పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కాలయవనుడు నీరగుట


తెభా-10.1-1638-ఆ.
నుచు యవనుఁ డట్టహాసంబు గావించి
టుల కఠిన కులిశ దృశమైన
పాదమెత్తి తన్నెఁ బాఱి తద్దేహంబు
గగుహం బ్రతిస్వనంబు నిగుడ.

టీక:- అనుచున్ = అని; యవనుడు = కాలయనుడు; అట్టహాసంబున్ = బిగ్గరగానవ్వుటను; కావించి = చేసి; చటుల = వడిగల; కఠిన = గట్టి; కులిశ = వజ్రాయుధము; సదృశము = వంటిది; ఐన = అగు; పాదమున్ = కాలిని; ఎత్తి = ఎత్తి; తన్నెన్ = తన్నెను; పాఱి = పరుగెటుకొని వెళ్ళి; తత్ = ఆ యొక్క; దేహంబున్ = శరీరమును; నగ = కొండ; గుహన్ = గుహ; ప్రతిస్వనంబు = మారుమ్రోగుట, ప్రతిధ్వని; నిగుడన్ = విజృంభించగా.
భావము:- అంటూ కాలయవనుడు అట్టహాసంగా నవ్వి, పరుగెట్టుకొని వెళ్ళి, ఎగిరి, కర్కశమైన వజ్రాయుధంవంటి తన కాలితో ఆ నిద్రపోతున్న పురుషుడిని తన్నాడు. ఆ తన్నుకు పర్వతగుహ అంతా మారుమ్రోగిపోయింది

తెభా-10.1-1639-ఉ.
న్నిన లేచి నీల్గి కనుమ్ములు మెల్లన విచ్చి లోపలన్
న్నపు గిన్క వర్ధిల దిల్గని దృష్టి సమిద్ధ విగ్రహో
త్పన్న మహాగ్నికీలముల స్మముచేసె నతండు సాయక
చ్ఛిన్నవిరోధికంఠవను శ్రీభవనున్ యవనున్ లఘుక్రియన్.

టీక:- తన్నినన్ = తన్నుటచేత; లేచి = నిద్రలేచి; నీల్గి = ఒళ్ళువిరుచుకొని; కను = కళ్ళు అనెడి; తమ్ములున్ = పద్మములను; మెల్లనన్ = మెల్లిగా; విచ్చి = తెరచికొని; లోపలన్ = మనసు లోపల; సన్నపు = చిన్నగా; కిన్క = కినుక, కోపము; వర్థిల్లన్ = పెరుగుతుండగా; దిశల్ = నలుదిక్కులకు; కని = చూసి; దృష్టి = చూపులందు; సమిద్ధ = మిక్కిలి తేజరిల్లుతున్న్; విగ్రహ = అసహనముచేత; ఉత్పన్న = కలిగిన; మహా = గొప్ప; అగ్ని = నిప్పు; కీలములన్ = మంటలచేత; భస్మము = బూడిద; చేసెన్ = చేసెను; అతండు = అతను; సాయక = బాణములచే; ఛిన్న = భేదింపబడిన; విరోధి = శత్రువుల; కంఠ = కంఠములు అను; వనునన్ = వనము కలవానిని; శ్రీభవనున్ = కాలయవనుని {శ్రీభవనుడు - సంపదలకు నిలయమైన వాడు, కాలయవనుడు}; యవనున్ = కాలయవనుని; లఘు = సుళువైన; క్రియన్ = విధముగ.
భావము:- అలా యవనుడు తన్నడంతోనే నిద్రలేచిన ఆ పురుషుడు ఒళ్ళువిరుచుకుంటూ, పద్మాలవంటి కన్నులువిచ్చి, పొటమరించిన కోపం వృద్ధిపొందగా. నాలుగు మూలలా చూసాడు. తన చూపులలో మహోగ్రమైన ఆగ్రహంవలన జనించిన మహాగ్ని జ్వాలలతో ఆయన, శత్రువుల కుత్తుకలనే అడవులను తన కత్తితో ఛేదించినవాడూ, సంపదలకు నిలయమైనవాడూ అయిన కాలయవనుడిని అలవోకగా బూడిద చేసేసాడు.

తెభా-10.1-1640-వ.
ఇట్లేక క్షణమాత్రంబున యవనుండు నీఱయ్యె” ననిన విని రాజు యిట్లనియె.
టీక:- ఇట్లు = ఇలా; ఏక = ఒకే యొక; క్షణ = క్షణప్రమాణకాలము; మాత్రంబునన్ = మాత్రములోనే; యవనుండు = కాలయవనుడు; నీఱయ్యెను = బూడిద; అయ్యెను = అయ్యెను; అనినన్ = అనగా; విని = విని; రాజు = పరీక్షిత్తు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అలా ఒక్క క్షణకాలంలో యవనుడు భస్మ మైపోయాడు” అని శుకమహర్షి చెప్పగా వినిన పరీక్షిన్నరేంద్రుడు ఇలా అన్నాడు.

తెభా-10.1-1641-ఆ.
"వ్వఁడాతఁ డతని కెవ్వండు దండ్రి? ఘో
రాద్రిగుహకు నేటి తఁడు వచ్చి
నిద్రపోయె? యవను నిటు గాల్ప నెట్లోపెఁ?
దెలియఁ బలుకు నాకు ధీవరేణ్య!"

టీక:- ఎవ్వడు = ఎవరు; ఆతడు = అతను; ఆతని = అతని; కిన్ = కి; ఎవ్వండు = ఎవరు; తండ్రి = నాన్న; ఘోర = భయంకరమైన; అద్రి = కొండ; గుహ = గుహ; కున్ = కు; ఏటికన్ = ఎందుకని; అతండు = అతను; వచ్చి = చేరి; నిద్రపోయెన్ = నిద్రించెను; యవనునన్ = కాలయవనుని; ఇటు = ఇలా; కాల్పన్ = కాల్చివేయుటకు; ఎట్లు = ఏ విధముగా; ఓపెన్ = చేయగలిగెను; తెలియన్ = తెలియునట్లు; పలుకు = చెప్పుము; నా = నా; కున్ = కు; ధీవరేణ్య = ప్రజ్ఞచేత శ్రేష్ఠుడా.
భావము:- “బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా! శుకా! ఆ పురుషుడు ఎవరు? అతని తండ్రి ఎవరు? అలా భయంకరమైన గుహలోకి వచ్చి అత డెందుకు నిద్రపోయాడు? అతడు కాలయవనుడిని ఎలా కాల్చివేయగలిగాడు? ఈ విషయ మంతా నాకు తెలిసేలా విశదీకరించు.”

తెభా-10.1-1642-వ.
అనినం బరీక్షిన్నరేంద్రునకు నతికుతూహలంబుతో శుకయోగివర్యుం డిట్లనియె “నిక్ష్వాకు కులసంభవుండు మాంధాత కొడుకు ముచికుందు డను రాజు, రాక్షసభీతులైన వేల్పులం బెద్దగాలంబు సంరక్షించిన; మెచ్చి వా రమరలోక రక్షకుండైన యా రాజకుమారుని కడకుం జేరి వరంబు వేఁడు మనిన; వారలం గనుంగొని మోక్షపదం బడిగిన; వార లతని కిట్లనిరి.
టీక:- అనినన్ = అనగా; పరీక్షిత్ = పరీక్షిత్తు అనెడి; నరేంద్రున్ = మహారాజు; కున్ = కి; అతి = మిక్కిలి; కుతూహలంబు = కౌతుకము; తోన్ = తోటి; శుక = శుకుడు అనెడి; యోగి = మునులలో; వరేణ్యుండు = శ్రేష్ఠుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ఇక్ష్వాకు = ఇక్ష్వాకుని; కుల = వంశమందు; సంభవుండు = పుట్టినవాడు; మాంధాత్రు = మాంధాత యొక్క; కొడుకు = పుత్రుడు; ముచికుందుండు = ముచికుందుడు; అను = అనెడి; రాజు = రాజు; రాక్షస = రాక్షసులవలన; భీతులు = భయపడినవారు; ఐన = అయిన; వేల్పులన్ = దేవతలను; పెద్దకాలంబు = చాలా కాలముపాటు; సంరక్షించినన్ = కాపాడగా; మెచ్చి = మెచ్చుకొని; వారు = వారు; అమర = దేవతలను; రక్షకుండు = కాపాడినవాడు; ఐన = అయిన; ఆ = ఆ ప్రసిద్ధుడైన; రాజకుమారుని = రాకుమారుడిని; కడ = వద్ద; కున్ = కు; చేరి = చేరి; వరంబున్ = వరమును; వేడుము = కోరుకొనుము; అనినన్ = అనగా; వారలన్ = వారని; కనుంగొని = చూసి; మోక్షపదంబున్ = ముక్తిమార్గమును; అడిగినన్ = కోరుకొనగా; వారలు = వారు; అతని = అతని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని ఇలా ప్రశ్నించిన మహారాజు పరీక్షిత్తుకు మిక్కిలి ఆసక్తి పూర్వకంగా యోగిపుంగవుడైన శుకుడు ఇలా చెప్పసాగాడు. “ఆ పురుషుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మాంధాత యొక్క పుత్రుడు. ముచుకుందుడు అనే మహారాజు. అతడు అసురులకు భయపడిన దేవతలను బహుకాలం సంరక్షించాడు. దేవలోకాన్ని కాపాడిన ఆ రాకుమారుడిని మెచ్చుకుని దేవతలు అతనిని ఏదైనా వరము కోరుకోమన్నారు. అతడు మోక్షమును కోరగా దేవతలు అతనితో ఇలా అన్నారు.

తెభా-10.1-1643-మ.
"తిన్ నిర్గతకంటకం బయిన రాజ్యంబున్ విసర్జించి శూ
ణాగ్రేసర! పెద్దకాలము మమున్ క్షించి; తీలోన నీ
గువల్ మంత్రులు బంధులున్ సుతులు సంబంధుల్ భువిన్లేరు కా
తిం జెందిరి; కాల మెవ్వరికి దుర్లంఘ్యంబు దా నారయన్.

టీక:- జగతిన్ = భూమిపైన; నిర్గత = పోయిన; కంటకంబు = శత్రువులు కలది; అయిన = అగు; రాజ్యంబున్ = రాజ్యమును {రాజ్యము - 1స్వామి 2అమాత్య 3సుహృత్త్ 4కోశ 5రాష్ట్ర 6దుర్గ 7బలంబులు అనెడి సప్తాంగములు కలది}; విసర్జించి = వదలిపెట్టి; శూర = మహావీరులు; గణ = అందరిలోను; అగ్రేసర = గొప్పవాడా; పెద్దకాలము = చాలాకాలముపాటు; మమున్ = మమ్ములను; రక్షించితి = కాపాడితివి; ఈలోనన్ = ఈ సమయము నందు; నీ = నీ యొక్క; మగువలు = స్త్రీలు, భార్యలు; మంత్రులు = సచివులు; బంధులున్ = చుట్టములు; సుతులున్ = కొడుకులు; సంబంధులు = నీకు చెందినవారు; భువిన్ = భూమిపైన; లేరు = లేరు; కాలగతిన్ = మరణమును; చెందిరి = పొందిరి; కాలము = కాలప్రభావము; ఎవ్వరి = ఎవరి; కిన్ = కైనను; దుర్లంఘ్యంబు = దాటరానిది; తాన్ = అది; ఆరయన్ = తరచిచూసినచో.
భావము:- “ఓ వీరాగ్రేసరా! ముచికుందా! మానవలోకంలో శత్రువులే లేని నీ రాజ్యాన్ని వదలి వచ్చి, చిరకాలం మమ్మల్ని సంరక్షిస్తూ ఇక్కడే ఉండిపోయావు. ఈ లోపల నీ పత్నులు, స్నేహితులు, చుట్టాలు, కుమారులు నీకు సంబంధించిన వారు అందరూ భూమిని విడిచారు. వారంతా మరణించారు. ఎంతటి వారైనా కాలప్రభావాన్ని గడవలేరు కదా!

తెభా-10.1-1644-క.
కాము ప్రబలురకును బలి
కాలాత్ముం డీశ్వరుం డణ్యుఁడు జనులం
గావశులఁగాఁ జేయును
గాముఁ గడవంగలేరు ను లెవ్వారున్.

టీక:- కాలము = కాలము; ప్రబలురకునున్ = మిక్కిలి బలము గలవారి కంటె; బలి = బలము కలది; కాలాత్ముండు = కాలస్వరూపుడు; ఈశ్వరుండు = భగవంతుడు; అగణ్యుడు = ఈశ్వరుడు {అగణ్యుడు - ఇట్టివాడని ఎంచుటకు వాక్కుచేత కాని మనస్సుచేత కాని శక్యముకానివాడు, భగవంతుడు}; జనులన్ = ప్రజలను; కాల = కాలమునకు; వశులన్ = అధీనమైన వారు; కాన్ = అగునట్లు; చేయును = చేయును; కాలమున్ = కాలమును; గడవంగలేరు = దాటలేరు; ఘనులు = గొప్పవారు; ఎవ్వారున్ = ఎవరుకూడ.
భావము:- కాలం మహాబలవంతుల కంటే బలమయినది. భగవంతుడే కాలస్వరూపుడు. అతడు ఇలాంటి వాడని నిరూపించటం సాధ్యం కాదు. అతడు జనులను కాలానికి లోబరుస్తాడు. ఎంతటి గొప్పవారయినా కాలాన్ని దాటలేరు.

తెభా-10.1-1645-క.
మిచ్చెద మర్థింపుము
ణీశ్వర! మోక్షపదవి క్కను మే మె
వ్వమును విభులము గా మీ
శ్వరుఁ డగు హరి దక్క మోక్షసంగతిఁ జేయన్."

టీక:- వరము = కోరిక సాఫల్యమును; ఇచ్చెదము = ఇచ్చెదము; అర్థింపుము = కోరుకొనుము; ధరణీశ్వర = రాజా {ధరణీశ్వరుడు - రాజ్యమునకు ప్రభువు,రాజు}; మోక్షపదవిన్ = మోక్షము పొందుటను; తక్కను = తప్పించి; మేము = మేము; ఎవ్వరమును = ఎవరము కూడ; విభులము = అంతటి ప్రభువులము; కాము = కాము; ఈశ్వరుండు = భగవంతుడు; అగు = ఐన; హరి = విష్ణుమూర్తి; తక్కన్ = తప్పించి; మోక్ష = ముక్తిని; సంగతిన్ = చెందునట్లు; చేయన్ = చేయుటకు.
భావము:- ఓ ముచికుంద మహారాజా! కైవల్యం తప్ప మరి ఏ వరమైనా సరే కోరుకో, ఇస్తాము. భగవంతుడు విష్ణువుకి తప్ప మోక్షము ఇవ్వడానికి మాకు ఎవరికీ అధికారం లేదు.”

తెభా-10.1-1646-వ.
అని పలికిన దేవతలకు, నమస్కరించి ముచికుందుఁడు నిద్రఁ గోరి దేవదత్త నిద్రావశుండయ్యి పర్వతగుహాంతరాళంబున శయనించి యుండె; యవనుండు నీఱయిన పిమ్మట హరి ముచికుందుని ముందఱ నిల్చిన.
టీక:- అని = ఇట్లు; పలికినన్ = చెప్పగా; దేవతల్ = దేవతల; కున్ = కు; నమస్కరించి = నమస్కారము చేసి; ముచికుందుడు = ముచికుందుడు; నిద్రన్ = నిద్రపోవుటను; కోరి = కోరుకొని; దేవ = దేవతలచే; దత్త = ఇవ్వబడిన; నిద్రా = నిద్రకు; వశుండు = అధీనమైనవాడు; అయ్యి = ఐ; పర్వతగుహ = కొండగుహ; అంతరాళంబునన్ = లోపల; శయనించి = పడుకొని; ఉండెన్ = ఉండెను; యవనుండు = కాలయవనుడు; నీఱు = బూడిద; అయిన = ఐన; పిమ్మట = తరువాత; హరి = కృష్ణుడు; ముచికుందుని = ముచికుందును; ముందఱ = ఎదుట; నిల్చినన్ = నిలబడగా.
భావము:- ఇలా చెప్పిన దేవతలకు అభివాదం చేసి ముచుకుందుడు నిద్రను కోరుకున్నాడు. దేవతలు ఇచ్చిన నిద్రకు లోబడి, అతడు కొండగుహలోపల ఇంత కాలమూ పండుకొని ఉన్నాడు. కాలయవనుడు భస్మమైన పిదప శ్రీకృష్ణుడు ముకుందుని ఎదుట నిలబడి సాక్షాత్కారం ఇవ్వగా.....

తెభా-10.1-1647-సీ.
నరుహలోచను వైజయంతీదామ-
శోభితు రాకేందు సుందరాస్యు
కరకుండలకాంతి హితగండస్థలుఁ-
గౌస్తుభగ్రైవేయు నశరీరు
శ్రీవత్సలాంఛనాంచితవక్షు మృగరాజ-
ధ్యుఁ జతుర్భాహు మందహాసుఁ
గాంచన సన్నిభ కౌశేయవాసు గాం-
భీర్య సౌందర్య శోభితుఁ బ్రసన్ను

తెభా-10.1-1647.1-ఆ.
మ్మహాత్ముఁ జూచి యాశ్చర్యమును బొంది
న్మనోజ్ఞదీప్తిఁ నకుఁ జూడ
లవిగాక చకితుఁడై యెట్టకేలకుఁ
లికెఁ బ్రీతి నవనిపాలకుండు.

టీక:- వనరుహలోచనున్ = పద్మాక్షుని, కృష్ణుని; వైజయంతీదామ = వైజయతీమాలచేత; శోభితున్ = శోభిల్లుతున్నవానిని; రాక = నిండు పున్నమినాటి; ఇందు = చంద్రుని వంటి; సుందర = అందమైన; ఆస్యున్ = ముఖము కలవానిని; మకరకుండల = మొసలిరూపుచెవిపోగుల; కాంతి = ప్రకాశముచేత; మహిత = మేలువహించిన; గండస్థలున్ = చెక్కిలిప్రదేశము కలవాని; కౌస్తుభ = కౌస్తుభమణిగల; గ్రైవేయున్ = కంఠహారముగలవానిని; ఘన = మేఘవర్ణపు; శరీరున్ = దేహముగల వానిని; శ్రీవత్స = శ్రీవత్సమను; లాంఛన = పుట్టుమచ్చచే; అంచిత = ఒప్పుచున్న; వక్షున్ = వక్షస్థలముగల వానిని; మృగరాజ = సింహము వంటి; మధ్యున్ = నడుము కలవానిని; చతుః = నాలుగు; బాహున్ = చేతులు కలవానిని; మందహాసున్ = చిరునవ్వు కలవానిని; కాంచన = బంగారమును; సన్నిభ = పోలిన; కౌశేయ = పట్టుబట్ట; వాసున్ = ధరించినవానిని; గాంభీర్య = గాంభీర్యముచేత; సౌందర్య = అందముచేత; శోభితున్ = ప్రకాశించువానిని; ప్రసన్నున్ = అనుగ్రహించువానిని; ఆ = ఆ యొక్క; మహాత్మునిన్ = గొప్పఆత్మ కలవానిని; చూచి = చూసి;
ఆశ్చర్యమును = ఆశ్చర్యమును; పొంది = పొంది; తత్ = అతని; మనోజ్ఞ = మనోహరమైన; దీప్తిన్ = తేజస్సును; తన = తన; కిన్ = కు; చూడన్ = చూచుటకు; అలవిగాక = శక్యముకాక; చకితుడు = నిశ్చేష్ఠుడు; ఐ = అయ్యి; ఎట్టకేలకున్ = చిట్టచివరకి; పలికెన్ = చెప్పెను; ప్రీతిన్ = ఇష్టపూర్తిగా; అవనిపాలకుండు = రాజు;
భావము:- కలువల వంటి కన్నుల కలవాడు; వైజయంతి అనే వనమాలతో విలసిల్లువాడు; పున్నమి నాటి చంద్రబింబం వంటి అందమైన మోము కలవాడు; మకరకుండలాల కాంతితో నిండిన చెక్కిళ్ళు కలవాడు; కౌస్తుభమణితో అలంకరింపబడిన వక్షస్థలము కలవాడు; మేఘవర్ణపు దేహం కలవాడు; శ్రీవత్సము అనే పుట్టుమచ్చతో ఒప్పుతున్న ఉరం కలవాడు; సింహం నడుము వంటి నడుము కలవాడు; నాలుగు చేతులతో అలరారువాడు; చిరునవ్వులు చిందించువాడు; పసిడివన్నె పట్టుబట్టలు కట్టుకున్నవాడు; నిండు సౌందర్యంతో విలసిల్లువాడు; ప్రసన్నుడు అయిన ఆ మహానుభావుడిని ముచుకుంద మహారాజు చూసి ఆశ్చర్యపోయాడు. నారాయణుడి మనోహరమైన కాంతి చూడడానికి తనకి అలవి కాక పోవడంతో అతడు సంభ్రమం చెంది, చివరికి ప్రీతితో ఇలా అన్నాడు.

తెభా-10.1-1648-మ.
"శివో? యింద్రుఁడవో? విభావసుఁడవో? చండప్రభారాశివో?
శిచూడామణివో? పితామహుఁడవో? క్రాంకహస్తుండవో?
దిలున్ భూమియు మిన్ను నిండె నిదె నీ తేజంబుఁ జూడంగ దు
ర్వ; మెవ్వండ విటేల వచ్చి తిచటన్ ర్తించె దేకాకివై.

టీక:- శశివో = చంద్రుడవా {శశి - శశము (కుందేలు) బింబమున కలవాడు, చంద్రుడు}; ఇంద్రుడవో = ఇంద్రుడవా; విభావసుడవో = సూర్యుడవా {విభావసుడు - విశేషమైన కాంతియే ధనముగ కలవాడు, సూర్యుడు}; చండప్రభారాశివో = అగ్నిదేవుడవా {చండప్రభారాశి - తీవ్రమైన కాంతుల సమూహము కలవాడు, అగ్ని}; శశిచూడామణివో = పరమశివుడవా {శశి చూడామణి - శశి (చంద్రుడు) చూడామణిగా (శిరోమణిగా) కలవాడు, శివుడు}; పితామహుడవో = బ్రహ్మదేవుడవా {పితామహుడు - అందరి తండ్రులను పుట్టించినవాడు, బ్రహ్మ}; చక్రాంకహస్తుండవో = విష్ణుమూర్తివా {చక్రాంక హస్తుడు - చక్రాయుధము చేతి యందు ధరించు వాడు, విష్ణువు}; దిశలున్ = దిక్కులందు; భూమియున్ = నేలను; మిన్నున్ = ఆకాశమును; నిండెన్ = నిండిపోయినది; ఇదె = ఇదిగో; నీ = నీ యొక్క; తేజంబున్ = తేజస్సును; చూడంగన్ = చూచుటకు; దుర్వశము = శక్యముకానిది; ఎవ్వెడవు = ఎవరివి; ఇటు = ఈ పక్కకి; ఏల = ఎందుకు; వచ్చితివి = వచ్చావు; ఇటన్ = ఇక్కడ; వర్తించెదు = మెలగెదవు; ఏకాకివి = ఒంటరివాడవు; ఐ = అయ్యి.
భావము:- “అయ్యా! నీవు చంద్రుడివో? మహేంద్రుడివో? అగ్నిదేవుడివో? సూర్యుడివో? చంద్రశేఖరుడివో? బ్రహ్మదేవుడివో? చక్రపాణివో? తెలియడం లేదు. దిక్కులూ భూమ్యాకాశములూ సర్వం నిండిన, నీ ప్రకాశం పరికించడానికి చూడ శక్యము కావటం లేదు. నీవు ఎవడవు? ఇక్కడకి ఎందుకు వచ్చావు? ఎందుకు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు?

తెభా-10.1-1649-క.
డవి విషమకంటక
భూయిష్ఠము ఘోరసత్వపుం జాలభ్యం
బో! య్య! యెట్లు వచ్చితి?
నీ డుగులు కమలపత్ర నిభములు సూడన్.

టీక:- ఈ = ఈ యొక్క; అడవి = అడవి; విషమ = మిట్టపల్లాలు కలిగి; కంటక = ముళ్లుచేత; భూయిష్టము = నిండి ఉన్నది; ఘోర = భయంకర మైన; సత్వ = జంతువుల; పుంజ = సమూహములచేత; అలభ్యంబు = పొందరానిది; ఓ = ఓయి; అయ్య = తండ్రీ; ఎట్లు = ఎలా; వచ్చితి = రాగలిగితివి; నీ = నీ యొక్క; అడుగులు = పాదములు; కమల = తామర; పత్ర = ఆకుల; నిభములు = వంటివి; చూడన్ = చూడబోతే.
భావము:- ఈ అడవి చూస్తే మిట్టపల్లాలతో, ముళ్ళతో నిండి ఉంది. భయంకర జంతుజాలం వల్ల దుర్గమంగా ఉంది. నీ అరికాళ్ళు చూస్తే పద్మపత్రాల మాదిరి ఉన్నాయి. ఇక్కడకి ఎలా నడచి వచ్చావు?

తెభా-10.1-1650-వ.
మహాత్మ! యేను నీకు శుశ్రూషణంబుజేయం గోరెద నీ జన్మగోత్రంబు లెఱింగింప నే నర్హుండనైన నెఱింగింపు; నే నిక్ష్వాకువంశ సంభవుండను; మాంధాతృ నందనుండను; ముచికుందుం డనువాఁడ; దేవహితార్థంబు చిరకాల జాగరశ్రాంతుండనై నిద్ర నొంది యింద్రియ సంచారంబులు మఱచి.
టీక:- మహాత్మా = గొప్ప ఆత్మగలవాడా; ఏను = నేను; నీ = నీ; కున్ = కు; శుశ్రూషణంబు = సేవ; చేయన్ = చేయవలెనని; కోరెదన్ = ఆశించుచున్నాను; నీ = నీ యొక్క; జన్మ = పుట్టుక; గోత్రంబులున్ = వంశమును; ఎఱిగింపన్ = తెలుపుటకు; నేన్ = నేను; అర్హుండను = తగినవాడను; ఐనన్ = అయినచో; ఎఱింగింపుము = తెలుపుము; నేను = నేను; ఇక్ష్వాకు = ఇక్ష్వాకుని; వంశ = వంశము నందు; సంభవుండను = పుట్టినవాడను; మాంధాత్రు = మాంధాత యొక్క; నందనుండను = పుత్రుడను; ముచికుందుండు = ముచికుందుడు; అనువాడన్ = అను పేరుగల వాడను; దేవ = దేవతలకు; హిత = మేలు కలిగించుట; అర్థంబున్ = కోసము; చిర = చాలా; కాల = కాలము పాటు; జాగర = మెళుకువగా ఉండుటచే; శ్రాంతుండను = బడలిక చెందినవాడను; ఐ = అయ్యి; నిద్రన్ = నిద్రను; ఒంది = పొంది; ఇంద్రియ = ఇంద్రియముల {ఇంద్రియ సంచారములు - వినుట చూచుట మొదలైనవి, ఇంద్రియ విషయములు}; సంచారంబులు = వ్యాపారములు; మఱచి = లేకుండా.
భావము:- ఓ మహానుభావా! నీ కులం గోత్రం నాకు తెలియదు. కాని నీకు సేవ చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. నేను వినదగ్గ వాడిని అనిపిస్తే చెప్పు. నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వాడను. మాంధాత పుత్రుడిని. నా పేరు ముచుకుందుడు అంటారు. దేవతల మేలు చేయడం కోసం ఎంతోకాలం మేలుకుని ఉండటంతో బడలిక చెందాను. నిద్రలో మునిగి ఇంద్రియ వ్యాపారాలు మరచి.....

తెభా-10.1-1651-శా.
నిద్రించుచు నుండ నొక్క మనుజుం డేతెంచి దుష్కర్ముఁడై
తా నీఱై చెడె నాత్మకిల్బిషమునన్ ర్పోగ్రుడై; యంతటన్
శ్రీనాథాకృతివైన నిన్నుఁ గని వీక్షింపన్నశక్తుండనై
దీత్వంబునుఁ జెందితిన్ ననుఁ గృపాదృష్టిన్ విలోకింపవే."

టీక:- ఏన్ = నేను; నిద్రించుచున్ = నిద్రపోతూ; ఉండన్ = ఉండగా; ఒక్క = ఒకానొక; మనుజుండు = మానవుడు; ఏతెంచి = వచ్చి; దుష్కర్ముడు = చెడ్డపని చేసినవాడు; ఐ = అయ్యి; తాన్ = అతను; నీఱు = బూడిద; ఐ = అయిపోయి; చెడెన్ = చనిపోయెను; ఆత్మ = స్వంత; కిల్బిష = పాపము అనెడి; దావాగ్ని = కార్చిచ్చు; చేన్ = చేత; దర్ప = గర్వంతో; ఉగ్రుడు = భయంకరుడు; ఐ = అయి; అంతటన్ = తరువాత; శ్రీనాథ = విష్ణుమూర్తి {శ్రీనాథుడు - శ్రీ (లక్ష్మీదేవి, సంపదలు)కు నాథుడు, విష్ణువు}; ఆకృతివి = స్వరూపము కలవాడవు; ఐన = అయినట్టి; నిన్నున్ = నిన్ను; కని = కనిగొని; వీక్షింపన్ = చక్కగా చూచుటకు; అశక్తుండను = చాలనివాడను; ఐ = అయ్యి; దీనత్వంబునన్ = దైన్యము; చెందితిన్ = పొందితిని; ననున్ = నన్ను; కృపా = దయగల; దృష్టిన్ = చూపుతో; విలోకింపవే = చూడుము.
భావము:- నేను నిద్రిస్తుండగా. ఎవడో మానవుడు ఒకడు వచ్చాడు. వాడు దుర్మార్గుడు. దారుణమైన గర్వం కల వాడు. వాడు తన పాపం వలన భస్మమై నశించాడు. తరువాత, శ్రీలక్ష్మీనాథ రూపుడవైన నిన్ను దర్శించాను. తేరిపార చూడ్డానికి అశక్తుడనై, దైన్యం పొందాను. నన్ను నీ దయగల చూపులతో చూసి కటాక్షించు.”

తెభా-10.1-1652-వ.
అనిన విని మేఘగంభీర భాషణంబుల హరి యిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; విని = విని; మేఘ = మేఘధ్వని(ఉరుము) వలె; గంభీర = గంభీరమైన; భాషణంబులన్ = పలుకులతో; హరి = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- ఇలా పలికిన ముచుకుందుని పలుకులు విని, మేఘగంభీర మైన కంఠంతో మాధవుడు ఇలా అన్నాడు.

తెభా-10.1-1653-సీ.
"భూరజంబులనైన భూనాథ! యెన్నంగఁ-
నుఁ గాని నా గుణ న్మ కర్మ
నామంబు లెల్ల నెన్నంగ నెవ్వరుఁ జాల-
దియేల; నాకును లవిగాదు
నేలకు వ్రేగైన నిఖిల రాక్షసులను-
నిర్జించి ధర్మంబు నిలువఁబెట్ట
బ్రహ్మచే మున్నునేఁ బ్రార్థింపఁబడి వసు-
దేవు నింటను వాసుదేవుఁ డనఁగ

తెభా-10.1-1653.1-ఆ.
రుణ నవతరించి కంసాఖ్యతో నున్న
కాలనేమిఁ జంపి లుల మఱియు
ద్రుంచుచున్నవాఁడఁ దొడరి నీ చూడ్కి నీ
ఱైనవాఁడు కాలవనుఁ డనఘ!

టీక:- భూరజంబు = భూమిమీది ఇసుక రేణువులను; ఐనన్ = అయినప్పటికి; భూనాథ = రాజా; ఎన్నంగ = గణించుట; చనున్ = శక్యమగును; కాని = కాని; నా = నా యొక్క; గుణ = గుణములు {భగవంతుని గుణములు - సర్వజ్ఞత అకింత అజ్ఞాత్వాది గుణములు}; జన్మ = జన్మములు, అవతారములు {భగవంతుని జన్మములు - స్థావర జంగమ జీవులన్ని తనే కనుక అసంఖ్యాకంబులు}; కర్మ = అసంఖ్యాకమైన పనులు; నామంబులు = అసంఖ్యాకమైన పేర్లు {నామములు - గుణాదులను వర్ణించుచు సంకేతముగా ఉండు పేర్లు, శ్రీరామ, గోవింద నారాయణ ఆదులు}; ఎల్లన్ = అన్నిటిని; ఎన్నంగన్ = గణించుటకు; ఎవ్వరున్ = ఎవరూ కూడ; చాలరు = సమర్థులు కారు; అదియేల = అంతెందుకు; నా = నా; కున్ = కు కూడా; అలవి = శక్యము; కాదు = కాదు; నేల = భూమండలమున; కున్ = కు; వ్రేగు = భారముగా; ఐన = తయారైన; నిఖిల = సమస్తమైన; రాక్షసులను = రాక్షసులను; నిర్జించి = చంపి; ధర్మంబున్ = వర్ణాశ్రమధర్మములను; నిలువబెట్టన్ = ఉద్ధరించుటకు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; చేన్ = చేత; మున్ను = పూర్వము; నేన్ = నేను; ప్రార్థింపబడి = వేడుకొనబడి; వసుదేవుని = వసుదేవు యొక్క; ఇంటన్ = ఇంటిలో; వాసుదేవుడు = వాసుదేవుడు {వాసుదేవుడు – వసుదేవుని కొడుకు, కృష్ణుడు, వసువులే (సంపదలే) తానైన దేవుడు, సర్వదేహము లందు అంతరాత్మగా వసించెడి వాడు, విష్ణువు}; అనగన్ = అనుపేరుతో; కరుణన్ = దయతో; అవతరించి = పుట్టి, (తానే దిగివచ్చి).
కంస = కంసుడు అను; ఆఖ్య = పేరు; తోన్ = తోటి; ఉన్న = ఉన్నట్టి; కాలనేమి = కాలనేమి అనురాక్షసుని; చంపి = సంహరించి; ఖలులన్ = దుష్టులను; మఱియున్ = ఇంకా ఉన్న వారిని; త్రుంచుచున్నవాడన్ = చంపుతున్నవాడను; తొడరి = పూని; నీ = నీ యొక్క; చూడ్కి = చూపుల వలన; నీఱు = బూడిద; ఐన = అయిపోయిన; వాడు = అతడు; కాలయవనుడు = కాలయవనుడు; అనఘ = పుణ్యుడా {అనఘుడు - పాపము లేనివాడు, పుణ్యాత్ముడు}.
భావము:- “ఓ రాజేంద్రా! భూమ్మీద ఉన్న దుమ్మురేణువులను అయినా లెక్కించడం సాధ్యమ అవుతుందేమో కాని, నాకు గల గుణములు, జన్మములు, కర్మములు, నామములు అన్నిటిని ఇన్ని అని ఎవరూ గణించ లేరు. ఇంత ఎందుకు నాకు కూడ సాధ్యం కాదు. భూదేవికి భారముగా అయిన రాక్షసులు అందరినీ జయించి, ధర్మాన్ని స్థాపించడం కోసం బ్రహ్మ పూర్వం నన్ను ప్రార్థించాడు. లోకానుగ్రహ కాంక్షతో నేను అంగీకరించి యదు వంశంలో వసుదేవుడి ఇంట అవతరించాను. వసుదేవ నందనుడిని కనుక నన్ను “వాసుదేవుడు” అంటారు. కంసనామంతో ఉన్న కాలనేమిని సంహరించాను. ఇంకా దుర్జనులను తునుమాడుతున్నాను. ఓ దోషరహితుడా! నీ చూపు తగిలి దగ్ధుడైనవాడు కాలయవనుడు.

తెభా-10.1-1654-వ.
వినుము; తొల్లియు నీవు నన్ను సేవించిన కతంబున నిన్ననుగ్రహింప నీ శైలగుహకు నేతెంచితి; నభీష్టంబులైన వరంబు లడుగు మిచ్చెద మద్భక్తులగు జనులు క్రమ్మఱ శోకంబున కర్హులు గా"రనిన హరికి ముచికుందుండు నమస్కరించి, నారాయణదేవుం డగుట యెఱింగి యిరువదియెనిమిదవ మహాయుగంబున నారాయణుం డవతరించు నని మున్ను గర్గుండు చెప్పుటఁ దలచి.
టీక:- వినుము = శ్రద్ధగా వినుము; తొల్లియున్ = ముందునుండి; నీవు = నీవు; నన్నున్ = నన్ను; సేవించిన = కొలిచిన; కతంబునన్ = కారణముచేత; నిన్నున్ = నిన్ను; అనుగ్రహింపన్ = అనుగ్రహించుటకోసము; ఈ = ఈ యొక్క; శైల = కొండ; గుహ = గుహ; కున్ = కు; ఏతెంచితి = వచ్చితిని; అభీష్టంబులు = మిక్కిలి ఇష్టమైనవి అగు; వరంబులున్ = కోరికలుతీరుటను; అడుగుము = కోరుకొనుము; ఇచ్చెదన్ = ఇచ్చెదను; మత్ = నా యొక్క; భక్తులు = భక్తులు; అగు = ఐన; జనులు = వారు; క్రమ్మఱన్ = మరల; శోకంబున్ = దుఃఖము పొందుట; కున్ = కు; అర్హులు = తగినవారు; కారు = కాదు; అనినన్ = అనగా; హరి = కృష్ణుని; కిన్ = కి; ముచికుందుండు = ముచికుందుడు; నమస్కరించి = నమస్కారము చేసి {నమస్కారము - న మహః (నేను నీకు ఇతరుడను కాను) అని తెలుపుకొను ప్రక్రియ, చేతులు జోడించుటాది}; నారాయణదేవుడు = ఇతనే విష్ణుమూర్తి {నారాయణుడు - నారం విజ్ఞానం తదయనమాశ్రయో యస్యసః నారాయణః, రిష్యతే క్షీయత యితరః రిజ్క్షయే ధాతుః సనభవతీతి నరః అవినాశ్యాత్మాః (వ్యుత్పత్తి)}; అగుటన్ = అయి ఉండుటను; ఎఱింగి = తెలిసికొని; ఇరువదియెనిమిదవ = ఇరవైయెనిమిదవ (28); మహాయుగంబునన్ = మహాయుగమునందు {మహాయుగము - ఒక చతుర్యుగపర్యంత కాలము (1కృతయుగము 1728000, 2త్రేత 1298000, 3ద్వాపర 864000 కలి 432000, మొత్తం 4320000 మానవ సంవత్సరముల కాలమునకు సమానము)}; నారాయణుండు = విష్ణుమూర్తి {నారాయణ - శ్లో. ఆపో నారా ఇతి ప్రోక్తాః ఆపోవై నరసూనవః, అయనంతస్యతా ప్రోక్తాః స్తేన నారాయణ స్మృత్యః. (విష్ణుపురాణము), నారాయణశబ్ద వాచ్యుడు, విష్ణువు}; అవతరించును = తన అంశతో పుట్టును; అని = అని; మున్ను = ఇంతకు పూర్వము; గర్గుండు = గర్గమహా ఋషి; చెప్పుట = తెలియజెప్పుట; తలచి = జ్ఞప్తితెచ్చుకొని, స్మరించి.
భావము:- పూర్వం నీవు నన్ను ఆరాధించావు ఆ కారణం చేత నిన్ను అనుగ్రహించడం కోసం ఈ పర్వతగుహకు వచ్చాను. నీ కిష్టమైన వరాలు అడుగు ఇస్తాను. నా భక్తులైనవారు ఇక శోకం పొందుటకు తగరు.” అని శ్రీకృష్ణభగవానుడు చెప్పాడు. ముచుకుందుడు నందనందనుడికి నమస్కరించి, అతడు సాక్షాత్తు నారాయణుడని తెలిసి ఇరువైయెనిమిదవ మహాయుగంలో భూమిపై విష్ణువు అవతరిస్తాడని తొల్లి గర్గాచార్యులు చెప్పిన మాట జ్ఞప్తికి తెచ్చుకుని ఇలా అన్నాడు.