పోతన తెలుగు భాగవతము/చతుర్ధ స్కంధము/స్వాయంభువు వంశ విస్తారము


తెభా-4-3-సీ.
"నాథ! విను విదురుకును మైత్రేయ-
మునినాథచంద్రుఁ డిట్లనియె "మరల
స్వాయంభువున కర్థి తరూపవలనను-
గూఁతులు మువ్వు రాకూతి దేవ
హూతి ప్రసూతులు నొనరఁ బ్రియవ్రతో-
త్తానపాదులు నను నయయుగము
నియింప నం దగ్రసంభవ యైన యా-
కూతిని సుమహిత భ్రాతృమతినిఁ

తెభా-4-3.1-తే.
నకు సంతాన విస్తరార్థంబు గాఁగఁ
బుత్రికాధర్మ మొంది యా పువ్వుఁబోఁడిఁ
బ్రకటమూర్తి రుచిప్రజాతికి నిచ్చె
నువు ముదమొంది శతరూప నుమతింప.

టీక:- జననాథ = రాజ {జననాథుడు - జన (ప్రజల) కు నాథుడు (ప్రభువు), రాజు}; విను = వినుము; విదురున్ = విదురుని; కును = కి; మైత్రేయ = మైత్రేయుడను; ముని = ముని; నాథ = ముఖ్యులలో; చంద్రుడు = శ్రేష్ఠుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; మరల = మరి; స్వాయంభువున్ = స్వాయంభువుని {స్వాయంభువుడు - స్వయంభువుని (తనంతతాను ఉద్భవించినవాని, బ్రహ్మదేవుని) పుత్రుడు}; కిన్ = కి; అర్థిన్ = కోరి; శతరూప = శతరూప; వలనను = యందు; కూతులు = పుత్రికలు; మువ్వురు = ముగ్గురు (3); ఆకూతి = ఆకూతి {ఆకూతి - కుతూహలము}; దేవహూతి = దేవహూతి; ప్రసూతులున్ = ప్రసూతులును; ఒనరన్ = పొందికగ; ప్రియవ్రత = ప్రియవ్రతుడు; ఉత్తానపాదులున్ = ఉత్తానపాదులును; అను = అనెడి; తనయ = కొడుకులు; యుగము = ఇద్దరు; జనియింప = పుట్టగ; అందు = వారిలో; అగ్ర = ముందు; సంభవ = పుట్టినామె; ఐన = అయినట్టి; ఆకూతిని = ఆకూతిని; సు = మంచి; మహిత = గొప్ప; భాతృమతినిన్ = సోదరులు కలదానిని; తన = తన; కున్ = కు;
సంతానవిస్తరార్థంబున్ = వంశవృద్ధి {సంతానవిస్తరార్థము - కుమా రులున్నను ఇంకను కుమారులు పొందుటకు}; కాఁగ = జరుగుటకు; పుత్రికాధర్మమున్ = పుత్రికాధర్మము {పుత్రికాధర్మము - ఈమె యందు జన్మించువాడు నా పుత్రుడు కాగలడు అను నియమముతో కన్యాదానము చేయుట}; ఒంది = స్వీకరించి; ఆ = ఆ; పువ్వుబోడిన్ = స్త్రీని; ప్రకటమూర్తి = ప్రసిద్ధుడగు; రుచి = రుచి అనెడి {రుచి - ప్రకాశము, వెలుగు}; ప్రజాపతి = ప్రజాపతి; కిన్ = కి; ఇచ్చెన్ = ఇచ్చెను; మనువు = స్వాయంభువ మనువు; ముదము = సంతోషమును; ఒంది = కలిగి; శతరూప = శతరూప; అనుమతింప = అనుమతించగా.
భావము:- రాజా! విను. విదురునితో మైత్రేయ మునీశ్వరుడు మళ్ళీ ఇలా అన్నాడు. “స్వాయంభువ మనువునకు శతరూప అనే భార్యవల్ల ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. వారిలో పెద్దదైన ఆకూతిని మనువు పుత్రికాధర్మాన్ని ఆశ్రయించి రుచి అనే ప్రజాపతికి ఇచ్చి పెండ్లి చేసాడు. ఆకూతికి సోదరులు ఉన్నప్పటికీ తన సంతానం విస్తరిల్లటంకోసం స్వాయంభువమనువు పుత్రికా ధర్మాన్ని పాటించాడు. అందుకు మనువు భార్య శతరూప ఆనందంతో అంగీకరించింది.

తెభా-4-4-వ.
అట్లు వివాహంబైన రుచిప్రజాపతి బ్రహ్మవర్చస్వియుఁ బరిపూర్ణగుణుండును గావునఁ జిత్తైకాగ్రతంజేసి యాకూతియందు శ్రీవిష్ణుండు యజ్ఞరూపధరుం డగు పురుషుండుగను జగదీశ్వరి యగు నాదిలక్ష్మి యమ్మహాత్మునకు నిత్యానపాయిని గావునఁ దదంశంబున దక్షిణ యను కన్యకారత్నంబుగను మిథునంబు సంభవించె; నందు స్వాయంభువుండు సంతుష్టాంతరంగుం డగుచుఁ బుత్రికాపుత్రుండును, వితతతేజోధనుండును, శ్రీవిష్ణుమూర్తి రూపుండును నగు యజ్ఞునిఁ దన గృహంబునకుఁ దెచ్చి యునిచె; రుచియుఁ గామగమన యైన దక్షిణ యను కన్యకాలలామంబును దన యొద్దన నిలిపె; అంత సకలమంత్రాధిదేవత యగు శ్రీయజ్ఞుండు దనుఁ బతిఁగంగోరెడు దక్షిణ యను కన్యకం బరిణయం బయ్యె; వార లాదిమిథునంబు గావున నది నిషిద్ధంబు గాకుండె"నని చెప్పి మైత్రేయుండు వెండియు నిట్లనియె.
టీక:- అట్లు = ఆవిధముగ; వివాహంబు = కల్యాణము; ఐన = అయినట్టి; రుచి = రుచి అనెడి; ప్రజాపతి = ప్రజాపతి; బ్రహ్మవర్చస్వియున్ = బ్రహ్మదేవుని వంటి వర్చస్సు కలవాడును; పరిపూర్ణుడునున్ = పరిపూర్ణ వ్యక్తిత్వము కలవాడును; కావునన్ = అగుటవలన; చిత్త = చిత్తము యొక్క; ఏగ్రతన్ = ఏకాగ్రత; జేసి = వలన; ఆకూతి = ఆకూతి; అందు = కి; శ్రీవిష్ణుండు = విష్ణుమూర్తి; యజ్ఞరూప = యజ్ఞరూపమును; ధరుండు = ధరించినవాడు; అగు = అయినట్టి; పురుషుండు = మగబిడ్డ; కాను = అయ్యి; జగదీశ్వరి = లోకములపై అధికారి; అగు = అయినట్టి; ఆదిలక్ష్మి = లక్ష్మీదేవి; ఆ = ఆ; మహాత్మున్ = గొప్పవాని; కున్ = కి; నిత్య = ఎల్లప్పుడును; అనపాయిని = విడువకుండునది; కావునన్ = అగుటవలన; తత్ = తన; అంశంబునన్ = అంశముతో; దక్షిణ = దక్షిణ; అను = అనెడి; కన్యకారత్నంబున్ = ఉత్తమమైన స్త్రీ; కాన్ = అయ్యి; మిథునంబు = జంట; సంభవించె = పుట్టిరి; అందు = వారిలో; స్వాయంభువుండు = స్వాయంభువుండు; సంతుష్టాంతరంగుండు = సంతోషించుచున్న మనసు కలవాడు; అగుచున్ = అవుతూ; పుత్రికాపుత్రుండును = మనుమడును; వితత = విస్తారమైన; తేజస్ = తేజస్సను; ధనుండును = సంపదగా కలవాడును; శ్రీవిష్ణుమూర్తిరూపుండును = విష్ణుమూర్తి స్వరూపము ఐనవాడును; అగు = అయినట్టి; యజ్ఞుని = యజ్ఞుడిని; తన = తన యొక్క; గృహంబున్ = ఇంటి; కున్ = కి; తెచ్చి = తీసుకొని వచ్చి; ఉనిచె = ఉంచెను; రుచియున్ = రుచిప్రజాపతికూడ; కామగమన = కోరిన విధముగ వర్తించెడియామె; ఐన = అయినట్టి; దక్షిణ = దక్షిణ; అను = అనెడి; కన్యకాలలామంబును = కన్యలలో పూజ్యురాలును; తన = తన; ఒద్దన్ = దగ్గర; నిలిపె = ఉంచెను; అంత = అంతట; సకల = సమస్తమైన; మంత్ర = మంత్రములకును; అధిదేవత = అధిదేవత; అగు = అయినట్టి; శ్రీయజ్ఞుండు = శ్రీయజ్ఞుండు; తనున్ = తనను; పతిగన్ = భర్తగా; కోరెడు = కోరుతున్న; దక్షిణ = దక్షిణ; అను = అనెడి; కన్యకం = కన్యను; పరిణయంబయ్యె = పెళ్లిచేసుకొనెను; వారలు = వారు; ఆది = మొదటి; మిథునంబు = జంట; కావునన్ = కనుక; అది = అది; నిషిద్ధంబు = అనంగీకారమైనది; కాకుండెను = కాకుండా ఉన్నది; అని = అని; చెప్పి = చెప్పి; మైత్రేయుండు = మైత్రేయుడు; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఆ విధంగా పెండ్లాడిన రుచి ప్రజాపతి బ్రహ్మతేజస్సు కలవాడు, సద్గుణ సంపన్నుడు, మనస్సును భగవంతునియందే లగ్నం చేసినవాడు కనుక అతనికి ఆకూతియందు శ్రీమహావిష్ణువు యజ్ఞుడు అనే పుత్రుడుగా, లోకేశ్వరి అయిన ఆదిలక్ష్మి విష్ణువును ఎప్పుడూ విడిచి ఉండదు కనుక తన అంశతో దక్షిణ అనే కన్యకగా జన్మించారు. స్వాయంభువుడు ఎంతో సంతోషించి తన కూతురి కుమారుడు, అత్యంత తేజోవంతుడు, శ్రీవిష్ణుదేవుని అవతారము అయిన యజ్ఞుని తన ఇంటికి తెచ్చుకున్నాడు. రుచి ప్రజాపతి కామగమన అయిన దక్షిణను తన దగ్గరనే ఉంచుకున్నాడు. తరువాత సకల మంత్రాలకు అధిదేవత అయిన యజ్ఞుడు తనను భర్తగా కోరిన దక్షిణను చేపట్టాడు. వారిద్దరూ ఆదిదంపతులు కనుక ఆ అన్నాచెల్లెళ్ళ వివాహం లోకవిరుద్ధం కాలేదు” అని చెప్పి మైత్రేయుడు మళ్ళీ ఇలా అన్నాడు.

తెభా-4-5-క.
"ధీహిత! యంత వారల
యామాఖ్యలు గలుగు దేవతావళి గడఁకన్
వేఱు నభినందించుచు
నా మిథునమువలనఁ బుట్టె తి బలయుతమై.

టీక:- ధీమహిత = బుద్ధిబలముచే గొప్పవాడ; అంత = అంతట; వారలన్ = వారు; యామ = యామము లనెడి; ఆఖ్యలున్ = పేర్లు; కలుగు = ఉన్నట్టి; దేవత = దేవతల; ఆవళి = సమూహము; కడకన్ = పూని; వేమఱు = వెయ్యిమార్లు, అనేకసార్లు; అభినందించుచున్ = స్తోత్రముచేయుచు; ఆ = ఆ; మిథునము = జంట; వలనన్ = కు; పుట్టెన్ = పుట్టిరి; బలయుతమై = బలశాలులై.
భావము:- “బుద్ధిమంతుడవైన విదురా! ఆ దంపతులకు యామ అనే పేర్లుగల దేవతలు మహాబలవంతులైన పుత్రులుగా జన్మించారు.

తెభా-4-6-వ.
వారు తోషుండును బ్రతోషుండును సంతోషుండును భద్రుండును శాంతియు నిడస్పతియు నిధ్ముండును గవియు విభుండును వహ్నియు సుదేవుండును రోచనుండును ననం బన్నిద్దఱు సంభవించిరి; వారలు స్వాయంభువాంతరంబునం దుషితు లను దేవగణంబులై వెలసిరి; మఱియు మరీచి ప్రముఖులైన మునీశ్వరులును యజ్ఞుండును దేవేంద్రుండును మహాతేజస్సంపన్ను లయిన ప్రియవ్రతోత్తాన పాదులునుం గలిగి పుత్రపౌత్ర నప్తృవంశంబులచే వ్యాప్తంబయి యా మన్వంతరంబు పాలితంబగుచు వర్తిల్లె; మనువు ద్వితీయపుత్రి యైన దేవహూతిం గర్దమున కిచ్చి తద్వంశ విస్తారంబు గావించె నని మున్న యెఱింగించితి; వెండియు నమ్మనువు మూఁడవచూలైన ప్రసూతి యను కన్యకను బ్రహ్మపుత్రుం డగు దక్షప్రజాపతికి నిచ్చె; ఆ దక్షునకుఁ బ్రసూతివలన నుదయించిన ప్రజాపరంపరల చేత ముల్లోకంబులు విస్తృతంబు లయ్యె; మఱియుఁ గర్దమపుత్రికా సముదయంబు బ్రహ్మర్షిభార్య లగుటం జేసి వారివలనం గలిగిన సంతాన పరంపరల వివరించెద.
టీక:- వారు = వారు; తోషుండును = తోషుడు {తోషుడు – తుష్టి కలవాడు}; ప్రతోషుండును = ప్రతోషుడు {ప్రతోషుడు - సంతతివలన తుష్టి కలవాడు}; సంతోషుండును = సంతోషుడు {సంతోషుడు - సంతోషము కలవాడు}; భద్రుండును = భద్రుడు {భద్రుడు - క్షేమము కలవాడు}; శాంతియున్ = శాంతి {శాంతి – శాంతి కలవాడు}; ఇడస్పతియున్ = ఇడస్పతి {ఇడస్పతి - విష్ణువు, సూర్యుడు (ఆంధ్రశబ్ధార్థచంద్రిక)}; ఇధ్ముండున్ = ఇధ్ముడు {ఇధ్ముడు - సమిధలు కలవాడు}; కవియు = కవి {కవి – రూపములు అల్లువాడు, శుక్రధాతువు}; విభుండును = విభుడు {విభుడు – ప్రభుత్వము కలవాడు}; వహ్నియున్ = వహ్ని {వహ్ని - అగ్నిదేవుడు}; సుదేవుండునున్ = సుదేవుడు {సుదేవుడు - మంచిదేవుడు}; రోచనుండునున్ = రోచనుడు {రోచనుడు - (కంటికి) వెలుగు యైనవాడు}; అనన్ = అనెడి; పన్నిద్ధఱు = పన్నెండు (12) మంది; సంభవించిరి = పుట్టిరి; వారలు = వారు; స్వాయంభువ = స్వాయంభువుని; అంతరంబునందు = మన్వంతర కాలమునందు; తుషితులు = తుష్టి కారకులు; అను = అనెడి; దేవగణంబులు = దేవతల సమూహములు; ఐ = అయ్యి; వెలసిరి = అవతరించిరి; మఱియు = ఇంకను; మరీచి = మరీచి; ప్రముఖులైన = మొదలైన ముఖ్యులు; మునీశ్వరులును = మునులలో శ్రేష్ఠులు; యజ్ఞుండును = యజ్ఞుండు; దేవేంద్రుండును = దేవేంద్రుడు; మహా = గొప్ప; తేజస్ = తేజస్సను; సంపన్నులు = సంపదగా కలవారు; అయిన = అయినట్టి; ప్రియవ్రత = ప్రియవ్రతుడు; ఉత్తానపాదులున్ = ఉత్తానపాదుడులును; కలిగి = పుట్టి; పుత్ర = పిల్లలు; పౌత్ర = మనుమలు; నప్తృ = మునిమనుమడు; వంశంబులన్ = సంతతి; చేన్ = చేతను; వ్యాప్తంబున్ = వ్యాపించినది; అయి = అయ్యి; ఆ = ఆ; మన్వంతరంబు = మన్వంతరము; పాలితంబు = పరిపాలింపడినది; అగుచున్ = అవుతూ; వర్తిల్లె = వర్థిల్లినది; మనువు = స్వాయంబువమనువు; ద్వితీయ = రెండవ (2); పుత్రి = కుమార్తె; ఐన = అయినట్టి; దేవహూతిన్ = దేహూతిని; కర్ధమున్ = కర్ధముని; కిన్ = కి; ఇచ్చి = ఇచ్చి; తత్ = ఆ; వంశ = వంశము; విస్తరంబున్ = వృద్ధి యగునట్లు; కావించెన్ = చేసెను; అని = అని; మున్న = పూర్వమె, ఇంతకుముందె; ఎఱింగించితిన్ = తెలిపితిని; వెండియున్ = తరవాత; ఆ = ఆ; మనువు = స్వాయంభువ మనువు; మూడవ = మూడవ (3); చూలు = గర్భమున పుట్టినామె; ఐన = అయినట్టి; ప్రసూతి = ప్రసూతి {ప్రసూతి - శిశుప్రసవము}; అను = అనెడి; కన్యకను = బాలను; బ్రహ్మపుత్రుండు = బ్రహ్మదేవుని కుమారుడు; అగు = అయినట్టి; దక్షప్రజాపతి = దక్షుడను ప్రజాపతి; కిన్ = కి; ఇచ్చెన్ = ఇచ్చెను; ఆ = ఆ; దక్షున్ = దక్షున; కున్ = కి; ప్రసూతి = ప్రసూతి; వలన = అందు; ఉదయించిన = కలిగిన; ప్రజా = సంతతుల; పరంపరల = సమూహములు; చేతన్ = వలన; ముల్లోకంబులున్ = మూడు (3) లోకములు; విస్తృతంబులు = విస్తరింపబడినవి; అయ్యె = అయ్యెను; మఱియున్ = ఇంకను; కర్దమ = కర్దముని; పుత్రికా = కూతరుల యొక్క; సముదయంబు = సమూహము; బ్రహ్మర్షి = బ్రహ్మర్షుల యొక్క; భార్యలున్ = పత్నులు; అగుటన్ = అగుట; చేసి = వలన; వారి = వారి; వలనన్ = వలన; కలిగిన = పుట్టిన; సంతాన = సంతతి; పరంపరలన్ = వరుసలను; వివరించెదన్ = వివరముగ తెలిపెదను.
భావము:- ఆ పుత్రులు తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, ఇధ్ముడు, కవి, విభుడు, వహ్ని, సుదేవుడు, రోచనుడు అని పన్నెండుమంది. వీరిని తుషితులు అనికూడా అంటారు. స్వాయంభువ మన్వంతరంలో తుషితులు దేవగణాలయ్యారు. మరీచి మొదలైన మునీశ్వరులు, యజ్ఞుడు, దేవేంద్రుడు, మనువు కుమారులైన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, వారి పుత్రులు, మనుమలు, మునిమనుమలు అందరితోనూ స్వాయంభువ మన్వంతరం నిండి కొనసాగింది. మనువు తన రెండవ కూతురయిన దేవహూతిని కర్దమ ప్రజాపతికిచ్చి వారి వంశాన్ని పెంపొందించాడని ఇదివరకే చెప్పాను. మనువు తన మూడవ కూతురైన ప్రసూతి అనే కన్యను బ్రహ్మ కుమారుడైన దక్షప్రజాపతికి ఇచ్చాడు. ఆ దక్షునికి ప్రసూతికి పుట్టిన సంతతితో మూడులోకాలు నిండిపోయాయి. కర్దముని పుత్రికలు బ్రహ్మర్షులకు భార్యలయ్యారు. వారివల్ల కలిగిన సంతాన పరంపరను వివరిస్తాను.