పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/కన్యకానవక వివాహంబు


తెభా-3-848-క.
ని పలికి యమ్మరీచిం
ని యుద్వాహార్థ మునిచి మలజుఁ డంతం
నందను లగు నారద
కాదులఁ గూడి యాత్మదనము కరిగెన్.

టీక:- అని = అని; పలికి = చెప్పి; ఆ = ఆ; మరీచిన్ = మరీచిని; కని = చూసి; ఉద్వాహన్ = వివాహము; అర్థమున్ = కోసము; ఉనిచి = ఉంచి; కమలజుండు = బ్రహ్మదేవుడు {కమలుజుడు - కమలమున పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; అంతన్ = అంతట; తన = తన యొక్క; నందనులు = పుత్రులు; అగు = అయిన; నారద = నారదుడు; సనక = సనకుడు; ఆదులన్ = మొదలగవారిని; కూడి = కలిసి; ఆత్మ = స్వంత; సదనమున్ = నివాసమున; కున్ = కు; అరిగెన్ = వెళ్ళెను.
భావము:- ఈ విధంగా పలికి బ్రహ్మదేవుడు ఆ మరీచి మహర్షిని వివాహ నిమిత్తం అక్కడే ఉంచి తన కుమారులైన నారదుడు, సనకుడు మొదలైన వారితో కలిసి తన నివాసానికి వెళ్ళాడు

తెభా-3-849-వ.
అంత; నా కర్దముండు గమలసంభవ చోదితుం డగుచు యథోచితంబుగా నాత్మీయ దుహితుల వివాహంబు సేయం దలంచి మరీచికిం గళ యను కన్యకను; నత్రికి ననసూయను; నంగిరసునకు శ్రద్ధను; బులస్త్యునకు హవిర్భువును; బులహునకు గతిని; గ్రతువునకుఁ గ్రియను; భృగునకు ఖ్యాతిని; వసిష్ఠునకు నరుంధతిని; నధర్వునకు శాంతినింగా నిజ కులాచార సరణిం బరిణయంబు గావించిన వారును గృత దాన పరిగ్రహులును గర్దమ కృత సంభావనా సంభావితు లగుచు నతని చేత ననుజ్ఞాతులై జాయాసహితు లగుచు నిజాశ్రమ భూములకుం జని; రంతం గర్దముండు దేవోత్తముం డగు విష్ణుండు దన మందిరంబున నవతరించి వసించి యుంటం దన చిత్తంబున నెఱింగి; వివిక్త స్థలంబునకుం జని యచ్చటఁ గపిలునికి వందన బాచరించి యిట్లనియె.
టీక:- అంతన్ = అంతట; ఆ = ఆ; కర్దముండున్ = కర్దముడు; కమలసంభవ = బ్రహ్మదేవునిచే; చోదితుడు = ప్రేరేపింపబడినవాడు; అగుచున్ = అవుతూ; యథోచితంబుగాన్ = తగిన విధముగా; ఆత్మీయ = తన యొక్క; దుహితులన్ = కూతుర్లకు; వివాహంబున్ = వివాహమును; చేయన్ = చేయవలెనని; తలంచి = అనుకొని; మరీచి = మరీచి; కిన్ = కి; కళ = కళ; అను = అను; కన్యకను = కన్యను; అత్రి = అత్రి; కిన్ = కి; అనసూయను = అనసూయను; అంగిరసున్ = అంగిరసుని; కున్ = కి; శ్రద్ధను = శ్రద్ధను; పులస్త్యున్ = పులస్త్యుని; కున్ = కి; హవిర్భువును = హవిర్భువును; పులహున్ = పులహున; కున్ = కి; గతిని = గతిని; క్రతువున్ = క్రతువున; కున్ = కి; క్రియను = క్రియని; భృగువున్ = భృగువున; కున్ = కు; ఖ్యాతిని = ఖ్యాతిని; వసిష్ఠున్ = వసిష్ఠుని; కున్ = కి; అరుంధతి = అరుంధతిని; అధర్వున్ = అధర్వుని; కున్ = కి; శాంతినిన్ = శాంతిని; కాన్ = అగునట్లు; నిజ = తన; కుల = వంశ; ఆచార = ఆచారముల; సరణిన్ = విధముగ; పరిణయంబున్ = వివాహమును; కావించినన్ = చేసిన; వారునున్ = వారు కూడ; కృత = చేసిన; దాన = దానమును; పరిగ్రాహులునున్ = తీసుకొన్నవారును; కర్దమ = కర్దమునిచే; కృత = చేయబడిన; సంభావన = గౌరవములచే; సంభావితులున్ = ఆదరింపబడినవారు; అగుచున్ = అవుతూ; అతని = అతని; చేతన్ = వద్ద; అనుజ్ఞాతులు = వీడ్కోలు పొందినవారు; ఐ = అయ్యి; జాయా = భార్యతో; సహితులు = కూడినవారు; అగుచున్ = అవుతూ; నిజ = తమ; ఆశ్రమ = ఆశ్రమములు ఉన్న; భూముల్ = ప్రదేశముల; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; అంతన్ = అంతట; కర్దముండున్ = కర్దముడు; దేవోత్తముండు = భగవంతుడు {దేవోత్తముడు - దేవుళ్ళలో ఉత్తముడు, విష్ణువు}; అగు = అయిన; విష్ణుండు = విష్ణుమూర్తి; తన = తన యొక్క; మందిరంబునన్ = గృహమున; అవతరించి = అవతారము ధరించి; వసించి = నివసించి; ఉంటన్ = ఉండుటను; చిత్తంబునన్ = మనసులో; ఎఱింగి = తెలిసి; వివిక్త = ఒంటరి; స్థలంబున్ = ప్రదేశమున; కున్ = కు; చని = వెళ్ళి; అచ్చటన్ = అక్కడ; కపిలున్ = కపిలుని; కిన్ = కి; వందనము = నమస్కారము; ఆచరించి = చేసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- తరువాత ఆ కర్దముడు బ్రహ్మదేవుని ఆదేశానుసారం తన కుమార్తెలకు యథావిధిగా పెండ్లిండ్లు చేయాలని నిశ్చయించినవాడై కళను మరీచికి, అనసూయను అత్రికి, శ్రద్ధను అంగిరసునకు, హవిర్భువును పులస్త్యునకు, గతిని పులహువునకు, క్రియను క్రతువుకు, ఖ్యాతిని భృగువుకు, అరుంధతిని వసిష్ఠునకు, శాంతిని అధ్వర్యునకు ఇచ్చి తన కులాచారం ప్రకారం వివాహం చేయగా ఆ మునులు కర్దముని కన్యలను పెండ్లాడి అతని సత్కారాలు అందుకొని ఆయన అనుజ్ఞతో సతీసమేతంగా తమ తమ ఆశ్రమాలకు వెళ్ళారు. ఆ తరువాత కర్దముడు దేవదేవుడైన విష్ణువు తన ఇంట్లో పుట్టి పెరుగుతున్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని ఏకాంత ప్రదేశంలో కపిలునికి నమస్కరించి ఇలా అన్నాడు.

తెభా-3-850-సీ.
"తురాత్మ! విను మాత్మ కృము లైనట్టి య-
మంగళ భూత కర్మంబు లనెడి
దావాగ్ని శిఖలచే దందహ్యమాను లై-
ట్టి జీవులు దుదముట్టలేక
పాయక సంసారద్ధులై యుందురు-
ద్భవహేతుభూతంబు లయిన
కల దేవతలుఁ బ్రన్నులు నగుదురు-
హుజన్మ పరిచిత ప్రాప్త యోగ

తెభా-3-850.1-తే.
చిరసమాధి తపోనిష్ఠచే వివిక్త
దేశముల యోగిజనములు ధృతుల నే మ
హానుభావు విలోకింతు ట్టి దివ్య
పురుషరత్నంబ! నా యింటఁ బుట్టి తీవు.

టీక:- చతురాత్మ = చాతుర్యముకలవాడ, {విష్ణుసహస్రనామములు శ్రీశంకర భాష్యం 137వ నామం, 769వ నామం, బ్రహ్మ, ప్రజాపతులు, కాలము, జీవులు సృష్టి విభూతులును, విష్ణు, మన్వాదులు, కాలము, భూతములు స్థితి విభూతులును, రుద్ర, కాల, అన్తకాదులు, జంతువులు లయ విభూతులును అను నాలుగు విభూతుల త్రయం కలవాడు}; వినుము = వినుము; ఆత్మ = తాము; కృతములు = చేసికొన్నవి; ఐనట్టి = అయినట్టి; అమంగళ = చెడుగా; ఆభూత = పరిణమించునట్టి; కర్మంబులన్ = పనులు; అనెడి = అనే; దావాగ్ని = కారుచిచ్చు {దావాగ్ని - దావము (అడవి) అందలి అగ్ని, కారుచిచ్చు}; శిఖలు = మంటల; చేన్ = వలన; దందహ్యమానులు = కాలిపోతున్నవారు; ఐనట్టి = అయినట్టి; జీవులున్ = ప్రాణులు; తుదముట్టలేక = ఆర్పివేయలేక; పాయక = బయటపడలేక; సంసార = సంసారమునకు; బద్ధులు = కట్టబటినవారు; ఐ = అయ్యి; ఉందురు = ఉంటారు; తత్ = ఆ; భవ = సంసారమునకు; హేతు = కారణ; భూతంబులు = అంశములు; అయిన = అయినట్టి; సకల = సమస్తమైన; దేవతలునున్ = దేవతలును; ప్రసన్నులు = ప్రసన్నమైనవారు; అగుదురు = అవుతారు; బహు = అనేక; జన్మ = జన్మములనుండి; పరిచిత = తెలిసి; ప్రాప్త = పొందిన; యోగ = యోగముల యొక్క; చిర = అధికమైన; సమాధి = సమాధియును; తపస్ = తపస్సు యొక్క; నిష్ఠ = నిష్ఠలు; చే = వలన;
వివిక్త = ఒంటరి; దేశములన్ = ప్రదేశములందు; యోగి = యోగులైన; జనములు = జనులు; ధృతులన్ = ధారణలచే; ఏ = ఏ; మహానుభావున్ = గొప్పవానిని; విలోకింతురు = దర్శించెదరో; అట్టి = అటువంటి; దివ్య = దివ్యమైన; పురుష = పురుషులలో; రత్నంబ = రత్నము వంటివాడా; నా = నా యొక్క; ఇంటన్ = ఇంటిలో; పుట్టితివి = జన్మంచితివి; ఈవున్ = నీవు.
భావము:- “ఓ మహాత్మా! విను. పూర్వం తాము చేసిన అమంగళ కార్యాలు అనే కార్చిచ్చులో కాలిపోతూ ఉన్న జీవులు బైట పడలేక ఎడతెగని సంసార బంధాలలో బంధింపబడి ఉంటారు. దేవతల అనుగ్రహం వల్లా, బహుజన్మల పరిచయం వల్లా ప్రాప్తించిన యోగసమాధిలో నిష్ఠాగరిష్ఠులైన యోగిశ్రేష్ఠులు ఏకాంత ప్రదేశంలో ఏమరుపాటు లేక ఏ మహానుభావుణ్ణి దర్శిస్తారో అటువంటి దేవాదిదేవుడవైన నీవు నా ఇంటిలో జన్మించావు.

తెభా-3-851-వ.
మఱియు; సంసారచక్ర పరిభ్రామ్యమాణుల మగుచు గ్రామ్యుల మయిన మా వర్తనంబులను గణింపక మదీయ గృహంబునం బూర్వంబునం బ్రతిశ్రుతంబు లైన భవదీయ వాక్యంబులు దప్పకుండ ననుగ్రహింప నుదయించి"తని; వెండియు నిట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకనూ; సంసార = సంసారము అనెడి; చక్రన్ = చక్రమున; పరిభ్రామ్యమాణులు = గిరగిర తిరుగుచున్న వారము; అగుచున్ = అవుతూ; గ్రామ్యులము = మోటు మనుషులము; అయిన = అయినట్టి; మా = మా యొక్క; వర్తనంబులున్ = ప్రవర్తనలను; గణింపక = లెక్కింపక; మదీయ = మా యొక్క; గృహంబునన్ = ఇంటిలో; ప్రతిశ్రుతంబులు = చక్కగా వినబడినవి; ఐన = అయినట్టి; భవదీయ = నీ యొక్క; వాక్యంబులున్ = మాటలను; తప్పకుండన్ = తప్పకుండ; అనుగ్రహింపను = అనుగ్రహించుటకై; ఉదయించితి = అవతరించితివి; వెండియున్ = మరియు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఇంకా సంసార చక్రంలో త్రిప్పబడుతూ, పరమ పామరులమైన మా ప్రవర్తన లెక్కించక, పూర్వం ఆనతి ఇచ్చిన మేరకు మాట తప్పకుండా నన్ను అనుగ్రహించటానికై నా కుమారుడవై జన్మించావు” అని మళ్ళీ ఇలా అన్నాడు.

తెభా-3-852-క.
"తపోయఁగ నప్రాకృత
యుక్త చతుర్భుజాది వదవతారం
బులు నీ కనురూపములై
పొలుపొందుం గాదె పరమపురుష! మహాత్మా!

టీక:- తలపోయగన్ = విచారించి చూసిన; అప్రాకృత = ప్రకృతికి అతీతమైన; బల = శక్తితో; యుక్త = కూడిన; చతుర్భుజ = చతుర్భుజుడు; ఆది = మొదలగు; భవత్ = నీ యొక్క; అవతారంబులున్ = అవతారములు; నీకున్ = నీకు; అనురూపములు = ఉపరూపములు; ఐ = అయ్యి; పొలుపొందున్ = చక్క నగును; కాదె = కదా; పరమపురుష = అత్యున్న మైన పురుషుడ; మహాత్మా = గొప్పవాడ.
భావము:- “ఓ పరమపురుషా! మహాత్మా! ప్రకృతికి అతీతమైన బలపరాక్రమాలు కలిగి నాలుగు చేతులతో ప్రకాశించే నీ అనేక అవతారాలు అన్నివిధాల నీకు అనుగుణంగా అలరారుతున్నాయి.

తెభా-3-853-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతేకాక...

తెభా-3-854-క.
యము భవదీయాశ్రిత
సంరక్షణముకొఱకు మ్మతితోఁ దా
ల్చి మానవ రూపంబులు
నురూపము లయ్యెఁ గాదె రి! నీకెపుడున్.

టీక:- అనయమున్ = అవశ్యము; భవదీయ = నీ యొక్క; ఆశ్రిత = ఆశ్రయించిన; జన = జనులను; సంరక్షణము = చక్కగ రక్షించుట; కొఱకున్ = కోసమై; సమ్మతి = అంగీకారము; తోన్ = తోటి; తాల్చిన = ధరించిన; మానవ = మానవుల; రూపంబులునున్ = రూపములును; అను = ఉప; రూపములు = రూపములు; అయ్యెన్ = అయినవి; కాదె = కదా; హరి = విష్ణుమూర్తి; నీకున్ = నీకు; ఎప్పుడున్ = ఎల్లప్పుడును.
భావము:- ఓ హరీ! అనవరతం నిన్ను ఆశ్రయించే జనులను ఆదుకోడానికై నీవు అంగీకరించే రూపాలు నీకు అనురూపాలే అవుతూ ఉంటాయి.

తెభా-3-855-క.
సుహిత తత్త్వజ్ఞానా
ర్థము విద్వజ్జనగణంబు విలి నమస్కా
ము లోలిఁ జేయు పదపీ
ము గల నినుఁ బొగడవశమె వణిల్లంగన్.

టీక:- సుమహిత = మిక్కిలి గొప్పదైన; తత్త్వ = తత్త్వము గురించిన; జ్ఞాన = జ్ఞానమును; అర్థమున్ = కోరి; విద్వత్ = విద్వాంసులు అయిన; జన = జనముల; గణంబున్ = సమూహములు; తవిలి = లగ్నులై; నమస్కారములున్ = నమస్కారములు; ఓలిన్ = వరుసగా; చేయు = చేస్తుండే; పద = పాదములు ఉంచుకొను; పీఠమున్ = పీట; కల = కలిగిన; నినున్ = నిన్ను; పొగడన్ = కీర్తించుట; వశమే = శక్యమా ఏమిటి; ఠవణిల్లంగన్ = నొక్కిచెప్పాలంటే.
భావము:- పరమ పవిత్రమైన తత్త్వజ్ఞానాన్ని పొందడం కోసం విద్వాంసులైనవారు విడువకుండా నమస్కరించే పాదపీఠం కల నిన్ను వర్ణించడం ఎవరికి సాధ్యం?

తెభా-3-856-సీ.
మధిక షడ్గుణైశ్వర్య కారణుఁడవు-
రమేశ్వరుండవు ప్రకృతిపురుష
హదహంకార తన్మాత్ర తత్క్షోభక-
హేతుకాలాత్మ విఖ్యా ధృతివి
గదాత్మకుఁడవు చిచ్ఛక్తివి నాత్మీయ-
ఠర నిక్షిప్త విశ్వప్రపంచ
మును గల సర్వజ్ఞమూర్తివి స్వచ్ఛంద-
క్తి యుక్తుండవు ర్వసాక్షి

తెభా-3-856.1-తే.
గుచుఁ గపిలాఖ్య దనరారు ట్టి నీకు
నఘ మ్రొక్కెదఁ బుత్రుండ గుచు నీవు
నాకుఁ బుట్టిన కతన ఋత్రయంబు
లనఁ బాసితి నిఁక భక్తరద! నేను.

టీక:- సమధిక = అత్యధికమైన; షడ్గుణ = షడ్గుణములకు {షడ్గుణములు భగవంతుని - 1ఐశ్వర్యము 2వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యము}; ఐశ్వర్య = ఐశ్వర్యములకును {అష్టైశ్వర్యములు - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6ప్రాకామ్యము 7ఈశత్వము 8నశిత్వము}; కారణుండవు = కారణము అయినవాడవు; పరమేశ్వరుండవు = భగవంతుడవు {పరమేశ్వరుడు - పరమ (అత్యున్నతమైన) ఈశ్వరుడు (ఫ్రభువు)}; ప్రకృతి = ప్రకృతి; పురుష = పురుషుడు; మహత్ = మహత్తు; అహంకార = అహంకారము; తన్మాత్ర = తన్మాత్రలు; తత్ = వాటి; క్షోభక = కల్లోలపరచు; హేతు = కారణము; కాలా = కాలము యొక్క; ఆత్మ = స్వరూపముగ; విఖ్యాత = ప్రసిద్దమైన; ధృతివి = ధారణమవు; జగత్ = విశ్వ; ఆత్మకుండవు = రూపుడవు; చిత్ = చైతన్యము అనెడి; శక్తివి = శక్తివి; ఆత్మీయ = తనయొక్క; జఠర = గర్భమునందు; నిక్షిప్త = ఉంచబడిన; విశ్వప్రపంచమును = సమస్తమైనప్రపంచమును; కల = కలిగిన; సర్వజ్ఞ = సర్వమునుతెలిసిన; మూర్తివి = స్వరూపివి; స్వచ్ఛంద = స్వతంత్రమైన; శక్తి = శక్తితో; యుక్తుండవు = కూడినవాడవు; సర్వ = సమస్తమునకు; సాక్షివి = చూచువాడవు; అగుచున్ = అవుతూ; కపిల = కపిలుడు అన; ఆఖ్యన్ = పేరుతో; తనరారు = అతిశయించెడి;
నీకున్ = నీకు; అనఘ = పుణ్యుడ; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; నీవున్ = నీవు; నాకున్ = నాకు; పుట్టిన = పుట్టినటువంటి; కతన = కారణమున; ఋణత్రయంబున్ = ఋణత్రయము {ఋణత్రయము - 1దేవఋణము 2పితృఋణము 3ఋషిఋణము}; వలనన్ = నుండి; పాసితిన్ = విడుదలైతిని; ఇంక = ఇంక; భక్తవరద = భక్తులకు వరములు ఇచ్చువాడ; నేను = నేను.
భావము:- ఓ భక్తవరదా! అపారమైన షడ్గుణైశ్వర్యాలకు నీవు కారణభూతుడవు. పరమేశ్వరుడవు. ప్రకృతి, పురుషుడు, మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు అన్నీ నీవే. వీనిని క్షోభింపజేయడానికి కారణమైన కాలం కూడ నీ స్వరూపమే. నీవు స్థిరమూర్తివి. జగదంతర్యామివైన స్వామివి. చిచ్ఛక్తి యుక్తుడవు. సమస్త విశ్వాన్నీ ఉదరంలో పదిలపరచుకున్న సర్వజ్ఞుడవు. స్వతంత్రుడవు. సర్వసాక్షివి. అటువంటి నీవు ఇప్పుడు కపిలు డనే పేరుతో వెలుగుతూ ఉన్నావు. ఓ పుణ్యపురుషా! నీకు నమస్కరిస్తున్నాను. నీవు నాకు పుత్రుడవై పుట్టడంవల్ల నేను దేవ, ఋషి, పితృ ఋణాలు మూడింటినుండి విముక్తి పొందాను.

తెభా-3-857-తే.
మానితవ్రత యోగసమాధి నియతి
చెంది భవదీయ పాదారవింద యుగము
డెందమునఁ జేర్చి శోకంబు లందుఁ దొలఁగి
సంచరించెద నంచిత స్థలము లందు."

టీక:- మానిత = గొప్ప; వ్రత = వ్రతములు; యోగ = యోగములు; సమాధి = సమాధియును; నియతిన్ = నియమములను; చెంది = పొంది; భవదీయ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; అరవింద = పద్మముల; యుగమున్ = జంటను; డెందమున్ = మనసు నందు; చేర్చి = ధ్యానము చేసి; శోకంబుల్ = దుఃఖముల; అందున్ = నుండి; తొలగి = విముక్తుడనై; సంచరించెదన్ = ఉండెదను; అంచిత = పవిత్రమైన; స్థలముల్ = ప్రదేశముల; అందున్ = లో.
భావము:- ఉత్తమ వ్రతాలలో, యోగాలలో, ధ్యానాలలో నియమం కలవాడినై, నీ రెండు పాదపద్మాలను నా హృదయంలో పదిల పరచుకొని దుఃఖాలన్నింటినీ దూరం చేసికొని, పుణ్యప్రదేశాలలో సంచరిస్తాను”.

తెభా-3-858-క.
ని యిట్లు విన్నవించిన
మునిపుంగవుఁ డైన కర్దముని వచనంబుల్
విని భగవంతుం డగు న
య్యఘుఁడు కపిలుండు పలికె ర్మిలిదోఁపన్.

టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; విన్నవించిన = వినిపించగ; ముని = మునులలో; పుంగవుడు = ఉత్తముడు; ఐన = అయినట్టి; కర్దముని = కర్దముని; వచనంబులున్ = మాటలను; విని = విని; భగవంతుండు = భగవంతుడు; అగున్ = అయిన; ఆ = ఆ; అలఘుండు = గొప్పవాడు; కపిలుండు = కపిలుడు; పలికెన్ = పలికెను; నర్మిలి = ఆదరము; తోపన్ = తోచునట్లు.
భావము:- అని ఈ విధంగా విన్నవించుకుంటున్న కర్దమ మునీంద్రుని మాటలు విని భగవంతుడైన కపిలుడు ఆయనను చూచి అనురాగ పూర్వకంగా ఇలా అన్నాడు.

తెభా-3-859-సీ.
"నాచేతఁ బూర్వంబునం బ్రతిశ్రుత మైన-
చనముల్ దప్పక రమునీంద్ర
నీ యింటఁ బుట్టితి నిర్హేతుకస్థితి-
భూరి దయాగుణంబున నవాప్త
కల కాముఁడ నేను న్మునివేషంబు-
రియించు టెల్ల నాకొకుఁ గాదు
విను మహాత్మకు లైన మునులకుఁ బరమాత్మ-
గురు సద్వివేకంబు సి చూపు

తెభా-3-859.1-తే.
త్త్వబోధంబుకొఱకును దాల్పఁబడిన
యంచితవ్యక్తమార్గమై ట్టి దేహ
ని తలంపుము మత్పదధ్యానభక్తి
ధీపరాయణ మహిమంబు దేజరిల్లు.

టీక:- నా = నా; చేతన్ = చేత; పూర్వంబునన్ = పూర్వముననే; ప్రతిశ్రుతములు = బాగవినిపించబడినవి; ఐన = అయినట్టి; వచనముల్ = మాటలను; తప్పక = తప్పకుండ; వర = ఉత్తమమైన; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠుడ; నీ = నీ; ఇంటన్ = ఇంటిలో; నిర్హేతుక = కారణరహితమైన; స్థితిన్ = స్థితికల; భూరి = అత్యధికమైన {భూరి - 1 తరువాత 34 సున్నాలు ఉండెడి సంఖ్య అదే కోటి అయితే 7 సున్నాలు}; దయా = దయకల; గుణంబునన్ = గుణములతో; అవాప్త = తీరిన; సకల = సమస్తమైన; కాముండ = కోరికలుకలవాడను; నేను = నేను; సత్ = మంచి; ముని = ముని యొక్క; వేషంబున్ = వేషమును; ధరియించుట = తాల్చుట; ఎల్లన్ = అంతా; నా = నా; కొఱకున్ = కోసము; కాదు = కాదు; విను = వినుము; మహా = గొప్ప; ఆత్మకులు = ఆత్మలు కలవారు; ఐన = అయిన; మునుల్ = మునుల; కున్ = కు; పరమాత్మ = పరమాత్మ సంబంధమైన; గురు = గొప్ప; సత్ = మంచి; వివేకమున్ = జ్ఞానమును; అరసి = తరచి; చూపు = చూపెడి;
తత్వ = తత్త్వజ్ఞానమును; బోధంబున్ = బోధించుట; కొఱకునున్ = కోసమై; తాల్పబడిన = ధరింపబడిన; అంచిత = పూజనీయమైన; వ్యక్త = కనబడు; మార్గము = విధము; ఐనట్టి = అయినట్టి; దేహము = శరీరము; అని = అని; తలంపుము = అనుకొనుము; మత్ = నా యొక్క; పద = పాదములందు; ధ్యాన = ధ్యానమును; భక్తి = భక్తియును కల; ధీ = బుద్ధితో; పరాయణన్ = ఆశ్రయించిన; మహిమంబు = గొప్పదనము; తేజరిల్లున్ = ప్రకాశించును.
భావము:- “ఓ కర్దమ మునీశ్వరా! నేను ఇంతకు ముందు నీకిచ్చిన వాగ్దానం మేరకు అవ్యాజమైన అనుగ్రహంతో నీ ఇంట పుట్టాను. అవాప్తకాముడనైన నాకు కోరికలు ఏవీ లేవు. నేను ఈ మునివేషం ధరించడం నాకోసం కాదు. మహాత్ములైన మునులకు పరమాత్మ సంబంధమైనదీ పరమ వివేకంతో కూడినదీ అయిన తత్త్వజ్ఞానాన్ని ప్రబోధించడం కోసం ధరించిన దేహంగా దీనిని తెలుసుకో. భక్తి పూర్వకంగా నా పాదాలను ధ్యానించు. మహిమతో విరాజిల్లే నీ బుద్ధిని నాయందు లగ్నం చెయ్యి.

తెభా-3-860-క.
ధిక నిష్ఠం గృతయో
మునన్ సన్న్యస్త సకలర్ముఁడవై మో
ముఁ బాసి భక్తిచే మో
క్షముకై భజియింపు నను వికారరహితుఁడై.

టీక:- సమధిక = అత్యధికమైన; నిష్ఠన్ = శ్రద్ధతో; కృత = చేయబడిన; యోగమునన్ = యోగమువలన; సన్న్యస్త = వదలివేసిన; సకల = సమస్తమైన; కర్ముండవు = కర్మములు కలవాడవు; ఐ = అయ్యి; మోహమున్ = వ్యామోహమును; పాసి = వదలివేసి; భక్తి = భక్తి; చే = చేత; మోక్షమున్ = ముక్తి; కై = కోసము; భజియింపు = భజించుము; ననున్ = నన్ను; వికార = (మనో) వికారములు; రహితుడు = లేనివాడు; ఐ = అయ్యి.
భావము:- నీవు అధికమైన నిష్ఠ కలవాడవై యోగమార్గాన్ని అనుసరించు. సమస్త కర్మలనూ నాకే అర్పించు. మోహానికి లొంగిపోకు. మనోవికారాలను విసర్జించు. మోక్షం కోసం నన్ను భక్తితో భజించు.

తెభా-3-861-క.
నుఁ బరమేశుఁ బరంజ్యో
తిని ననఘు ననంతు దేవదేవు సకలభూ
నికాయగుహాశయు నా
ద్యుని నజు నాద్యంతశూన్యు దురితవిదూరున్.

టీక:- ననున్ = నన్ను; పరమేశున్ = భగవంతుని {పర మేశుడు - పరమ (అత్యున్నతమైన) ఈశుడు, విష్ణువు}; పరంజ్యోతిన్ = భగవంతుని {పరం జ్యోతి - పరమము (కేవలము) అయిన జ్యోతిస్వరూపుడు, విష్ణువు}; అనఘున్ = భగవంతుని {అనఘుడు - పాపము లేనివాడు, విష్ణువు}; అనంతున్ = భగవంతుని {అనంతుడు - అంతము లేనివాడు, విష్ణువు}; దేవదేవున్ = భగవంతుని {దేవదేవుడు - దేవుళ్ళకు దేవుడు, విష్ణువు}; సకలభూతనికాయగుహాశయున్ = భగవంతుని {సకల భూత నికాయ గుహాశయుడు - సకల (సమస్తమైన) భూతనికాయము (జీవజాలము) యొక్క గుహ (హృదయము) నందు శయుడు (పడుకొని ఉండువాడు), విష్ణువు}; ఆద్యున్ = భగవంతుని {ఆద్యుడు - ఆది (మొదట) నుండి ఉన్నవాడు, విష్ణువు}; అజున్ = భగవంతుని {అజుడు - జన్మము లేనివాడు}; ఆద్యంతశూన్యున్ = భగవంతుని {ఆద్యంత శూన్యుడు - ఆది (మొదలు) అంతము(చివర) లు లేనివాడు}; దురితవిదూరున్ = భగవంతుని {దురిత విదూరుడు - దురితముల (పాపములు) విదూరుడు (పోగొట్టువాడు), విష్ణువు};
భావము:- పరమేశ్వరుడను, పరంజ్యోతిని, అనఘుడను, అనంతుడను, దేవదేవుడను, సమస్త ప్రాణుల హృదయాంతరాళలో నివసించేవాడను, ఆద్యుడను, అజుడను, ఆద్యంత రహితుడను, దురితదూరుడను అయిన నన్ను....

తెభా-3-862-క.
తిముగ భవదీయాంతః
ణసరోజాత కర్ణికాతలమున సు
స్థిరుఁ జేసి యింద్రియంబుల
నిసించి మనోంబకమున నెఱిఁ గను మనఘా!

టీక:- తిరముగన్ = స్థిరముగ; భవదీయ = నీ యొక్క; అంతఃకరణ = హృదయము అనెడి; సరోజాత = పద్మము యొక్క {సరోజాతము - సరసున జాతము (పుట్టునది), పద్మము}; కర్ణికా = (మధ్యలో ఉండు) బొడ్డుదమ్మి; తలమునన్ = ప్రదేశమున. సుస్థిరున్ = చక్కగ స్థిరపడినవానిగ; చేసి = చేసికొని; ఇంద్రియంబులన్ = ఇంద్రియములను; నిరసించి = నియమించి; మనస్ = మనస్సు అను; అంబకమునన్ = కన్నుతో; నెఱిన్ = నిండుగ; కనుము = దర్శించుము; అనఘా = పుణ్యుడ.
భావము:- ...స్థిరంగా నీ హృదయకమలం మధ్య పదిలంగా నిలిపి జితేంద్రియుడవై మనోనేత్రంతో సూటిగా దర్శించు.

తెభా-3-863-వ.
అట్లేని.
టీక:- అట్లు = అలా; ఏని = అయితే.
భావము:- అలా అయితే...

తెభా-3-864-క.
రిన మోక్షము నొందెద
ని పలికినఁ గర్దముండు మ్మునికులచం
ద్రుని వలగొని వందనములు
ముగ నతిభక్తిఁ జేసి గౌతుక మలరన్."

టీక:- తనరిన = అతిశయించిన; మోక్షమున్ = ముక్తిని; పొందెదవు = పొందెదవు; అని = అని; పలికినన్ = అనగా; కర్దముండు = కర్దముడు; ఆ = ఆ; ముని = మునుల; కుల = సమూహమునకు; చంద్రునిన్ = చంద్రునివంటి వానిని; వలగొని = ప్రదక్షిణములు చేసి; వందనములు = నమస్కారములు; ఘనముగన్ = గట్టిగ; అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తిని; చేసి = చేసి; కౌతుకమున్ = కుతూహలము; అలరన్ = ఒప్పగ.
భావము:- నీవు మోక్షాన్ని పొందుతావు” అని కపిలుడు పలుకగా కర్దముడు ఆ మునికుల శ్రేష్ఠునకు ప్రదక్షిణం చేసి అత్యంత భక్తితో నమస్కరించి కుతూహలంతో...