పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కన్యలం బదాఱువేలం దెచ్చుట

కన్యలంబదాఱువేలందెచ్చుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కన్యలం బదాఱువేలం దెచ్చుట)
రచయిత: పోతన



తెభా-10.2-206-ఉ.
రాకులావతంసుఁడు పరాజిత కంసుఁడు సొచ్చి కాంచె ఘో
రాజుల రాజులం బటుశరాహతి నొంచి ధరాతనూజుఁ డు
త్తేజిత శక్తిఁ దొల్లిఁ జెఱదెచ్చినవారిఁ బదాఱువేల ధా
త్రీన మాన్యలన్ గుణవతీ వ్రతధన్యల రాజకన్యలన్.

టీక:- రాజకులావతంసుడు = కృష్ణుడు {రాజ కులావతంసుడు - రాజ (చంద్ర) కులా (వంశమున) అవతంసుడు (సిగబంతివలె శ్రేష్ఠుడు), కృష్ణుడు}; పరాజితకంసుఁడు = కృష్ణుడు {పరాజిత కంసుఁడు - ఓడింపబడిన కంసుడు కలవాడు, కృష్ణుడు}; చొచ్చి = ప్రవేశించి; కాంచెన్ = చూసెను; ఘోర = భీకరమైన; ఆజులన్ = యుద్ధము లందు; రాజులన్ = రాజు లనేక మందిని; పటు = బలమైన; శరా = బాణముల; హతి = దెబ్బలతో; నొంచి = నొప్పించి; ధరాతనూజుడు = నరకాసురుడు; ఉత్తేజిత = మిక్కిల తేజరిల్లుతున్న; శక్తిన్ = శక్తితో; తొల్లి = మునుపు; చెఱన్ = చెరపట్టి; తెచ్చిన = తీసుకువచ్చిన; వారిన్ = వారిని; పదాఱువేలన్ = పదహారువేల (16000) మందిని; ధాత్రీజన = భూజనులచేత; మాన్యలన్ = గౌరవింపబడువారిని; గుణవతీ = సుగుణవతుల; వ్రత = వ్రతములచే, నడవడికతో; ధన్యలన్ = కృతార్థులను; రాజకన్యలన్ = రాకుమారిలను.
భావము:- కంసారి, యదుకులావతంసుడు అయిన శ్రీకృష్ణుడు ఆ రాజసౌధంలో, ఘోరమైన యుద్ధాలలో భూదేవి కొడుకు నరకుడు రాజులను శర పరంపరలతో ఓడించి, చెరపట్టి తెచ్చిన మాననీయులూ, గుణవతులూ అయిన పదహారువేలమంది రాజకన్యలను చూసాడు.

తెభా-10.2-207-మ.
ని రా రాజకుమారికల్‌ పరిమళత్కౌతూహలాక్రాంతలై
నుజాధీశ చమూవిదారు నతమందారున్ శుభాకారు నూ
శృంగారు వికారదూరు సుగుణోదారున్ మృగీలోచనా
చేతోధనచోరు రత్నమకుటస్ఫారున్ మనోహారునిన్.

టీక:- కనిరి = చూసారు; ఆ = ఆ యొక్క; రాజకుమారికల్ = రాకుమారికలు; పరిమళత్ = పరిమళించుచున్న; కౌతూహల = వేడుకచేత; ఆక్రాంతలు = ఆక్రమింపబడినవారు; ఐ = అయ్యి; దనుజాధీశచమూ విదారున్ = కృష్ణుని {దనుజాధీశ చమూ విదారుడు – రాక్షస రాజుల సైన్యాలని భేదించువాడు, కృష్ణుడు}; నతమందారున్ = కృష్ణుని {నత మందారుడు - మొక్కినవారికి కల్పవృక్షము వంటివాడు, కృష్ణుడు}; శుభ = శోభనకరమైన; ఆకారున్ = స్వరూపము కలవానిని; నూతన = సరికొత్త; శృంగారున్ = అలంకారములు కలవానిని; వికారదూరున్ = వికారములకు అతీతుని {షడ్విధ వికారములు - 1పుట్టుట 2పెరుగుట 3ముదియుట 4చిక్కుట 5చచ్చుట 6గర్భనరకస్థితి}; సుగుణ = సుగుణములచేత; ఉదారున్ = గొప్పవానిని; మృగీలోచనా = వనితా {మృగీలోచన - మృగి (లేడి వంటి) కన్నులు కల స్త్రీ}; జన = జనుల; చేతః = మనసులు అను; ధన = సంపదలను; చోరున్ = అపహరించువానిని; రత్న = మణిమయ; మకుట = కిరీటముతో; స్ఫారున్ = ప్రకాశించువానిని; మనోహారునిన్ = మనోజ్ఞమైనవానిని.
భావము:- ఆ రాజపుత్రికలు, రాక్షస సైన్యసంహారుడూ; ఆశ్రిత మందారుడూ; సుందరాకారుడూ; సుగుణాధారుడూ; మానినీమానస చోరుడూ; మనోహారుడూ; రత్నకిరీట ధరుడూ; అయిన శ్రీకృష్ణుడిని మిక్కిలి వికసించిన కుతూహలంతో చూశారు

తెభా-10.2-208-వ.
కని యతని సౌందర్య గాంభీర్య చాతుర్యాది గుణంబులకు మోహించి, తమకంబులు జనియింప, ధైర్యంబులు సాలించి, సిగ్గులు వర్జించి, పంచశరసంచలిత హృదయలై, దైవయోగంబునం బరాయత్తంబులైన చిత్తంబుల నమ్మత్తకాశినులు దత్తరంబున మనోజుండుత్తలపెట్ట నతండు దమకుఁ బ్రాణవల్లభుండని వరియించి.
టీక:- కని = చూసి; అతని = అతని; సౌందర్య = చక్కదనమునకు; గాంభీర్య = చలింపని స్వభావము; చాతుర్య = నేర్పరితనము; ఆది = మున్నగు; గుణంబుల్ = సుగుణముల; కున్ = వలన; మోహించి = మచ్చిక పుట్టి; తమకంబులన్ = త్వరపాటులు; జనియింపన్ = పుట్టగా; ధైర్యంబులు = తాలుములు; చాలించి = విడిచి; సిగ్గులు = లజ్జలను; వర్జించి = వదలివేసి; పంచశర = మన్మథుని బాణములచేత; సంచలిత = చలించిన; హృదయలు = మనసులు కలవారు; ఐ = అయ్యి; దైవయోగంబునన్ = దైవ నిర్ణయానుసారము; పరాయత్తంబులు = పరవశము లైన; చిత్తంబులన్ = మనసులతో; ఆ = ఆ; మత్తకాశినులు = విలాసవంతురాళ్ళు {మత్తకాశిని - మదముచేత ప్రకాశించునామె, స్త్రీ}; తత్తఱంబునన్ = తొట్రుపాటుతో; మనోజుండు = మన్మథుడు; ఉత్తలపెట్టన్ = పరితాపపడ జేయగా; అతండు = అతను; తమ = వారల; కున్ = కి; ప్రాణవల్లభుండు = ప్రియమైన భర్త; అని = అని; వరియించి = కోరి.
భావము:- అలా చూసి శ్రీకృష్ణుని సౌందర్యం, చాతుర్యం, గాంభీర్యం మున్నగు సుగుణాలకు ఆకర్షితలై మోహించారు. వలపులు పొంగి ధైర్యం కోల్పోయి సిగ్గులు వదలి శృంగార భంగిమలతో సంచలించిన హృదయాలతో పంచబాణుడు తొందరపెట్టగా ఆ రాచకన్నెలు అతడే తమ ప్రాణవల్లభు డని వరించారు.

తెభా-10.2-209-ఉ.
"పాపురక్కసుండు సెఱట్టె నటంచుఁ దలంతుఁ మెప్పుడుం
బాపుఁడె? వాని ధర్మమునఁ ద్మదళాక్షునిఁ గంటి మమ్మ! ము
న్నీ పురుషోత్తముం గదియ నేమి వ్రతంబులు సేసినారమో?
యా రమేష్ఠి పుణ్యుఁడుగమ్మ! హరిన్ మముఁ గూర్చె నిచ్చటన్

టీక:- పాపపు = పాపిష్టి; రక్కసుండు = రాక్షసుడు; చెఱపట్టెన్ = బంధించెను; అటంచున్ = అని; తలంతుము = భావిస్తున్నాము; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; పాపుడె = నిజంగా పాపియేనా, కాదు; వాని = అతని యొక్క; ధర్మమునన్ = పుణ్యముచేత; పద్మదళాక్షునిన్ = కృష్ణుని {పద్మదళాక్షుడు - తామరరేకులవంటి కన్నులవాడు, కృష్ణుడు}; కంటిమి = చూడగలిగితిమి; అమ్మ = తల్లి; మున్ను = మునుపు, పూర్వజన్మలో; ఈ = ఈ; పురుషోత్తమున్ = కృష్ణుని; కదియన్ = దరిచేరుటకు; ఏమి = ఎలాంటి; వ్రతంబులు = నోములు; చేసినారమో = ఆచరించామో; ఆ = ఆ ప్రసిద్ధుడైన; పరమేష్ఠి = బ్రహ్మదేవుడు {పరమేష్ఠి - శ్రేష్ఠమైన స్థానమగు సత్యలోకమున ఉండువాడు, బ్రహ్మ}; పుణ్యుడు = పుణ్యాత్ముడు; కద = కదా; అమ్మ = తల్లీ; హరిన్ = కృష్ణుని; మమున్ = మమ్మల్ని; కూర్చెన్ = కలిపెను; ఇచటన్ = ఇక్కడ.
భావము:- “పాపాత్ముడైన రాక్షసుడు మనల్ని చెరపట్టాడని ఎప్పుడూ భావిస్తుండేవాళ్ళం. వాడిధర్మాన పద్మాక్షుని దర్శించాం. ఈ పురుషోత్తముని దగ్గర చేరడానికి మనం పూర్వజన్మలో ఏ వ్రతాలు చేశామో? శ్రీకృష్ణునితో మనలను జతకూర్చిన ఆ బ్రహ్మదేవుడు ఎంత పుణ్యాత్ముడో? కదా

తెభా-10.2-210-క.
న్నతి నీతఁడు గౌఁగిట
న్నింపఁగ నింక బ్రదుకు మానిని మనలో
మున్నేమి నోము నోఁచెనొ
న్నుతమార్గముల విపిన ల దుర్గములన్.

టీక:- ఉన్నతిన్ = గౌరవముతో; ఈతడు = ఇతడు; కౌగిటన్ = ఆలింగనములందు; మన్నింపగన్ = సన్మానింపగా; ఇంక = మరి; బ్రదుకు = జీవించెడి; మానిని = మానవతి; మన = మన అందరి; లోన్ = అందు; మున్ను = పూర్వజన్మలలో; ఏమి = ఎట్టి; నోమున్ = వ్రతములను; నోచెనో = నోచినామో; సన్నుత = పొగడదగిన; మార్గములన్ = విధములుగా; విపిన = అడవి; జల = జలము వంటి; దుర్గములన్ = చొరరాని ప్రదేశములలో.
భావము:- మనలో ఎవరినైతే ఈ కమలాక్షుడు కనికరంతో కౌగిట చేర్చి గౌరవిస్తుంటే జీవిస్తుందో, ఆ సౌభాగ్యవతి తాను పూర్వ జన్మలో ఏ అరణ్యాలలో ఏ జల దుర్గాలలో ఎంత తపస్సు చేసిందో? కదా.

తెభా-10.2-211-క.
విన్నారమె యీ చెలువముఁ?
న్నారమె యిట్టి శౌర్యగాంభీర్యంబుల్‌?
న్నార మింతకాలముఁ
గొన్నారమె యెన్నఁ డయినఁ గూరిమి చిక్కన్.

టీక:- విన్నారమె = విన్నామా, లేదు; ఈ = ఈ యొక్క; చెలువము = చక్కదనము; కన్నారమె = చూసామా, లేదు; ఇట్టి = ఇలాంటి; శౌర్య = ప్రతాపములు; గాంభీర్యంబుల్ = గంభీరత్వములు; మన్నారము = బ్రతికాము; ఇంత = ఇన్ని; కాలమున్ = నాళ్ళు; కొన్నారమె = పొందామా, లేదు; ఎన్నడు = ఎప్పుడు; అయినన్ = అయినాసరే; కూరిమి = స్నేహము; చిక్కన్ = లభించగా.
భావము:- ఇటువంటి సౌందర్యాన్ని గూర్చి ఎక్కడైనా విన్నామా? ఇంతటి శౌర్యాన్నీ గాంభీర్యాన్నీ ఎప్పుడైనా కన్నామా? ఇంత కాలం జీవించాం గానీ ఇంతటి అనురాగాన్ని ఎక్కడైనా పొందామా?

తెభా-10.2-212-సీ.
నజాక్షి! నేఁ గన్క వైజయంతిక నైన-
దిసి వ్రేలుదు గదా కంఠమందు;
బింబోష్ఠి! నేఁ గన్క బీతాంబరము నైన-
మెఱసి యుండుదు గదా మేనునిండఁ;
న్నియ! నేఁ గన్క గౌస్తుభమణి నైన-
నొప్పు సూపుదుఁ గదా యురమునందు;
బాలిక! నేఁ గన్కఁ బాంచజన్యము నైన-
మొనసి చొక్కుదుఁ గదా మోవిఁ గ్రోలి;

తెభా-10.2-212.1-ఆ.
ద్మగంధి! నేను ర్హదామము నైనఁ
జిత్ర రుచుల నుందు శిరమునందు"
నుచుఁ బెక్కుగతుల నాడిరి కన్యలు
ములు గట్టి గరుడమనుఁ జూచి.

టీక:- వనజాక్షి = పద్మాక్షీ {వనజాక్షి - వనజము (పద్మము) వంటి కన్నులు కలామె, స్త్రీ}; నేన్ = నేను; కన్కన్ = కనుక; వైజయంతికన్ = వైజయంతికమాలను; ఐనన్ = అయినచో; కదిసి = చేరి; వ్రేలుదున్ = వేలాడుచుందును; కదా = కదా; కంఠము = మెడ; అందున్ = లో; బింబోష్ఠి = పడతి {బింబోష్ఠి - దొండపండు వంటి పెదవి కలామె, స్త్రీ}; నేన్ = నేను; కన్కన్ = కనుక; పీతాంబరమున్ = పచ్చని పట్టువస్త్రమును; ఐనన్ = అయినచో; మెఱసి = ప్రకాశించి; ఉండుదున్ = ఉండేదాన్ని; కదా = కదా; మేను = దేహము; నిండన్ = అంతటా; కన్నియ = కన్య; నేన్ = నేను; కన్కన్ = కనుక; కౌస్తుభమణిన్ = కౌస్తుభమణిని {కౌస్తుభమణి - విష్ణుమూర్తి వక్షస్థలమున ఉండెడి మణి}; ఐనన్ = అయినచో; ఒప్పు = మనోజ్ఞతను; చూపుదున్ = కనబరచేదానిని; కదా = కదా; ఉరము = వక్షస్థలము; అందున్ = మీద; బాలిక = చిన్నదాన; నేన్ = నేను; కన్కన్ = కనుక; పాంచజన్యమున్ = పాంచజన్యమను శంఖము; ఐనన్ = అయినచో; మొనసి = అతిశయించి; చొక్కుదున్ = పరవశించెదను; కదా = కదా; మోవిన్ = అధరామృతమును; క్రోలి = ఆస్వాదించి, తాగి; పద్మగంధి = ఇంతి {పద్మగంధి - పద్మముల వంటి దేహ పరిమళము కల స్త్రీ}; నేనున్ = నేను; బర్హ = నెమలి పింఛముల; దామమున్ = దండను; ఐనన్ = అయినచో; చిత్ర = పలువన్నెల; రుచులన్ = కాంతులతో; ఉందున్ = ఉండెదను; శిరము = తల; అందున్ = పైన; అనుచున్ = అని; బెక్కు = బహు; గతులన్ = విధములుగా; ఆడిరి = చెప్పుకొనిరి; కన్యలు = యువతులు; గములు = గుంపులు; కట్టి = కట్టి; గరుడగమనున్ = కృష్ణుని {గరుడగమనుడు - గరుడవాహనముపై తిరుగువాడు,కృష్ణుడు}; చూచి = చూసి.
భావము:- ఓ పద్మాలాంటి కనులున్న సఖీ! నేను గనుక వైజయంతికను అయిన ట్లయితే అతని మెడలో వ్రేలాడేదానిని కదా. ఓ దొండపండు లాంటి పెదవిగల సుందరీ! నేను కనుక పట్టువస్త్రాన్ని ఐనట్లైతే ఆయన శరీరంమీద ప్రకాశిస్తూ ఉండేదానిని కదా. ఓ బాలామణీ! నేను కౌస్తుభమణిని ఐనట్లయితే ఆయన వక్షస్థలంమీద మెరుస్తూ ఉండేదానిని గదా. ఓ కన్యామణీ! నేను పాంచజన్యాన్ని అయినట్లయితే అతని పెదవిని తాకి పరవశించి పోయేదానిని కదా. ఓ పద్మాల సుగంధాలతో విలసిల్లే చెలీ! నేను నెమలి పింఛాన్ని అయిన ట్లయితే ఆయన శిరస్సుమీద చిత్రమైన కాంతులతో విలసిల్లేదానిని కదా.” అని అనేక విధాలుగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ కన్యలు గుంపులు కూడి గరుడ వాహనుడు, శ్రీకృష్ణుడిని చూసి.....

తెభా-10.2-213-శా.
భూనాథోత్తమ! కన్యకల్‌ వరుస "నంభోజాతనేత్రుండు న
న్నే వ్వెం దగఁ జూచె డగ్గఱియె వర్ణించెన్ వివేకించె స
మ్మానించెం గరుణించెఁ బే రడిగె సన్మార్గంబుతోఁ బెండ్లి యౌ
నేనే చక్రికి దేవి" నంచుఁ దమలో నిర్ణీత లై రందఱున్.

టీక:- భూనాథ = రాజులలో; ఉత్తమ = ఉత్తముడా; కన్యకల్ = కుమారికలు; వరుసన్ = వరుసపెట్టి; అంభోజనేత్రుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; నన్నే = నన్ను గురించే; నవ్వెన్ = నవ్వెను; తగన్ = యుక్తముగా; చూచెన్ = చూసెను; డగ్గఱియెన్ = సమీపించెను; వర్ణించెను = రూపవిచారము చేసెను; వివేకించెన్ = చక్కగా తెలుసుకొనెను; సమ్మానించెన్ = మన్నించెను; కరుణించెన్ = దయచూపెను; పేరు = నామమును; అడిగెన్ = తెలియగోరెను; సన్మార్గంబునన్ = మంచి పద్ధతిలో; పెండ్లి = వివాహము; ఔన్ = జరుగును; నేనే = నేనే; చక్రి = కృష్ణుని; కిన్ = కి; దేవిన్ = భార్యను; అంచున్ = అని; నిర్ణీతలు = నిర్ణయించేసుకొన్నవారు; ఐరి = అయ్యారు; అందఱున్ = అందరు.
భావము:- ఓ మహారాజా! పరీక్షిత్తూ! “శ్రీకృష్ణుడు నన్ను చూసే నవ్వాడు.” “నా వైపే చూసాడు.” “నా చెంతకు వచ్చాడు.” “నన్నే వర్ణించాడు.” “నన్నే గౌరవించాడు.” “నన్నే కరుణించాడు.” “నా పేరే అడిగాడు.” “నన్నే పెండ్లాడుతాడు.” “నేనే శ్రీకృష్ణుని భార్యను అవుతా” నని రకరకాలుగా అంటూ ఆ కన్య లందరూ ఎవరికి వారు నిర్ణయిం చేసేసుకోసాగారు.

తెభా-10.2-214-వ.
ఇట్లు బహువిధంబులం దమతమ మన్ననలకు నువ్విళ్ళూరు కన్నియలం బదాఱువేల ధవళాంబరాభరణ మాల్యానులేపనంబు లొసంగి, యందలంబుల నిడి, వారలను నరకాసుర భాండాగారంబులం గల నానావిధంబు లయిన మహాధనంబులను, రథంబులను, దురంగంబులను, ధవళంబులై వేగవంతంబులై యైరావతకుల సంభవంబులైన చతుర్దంత దంతావళంబులను, ద్వారకానగరంబునకుం బనిచి; దేవేంద్రుని పురంబునకుం జని యదితిదేవి మందిరంబు సొచ్చి, యా పెద్దమ్మకు ముద్దు సూపి, మణికిరణ పటల పరిభావితభానుమండలంబులైన కుండలంబు లొసంగి, శచీసమేతుండైన మహేంద్రునిచేత సత్యభామతోడం బూజితుండై, పిదప సత్యభామ కోరిన నందనవనంబు సొచ్చి.
టీక:- ఇట్లు = ఈ విధమగా; బహు = అనేక; విధంబులన్ = రకములుగా; తమతమ = వారలకు కలుగబోవు; మన్ననలు = సన్మానముల; కున్ = కు; ఉవ్విళ్ళూరు = వేడుకపడెడి; కన్నియన్ = కన్యకలను; పదాఱువేలన్ = పదహారువేలమందిని (16000); ధవళ = తెల్లని, చక్కని; అంబర = వస్త్రములు; ఆభరణ = భూషణములు; మాల్య = పూలమాలలు; అనులేపనంబులున్ = మైపూతలు; ఒసంగి = ఇచ్చి; అందలంబులన్ = పల్లకీలలో {అందలము - పార్శ్వముల మఱుగులేని పల్లకి}; ఇడి = కూర్చుండబెట్టి; వారలను = వారిని; నరకాసుర = నరకాసురుని; భాండాగారంబులన్ = కోశాగారంలో, బొక్కసంలో; కల = ఉన్నట్టి; నానా = అనేక; విధంబులు = రకములు; అయిన = ఐనట్టి; మహా = గొప్ప; ధనంబులను = సంపదలను; రథంబులను = రథములను; తురంగంబులను = గుఱ్ఱములను; ధవళంబులు = తెల్లటివి; ఐ = అయ్యి; వేగవంతంబులు = వడిగలవి; ఐ = అయ్యి; ఐరావత = ఐరావతము; కుల = జాతి యందు; సంభవంబులు = పుట్టినవి; ఐన = అయిన; చతుర్దంత = నాలుగు దంతములున్న; దంతావళంబులను = పెద్ద ఏనుగులను {దంతావళము - ప్రశస్తమైన దంతములు కలది, పెద్ద ఏనుగు}; ద్వారకానగరంబున్ = ద్వారక; కున్ = కు; పనిచి = పంపించి; దేవేంద్రునిపురంబు = అమరావతి {దేవేంద్రునిపురము - ఇంద్రుని యొక్క పట్టణము, స్వర్గమునకు ముఖ్యపట్టణము, అమరావతి}; కున్ = కి; చని = వెళ్ళి; అదితిదేవి = అదితి యొక్క; మందిరంబున్ = గృహమును; చొచ్చి = ప్రవేశించి; ఆ = ఆ; పెద్దమ్మ = వృద్ధమాత; కున్ = కు; ముద్దు = ఆదరమును; చూపి = కనబరచి; మణి = రత్నాల; కిరణ = కిరణముల; పటల = సమూహముచే; పరిభావిత = భంగపరచబడిన; భానుమండలంబులు = సూర్యబింబములు కలవి; ఐన = అయిన; కుండలంబులు = చెవికుండలములు; ఒసంగి = ఇచ్చి; శచీ = శచీదేవితో; సమేతుండు = కూడినవాడు; ఐన = అయిన; మహేంద్రున్ = దేవేంద్రుని; చేతన్ = చేత; సత్యభామ = సత్యభామ; తోడన్ = తోటి; పూజితుండు = పూజింపబడినవాడు; ఐ = అయ్యి; పిదపన్ = పిమ్మట; సత్యభామ = సత్యభామ; కోరినన్ = కోరగా; నందనవనంబున్ = నందనవనమును {నందనవనము - స్వర్గములోని ఇంద్రుని ఉద్యానవనము}; చొచ్చి = ప్రవేశించి.
భావము:- ఈ మాదిరిగా తన ఆదరణ కోసం ఉవ్విళ్ళూరుతున్న ఆ కన్యలు అందరకూ తెల్లని చీరలను, ఆభరణాలనూ, పూమాలలనూ, సుగంధ మైపూతలనూ శ్రీకృష్ణుడు ఇచ్చాడు; నరకాసురుని కోశాగారంలో ఉన్న సకల అమూల్య సంపదలనూ, రథాలనూ, అశ్వాలనూ, అమితమైన వేగం కలిగిన ఐరావత కులంలో ఉద్భవించిన తెల్లని నాలుగు దంతాల ఏనుగులనూ, ద్వారకానగరానికి పంపించాడు. ఆ పదారువేలమంది స్త్రీలనూ పల్లకీలలో ఎక్కించి ద్వారకకు సాగనంపాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు దేవేంద్రుని పట్టణ మైన అమరావతికి వెళ్ళాడు. దేవమాత అదితి అంతఃపురానికి వెళ్ళి ఆమె ప్రేమను చూరగొని తమ కాంతులతో సూర్యమండలాన్ని తిరస్కరిస్తున్న ఆమె మణికుండలాలను ఆమెకు సమర్పించాడు. శచీదేవీ దేవేంద్రుల చేత సత్యభామ సమేతంగా పూజలు అందుకున్నాడు. తర్వాత సత్యభామ నందనవనం వెళ్దామని కోరింది. ఆమెను ఆ వనానికి తీసుకొని వెళ్ళాడు.