పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కాశీరాజు వధ

కాశీరాజు వధ

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కాశీరాజు వధ)
రచయిత: పోతన


తెభా-10.2-524-చ.
వక కాశికావిభుని స్తక ముద్ధతిఁ ద్రుంచి బంతి కై
డి నది పింజ పింజ గఱవన్ విశిఖాళి నిగుడ్చి వాని యే
లెడి పురిలోన వైచె నవలీల మురాంతకుఁ డిట్లు వైరులం
డఁగి జయించి చిత్తమునఁ గౌతుకముం జిగురొత్త నత్తఱిన్.

టీక:- మడవక = వెనుదీయక; కాశికా = కాశీపట్టణపు; విభుని = రాజు యొక్క; మస్తకమున్ = తలను; ఉద్ధతిన్ = అతిశయముతో; త్రుంచి = తెగనరికి; బంతి = బంతి; కైవడిన్ = వలె; అది = దానిని; పింజపింజగఱవన్ = ఒకటి వెను కొకటి చొప్పున; విశిఖ = బాణములు; ఆళిన్ = పరంపరను; నిగుడ్చి = వేసి; వాని = అతను; ఏలెడి = పాలించెడి; పురి = పట్టణము; లోనన్ = అందు; వైచె = వేసెను; లీలన్ = విలాసముగా; మురాంతకుడు = కృష్ణుడు; ఇట్లు = ఇలా; వైరులన్ = శత్రువులను; కడగి = పూని; జయించి = గెలిచి; చిత్తమునన్ = మనసు నందు; కౌతుకము = కుతూహలము; చిగురొత్తన్ = కలుగగా; ఆ = ఆ; తఱిన్ = సమయము నందు.
భావము:- అటుపిమ్మట, కాశీరాజు శిరస్సును కూడా శ్రీకృష్ణుడు ఖండించి, ఆ శిరస్సును బంతిలాగ వరుస బాణాలతో పైపైకి ఎగురకొట్టి అతని పట్టణంలో పడేలా కొట్టాడు. ఈ విధంగా మురాంతకుడు శత్రువులను జయించి మనస్సులో ఎంతో ఉత్సాహం ఉప్పొంగగా ఆనందించాడు. అప్పుడు....

తెభా-10.2-525-క.
సు గంధర్వ నభశ్చర
రుడోరగ సిద్ధ సాధ్యణము నుతింపన్
లి చనుదెంచి హరి నిజ
పుమున సుఖముండె నతి విభూతి దలిర్పన్.

టీక:- సుర = దేవతల; గంధర్వ = గంధర్వుల; నభశ్చర = ఖేచరుల; గరుడ = గరుడుల; ఉరగ = నాగుల; సిద్ధ = సిద్ధుల; సాధ్య = సాధ్యుల; గణము = సమూహము; నుతింపన్ = స్తుతించగా; మరలి = వెనుదిరిగి; చనుదెంచి = వచ్చి; హరి = కృష్ణుడు; నిజ = తన; పురమునన్ = పట్టణము నందు; సుఖమునన్ = సౌఖ్యముగా; ఉండెన్ = ఉండెను; అతి = మిక్కిలి; విభూతి = వైభవము; తలిర్పన్ = అతిశయించగా.
భావము:- దేవ, గంధర్వ, సిద్ధ, సాధ్య, గరుడ, ఉరగ గణాలు వారందరూ స్తుతిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు మిక్కిలి వైభవంతో తన నగరానికి తిరిగి వచ్చి సుఖంగా కాలం గడుపుతున్నాడు

తెభా-10.2-526-క.
జోదరు చిహ్నంబులు
గొకొని ధరియించి పౌండ్రకుఁడు మచ్చరియై
వరతము హరి దన తలఁ
పునఁ దగులుటఁ జేసి ముక్తిఁ బొందె నరేంద్రా!

టీక:- వనజోదరు = కృష్ణుని {వనజోదరుడు - వనజము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; చిహ్నములు = గురుతులు; కొనకొని = పూని; ధరియించి = ధరించి; పౌండ్రకుడు = పౌండ్రకుడు; మచ్చరి = గర్వము కలవాడు; ఐ = అయ్యి; అనవరతము = ఎల్లప్పుడు; హరి = కృష్ణుడు; తన = తన యొక్క; తలపున = మనస్సులో; తగులుటన్ = లగ్నమై ఉండుట; చేసి = వలన; ముక్తిన్ = మోక్షమును; పొందెన్ = పొందెను; నరేంద్రా = రాజా.
భావము:- రాజా పరీక్షిత్తూ! పద్మనాభుడి చిహ్నాలు అన్నింటినీ పట్టుదలతో ధరించి అసూయాపరుడై నిరంతరం తన మనస్సులో శ్రీకృష్ణుడినే ధ్యానించడం వలన పౌండ్రకుడు మోక్షాన్ని పొందాడు.

తెభా-10.2-527-సీ.
క్కడఁ గాశిలో నా రాజు మందిరాం-
ణమునఁ గుండల లిత మగుచుఁ
డి యున్న తలఁ జూచి పౌరజనంబులు-
మ రాజు తలయ కాఁ గ నెఱింగి
చెప్పిన నా నృపు జీవితేశ్వరులును-
సుతులు బంధువులును హితులు గూడి
మొనసి హాహాకారమున నేడ్చి; రత్తఱిఁ-
త్తనూభవుఁడు సుక్షిణుండు

తెభా-10.2-527.1-తే.
వెలయఁ దండ్రికిఁ బరలోకవిధు లొనర్చి
నకు ననిలో వధించిన క్రపాణి
డరి మర్దింపఁ దగు నుపాయంబు దలఁచి
తురుఁ డగు నట్టి తన పురోహితునిఁ బిలిచి.

టీక:- అక్కడ = అక్కడ; కాశి = కాశీపట్టణము; లోన్ = అందు; ఆ = ఆ; రాజు = రాజు యొక్క; మందిర = ఇంటి; అంగణమునన్ = ముంగిలి అందు; కుండల = చెవికుండలములు; కలితము = కూడినది; అగుచున్ = ఔతు; పడి = పడిపోయి; ఉన్న = ఉన్నట్టి; తలన్ = తలను; చూచి = చూసి; పౌరజనులున్ = ప్రజలు; తమ = వారి; రాజు = రాజు యొక్క; తలయ = శిరస్సే; కాన్ = అయ్యి ఉండుట; ఎఱింగి = తెలిసికొని; చెప్పినన్ = తెలుపగా; ఆ = ఆ; నృపు = రాజు యొక్క; జీవితేశ్వరులును = భార్యలు; సుతులున్ = పిల్లలు; బంధువులును = చుట్టములు; హితులున్ = స్నేహితులు; కూడి = గుంపుగా కూడి; మొనసి = పూని; హాహాకారమునన్ = హాహా అనుచు; ఏడ్చిరి = విలపించిరి; తత్ = ఆ; తఱిన్ = సమయమునందు; తత్ = అతని; తనూభవుడు = పుత్రుడు {తనూభవుడు - తనువున పుట్టిన వాడు, కొడుకు}; సుదక్షిణుండు = సుదక్షిణుడు; వెలయన్ = విశదముగ; తండ్రి = తండ్రి; కిన్ = కి; పరలోకవిధులు = ఉత్తరక్రియలు; ఒనర్చి = చేసి; జనకునిన్ = తండ్రిని; అని = యుద్ధము; లోన్ = అందు; వధించిన = చంపిన; చక్రపాణిన్ = కృష్ణుని; అడరి = విజృంభించి; మర్దింపన్ = చంపుటకు; తగు = తగినట్టి; ఉపాయంబున్ = ఉపాయమును; తలచి = ఆలోచించి; చతురుడు = తెలివి కలవాడు; అగునట్టి = ఐన; తన = తన యొక్క; పురోహితునిన్ = పురోహితుని {పురోహితుడు - శుభాశుభ వైదిక కర్మములను చేయించుచు మేలుకీడులను తెలుపు ఆచార్యుడు, ఒజ్జ}; పిలిచి = పిలిచి.
భావము:- ఇక అక్కడ కాశీపట్టణంలో ఆ రాజమందిరంలో, కుండల సహితమైన శిరస్సు పడగానే పురజనులు అందరూ అది తమ రాజు శిరస్సుగా గుర్తించారు. ఆ రాజు భార్యలు, పుత్రులు, మిత్రులు, బంధువులు హాహాకారాలు చేస్తూ దుఃఖించారు. కాశీరాజు కుమారుడు సుదక్షిణుడు తండ్రికి ఉత్తర క్రియలు నిర్వర్తించాడు. తన తండ్రిని యుద్ధంలో సంహరించిన శ్రీకృష్ణుడిని సంహరించడానికి ఉపాయం ఆలోచించాడు. చతురుడైన పురోహితుడిని పిలిపించి.

తెభా-10.2-528-క.
డుం దానునుఁ జని పశు
తిపద సరసిజములకునుఁ బ్రమదముతో నా
తుఁడై యద్దేవుని బహు
తులం బూజింప నతఁడుఁ రుణాన్వితుఁడై.

టీక:- అతడున్ = పురోహితుడు; తానునున్ = సుదక్షిణుడు; చని = వెళ్ళి; పశుపతి = శివుని యొక్క {పశుపతి - ప్రమథగణములకు జంతువులకు ప్రభువు, శివుడు}; పద = పాదములు అను; సరసిజములు = పద్మముల; కున్ = కు; ప్రమదము = సంతోషము; తోన్ = తోటి; ఆనతుడు = మొక్కినవాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; దేవుని = భగవంతుడిని; బహు = అనేక; గతులన్ = విధములుగా; పూజింపన్ = పూజించగా; అతడున్ = శివుడు; కరుణా = దయ; ఆన్వితుడు = కలవాడు; ఐ = అయ్యి.
భావము:- పురోహితుడూ తానూ వెళ్ళి పరమేశ్వరుని పాదాలకు మ్రొక్కి, బహువిధాలుగా పూజలు చేసారు. పరమశివుడు కరుణామయుడు అయి.

తెభా-10.2-529-క.
"మెచ్చితి నే వర మైనను
నిచ్చెద నను వేఁడు"మనిన "నీశ్వర! నన్నున్
చ్చిక రక్షింతువు పొర
పొచ్చెము సేయక మహేశ! పురహర! యభవా!

టీక:- మెచ్చితిన్ = మెచ్చుకొన్నాను; ఏ = ఎలాంటి; వరమున్ = వరమును, కోరికను; ఐనను = అయినప్పటికి; ఇచ్చెదన్ = ఇస్తాను; ననున్ = నన్ను; వేడుము = కోరుము; అనినన్ = అనగా; ఈశ్వరా = శివా {ఈశ్వరుడు - స్వభావము చేతనే ఐశ్వర్యములు కలవాడు, శివుడు}; నన్నున్ = నన్ను; మచ్చికన్ = ప్రీతితో; రక్షింతువు = కాపాడుతావు; పొరపొచ్చెము = కపటము, న్యూనత; చేయక = చేయకుండ; మహేశ = శివా {మహేశ - నియామకుల (దేవుళ్ళ)కే నియామకుడు, శివుడు}; పురహర = శివా {పుర హరుడు - త్రిపురములను హరించిన వాడు, శివుడు}; అభవ = శివా {అభవుడు – పుట్టుక లేనివాడు}.
భావము:- “నీ భక్తికి మెచ్చాను. ఏ వరం కావాలో కోరుకో ఇస్తాను” అని అనుగ్రహించాడు. అప్పుడు, సుదక్షిణుడు “పరమేశ్వరా! త్రిపురాసుర సంహారా! అభవా! నన్ను ప్రీతితో ఏ పొరపొచ్చమూ లేకుండా తప్పక రక్షిస్తావు.

తెభా-10.2-530-క.
దేవా! మజ్జనకుని వసు
దేవాత్మజుఁ డాజిలో వధించెను, నే నా
గోవిందుని ననిలోపల
నే విధమున గెలుతు నానతీవె పురారీ! "

టీక:- దేవా = భగవంతుడా {దేవ - స్వయం ప్రకాశకుడు, స్వతంత్రుడు, భగవంతుడు}; మత్ = నా యొక్క; జనకునిన్ = నాన్నను; వసుదేవ = వసుదేవుని; ఆత్మజుడు = కొడుకు; ఆజి = యుద్ధము; లోన్ = అందు; వధించెను = చంపెను; నేను = నేను; ఆ = ఆ; గోవిందుని = కృష్ణుని; అని = యుద్ధము; లోపలన్ = అందు; ఏ = ఏ; విధమునన్ = విధముగా; గెలుతున్ = జయింపగలను; ఆనతీవె = తెలియజెప్పుము; పురారీ = శివా {పురారి - త్రిపురాసురులకు శత్రువు, శివ}.
భావము:- ఓ దేవా! వాసుదేవుడి కొడుకు శ్రీకృష్ణుడు నా తండ్రిని యుద్ధంలో సంహరించాడు. నేను యుద్ధంలో ఆ శ్రీకృష్ణుడిని ఏ ఉపాయంతో అయితే గెలువగలనో దానిని చెప్పు.” అని ప్రార్థించాడు.

తెభా-10.2-531-తే.
నిన శంకరుఁ డతనికి నియె "ననఘ!
నీవు ఋత్విజులును భూసురాళియునుఁ
బ్రీతి నభిచార మొనరింప భూయుక్తుఁ
గుచు ననలుండు దీర్చు నీ భిమతంబు. "

టీక:- అనినన్ = అనగా; శంకరుడు = శివుడు; అతని = అతని; కిన్ = కి; అనియెన్ = చెప్పెను; అనఘ = పాపరహితుడా; నీవు = నీవు; ఋత్విజులును = యజ్ఞము చేయించువారు; భూసుర = విప్రులు; ఆవళియునున్ = సమూహములు; ప్రీతిన్ = ఇష్టపూర్వకముగా; అభిచార = మారణహోమమును {అభిచారము - శత్రునాశనమునకైన హోమము, మారణహోమము}; ఒనరింపన్ = చేయగా; భూత = భూతములతో; యుక్తుడు = కూడినవాడు; అగుచున్ = ఔతు; అనలుండు = అగ్నిదేవుడు; తీర్చున్ = నెరవేర్చును; నీ = నీ యొక్క; అభిమతమున్ = కోరికను, ఇచ్ఛను.
భావము:- అప్పుడు పరమశివుడు అతడితో ఇలా అన్నాడు “అనఘా! నీవూ ఋత్విజులూ బ్రాహ్మణశ్రేష్ఠులూ ప్రీతితో అభిచారహోమం చేస్తే, భూతములతో కూడి, అగ్నిదేవుడు నీ కోరిక నెరవేరుస్తాడు.”

తెభా-10.2-532-తే.
నిన నా చంద్రమౌళి వాక్యముల భంగి
భూరినియమముతో నభిచాహోమ
మొనరఁ గావింప నగ్ని యథోచితముగఁ
జెలఁగు దక్షిణవలమాన శిఖల వెలిఁగె.

టీక:- అనినన్ = అని చెప్పగా; ఆ = ఆ ప్రసిద్ధుడైన; చంద్రమౌళి = శివుని యొక్క {చంద్రమౌళి - చంద్రుడు శిఖయందు కలవాడు, శివుడు}; వాక్యములన్ = మాటల; భంగిన్ = ప్రకారము; భూరి = మిక్కుటమైన; నియమము = నిష్ఠ; తోన్ = తోటి; అభిచారహోమమున్ = హింసార్థమైన హోమము; ఒనరన్ = చక్కగా; కావింపన్ = చేయగా; అగ్ని = అగ్నిదేవుడు; యథోచితముగ = తగినట్లు; చెలగు = విజృంభించెడి; దక్షిణవలమాన = ప్రదక్షిణముగా, కుడి వైపుగా తిరుగు; శిఖలన్ = మంటలతో; వెలిగెన్ = వెలిగెను, మండెను.
భావము:- అలా చెప్పిన పరమేశ్వరుని వాక్యానుసారం సుదక్షిణుడు గొప్పనియమాలతో అభిచార హోమం చేసాడు. అగ్నిదేవుడు కుడి వైపుగా తిరుగుతూ జ్వలించే జ్వాలలతో వెలిగాడు.

తెభా-10.2-533-వ.
అందుఁ దామ్రశ్మశ్రుకేశకలాపంబును, నశనిసంకాశంబులైన నిడుద కోఱలును, నిప్పులుప్పతిల్లు చూడ్కులును, ముడివడిన బొమలును, జేవురించిన మొగంబును గలిగి కృత్య యతి రౌద్రాకారంబునఁ బ్రజ్వరిల్లుచుఁ గుండంబు వెలువడి యనుదిన నిహన్య మాన ప్రాణిరక్తారుణ మృత్యుకరవాలంబు లీలం జూపట్టు నాలుకను సెలవుల నాకికొనుచు నగ్నికీలాభీలంబగు శూలంబు గేలం దాల్చి భువనకోలాహలంబుగా నార్చుచు, నుత్తాల తాలప్రమాణ పాదద్వయ హతులం దూలు పెంధూళి నింగిమ్రింగ, భూతంబులు సేవింప, నగ్నవేషయై, నిజవిలోచన సంజాత సముద్ధూత నిఖిల భయంకర జ్వాలికాజాలంబున దిశాజాలంబు నోలిం బ్రేల్చుచు, నుద్వేగగమనంబున నగధరు నగరంబున కరుగుదేరఁ, బౌరజనంబులు భయాకులమానసులై దావదహనునిం గని పఱచు వన మృగంబులచాడ్పునం బఱచి, సుధర్మాభ్యంతరంబున జూదమాడు దామోదరునిం గని “రక్షరక్షేతి”రవంబుల నార్తులయి “కృష్ణ! కృష్ణ! పెనుమంటలం బురంబు గాల్పం బ్రళయాగ్ని సనుదెంచె” నన వారిం జూచి “యోడకోడకుఁ” డని భయంబు నివారించి, సర్వరక్షకుండైన పుండరీకాక్షుండు జగదంతరాత్ముండు గావునం దద్వృత్తాంతం బంతయుఁ దన దివ్యచిత్తంబున నెఱింగి కాశీరాజపుత్త్ర ప్రేరితయైన యమ్మహాకృత్యను నిగ్రహింపం దలంచి నిజపార్శ్వవర్తి యయియున్న యద్దివ్యసాధనంబు గనుంగొని యప్పుడు.
టీక:- అందున్ = దానిలోంచి; తామ్ర = రాగిరంగు; శ్మశ్రు = గడ్డము, మీసముల; కేశ = శిరోజముల; కలాపంబును = సమూహములు; అశని = వజ్రాయుధము; సంకాశంబులు = సరిపోలునవి; ఐనను = అయినట్టి; నిడుద = పొడవైన; కోఱలును = కోర పళ్ళు; నిప్పులు = నిప్పు (రవ్వలు); ఉప్పతిల్లు = రాలుతున్న, పుట్టుచున్న; చూడ్కులును = చూపులు; ముడిపడిన = కలిసిపోయిన; బొమలును = కనుబొమలు; జేవురించిన = ఎఱ్ఱబారిన; మొగంబును = ముఖము; కలిగి = కలిగినట్టి; కృత్య = కృత్య {కృత్య - సంహారార్థము ప్రయోగింపబడిన క్షుద్రదేవత}; అతి = మిక్కిలి; రౌద్ర = భయంకర; ఆకారంబునన్ = ఆకృతితో; ప్రజ్వరిల్లుచున్ = మండిపోతూ, ప్రకాశించుచు; గుండంబున్ = అగ్ని గుండము నుండి; వెలువడి = బయటకు వచ్చి; అనుదిన = ఎల్లప్పుడు; నిహన్యమాన = చంపబడుతున్న; ప్రాణి = ప్రాణుల; రక్త = నెత్తుటిచేత; అరుణ = ఎఱ్ఱగానైన; మృత్యు = మరణదేవత యొక్క; కరవాలంబు = కత్తి; లీలన్ = వలె; చూపట్టు = కనబడుతున్న; నాలుకను = నాలుకతో; సెలవులన్ = తన పెదవు మూలలను, ఓష్ఠ్యాంత భాగము, పెదవి (అధరము) మూల; నాకికొనుచున్ = నాకుతూ; అగ్ని = అగ్ని; కీలా = మంటల వలె; ఆభీలంబు = భయంకరము; అగు = ఐన; శూలంబున్ = శూలమును; కేలన్ = చేత; తాల్చి = ధరించి; భువన = లోకములను; కోలాహలంబు = అల్లకల్లోలము; కాన్ = అగునట్లు; ఆర్చుచున్ = అరుస్తూ; ఉత్తాల = ఎత్తైన; తాల = తాడిచెట్టుల వలె; ప్రమాణ = పొడవైన; పాద = కాళ్ళ; ద్వయ = జంట యొక్క; ఆహతులన్ = తాకుడులచే; తూలు = రేగుచున్న; పెంధూళి = మిక్కుటమైన; ధూళి = దుమ్ము; నింగిన్ = ఆకాశమును; మ్రింగన్ = కమ్ముకోగా; భూతంబులు = బేతాళాది భూతములు; సేవింపన్ = కొలుస్తుండగా; నగ్నవేష = దిసమొల కలది, దిగంబరి; ఐ = అయ్యి; నిజ = తన; విలోచన = కన్నులనుండి; సంజాత = పుట్టెడి; సముద్ధూత = మీది కెగురుతున్న; నిఖిల = ఎల్లరకు; భయంకర = భయము కలిగిస్తున్న; జ్వాలికా = మంటల; జాలంబున = సమూహముచేత; దిశా = దిక్కులు; జాలంబున్ = ఎల్ల; ఓలిన్ = క్రమముగా; ప్రేల్చుచున్ = మండింపజేచేస్తు, కాల్చుచు; ఉద్వేగ = మిక్కిలి వేగవంతమైన; గమనంబునన్ = నడకతో; నగధరు = కృష్ణుని; నగరంబున్ = పట్టణమున; కున్ = కు; అరుగుదేరన్ = రాగా; పౌరజనంబులు = ప్రజలు; భయ = భయముచేత; ఆకుల = కలత నొందిన; మానసులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; దావదహనునిన్ = కార్చిచ్చును; కని = చూసి; పఱచు = పారిపోయెడి; వన = అడవి; మృగంబులన్ = జంతువుల; చాడ్పునన్ = వలె; పఱచి = పారిపోయి; సుధర్మ = సుధర్మ సభ; అభ్యంతరంబునన్ = లోపల; జూదము = జూదము; ఆడు = ఆడుచున్న; దామోదరునిన్ = కృష్ణుని {దామోదరుడు - దామము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; కని = చూసి; రక్షరక్ష = కాపాడు కాపాడు; ఇతి = అను; రవంబులన్ = కేకలతో; ఆర్తులు = దుఃఖకంఠములతో; కృష్ణ = కృష్ణా కృష్ణా; పెను = పెద్ద పెద్ద; మంటలన్ = మంటలతో; పురంబున్ = పట్టణమును; కాల్పన్ = కల్చివేయుటకు; ప్రళయా = ప్రళయకాల; అగ్ని = అగ్ని; చనుదెంచెన్ = వచ్చినది; అనన్ = అనగా; వారిన్ = వారిని; చూచి = చూసి; ఓడకుడు = భయపడకండి; ఓడకుడు = భయపడకండి; అని = అని; భయంబున్ = భయమును; నివారించి = పోగొట్టి; సర్వరక్షకుండు = ఎల్లరను కాపాడువాడు; ఐన = అయిన; పుండరీకాక్షుండు = కృష్ణుడు; జగత్ = లోక మంతటికి; అంతరాత్ముడు = అంతరాత్మగా ఉన్నవాడు; కావునన్ = కాబట్టి; తత్ = ఆ; వృత్తాంతంబు = వర్తమానము; అంతయున్ = సమస్తమును; తన = తన యొక్క; దివ్య = దైవ సంబంధమైన; చిత్తంబునన్ = మనస్సు నందు; ఎఱింగి = తెలిసికొని; కాశీరాజపుత్ర = సుదక్షిణునిచేత; ప్రేరిత = ప్రేరేపింపబడినది; ఐన = అయిన; ఆ = ఆ; మహా = పెద్ద; కృత్యను = కృత్యను; నిగ్రహింపన్ = అణచివేయుటకు; నిజ = తన; పార్శ్వ = పక్కననే; వర్తి = మెలగెడి; అయి = ఐ; ఉన్న = ఉన్నట్టి; ఆ = ఆ; దివ్య = దివ్యమైన; సాధనంబున్ = ఆయుధమును; కనుంగొని = చూసి; అప్పుడు = అప్పుడు.
భావము:- ఆ అభిచారహోమ గుండంలోని అగ్నిజ్వాలల నుండి ఎఱ్ఱని జుట్టూ; పిడుగుల వంటి కోరలూ; నిప్పులు గ్రక్కే చూపులూ; ముడిపడిన కనుబొమలూ; జేవురించిన ముఖము; కలిగిన “కృత్య” అతిభయంకర ఆకారంతో వెలువడింది. ఆ కృత్య మృత్యుదేవత కరవాలంలా కనిపిస్తున్న నాలుకతో పెదవి మూలలు తడవుకుంటూ, అగ్నిజ్వాలవంటి శూలాన్ని చేతబట్టి, లోకం దద్దరిల్లేలా బొబ్బలు పెడుతూ, నింగినిండా దుమ్ము వ్యాపించేలా తాటిచెట్ల వంటి పాదాలతో అడుగులు వేస్తూ, భూతాలు సేవిస్తుండగా, కళ్ళ నుంచి రాలే నిప్పులతో దిక్కులను కాల్చివేస్తూ, అతివేగంగా శ్రీకృష్ణుని ద్వారకా నగరానికి దిగంబరంగా వచ్చింది. ద్వారకానగరవాసులు అంతా కృత్యను చూచి దావానలాన్ని చూసి పారిపోయే అడవిజంతువుల లాగా పారిపోయి “కాపాడు కాపాడు” అని అరుస్తూ, సుధర్మా సభామండపంలో జూదమాడుతున్న దామోదరుడు, శ్రీకృష్ణుడిని చేరారు. “మన పట్టణాన్ని దహించడానికి ప్రళయకాలాగ్ని వచ్చింది. మమ్మల్ని రక్షించు” అని ప్రార్థించారు. వారికి “భయపడకండి” అని చెప్పి, పుండరీకముల వంటి కన్నులున్న వాడు, విశ్వము అంతటిలోనూ ఆత్మరూపంలో వ్యాపించి ఉండేవాడు, సర్వరక్షకుడు, అయిన శ్రీకృష్ణుడు జరిగిన సంగతంతా దివ్యదృష్టితో తెలిసికొని, కాశీ రాకుమారుడు పంపించిన కృత్యను సంహరించాలని భావించి తన చక్రాయుధాన్ని పరికించి......

తెభా-10.2-534-సీ.
భీమమై బహుతీవ్రధామమై హతరిపు-
స్తోమమై సుమహితోద్దామ మగుచుఁ
జండమై విజితమార్తాండమై పాలితా-
జాండమై విజయప్రకాండ మగుచు
దివ్యమై నిఖిలగంతవ్యమై సుజన సం-
భావ్యమై సద్భక్త సేవ్య మగుచు
నిత్యమై నిగమసంస్తుత్యమై వినమితా-
దిత్యమై నిర్జితదైత్య మగుచు

తెభా-10.2-534.1-తే.
విలయసమయ సముద్భూత విపులభాస్వ
ళికలోచన లోచనాల సహస్ర
టిత పటుసటాజ్వాలికా టుల సత్త్వ
యదచక్రంబు కృత్యపైఁ బంపె శౌరి.

టీక:- భీమము = భయంకరమైనది; ఐ = అయ్యి; బహు = మిక్కిలి; తీవ్ర = తీక్షణతకు; ధామము = ఉనికిపట్టు; ఐ = అయ్యి; హత = చంపబడిన; రిపు = శత్రువుల; స్తోమము = సమూహముకలది; ఐ = అయ్యి; సు = గొప్ప; మహిత = మహిమచేత; ఉద్దామము = అడ్డులేనిది; అగుచున్ = ఔతు; చండము = భీకరమైనది; ఐ = అయ్యి; విజిత = గెలువబడిన; మార్తాండము = సూర్యమండలము కలది; ఐ = అయ్యి; పాలిత = ఏలబడిన; అజాండము = బ్రహ్మాండము కలది; ఐ = అయ్యి; విజయ = గెలుపుయొక్క; ప్రకాండము = మేలు కలది; అగుచున్ = ఔతు; దివ్యము = అప్రాకృతమైనది; ఐ = అయ్యి; నిఖిల = ఎల్లచోట్లకు; గంతవ్యము = పోగలది; ఐ = అయ్యి; సుజన = మంచివారి; సంభావ్యము = గౌరవింపబడినది; ఐ = అయ్యి; సత్ = మంచి; భక్త = భక్తులచేత; సేవ్యము = సేవింపబడునది; అగుచున్ = ఔతు; నిత్యము = శాశ్వతమైనది; ఐ = అయ్యి; నిగమ = వేదములచే; సంస్తుతము = మిక్కుటముగాస్తుతింపబడునది; ఐ = అయ్యి; వినమిత = మొక్కుచున్న; ఆదిత్యము = దేవతలు కలది; ఐ = అయ్యి; నిర్జిత = జయింపబడిన; దైత్యము = రాక్షసులు కలది; అగుచున్ = ఔతు; విలయ = ప్రళయకాల; సమయ = కాలమున; సముద్భూత = మిక్కిలిఎగసెడి; విపుల = విస్తారమైన; భాస్వత్ = ప్రకాశించుచున్న; అళికలోచన = శివుని కంటి {అళికలోచనము - అళీక (నొసటందుండు) లోచనము (కన్ను), శివుడి మూడవ కన్ను}; లోచనా = చూపుల యొక్క; అనల = అగ్ని; సహస్ర = వేలకొలదితో; ఘటిత = కూర్చబడిన; పటు = దృఢమైన; సటా = జటలు అను; జ్వాలికా = మంటలచేత; చటుల = తీక్షణమైనట్టి; సత్వ = ప్రాణులకు; భయద = భయము కలిగిస్తున్న; చక్రంబున్ = చక్రాయుధమును; కృత్య = కృత్య (క్షుద్రదేవత); పైన్ = మీదకి; పంపెన్ = ప్రయోగించెను; శౌరి = కృష్ణుడు {శౌరి - శూరుని మనుమడు, కృష్ణుడు}.
భావము:- బహు భయంకరమైనదీ, శత్రువులను హతం గావించేదీ, సూర్యకాంతిని ధిక్కరించే తీక్షణ మైన కాంతి కలదీ, సుజనులచే స్తుతింపబడేదీ, భక్తులచే సేవించబడేదీ, దేవతలచే నమస్కరింపబడేదీ, దానవులను సంహరించేదీ, ప్రళయకాలంలోన పరమేశ్వరుని ఫాలనేత్రం నుంచి వెలువడే జ్వలనజ్వాలా మాలికవలె భయంకరమైనదీ, అన్ని వైపులా పయనించ గలదీ అయిన ఆ చక్రాయుధాన్ని శ్రీకృష్ణుడు కృత్యపై ప్రయోగించాడు.

తెభా-10.2-535-వ.
అదియును, బ్రళయవేళాసంభూత జీమూతసంఘాత ప్రభూత ఘుమఘుమాటోప నినదాధరీకృత మహాదుస్సహ కహకహ నిబిడనిస్వననిర్ఘోషపరిపూరిత బ్రహ్మాండకుహరంబును, నభ్రంలిహ కీలాసముత్కట పటు చిటపట స్ఫుట ద్విస్ఫులింగచ్ఛటాభీలంబును, సకలదేవతాగణ జయజయశబ్ద కలితంబును, ననంతతేజో విరాజితంబును నగుచుం గదిసినం బంటింపక కంటగించు కృత్యను గెంటి వెంటనంటిన నది తన తొంటిరౌద్రంబు విడిచి మరలి కాశీపురంబు సొచ్చి పౌరలోకంబు భయాకులతంబొంది వాపోవ, రోషభీషణాకారంబుతో నప్పుడు ఋత్విఙ్నికాయయుతంబుగ సుదక్షిణుని దహించె; నత్తఱిఁ జక్రంబును దన్నగరంబు సౌధ ప్రాకార గోపురాట్టాల కాది వివిధ వస్తు వాహన నికరంబుతో భస్మంబు గావించి మరలి యమరులు వెఱఁగందఁ గమలలోచన పార్శ్వవర్తి యై నిజ ప్రభాపుంజంబు వెలుఁగొందఁ గొల్చియుండె"నని చెప్పి; మఱియు నిట్లనియె.
టీక:- అదియును = ఆ చక్రము; ప్రళయ = ప్రళయ; వేళా = కాలము నందు; సంభూత = పుట్టు; జీమూత = మేఘముల; సంఘాత = సమూహము లందు; ప్రభూత = జనించు; ఘుమఘుమ = ఘుమఘుమ అను శబ్దము యొక్క; ఆటోప = విజృంభణము గల; నినద = ధ్వనిని; అధరీకృత = కించపరచెడి; మహా = మిక్కిలి; దుస్సహ = సహింపరాని; కహకహ = కహకహ అను; నిబిడ = దట్టమైన, గట్టి; నిస్వన = ధ్వని యొక్క; నిర్ఘోష = మోతచేత; పరిపూరిత = పూర్తిగా నిండిపోయిన; బ్రహ్మాండ = బ్రహ్మాండము అను; కుహరంబును = బిలము కలది; అభ్రన్ = ఆకాశమును; లిహ = ఒరయుచున్న; కీలా = మంటలచేత; సముత్కట = అతిశయించిన; పటు = వేండ్రములైన; చిటపట = చిటపట అను; స్ఫుటత్ = స్పష్టమైన; విస్ఫులింగత్ = మిణుగురుల, అగ్నికణముల; ఛటా = సమూహములచే; ఆభీలంబును = మిక్కిలి భయంకరమైనది; సకల = సర్వ; దేవతా = దేవతల; గణ = సమూహముచేత; జయజయ = జయముజయము అను; శబ్ద = శబ్దములతో; కలితంబును = కూడినది; అనంత = అంతులేని; తేజస్ = తేజస్సుచేత; విరాజితంబును = ప్రకాశించునది; అగుచున్ = ఔతు; కదిసిన = సమీపించగా; పంటింపకన్ = వెనుదీయకుండ; కంటగించు = విరోధించు నట్టి; కృత్యను = కృత్యను; గెంటి = తోసివేసి; వెంటనంటినన్ = వెంబడించగా; అది = ఆ కృత్య; తన = తన యొక్క; తొంటి = మునుపటి; రౌద్రంబును = భీకరత్వమును; విడిచి = వదలిపెట్టి; మరలి = వెనుదిరిగి; కాశీ = కాశీ; పురంబున్ = పట్టణమును; చొచ్చి = ప్రవేశించి; పౌర = పురజనులు; లోకంబు = సర్వము; భయ = భయముచేత; ఆకులతన్ = కలతను; పొంది = పొంది; వాపోవన్ = మొరపెట్టగా; రోష = క్రోధముతో కూడిన; భీషణ = భయంకరమైన; ఆకారంబు = ఆకృతితో; అప్పుడు = అప్పుడు; ఋత్విక్ = ఋత్విక్కుల; నికాయ = సమూహములతో; యుతంబుగన్ = సహా; సుదక్షిణుని = సుదక్షిణుడిని; దహించెన్ = దహించివేసెను; ఆ = ఆ; తఱిన్ = సమయము నందు; చక్రంబునున్ = చక్రము; తత్ = ఆ; నగరంబున్ = పట్టణము; సౌధ = మేడలతో; ప్రాకార = కోటగోడలు; గోపుర = గోపురములు; అట్టాలక = కోటబురుజులు; ఆది = మున్నగు; వివిధ = నానావిధ; వస్తు = పదార్థములు; వాహన = వాహనముల; నికరంబున్ = సమూహము; తోన్ = తోటి; భస్మంబు = బూడిద; కావించి = చేసి; మరలి = వెనుతిరిగి; అమరులు = దేవతలు; వెఱగందన్ = ఆశ్చర్యపోతుండగా; కమలలోచన = కృష్ణుని; పార్శ్వవర్తి = పక్క నుండునది; ఐ = అయ్యి; నిజ = తన యొక్క; ప్రభా = కాంతి; పుంజంబున్ = సమూహమును; వెలుగొందన్ = ప్రకాశించుచుండగా; కొల్చి = సేవించుచు; ఉండెను = ఉండెను; అని = అని; చెప్పి = చెప్పి; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఆ చక్రాయుధం ప్రళయకాలంనాటి మేఘాల నుండి పుట్టిన ఘుమ ఘుమ అంటూ భయంకరంగా ధ్వనించే గర్జనల వంటి ధ్వనితో, ఆకాశాన్ని అంటుతున్న అగ్నిజ్వాలలతో, అమిత తేజస్సుతో వెలుగొందుతూ, సకల దేవతలు జయజయ ధ్వానాలు చేస్తుండగా, కృత్యను సమీపించింది. తనను చూసి తడబడకుండా కంటగిస్తున్న కృత్యను గెంటివేసి, వెంటబడింది. అప్పుడు, కృత్య తన పూర్వపు రౌద్రరూపాన్ని వదలి తిరిగి కాశీపురం వచ్చింది. మరలి వచ్చిన కృత్యను చూసి పౌరులంతా భయపడి శోకిస్తుండగా, ఆ కృత్య రోషభీషణమైన ఆకారంతో ఋత్విజులతోపాటు సుదక్షిణుని దహించి వేసింది. అప్పుడు, శ్రీకృష్ణుడి చక్రాయుధం సౌధ, గోపుర, ప్రాకారాలతోపాటు ఆ నగరాన్ని భస్మీపటలం చేసింది. దేవతలంతా ఆశ్చర్యపడేలా శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి చేరి, తన నిజప్రభావంతో ప్రకాశిస్తూ ఉంది.” అని శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో చెప్పి కృష్ణగాథను ఇంకా ఇలా కొనసాగించాడు.

తెభా-10.2-536-క.
"మురిపు విజయాంకితమగు
రితము సద్భక్తిఁ దగిలి దివిన వినినన్
దురితములఁ బాసి జను లిహ
సౌఖ్యము లతనిచేతఁ డయుదు రధిపా!"

టీక:- మురరిపు = కృష్ణుని; విజయ = విజయముచే; అంకితము = అలంకరింపబడినది; అగు = ఐన; చరితమున్ = వృత్తాంతమును; సద్భక్తి = మంచి భక్తితో; తగిలి = ఆసక్తులై; చదివినన్ = చదివినను; వినినన్ = వినినను; దురితములన్ = పాపములను; పాసి = దూరమై; జనులు = మానవులు; ఇహ = ఇహలోకపు; పర = పరలోకపు; సౌఖ్యముల్ = సుఖములను; అతని = ఆ కృష్ణుని; చేతన్ = చేత; పడయుదురు = పొందెదరు; అధిపా = రాజా.
భావము:- “ఓ పరీక్షన్మహారాజా! శ్రీకృష్ణుడి ఈ విజయగాథలను భక్తితో చదివినవారు, వినినవారు పాపరహితులై, ఆ దేవుని దయచేత ఇహపర సౌఖ్యాలను పొందుతారు.”

తెభా-10.2-537-వ.
అనిన శుకయోగికి రాజయోగి యిట్లనియె.
టీక:- అనినన్ = అని చెప్పగా; శుక = శకుడు అను; యోగి = ముని; కిన్ = కి; రాజ = రాజులలో; యోగి = ఋషి; ఇట్లు = ఈ విధముగ; అనియె = అడిగెను.
భావము:- శుకయోగి ఇలా చెప్పగా రాజయోగి ఐన పరీక్షిత్తు ఇలా అన్నాడు.