పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/హరిహ రాభేదము చూపుట

తెభా-10.1-296-వ.
మఱియును.
టీక:- మఱియున్ = ఇంకను.
భావము:- అంతే కాకుండా

తెభా-10.1-297-సీ.
నువున నంటిన రణీపరాగంబు-
పూసిన నెఱిభూతి పూఁత గాఁగ;
ముందల వెలుగొందు ముక్తాలలామంబు-
తొగలసంగడికాని తునుక గాఁగ;
ఫాలభాగంబుపైఁ రగు కావిరిబొట్టు-
కాముని గెల్చిన న్ను గాఁగఁ;
గంఠమాలికలోని ననీల రత్నంబు-
మనీయ మగు మెడప్పు గాఁగ;

తెభా-10.1-297.1-ఆ.
హారవల్లు లురగహారవల్లులు గాఁగ;
బాలలీలఁ బ్రౌఢబాలకుండు
శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును
వేఱులేమిఁ దెల్ప వెలయునట్లు.

టీక:- తనువున్ = ఒంటికి; అంటిన = అంటుకొన్న; ధరణీ = మట్టి; పరాగంబున్ = మరకలు; పూసిన = రాసుకొన్న; నెఱి = నిండైన; భూతి = వీబూది; పూత = పూత; కాగన్ = అగుచుండగా; ముందలన్ = శిరస్సుపై; వెలుగొందు = ప్రకాశించెడి; ముక్తాలలామంబు = ముత్యాలచేరు; తొగలసంగడికాని = చంద్రుని {తొగలసంగడికాడు -తొగ (కలువ)ల సంగటికాడు (స్నేహితుడు), చంద్రుడు}; తునుక = రేఖ; కాగన్ = అగుచుండగా; ఫాలభాగంబు = నుదిటి; పైన్ = మీద; పరగు = ఉండునట్టి; కావిరిబొట్టు = నల్లబొట్టు; కాముని = మన్మథుని; గెల్చిన = జయించిన; కన్ను = కన్ను (మూడవకన్ను); కాగన్ = అగుచుండగా; కంఠమాలిక = మెడలోనిహారము; లోని = అందలి; ఘన = బాగాపెద్ద; నీల = ఇంద్రనీల; రత్నంబు = మణి; కమనీయము = అందమైనది; అగు = ఐన; మెడకప్పు = కంఠమునందలినల్లదనం; కాగన్ = అగుచుండగా.
హారవల్లులు = ముత్యాలహారపుపేటలు; ఉరగ = సర్పములనెడి; హారవల్లులు = దండలపేర్లు; కాగన్ = అగుచుండగా; బాల = పసితనపు; లీలన్ = విలాసములతో; ప్రౌఢ = అన్నీతెలిసిన; బాలకుండు = పిల్లవాడు; శివుని = పరమశివుని; పగిదిన్ = వలె; ఒప్పెన్ = కనబడుచుండెను; శివుని = పరమశివుని; కిన్ = కి; తన = తన; కును = కు; వేఱు = భేదము; లేమిన్ = లేకపోవుటను; తెల్పన్ = తెలియజేయుటకు; వెలయున్ = విలసిల్లిన; అట్లు = విధముగా.
భావము:- ఆ శ్రీపతి అపరావతారమైన బాలకృష్ణుడు ఎదగకుండానే పెద్దవాడైన ప్రౌఢబాలకుడు. హరి హరులకు భేదం లేదు ఇద్దరు ఒకటే సుమా అని హెచ్చరిస్తున్నట్లుగా శ్రీకృష్ణుడు బాల్యంలో ఆటపాటల సమయాలలో పరమశివుని వలె కనిపించేవాడు. ఎలా అంటే.
దేహానికి అంటిన దుమ్ము విభూతి పూత వలె కనిపించేది. యశోద ముత్యాలపేరుతో ఉంగరాలజుట్టు పైకి మడిచి ముడివేసింది. అది శంకరుని తలపై ఉండే చంద్రవంకలా కనబడసాగింది. నుదుట పెట్టిన నల్లని అగులు బొట్టు ముక్కంటి మూడవకన్నులా అగబడసాగింది. మెడలో వేసిన రత్నాలహారం మధ్యలో నాయకమణిగా ఉన్న పెద్ద ఇంద్రనీల మణి, ఈశ్వరుని కంఠంలోని హాలాహలపు నల్లని మచ్చలా కనబడేది, మెళ్ళోవేసిన హారాలు సర్పహారాలుగా కనబడుతున్నాయి.
అలా చిన్ని కృష్ణుడు శివునిలా కనబడుతున్నాడు అన్నారు. ఆ కాలపు వీరశైవ వీరవైష్ణవ భేదాలను పరిహరించిన విప్లవ కవి, ప్రజాకవి మన బమ్మెర పోతనామాత్యుల వారు.

తెభా-10.1-298-క.
పాపల విహరణములు
తీపులు పుట్టింప మరగి తేఁకువ లే కా
గోపాలసతులు మక్కువ
నే నులును మఱచి యుండి రీక్షణపరలై.

టీక:- ఆ = ఆ; పాపల = శిశువుల; విహరణములున్ = క్రీడలు; తీపులు = ఆసక్తిని; పుట్టింపన్ = కలిగిస్తుండగ; మరగి = అలవాటు వలన ఆసక్తి పెరిగి; తేకువ = భయము; లేక = లేకుండగ; ఆ = ఆ; గోపాల = యాదవ; సతులున్ = స్త్రీలు; మక్కువన్ = ప్రీతివలన; ఏ = ఏ యొక్క; పనులును = కార్యక్రమములను; మఱచి = మరిచిపోయి; ఉండిరి = ఉండిపోయారు; ఈక్షణ = చూచుట యందు; పరలు = లగ్నమైనవారు; ఐ = అయ్యి.
భావము:- బలభద్ర కృష్ణుల బాల్యక్రీడలు ఆ మందలోని గోపికలకు మధుర మధురంగా కనిపిస్తున్నాయి. వారు ఆ మాధుర్యాన్ని మరిగి అన్ని పనులు మరచిపోయి, అదురు బెదురు లేకుండా ఆ క్రీడలనే మక్కువతో వీక్షిస్తు ఉండిపోయారు.

తెభా-10.1-299-వ.
ఆ సమయంబున బాలకుల తల్లులు గోఱ గోరు కొమ్ములు గల జంతువులవలన నేమఱక, జలదహనకంటకాదుల యెడ మోసపోక, బాలసంరక్షణంబు జేయుచు నుల్లంబుల మొల్లంబు లైన ప్రేమంబు లభిరామంబులు గా విహరించుచుండి రంత.
టీక:- ఆ = ఆ; సమయంబునన్ = సమయమునందు; బాలకుల = పిల్లల; తల్లులు = తల్లులు; కోఱన్ = కోరలు గల; గోరు = గోర్లు గల; కొమ్ములు గల = కొమ్ములు గల; జంతువుల = ప్రాణుల; వలనన్ = నుండి; ఏమఱక = ప్రమత్తులు కాకుండ; జల = నీరు; దహన = అగ్ని; కంటక = ముల్లు; ఆదులన్ = మున్నగువాని; ఎడన్ = అందుకొని; మోసపోక = ఏమరకుండ; బాల = పిల్లల; సంరక్షణంబు = పోషణ; చేయుచున్ = చేస్తూ; ఉల్లంబుల = హృదయములలో; మొల్లంబులు = అధికములు; ఐన = అయిన; ప్రేమంబులన్ = అభిమానములతో; అభిరామంబులుగా = మనోజ్ఞము లైనవి; కాన్ = అగునట్లు; విహరించుచుండిరి = క్రీడించుచుండిరి; అంతన్ = అప్పుడు.
భావము:- బలరామకృష్ణులు శైశవలీలలు ప్రదర్శిస్తున్న సమయంలో, వారి తల్లులు రోహిణి, యశోదలు చక్కని జాగ్రత్తలతో ఆ బాలురను పెంచుతు వచ్చారు. గోళ్ళు, కోరలు, కొమ్ములు ఉన్న జంతువులనుండి; నీళ్ళు, నిప్పు, ముళ్ళు మొదలైన వానినుండి ప్రమాదాలు జరగకుండ జాగ్రత్త పడ్డారు. హృదయాలలో బాలకుల యెడ ప్రేమానురాగాలు ఉప్పొంగుతు ఉండగా ఆనందంగా కాలం గడుపుతున్నారు.

తెభా-10.1-300-క.
యీడు గోపబాలురు
నుఁ గొలువఁగ రాముఁ గూడి నువు గలుగుచుం
ను గమనంబులఁ గృష్ణుఁడు
నుమధ్యలు మెచ్చ నీల నురుచి మెఱసెన్.

టీక:- తన = తన; ఈడు = వయసు; గోప = యాదవ; బాలురు = పిల్లలు; తనున్ = అతనిని; కొలువగన్ = సేవించుచుండగా; రామున్ = బలరాముని; కూడి = తోకలిసి; తనువున్ = మంచిదేహము; కలుగుచున్ = ఉండి; తను = చిన్న; గమనంబులన్ = నడకలతో; కృష్ణుడు = కృష్ణుడు; తనుమధ్యలు = పడతులు {తనుమధ్యలు - సన్నని నడుము కలవారు, స్త్రీలు}; మెచ్చన్ = మెచ్చుకొనునట్లుగా; నీల = నల్లని; తను = శరీరపు; రుచిన్ = రంగుతో; మెఱసెన్ = చక్కగ నుండెను.
భావము:- బాలకృష్ణుడు అన్న బలరామునితో చిన్నచిన్న అడుగులు వేస్తూ ఆడుకుంటు ఉంటే, తన యీడు గల గొల్లపిల్లవాళ్ళు అతని చుట్టూ చేరి ఆడుకునేవారు. అతడే తమ నాయకుడు అన్నట్లు భక్తితో ప్రేమతో ప్రవర్తించేవారు. చల్లని వర్తనలు చూసి మందలోని మగువలు చూసి మెచ్చుకునే అతని నీల దేహకాంతి మెరుస్తున్నది.

తెభా-10.1-301-వ.
మఱియు నా కుమారుండు దినదినంబునకు సంచార సంభాషణ దక్షుండై.
టీక:- మఱియున్ = ఇంకను; కుమారుండు = పిల్లవాడు; దినదినంబున్ = రోజురోజు; కున్ = కి; సంచార = విహరించుటలు; సంభాషణ = మాట్లాడుట; దక్షుండు = వచ్చినవాడు; ఐ = అయ్యి.
భావము:- ఆ కృష్ణ బాలకుడు రోజురోజు నడవటం, మాట్లాడటం వంటి కొత్త విద్యలు చక్కగా నేర్చుకున్నాడు.

తెభా-10.1-302-ఉ.
ప్పుడు చేయకుండు మని జంకె యొనర్చిన నల్గిపోవఁగా
ప్పుడు బార చాఁచి తన ర్మిలి విందులు వచ్చి రంచు న
వ్వొప్పఁగఁ జీరు తల్లి దెస కొత్తిలి కృష్ణుఁడు రంతు జేయుచు
న్నెప్పటియట్ల చన్గుడుచు నింపొలయన్ మొలగంట మ్రోయఁగన్.

టీక:- చప్పుడు = అల్లరి శబ్దములు; చేయక = చేయకుండా; ఉండుము = ఉండు; అని = అని; జంకె = బెదిరించుట; ఒనర్చినన్ = చేసినచో; అల్గి = అలిగి; పోవగాన్ = వెళ్ళిపోయి; అప్పుడు = అప్పటి కప్పుడే; బారచాచి = చేతులు నిడుపుగా చాపి; తన = అతని యొక్క; అర్మిలి = ప్రియ; విందులు = చెలికాళ్ళు; వచ్చిరి = వచ్చారు; అంచున్ = అనుచు; నవ్వొప్పగన్ = నవ్వొచ్చేటట్లుగ; చీరు = పిలుచు; తల్లి = తల్లి; దెసన్ = వైపున; కున్ = కు; ఒత్తిలి = గట్టిగా; కృష్ణుడు = కృష్ణుడు; రంతు జేయుచున్ = ఏడుస్తూ; ఎప్పటియట్ల = ఎప్పటిలాగనే; చన్నున్ = చనుబాలు; కుడుచున్ = తాగును; నింపు = చక్కదనము; ఒలయన్ = ఒలకబోస్తూ; మొలగంట = మొలకు కట్టిన చిరుగంట; మ్రోయగన్ = శబ్దము చేయగా.
భావము:- ఆ కృష్ణ బాలకుడు రోజురోజు నడవటం, మాట్లాడటం వంటి కొత్త విద్యలు చక్కగా నేర్చుకున్నాడు. తల్లి యశోద అల్లరి చేయవద్దని బెదిరిస్తే, కొంటె కృష్ణుడు కోపగించి దూరంగా వెళ్ళిపోతాడు. అది చూసి “నా కన్నతండ్రి! రా ప్రియ చెలికాళ్ళు వచ్చారు” అంటు చేతులు చాపి పిలవగానే పరిగెత్తుకుంటు తల్లి దగ్గరకు వచ్చి అల్లరి చేస్తూ ఎప్పటిలాగా చనుబాలు త్రాగుతాడు. అలా అల్లరి చేస్తూ పరుగెడుతుంటే, మొలతాడుకు కట్టిన చిరుగంట ఘల్లుఘల్లున మ్రోగుతుంది. ఆ అల్లరి ఎంతో అందంగా ఉంటుంది.

తెభా-10.1-303-క.
ల్లవగృహ నవనీతము
లెల్లను భక్షించి వచ్చి, యెఱుఁగని భంగిం
ల్లిఁ గదిసి చిట్టాడుచు,
ల్లనఁ జను "బువ్వఁ బెట్టు వ్వా!"యనుచున్.

టీక:- వల్లవ = గోపికా; గృహంబున్ = ఇండ్లలోని; నవనీతములు = వెన్నలు; ఎల్లను = అన్నిటిని; భక్షించి = తినివేసి; వచ్చి = వచ్చి; ఎఱుగని = ఏమీ తెలియనివాని; భంగిన్ = వలె; తల్లిన్ = తల్లిని; కదిసి = చేరి; చిట్టాడుచున్ = ఇటునటు తిరుగుచు; అల్లనన్ = మెల్లిగా; చనున్ = వెళ్ళును; బువ్వ = అన్నము; పెట్టుము = పెట్టు; అవ్వా = అమ్మా; అనుచున్ = అంటూ.
భావము:- గోపికల ఇళ్ళల్లో వెన్నంతా తిని యింటికి వచ్చి, అల్లరి కృష్ణుడు ఏమీ తెలియనివానిలా మెల్లిగా తల్లి పక్కకి చేరతాడు. "అమ్మా బువ్వ పెట్టు"అంటు ఊరికే ఇల్లంతా తిరిగేస్తాడు.

తెభా-10.1-304-వ.
మఱియు గోపకుమారులం గూడికొని కృష్ణుండు.
టీక:- మఱియున్ = ఇంకను; గోపకుమారులన్ = గొల్లపిల్లలను; కూడికొని = కలుపుకొని; కృష్ణుండు = కృష్ణుడు.
భావము:- మరి కృష్ణబాలుడు గోపబాలురు అందరితో కలిసి, రకరకాల ఆటలు ఆడసాగాడు.

తెభా-10.1-305-సీ.
"గోవల్లభుఁడ నేను; గోవులు మీ"రని-
డి ఱంకె వైచుచు వంగి యాడు;
"రాజు నే; భటులు మీలు రండురం"డని-
ప్రాభవంబునఁ బెక్కు నులుపనుచు;
"నేఁదస్కరుండ; మీరింటివా"రని నిద్ర-
పుచ్చి సొమ్ములు గొనిపోయి డాఁగు;
"నే సూత్రధారి; మీ రిందఱు బహురూపు"-
ని చెలంగుచు నాటలాడఁ బెట్టు;

తెభా-10.1-305.1-తే.
మూల లుఱుకును; డాఁగిలిమూఁత లాడు;
నుయ్యలల నూఁగుఁ జేబంతు లొనరవైచు;
జార చోరుల జాడలఁ జాల నిగుడు;
శౌరి బాలురతో నాడు మయమందు.

టీక:- గోవల్లభుండన్ = ఆంబోతును, ఎద్దును; నేను = నేను; గోవులు = ఆవులు; మీరు = మీ రందరు; అని = అని; వడిన్ = వేగముగ; ఱంకె = ఎద్దు, ఆంబోతు అరుపు యందలి ధ్వన్యనుకరణ ఱంకె; వైచుచున్ = వేస్తూ; వంగి = ఎద్దు వలె వంగి; ఆడున్ = ఆటలాడును; రాజున్ = రాజును; నేన్ = నేను; భటులు = సేవకులు; మీరలు = మీరు; రండురండు = తొందరగా రండి; అని = అని; ప్రాభవంబునన్ = అధికార పూర్వకముగా; పెక్కు = అనేకమైన; పనులున్ = పనులను; పనుచున్ = అప్పజెప్పును; నేన్ = నేను; తస్కరుండన్ = దొంగను; మీరున్ = మీరు; ఇంటివారు = గృహస్థులు; అని = అని; నిద్ర = నిద్ర; పుచ్చి = పోవునట్లు చేసి; సొమ్ములున్ = ఆభరణములు; కొనిపోయి = తీసుకెళ్ళి; డాగున్ = దాగుకొనును; నేన్ = నేను; సూత్రధారి = దారముల బట్టి తిప్పువాడు, నాటకానికి దర్శకుడను; మీరు = మీరు; అందఱున్ = అందరు; బహురూపులు = అనేక రూపముల బొమ్మలు, వివిధ వేషధారులు; అని = అని; చెలంగుచున్ = చెలరేగుచు; ఆటలాడబెట్టున్ = ఆట్లాడునట్లు చేయును.
మూలలున్ = సందుగొందుల లోకి; ఉఱుకును = పరుగెత్తును; డాగిలిమూతలు = దాగుడుమూతల ఆటలు; ఆడును = ఆడును; ఉయ్యలలన్ = ఉయ్యాలలు; ఊగున్ = ఊగును; చే = చేతిలోని; బంతులున్ = బంతులను; ఒనరన్ = చక్కగా; వైచున్ = వేయును; జార = విటుల; చోరుల = దొంగల; జాడలన్ = వలె; చాలన్ = విరివిగా, మిక్కిలి; నిగుడున్ = వ్యాపించును; శౌరి = కృష్ణుడు {శౌరి - శూరుని వంశపు వాడు, కృష్ణుడు}; బాలుర = పిల్లల; తోన్ = తోటి; ఆడు = ఆడెడి; సమయమందు = వేళ.
భావము:- “నేను ఆబోతును, మీరందరు ఆవులు” అంటు, ఆబోతులా రంకలు వేస్తూ పరుగుపెడతాడు. నేను రాజును, “మీరు అందరు నా భటులు” అంటు, అధికారం చూపుతు వాళ్ళతో ఎన్నో పనులు చెప్పి చేయిస్తాడు. “నేను దొంగను మీరు గృహస్థులు” అంటు వారిని నిద్రపుచ్చి, వారి వస్తువులు తీసుకొని పారిపోయి దాక్కుంటాడు. “మీరందరు నాటకాలలో పాత్రధారులు, నేను దర్శకత్వం చేసే సూత్రధారుడను” “నేను తోలుబొమ్మ లాడించే వాడిని, మీరు రకరకాల పాత్రల ధరించే తోలు బొమ్మలు” అంటు వారందరి చేత ఆటలు ఆడిస్తు ఉంటాడు. మూలమూలలోను దూరుతు ఉంటాడు దాగుడుమూతలు ఆడతాడు. ఉయ్యాలలు ఊగుతాడు. చేతిబంతులు ఎగరేసి ఆడుతుంటాడు. తిరుగుబోతులా, దొంగలా రకరకాల పోకిళ్ళు పోతాడు.