పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/గోపికలతో సంభాషించుట

తెభా-10.1-1076-వ.
అని తన్ను నుద్దేశించి రహస్యంబుగాఁ బల్కిన సుందరుల పలుకులు విని గోపాలసుందరుం డిట్లనియె.
టీక:- అని = అని; తన్నున్ = తనను; ఉద్దేశించి = గురించి; రహస్యంబుగాన్ = గుప్తముగా, నర్మగర్భంగా; పల్కిన = అనిన; సుందరుల = అందగత్తెల; పలుకులు = మాటలను; విని = విని; గోపాలసుందరుండు = కృష్ణుడు {గోపాల సుందరుడు - గోవులను పాలించెడి సుందరమైనవాడు, కృష్ణుడు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా తనను గురించి నర్మగర్భంగా పలికిన ఆ సుందరాంగుల మాటలు విని గోపాలసుందరుడు కృష్ణుడు ఇలా అన్నాడు. . .

తెభా-10.1-1077-సీ.
"కొలిచినఁ గొలుతురు కొందఱు పశువుల-
జనము భంగిని లము కొఱకు
నై; సఖ్యధర్మములందు సిద్ధింపవు-
కొందఱు తండ్రుల గుణముఁ దాల్చి
య గలవారును గిన సుహృత్తులు-
గొలువని వారలఁ గొల్తు రెపుడు
ర్మకామంబులు నరంగఁ గొందఱు-
కొలువని వారినిఁ గొలుచువారిఁ

తెభా-10.1-1077.1-ఆ.
గొలుచు తలఁపులేమిఁ గొలువ రాత్మారాము
లాప్తకాము లజ్ఞు తికఠినులు
వారి యందుఁ బిదపవానిఁగాఁ జింతించి
యే లతాంగులార! యిట్టు లనుట.

టీక:- కొలచినన్ = సేవించినచో; కొలుతురు = ఆదరించెదరు; కొందఱు = కొంతమంది; పశువుల = పశువులను; భజనము = మేపుట; భంగిని = వలె; ఫలము = ఫలితము; కొఱకున్ = కోసము; ఐ = అయ్యి; సఖ్య = స్నేహ; ధర్మములు = ధర్మములు; అందున్ = అందు; సిద్ధింపవు = కలుగవు; కొందఱు = కొంతమంది; తండ్రుల = తండ్రుల యొక్క; గుణమున్ = స్వభావమును; తాల్చి = ధరించి; దయగలవారునున్ = దయామయులు; తగిన = యుక్తులైన; సుహృత్తలు = స్నేహితులు; కొలువని = సేవించని; వారలన్ = వారిని; కొల్తురు = ఆదరించెదరు; ఎపుడున్ = ఎల్లప్పుడు; ధర్మ = ధర్మములు; కామంబులున్ = కామములు; తనరంగన్ = ఒప్పునట్లుగా; కొందఱు = కొంతమంది; కొలువనివారిని = సేవించనివారిని; కొలుచువారిని = సేవించెడివారిని; కొలుచు = ఆసక్తి చూపెడి.
తలపు = భావన; లేమి = లేకపోవుటచేత; కొలువరు = ఆదరింపరు; ఆత్మారాముల్ = ఆత్మయందు రమించువారు; ఆప్తకాములు = నిరాశులు {ఆప్తకాములు - పొందబడినకోరికలు కలవారు, నిరాశులు}; అజ్ఞులు = తెలివిలేనివారు; అతి = మిక్కిలి; కఠినులు = కఠినమైన ఆత్మకలవారు; వారి = వారి; అందున్ = లో; పిదపవాని = చివరవాని; కాన్ = అగునట్లు; చింతించి = భావించేకదా; లతాంగులార = అందగత్తెలు; ఇట్టులు = ఈ విధముగ; అనుట = పలుకుట.
భావము:- “ఓ సుందరీమణులారా! పశువులను ఫలాపేక్షతో సేవించిన విధంగా సేవించే వారినే కొందరు సేవిస్తారు; వారు స్వప్రయోజనం మాత్రమే కాంక్షించే వారు. వారికి స్వార్ధం మీదనే కన్ను. సేవిస్తేనే తిరిగి సేవించడం మంచి మనసు అనిపించుకోదు; దాని వలన పరోపకార ధర్మం సిద్ధించదు. ఇంక కొందరు దయ గలవారు, మంచి మనసు గలవారు, తండ్రులు తమ పుత్రులను వలె, తమను సేవించని వారిని కూడా సేవిస్తారు; అందువల్ల వారికి ధర్మ కామాలు సిద్ధిస్తాయి. మరికొందరు కొలిచే ఉద్దేశం లేనందున తమను సేవించేరినీ, సేవించని వారినీ కూడా సేవించరు; వారు కేవల స్వార్థజీవులు, నిరాశులు; మూఢులూ, మిక్కిలి కఠినులూ వీరిలో నన్ను ఈ మూడవ తెగకు చెందిన వానిగా నెంచి మీరు ఇలా అంటున్నారు. అవునా?

తెభా-10.1-1078-క.
నిం దెవ్వఁడ నైనం
గా నంగనలార! పరమకారుణికుండన్
మాసబంధుఁడ నిత్య
ధ్యాము మీ కొనరవలసి లఁగితిఁ జుండీ.

టీక:- ఏన్ = వీరి; అందు = లో; ఎవ్వ డన్ = ఎవరిని; ఐనన్ = కూడ; కాన్ = కాదు; అంగనలార = ఓ యువతులు; పరమ = మిక్కిలి; కారుణికుండన్ = దయ గలవాడను; మానస = మనసులకు; బంధుడన్ = ప్రియ చుట్టమును; నిత్య = శాశ్వతమైన; ధ్యానము = ధ్యానము; మీ = మీ; కున్ = కు; ఒనరవలసి = సమకూర్చుట కోసము; తలగితిన్ = తొలగితిని; సుండీ = సుమా.
భావము:- ఓ మగువలూ! మీరు అంటున్న వారిలో నేను ఏ ఒక్కడనూ కాను. నేను మిక్కిలి కరుణ కలవాడిని. మీకు ఆత్మబాంధవుణ్ణి. నా యెడ మీకు నిత్యమైన ధ్యానం సమకూర్చడం కోసం కనుమరుగు అయ్యాను సుమా, అంతే.

తెభా-10.1-1079-మ.
ను సేవించుచునున్నవారలకు నే నా రూపముం జూపఁ జూ
చినఁ జాలించి మదించి వారు మది నన్ సేవింపరో యంచు ని
ర్ధనికుం డాత్మధనంబు చెడ్డ నెపుడుం త్పారవశ్యంబుఁ దా
ల్చి భంగిన్ ననుఁ బాసి మత్ప్రియుఁడు దాఁ జింతించు నా రూపమున్

టీక:- ననున్ = నన్ను; సేవించుచున్న = కొలుస్తున్న; వారల = వారి; కున్ = కి; నేన్ = నేను; ఆ = ఆ కొలచుచున్న; రూపమున్ = స్వరూపమును; చూపన్ = చూపించను; చూచినన్ = దర్శించినచో; చాలించి = మానివేసి; మదించి = గర్వించి; వారు = వారు; మదిన్ = మనసు నందు; నన్ = నన్ను; సేవింపరో = కొలువరేమో; అంచున్ = అని; నిర్ధనికుండు = బీదవాడు; ఆత్మ = తన; ధనంబు = ధనము; చెడ్డన్ = పోయిన ఎడల; ఎప్పుడున్ = ఎంతసేపు; తత్ = దాని యందే; పారవశ్యంబునన్ = దృష్టి కలిగి ఉండుటను; తాల్చిన = పూనిన; భంగిన్ = విధముగ; ననున్ = నన్ను; పాసి = ఎడబాసి; మత్ = నా యొక్క; ప్రియుడు = భక్తుడు; తాన్ = అతను; చింతించున్ = తలపోయును; నా = నా యొక్క; రూపమున్ = రూపమును.
భావము:- ప్రత్యక్షంగా నన్ను దర్శిస్తే, అంతటితో గర్వించి, నన్ను సేవించ రని కొలిచే వారికి నా రూపం చూపించను. దరిద్రుడు తనకున్న డబ్బు పోయినప్పుడు తదేక చింతలో మునిగినట్లు, నేను కనపడకుండా ఉంటేనే నన్ను కోరేవారు నా రూపాన్ని ధ్యానిస్తారు.

తెభా-10.1-1080-త.
వు ధర్మముఁ జూడనొల్లక ల్లిదండ్రుల బంధులన్
ల బిడ్డలఁ బాసి వచ్చిన న్నిషక్తల మిమ్ము నేఁ
దు; పాసితిఁ దప్పు సైపుఁడు; ద్వియోగభరంబునన్
లఁ బొందుచు మీర లాడిన వాక్యముల్ వినుచుండితిన్.

టీక:- తగవు = న్యాయము; ధర్మమున్ = ధర్మమును; చూడన్ = ఎంచుటకు; ఒల్లక = అంగీకరించకుండ; తల్లిదండ్రులన్ = తల్లిదండ్రులను; బంధులన్ = బంధువులను; మగలన్ = భర్తలను; బిడ్డలన్ = సంతానమును; పాసి = విడిచిపెట్టి; వచ్చిన = వచ్చినట్టి; మత్ = నా యొక్క; నిషక్తలన్ = సేవించువారిని; మిమ్మున్ = మిమ్ము; నేన్ = నేను; తగదు = తగినపనికాదు (కాని); పాసితిన్ = దూరమైతిని; తప్పు = అపరాధమును; సైపుడు = ఓర్చుకొనండి; తత్ = ఆ యొక్క; వియోగ = ఎడబాటు వలని; భరంబునన్ = బాధచేత; వగలన్ = విచారములను; పొందుచున్ = అనుభవించుచు; మీరలు = మీరు; ఆడిన = పలికిన; వాక్యముల్ = మాటలు; వినుచుండితిన్ = వింటున్నాను.
భావము:- నా మీద మనస్సులను లగ్నం చేసి న్యాయమూ ధర్మమూ లెక్కించక మీ తల్లితండ్రులనూ, చుట్టాలనూ, పతులనూ, బిడ్డలనూ వదలిపెట్టి మీరు నా దగ్గరకు వచ్చారు. మీకు వియోగ వ్యథ కలిగించాను. నేను చేసిన ఈ తప్పును మన్నించండి. నా విరహవేదనతో ఎంతో నలిగిపోయిన మీరు ఆడిన మాటలు వింటూనే ఉన్నాను

తెభా-10.1-1081-ఉ.
పాని గేహశృంఖలలఁ బాసి నిరంతర మత్పరత్వముం
జేయుచు నున్న మీకుఁ బ్రతిజేయ యుగంబుల నైన నేర; నన్
బాక కొల్చు మానసము ప్రత్యుపకారముగాఁ దలంచి నా
పాయుటఁ దప్పుగాఁ గొనక భామినులార! కృపన్ శమింపరే!"

టీక:- పాయని = విడువరాని; గేహ = గృహములు అనెడి; శృంఖలలన్ = బంధములను; పాసి = విడిచిపెట్టి; నిరంతర = ఎడతెగని; మత్ = నా యందలి; పరత్వమున్ = ఆసక్తి కలిగి ఉండుటను; చేయుచున్న = చేయుచున్న; మీ = మీ; కున్ = కు; ప్రతి = ప్రత్యుపకారము; చేయన్ = చేయుటకు; యుగంబులన్ = అనేక యుగములు; ఐనన్ = పట్టినను; నేరన్ = చేయ సమర్థుడను కాను; నన్ = నన్ను; పాయక = విడువక; కొల్చు = సేవించు; మానసమున్ = మనస్సును కలిగించుటే; ప్రత్యుపకారము = బదులు; కాన్ = ఐనట్లు; తలచి = భావించి; నా = నా యొక్క; పాయుటన్ = అంతర్ధానమును; తప్పు = అపరాధము; కాన్ = అగునట్లు; కొనక = గ్రహింపకుండ; భామినులార = ఓ భామలు; కృపన్ = దయతో; శమింపరే = ఓర్చుకొనండి.
భావము:- ఓ భామలారా! వీడరాని సంసార మనే సంకెళ్ళను వీడి నా మీదనే ఎడతెగకుండా మనస్సు లీనం చేసిన మీకు ఎన్ని యుగాలు గడచినా ప్రత్యుపకారం చేయలేను. నేను మిమ్మల్ని ఎడబాయుట కృతజ్ఞత లేక కాదు. నన్ను నిరంతరం మీరు స్మరిస్తూ ఉండటం కోసమే. ఇదే మీకు నేను చేసిన ప్రత్యుపకారంగా ఎంచి మీకు దూరం కావటాన్ని ఒక తప్పుగా తలవకండి. నా మీద కరుణతో ఓర్చుకోండి.”

తెభా-10.1-1082-క.
క్కఁగ హరి యిటు పలికిన
క్కని వాక్యముల నతని సంగమమున లో
నిక్కిన వియోగతాపము
లొక్కట విడిచిరి లతాంగు లుర్వీనాథా!

టీక:- చక్కగన్ = ఒప్పుగా; హరి = కృష్ణుడు; ఇటు = ఇలా; పలికిన = చెప్పిన; చక్కని = చక్కటి; వాక్యములన్ = మాటలను; అతని = అతనితోటి; సంగమమునన్ = కూడుట; లోన్ = అందు; నిక్కిన = పొడచూపిన; వియోగ = ఎడబాటు వలని; తాపములు = బాధలను; ఒక్కటన్ = ఒక్కసారిగా; విడిచిరి = వదలిపెట్టిరి; లతాంగులు = పడతులు; ఉర్వీనాథ = రాజా.
భావము:- మహారాజా! పరీక్షిత్తూ! ఇలా చక్కగా చెప్పిన కృష్ణుడి మాటలు విని, ఆయన కలయికతో తమ విరహతాపాన్ని అంతా గోపికలు ఒక్కసారిగా వదలిపెట్టేసారు.