పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/ప్రవర్షణ పర్వతారోహణంబు

తెభా-10.1-1673-వ.
మఱియుం బలాయమానులై బహుయోజనంబుల దూరంబు చని విశ్రాంతులై తమకు డాఁగ నెల వగునని యింద్రుండు మిక్కిలి వర్షింపఁ "బ్రవర్షణా"ఖ్యంబై పదునొకండు యోజనంబుల పొడవును నంతియ వెడలుపునుం గల గిరి యెక్కి రంత.
టీక:- మఱియున్ = తరువాత; పలాయమానులు = పారిపోవుచున్నవారు; ఐ = అయ్యి; బహు = అనేక; యోజనంబుల = యోజనముల; దూరంబున్ = దూరము; చని = వెళ్ళి; విశ్రాంతులు = అలసినవారు; ఐ = అయ్యి; తమ = వారల; కున్ = కు; డాగ = దాగుకొనుటకు; నెలవు = అనువగుచోటు; అని = అని; ఇంద్రుండు = ఇంద్రుడు; మిక్కిలి = అధికముగా; వర్షింపన్ = వానకురిపించుచేత; ప్రవర్షణ = ప్రవర్షణ అనెడి; ఆఖ్యంబు = పేరుపొందినది; ఐ = అయి; పదునొకండు = పదకొండు (11); యోజనంబుల = యోజనముల కొలతగల; పొడవును = పొడుగు; అంతియన్ = అంతే; వెడలుపునున్ = వెడల్పు; కల = కలిగిన; గిరిన్ = కొండను; ఎక్కిరి = ఎక్కిరి; అంత = అటుపిమ్మట.
భావము:- రామకృష్ణులు పరుగెత్తి పరుగెత్తి పెక్కు ఆమడల దూరం వెళ్ళి సేదతీర్చుకోవడానికి దాగుకోడానికి తగిన చోటని తలచి దేవేంద్రుడు అధికంగా వానలు కురిపించడం చేత ప్రవర్షమనే పేరువహించి పదకొండు ఆమడల పొడవు అంతే వెడల్పు కల ఒక పర్వతాన్ని ఎక్కారు.

తెభా-10.1-1674-శా.
శైలేంద్రముఁ జుట్టి రా విడిసి రోషావిష్టుఁడై మాగధో
ర్వీశుం డా వసుదేవ నందనులఁ దా వీక్షింపఁగా లేక త
న్నాశేచ్ఛన్ బిల సాను శృంగములఁ బూర్ణక్రోధుఁడై కాష్ఠముల్
రాశుల్గా నిడి చిచ్చుపెట్టఁ బనిచెన్ రౌద్రంబుతో భృత్యులన్.

టీక:- ఆ = ఆ యొక్క; శైల = పర్వత; ఇంద్రము = శ్రేష్ఠము; చుట్టిరా = చుట్టూరా; విడిసి = చుట్టుముట్టి; రోషావిష్టుడు = రోషావేశము కలవాడు; ఐ = అయ్యి; మాగధోర్వీశుండు = జరాసంధుడు {మాగధోర్వీశుడు - మాగధ దేశ ప్రభువు, జరాసంధుడు}; ఆ = ఆ యొక్క; వసుదేవ = వసుదేవుని; నందనులన్ = పుత్రులను; తాన్ = అతను; వీక్షింపగాన్ = కనుగొన; లేక = లేకపోవుటచే; తత్ = వారిని; నాశ = నాశనము చేయవలె నని; ఇచ్ఛన్ = కోరికతో; బిల = గుహలలోను; సాను = చరియలలోను; శృంగములన్ = శిఖరములలోను; పూర్ణ = పూర్తిగా; క్రోధుడు = కోపము గలవాడు; ఐ = అయ్యి; కాష్ఠముల్ = కఱ్ఱలను, దుంగలను; రాశులుగా = పోగులుగా; ఇడి = పెట్టి; చిచ్చు = నిప్పు; పెట్టన్ = పెట్టుటకు; పనిచెన్ = నియమించెను; రౌద్రంబు = భీకరత్వము; తోన్ = తోటి; భృత్యులన్ = సేవకులను.
భావము:- మగధదేశాధీశుడైన జరాసంధుడు కోపవివశుడై ఆ పర్వతరాజం చుట్టూ దండువిడిశాడు. ఎంత వెతికించినా, అక్కడ రామకృష్ణులను కనుగొనలేకపోయాడు. వారిని నాశనం చేయాలని, ఆ కొండగుహల్లో చరియల్లో శిఖరాల్లో కట్టెలు కట్టలు కట్టలు పేర్చి దహించివేయ మని రౌద్రంతో సేవకులను ఆజ్ఞాపించాడు.

తెభా-10.1-1675-వ.
ఇట్లు జరాసంధపరిజన ప్రదీపితంబైన మహానలంబు దరికొనియె; నందు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; జరాసంధ = జరాసంధుని; పరిజన = సేవకులచే; ప్రదీపితంబు = రాజేయబడినది; ఐన = అయిన; మహా = గొప్ప; అనలంబు = అగ్ని; తరికొనియెన్ = రగుల్కొనెను; అందు = దానిలో.
భావము:- ఈ విధంగా జరాసంధుని భృత్యులు ముట్టించిన మహాగ్ని రగులుకొని ఆ పర్వతాన్ని కాల్చివేసింది.

తెభా-10.1-1676-క.
పొ లెగసెఁ బొగల తుదలను
మిగులుచు మిడుఁగుఱులు నిగిడె మిడుఁగుఱగమి ము
న్ను బ్రహ్మాండము నిండను
భగ యని మంట లొదివె యదము లగుచున్.

టీక:- పొగలు = ధూమములు; ఎగసెన్ = మీదికి లేచెను; పొగలన్ = పొగలకు; తుదలన్ = చివర్లలో; మిగులుచున్ = అతిశయించుచు; మిడుగుఱులున్ = నిప్పురవ్వలు; నిగిడెన్ = చెలరేగెను; మిడుగుఱుల = నిప్పురవ్వల; గమి = సమూహము; మున్నుగన్ = ముందుగా; బ్రహ్మాండము = లోకమంతా; నిండను = నిండిపోతున్నట్లు; భగభగ = భగభగ (మంటల శబ్దం); అని = అని; మంటలు = మంటలు; ఒదివెన్ = పుట్టినవి; భయదములున్ = భయంకరములుగా; అగుచున్ = అగుచు.
భావము:- అలా రగులుకున్న అగ్నితో ప్రవర్షణ పర్వతంపై ముందు పొగలు పైకి లేచాయి. పొగలమీద మిక్కుటంగా నిప్పురవ్వలు కమ్ముకున్నాయి. ఆ మిణుగురు గుంపులతో బ్రహ్మాండం నిండింది. తరువాత భయంకొల్పుతూ భగభగమని మంటలు లేచాయి.

తెభా-10.1-1677-వ.
మఱియు న మ్మహానలంబు బిలసాను శృంగ వృక్ష లతాకుంజపుంజంబుల దరికొని శిఖలు కిసలయంబులుగ విస్ఫులింగంబులు విరులుగ, సముద్ధూత ధూమపటలంబులు బంధురస్కంధశాఖా విసరంబులుగ, ననోహకంబు కైవడి నభ్రంకషం బై ప్రబ్బి కఠోరసమీరణ సమున్నత మహోల్కాజాల తిరోహిత వియచ్చర విమానంబును, వివిధ విధూమవిస్ఫులింగ విలోకనప్రభూత నూతనతారకా భ్రాంతి విభ్రాంతి గగనచరంబును, సంతప్యమాన సరోవర సలిలంబును, విశాలజ్వాలాజాల జాజ్వల్యమాన తక్కోల చందనాగరు కర్పూరధూమ వాసనావాసిత గగనకుహరంబును, గరాళకీలాజాల దందహ్యమాన కీచకనికుంజపుంజ సంజనిత చిటచిటారావ పరిపూరిత దిగంతరాళంబును, భయంకర బహుళతరశాఖాభిద్యమాన పాషాణఘోషణపరిమూర్ఛిత ప్రాణిలోకంబును సంతప్యమాన శాఖిశాఖాంతర నిబిడ నీడనిహిత శాబకవియోగ దుఃఖ డోలాయమాన విహంగకులంబును, మహాహేతిసందీప్యమాన కటిసూత్ర సంఘటిత మయూరపింఛ కుచకలశయుగళ భారాలస శబరకామినీసమాశ్రిత నిర్ఝరంబును, దగ్ధానేక మృగమిథునంబునునై యేర్చు నెడ.
టీక:- మఱియున్ = తరువాత; ఆ = ఆ యొక్క; మహా = మిక్కిలి పెద్దదైన; అనలంబు = అగ్ని; బిల = గుహలలోను; సాను = కొండచరియలమీద; శృంగ = శిఖరములందు; వృక్ష = చెట్లకు; లతా = తీగలకు; కుంజ = పొదల; పుంజంబులన్ = సమూహములందు; తరికొని = అంటుకొని; శిఖలు = అగ్నికీలలు; కిసలయంబులుగన్ = చిగుళ్ళులాగ; విస్ఫులింగంబులున్ = నిప్పురవ్వలు; విరులుగన్ = పూలులాగ; సమ = మిక్కిలి; ఉద్ధూత = మీది కెగయుచున్న; ధూమ = పొగ; పటలంబులున్ = సమూహములు; బంధుర = చక్కటి; స్కంధ = చెట్టుబోదెలు; శాఖా = కొమ్మలు; విసరంబులుగన్ = సమూహములులాగ; అనోకహంబు = వృక్షములు; కైవడిన్ = వలె; అభ్రన్ = ఆకాశమును; కషంబు = ఒరుసుకొనునది; ఐ = అయ్యి; ప్రబ్బి = వ్యాపించి, పాకి; కఠోర = తీవ్రమైన; సమీరణ = గాలులచేత; సమున్నత = మిక్కిలి పెద్దవైన; మహా = గొప్ప; ఉల్కా = నిప్పురవ్వలు; జాల = సమూహములవలన; తిరోహిత = వెనుతిరిగిన; వియచ్చర = ఆకాశమున తిరిగెడి {వియత్+చర, వియచ్ఛర - శ్చుత్వసంధి}; విమానంబును = విమానములు కలది; వివిధ = పెక్కు; విధూమ = పొగతో కూడిన; విస్ఫులింగ = నిప్పురవ్వల; విలోకన = చూచుటచేత; ప్రభూత = కలిగిన; నూతన = కొత్త; తారకా = నక్షత్రములు అనెడి; భ్రాంతిన్ = భ్రమచేత; విభ్రాంత = ఆశ్చర్యపోతున్న; గగనచరంబున్ = ఆకాశగమనులు కలది; సంతప్తమాన = ఉడికిపోతున్న; సరోవర = చెరువులలోని; సలిలంబును = నీళ్ళుకలది; విశాల = బాగా పెద్దవైన; జ్వాల = మంటల; జాల = సమూహములచే; జాజ్వల్యమాన = కాలిపోతున్న; తక్కోల = తక్కోలపుచెట్ల; చందన = గంధంచెట్ల; అగరు = అగులుచెట్ల; కర్పూర = ఘనసారపుచెట్ల; ధూమ = పొగల యొక్క; వాసనా = సువాసనులచే; వాసిత = పరిమళించుచున్న; గగనకుహరంబునున్ = ఆకాశము; కరాళ = భయంకరమైన; కీలా = మంటల; జాల = సమూహములచేత; దందహ్యమాన = కాల్చబడుతున్న; కీచక = వెదురు; నికుంజ = పొదల; పుంజ = సమూహములందు; సంజనిత = పుట్టుచున్న; చిటచిట = చిటపటమనెడి; ఆరావ = ధ్వనులచే; పరిపూరిత = పూర్తిగా నిండిపోయిన; దిక్ = దిక్కుల; అంతరాళంబున్ = మధ్య ప్రదేశమంతా కలది; భయంకర = భీకరమైన; బహుళతర = చాలా ఎక్కువైన {బహుళము - బహుళతరము - బహుళతమము}; శాఖా = శాఖలు; భిద్యమాన = విరిగిపడిపోవుటవలని; పాషాణ = బండరాళ్ళ; ఘోషణ = గట్టిధ్వనులుచేత; పరిమూర్ఛిత = మూర్ఛపొందింపబడిన; ప్రాణి = జీవ; లోకంబును = జాలము కలది; సంతప్యమాన = మిక్కిలి కాలిపోతున్న; శాఖి = చెట్ల; శాఖా = కొమ్మలు; అంతరన్ = లోపల; నిబిడ = చిక్కుకొన్న; నీడ = గూళ్ళ యందు; నిహిత = ఉంచబడిన; శాబక = పిల్లల; వియోగ = ఎడబాటువలని; దుఃఖ = దుఃఖముచేత; డోలాయమాన = చలించిపోయిన; విహంగ = పక్షుల; కులంబును = సమూహము; మహా = పెద్దపెద్ద; హేతి = మంటలచేత; సందీప్యమాన = ప్రకాశింపజేయబడిన; కటిసూత్ర = మొలనూళ్ళకు; సంఘటిత = కట్టబడిన; మయూర = నెమలి; పింఛ = పింఛముల యొక్క; కుచ = స్తనములనెడి; కలశ = కలశముల; యుగళ = జంట యొక్క; భార = బరువుచేత; అలస = బడలిన; శబర = బోయ; కామినీ = స్త్రీలచేత; సమాశ్రిత = ఆశ్రయింపబడిన; నిర్ఝరంబును = సెలయేళ్ళు కలది; దగ్ధ = కాలిపోయిన; అనేక = పెక్కు; మృగ = లేళ్ళ; మిథునంబును = జంటలు కలది; ఐ = అయ్యి; ఏర్చున్ = దహించెడి; ఎడన్ = సమయము నందు.
భావము:- ఆ మహాగ్నికి గుహలలోని, చరియలమీద, శిఖరము పైన ఉన్న చెట్లు తీగలు పొదలు అంటుకుని మండిపోసాగాయి. జ్వాలలే చిగుళ్ళుగా మిణుగురులే పూలుగా పైకిలేచిన పొగలప్రోగులే దట్టమైన బోదెలుగా కొమ్మలుగా కనిపించగా. ఆ అగ్ని ఒక మహావృక్షంవలె ఆకాశాన్ని తాకుతూ వ్యాపించింది. దారుణమైన వాయువు చేత లేచిన గొప్ప నిప్పుకణికలు ఆకాశంలో తిరిగే విమానాలను మరుగుపరిచాయి. పొగలేక కణకణలాడే పలురకాల మిణుగురులను చూసి అవి క్రొత్త నక్షత్రాలని ఆకాశంలో సంచరిస్తున్న దేవతలు విభ్రాంతి చెందారు. సరస్సులలోని నీరు సలసల క్రాగిపోయింది. పెనుమంటలు అంటుకుని కాలుతున్న అగరు, తక్కోల, చందన, కర్పూర వృక్షాల పొగల సుగంధంతో ఆకాశమండలం అంతా పరిమళించింది. భయంకరమైన మంటలతో మండిపోతున్న వెదురుపొదల నుండి పుట్టిన చిటపట ధ్వనులు అన్ని దిక్కుల మధ్య ప్రదేశం అంతా నింపివేశాయి. ఘోరములు మిక్కుటములు అయిన మంటలచే పగిలిపోతున్న రాళ్ళమ్రోత వలన భూతజాలం మూర్ఛిల్లింది. దగ్ధమవుతున్న చెట్లకొమ్మల నడుమ దట్టమైన గూళ్ళలో నివసిస్తున్న తమ పిల్లల ఎడబాటువల్ల ఏర్పడిన దుఃఖంతో పక్షిసమూహం కలతచెందింది. తమ మొలనూళ్ళలో కట్టుకున్న నెమలి యీకలకు మంటలు అంటుకోగా కుండల వంటి కుచాల బరువుచే మందగమన లైన చెంచితలు సెలయేళ్ళను ఆశ్రయించారు. ఆ అగ్ని అనేక మృగమిథునాలను దహించివేసింది.

తెభా-10.1-1678-క.
నేకాదశ యోజన
ము పొడవగు శైలశిఖరమున నుండి వడిన్
కృష్ణులు రిపుబలముల
వెలి కుఱికిరి కానఁబడక విలసితలీలన్.

టీక:- ఇలన్ = భూమి యందు; ఏకాదశ = పదకొండు (11); యోజనముల = యోజనముల ప్రమాణము; పొడవు = పొడుగు; అగు = కల; శైల = కొండ; శిఖరమునన్ = కొన; నుండి = నుండి; వడిన్ = వేగముగా; బల = బలరాముడు; కృష్ణులు = కృష్ణుడులు; రిపు = శత్రువుల; బలముల = సైన్యముల; వెలి = వెలుపలి; కిన్ = కి; ఉఱికిరి = పారిపోయిరి; కానబడకన్ = కనుపించకుండ; విలసిత = ఆటలాడుతున్న; లీలన్ = విధముగా.
భావము:- అప్పుడు భూమ్మీద పదకొండామడల పొడవు ఉన్న ఆ కొండ కొమ్ము నుంచి బలరామకృష్ణులు జరాసంధుడి సైనికుల కంటపడకుండా వారిని దాటి కుప్పించి దూకేరు.