పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/లక్షణ ద్రౌపదీ సంభాషణంబు

లక్షణ ద్రౌపదీ సంభాషణంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/లక్షణ ద్రౌపదీ సంభాషణంబు)
రచయిత: పోతన


తెభా-10.2-1082-వ.
అట్టియెడఁ గృష్ణకథావిశేషంబులు పరితోషంబున నుగ్గడించుచుఁ బ్రసంగ వశంబున నా రుక్మిణీదేవి మొదలగు శ్రీకృష్ణుభార్యలం గనుంగొని పాంచాలి యిట్లనియె. “మిమ్ముఁ బుండరీకాక్షుండు వివాహంబయిన తెఱంగులు వినిపింపుఁడన వారును దమ పరిణయంబుల తెఱంగులు మున్ను నే నీకుం జెప్పిన విధంబున వినిపించి; రందు సవిస్తరంబుగాఁ దెలియం బలుకని మద్రరాజకన్యకా వృత్తాంతం బా మానిని పాంచాలికిం జెప్పిన విధంబు విను మని శుకుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె.
టీక:- అట్టి = అటువంటి; ఎడన్ = సమయము నందు; కృష్ణ = కృష్ణుని; కథా = వర్తన; విశేషంబులున్ = విశేషములను; పరితోషంబుననున్ = సంతోషముతో; ఉగ్గడించుచున్ = చెప్పుకొనుచు; ప్రసంగ = ప్రస్తావన; వశంబునన్ = వశముచేత; ఆ = ఆ; రుక్మిణీదేవి = రుక్మిణీదేవి; మొదలగు = మున్నగు; శ్రీకృష్ణు = శ్రీకృష్ణుని; భార్యలన్ = భార్యలను; కనుంగొని = చూసి; పాంచాలి = ద్రౌపది {పాంచాలి - పాంచాలదేశపు రాకుమారి, ద్రౌపది}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; మిమ్మున్ = మిమ్ములను; పుండరీకాక్షుండు = కృష్ణుడు; వివాహంబయిన = పెండ్లాడిన; తెఱంగులున్ = విధములు; వినిపింపుడు = చెప్పండి; అనన్ = అనగా; వారునున్ = వారు; తమ = వారివారి; పరిణయంబులన్ = పెళ్ళిళ్ళుకు చెందిన; తెఱంగులున్ = విధములను; మును = మునుపు; నేన్ = నేను; నీ = నీ; కున్ = కు; చెప్పిన = చెప్పినట్టి; విధంబునన్ = విధముగ; వినిపించిరి = చెప్పిరి; అందున్ = వాటిలో; సవిస్తరంబుగా = విశదముగా; తెలియన్ = తెలియునట్లు; పలుకని = చెప్పని; మద్రరాజకన్యక = లక్షణ యొక్క {మద్రరాజకన్యక - మద్రదేశపు రాకుమారి, లక్షణ}; వృత్తాంతంబు = వర్తమానము; ఆ = ఆ; మానిని = యువతి; పాంచాలి = ద్రౌపది; కిన్ = కి; చెప్పిన = తెలిపినట్టి; విధంబున్ = విధమును; వినుము = వినుము; అని = అని; శుకుండు = శుకుడు; పరీక్షిత్ = పరీక్షిత్తు; నరేంద్రున్ = మహారాజున; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఆ సమయంలో ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని గాథలను సంతోషంతో చెప్తూ ఉంది. అలా చెప్తూ రుక్మిణి మొదలైన అంతఃపుర కాంతలతో. “కలువకన్నుల కన్నయ్య మిమ్మల్ని కల్యాణమాడిన కబుర్ల వివరాలు అన్నీ చెప్పండి.” అని కోరింది. ఒక్క లక్షణ తప్ప తక్కిన శ్రీకృష్ణుని భార్యలు అందరి వివాహ వృత్తాంతాలను పరీక్షిత్తూ! ఇంతకు మునుపు నేను నీకు చెప్పి ఉన్నాను కదా. వారు ఆ వివరాలే ద్రౌపదికి చెప్పారు. మద్రదేశాధిపతి బృహత్సేనుడి పుత్రి లక్షణ తనను కృష్ణుడు పరిణయ మాడిన సన్నివేశాన్ని ద్రౌపదికి చెప్పిన వివరాలు చెప్తాను, వినుము.” అని శుకమహర్షి పరీక్షిత్తునకు చెప్పసాగాడు.

తెభా-10.2-1083-సీ.
పాంచాలితో మద్రతిసుత యిట్లను-
  "సంగీతవిద్యా విశారదుండు
నారదుచేతి వీణాస్వనకలిత మై-
ట్టి గోవింద కథామృతంబు
విలి యేఁ గ్రోలి చిత్తము దన్మయత్వంబు-
నొంది మోదించుచు నుండునంత
దుహితృవత్పలుఁడు మద్గురుఁడు దా నది విని-
దుపాయ మొక్కటి దిఁ దలంచి

తెభా-10.2-1083.1-తే.
దల నెబ్భంగి నైన గోరము గాక
వారి మధ్యములో నభివ్యాప్తి దోఁచు
త్స్యయంత్రంబు కల్పించి నుజు లెంత
వారి కై నను దివ్వ మోవంగరాని.

టీక:- పాంచాలి = ద్రౌపది; తోన్ = తోటి; మద్రపతిసుత = లక్షణ {మద్రపతిసుత - మద్రదేశ రాజు యొక్క పుత్రిక, లక్షణ}; ఇట్లు = ఈ విధముగ; అను = చెప్పెను; సంగీత = సంగీత; విద్యా = విద్య యందు; విశారదుండు = మిక్కిలి నేర్పరుడు; నారదు = నారదునియొక్క; చేతి = చేతిలోని; వీణ = మహతి అను వీణ {మహతి - నారదుని వీణ}; ఆస్వన = ధ్వనితో; కలితము = కూడిన; ఐనట్టి = అయిన; గోవింద = కృష్ణుని; కథా = కథ అనెడి; అమృతంబున్ = అమృతమునందు; తవిలి = ఆపేక్ష కలామెను ఐ; ఏన్ = నేను; క్రోలి = ఆస్వాదించి; చిత్తమున్ = మనస్సునందు; తన్మయత్వంబు = తన్మయత్వము; ఒంది = పొంది; మోదించుచున్ = సంతోషించుచు; ఉండున్ = ఉన్నట్టి; అంతన్ = సమయమునందు; దుహితృ = కూతురి ఎడల; వత్సలుండు = వాత్సల్యము కలవాడు; మత్ = నా యొక్క; గురుడు = తండ్రి; తాన్ = అతను; అది = ఆ విషయము; విని = విని; సత్ = మంచి; ఉపాయము = ఉపాయము; ఒక్కటి = ఒకదానిని; మదిన్ = మనసునందు; తలంచి = ఆలోచించి.
చదలన్ = ఆకాశమునందు; ఏ = ఎలాంటి; భంగిన్ = విధముగా నైనను; అగోచరము = కనబడనిది; కాకన్ = అగునట్లు; వారి = నీటి; మధ్యము = నడుమ; లోన్ = అందు; అభివ్యాప్తిన్ = ప్రతిఫలించుటచేత; తోచు = కనబడెడి; మత్స్యయంత్రంబున్ = మత్స్యయంత్రమును; కల్పించి = ఏర్పరచి; మనుజులు = మానవులు; ఎంత = ఎంతగొప్ప; వారి = వారల; కిన్ = కి; ఐననున్ = అయినప్పటికి; తివ్వన్ = ఇవతలికిలాగుటకు; మోవంగన్ = యత్నించుటకు; రాని = శక్యముకాని.
భావము:- “మద్ర రాజు పుత్రిక లక్షణ పాంచాల రాజు పుత్రి ద్రౌపదితో ఇలా అన్నది, “నారదుడు సంగీత విద్యలోనూ, తన మహతీ వీణాలాపనలలోనూ మహాపండితుడు. సతత గోవిందనామ పారాయణుడు. అట్టి మహతీ స్వన మాధుర్యంతో కూడిన నారదుడు చేసే ముకుందుని కధాసుథలు తనివితీరా గ్రోలి పరవశించేదానిని. కూతురుపై ఎంతో వాత్యల్యం గల వాడు నా తండ్రి, ఈ విషయం తెలిసి నా మనసు గ్రహించాడు. నా వివాహానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆకాశంలో కంటికి కానబడని విధంగా మత్స్యయంత్రాన్ని ఏర్పాటుచేసి, క్రింద ఉన్న నీటిలో అది ప్రతిబింబించేలాగ ఏర్పాటు చేయించాడు. ఎవరైనా సరే చేపను ఆ నీటిలోని ప్రతిబంబం ద్వారా తప్ప కనిపెట్ట లేరు.

తెభా-10.2-1084-తే.
నువుఁ బవిచండ నిష్ఠురాస్త్రంబు నచట
సంచితంబై న గంధపుష్పాక్షతలనుఁ
బూజగావించి యునిచి "యే పురుషుఁ డేని
నిద్ధబలమున నీ చాప మెక్కు వెట్టి.

టీక:- ధనువున్ = విల్లును; పవి = వజ్రాయుధమువలె; చండ = తీక్షణమైన; నిష్ఠుర = కఠినమైన; అస్త్రంబున్ = బాణమును; అచటన్ = అక్కడ; సంచితంబు = కూడినవి; ఐన = అయిన; గంధ = గంధము; పుష్ప = పూలు; అక్షతలును = అక్షింతలుతో; పూజ = పూజించుట; కావించి = చేయించి; ఉనిచి = ఉంచి; ఏ = ఏ; పురుషుడేని = మానవుడు అయినను; ఇద్ధ = ప్రసిద్ధమైన; బలమునన్ = బలముచేత; ఈ = ఈ; చాపము = వింటిని; ఎక్కుపెట్టి = నారినెక్కించి.
భావము:- ఒక విల్లూ, వజ్రాయుధానికి సాటివచ్చే ఒక గట్టి బాణాన్ని అక్కడ ఉంచి. గంథపుష్పాక్షతలతో పూజించాడు. “ఎవరైతే తన బలం ప్రదర్శించి ఈ విల్లు ఎక్కుపెట్టి...

తెభా-10.2-1085-క.
సాయకంబు నారిం
బోసి వెసన్ మత్స్యయంత్రమున్ ధరఁ గూలన్
వేసిన శౌర్యధురీణుఁడు
నా సుత వరియించు" నని జనంబులు వినఁగన్.

టీక:- ఈ = ఈ; సాయకంబున్ = బాణమును; నారిన్ = అల్లెతాటిని; పోసి = సంధించి; వెసన్ = వడితో; మత్స్యయంత్రమున్ = మత్స్యయంత్రముతో; ధరన్ = నేలమీద; కూలన్ = కూలిపోయినట్లు; వేసినన్ = కొట్టినట్లి; శౌర్య = శూరత్వపు; ధురీణుడు = వహించినవాడు; నా = నా; సుతన్ = కుమార్తెను; వరియించును = పెండ్లాడును; అని = అని; జనంబులు = ప్రజలందరు; వినగన్ = వినునట్లుగా.
భావము:- ఇదిగో ఈ బాణాన్ని వింటికి సంధించి, అదిగో ఆ మత్స్యయంత్రాన్ని పడగొడతాడో ఆ వీరుడినే నా పుత్రిక పరిణయమాడుతుంది.” అని అందరికి తెలిసేలా చాటింపు వేయించాడు.

తెభా-10.2-1086-క.
చాటించిన నవ్వార్తకుఁ
బాటించిన సంభ్రమముల బాణాసన మౌ
ర్వీ టంకార మహారవ
పాటితశాత్రవులు బాహుల సంపన్నుల్.

టీక:- చాటించిననన్ = చాటింపు వేయించగా; ఆ = ఆ; వార్త = వృత్తాంతమున; కున్ = కు; పాటించిన = కలిగినట్టి; సంభ్రమములన్ = త్వరత్వము కలవారై; బాణాసన = విండ్ల యొక్క; మౌర్వీ = నారి; టంకార = టం అను శబ్దముల; మహా = గట్టి; రవ = ధ్వని; పాటిత = చీల్చబడిన; శాత్రవులు = శత్రులు కలవారు; బాహుబల = భుజబలముచేత; సంపన్నుల్ = మిక్కుటముగా కలవారు.
భావము:- మా తండ్రి వేయించిన చాటింపును విలువిద్యలో ఆరితేరిన వీరులెందరో విన్నారు. వింటినారిని మ్రోగించడంలో మిన్నలు, మహా బాహుబల సంపన్నులు అయిన శాత్రవ వీరురెందరో విన్నారు.

తెభా-10.2-1087-క.
సుంరతనులు దదుత్సవ
సంర్శన కుతుకు లమిత సైన్యులు భూభృ
న్నంను లేతెంచిరి జన
నందితయశు లగుచు మద్రగరంబునకున్.

టీక:- సుందర = అందమైన; తనులున్ = దేహములు కలవారు; తత్ = ఆ; ఉత్సవ = వేడుకను; సందర్శన = చూచుట యందలి; కుతుకులు = కుతూహలము కలవారు; అమిత = మిక్కిలి; సైన్యులు = సేనలు కలవారు; భూభృన్నందనులు = రాకుమారులు; ఏతెంచిరి = వచ్చిరి; జన = జనులచేత; నందిత = కొనియాడబడిన; యశులు = కీర్తి గలవారు; అగుచున్ = ఔతు; మద్రనగరంబున్ = మద్రపట్టణము; కున్ = కు.
భావము:- సుందరాకారులైన ఆ రాజకుమారులు ఆ స్వయంవర ఉత్సవాన్ని తిలకించే కుతూహలంతో పెద్ద పెద్ద సైన్యాలతో మద్రనగరానికి వచ్చారు

తెభా-10.2-1088-క.
నుదెంచిన వారికి మ
జ్జకుఁడు వివిధార్చనములు మ్మతిఁ గావిం
చి నా బాహుబలాఢ్యులు
నువుం జేరంగ నరిగి ధైర్యస్ఫూర్తిన్.

టీక:- చనుదెంచిన = వచ్చిన; వారి = వారల; కిన్ = కి; మత్ = నా యొక్క; జనకుడు = తండ్రి; వివిధ = నానా విధమైన; అర్చనములు = సత్కారములు, పూజనములు; సమ్మతిన్ = ఇష్టముగా; కావించినన్ = చేయగా; ఆ = ఆ; బాహుబలా = భుజబలముచేత; ఆఢ్యులు = సంపన్నులు; ధనువున్ = వింటిని; చేరంగన్ = దగ్గరకు; అరిగి = వెళ్ళి; ధైర్య = ధైర్యము యొక్క; స్ఫూర్తిన్ = ప్రకాశముతో.
భావము:- అలా విచ్చేసిన వారందరికి మాతండ్రి సంతోషంతో స్వాగతం పలికి సత్కరించాడు. బాహుబలసంపన్ను లైన ఆ రాజపుత్రులు ధైర్యంతో ధనువును సమీపించారు.

తెభా-10.2-1089-వ.
ఇట్లు డగ్గఱి యద్ధనువుం గనుంగొని.
టీక:- ఇట్లు = ఈ విధముగ; డగ్గఱి = దగ్గరకుచేరి; ఆ = ఆ; ధనువున్ = విల్లును; కనుంగొని = చూసి.
భావము:- అలా ఆ ధనుస్సు దగ్గరకు వెళ్ళి చూసిన మహా వీరులు...

తెభా-10.2-1090-ఉ.
కొంఱు పూనలేక చనఁ గొందఱు పూని కదల్పలేక పోఁ,
గొం ఱొకింత యెత్త నొక కొందఱు మోపిడలేక దక్కఁగాఁ,
గొం ఱొకింత యెక్కిడుచుఁ గోరి నృపాలకు లిట్లు సిగ్గునుం
జెంది తలంగి పోవుచును "సీ! యిటకేఁగుట నీతి త"ప్పనన్.

టీక:- కొందఱు = కొంతమంది; పూనలేక = ప్రయత్నించలేక; చనన్ = వెళ్ళిపోగా; కొందఱున్ = కొంతమంది; పూని = ప్రయత్నించినను; కదల్చలేక = కదలింపలేక (విల్లును); పోన్ = వెళ్ళిపోగా; కొందఱు = కొంతమంది; ఒకింత = కొద్దిపాటి; ఎత్తన్ = ఎత్తగలుగగా; ఒక = మరి; కొందఱు = కొంతమంది; మోపు = వింటినారిని; ఇడలేక = ఎక్కుపెట్టలేక; తక్కగాన్ = తప్పుకొనగా; కొందఱున్ = కొంతమంది; ఒకింత = కొంచెము; ఎక్కిడుచున్ = ఎక్కించగలిగి; కోరి = ఆపేక్షించినను; నృపాలకులు = రాజులు; ఇట్లు = ఈ విధముగ; సిగ్గునున్ = సిగ్గు; చెంది = పడి; తలంగిపోవుచును = తొలగిపోతూ; ఛీ = ఛీ; ఇట = ఇక్కడ; కున్ = కు; ఏగుట = వెళ్ళుట; నీతి = క్రమము; తప్పు = తప్పుట; అనన్ = అనగా.
భావము:- అలా ముందుకు వచ్చినవారిలో కొందరు ప్రయత్నించ లేక వెనుదిరిగారు. మరికొందరు కొంత ప్రయత్నించినా కదలించలేకపోయారు. కొంతమందైతే ఎలాగో విల్లుని మీదికెత్తినా, దానికి నారిని కట్టలేకపోయారు. మరి కొందరు కష్టపడి నారిని కట్టినా బాణం కొద్దిగా తప్పించి ఎక్కుపెట్టలేక పోయారు. అలా వారందరూ విఫలులయ్యి సిగ్గుచెంది, ఇక్కడకి రావడమే తప్పయిందని తలచి సిగ్గుతో తప్పుకున్నారు.

తెభా-10.2-1091-వ.
అట్టియెడ.
టీక:- అట్టి = అటువంటి; ఎడన్ = సమయమునందు.
భావము:- ఆలా బృహద్ధనువును ఎవరూ ఎక్కుపెట్టలేకపోతున్న తరుణంలో...

తెభా-10.2-1092-క.
భీముఁడు రాధేయుఁడు ను
ద్దాగతిన్నెక్కు ద్రోఁచి గ నమ్మీనం
బేఱక దిరుగుచుంటయుఁ
దామేమియు నెఱుఁగలేక లఁగిన పిదపన్.

టీక:- భీముడున్ = భీముడు{భీముడు – భయంకరుడు, పంచపాండవులలో 2వ వాడు)}; రాధేయుడున్ = కర్ణుడు {రాధేయుడు - రాధపుత్రుడు, కర్ణుడు}; ఉద్దామ = అడ్డులేని; గతిన్ = రీతితో; ఎక్కుద్రోచి = ఎక్కుపెట్టి; తగన్ = తగినట్లు; ఆ = ఆ; మీనంబున్ = చేప; ఏమఱక = ఎడతెగక; తిరుగుటయన్ = తిరుగుచుండుట; తామున్ = వారు; ఏమియున్ = ఏమాత్రము; ఎఱుగలేక = భేదించుట తెలియలేక; తలగినన్ = తొలగిపోగా; పిదపన్ = పిమ్మట.
భావము:- భీముడూ, కర్ణుడూ మత్స్యయంత్రాన్ని పడగొట్టడానికి ధనుస్సు ఎక్కుపెట్టినా వేగంగా తిరుగుతున్న మత్స్యాన్ని ఎలా ఛేదించాలో తెలియక తొలగిపోయారు.

తెభా-10.2-1093-క.
రేంద్ర తనయుఁ డమ్మ
త్స్యము నేయ నుపాయ మెఱిఁగి గ నేసియు మీ
ము ద్రుంపలేక సిగ్గున
విముఖుండై చనియె నంత వికలుం డగుచున్.

టీక:- అమరేంద్రతనయుడు = అర్జునుడు {అమరేంద్ర తనయుడు - ఇంద్రుని పుత్రుడు, అర్జునుడు}; ఆ = ఆ యొక్క; మత్స్యయంత్రమున్ = మత్స్యయంత్రమును; ఏయు = కొట్టు; ఉపాయము = కిటుకు; ఎఱిగి = తెలిసి; తగన్ = చక్కగా; ఏసియున్ = బాణము వేసినను; మీనమున్ = చేపను; త్రుంపలేక = తెగవేయలేక; సిగ్గునన్ = సిగ్గుతో; విముఖుండు = వెనుదిరిగినవాడు; ఐ = అయ్యి; చనియెన్ = వెళ్ళిపోయెను; అంతన్ = అంతట; వికలుండు = మనసు వికల మైనవాడు; అగుచున్ = ఔతు.
భావము:- ఇంద్ర తనయుడు అర్జునుడు మత్స్యయంత్రాన్ని భేదించే ఉపాయం తెలిసినవాడే అయినా ఆ యంత్రాన్ని కొట్టలేక విఫలుడు అయి, సిగ్గుతో వికలమైన మనసుతో వెనుదిరిగాడు.

తెభా-10.2-1094-వ.
ఇట్లు సకల రాజకుమారులుం దమతమ ప్రయత్నంబులు విఫలంబులైన ముఖారవిందంబులు ముకుళించి దైన్యంబున విన్ననై చూచుచున్న యెడ.
టీక:- ఇట్లు = ఈ విధముగ; సకల = ఎల్ల; రాజకుమారులున్ = రాకుమారులు; తమతమ = వారివారి; ప్రయత్నంబులు = ప్రయత్నాలు; విఫలంబులు = వ్యర్థములు; ఐనన్ = కాగా; ముఖ = మోములు అను; అరవిందంబులు = పద్మములు; ముకుళించి = ముడుచుకొని; దైన్యంబునన్ = దీనత్వముతో; విన్నను = చిన్నబోయినవారు; ఐ = అయ్యి; చూచుచున్న = చూస్తున్న; ఎడన్ = సమయము నందు.
భావము:- ఇలా తమ ప్రయత్నాలు ఫలించలేకపోడంతో ముడుచుకున్న ముఖాలతో ఆ రాకుమారులు అందరూ దైన్యంతో చిన్నబోయి చూస్తూ ఉండగా...

తెభా-10.2-1095-చ.
సిజపత్త్రలోచనుఁడు చాపము సజ్యము సేసి యుల్లస
చ్ఛ మరిఁబోసి కార్ముకవిశారదుఁడై యలవోక వోలె ఖే
మగు మీనముం దునిమె త్వరతన్ సుర సిద్ధ సాధ్య ఖే
జయశబ్ద మొప్పఁ బెలుచం గురిసెం దివిఁ బుష్పవర్షముల్.

టీక:- సరసిజపత్రలోచనుడు = కృష్ణుడు {సరసిజపత్ర లోచనుడు - తామర రేకుల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; చాపమున్ = ధనుస్సును; సజ్యము = నారికట్టబడినదిగా; చేసి = చేసి; ఉల్లసత్ = ప్రకాశించుచున్న; శరమున్ = బాణమును; అరిబోసి = సంధించి; కార్ముక = ధనుర్విద్యయందు; విశారదుడు = మిక్కిలినేర్పుకలవాడు; ఐ = అయ్యి; అలవోకన్ = లీల; పోలెన్ = వలె; ఖేచరము = ఆకాశమున తిరుగునది; అగు = ఐన; మీనమున్ = చేపను; తునిమి = తెంచి; సత్ = మిక్కిలి; త్వరతన్ = వేగముతో; సుర = దేవతలు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; ఖేచర = ఆకాశగమనులు; జయ = జమముజయము అను; శబ్దము = శబ్దములు; ఒప్పన్ = కలుగగా; పెలుచన్ = విశేషముగా; కురిసెన్ = కురిపించిరి; దివిన్ = ఆకాశమునుండి; పుష్ప = పూల; వర్షముల్ = వానలను.
భావము:- పద్మాలవంటి కన్నులు ఉన్న అందగాడు శ్రీకృష్ణుడు ధనువు ఎత్తి నారిని కట్టాడు. ఉల్లాసంగా ఆ శరమును నారికి సంధించాడు. విలువిద్యావిశారదుడై, విల్లెక్కుపెట్టి బాణం ప్రయోగించి అలవోకగా మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు. దేవసిద్దసాధ్యాది ఖేచరుల జయజయ ధ్వానాలు ఎగసాయి. ఆకాశం నుండి పూలవాన కురిసింది.

తెభా-10.2-1096-వ.
అయ్యవసరంబున నేనుం బరితుష్టాంతరంగనై పరమానందవికచ వదనారవింద నగుచు,నిందిందిర సన్నిభంబులగు చికురబృందంబులు విలసదలిక ఫలకంబునం దళుకులొలుకు ఘర్మజల కణంబులం గరంగు మృగమద తిలకంపు టసలున మసలుకొనినం గరకిసలయంబున నోసరించుచు మిసమిస మను మెఱుంగుగములు గిఱికొన నెఱిగౌను వడవడ వడంక నప్పుడు మందగమనంబున.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు; నేనున్ = నేనుకూడ; పరితుష్ట = తృప్తిచెందిన; అంతరంగను = మనసు కలామెను; పరమ = మిక్కిలి; ఆనంద = ఆనందముతో; వికచ = వికసించిన; వదన = ముఖము అను; అరవిందన్ = పద్మము కలామెను; ఇందిందిర = తుమ్మెదలను; సన్నిభంబులు = పోలునవి; అగు = ఐన; చికుర = ముంగురుల; బృందంబులున్ = సమూహములు; విలసత్ = ప్రకాశించుచున్న; అలికఫలకంబునన్ = నొసటిపట్టె యందు; తళుకులు = మెరుపులు; ఒలుకు = వ్యాపించెడి; ఘర్మ = చెమట; జల = నీటి; కణంబులన్ = బిందువులను; కరంగు = కరగిపోవుచున్న; మృగమద = కస్తూరి; తిలకము = తిలకపు; అసలునన్ = ముద్దకు; మసలుకొనినన్ = అంటుకొనగా; కర = చేయి అను; కిసలయంబునన్ = చిగురులతో; ఓసరించుచున్ = తొలగించుచు; మిసమిస = మిసమిస; అను = అనెడి; మెఱుంగు = మెరుపుల; గములు = సమూహములు; గిఱికొనన్ = ఆవరింపగా; నెఱి = నిండైన; కౌను = నడుము; వడవడ = వడవడ అని; వడకన్ = వణుకుతుండగా; అప్పుడు = అప్పుడు; మంద = మెల్లని; గమనంబునన్ = నడకతో.
భావము:- అప్పుడు నాకు పరమానందం కలిగింది. ఒళ్ళంతా చెమర్చింది. చెమటకి తడిసి కరగిన నా నుదుటి కస్తూరితిలకంలో ముంగురులు అతుక్కున్నాయి. వాటిని నా మృదువైన చేతులతో సరిచేసుకుంటూ, మిసమిలలాడే నా సన్నని నడుము వడ వడ వణకుతుండగ, మందగమనంతో ముందుకు నడిచాను.

తెభా-10.2-1097-చ.
లితపదాబ్జ నూపురకధ్వనితో దరహాస చంద్రికా
లిత కపోలపాలికలఁ ప్పు సువర్ణవినూత్న రత్నకుం
రుచులొప్పఁ గంకణఝణంకృతు లింపెసలార రంగ భూ
మున కేగుదెంచి ముఖతామరసం బపు డెత్తి చూచుచున్.

టీక:- లలిత = మవోజ్ఞమైన; పద = పాదములు అను; అబ్జ = పద్మము లందలి; నూపుర = అందెల యొక్క; కలధ్వని = మధురధ్వని; తోన్ = తో; దరహాస = చిరునవ్వులను; చంద్రికా = వెన్నెలలతో; కలిత = కూడుకొన్న; కపోల = చెక్కిళ్ళ; పాలికలన్ = ప్రదేశము లందు; కప్పు = కమ్ముకొంటున్న; సువర్ణ = బంగారు; వినూత్న = సరికొత్త; రత్న = రత్నాల; కుండల = చెవిలోలకుల; రుచులు = కాంతులు; ఒప్పన్ = ఉండగా; కంకణ = చేతి కడియాల; ఝణంకృతులు = ఝణ అనుధ్వనులు; ఇంపు = మనోహరములై; ఎసలార = అతిశయించగా; రంగభూతలమున్ = రంగస్థలమున; కున్ = కు; ఏగుదెంచి = వచ్చి; ముఖ = మోము అను; తామరసంబున్ = పద్మమును; అపుడు = అప్పుడు; ఎత్తి = ఎత్తి; చూచుచున్ = చూస్తూ.
భావము:- అలా కదులుతుంటే కాలిఅందెలు ఘల్లు ఘల్లు మన్నాయి. పెదవులపై మందహాసం చిందులాడుతోంది. చెక్కుటద్దాలపై బంగారుకర్ణకుండలాల దీప్తులు మెరుస్తున్నాయి. మణికంకణాలు మధురంగా ధ్వనిస్తున్నాయి. అలా ఒయ్యారంగా రంగస్థలం మీదికి వెళ్ళి ముఖమెత్తి అటూ ఇటూ పరికించాను.

తెభా-10.2-1098-చ.
పతులం గనుంగొని మనంబున వారిఁ దృణీకరించి మ
త్కజలజాత దివ్యమణి కాంచనమాలిక నమ్మురారి కం
మున లీలమై నిడి పదంపడి నవ్య మధూకదామ మా
రికబరిం దగిల్చితి నయంబునఁ గన్నుల లజ్జ దేఱఁగన్.

టీక:- నరపతులన్ = రాజు లందరిని; కనుంగొని = చూసి; మనంబునన్ = మనస్సు నందు; వారిన్ = వారిని; తృణీకరించి = తిరస్కరించి; మత్ = నా యొక్క; కర = చేతులు అను; జలజాత = పద్మాలలోని; దివ్య = గొప్ప; మణి = రత్నాలు కల; కాంచన = బంగారు; మాలికన్ = దండను; ఆ = ఆ; మురారి = కృష్ణుని; కంధరమునన్ = మెడలో; లీలమై = విలాసముతో; ఇడి = వేసి; పదంపడి = పిమ్మట; నవ్య = కొత్త; మధూక = ఇప్పపూల; దామము = దండను {దండ దామము - దారమునందు గుచ్చి రెండు పక్కల కలపకుండా ఉండునది దామము, రెండు పక్కల కలిపేసినది దండ}; ఆ = ఆ; హరి = కృష్ణుని; కబరిన్ = కొప్పునందు; తగిల్చితిన్ = తురిమితిని; నయంబునన్ = చక్కగా; కన్నులన్ = కన్నులలో; లజ్జ = సిగ్గులు; తేఱగన్ = కనబడుచుండగా.
భావము:- రాజకుమారులను అందరినీ మనసులోనే తృణీకరించాను. నా చేతులలో ఉన్న దివ్యమైన మణులు పొదిగిన బంగారు హారాన్ని శ్రీకృష్ణుని మెడలో వేశాను. అలాగే నవ్య ఇప్పపూలదండతో ఆయన వక్షాన్ని అలంకరించాను. ఆ సమయాన నా కళ్ళల్లో సిగ్గు తొణికిసలాడింది.

తెభా-10.2-1099-వ.
అప్పుడు.
టీక:- అప్పుడు = ఆ సమయము నందు.
భావము:- అలా నేను శ్రీకృష్ణుని వరించిన శుభసమయంలో...

తెభా-10.2-1100-చ.
కొలఁదికి మీఱఁగా డమరు, గోముఖ, డిండిమ, మడ్డు, శంఖ, కా
ళ, మురళీ, మృదంగ, పణ, వానక, దుందుభి, ఢక్క, కాంస్య, మ
ర్దళ, మురజారజాది వివిధ్వను లేపున భూనభోంతరం
బులఁ జెలఁగెన్ నటీనటనముల్‌ దనరారె మనోహరాకృతిన్.

టీక:- కొలదికిమీఱగా = మితిమీరిన; డమరు = డమరుకము; గోముఖ = గోప రూప చర్మవాద్య విశేషము; డిండిమ = రాయిడిగిడిగిళ్ళు; మడ్డు = చర్మవాద్య విశేషము; శంఖ = శంఖము; కాహళ = బాకా; మురళీ = పిల్లనగ్రోవి; మృదంగ = మద్దెల విశేషము; పణవ = ఉడుక; ఆనక = నిస్సాణము; దుందుభి = భేరీ; ఢక్క = ఢక్క; కాంస్య = తాళములు; మర్దళ = మద్దెల విశేషము; మురజ = మద్దెల విశేషము; అరజ = మద్దెల విశేషము; ఆది = మున్నగు; వివిధ = నానా విధము లైనవాని; ధ్వనులు = శబ్దములు; ఏపునన్ = విజృంభణలతో; భూ = భూమి; నభః = ఆకాశముల; అంతరంబులన్ = మధ్యప్రదేశము లంతా; చెలగెన్ = మోగినవి; నటీ = నాట్యకత్తెల; నటనముల్ = నాట్యములు; తనరారెన్ = అతిశయించినవి; మనోహర = మనోజ్ఞమైన; ఆకృతిన్ = రీతిగా.
భావము:- డమరు, గోముఖ, డిండిమ, మడ్డు, శంఖ, బాకా, మురళీ, మృదంగ, పణ, ఆనక, భేరీ, ఢక్క, తాళములు, మద్దెల, మురజ, అరజ మున్నగు నానావిధ మంగళ వాద్యాలు దిక్కులు పిక్కటిల్లేలా అతిశయించి మ్రోగాయి. నటీమణుల నృత్యాలు కన్నులపండువు చేశాయి.

తెభా-10.2-1101-వ.
అంత.
టీక:- అంతన్ = పిమ్మట.
భావము:- అప్పుడు....

తెభా-10.2-1102-చ.
రగణంబుఁ దోలి యురగారి సుధాకలశంబుఁ గొన్న చం
మున సమస్తశత్రువసుధావర కోటిఁ దృణీకరించి య
క్కల విలోచనుండు ననుఁ గౌఁగిట నొప్పుఁగ జేర్చి సింహచం
క్రణ మెలర్పఁ గొంచుఁ జనెఁ గాంచనచారు రథంబుమీఁదికిన్.

టీక:- అమర = దేవతల; గణంబున్ = సమూహమును; తోలి = తఱిమి; ఉరగారి = గరుత్మంతుడు; సుధా = అమృతపు; కలశంబున్ = కలశమును; కొన్న = తీసుకొన్న; చందమునన్ = రీతిని; సమస్త = ఎల్ల; శత్రు = వైరి; వసుధావర = రాజుల; కోటిన్ = సమూహమును; తృణీకరించి = లెక్కచేయకుండ {తృణీకరించు - తృణముగా నెంచు, లెక్కచేయకుండు}; ఆ = ఆ; కమలవిలోచనుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; ననున్ = నన్ను; కౌగిటన్ = రెండు చేతుల నడుమ; ఒప్పుగన్ = చక్కగా; చేర్చి = పట్టుకొని; సింహచంక్రమణము = సింహపుగెంతు; ఎలర్పన్ = ఒప్పునట్లుగా; కొంచున్ = తీసుకుని; చనెన్ = వెళ్ళెను; కాంచన = బంగారు; చారు = అందమైన; రథంబు = తేరు; మీది = పై; కిన్ = కి.
భావము:- దేవతలను పారద్రోలి గరుత్మంతుడు అమృతకలశాన్ని హరించినట్లు, సమస్త శత్రురాజ సమూహాన్ని ధిక్కరించి శ్రీకృష్ణుడు నన్ను చేరదీసి కౌగలిలో చేర్చి పట్టుకుని సింహగమనంతో తన కాంచనరథం మీదకి చేర్చాడు.

తెభా-10.2-1103-వ.
అట్లు రథారోహణంబు సేసిన.
టీక:- అట్లు = అలా; రథా = రథమును; ఆరోహణంబు = ఎక్కుట; చేసినన్ = చేయగా.
భావము:- అలా మేము రథం ఎక్కగానే...

తెభా-10.2-1104-చ.
తుగచతుష్కమున్ విమతదుర్దమశూరతఁ బూన్చి దారుకుం
దము రొప్ప శత్రునికరాంధతమః పటలప్రచండ భా
స్కరుచి నొప్పునట్టి నిజకార్ముక యుక్తగుణప్రఘోష సం
రిత దిగంతరుం డగుచుఁ ద్మదళాక్షుడు వోవుచుండఁగన్!

టీక:- తురగ = గుఱ్ఱములను; చతుష్కమున్ = నాలుగింటిని; విమత = వైరుల; దుర్దమ = మట్టుపెట్టు; శూరతన్ = వీరత్వముతో; పూన్చి = కట్టి; దారుకుండు = దారుకుడు అను సారథి; అరదమున్ = రథమును; రొప్పన్ = తోలగా; శత్రు = శత్రువుల; నికర = సమూహము అను; అంధ = గుడ్డి; తమః = చీకట్ల; పటల = తెరలకు; ప్రచండ = మిక్కిలి తీక్షణమైన; భాస్కర = సూర్యుని; రుచిన్ = రీతిని; ఒప్పునట్టి = ఉన్నట్టి; నిజ = తన; కార్ముక = ధనుస్సున; యుక్త = కూడినట్టి; గుణ = తాడు యొక్క; ప్రఘోష = మోతతో; సంభరిత = మిక్కిలి నిండిపోయిన; దిక్ = దిక్కుల; అంతరుండు = నడుమలు కలవాడు; అగుచున్ = ఔతు; పద్మదళాక్షుడు = కృష్ణుడు; పోవుచుండగన్ = వెళ్ళిపోతుండగా.
భావము:- సారథి దారుకుడు శూరత్వం ప్రకటిస్తూ నాలుగు గుఱ్ఱాలను రొప్పుతు రథాన్ని ముందుకు పరుగెత్తించాడు. అప్పుడు శత్రురాజులనే కారుచీకట్లకు సూర్యకిరణాల వంటి తన ధనుష్టంకారాలు దిగంతాలలో ప్రతిధ్వనింప జేస్తూ కలువరేకుల వంటి కన్నులు కలిగిన శ్రీకృష్ణుడి రథం వేగంగా సాగిపోతుండగా....