పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/బ్రహ్మకు ప్రసన్నుడగుట


తెభా-2-240-చ.
ప్రియుఁడగు బొడ్డుఁదమ్మి తొలిబిడ్డఁడు వేలుపుఁబెద్ద భూతసం
ములఁజేయుకర్త నిజశాసనపాత్రుఁడు ధాత మ్రొక్కినన్
దళుకొత్తఁ బల్కెఁ బ్రమస్మితచారుముఖారవిందుఁడై
మునఁ బాణిపంకజమునన్ హరి యాతనిదేహమంటుచున్.


2-240/1-వ. ఇట్లనియె. - విద్వాన్ కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితుల వారి ప్రచురణ



టీక:- ప్రియుఁన్ = ఇష్టుడు; అగు = అయిన; బొడ్డుఁదమ్మిన్ = నాభి పద్మమున పుట్టిన; తొలి = మొదటి {తొలి బిడ్డడు - మొదట (సృష్టికే మొదట) పుట్టినవాడు}; బిడ్డఁడు = పుత్రుడు; వేలుపున్ = దేవతలకు; పెద్ద = పెద్దవాడును; భూత = జీవుల; సంచయములఁన్ = సమూహములను; చేయున్ = చేసే; కర్తన్ = కర్తయును; నిజ = తన; శాసన = పాలనకు; పాత్రుఁడున్ = అర్హుడును; ధాతన్ = బ్రహ్మదేవుడు; మ్రొక్కినన్ = నమస్కరించగ; దయన్ = కరుణ; తళుకొత్తఁన్ = పొంగిపొరలగ; పల్కెఁన్ = పలికెను; ప్రమదన్ = తన్మయత్వపు; స్మిత = చిరునవ్వు కల; చారు = అందమైన; ముఖ = ముఖము అను; అరవిందుఁడు = పద్మము కలవాడు; ఐ = అయి; నయమునఁన్ = చనువుగ; పాణి = చేయి అను; పంకజమునన్ = పద్మముతో; హరి = విష్ణువు; ఆతని = అతని (బ్రహ్మదేవుని); దేహమున్ = శరీరమును; అంటుచున్ = తాకుతూ.
భావము:- తనకు ఇష్ఠుడు, నాభి యందు జనించినవాడు, ప్రథమ సంతానము, దేవతలందరకు అధిదేవుడు, సమస్తమైన భూతజాలమును సృష్టించెడి వాడు, తన ఆజ్ఞానువర్తి, సృష్టి నంతటిని ధరించువాడు అగు బ్రహ్మదేవుడు అలా ప్రణామములు చేయగా శ్రీమహావిష్ణువు పరమ సంతోషంతో కూడిన చిరునవ్వులు చిందించే మోము కలవాడయ్యాడు. అతని దేహమును చనువుగా హస్తపద్మములతో తాకుతు, దయ ఉట్టిపడుచుండగా ఇలా చెప్పాడు.

తెభా-2-241-ఆ.
"పట మునులకెంత కాలమునకు నైన
సంతసింప నేను లజగర్భ!
చిరతపస్సమాధిఁ జెంది విసర్గేచ్ఛ
మెలఁగు నిన్నుఁ బరిణమింతుఁ గాని.

టీక:- కపట = కపటము కల; మునులన్ = మునులను; ఎంతన్ = ఎంత; కాలమునకున్ = కాలమునకు; ఐనన్ = అయినప్పటికిని; సంతసింపన్ = సంతోషింపను; నేనున్ = నేను; జలజగర్భ = బ్రహ్మదేవ {జలజగర్భుడు - జలజ (నీట పుట్టిన, పద్మము) అను గర్భమున పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు}; చిర = చిరకాలము చేసిన; తపస్ = తపస్సు చేయుచు; సమాధిఁన్ = సమాధిని; చెందిన్ = పొంది; విసర్గ = చక్కటి సృష్టిచేయు; ఇచ్చన్ = కోరికతో; మెలఁగు = వర్తిస్తున్న; నిన్నున్ = నిన్ను; పరిణమింతున్ = మెచ్చుదును; కాని = కాని.
భావము:- "దొంగ మునులు దొంగ తపస్సులు చేస్తుంటే ఎంత కాలానికైనా నేను వారిని అనుగ్రహించనయ్యా. ఓ పద్మసంభవ! బ్రహ్మదేవుడ! గాఢమైన తపస్సమాధి పొంది చక్కటి సృష్టి చేయాలనే సంకల్పంతో వర్తిస్తున్ననిన్ను అనుగ్రహిస్తాను అని బ్రహ్మదేవునికి సాక్షాత్కరించిన హరి అనుగ్రహించాడు.

తెభా-2-242-తే.
ద్రమగుఁగాక! నీకు నో! ద్మగర్భ!
రము నిపు డిత్తు నెఱిఁగింపు వాంఛితంబు;
దేవదేవుఁడ నగు నస్మదీయ పాద
ర్శనం బవధి విపత్తిశల కనఘ!

టీక:- భద్రము = క్షేమము; అగుఁన్ = అగును; గాక = గాక; నీకున్ = నీకు; ఓ = ఓ; పద్మగర్భ = బ్రహ్మదేవ {పద్మగర్భుడు - పద్మమునందు పుట్టిన వాడు, బ్రహ్మ దేవుడు}; వరమున్ = వరములను; ఇపుడున్ = ఇప్పుడే; ఇత్తున్ = ఇచ్చెదను; ఎఱిగింపు = తెలుపుము; వాంఛితంబున్ = కోరికను; దేవ = దేవతలకే; దేవుఁడన్ = దేవుడను; అగున్ = అయిన; అస్మదీయ = నా; పాద = పాదముల; దర్శనంబున్ = దర్శనమే; అవధి = హద్దు; విపత్తి = ఆపదల; దశలన్ = దశల; కున్ = కు; అనఘ = పాపములు లేనివాడ.
భావము:- ఓ పరమ పుణ్యుడ దేవాధిదేవుడనైన నా యొక్క పాదదర్శనం పొందావు. నీ విపత్తి ఆపత్తులు సర్వం తొలగిపోతాయి. జ్ఞనానికి హృదయానికి ప్రతీక యైన పద్మమునందు ఉద్భవించిన ఓ బ్రహ్మదేవుడ! నీకు శుభమగు గాక. నీవు కోరిన వరం ఇస్తాను కోరుకో అన్నాడు విష్ణుమూర్తి.

తెభా-2-243-చ.
సిజగర్భ! నీ యెడఁ బ్రన్నత నొంది మదీయలోక మే
నివుగఁ జూపుటెల్లను నహేతుక భూరి దయా కటాక్ష వి
స్ఫుణన కాని, నీ దగు తపోవిభవంబునఁ గాదు; నీ తప
శ్చణము నాదు వాక్యముల సంగతిఁ గాదె సరోజసంభవా!

టీక:- సరసిన్ = పద్మమున {సరసి - సరసున పుట్టునది, పద్మము}; గర్భ = పుట్టిన వాడా {సరసిగర్భుడు - పద్మమున పుట్టిన వాడు, బ్రహ్మ దేవుడు}; నీ = నీ; ఎడఁన్ = అందు; ప్రసన్నతన్ = ప్రసన్నతను; ఒంది = పొంది; మదీయ = నాయొక్క; లోకమున్ = లోకమును; ఏను = నేను; ఇరవుగఁన్ = చక్కగ, నెలకొని ఉండగ; చూపుట = చూపించుట; ఎల్లనున్ = అంతయును; అహేతుక = అకారణ; భూరి = మిక్కిలి గొప్ప; దయా = దయతో కూడిన; కటాక్ష = కటాక్షమును; విస్ఫురణనన్ = విశిష్టముగ చూపుటకే; కాని = కాని; నీది = నీది; అగున్ = అయిన; తపస్ = తపస్సు యొక్క; విభవంబునఁన్ = వైభవము వలన; కాదు = కాదు; నీ = నీవు; తపస్ = తపస్సు; చరణము = చేయుట; నాదు = నా యొక్క; వాక్యముల = మాటల; సంగతిఁన్ = వలన; కాదె = కదా; సరోజ = పద్మము అందు {సరోజసంభవ - సరోజ (సరసున పుట్టినది, పద్మము) అందు పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు}; సంభవా = పుట్టిన వాడ. బ్రహ్మదేవుడా.
భావము:- ఓ కమలసంభవుడ! నీ యెడల ప్రసన్నుడను అయ్యాను కనుక నీకు వైకుంఠదర్శనం అనుగ్రహించాను. అదంతా అహేతుకమైన నాయొక్క కృపాకటాక్షము మాత్రమే. అంతే తప్ప నువ్వు చేసిన తపోప్రభావంవల్ల కాదు అని తెలుసుకో. అవును, నీ తపస్సంతా నా అనుగ్రహభాషణల కోసమే కదయ్యా బ్రహ్మదేవుడ! అంటు హరి అనుగ్రహ భాషణ చేస్తున్నాడు.

తెభా-2-244-క.
మనఁగ మత్స్వరూపము
మను తరువునకు ఫలవితానము నే నా
ముననే జననస్థి
త్యుసంహరణము లొనర్చుచుండుదుఁ దనయా!

టీక:- తపము = తపము; అనఁగన్ = అంటే; మత్ = నా యొక్క; స్వరూపము = స్వరూపము; తపము = తపము; అను = అను; తరువునకున్ = వృక్షమునకు; ఫల = ఫలముల; వితానమున్ = సమూహములను; నేన్ = నేనే; ఆ = ఆ; తపముననే = తపస్సు వలనే; జనన = సృష్టి; స్థితి = స్థితి; ఉపసంహరణములన్ = లయములను; ఒనర్చుచున్ = చేయుచు; ఉండుదున్ = ఉండుదును; తనయా = పుత్రా;
భావము:- పుత్రా! బ్రహ్మదేవ! తపస్సు అంటేనే నా స్వరూపం. తపస్సు అనే వృక్షానికి ఫలాన్ని నేనే. ఆ తపస్సు చేతనే సృష్టి స్థితి లయాలు సర్వం నిర్వహిస్తుంటాను. అంటు బ్రహ్మదేవునికి తపస్సు యొక్క రహస్యాన్ని నారాయణుడు వెలిబుచ్చాడు.

తెభా-2-245-క.
కావున మద్భక్తికిఁ దప
మేవిధమున మూలధనము నిది నీ మది రా
జీభవ! యెఱిఁగి తప మిటు
గావించుట విగతమోహర్ముఁడ వింకన్."

టీక:- కావునన్ = అందుచేత; మత్ = నా యందలి; భక్తిన్ = భక్తి; కిన్ = కి; తపము = తపస్సు; ఏ = ఏ; విధమునన్ = విధముగ; మూల = ముఖ్యమైన; ధనమొ = సంపదో; ఇది = ఇది యంతయు; నీ = నీ యొక్క; మదిన్ = మనసులో; రాజీవ = పద్మము లో; భవ = పుట్టినవాడ, బ్రహ్మదేవుడ; ఎఱిఁగి = తెలిసి; తపమున్ = తపస్సు; ఇటున్ = ఈ విధముగ; కావించుటన్ = చేయుటచేత; విగత = తొలగిన; మోహన్ = మోహమును; కర్ముఁడవు = కర్మలు కలవాడవు; ఇంకన్ = ఇకపైన.
భావము:- “ఓ పద్మగర్భుడ! నీ మనసులో నా భక్తికి తపస్సు ఎలా మూలాధారమో గ్రహించి, ఈ విధంగా గాఢమైన తపస్సు చేసావు. కనుక ఇంక నీవు మోహ కర్మల నుండి ముక్తుడవు అయ్యావు". అని సాక్షాత్కరించిన నారాయణుడు అనుగ్రహించాడు.

తెభా-2-246-క.
ని యానతిచ్చి “కమలజ!
యెయఁగ భవదీయమానసేప్సిత మేమై
ను నిత్తు; వేఁడు మనినను
రుహసంభవుఁడు వికచదనుం డగుచున్.

టీక:- అని = అని; ఆనతిచ్చి = అనుగ్రహించి; కమలజ = బ్రహ్మదేవ {కమలజుడు - కమలమున పుట్టినవాడు}; ఎనయఁగన్ = తగినట్లుగ; భవదీయన్ = నీ యొక్క; మానస = మనసులోని; ఈప్సితమున్ = కోరికను; ఏమి = ఏది; ఐననున్ = అయినను; ఇత్తున్ = ఇచ్చెదను; వేఁడుము = కోరుకొనుము; అనినను = అనగా; వనరుహ = పద్మమున {వనరుహము - నీట పుట్టినది, పద్మము}; సంభవుఁడున్ = పుట్టినవాడును, బ్రహ్మదేవుడును {వనరుహసంభవ - పద్మమున పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; వికచ = వికసించిన; వదనుండున్ = ముఖము కలవాడు; అగుచున్ = అగుచు.
భావము:- ఆలా అనుగ్రహించిన విష్ణుమూర్తి ఇంకా ఇలా అన్నాడు. ఓ పద్మభవ! నీ మనోవాంఛితము ఏదైనా సరే, కోరుకో. కోరిన కోరికతీరుస్తాను.. అంతట బ్రహ్మదేవుని ముఖము సంతోషంతో వికసించింది.

తెభా-2-247-చ.
రివచనంబు లాత్మకుఁ బ్రియం బొనరింపఁ బయోజగర్భుఁ "డో!
మపదేశ! యోగిజనభావన! యీ నిఖిలోర్వి యందు నీ
యని యట్టి యర్థ మొకఁడైననుఁ గల్గునె? యైన నా మదిన్
బెసిన కోర్కి దేవ! వినిపింతు దయామతిఁ జిత్తగింపవే.

టీక:- హరి = విష్ణువు {హరి - సర్వ పాపములను హరించు వాడు, భగవంతుడు}; వచనంబున్ = మాటలు; ఆత్మ = మనసున; కున్ = కు; ప్రియంబున్ = సంతోషమును; ఒనరింపన్ = కలిగింపగ; పయోజ = పద్మమున {పయోజగర్భుడు - పయోజ (నీట పుట్టినది, పద్మము) లో పుట్టిన వాడు, బ్రహ్మ దేవుడు}; గర్భుఁడు = పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు; ఓ = ఓ; పరమపద = పరమపదమునకు; ఈశ = ప్రభువా; యోగి = యోగుల; జన = సమూహముల; భావన = ధ్యాన స్వరూపుడ; ఈ = ఈ; నిఖిల = సమస్త; ఉర్విన్ = లోకములు; అందున్ = లోను; నీ = నీవు; అరయని = తెలియని; అట్టి = అటువంటి; అర్థము = విషయము; ఒకఁడు = ఒక్కటి; ఐనను = అయినను; కల్గునే = ఉన్నదా; ఐనన్ = అయినను; నా = నా యొక్క; మదిన్ = మనసున; బెరసినన్ = కలిగిన; కోర్కిన్ = కోరికను; దేవ = దేవుడా; వినిపింతున్ = వినిపించెదను; దయా = కరుణతో కూడిన; మతిఁన్ = మనసుతో; చిత్తగింపవే = అవధరింపుము, వినుము.
భావము:- నారాయణుని భాషణములు వినిన బ్రహ్మదేవుడు ఓ పరమపదానికి ప్రభువా! పరమ యోగులు నిన్ను చేరాలని నిత్యం భావిస్తు ఉంటారు. దేవాధిదేవ! ఈ సమస్తమైన లోకము నందు నీకు తెలియని విషయం ఒక్కటైన లేదు కదా. అయినప్పటికి నా మనసులో మెదలిన కోరికను వినిపిస్తాను కృపాదృష్టితో అనుగ్రహించుము. అని విన్నవించుకుంటున్నాడు.

తెభా-2-248-వ.
దేవా! సర్వభూతాంతర్యామివై భగవంతుండవైన నీకు నమస్కరించి మదీయవాంఛితంబు విన్నవించెద నవధరింపు; మవ్యక్తరూపంబులై వెలుంగు భవదీయ స్థూలసూక్ష్మ రూపంబులును నానా శక్త్యుపబృంహితంబులైన బ్రహ్మాది రూపంబులును నీ యంత నీవే ధరించి జగదుత్పత్తిస్థితిలయంబులం దంతుకీటకంబునుం బోలెఁ గావించుచు నమోఘ సంకల్పుండవై లీలావిభూతిం గ్రీడించు మహిమంబు దెలియునట్టి పరిజ్ఞానంబుఁ గృప సేయుము; భవదీయశాసనంబున జగన్నిర్మాణంబు గావించు నపుడు బ్రహ్మాభిమానంబునం జేసి యవశ్యంబును మహదహంకారంబులు నామదిం బొడముం గావునఁ దత్పరిహారార్థంబు వేడెద; నన్నుం గరుణార్ద్రదృష్టి విలోకించి దయసేయు;"మని విన్నవించిన నాలించి పుండరీకాక్షుం డతని కిట్లనియె.
టీక:- దేవ = దేవుడు; సర్వ = సమస్తమైన; భూత = జీవులలోను; అంతర్యామివిన్ = అంతర్యామివి, లోన ఉండేవాడవు {అంతర్యామి - అతరమందు (లోపల) యామి వ్యాపించి ఉండువాడు, అంతరాత్మ, భగవంతుడు}; ఐ = అయి; భగవంతుడవున్ = భగవంతుడవు {భగవంతుడు - సమస్త మహిమలు కలవాడు}; ఐన = అయినట్టి; నీకున్ = నీకు; నమస్కరించి = మొక్కి; మదీయ = నా యొక్క; వాంఛితంబున్ = కోరికను; విన్నవించెదన్ = వినిపించెదను; అవధరింపుము = ఆలకించి ధరించు; అవ్యక్త = అవ్యక్తమైన; రూపంబులున్ = స్వరూపాలు; ఐ = అయి; వెలుంగు = ప్రకాశించే; భవదీయ = నీ; స్థూల = స్థూలమైన; సూక్ష్మ = సూక్ష్మమైన; రూపంబులునున్ = స్వరూపములును; నానా = అనేక; శక్తి = శక్తులు; ఉపబృంహితంబున్ = పెంపొందినవి; ఐన = అయిన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగు; రూపంబులునున్ = స్వరూపములును; నీ యంత నీవే = నీ యంత నీవే; ధరించి = ధరించి, స్వీకరించి; జగత్ = లోకములను; ఉత్పత్తిన్ = సృష్టి; స్థితి = స్థితి; లయంబులన్ = లయములను; తంతుకీటకంబునున్ = పట్టుపురుగు; పోలెన్ = వలె; కావించుచున్ = చేయుచు; అమోఘ = అమోఘమైన, తిరుగులేని; సంకల్పుండవు = సంకల్పము కలవాడవు; ఐ = అయి; లీలన్ = లీలల {లీల - ప్రయత్నరహితముగను, లేనిది ఉన్నట్లనిపింప జేయు}; విభూతిన్ = వైభవములలో; క్రీడించు = క్రీడించెడి; మహిమంబున్ = మహిమను; తెలియున్ = తెలిసికొనగల; అట్టి = సరిపడునట్టి; పరిజ్ఞానమున్ = నేర్పును; కృపన్ = దయ; చేయుము = చేయుము; భవదీయ = నీ యొక్క; శాసనంబునన్ = ఆజ్ఞానుసారము; జగత్ = లోకములను; నిర్మాణంబున్ = నిర్మాణమును; కావించున్ = చేయుచున్న; అపుడు = అప్పుడు; బ్రహ్మా = బ్రహ్మను అను; అభిమానంబునన్ = అహంకారము; చేసి = వలన; అవశ్యంబునున్ = తప్పక; మహత్ = గొప్పతన; అహంకారంబులున్ = అహంకారములు; నా = నా; మదిన్ = మనసున; పొడమున్ = పుట్టును; కావునన్ = అందచేత; తత్ = వాని; పరిహారాన్ = విరుగుడు, తొలగుట; అర్థంబున్ = కోసము; వేడెదన్ = ప్రార్థించెదను; నన్నున్ = నన్ను; కరుణ = దయతో; ఆర్ద్ర = ఆర్ద్రమైన, మెత్తబడ్డ; దృష్టిన్ = దృష్టితో; విలోకించి = చూచి; దయసేయుము = ప్రసాదించుము; అని = అని; విన్నవించినన్ = వేడుకొనిన; ఆలించి = విన్నవాడై; పుండరీకాక్షుండున్ = పుండరీకాక్షుడు {పుండరీకాక్షుడు - పుండరీకముల (తెల్లతామరల) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; అతనిన్ = అతనికి (బ్రహ్మదేవుని); కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;
భావము:- ఓ దేవా! నీవు సకల భూతాల అంతరాత్మవు అయి ఉండేవాడవు, భగవంతుడవు. నీకు నమస్కరించి నా కోరిక విన్నవించుకుంటాను. అనుగ్రహించు. అవ్యక్త స్వరూపాలలో ప్రకాశించే నీ యొక్క స్థూల సూక్ష్మ రూపాలను; సకల శక్తులతో కూడిన బ్రహ్మదేవుడు మున్నగు రూపములును సమస్తం సృష్టి స్థితి లయములను సాలెపురుగు గూడు అల్లినట్లు నీ అంతట నీవె ధరించి నిర్వహించుచు ఉంటావు. అమోఘ స్వసంకల్పశక్తితో లీలావిభూతితో క్రీడిస్తు ఉంటావు. అట్టి నీ మహిమను నాకు విశదీకరించు. నీ ఆజ్ఞానువర్తిని అయి జగత్తు నిర్మించే సమయంలో బ్రహ్మదేవుడను అనే మోహం అహంకారం తప్పక జనిస్తాయి కదా. దానికి పరిహారం అనుగ్రహించ మని వేడుకుంటున్నాను. నన్ను కృపాదృష్టితో కటాక్షించి అనుగ్రహించు"అని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. అది విన్న పద్మాక్షుడు ఇలా చెప్పసాగాడు.

తెభా-2-249-క.
"వారిజభవ శాస్త్రార్థ వి
చాజ్ఞానమును భక్తి మధికసాక్షా
త్కాములను నీ మూఁడు ను
దాత నీ మనమునందు రియింపనగున్.

టీక:- వారిజ = పద్మమున; భవ = పుట్టినవాడ (బ్రహ్మదేవుడా); శాస్త్ర = శాస్త్రముల; అర్థ = భావములు; విచార = విశేషముగ చర్చించుకొను; జ్ఞానమును = జ్ఞానమును; భక్తిన్ = భక్తియును; సమధిక = చక్కటి; సాక్షాత్కారమునున్ = యదార్థ స్థితి నెరుగుట; అను = అనే; ఈ = ఈ; మూఁడున్ = మూడును (3); ఉదారతన్ = బాగుగ, ఎక్కువగ; నీ = నీ యొక్క; మనమునన్ = మనసు; అందున్ = లోపల; ధరియింపన్ = స్థిరపరచు కొన; అగున్ = వలెను.
భావము:- నారాయణుడు కటాక్షించి తెలుపుతున్నాడు. "ఓ పద్మసంభవ! బ్రహ్మదేవుడ! నీ మన్సులో శాస్త్రాలను చర్చించుకొని అర్థం చేసికొనుట, భక్తి, చక్కగా యదార్థ స్థితిని తెలిసికొనుట అనే ఈ మూడింటిని బాగుగ నిలుపుకొనవలయును.

తెభా-2-250-సీ.
రికింప మత్స్వరూస్వభావములును-
హిమావతార కర్మములుఁ దెలియు
త్త్వవిజ్ఞానంబు లకొని మత్ప్రసా-
మునఁ గల్గెడి నీకుఁ మలగర్భ!
సృష్టిపూర్వమునఁ జర్చింప నే నొకరుండఁ-
లిగి యుండుదు వీతర్మి నగుచు
మధిక స్థూల సూక్ష్మస్వరూపములుఁ ద-
త్కారణ ప్రకృతియుఁ గ మదంశ

తెభా-2-250.1-ఆ.
మందు లీనమైన ద్వితీయుండనై
యుండు నాకు నన్య మొకటి లేదు
సృష్టికాలమందు సృజ్యమానం బగు
గము మత్స్వరూప గును వత్స!

టీక:- పరికింపన్ = సరిగ చూసిన; మత్ = నాయొక్క; స్వరూప = స్వరూప; స్వభావములునున్ = స్వభావములును; మహిమ = ప్రభావములు; అవతార = అవతారములు; కర్మమములు = ఆచరించిన పనులు; తెలియు = గ్రహింపగల; తత్త్వ = తత్త్వశాస్త్ర {తత్త్వము - విచారించు జ్ఞనము, లక్షణము, ఉన్నయదార్థస్థితి, తత్త్వశాస్త్రము}; విజ్ఞానంబున్ = విజ్ఞానము; తలకొని = చక్కగ, పొటమరించి; మత్ = నాయొక్క; ప్రసాదమున్ = అనుగ్రహము వలన; కల్గెడిన్ = కలుగును; నీకుఁన్ = నీకు; కమలన్ = కమలమందు; గర్భ = పుట్టిన వాడ (బ్రహ్మ దేవ); సృష్టి = సృష్టికి; పూర్వమునన్ = ముందుననే; చర్చింపన్ = తెలిసికొని చూసిన; నేన్ = నేను; ఒకరుండన్ = ఒక్కడనే; కలిగి = ఉండి; ఉండుదున్ = ఉండేవాడను; వీత = తొలగిన; కర్మిన్ = కర్మములు కలవాడను; అగుచున్ = అగుచు; సమధిక = చాలాఎక్కువ; స్థూల = స్థూలమైన {స్థూలరూపము - కంటికి కనిపించు పంచభూతాత్మక స్వరూపము}; సూక్ష్మ = సూక్ష్మమైన {సూక్ష్మరూపము - కంటికి కనిపించని సూక్ష్మ స్థాయిలోని ఆత్మైకరూపము}; స్వరూపములున్ = స్వరూపములు; తత్ = వానికి; కారణ = కారణమైన; ప్రకృతియుఁన్ = ప్రకృతియును; తగన్ = తగ; మత్ = నాయొక్క; అంశన్ = కళలలు; అందున్ = లో;
లీనమైనన్ = లీనమైపోయి; అద్వితీయుండను = అద్వితీయమైనవాడను {అద్వితీయము - ద్వితీయము (సాటికా గల రెండవది) లేనిది}; ఐ = అయ్యి; ఉండున్ = ఉండే; నాకు = నాకు; అన్యము = ఇతరము; ఒకటి = ఒకటైనను; లేదు = లేదు; సృష్టి = సృష్టికి; కాలము = సమయము; అందున్ = లో; సృజ్యమానంబున్ = సృష్టింపబడుచున్నవి; అగు = అయిన; జగముల్ = లోకములు; మత్ = నా యొక్క; రూపము = స్వరూపము; అగును = అయిఉన్నవి; వత్స = నాయనా.
భావము:- ఓ పద్మజుడ! బ్రహ్మదేవుడ! తెలిసికొంటే, నా యొక్క స్వరూపము, స్వభావములు, మహిమలు, అవతారాలు- కృత్యాలు అధ్యయనం చేయవలెను. దానితో నా దయవలన తత్వవిజ్ఞానము లభించును. ఈ జగత్తు సృష్టించబడుటకు ముందు నుండి నేను ఒక్కనిగనే (ఏకలుడగనే) ఉన్నాను. ఏ కర్మబంధాలు నాకు అంటవు. స్థూల సూక్ష్మ స్వరూపాలు, కారణభూతమైన ప్రకృతి సమస్తం నా అంశలే. అవన్నీ నాలో లీనమై ఉంటాయి. పుత్రా! బ్రహ్మదేవుడ! నాకు ఇతరమైనది ఏదీ లేనే లేదు. అలాగే సృష్ఠి జరుగుతుండె కాలంలో వచ్చేవి సర్వం నా స్వరూపమే అని గ్రహించు." అని విష్ణుదేవుడు వివరించసాగాడు.