పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కాలయవనునికి నారదుని బోధ


తెభా-10.1-1582-మ.
"నా! నీవు సమస్త భూపతుల బాహాఖర్వగర్వోన్నతిం
నుం డభ్రములన్ హరించు పగిదిన్ భంజించియున్నేల యా
వులన్ గెల్వవు? వారలన్ మఱచియో ర్పంబు లేకుండియో?
వివేకస్థితి నొందియో? వెఱచియో? హైన్యంబునం జెందియో?

టీక:- యవనా = యవనుడా; నీవు = నీవు; సమస్త = ఎల్ల; భూపతులన్ = రాజుల యొక్క; బాహా = బాహుబలమువలని; అఖర్వ = అధికమైన; గర్వ = గర్వము యొక్క; ఉన్నతిన్ = అతిశయమును; పవనుండు = వాయుదేవుడు {పవనము - పరిశుద్ధము చేయునది, గాలి}; అభ్రములన్ = మేఘములను {అభ్రము - అప్పు (నీటిని) భరించునది, మేఘము}; హరించు = నశింపజేసెడి; పగిదిన్ = వలె; భంజించియున్ = మొత్తి ఉన్నప్పటికి; ఏలన్ = ఎందుచేత; యాదవులన్ = గోపకులను; గెల్వవు = జయించవు; వారలన్ = వారిని; మఱచియో = మరచిపోవుటవలననా; దర్పంబు = పరాక్రమము; లేకుండియో = లేకపోవుటచేతనా; అవివేక = తెలియని; స్థితిన్ = స్థితిని; ఒందియో = పొందుటచేతనా; వెఱచియో = బెదురుట వలననా; హైన్యంబునన్ = తక్కువ తనము; చెందియో = పొందుటచేతనా.
భావము:- “ఓ కాలయవనా! వాయువు మేఘములను ఎగురగొట్టునట్లు, నీవు భుజగర్వాతిశయంతో రాజులను అందరిని గెలిచావు కాని, ఎందుకు ఇంకా యాదవులను జయించ లేదు. వాళ్ళను మరచిపోయావా, గర్వములేకనా, తెలియకనా, భయమా లేక అల్పత్వమా?

తెభా-10.1-1583-క.
యావులలోన నొక్కఁడు
మేదినిపై సత్వరేఖ మెఱసి జరాసం
ధాదులఁ దూలం దోలెనుఁ
దాదృశుఁ డిలలేడు వినవె త్కర్మంబుల్."

టీక:- యాదవుల = గొపకులలో; ఒక్కడు = ఒకానొకడు; మేదిని = భూమి; పైన్ = మీద; సత్వరేఖన్ = బలాతిశయముచే; మెఱసి = ప్రకాశించుచు; జరాసంధ = జరాసంధుడు; ఆదులన్ = మున్నగువారిని; తూలందోలెను = తూలగొట్టెను; తాదృశుడు = వానికి సమానుడు; ఇలన్ = భూమిపైన; లేడు = ఎవడులేడు; వినవె = వినుము; తత్ = అతని; కర్మంబుల్ = పనులను.
భావము:- యాదవులలో ఒకడు బలాధిక్యంతో భూమ్మీద తేజరిల్లుతూ జరాసంధుడూ మొదలైనవారిని తరిమేసాడు. అంతటి వాడు ఈ భూలోకంలోనే మరొకడు లేడు. అతను చేసిన ఘనకార్యములు నీవు వినలేదా?”

తెభా-10.1-1584-వ.
అనిన విని, కాలయవనుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; విని = విని; కాలయవనుండు = కాలయవనుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా చెప్పిన నారదుని మాటలు వినిన కాలయవనుడు ఇలా అన్నాడు.

తెభా-10.1-1585-శా.
"మీ; నారద! నీవు చెప్పిన నరుం డే రూపువాఁ? డెంతవాఁ?
డే మేరన్ విహరించు? నెవ్వఁడు సఖుం? డెందుండు? నేపాటి దో
స్సార్థ్యంబునఁ గయ్యముల్ సలుపు? నస్మద్బాహు శౌర్యంబు సం
గ్రాక్షోణి భరించి నిల్వఁ గలఁడే? ర్వాఢ్యుఁడే? చెప్పుమా!"

టీక:- ఏమీ = ఏమిటి; నారద = నారదుడా; నీవు = నీవు; చెప్పిన = చెప్పినట్టి; నరుండు = మానవుడు; ఏ = ఎలాంటి; రూపు = స్వరూపము; వాడు = కలవాడు; ఎంత = ఎంతటి; వాడు = వాడు; ఏమేరన్ = ఎంతమర్యాదతో; విహరించున్ = మెలగుచుండును; ఎవ్వడు = ఎవడు; సఖుండు = స్నేహితుడు; ఎందు = ఎక్కడ; ఉండున్ = ఉండును; ఏపాటి = ఎంతమాత్రము; దోః = భుజముల; సామర్థ్యంబునన్ = బలముతోటి; కయ్యముల్ = పోరులను; సలుపున్ = చేయును; అస్మత్ = నా యొక్క; బాహు = భుజముల; శౌర్యంబున్ = పరాక్రమమును; సంగ్రామక్షోణిన్ = యుద్ధభూమి యందు; భరించి = తట్టుకొని; నిల్వగలడే = నిలబడగలడా; గర్వ = గర్వము అను; ఆఢ్యుడే = సంపద కలవాడేనా; చెప్పుమా = తెలుపుము.
భావము:- “ఏమిటేమిటి? నారదా! నీవు చెప్పిన ఆ మానవుడు ఎలా ఉంటాడు? ఎంతటి వాడు? ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? వానికి మిత్రుడు ఎవడు? ఏపాటి భుజబలంతో యుద్ధం చేయగలడు? మా బాహు పరాక్రమమును తట్టుకుని రణరంగములో ఎదురు నిలుబడగలడా? దర్పోద్ధతుడేనా? చెప్పు.”

తెభా-10.1-1586-వ.
అనిన విని దేవముని యిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; విని = విని; దేవముని = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని అడిగిన కాలయవనుడుతో దేవర్షి అయిన నారదుడు ఇలా అన్నాడు.

తెభా-10.1-1587-సీ.
"నీలజీమూత సన్నిభ శరీరమువాఁడు-
తామరసాభ నేత్రములవాఁడు
పూర్ణేందుబింబంబుఁ బోలెడి మోమువాఁ-
డున్నత దీర్ఘ బాహువులవాఁడు
శ్రీవత్సలాంఛనాంచిత మహోరమువాఁడు-
కౌస్తుభమణి పతకంబువాఁడు
శ్రీకర పీతకౌశేయ చేలమువాఁడు-
కరకుండల దీప్తి లయువాఁడు

తెభా-10.1-1587.1-తే.
రాజ! యింతంతవాఁ డనరానివాఁడు
మెఱసి దిక్కుల నెల్లను మెఱయువాఁడు
తెలిసి యే వేళలందైనఁ దిరుగువాఁడు
ట్టనేర్చినఁ గాని లోఁడనివాఁడు."

టీక:- నీల = నల్లని; జీమూత = మేఘముల; సన్నిభ = లాంటి; శరీరము = దేహవర్ణము కల; వాడు = వాడు; తామరస = పద్మములతో; ఆభ = సాటిరాగల; నేత్రములవాడు = కన్నులు కలవాడు; పూర్ణేందు = నిండుపున్నమిచంద్రుని; బింబంబున్ = బింబమును; పోలెడి = వంటి; మోము = ముఖము కలిగిన; వాడు = వాడు; ఉన్నత = గొప్ప; దీర్ఘ = పొడవైన; బాహులు = చేతులు కల; వాడు = వాడు; శ్రీవత్స = శ్రీవత్సము అనెడి; లాంఛన = పుట్టుమచ్చచే; అంచిత = అలంకరింపబడిన; మహా = గొప్ప; ఉరము = వక్షస్థలము కల; వాడు = వాడు; కౌస్తుభ = కౌస్తుభము అనెడి; మణి = రత్నముకల; పతకంబు = పతకముకల {పతకము - మెడలోని హారమునకు వేళ్ళాడు బిళ్ళ}; వాడు = వాడు; శ్రీకర = శుభప్రదమైన; పీత = పచ్చని; కౌశేయ = పట్టు; చేలము = వస్త్రము కల; వాడు = వాడు; మకర = మొసలిరూపు; కుండల = చెవికుండలముల; దీప్తి = ప్రకాశము; మలయు = వ్యాపించెడి; వాడు = వాడు.
రాజ = రాజా; ఇంత = ఇంతటివాడు; అంత = అంతటి; వాడు = వాడు; అనన్ = అనిచెప్పుటకు; రాని = వల్లకాని; వాడు = వాడు; మెఱసి = అతిశయించి; దిక్కుల = దిశల; ఎల్లను = అన్నిటి యందు; మెఱయు = ప్రకాశించు; వాడు = వాడు; తెలిసి = నైపుణ్యము ఉండి; ఏ = ఎట్టి; వేళలన్ = సమయముల; అందు = అదు; ఐనన్ = అయినను; తిరుగు = సంచరించగల; వాడు = వాడు; పట్టన్ = పట్టుకొనుట; నేర్చినన్ = నేర్చుకొంటె; కాని = తప్పించి; లోబడని = లొంగను; వాడు = వాడు.
భావము:- “ఓ యవనేశ్వరా! కాలయవనా! విను. అతడు నల్లని మేఘంవంటి దేహము కలవాడు. తామరపూలవంటి కన్నులు కలవాడు. పూర్ణచంద్రబింబంవంటి ముఖము కలవాడు. పొడవైన ఎగుభుజములు కలవాడు. శ్రీవత్సము అనే పుట్టుమచ్చతో పొలుపారు విశాలవక్షము కలవాడు. అతడు కౌస్తుభమణి ధరిస్తాడు. సంపత్కరమైన పసుపు పచ్చని పట్టుపుట్టాలు కడతాడు. చెవులకు ధరించిన మకరకుండలాల కాంతులు కలవాడు. ఇంతవాడు అంతవాడు అని చెప్పశక్యం కానివాడు. అన్ని దిక్కులలో పరాక్రమంతో ప్రకాశించేవాడు. ఏవేళలందు అయినా నైపుణ్యంతో సంచరించేవాడు. పట్టుకోడం నేర్చుకుంటే తప్ప లొంగనివాడు.”

తెభా-10.1-1588-వ.
అని మఱియు నితర లక్షణంబులుం జెప్పిన విని, సరకుజేయక.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; ఇతర = మిగిలిన; లక్షణంబులున్ = లక్షణములను; చెప్పినన్ = తెలియజెప్పగా; విని = విని; సరకుజేయక = లక్ష్యపెట్టకుండ.
భావము:- అని ఇంకా ఎంతో వివరంగా వర్ణించి నారదుడు శ్రీకృష్ణుని లక్షణాలు చెప్పాడు. వినిన కాలయవనుడు లెక్కచేయకుండా ఇలా అన్నాడు.

తెభా-10.1-1589-ఉ.
యావుఁ డెంతవాఁడు ప్రళయాంతకుఁడైన నెదిర్చె నేనియుం
గానఁ బోర మత్కలహ ర్కశ బాహుధనుర్విముక్త నా
నా దృఢ హేమపుంఖ కఠిజ్వలదస్త్ర పరంపరా సము
ద్పాదిత వహ్నికీలముల స్మము చేసెదఁ దాపసోత్తమా!”

టీక:- యాదవుడు = కృష్ణుడు; ఎంత = ఎంతమాత్రపు; వాడు = వాడు; ప్రళయ = ప్రళయకాలపు; అంతకుడు = యముడు; ఐనన్ = అయినను; నెదిర్చెనేనియున్ = ఎదిరించిన పక్షమున; కాదు = కాదు; అనన్ = అనను; పోరన్ = యుద్ధము నందు; మత్ = నా యొక్క; కలహ = యుద్ధము నందు; కర్కశ = కఠినము లైన; బాహు = చేతులచే; ధనుః = ధనుస్సునుండి; విముక్త = వదలబడిన; నానా = అనేకములైన; దృఢ = గట్టివి యైన; హేమ = బంగారపు; పుంఖ = పింజలచేత; కఠిన = కఠోరములైన; జ్వలత్ = వెలుగుచున్న; అస్త్ర = అస్త్రముల; పరంపరా = సమూహములచే; సముద్పాదిత = పుట్టిన; వహ్ని = నిప్పు; కీలముల = శిఖలతో; భస్మము = బూడిద; చేసెదన్ = చేసెదను; తాపస = ముని; ఉత్తమ = శ్రేష్ఠుడా.
భావము:- “ఓ మునిశ్రేష్ఠుడా! నారదా! యాదవుడు నా ముందు ఎంతటి వాడు. నేను ప్రళయకాలయముడు అయినా సరే ఎదిరిస్తానంటే కాదనను. కదనరంగంలో కఠినమైన నా చేతులు ప్రయోగించే బంగారు పింజలు కల అనేక రకాల గట్టి నిశితాస్త్ర పరంపరలకు జనించే అగ్నిజ్వాలలతో అతడిని బూడిద చేసేస్తాను.”