు = మెత్తని; దుకూలమున్ = మేలైనవస్త్రములు; ఇచ్చి = కట్టించి; మౌనిన్ = ఋషిని; మరగన్ = మోహింప; చేసి = చేసి; మా = మా యొక్క; పర్ణశాల = పాక; కున్ = కు; పోదము = వెళ్లెదము; అనుచున్ = అనుచు; కొంచుబోయిరి = తీసుకెళ్ళిరి; అతని = అతనిని;
భావము:- “కులాసాగా ఉన్నావా” అని కాంతలు చేతిలో చేతులు వేసి నొక్కసాగారు. తమ కఠిన స్తనాలు ఒత్తుకొనేలా కౌగలించుకో సాగారు. “చాలా సేపు తపస్సు చేసి అలసిపోయావే” అని ముఖము, మెడ, బొడ్డు, తాకుసాగారు. “ఇవి కొత్తరకం ఆశీస్సులు తీసికో” అని చెవుల దగ్గర నాలుకలతో చప్పుడులు చేయసాగారు. “మా వద్ద లభించే మంచి పళ్ళు ఆరగించు.” అని అనేక రకాల తినిబండారాలను ప్రేమగా పెట్టసాగారు. “కొత్తరకం నున్నటి జింకచర్మం బాగుంటుది” అని గోచీ బదులుగా మెత్తని మేలిమివస్త్రాలు కట్టించసాగారు. అలా అతనిని వశీకరించుకుని “మా పర్ణశాలకు వెళ్దాం. రా” అంటూ వెంట తీసుకెళ్ళారు.

తెభా-9-695-వ.
ఇట్లు హరిణీసుతుండు కాంతాకటాక్షపాశబద్దుండై, వారల వెంటం జని, రోమపాదుకడకుం బోయిన, నతండు దన ప్రియనందన యైన శాంతనిచ్చి పురంబు ననునిచికొనియె; నమ్మునీశ్వరుండు వచ్చిన వర్షప్రతిబంధదోషంబు చెడి వర్షంబు గురిసె; నంత.
టీక:- ఇట్లు = ఈ విధముగ; హరిణీసుతుండు = ఋష్యశృంగుడు {హరిణీసుతుడు - విభాండకమునికి లేడి యందు కలిగినవాడు, ఋశ్యశృంగుడు}; కాంతా = వారవనితల; కటాక్ష = కడకంటి చూపులు అనెడి; పాశ = పాశములకు; బద్దుండు = కట్టుబడినవాడు; ఐ = అయ్యి; వారలన్ = వారి; వెంటన్ = కూడా; చని = వెళ్ళి; రోమపాదు = రోమపాదుని; కడ = వద్ద; కున్ = కు; పోయినన్ = వెళ్ళగా; అతండు = అతను; తన = తన యొక్క; ప్రియ = ఇష్ట; నందనన్ = పుత్రిక; ఐన = అయిన; శాంతన్ = శాంతని; ఇచ్చి = వివాహమునందు ఇచ్చి; పురంబున్ = నగరమున; ఉనిచికొనియెన్ = ఉంచుకొనెను; ఆ = ఆ; ముని = మునులలో; ఈశ్వరుండున్ = శ్రేష్ఠుడు; వచ్చినన్ = రాగా; వర్ష = వానలను; ప్రతిబంధ = అడ్డుకొనెడి; దోషంబున్ = దోషములు; చెడి = తొలగిపోయి; వర్షంబున్ = వానలు; కురుసెను = కురిసినవి; అంత = తరవాత.
భావము:- ఇలా ఋష్యశృంగుడు ఆ వారవనితల వాలు చూపుల వలలకు చిక్కి వారి వెంట రోమపాదుని వద్దకు వెళ్ళాడు. అతను తన ఇష్ట పుత్రిక అయిన శాంతని ఇచ్చి వివాహం చేసి నగరంలో ఉంచుకున్నాడు. ఆ మునిశ్రేష్ఠుడు రాగా అనావృష్టి దోషాలు తొలగిపోయి వానలు కురిసాయి. పిమ్మట.

తెభా-9-696-ఆ.
నృపాలచంద్రుఁ నపత్యుఁడై యుండ
నెఱిగి మునికులేంద్రుఁ డింద్రుఁగూర్చి
యిష్టి చేసి సుతుల నిచ్చె నాతని కృపఁ
బంక్తిరథుఁడు పిదపఁ డసె సుతుల.

టీక:- ఆ = ఆ; నృపాల = రాజులలో; చంద్రుడు = చంద్రుని వంటివాడు; అనపత్యుడు = కొడుకులు లేనివాడు; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; ఎఱిగి = తెలిసికొని; ముని = మునుల; కుల = అందరిలోను; ఇంద్రుడు = ఇంద్రుడు; ఇంద్రున్ = దేవేంద్రుని; గూర్చి = గురించి; ఇష్టి = యజ్ఞము; చేసి = చేసి; సుతులన్ = పుత్రులను; ఇచ్చెన్ = కలుగజేసెను; ఆతని = అతని యొక్క; కృపన్ = కరుణచేతనే; పంక్తిరథుడున్ = దశరథుడుకూడ; పిదపన్ = ఆ తరువాత; పడసెన్ = పొందెను; సుతులన్ = పుత్రులను.
భావము:- ఆ రోమపాదరాజచంద్రుడు అపుత్రకుడు అని తెలిసికొని ఋష్యశృంగ మహాముని దేవేంద్రుని గురించి పుత్రకామేష్టియాగం చేసి పుత్రులు కలిగేలా చేసాడు. పిమ్మట అతని కరుణతోనే దశరథుడుకూడ పుత్రకామేష్టి చేసి పుత్రులను పొందాడు.

తెభా-9-697-వ.
ఆ రోమపాదునకుఁ జతురంగుఁడును, జతురంగునకుఁ బృథులాక్షుండును, బృథులాక్షునికి బృహద్రథుండు, బృహత్కర్ముండు బృహద్భానుండు ననువారు మువ్వురు పుట్టి; రందు బృహద్రథునకు బృహన్మనసుఁడు, బృహన్మనసునకు జయద్రథుండు, జయద్రథునకు విజయుండు, విజయునకు సంభూతి యను భార్యయందు ధృతియు, నా ధృతికి ధృతవ్రతుండు, ధృతవ్రతునకు సత్యకర్ముండు, సత్యకర్మునకు నతిరథుండును జన్మించిరి.
టీక:- ఆ = ఆ; రోమపాదున్ = రోమపాదుని; కున్ = కి; చతురంగుడున్ = చతురంగుడు; చతురంగున్ = చతురంగుని; కున్ = కి; పృథులాక్షుండును = పృథులాక్షుడు; పృథులాక్షుని = పృథులాక్షుని; కిన్ = కి; బృహద్రథుండున్ = బృహద్రథుడు; బృహత్కర్ముండున్ = బృహత్కర్ముడు; బృహద్భానుండున్ = బృహద్భానుడు; అను = అనెడి; వారున్ = వారు; మువ్వురు = ముగ్గురు (3); పుట్టిరి = జనించిరి; అందున్ = వారిలో; బృహద్రథున్ = బృహద్రథున; కున్ = కు; బృహన్మనసుడు = బృహన్మనసుడు; బృహన్మనసున్ = బృహన్మనసున; కున్ = కు; జయద్రథుండున్ = జయద్రథుడు; జయద్రథున్ = జయద్రథున; కున్ = కు; విజయుండున్ = విజయుడు; విజయున్ = విజయున; కున్ = కు; సంభూతి = సంభూతి; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = ఎడల; ధృతియున్ = ధృతి; ఆ = ఆ; ధృతి = ధృతి; కిన్ = కి; ధృతవ్రతుండున్ = ధృతవ్రతుడు; ధృతవ్రతున్ = ధృతవ్రతున; కున్ = కు; సత్యకర్ముండున్ = సత్యకర్ముడు; సత్యకర్మున్ = సత్యకర్మున; కున్ = కు; అతిరథుండును = అతిరథుడు; జన్మించిరి = పుట్టిరి.
భావము:- ఆ రోమపాదునికి చతురంగుడు; చతురంగునికి పృథులాక్షుడు; పృథులాక్షునికి బృహద్రథుడు, బృహత్కర్ముడు, బృహద్భానుడు అని ముగ్గురు కలిగారు. వారిలో బృహద్రథునకు బృహన్మనసుడు; బృహన్మనసునకు జయద్రథుడు; జయద్రథునకు విజయుడు; విజయునకు భార్య సంభూతి ఎడల ధృతి; ఆ ధృతికి ధృతవ్రతుడు; ధృతవ్రతునకు సత్యకర్ముడు; సత్యకర్మునకు అతిరథుడు పుట్టారు.

తెభా-9-698-ఆ.
కుంతి పిన్ననాఁడు గోరి సూర్యునిఁ బొంద
బిడ్డఁ డుదితుఁడైనఁ బెట్టెఁ బెట్టి
గంగ నీట విడువఁ ని యతిరథుఁ డంత
ర్ణుఁ డనుచుఁ గొడుకు గారవించె.

టీక:- కుంతి = కుంతి; పిన్ననాడు = చిన్నతనమునందు; కోరి = కోరి; సూర్యునిన్ = సూర్యుని; పొందన్ = కలియగా; బిడ్డడున్ = పిల్లవాడు; ఉదితుడు = పుట్టినవాడు; ఐన = కాగా; పెట్టెన్ = పెట్టెలో; పెట్టి = ఉంచి; గంగ = గంగానది; నీటన్ = నీటిప్రవాహము నందు; విడువన్ = వదలగా; కని = కనుగొని; అతిరథుండున్ = అతిరథుడు; అంతన్ = అప్పుడు; కర్ణుడు = కర్ణుడు; అనుచున్ = అనుచు; కొడుకున్ = పుత్రునిగా; గారవించెన్ = మన్నించెను.
భావము:- కుంతి అభం శుభం తెలియని చిన్నతనంలో కోరి సూర్యుని పొందగా పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని పెట్టెలో ఉంచి గంగానదిలో విడిచి పెట్టింది. ఆ ప్రవాహంలో కొట్టుకు వస్తున్న పెట్టెలోని పిల్లవాడిని అతిరథుడు కనుగొన్నాడు. అతిరథుడు అప్పుడు ఆ బాలుని ఆదరించి కర్ణుడు అంటూ పుత్రునిగా పెంచుకున్నాడు.