పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/విరాట్పురుష ప్రకారంబు


తెభా-3-898-సీ.
మొప్పఁగా విరాట్పురుషుండు వెలుఁగొందు-
నా విరాట్పురుషుని యాననంబు
లనను వాణియు వాణితో వహ్నియు-
నాసంబువలనఁ బ్రాములఁ గూడి
ఘ్రాణేంద్రియం బయ్యె ఘ్రాణంబువలనను-
వాయువులును బ్రాణవాయువులును
నందు నక్షులు చక్షు వందు సూర్యుండును-
నందభిధ్యానంబు ర్థిఁ జేయఁ

తెభా-3-898.1-తే.
ర్ణములు జాత మయ్యెఁ దత్కర్ణసమితి
న శ్రోత్రేంద్రియంబు దిక్కులును గలిగెఁ
ద్వక్కుచే శ్మశ్రు రోమ వితానకములు
నోషధివ్రాతమును భవ మొందె; మఱియు.

టీక:- కరము = మిక్కిలి; ఒప్పగాన్ = ఒప్పునట్లు; విరాట్పురుషుండు = విరాట్పురుషుడు; వెలుగొందున్ = ప్రకాశించును; ఆ = ఆ; విరాటపురుషుని = విరాటపురుషుని; ఆననంబున్ = మోము; వలననున్ = వలనను; వాణియున్ = సరస్వతీదేవియును; వాణి = వాక్కు; తోన్ = వలనను; వహ్నియున్ = అగ్నియును; నాసంబున్ = ముక్కు; వలనన్ = వలన; ప్రాణములన్ = ప్రాణములను; కూడి = కూడి; ఘ్రాణేంద్రియంబున్ = వాసనచూచు ఇంద్రియము; అయ్యెన్ = అయ్యెను; ఘ్రాణంబున్ = ముక్కు; వలననున్ = వలనను; వాయువులును = వాయువులును; ప్రాణవాయువులును = ప్రాణవాయువులును; అందున్ = అందు; అక్షులున్ = కన్నులును; చక్షువున్ = కంటి; అందున్ = అందు; సూర్యుండును = సూర్యుడును; అందున్ = అందు; అభి = అధికముగ; ధ్యానంబున్ = ధ్యానము; అర్థిన్ = కోరి; చేయన్ = చేయగా; కర్ణములున్ = చెవులును;
జాతమున్ = పుట్టినవి; అయ్యెన్ = అయినవి; తత్ = ఆ; కర్ణ = చెవుల; సమితి = సమూహము; వలన = వలన; శ్రోత్రేంద్రియంబున్ = వినునట్టి ఇంద్రియములును; దిక్కులును = దిక్కులును; కలిగెన్ = కలిగెను; త్వక్కు = చర్మము; చేన్ = చేత; శ్మశ్రు = మీసములు; రోమ = వెంట్రుకల; వితానకములున్ = సమూహములును; ఓషధి = ధ్యాన్యముల; వ్రాతమునున్ = సమూహనులును; భవమున్ = పుట్టుకను; పొందెన్ = చెందెను; మఱియున్ = ఇంకను.
భావము:- ఆ అండంలో విరాట్పురుషుడు వెలుగుతూ ఉంటాడు. అతని ముఖం నుండి వాణి, వాణితోపాటు అగ్ని పుట్టాయి. ముక్కునుండి ప్రాణాలు, ఘ్రాణేంద్రియం పుట్టాయి. ఘ్రాణేంద్రియం నుండి వాయువులు, ప్రాణవాయువులు ఆవిర్భవించాయి. ప్రాణవాయువుల వల్ల కన్నులు, కన్నులవల్ల సూర్యుడు పుట్టారు. వానియందు ధ్యాన మేర్పడగా చెవులు పుట్టాయి. వానివల్ల శ్రోత్రేంద్రియం దిక్కులూ పుట్టాయి. చర్మంనుండి గడ్డం, మీసాలు మొదలగు రోమసమూహమూ, ఓషధులూ జనించాయి. ఇంకా...

తెభా-3-899-తే.
దానివలనను మేఢ్రంబు గానఁబడియెఁ
రఁగ రేతంబువలన నాపంబు పుట్టె
గుదమువలన నపానంబు నుదయ మయ్యె
దానివలనను మృత్యువు గ జనించె.

టీక:- దాని = దాని; వలననున్ = వలనను; మేఢ్రంబున్ = పురుషాంగము; కానంబడియెన్ = కనబడినది; పరగ = ప్రసిద్దముగ; రేతంబున్ = రేతస్సు, శుక్రము; వలనన్ = వలనను; ఆపంబున్ = జలము; పుట్టెన్ = పుట్టెను; గుదము = మలద్వారము; వలన = వలనను; అపానంబును = అపానవాయువును {పంచ ప్రాణవాయువులు - 1ప్రాణవాయువు 2అపానవాయువు 3 ఉదానవాయువు 4 సమవాయువు 5.వ్యాసవాయువు}; ఉదయంబున్ = పుట్టినది; అయ్యెన్ = అయినది; దాని = దాని; వలననున్ = వలనను; మృత్యువున్ = మరణమును; తగన్ = అవశ్యము; జనించెన్ = పుట్టెను.
భావము:- చర్మం వలన మూత్రావయవం పుట్టింది. దానినుండి రేతస్సు పుట్టింది. రేతస్సువల్ల జలం పుట్టింది. దానివల్ల అపానం పుట్టింది. దానివల్ల మృత్యువు పుట్టింది.

తెభా-3-900-క.
ములవలనను బలమును
నివుగ నా రెంటివలన నింద్రుఁడుఁ బాదాం
బురుహంబులవలన గతియు
రుదుగ నా రెంటివలన రియును గలిగెన్.

టీక:- కరముల = చేతుల; వలననున్ = వలనను; బలమును = బలమును; ఇరవుగన్ = నివాసముగా; ఆ = ఆ; రెంటి = రెండింటి; వలనన్ = వలనను; ఇంద్రుడున్ = ఇంద్రుడును; పాద = పాదములు అనెడి; అంబురుహంబు = పద్మము; వలనన్ = వలనను; గతియున్ = గమనమును; అరుదుగన్ = అపూర్వముగ; హరియునున్ = ఉపేంద్రుడును; కలిగెన్ = కలిగెను.
భావము:- విరాట్పురుషుని చేతులవల్ల బలం, చేతుల బలంవల్ల ఇంద్రుడు, పాదాలవల్ల గమనం, పాదగతులవల్ల ఉపేంద్రుడు ఉద్భవించటం జరిగింది.

తెభా-3-901-క.
నాడీ పుంజమువల
ను రక్తము దానివలన దులును జఠరం
బు నాకఁలియును దప్పియుఁ
యము నా రెంటివలన బ్దులు పుట్టెన్.

టీక:- ఘన = గొప్ప; నాడీ = నాడుల; పుంజము = సమూహముల; వలననున్ = వలనను; రక్తమున్ = రక్తమును; దాని = దాని; వలన = వలనను; నదులునున్ = నదులును; జఠరంబునున్ = పొట్టయును; ఆకలియునున్ = ఆకలియును; దప్పికయున్ = దాహమును; అనయంబున్ = అవశ్యము; ఆ = ఆ; రెంటి = రెండింటి; వలనన్ = వలనను; అబ్దులున్ = సముద్రములును; పుట్టెన్ = పుట్టినవి.
భావము:- విరాట్పురుషుని నాడులవల్ల రక్తమూ, రక్తంవల్ల నదులూ, జఠరం వల్ల ఆకలిదప్పులూ, ఈ రెండింటివల్ల సముద్రాలు పుట్టాయి.

తెభా-3-902-క.
విను హృదయమువలనను మన
మును మనమునఁ దుహినకరుఁడు బుద్ధియుఁ జిత్తం
బు బ్రహ్మయు క్షేత్రజ్ఞుం
డును గలిగిరి యవ్విరాజుఁడుం బూరుషతన్.

టీక:- విను = వినుము; హృదయము = హదయము; వలననున్ = వలనను; మనమునున్ = మనస్సు; మనమునన్ = మనస్సులో; తుహినకరుడున్ = చంద్రుడును; బుద్ధియున్ = బుద్ధియును; చిత్తంబునన్ = చిత్తమున; బ్రహ్మయున్ = బ్రహ్మయును; క్షేత్రజ్ఞుండునున్ = క్షేత్రజ్ఞుండును {క్షేత్రజ్ఞుడు - క్షేత్రము (దేహము) ఉన్నదని తెలిసి అందు ఉన్నవాడు, నం. విణ – నేర్పరి, వ్యు. క్షేత్రం జానాతి, క్షేత్ర + జ్ఞా + క, కృ.ప్ర}; కలిగిరి = పుట్టిరి; ఆ = ఆ; విరాజుడు = విరాట్టును; పూరుషతన్ = పురుషత్వమున.
భావము:- విరాట్పురుషుని హృదయంవల్ల మనస్సూ, మనస్సువల్ల చంద్రుడూ, బుద్ధీ, చిత్తంవల్ల బ్రహ్మ, క్షేత్రజ్ఞుడు కలిగారు. ఇలా ఆ అండం నుండి సృష్టికారకుడైన పురుషుడు పుట్టాడు.

తెభా-3-903-వ.
మఱియు; విరాట్పురుషు నం దుదయించిన వ్యష్టిరూపంబు లగు నాకాశాది భూతంబులును శబ్దంబు మొదలగు భూతతన్మాత్రంబులును వాగాదీంద్రియ జాతంబును దదధిదేవతలును దమంతన సమిష్టిరూపుం డగు క్షేత్రజ్ఞుం బ్రవృత్తి ప్రవక్తకుం జేయ నసమర్థంబు లయ్యె; నెట్లనిన దేవాధిష్ఠితంబు లగు నింద్రియంబులు దాము వేర్వేఱ యయ్యీశ్వరుం బ్రవృత్తున్ముఖుం జేయనోపక క్రమంబునం దత్తదధిష్ఠానాదుల నొందె; నందు నగ్ని వాగింద్రియంబుతోడ ముఖంబు నొంది ప్రవర్తించిన విరాట్కార్యం బగు వ్యష్టి శరీరజాతం బనుత్పన్నం బయ్యె; నంత నాసయు ఘ్రాణేంద్రియంబుతోడ వాయువుం గూడిన నట్టిది యయ్యె; నాదిత్యుఁడు చక్షురింద్రియంబుతోడ నేత్రంబులు నొందిన వృథాభూతం బయ్యె; దిగ్దేవతాకం బగు కర్ణంబు శ్రోత్రేంద్రియంబుతోఁ గూడిన విరాట్కార్య ప్రేరణాయోగ్యం బయ్యె ఓషధులు రోమంబులం ద్వగింద్రియంబుఁ జెంది విఫలం బయ్యె; నద్దైవం బగు మేఢ్రంబు రేతంబు నొందినఁ దత్కార్యకరణాదక్షం బయ్యెఁ; బదంపడి గుదంబు మృత్యువు తోడ నపానేంద్రియంబుఁ జేరిన నది హైన్యంబు నొందె; విష్ణు దేవతాకంబు లగు చరణంబులు గతితోఁ గూడిన ననీశ్వరంబు లయ్యెఁ; బాణీంద్రియంబు లింద్రదైవతంబు లగుచు బలంబు నొందిన శక్తిహీనంబు లయ్యె; మఱియు నాడులు సనదీకంబులై లోహితంబు వొందిన నిరర్థకంబు లయ్యె; నుదరంబు సింధువుల తోడఁ జేరి క్షుత్పి పాసలం బొందిన వ్యర్థం బయ్యె; హృదయంబు మనంబు తోడం జంద్రు నొందిన నూరక యుండె; బుద్ధి బ్రహ్మాది దైవతంబై హృదయంబు నొందిన నిష్ఫలం బయ్యెఁ జిత్తం బభిమానంబుతో రుద్రునిం జెందిన విరాట్కార్య జాతం బనుభూతం బయ్యె; నంతఁ జైత్యుం డగు క్షేత్రజ్ఞుండు హృదయాధిష్ఠానంబు నొంది చిత్తంబు తోడం బ్రవేశించిన విరాట్పురుషుండు సలిల కార్యభూత బ్రహ్మాండంబు నొంది ప్రవృత్యున్ముఖక్షముం డయ్యె; సుప్తుం డగు పురుషునిం బ్రాణాదులు దమ బలంబుచే భగవదప్రేరితంబు లగుచు నుత్థాపనా సమర్థంబు లగు చందంబున నగ్న్యాదులు స్వాధిష్ఠాన భూతంబు లగు నిద్రియంబులతోడ దేవాది శరీరంబుల నొందియు నశక్తంబు లయ్యె"నని మఱియు "నవ్విరాట్పురుషుని ననవరతభక్తిం జేసి విరక్తులై యాత్మల యందు వివేకంబు గల మహాత్ములు చింతింపుదు రనియుఁ బ్రకృతిపురుష వివేకంబున మోక్షంబును బ్రకృతి సంబంధంబున సంసారంబును గలుగు"ననియుఁ జెప్పి మఱియు నిట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకనూ; విరాట్పురుషున్ = విరాట్పురుషుని; అందున్ = అందు; ఉదయించిన = పుట్టిన; వ్యష్టి = వేరు వేరు అయిన; రూపంబుల్ = రూపములు; అగు = అయిన; ఆకాశాది = ఆకాశము మొదలైన {ఆకాశాది - 1ఆకాశము 2తేజము 3వాయువు 4జలము 5పృథ్వి అను పంచభూతములు}; భూతంబులునున్ = (పంచ) భూతములును; శబ్దంబున్ = శబ్దము; మొదలగు = మొదలగు; భూతతన్మాత్రంబులున్ = భూతతన్మాత్రములును {పంచతన్మాత్రలు - 1శబ్దము 2స్పర్శ 3 దృక్కు (చూపు) 4ఘ్రాణము (వాసన) మరియు 5రస (రుచి)}; వాగాది = వాక్కు మొదలగు {వాగాది - పంచజ్ఞానేద్రియములు, 1వాక్కు 2కన్నులు 3ముక్కు 4 చెవులు 5చర్మము}; ఇంద్రియ = ఇంద్రియముల; జాతంబున్ = సమూహములును; తత్ = వాని; అధిదేవతలునున్ = అధిదేవతలును; తమంతన = తమంతతాము; సమిష్టిరూపుడు = అన్నికలసి ఒక రూపముగ యైనవాడు; క్షేత్రజ్ఞున్ = క్షేత్రజ్ఞుని; ప్రవృత్తిన్ = ప్రవర్తనమున; ప్రవర్తకున్ = వర్తించువానిగ; చేయన్ = చేయుటకు; అసమర్థంబులు = అశక్తులు; అయ్యెన్ = అయినవి; ఎట్లు = ఏ విధముగ; అనిన్ = అనినచో; దేవా = దేవతలచే; అధిష్ఠితంబులున్ = అధిపత్యము కలవి; అగు = అయిన; ఇంద్రియంబులున్ = ఇంద్రియములు; తాము = తాము; వేర్వేఱ = వేరు వేరుగ; ఆ = ఆ (పై); ఈశ్వరున్ = అధిపతిని; ప్రవృత్తిన్ = ప్రవర్తించుటకు; ఉన్ముఖున్ = సుముఖుని; చేయన్ = చేయుటకు; ఓపక = చాలక; క్రమంబునన్ = క్రమముగ; తత్తత్ = ఆయా; అధిష్ఠాన = స్థానములు; ఆదులన్ = మొదలైనవానిని; ఒందెన్ = చెందెను; అందున్ = వానిలో; అగ్ని = అగ్నిదేవుడు; వాగింద్రియంబున్ = మాట్లాడు ఇంద్రియము; తోడన్ = తోటి; ముఖంబున్ = నోటిని; పొంది = చెంది; ప్రవర్తించినన్ = ప్రవర్తించగా; విరాట్కార్యంబున్ = విరాట్పురుషుని పని; అగు = అయిన; వ్యష్టి = వేర్వేరు; శరీర = దేహభాగముల; జాతంబున్ = మొత్తము; అనుత్పన్నంబు = ఇంకను పుట్టనిది; అయ్యెన్ = అయ్యెను; అంతన్ = అంతట; నాసయున్ = ముక్కుయు; ఘ్రాణేంద్రియంబున్ = వాసన చూసే ఇంద్రియము; తోడన్ = తోటి; వాయువున్ = వాయువును; కూడినన్ = కలియగా; అట్టిద = అటువంటిదే; అయ్యెన్ = అయినది; ఆదిత్యుండు = సూర్యుడు; చక్షురింద్రియంబున్ = చూడగల ఇంద్రియముల; తోడన్ = తోటి; నేత్రంబులన్ = నేత్రములను; ఒందినన్ = చెందగా; వృథాభూతంబున్ = వ్యర్థమైనది; అయ్యెన్ = అయినది; దిగ్దేవతాకంబున్ = దిక్కుల దేవతలు కలది; అగు = అయిన; కర్ణంబున్ = చెవి; శ్రోత్రేంద్రియంబున్ = వినగల ఇంద్రియములు; తోన్ = తోటి; కూడినన్ = కూడగా; విరాట్ = విరాట్పురుషుని; కార్య = పనికి; ప్రేరణా = ప్రేరేపించుటకు; అయోగ్యంబున్ = తగనవి; అయ్యెన్ = అయినవి; ఓషధులున్ = ఓషధులు; రోమంబులన్ = వెంట్రుకలను; త్వగింద్రియంబున్ = చర్మేంద్రియమును; చెంది = చెంది; విఫలంబున్ = ఫలితము లేనివి; అయ్యెన్ = అయినవి; అప్ = జలము; దైవంబున్ = దేవతగా కలది; అగు = అయిన; మేఢ్రంబున్ = పురుషావయవము; రేతంబున్ = శుక్రమును; ఒందినన్ = చెందినను; తత్ = ఆ; కార్య = పని; కరణ = చేయుటకు; అదక్షంబున్ = అసమర్థము; అయ్యెన్ = అయినది; పదంపడి = తరువాత; గుదంబున్ = మలావయవమును; మృత్యువున్ = మరణము; తోడన్ = తోటి; అపానేంద్రియంబున్ = అపానేంద్రియమును; చేరినన్ = చెందినను; అది = అదియు; హైన్యంబున్ = హీనత్వమును; ఒందెన్ = చెందెను; విష్ణు = విష్ణువు; దేవతాకంబులు = దేవతలుగా కలవి; అగు = అయిన; చరణంబులున్ = పాదములు; గతి = గమనము; తోన్ = తోటి; కూడినన్ = కూడినను; అనీశ్వరంబులు = అసమర్థంబులు; అయ్యెన్ = అయినవి; పాణీంద్రియంబుల్ = చేతులు; ఇంద్రదైవతంబులు = ఇంద్రుని దేవతగా కలవి; అగుచున్ = అవుతూ; బలంబున్ = బలమును; ఒందినన్ = చెందినను; శక్తి = శక్తి; హీనంబులున్ = లేనివి; అయ్యెన్ = అయినవి; మఱియున్ = ఇంకను; నాడులు = నాడులు; సనత్ = నదులతో; ఏకంబులున్ = కూడినవి; ఐ = అయ్యి; లోహితంబున్ = రక్తమును {లోహితము - ఎఱ్ఱనిది, రక్తము}; ఒందినన్ = చెందినను; నిరర్థకంబుల్ = పనికిరానివి; అయ్యెన్ = అయ్యెను; ఉదరంబున్ = కడుపును; సింధువున్ = సముద్రములు; తోడన్ = తోటి; చేరి = చేరి; క్షుత్ = ఆకలియును; పిపాసలన్ = దప్పికలను; పొందినన్ = చెందినను; వ్యర్థంబున్ = పనికిరానిది; అయ్యెన్ = అయినది; హృదయంబున్ = హృదయమును; మనంబున్ = మనస్సు; తోడన్ = తోటి; చంద్రునిన్ = చంద్రుని; ఒందినన్ = చెందినను; ఊరకన్ = ఉత్తినే; ఉండె = ఉండిపోయెను; బుద్ధి = బుద్ధియును; బ్రహ్మ = బ్రహ్మ; ఆది = మొదలగు; దైవతంబున్ = దేవతలుగా కలది; ఐ = అయ్యి; హృదయంబున్ = హృదయమును; ఒందినన్ = చెందినను; నిష్ఫలంబున్ = ఫలితము లేనిది; అయ్యెన్ = అయినది; చిత్తంబున్ = చిత్తము; అభిమానంబునన్ = అభిమానము; తోన్ = తోటి; రుద్రునిన్ = రుద్రుని; చెందినన్ = చెందినను; విరాట్ = విరాట్పురుషుని; కార్య = పనుల; జాతంబున్ = మొత్తము; అనుభూతంబున్ = పుట్టనిది; అయ్యెన్ = అయినది; అంతన్ = అంతట; చైత్యుండు = చిత్తమున ఉండువాడు; అగు = అయిన; క్షేత్రజ్ఞుండున్ = క్షేత్రజ్ఞుడు; హృదయ = హృదయమున; అధిష్ఠానంబున్ = నివాసముగ ఉండుటను; ఒంది = చెంది; చిత్తంబు = చిత్తము; తోడన్ = తోటి; ప్రవేశించినన్ = ప్రవేశించగా; విరాట్పురుషుండు = విరాట్పురుషుడు; సలిల = జలములే; కార్య = కార్యము లను; భూత = నెరవేర్చునవిగా; బ్రహ్మాండంబున్ = బ్రహ్మాండమును; ఒంది = చెంది; ప్రవృత్తిన్ = ప్రవర్తించుటకు; ఉన్ముఖ = పూనుకొన; అక్షముండు = సమర్థుండు; అయ్యెన్ = అయ్యెను; సుప్తుండు = నిద్రించువాడు; అగు = అయిన; పురుషునిన్ = పురుషుని; ప్రాణా = ప్రాణము; ఆదులు = మొదలైనవి; తమ = తమ యొక్క; బలమున్ = శక్తి; చేన్ = చేత; భగవత్ = భగవంతునిచే; ప్రేరితంబులున్ = ప్రేరేపింపబడినవి; ఉత్తాపనా = లేపుటకు; అసమర్థంబులున్ = సమర్థత లేనివి; అగున్ = అగు; చందంబునన్ = విధముగ; అగ్ని = నిప్పు; ఆదులున్ = మొదలైనవి; స్వ = తమ యొక్క; అధిష్ఠాన = నివాసమున; భూతంబులున్ = కూడినవి; అగు = అయిన; ఇంద్రియంబుల్ = ఇంద్రియముల; తోడన్ = తోటి; దేవ = దైవము; ఆది = మొదలైన; శరీరంబులన్ = దేహములను; ఒందియున్ = చెందియును; అశక్తంబులున్ = శక్తిలేనివి; అయ్యెన్ = అయినవి; అని = అని; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; విరాట్పురుషునిన్ = విరాట్పురుషుని; అనవరత = ఎడతెగని; భక్తిన్ = భక్తి; చేయి = వలన; విరక్తులు = విరాగులు; ఐ = అయ్యి; ఆత్మలన్ = తమ; అందున్ = అందు; వివేకము = వివేకము; కల = కలిగిన; మహాత్ములు = గొప్పవారు; చింతింపుదురు = తలచెదరు; అనియున్ = అనియును; ప్రకృతి = ప్రకృతి; పురుషుడున్ = పురుషుల; వివేకంబునన్ = జ్ఞానము వలన; మోక్షంబునున్ = మోక్షమును; ప్రకృతి = ప్రకృతి యొక్క (మాత్రమే); సంబంధంబున = సంబంధము వలన; సంసారంబున్ = సంసారబంధమును; కలుగున్ = కలగును; అనియున్ = అనియును; చెప్పి = చెప్పి; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఇంకా విరాట్పురుషునిలో జన్మించిన ఆకాశం మొదలైన పంచభూతాలూ, శబ్దం మొదలైన పంచతన్మాత్రలూ, వాక్కు మొదలైన ఇంద్రియాలూ, ఆ ఇంద్రియాల అధిదేవతలూ వేరువేరుగా ఉండిపోయాయి. అవి తమలో తాము సమైక్యం పొందనందువల్ల జీవుణ్ణి ప్రవర్తింపజేయలేక పోయాయి. ఆ యా దేవతలు అధిష్ఠించిన ఇంద్రియాలు, తాము ప్రత్యేకంగా క్షేత్రజ్ఞుని లోకవ్యవహారానికి ప్రేరేపింపజాలక వరుసగా ఆయా స్థానాలలో ఉండిపోయాయి. విరాట్పురుషుని ముఖాన అగ్ని వాగింద్రియంతో కూడి వర్తించి నప్పటికీ విరాట్పురుషుని కార్యమైన ఇతరేతర జీవుల శరీరోత్పత్తి కలుగలేదు. అట్లే విరాట్పురుషుని నాసికలో వాయువు జ్ఞానేంద్రియంతో వర్తించినప్పటికీ జీవోత్పత్తి కాలేదు. అదే విధంగా కన్నులలో సూర్యుడు చక్షురింద్రియంతో కూడి వర్తించినా వ్యర్థమే అయింది. అలాగే చెవులలో దిక్కులు శ్రోత్రేంద్రియంతో కూడినప్పుడు కూడ విరాట్పురుషుని కార్యం సాధించటంలో వృథా అయ్యాయి. రోమాలలో త్వగింద్రియంతో ఓషధులు వర్తించి విఫలమయ్యాయి. అలాగే జలం అధిదేవతగా కల పురుషాంగం రేతస్సును పొందికూడా సృష్టికి సమర్థం కాలేదు. మలావయవం మృత్యువుతోకూడి అపానేంద్రియాన్ని చేరి నిరర్థకమే అయింది. హరిదేవతాకాలైన పాదాలు గతితో కూడి శక్తిహీనాలు అయ్యాయి. ఇంద్రదేవతాకాలైన చేతులు బలాన్ని పొంది కూడా నిరుపయోగాలైనాయి. నదీ దేవతాకాలైన నాడులు రక్తంతో కూడినప్పటికీ నిరర్థకాలైనాయి. కడుపు సముద్రాలతో కూడి ఆకలిదప్పులను పొందినప్పటికీ నిష్ప్రయోజనమైంది. హృదయం మనస్సుతో చంద్రుణ్ణి పొందికూడా ఊరక ఉంది. అట్లే బుద్ధి హృదయాన్ని పొందినప్పటికీ, చిత్తం రుద్రుణ్ణి చెందినప్పటికీ విరాట్పురుషుని కార్యాలు ఉత్పన్నం కాలేదు. అనంతరం అన్నిటికీ సమైక్యం కుదుర్పగల క్షేత్రజ్ఞుడు హృదయాన్ని అధిష్ఠించి, చిత్తంలో ప్రవేశించాడు. అప్పుడు విరాట్పురుషుడు, జలాలలో తేలుతున్న బ్రహ్మాండాన్ని అధిష్ఠించి సృష్టికార్యాన్ని ప్రవర్తింప గలిగాడు. నిద్రించిన జీవుని ప్రాణాలు మొదలైనవి తమ సొంతబలంతో కదలాడలేవు. లేవటానికి సమర్థాలు కావు. ఆ విధంగా అగ్ని మొదలైనవి తమకు అధిష్ఠానాలైన ఇంద్రియాలతో దేవాది శరీరాలు పొందికూడా, అవి శక్తిహీనా లయ్యాయి. క్షేత్రజ్ఞుడు ప్రవేశించగానే మెలకువ వచ్చినట్లు ఆయా శరీరభాగాలు పనిచేయటం ప్రారంభించాయి. అటువంటి విరాట్పురుషుని ఎడతెగని భక్తితో వివేకం కలిగి విరక్తులైన మహాత్ములు ధ్యానిస్తారు. ప్రకృతి, పురుషుల యథార్థజ్ఞానం వల్ల మోక్షమూ, కేవలం ప్రకృతి సంబంధంతో సంసారబంధమూ కలుగుతుంది” అని చెప్పి కపిలుడు దేవహూతితో మళ్ళీ ఇలా అన్నాడు.