పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ప్రద్యుమ్న జన్మంబు

ప్రద్యుమ్న జన్మంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ప్రద్యుమ్న జన్మంబు)
రచయిత: పోతన



తెభా-10.2-3-ఉ.
తారసాక్షునంశమున ర్పకుఁ డీశ్వరుకంటిమంటలం
దా మును దగ్ధుఁడై; పిదపఁ త్పరమేశుని దేహలబ్ధికై,
వేఱు నిష్ఠఁ జేసి, హరి వీర్యమునం బ్రభవించె రుక్మిణీ
కామిని గర్భమం దసురఖండను మాఱట మూర్తియో యనన్.

టీక:- తామరసాక్షున్ = విష్ణుమూర్తి యొక్క; అంశమునన్ = అంశతో; దర్పకుడు = మన్మథుడు; ఈశ్వరు = పరమశివుని; కంటి = కన్నులనుండి వెలువడిన; మంటలన్ = అగ్నివలన; తాన్ = తను; మును = ఇంతకుపూర్వము; దగ్ధుడు = దహింపబడినవాడు; ఐ = అయ్యి; పిదప = తరువాత; తత్ = ఆ; పరమేశుని = శివుని; దేహ = శరీరము; లబ్ధి = పొందుట; కై = కోసము; వేమఱు = అనేకమార్లు; నిష్ఠన్ = తపస్సు; చేసి = చేసి; హరి = కృష్ణుని; వీర్యమునన్ = వీర్యముచేత; ప్రభవించె = పుట్టెను; రుక్మిణీ = రుక్మిణీ; కామిని = దేవి; గర్భము = కడుపు; అందున్ = లో; అసురఖండను = కృష్ణుని {అసుర ఖండనుడు - అసురులను సంహరించు వాడు, కృష్ణుడు}; మాఱటమూర్తియో = ప్రతిబింబమేమో; అనన్ = అన్నట్లుగ.
భావము:- విష్ణుదేవుని కుమారుడైన మన్మథుడు పూర్వం పరమేశ్వరుని కంటిమంటలలో కాలిబూడిద అయిపోయి, తరువాత ఈశ్వరుణ్ణి తన దేహం కోసం ప్రార్థించి, రుక్మిణీ కృష్ణులకు, కృష్ణమూర్తి ప్రతిబింబమా అనిపించేలా ఉద్భవించాడు.

తెభా-10.2-4-వ.
అంత నా డింభకుండు ప్రద్యుమ్నుండను పేర విఖ్యాతుం డయ్యె; నా శిశువు సూతికాగృహంబునం దల్లి పొదిఁగిట నుండం, దనకు శత్రుండని యెఱింగి, శంబరుండను రాక్షసుండు దన మాయాబలంబునం గామరూపి యై వచ్చి, కొనిపోయి సముద్రంబులో వైచి, తన గృహంబునకుం జనియె; నంత నా శాబకుండు జలధిజలంబున దిగఁబడ నొడిసి యొక మహామీనంబు మ్రింగె; నందు.
టీక:- అంతన్ = అంతట; ఆ = ఆ యొక్క; డింభకుండు = బాలుడు; ప్రద్యుమ్నుండు = ప్రద్యుమ్నుడు {ప్రద్యుమ్నుడు - ప్రకర్షణేద్యుమ్నంద్రవిణం అన్యేతి ప్రద్యుమ్నః (వ్యుత్పత్తి), ప్రసిద్ధముగ ప్రజ్ఞాన మనెడి ధనము కలవాడు}; అను = అనెడి; పేరన్ = పేరుతో; విఖ్యాతుండు = ప్రసిద్ధి పొందినవాడు; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ; శిశువు = పిల్లవాడు; సూతికాగృహంబున్ = పురిటింటిలో; తల్లి = తల్లి యొక్క; పొదిగిటన్ = సందిటలో; ఉండన్ = ఉండగా; తన = అతని; కున్ = కి; శత్రుండు = శత్రువు; అని = అని; ఎఱింగి = తెలిసికొని; శంబరుండు = శంబరుడు; అను = అనెడి; రాక్షసుండు = రాక్షసుడు; తన = వాని; మాయా = మాయ యొక్క; బలంబునన్ = శక్తితో; కామరూపి = మాయారూపం కలవాడు; ఐ = అయ్యి; వచ్చి = వచ్చి; కొనిపోయి = తీసుకుపోయి; సముద్రంబు = సముద్రము, కడలి {సముద్రము - చంద్రోదయము వలన వృద్ధిపొందునది, కడలి}; లోన్ = అందు; వైచి = పడవేసి; తన = అతని యొక్క; గృహంబున = నివాసమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళిపోయెను; అంతన్ = అప్పుడు; ఆ = ఆ యొక్క; శాబకుండు = పిల్లవాడు; జలధి = సముద్రము {జలధి - జలమునకు నిధి, కడలి}; జలంబునన్ = నీటిలో; దిగబడన్ = మునిగిపోతుండగ; ఒడిసి = ఒడుపుగా పట్టుకొని; ఒక = ఒకానొక; మహా = పెద్ద; మీనంబు = చేప; మ్రింగెన్ = మింగివేసెను; అందున్ = అప్పుడు.
భావము:- ఆ బాలుడు “ప్రద్యుమ్నుడు” అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు. ఆ శిశువు తనకు శత్రువని తెలిసి, పురిటిగృహంలో తల్లి పొత్తిళ్ళలో ఉండగా శంబరుడనే రాక్షసుడు కామరూపంలో వచ్చి, ఆ బాలుణ్ణి తన మాయా శక్తితో అపహరించుకుని వెళ్ళి, సముద్రంలొ పడవేశి, తన ఇంటికి పోయాడు. ఆ బాలుడు సముద్రజలాలలో పడి మునగుతూ ఉండగా ఒక పెద్ద చేప అమాంతంగా అతణ్ణి మ్రింగివేసింది.

తెభా-10.2-5-క.
జాలిఁ బడి పాఱు జలచర
జాలంబులఁ బోవనీక, ని రోషాగ్ని
జ్వాలు నిగుడఁగ, నూరక
జాలంబులు వైచిపట్టు జాలరు లంతన్.

టీక:- జాలిబడి = దిగులు చెంది; పాఱు = పారిపోయెడి; జలచర = చేపల; జాలంబులన్ = సమూహములను; పోవనీక = పోనీయకుండ; చని = వెళ్ళి; రోష = కొపపు; అగ్నిజ్వాలలు = మంటలు; నిగుడన్ = అతిశయించగా; ఊరక = సందు విడువకుండ; జాలంబులున్ = వలలు; వైచి = వేసి; పట్టు = పట్టుకొనెడి; జాలరులు = చేపల వేటగాళ్ళు; అంతన్ = అప్పుడు.
భావము:- జాలరులు వెళ్ళి తమ కోపాగ్ని జ్వాలలు మించగా, సముద్రంలో వలల వేసి బెదిరి పోతున్న జలచరాలను అటునిటు పారిపోనీకుండా పట్టుకుంటున్నారు. వారు ఇంతలో....

తెభా-10.2-6-వ.
సముద్రంబులోన నా మీనంబును, దత్సహచరంబులైన మీనంబులనుం బట్టికొని తెచ్చి, శంబరునకుం గానికఁగా నిచ్చిన, నతండు “వండి తెండ”ని మహానస గృహంబునకుం బంచిన.
టీక:- సముద్రంబు = సముద్రము; లోనన్ = అందు; ఆ = ఆ యొక్క; మీనంబునున్ = చేప; తత్ = దానితో; సహచరంబులు = కూడ తిరిగెడివి; ఐన = అయిన; మీనంబులనున్ = చేపలను; పట్టికొని = పట్టుకొని; తెచ్చి = తీసుకువచ్చి; శంబరున్ = శంబరుని; కున్ = కి; కానికగాన్ = కానుకగా {కానిక, కానుక - రాజ దర్శనార్థము తెచ్చెడిది}; ఇచ్చినన్ = ఇవ్వగా; అతండు = అతను; వండి = వంటకముగ చేసి; తెండు = తీసుకు రండి; అని = అని; మహానసగృహంబు = వంట ఇంటి {మహానసము - అధికమైన నసము (వాసనలు) వచ్చునది, పాకస్థానము}; కున్ = కి; పంచినన్ = పంపించగా.
భావము:- ప్రద్యుమ్నుడిని మ్రింగిన పెనుచేపతోపాటు తిరుగుతున్న మరికొన్ని చేపలను కూడా పట్టుకున్నారు. వాటిని తీసుకువచ్చి శంబరునకు కానుకగా సమర్పించారు. శంబరుడు ఆ చేపలను వండితెమ్మని వంటశాలకు పంపాడు.

తెభా-10.2-7-క.
రాజునగరి యడబాలలు
రాజీవముకడుపు వ్రచ్చి, రాజనిభాస్యున్
రాశిశువుఁ గని, చెప్పిరి
రాజీవదళాక్షియైన తికి; నరేంద్రా!

టీక:- రాజు = రాజుగారి; నగరి = ఇంటి; అడబాలలు = వంటవారు; రాజీవము = చేప; కడుపు = కడుపు, గర్భము; వ్రచ్చి = చీల్చి; రాజ = చంద్రుని; నిభ = వంటి; ఆస్యునిన్ = ముఖము కలవానిని; రాజశిశువున్ = రాచబిడ్డను; కని = చూసి; చెప్పిరి = చెప్పారు; రాజీవ = తామర {రాజీవము - రాజును (చంద్రుని) అనుసరించి జీవించునది, పద్మము}; దళా = రేకులవంటి; అక్షి = కన్నులు కలామె; ఐన = అయిన; రతి = రతీదేవి; కిన్ = కి; నరేంద్రా = రాజా {నరేంద్రుడు - నరులకు ప్రభువు, రాజు}.
భావము:- వంటవారు ఆ చేప కడుపు కోయగా చంద్రబింబంతో సమానమైన ముఖంతో విలసిల్లుతున్న బాలుడు కనిపించాడు. వారు ఈ విషయాన్ని రతీదేవికి విన్నవించారు.

తెభా-10.2-8-వ.
అంత నారదుండు వచ్చి, బాలకుని జన్మంబును, శంబరోద్యోగంబును, మీనోదరప్రవేశంబునుం జెప్పిన విని, యా రతి మాయావతి యను పేర శంబరునియింట బాతివ్రత్యంబు సలుపుచు, దహన దగ్ధుండయిన తన పెనిమిటి శరీర ధారణంబు సేయుట కెదురు చూచుచున్నది గావున; నయ్యర్భకుండు దర్పకుండని తెలిసి, మెల్లన పుత్రార్థినియైన తెఱంగున శంబరుని యనుమతి వడసి, సూపకారుల యొద్ద నున్న పాపనిం దెచ్చి పోషించుచుండె; నా కుమారుండును శీఘ్రకాలంబున నారూఢ యౌవనుండై.
టీక:- అంతన్ = ఆ సమయము నందు; నారదుండు = నారదుడు; వచ్చి = వచ్చి; బాలకుని = పిల్లవాని యొక్క; జన్మంబును = పుట్టుక; శంబర = శంబరుడు; ఉద్యోగంబును = చేసిన పని; మీన = చేప; ఉదర = కడుపులో; ప్రవేశంబునున్ = చేరుట; చెప్పినన్ = చెప్పగా; విని = విని; ఆ = ఆ యొక్క; రతి = రతీదేవి; మాయావతి = మాయావతి; అను = అనెడి; పేరన్ = పేరుతో; శంబరుని = శంబరాసురుని; ఇంటన్ = ఇంటిలో; పాతివ్రత్యంబున్ = పతివ్రతాధర్మము; సలుపుచు = జరుపుచు; దహన = అగ్ని చేత; దగ్ధుండు = కాలిపోయినవాడు; అయిన = ఐన; తన = తన యొక్క; పెనిమిటి = భర్త; శరీర = దేహము (ఇంకొకటి); ధారణంబు = ధరించుట; చేయుట = చేయుట; కున్ = కు; ఎదురుచూచున్నయది = ఎదురు చూస్తున్నది; కావున = కాబట్టి; ఆ = ఆ యొక్క; అర్భకుండు = పిల్లవాడు; దర్పకుండు = మన్మథుడు; అని = అని; తెలిసి = తెలిసికొని; మెల్లన = అల్లన; పుత్ర = పిల్లలు; అర్థిని = కోరునామె; ఐన = అయిన; తెఱంగునన్ = విధముగ; శంబరుని = శంబరాసురుని; అనుమతి = అంగీకారము; పడసి = పొంది; సూపకారుల = వంటవారి; ఒద్దన్ = దగ్గర; ఉన్న = ఉన్నట్టి; పాపనిన్ = శిశువును; తెచ్చి = తీసుకువచ్చి; పోషించుచుండెన్ = పెంచుతుండెను; ఆ = ఆ; కుమారుండును = పిల్లవాడు; శీఘ్రకాలంబునన్ = తొందరలోనే; ఆరూఢ = ఎక్కిన; యౌవనుడు = యౌవనము కలవాడు; ఐ = అయ్యి.
భావము:- అంతకు ముందే నారదమహర్షి రతీదేవికి ఇలా రుక్మిణి కడుపున పుట్టే బాలుడి జన్మరహస్యం, వానిని నాశం చేయాలనే శంబరుడి ప్రయత్నం, ఆ శిశువును చేప మ్రింగడం అంతా చెప్పాడు. శంకరుడి కంటిమంటలకు ఆహుతి అయిపోయిన తన భర్త ఎప్పుడు సశరీరంగా సాక్షాత్కరిస్తాడా అని ఎదురు చూస్తూ శంబరుని గృహంలో మాయావతి అనే పేరుతో నీతిగా జీవిస్తున్న రతీదేవి ఆ బాలుడు మన్మథుడే అని తెలుసుకుంది. పుత్రార్థిని వలె శంబరుడి అనుమతితో, ఆ శిశు రూప మన్మథుడిని వంటవారి నుండి తీసుకుని పోషించసాగింది. ఆ బాలుడు శీఘ్రకాలంలోనే యౌవనవంతుడు అయ్యాడు

తెభా-10.2-9-క.
సుంర మగు తన రూపము
సుంరు లొకమాఱు దేఱి చూచినఁ జాలున్,
సౌంర్య మేమి చెప్పను?
బొందెద మని డాయు బుద్ధిఁ బుట్టించు; నృపా!

టీక:- సుందరము = అందమైనది; అగు = ఐన; తన = అతని; రూపము = స్వరూపము; సుందరులు = అందగత్తెలు; ఒకమారు = ఒకమాటైనా సరే; తేఱి = తేరిపార; చూచినన్ = చూసినచో; చాలును = చూలు; సౌందర్యము = అందము; ఏమి = ఏమని; చెప్పను = చెప్పాలి; పొందెదము = వీనిని కలసెదము; అని = అని; డాయు = దగ్గరకుచేరెడి; బుద్ధి = తలంపును; పుట్టించున్ = కలిగించును; నృపా = రాజా.
భావము:- ఓ పరీక్షన్మహారాజా! ప్రద్యుమ్నుడి చక్కదనం ఒక్కమాటు చూసిన సుందరీమణులకు అతనితో కామసౌఖ్యాలు అనుభవించాలనే కోరిక కలుగుతుంది. ఇక అతని సౌందర్యాన్ని వేరే వర్ణించడం ఎందుకు.

తెభా-10.2-10-సీ.
"క్కని వారల క్కఁ దనంబున-
కుపమింప నెవ్వండు యోగ్యుఁ డయ్యె?
మిక్కిలి తపమున మెఱయు నంబికకు నై-
శంకరు నెవ్వండు గము సేసె?
బ్రహ్మత్వమును బొంది, రఁగు విధాతను-
వాణికై యెవ్వఁడు వావి సెఱిచె?
వేయిడాఁగులతోడి విబుధ లోకేశుని-
మూర్తికి నెవ్వఁడు మూల మయ్యె?

తెభా-10.2-10.1-తే.
మునుల తాలిమి కెవ్వఁడు ముల్లు సూపు
గల మగువల నెవ్వండు రులుకొలుపు?
గుసుమధనువున నెవ్వండు గొను విజయము
చిగురువాలున నెవ్వండు సిక్కువఱుచు?"

టీక:- చక్కని = చక్కటి; వారల = వారియొక్క; చక్కదనంబున్ = అందమున; కున్ = కు; ఉపమింపన్ = పోలిక చెప్పుటకు; ఎవ్వండు = ఎవరు; యోగ్యుడు = తగినవాడు; అయ్యెన్ = అయి ఉండెను; మిక్కిలి = మిక్కుటమైన; తపమునన్ = తపస్సుచేత; మెఱయున్ = ప్రకాశించునట్టి; అంబిక = పార్వతీదేవి; కున్ = కు; ఐ = కోసము; శంకరున్ = శివుని; ఎవ్వండు = ఎవరు; సగముచేసెన్ = అర్థనారీశ్వరునిచేసెను {సగముచేసె - అర్థ దేహము కలవానిగా చేసెను, అర్థనారీశ్వరునిగ చేసెను}; బ్రహ్మత్వమునున్ = బ్రహ్మఅధికారస్థానము; పొంది = పొంది; పరగు = ప్రసిద్ధిపొందినవాడు; విధాతను = బ్రహ్మదేవుని; వాణి = సరస్వతీ దేవి; కై = కోసము; ఎవ్వడు = ఎవరు; వావి = వావివరుసలు; చెఱిచెన్ = చెడిపోవునట్లు చేసెను; వేయి = వెయ్యి; డాగుల = గుర్తులు, మరకలు; తోడి = తోటి; విబుధలోకేశుని = ఇంద్రుని {విబుధలోకేశుడు - దేవతల ప్రభువు, ఇంద్రుడు}; మూర్తి = ఆకారమున; కిన్ = కు; ఎవ్వడు = ఎవరు; మూలము = ముఖ్యకారణము; అయ్యెన్ = అయ్యెను; మునుల = ఋషుల యొక్క; తాలిమి = ధైర్యము; కిన్ = కి; ఎవ్వడు = ఎవరు; ముల్లుచూపున్ = బాధించునో; మగల = పురుషుల; మగువలన్ = స్త్రీలను; ఎవ్వండు = ఎవరు; మరులు = మోహములు; కొలుపున్ = కలిగించును; కుసుమ = పూల; ధనువున్ = విల్లుచేత; ఎవ్వండు = ఎవరు; కొను = పొందునో; విజయమున్ = గెలుచుటను; చిగురు = చిగురుటాకులనెడి; వాలున్ = కత్తితో; ఎవ్వండు = ఎవరు; చిక్కుపఱచు = చీకాకుపెట్టునో(లోకులను).
భావము:- “సౌందర్యవంతుల అందచందాలను వర్ణించేందుకు ఉపమానంగా చెప్పడానికి తగినవాడూ; తపోనిష్ఠతో విరాజిల్లే పరమేశ్వరుడిని పార్వతీదేవి కోసం అర్ధనారీశ్వరుణ్ణి చేసినవాడూ; బ్రహ్మతేజస్సుతో విలసిల్లే బ్రహ్మదేవుణ్ణి సరస్వతీదేవికోసం వావివరుసలు మరచిపోయేలా గావించినవాడూ; దేవేంద్రుని వేయికళ్ళ వేల్పుగా నిలిపినవాడూ; మునీంద్రుల ధైర్యాన్ని సైతం చెదరగొట్టగల వాడూ; స్త్రీపురుషుల కొకరిపై మరొకరికి ప్రేమభవం కల్గించేవాడూ; చెరకువింటితో ప్రపంచాన్ని జయించగలిగినవాడూ; చిగురుటాకు అనే బాకుతో లోకులను చీకాకుపరచి, చిక్కులపాలు చేసేవాడూ ఎవరంటే, ఈ మన్మథుడే అయిన ప్రద్యుమ్నుడే.”

తెభా-10.2-11-వ.
అని, తన్ను లోకులు వినుతించు ప్రభావంబులు గలిగి, పద్మదళలోచనుండును, బ్రలంబబాహుండును, జగన్మోహనాకారుండును నైన పంచబాణునిం గని లజ్జాహాస గర్భితంబు లైన చూపులం జూచుచు, మాయావతి సురత భ్రాంతిఁ జేసినం జూచి, ప్రద్యుమ్నుం డిట్లనియె.
టీక:- అని = అని; తన్నున్ = తనను; లోకులు = ప్రజలు; వినుతించు = పొగడెడి; ప్రభావంబులున్ = మహిమత్వములు; కలిగి = కలవాడై; పద్మ = పద్మముల; దళ = రేకులవంటి; లోచనుండును = కన్నులు కలవాడు; ప్రలంబ = మిక్కిలి పొడవుగా వ్రేలాడు; బాహుండును = చేతులు కలవాడు; జగత్ = లోకమునకు; మోహన = మోహము పుట్టించు నట్టి; ఆకారుండును = ఆకారము కలవాడు; ఐన = అయిన; పంచబాణుని = ప్రద్యుమ్నుని {పంచబాణుడు - 1ఉన్మాదన 2తాపన 3శోషణ 4స్తంభన 5సమ్మోహనములను ఐదు (5) బాణములు కలవాడు, 1అరవిందము 2అశోకము 3చూతము 4నవమల్లిక 5నీలోత్పలము అను ఐదు (5) పూలబాణములు కలవాడు, మన్మథుడు}; కని = చూసి; లజ్జా = సిగ్గుతో; హాస = నవ్వుతో; గర్భితంబులు = కూడినవి; ఐన = అయిన; చూపులన్ = చూపులతో; చూచుచున్ = చూస్తూ; మాయావతి = మాయావతి {మాయావతి - శంబరాసురుని యింట పాతివ్రత్యమును నడుపుతూ ఉన్న రతీదేవి}; సురత = క్రీడింపు; భ్రాంతిజేసినన్ = విలాసములు; చేసినన్ = చేయగా; చూచి = చూసి; ప్రద్యుమ్నుండు = ప్రద్యుమ్నుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;
భావము:- అని తనను జనులు స్తుతించే టంతటి ప్రభావం కలిగినవాడు ఆ ప్రద్యుమ్నుడు. తామరరేకుల వంటి నేత్రాలతో. ఆజానుబాహువులతో, ప్రపంచాన్ని సమ్మోహితం చేయగల ఆకార విశేషంతో అలరారే ఆ మన్మథుడిని మాయావతి సిగ్గుతో చిరునవ్వుతో కూడిన చూపులతో ఆకట్టుకోడానికి ప్రయత్నించింది. అప్పుడు ప్రద్యుమ్నుడు ఆమెతో ఇలా అన్నాడు.

తెభా-10.2-12-మత్త.
"నా నూభవుఁ డీతఁ డంచును, నాన యించుక లేక యో!
మా! నీ విది యేమి? నేఁ డిటు మాతృ భావము మాని సం
ప్రీతిఁ గామినిభంగిఁ జేసెదు పెక్కు విభ్రమముల్‌; మహా
ఖ్యా వృత్తికి నీకు ధర్మము గాదు మోహము సేయఁగాన్."

టీక:- నా = నా యొక్క; తనూభవుడు = కొడుకు {తనూభవుడు - దేహమున పుట్టినవాడు, కుమారుడు}; ఈతడు = వీడు; అంచును = అని; నాన = సిగ్గు; ఇంచుక = కొంచెమైనను; లేక = లేకుండ; ఓ = ఓ; మాత = తల్లీ; నీవు = నీవు; ఇది = ఇది; ఏమి = ఏమిటి; నేడు = ఇవాళ; ఇటు = ఇలా; మాతృభావము = తల్లిదనము; మాని = వదలి; సంప్రీతి = మిక్కిలి మక్కువతో; కామిని = కాముకురాలి; భంగిన్ = వలె; చేసెదు = చేయుచున్నావు; పెక్కు = అనేక; విభ్రమముల్ = విలాసపు చేష్టలు; మహా = మిక్కిలి; ఖ్యాత = శ్లాఘనీయమైన; వృత్తి = వర్తనక లామె; కిన్ = కు; నీవు = నీ; కున్ = కు; ధర్మము = తగిన పని; కాదు = కాదు; మోహము = వ్యామోహము; చేయగన్ = చూపుట.
భావము:- “ఓ తల్లీ! నేను నీ కుమారుడ ననే భావం లేక, సిగ్గు విడిచి కామినిలా ప్రవర్తిస్తూ విలాసములు చేస్తున్నావు. మాతృభావం వదలివేసావు. నీ విలా నన్ను మోహించుట ధర్మబద్ధమైన పని కాదు.”

తెభా-10.2-13-వ.
అనిన రతి యిట్లనియె; “నీవు నారాయణనందనుండ వైన కందర్పుండవు; పూర్వకాలంబున నేను నీకు భార్య నైన రతిని; నీవు శిశువై యుండునెడ నిర్దయుండై దొంగిలి, తల్లిం దొఱంగఁజేసి, శంబరుండు కొని వచ్చి, నిన్ను నీరధిలో వైచిన, నొక్క మీనంబు మ్రింగె; మీనోదరంబు వెడలి తీవు; మీఁదటి కార్య మాకర్ణింపుము.
టీక:- అనినన్ = అని పలుకగా; రతి = మాయాదేవి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; నీవు = నీవు; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; నందనుండవు = పుత్రుడవు; ఐన = అయిన; కందర్పుండవు = మన్మథుడవు {కందర్పుడు - కం (ఆనందముచేత) దర్పించువాడు (అతిశయించువాడు), మన్మథుడు}; పూర్వ = తొల్లిటి; కాలంబునన్ = కాలము నందు; నేను = నేను; నీవు = నీ; కున్ = కు; భార్యను = భార్యను; ఐన = అయిన; రతిని = రతీదేవిని; నీవు = నీవు; శిశువు = చంటిబిడ్డవు; ఐ = అయ్యి; ఉండున్ = ఉన్న; ఎడన్ = అప్పుడు; నిర్దయుండు = దయలేనివాడు; ఐ = అయ్యి; దొంగిలి = దొంగతనము చేసి; తల్లిన్ = నీ తల్లినుంచి; తొఱంగజేసి = తప్పించి; శంబరుండు = శంబరుడు; కొని = తీసుకొని; వచ్చి = వచ్చి; నిన్ను = నిన్ను; నీరధి = సముద్రము {నీరధి - నీరు కి నిధి, కడలి}; లోన్ = లోపల; వైచినన్ = పడవేయగా; ఒక్క = ఒకానొక; మీనంబు = చేప; మ్రింగెన్ = మింగెను; మీన = చేప; ఉదరంబు = కడుపునుండి; వెడలితి = బడటకి వచ్చితివి; ఈవు = నీవు; మీదటి = ఇకమీద చేయవలసిన; కార్యమున్ = పనిని; ఆకర్ణింపుము = వినుము.
భావము:- ఈలాగ పలికిన ప్రద్యుమ్నుడితో రతీదేవి ఇలా చెప్పింది. “నీవు విష్ణుమూర్తి పుత్రుడవైన మన్మథుడవు. పూర్వం నేను నీ భార్యనైన రతీదేవిని. నీవు శిశువుగా ఉండగా దయమాలిన శంబరుడు నిన్ను తల్లి నుండి తప్పించి తెచ్చి, సముద్రంలో పారేసాడు. అప్పుడు నిన్ను ఒక మీనం మ్రింగింది. ఆ చేప కడుపు నుండి నీవు బయట పడ్డావు. ఇక పైన ఏమి చేయవలెనో విను.

తెభా-10.2-14-క.
మాయావి వీఁడు; దుర్మతి
మాయఁడు సంగరములం; దర్త్యుల గెలుచున్;
మాయికరణమున వీనిన్
మాయింపుము, మోహనాది మాయలచేతన్.

టీక:- మాయావి = మాయలు కలవాడు; వీడు = ఇతడు; దుర్మతి = దుష్టబుద్ధి కలవాడు; మాయడు = చంపబడడు; సంగరములు = యుద్ధములు; అందున్ = లో; అమర్త్యులన్ = దేవతలను; గెలుచున్ = జయించును; మాయికరణమునన్ = మాయలు పన్నుటచేత; వీనిని = ఇతనిని; మాయింపుము = చంపుము; మోహనాది = మోహనము మున్నగు; మాయలన్ = విద్యల; చేతన్ = చేత.
భావము:- ఈ శంబరుడు దుర్మార్గుడు, మాయలమారి. దుష్టుడు యుద్ధాలలో మాయుల పన్ని దేవతలను ఓడిస్తుంటాడు. ఇతణ్ణి సమ్మోహనాది మాయలతో నీవు సంహరించు.

తెభా-10.2-15-మత్త.
పాకర్ముఁడు వీఁడు; నిన్నిఁటఁ ట్టి తెచ్చిన, లేచి "నా
పాపఁ డెక్కడఁ బోయెనో? సుతుఁ బాపితే విధి!"యంచుఁ దాఁ
గ్రేపుఁ బాసిన గోవు భంగిని ఖిన్నయై, పడి గాఢ సం
తాయై, నిను నోఁచి కాంచిన ల్లి కుయ్యిడ కుండునే?

టీక:- పాపకర్ముడు = పాపి; వీడు = ఇతడు; నిన్ను = నిన్ను; ఇటన్ = ఈ విధముగ; పట్టి = పట్టుకొని; తెచ్చిన = తీసుకురాగా; లేచి = నిద్రలేచి; నా = నా యొక్క; పాపడు = పిల్లవాడు; ఎక్కడ = ఎక్కడికి; పోయెనో = వెళ్లిపోయాడో; సుతున్ = కొడుకును; పాపితే = దూరము చేసితివి కదా; విధి = దైవమా; అంచున్ = అని; తాన్ = ఆమె; క్రేపు = దూడను; పాసిన = ఎడబాసిన; గోవు = ఆవు; భంగినిన్ = వలె; ఖిన్న = దుఃఖితురాలు; ఐ = అయ్యి; పడి = బాధపడి; గాఢ = తీవ్రమైన; తాప = సంతాపము కలది; ఐ = అయ్యి; నిను = నిన్ను; నోచి = ఎన్నో నోములు నోచి; కాంచిన = కనినట్టి; తల్లి = తల్లి; కుయ్యిడకన్ = మొఱపెట్టకుండా; ఉండునే = ఉండునా, ఉండదు.
భావము:- ఎన్నో నోములు నోచి నిను కన్న తల్లి పాపాత్ముడైన శంబరుడు నిన్ను అపహరించి తెచ్చిన తరువాత విలపించదా? లేగను బాసిన గోవు వలె “నా కుమారుడు ఏమయ్యాడో దేవుడా? నన్ను నా కుమారుడికి దూరం చేసావా?” అంటూ ఎంతగానో దుఃఖించి ఉండదా?”

తెభా-10.2-16-వ.
అని పలికి మాయావతి మహానుభావుండైన ప్రద్యుమ్నునికి సర్వ శత్రు మాయా వినాశిని యైన మహామాయ విద్య నుపదేశించె; నివ్విధంబున.
టీక:- అని = అని; పలికి = చెప్పి; మాయావతి = మాయావతి; మహానుభావుండు = గొప్పమహిమ కలవాడు; ఐన = అయిన; ప్రద్యుమ్నుని = ప్రద్యుమ్నుని; కిన్ = కి; సర్వ = ఎల్ల; శత్రు = పగవారి; మాయా = మాయలను; వినాశిని = నశింపజేసెడిది; ఐన = అగు; మహామాయ = మహామాయ అను; విద్యన్ = విద్యను; ఉపదేశించె = ఉపదేశించెను; ఈ = ఈ; విధంబునన్ = విధముగ;
భావము:- ఇలా వివరించి చెప్పి మాయావతి, మహానుభావుడైన ప్రద్యుమ్ముడికి సర్వశత్రుమాయలను మాయింపజేయగల మహామాయ అనే విద్యను ఉపదేశించింది.