పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/గురుపుత్రుని తెచ్చి ఇచ్చుట


తెభా-10.1-1429-క.
నిన విని "వీఁడె వీనిం
గొనిపొం"డని భక్తితోడ గురునందను ని
చ్చినఁ గృష్ణుఁడు వీడ్కొలిపెను
దుర్జనదమను మహిషమనున్ శమనున్.

టీక:- అనినన్ = అనగా; విని = విని; వీడె = ఇతడే అతడు; వీనిన్ = ఇతనిని; కొనిపొండు = తీసుకు వెళ్ళండి; అని = అని; భక్తి = భక్తి; తోడన్ = తోటి; గురు = గురువు యొక్క; నందనునిన్ = పుత్రుని; ఇచ్చినన్ = ఇవ్వగా; కృష్ణుడు = కృష్ణుడు; వీడ్కోలిపెను = సెలవిచ్చి పంపెను; ఘన = గొప్ప; దుర్జన = చెడ్డవారిని; దమనున్ = శిక్షించువానిని; మహిష = దున్నపోతు; గమనున్ = వాహనముగా కలవానిని; శమనున్ = యముని {శమనుడు - ప్రాణములను శమింపజేయు వాడు, యముడు}.
భావము:- శ్రీకృష్ణుడి మాటలు వినిన యమధర్మరాజు “ఇడుగో వీడే. వీడిని తీసుకుపొండి.” అని భక్తితో గురుపుత్రుని ఇచ్చివేశాడు. దుర్మార్గులను అణచివేసేవాడూ దున్నపోతు వాహనంగా కలవాడు అయిన యముడికి కృష్ణుడు వీడ్కోలు చెప్పి, గురుకుమారుణ్ణి కూడా తీసుకొని బయలుదేరాడు.

తెభా-10.1-1430-వ.
ఇట్లు జము నడిగి తెచ్చి రామకృష్ణులు సాందీపునికిం బుత్రుని సమర్పించి “యింకనేమి చేయవలయు నానతిం” డనిన న మహాత్ముం డిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; జమున్ = యముడిని {యముడు (ప్ర) - జముడు (వి)}; అడిగి = అడిగి ; తెచ్చి = తీసుకొని వచ్చి; రామ = బలరాముడు; కృష్ణులు = కృష్ణుడులు; సాందీపుని = సాందీపుని; కిన్ = కి; పుత్రుని = కుమారుని; సమర్పించి = ఇచ్చి; ఇంకన్ = ఇంతేకాకుండగ; ఏమి = ఏమి; చేయవలయున్ = చేయమనెదరు; ఆనతిండు = చెప్పండి; అనినన్ = అనగా; ఆ = ఆ యొక్క; మహాత్ముండు = గొప్పవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా యముడి దగ్గర నుండి గురుపుత్రుడిని తీసుకొని వచ్చి తమ గురువు సాందీపనుడికి ఇచ్చి, రామకృష్ణులు “ఇంకా ఏమి చేయమంటారో చెప్పండి” అని అడిగారు. ఆ మహానుభావుడు సాందీపని వారితో ఇలా అన్నాడు. . .

తెభా-10.1-1431-క.
"గురునకుఁ గోరిన దక్షిణఁ
రుణన్ మున్నెవ్వఁ డిచ్చె? నులార! భవ
ద్గురునకుఁ గోరిన దక్షిణఁ
దిముగ నిచ్చితిరి మీరు దీపితయశులై.

టీక:- గురున్ = గురువున; కున్ = కు; కోరిన = అపేక్షించినట్టి; దక్షిణన్ = గురుదక్షిణను; కరుణన్ = దయతోటి; మున్ను = ఇంతకు పూర్వము; ఎవ్వడు = ఎవడుమాత్రము; ఇచ్చెన్ = ఇచ్చెను; ఘనులార = ఓ గొప్పవారు; భవత్ = మీ యొక్క; గురున్ = గురువున; కున్ = కు; కోరిన = అపేక్షించినట్టి; దక్షిణన్ = దక్షిణను; తిరముగన్ = శాశ్వతముగా; ఇచ్చితిరి = ఇచ్చారు; మీరున్ = మీరు; దీపిత = ప్రకాశించెడి; యశులు = కీర్తి కలవారు; ఐ = అయ్యి.
భావము:- “ఓ మహాత్ములారా! గురువు కోరిన దక్షిణ తెచ్చి ఇచ్చారు. మీ యశస్సు దిగంతాలలో ప్రకాశింపజేసారు. ఇంతవరకూ తన గురువునకు అతడడిగిన ఇలాంటి దక్షిణ దయతో ఇచ్చినవాడు ఎక్కడా లేడు.

తెభా-10.1-1432-క.
కాలుని వీటికిఁ జని మృత
బాకుఁ దే నొరుల వశమె? వదీయ కృపన్
మేలు దొరఁకొనియె మాకు; వి
శా మగుంగాత మీ యము లోకములన్.

టీక:- కాలుని = యముని; వీటి = పట్టణమున; కిన్ = కు; చని = వెళ్ళి; మృత = మరణించిన; బాలకున్ = పిల్లవానిని; తేన్ = తీసుకు వచ్చుట; ఒరుల = ఇతరులకు; వశమే = శక్యమా, కాదు; భవదీయ = మీ యొక్క; కృపన్ = దయవలన; మేలు = శుభములు; దొరకొనియెన్ = లభించెను; మా = మా; కున్ = కు; విశాలము = విస్తారము; అగుంగాత = అగుగాక; మీ = మీ యొక్క; యశము = కీర్తి; లోకములన్ = అన్ని లోకము లందును.
భావము:- యమపురికి వెళ్ళి చనిపోయిన పిల్లవాడిని తెచ్చి ఇవ్వడము అన్నది మీకు చెల్లింది కాని, ఇతరులకు సాధ్యమా? ఎంతో శ్రద్ధాభక్తులతో మాకు మేలు కలిగించారు. మీ కీర్తి లోకాలలో విస్తరిల్లు కాక!

తెభా-10.1-1433-వ.
మహాత్ములార! యేను కృతార్థుండ నైతి"నని దీవించిన సాందీపుని వీడ్కొని కృతకృత్యులై రామకృష్ణులు రథారోహణంబు చేసి మథురకుఁ జనుదెంచి పాంచజన్యంబుఁ బూరించిన విని నష్టధనంబులు గనినవారి భంగిం బ్రజలు ప్రమోదించి; రంత నొక్కనాఁ డేకాంతంబున.
టీక:- మహాత్ములారా = ఓ గొప్ప బుద్ధి కలవారు; ఏను = నేను; కృతార్థుండను = ధన్యుడను; ఐతిని = అయినాను; అని = అని; దీవించినన్ = ఆశీర్వదించగా; సాందీపుని = సాందీపుని; వీడ్కొని = సెలవు తీసుకొని; కృతకృత్యులు = తలచి పని చేసినవారు, నెరవేరిన పని గలవారు; ఐ = అయ్యి; రామ = బలరాముడు; కృష్ణులు = కృష్ణుడులు; రథా = రథమును; ఆరోహణంబు = ఎక్కుట; చేసి = చేసి; మథుర = మథురానగరమున; కున్ = కు; చనుదెంచి = వచ్చి; పాంచజన్యంబున్ = పాంచజన్యమును {పాంచజన్యము - పంచజనుని యొక్క దేహమునుండి వచ్చిన శంఖము, కృష్ణుని శంఖము}; పూరించినన్ = ఊదగా; విని = విని; నష్ట = పోయిన; ధనంబులన్ = ద్రవ్యములను; కనిన = పొందిన; వారి = వారి; భంగిన్ = వలె; ప్రజలు = పౌరులు; ప్రమోదించిరి = సంతోషించిరి; అంతన్ = ఆ తరువాత; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; ఏకాంతంబునన్ = రహస్య స్థానము నందు.
భావము:- ఓ పుణ్యాత్ములారా! నేను ధన్యుడను అయ్యాను.” అని సాందీపని వారిని దీవించాడు. రామకృష్ణులు కృతార్ధులై గురువు దగ్గర సెలవు పుచ్చుకుని రథం ఎక్కి మధుర వెళ్ళి శంఖాన్నిఊదారు. అప్పుడు ప్రజలు పోయిన సొమ్ము తిరిగి లభించిన వారిలా సంతోషించారు.

తెభా-10.1-1434-శా.
"నా పైఁ జిత్తము లెప్పుడున్ నిలుపుచున్ నా రాకఁ గాంక్షించుచున్
నా పే రాత్మల నావహించుచు వగన్ నానాప్రకారంబులన్
గోపాలాంగన లెంత జాలిఁబడిరో? కోపించిరో? దూఱిరో?
వ్రేల్లెన్ నిజధర్మ గేహములలో విభ్రాంతచైతన్యలై."

టీక:- నా = నా; పైన్ = మీద; చిత్తములు = మనసులను; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; నిలుపుచున్ = ఉంచుకొని; నా = నా; రాకన్ = వచ్చుటను; కాంక్షించుచున్ = కోరుకొనుచు; నా = నా; పేరు = నామములను; ఆత్మలన్ = మనసు లందు; ఆవహించుచు = ధరించుచు, తలచుచు; వగన్ = తపించుటచేత; నానా = పెక్కు; ప్రకారంబులన్ = విధములుగ; గోపాల = గొల్ల; అంగనలు = భామలు; ఎంత = ఎంత అధికమైన; జాలిన్ = దుఃఖమును; పడిరో = పొందినారో; కోపించిరో = కోపము చేసారో; దూఱిరో = దూషించినారో; వ్రేపల్లెన్ = గొల్లపల్లెలో; నిజ = తమ; ధర్మ = పుణ్య; గేహముల = నివాసముల; లోన్ = అందు; విభ్రాంత = మిక్కిలి భ్రాంతి పొందిన; చైతన్యలు = మనసులు కలవారు; ఐ = అయ్యి.
భావము:- శ్రీకృష్ణుడు ఒకరోజు ఏకాంతంలో ఇలా ఆలోచించసాగాడు “వ్రేపల్లెలోని గొల్లముదితలు సదా నా మీదనే మనసు లగ్నం చేసుకుని ఉంటారు. నా ఆగమనం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. నా పేరు మనసులో నిరంతరం ధ్యానిస్తూ, ప్రణయపారవశ్యంతో తమ పుణ్య గృహాలలో అనేక విధాలుగా వగలు చెందుతుంటారు. పాపం వారెంత దైన్యం పాలవుతున్నారో? నాపై ఎంత కినుక వహించారో? నన్నెంతగా దూషించుతున్నారో?”

తెభా-10.1-1435-వ.
అని చింతించి.
టీక:- అని = అని; చింతించి = తలచుకొని.
భావము:- ఇలా తలపోసిన కృష్ణుడు . . .