పోతన తెలుగు భాగవతము/చతుర్ధ స్కంధము/పూర్వ సఖుని ఉవాచ


తెభా-4-845-క.
తా నుగమనము చేయం
బూనుటయును నంతలోనఁ బూర్వసఖుఁడు వి
జ్ఞాస్వరూపుఁ డమలుఁడు
నై ధరాదివిజుఁ డొక్క బలం గనుచున్.

టీక:- తాన్ = తాను; అనుగమనమున్ = సహగమనము; చేయన్ = చేయుటకు; పూనుటయున్ = సిధ్దపడుతుండగ; అంత = ఆ సమయము; లోనన్ = లో; పూర్వ = పాతకాలపు; సఖుడు = స్నేహితుడు; విజ్ఞాన = విశిష్ట జ్ఞానము; స్వరూపుడున్ = స్వరూపముగా కలవాడు; అమలుడున్ = స్వచ్ఛమైనవాడు; ఐన = అయిన; ధరాదివిజుడు = బ్రాహ్మణుడు; ఒక్కడున్ = ఒకడు; అబలన్ = స్త్రీని {అబల - బలము లేనామె, స్త్రీ}; కనుచున్ = చూస్తూ.
భావము:- వైదర్భి తాను భర్తతో సహగమనం చేయటానికి పూనుకున్నది. అంతలో పురంజనునకు పూర్వసఖుడు, జ్ఞాని అయిన అవిజ్ఞాతుడు అనే బ్రాహ్మణుడు ఆమెను కలవడానికి…

తెభా-4-846-క.
నుదెంచి యత్తలోదరి
సుయోక్తుల ననునయించుచుం దగ ననియెన్
"వనితా! నీవెవ్వతె? వె
వ్వని దాన? వితం డెవండు? గచెద వేలా?"

టీక:- చనుదెంచి = వచ్చి; ఆ = ఆ; తలోదరిన్ = స్త్రీని {తలోదరి - తల (సన్నని) ఉదరము కలామె, స్త్రీ}; సు = చక్కటి; నయ = మెత్తటి; ఉక్తులన్ = మాటలతో; అనునయించుచున్ = బుజ్జగించుతూ; తగన్ = తగినట్లు; అనియెన్ = పలికెను; వనితా = స్త్రీ; నీవున్ = నీవు; ఎవ్వతెవున్ = ఎవరివి; ఎవ్వనిదానవున్ = ఎవరి దానవు; ఇతండున్ = ఇతడు; ఎవండున్ = ఎవడు; వగచెదవున్ = దుఃఖించెదవు; ఏలా = ఎందులకు.
భావము:- వచ్చి ఆమెను మంచిమాటలతో ఓదారుస్తూ ఇలా అన్నాడు “వనితా! నీ వెవరు? ఎవరి దానవు? ఇత డెవరు? ఇతని కోసం ఎందుకు దుఃఖిస్తున్నావు?”

తెభా-4-847-క.
ని యడిగి వెండియును ని
ట్లనియెను నీ సృష్టి పూర్వమందును నీ వె
వ్వనితోడి సఖ్య సౌఖ్యము
వరతము ననుభవించి ట్టి సఖుండన్.

టీక:- అని = అని; అడిగి = అడిగి; వెండియునున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ఈ = ఈ; సృష్టిన్ = సృష్టికి; పూర్వము = ముందు; అందున్ = సమయములో; నీవున్ = నీవు; ఎవ్వని = ఎవని; తోడన్ = తోటి; సఖ్య = స్నేహము యొక్క; సౌఖ్యముల్ = సౌఖ్యములు; అనవరతమున్ = ఎల్లప్పుడున్; అనుభవించితివి = అనుభవించితివో; అట్టి = అటువంటి; సఖుండన్ = స్నేహితుడను.
భావము:- అని ప్రశ్నించి ఇంకా ఇలా అన్నాడు “నేను నీ మిత్రుడను. ఈ సృష్టికి పూర్వం నీవు ఎవరి స్నేహంతో ఎడతెగని సౌఖ్యములను అనుభవించావో ఆ స్నేహితుడను నేను.

తెభా-4-848-క.
న్నెఱుగు దేని మనమున
న్నెఱుఁగక యున్న నైన ళినదళాక్షీ!
న్నుఁ బురాతన సఖుఁగా
నెన్నంగలదాన; వైన నెఱుఁగవె చెపుమా?

టీక:- నన్నున్ = నన్ను; ఎఱుగుదు = తెలియుదువు; ఏని = అయినచో; మనమునన్ = మనసులో; నన్నున్ = నన్ను; ఎఱుగకన్ = తెలియకన్; ఉన్నన్ = ఉండినట్లు; ఐనన్ = అయినను; నళినదళాక్షీ = స్త్రీ {నళినదళాక్షి - నళినము (పద్మము) దళ (రేకుల) వంటి అక్షి (కన్నులుగలామె), స్త్రీ}; నన్నున్ = నన్ను; పురాతన = పాతకాలపు; సఖున్ = స్నేహితునిగా; ఎన్నంగల = ఎంచగలిగిన; దానవు = దానివి; ఐనన్ = అయినచో; ఎఱుగవె = ఎరుగవా; చెపుమా = చెప్పుము.
భావము:- నీవు నన్ను ఎరిగినా, ఎరుగక పోయినా నన్ను పూర్వమిత్రునిగా తెలుసుకో.

తెభా-4-849-వ.
కావున, నీవును నేనునుం బూర్వంబునందు మానసనివాసులమైన హంసలమై యుండి గృహంబుఁ బాసి సహస్రవత్సరంబులు సఖులమై వర్తించు నంత నీవు నన్నుం బాసి భౌమభోగ రతుండవై పదంబు నిచ్చగించుచు మహీమండలంబు గలయం గ్రుమ్మరు నప్పు డొక్క కామినీ నిర్మితంబుం బంచారామంబు నవద్వారసమేతంబు నేకపాలకంబుఁ ద్రికోష్ఠంబు షట్కులంబుఁ బంచవిపణంబుఁ బంచప్రకృతియు స్త్రీనాయకంబు నైన యొక్క పురంబు పొడగంటి; వది యెట్టి దనినం బంచారామంబులనం బంచేంద్రియార్థంబులు; నవద్వారంబులన నాసికాది ద్వారంబు; లేకపాలకంబనం బ్రాణపాలనంబు; త్రికోష్ఠంబులనం దేజో భిన్నంబులు; షట్కులంబులన నింద్రియ సంగ్రహంబు; విపణంబులనఁ గర్మేంద్రియంబులు; పంచప్రకృతి యనం బంచ భూతంబులు; బ్రకృతి యను కామిని యన బుద్ధి; నిట్టి పురంబునం బ్రవిష్టుండైన పురుషుం డంగనా పరతంత్రుఁడు నజ్ఞుండు నైన నీవ యప్పురంబునం గామినీ సంస్పృష్టుండవై రమియించుచుఁ దత్సంగమంబున నష్టస్మృతివై వైదర్భీ జనసంభావిత సుఖాభాసంబులగు దుఃఖంబులచే నిట్టి పాపిష్ఠంబైన దశం బొందితివి; కావున.
టీక:- కావునన్ = కనుక; నీవునున్ = నీవు; నేనున్ = నేను; పూర్వంబు = పూర్వము; అందున్ = అందు; మానస = మానససరోవరమున; నివాసులము = ఉండెడివారము; ఐన = అయిన; హంసలము = హంసలము; ఐ = అయ్యి; ఉండి = ఉండి; గృహంబున్ = గృహమునకు; పాసి = దూరమై; సహస్ర = వెయ్యి (100); వత్సరంబులున్ = సంవత్సరములు; సఖులము = స్నేహితులము; ఐ = అయ్యి; వర్తించున్ = తిరుగుతుండు; అంతన్ = సమయములో; నీవు = నీవు; నన్నున్ = నన్ను; పాసి = తొలగి; భౌమ = భౌతిక; బోగ = సౌఖ్యములు అందు; రతుండవు = ఆసక్తి కలవాడవు; ఐ = అయ్యి; పదంబున్ = పదవిని; ఇచ్చగించున్ = కోరుతూ; మహీమండలంబున్ = భూమండలము; కలయన్ = కలియ; క్రుమ్మరున్ = తిరిగెడి; అప్పుడు = సమయములో; ఒక్క = ఒక; కామినీ = స్త్రీచే; నిర్మితంబున్ = తయారుచేయబడిన; పంచారామంబున్ = ఐదు తోటలు (విషయములు) గలది {పంచారామములు - పంచ (ఐదు) ఆరామములు (ఇంద్రియ గోచర మగు విషయములు, తోటలు)}; నవ = తొమ్మిది; ద్వార = గుమ్మములు, కన్ను మొదలగు రంధ్రములు; సమేతంబున్ = కలిగినది; ఏక = ఒకే; పాలకంబునున్ = పాలకుడు (మనలు) కలది; త్రి = మూడు (3); కోష్టంబునున్ = గాదెలు (లోకములు) కలది; షట్ = ఆరు (6); కులంబున్ = విభాగములు కలది (జ్ఞానేంద్రియములు మనసు); పంచ = అయిదు (5); విపణంబున్ = దుకాణములు (కర్మేంద్రియములు); స్త్రీ = ఆడమనిషి (బుద్ధి); నాయకంబునున్ = నాయకుడుగా కలది; ఐన = అయిన; ఒక్క = ఒక; పురంబున్ = పురమును (దేహమును); పొడగంటివి = కనుగొంటివి; అది = అది; ఎట్టిది = ఎటువంటిది; అనినన్ = అన్నచో; పంచారామంబుల్ = పంచారామములు; అనన్ = అనగా; పంచేంద్రియార్థంబులున్ = ఐదు ఇంద్రియార్థ విషయములు; నవద్వారంబుల్ = నవద్వారములు; అనన్ = అనగా; నాసిక = ముక్కు; ఆది = మొదలగు; ద్వారంబుల్ = రంధ్రములు; ఏకపాలకంబున్ = ఏకపాలకము; అనన్ = అనగా; ప్రాణ = ప్రాణముచే; పాలనంబున్ = పాలింపబడునది; త్రికోష్టంబుల్ = త్రికోష్టములు; అనన్ = అనగా; తేజోభిన్నంబులు = తేజస్సులలోని బేధములు {తేజోభిన్నంబులు - భూర్భువస్సువర్లోకములు అనెడి ద్రవ్య శక్తి ప్రజ్ఞా మయలోకములు, వసు రుద్ర ఆదిత్య లోకములు, దేహము ప్రాణము మనస్సు}; షట్కులంబులున్ = షట్కులములు; అనన్ = అనగా; ఇంద్రియసంగ్రహంబున్ = పంచేంద్రియములు మనస్సు {ఇంద్రియ సంగ్రహము - పంచేంద్రియములు (1కళ్ళు 2ముక్కు 3చెవులు 4నాలిక 5చర్మము) మరియు 6మనస్సు}; విపణంబులు = విపణములు; అనన్ = అనగా; కర్మేంద్రియములు = కర్మేంద్రియములు {కర్మేంద్రియములు - కాళ్ళు చేతులు నోరు ఉపస్తు గుదము}; పంచప్రకృతి = పంచప్రకృతి; అనన్ = అనగా; పంచభూతంబులున్ = పంచభూతములు {పంచభూతములు - 1పృథ్వి 2వాయు 3జల 4అగ్ని 5గగనములు}; ప్రకృతి = ప్రకృతి; అను = అనెడి; కామిని = స్త్రీ; అనన్ = అనగా; బుద్ధి = బుద్ధి; ఇట్టి = ఇటువంటి; పురంబునన్ = పురములో; ప్రవిష్టుండు = ప్రవేశించినవాడు; ఐన = అయిన; పురుషుండు = పురుషుడు; అంగనా = స్త్రీ యందు {అంగన - చక్కటి అంగములు (అవయవములు) కలామె, స్త్రీ}; పరతంత్రుడు = లగ్నమైనవాడు; అజ్ఞుండు = తెలివిలేనివాడు; ఐన = అయిన; నీవ = నీవే; ఆ = ఆ; పురంబునన్ = పురములో; కామినీ = స్త్రీచేత {కామిని - కోరిక కలామె, స్త్రీ}; సంస్పృష్టుండవు = మిక్కిలి తగులుకొన్నవాడవు; ఐ = అయ్యి; రమియించుచున్ = భోగించుచున్; తత్ = ఆమెతో; సంగమంబునన్ = కలయిక వలన; నష్ట = పోయిన; స్మృతివి = జ్ఞాపకము కలవానివి; ఐ = అయ్యి; వైదర్భీ = విదర్భరాకుమారి అనెడి; జన = దానివిగా; సంభావిత = అనుకొనెడి; సుఖ = సుఖములు అనెడి; అభాసంబులు = అబద్దములు; అగు = అయిన; దుఃఖంబుల్ = దుఃఖముల; చేన్ = చేత; ఇట్టి = ఇటువంటి; పాపిష్ఠంబు = పాపముతో కూడినది; ఐన = అయిన; దశన్ = దశను; పొందితివి = పొందితివి; కావునన్ = అందుచేత.
భావము:- నీవు, నేను పూర్వం మానస సరస్సులో నివసించే హంసలం. మనం మిత్రులమై మన నివాసాన్ని విడిచి వేయి సంవత్సరాలు సంచరించాము. నీవు నన్ను వదలిపెట్టి క్షుద్రసుఖాలను, అధికారాన్ని కోరి భూమండలంలో తిరిగావు. అప్పుడు కామినీ నిర్మితం, పంచారామం, నవద్వారం, ఏకపాలకం, త్రికోష్ఠకం, షట్కులం, పంచవిపణం, పంచప్రకృతి, స్త్రీనాయకం అయిన ఒక పురాన్ని చూశావు. అది ఎలాంటిదో వివరిస్తాను విను. పంచారామాలంటే పంచేంద్రియార్థాలైన శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనేవి ఐదు. నవద్వారాలంటే ముక్కు మొదలైన తొమ్మిది రంధ్రాలు. ఏకపాలకం అంటే ప్రాణం. త్రికోష్ఠాలు అంటే భూమి, జలం, అగ్ని అనేవి. షట్కులం అంటే నాలుక, కన్ను, చెవి, ముక్కు, చర్మం, మనస్సు అనే జ్ఞానేంద్రియాలు. పంచవిపణాలు అంటే వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనే కర్మేంద్రియాలు. పంచప్రకృతి అంటే పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు. కామిని అంటే బుద్ధి. ఇటువంటి పురం(దేహం)లో స్త్రీకాముకుడవు, అజ్ఞుడవు అయి నీవు ప్రవేశించావు. నీవు ఆ కామినికి చిక్కి ఆమెతో క్రీడిస్తూ, ఆమె సంగమం చేత స్మృతిని కోల్పోయి ఈ మహాపాపదశను పొందావు. కాబట్టి…

తెభా-4-850-సీ.
నీవు వైదర్భివి గావు; వీరుఁ డితండు-
వివరింపఁగాఁ గాఁడు విభుఁడు నీకు;
నొగి మున్ను పురమున నుపరుద్ధుఁ జేసిన-
యా పురంజన పతి రయఁ గావు;
ఱియు నీ వన్య సీమంతిని యనియును-
ర్చింపఁగా బూర్వ న్మమందుఁ
బురుషుం డవనియును బుద్ధిఁ దలంచుట-
రయంగ నీ యుభము నసత్య;

తెభా-4-850.1-తే.
మింతయును మామకీనమై యెసఁగు మాయఁ
జేసి కల్పిత మయ్యెఁ; జర్చింప మనము
పూర్వమున హంసలమ యని పూని యెఱుఁగఁ
లికితిఁ దెలియు మనల రూపంబుఁ జూడు.

టీక:- నీవున్ = నీవు; వైదర్భివి = విదర్భరాకుమారివి; కావు = కావు; వీరుడు = శూరుడు; ఇతండు = ఇతడు; వివరింపగా = తరచిచూడగా; కాడున్ = కాడు; విభుడు = భర్త; నీకున్ = నీకు; ఒగిన్ = వరుసగా; మున్ను = పూర్వము; పురముననున్ = పురములో; అనుపరుద్దు = ఆపబడినవానినిగా; చేసిన = చేసినట్టి; ఆ = ఆ; పురంజన = పురంజనుడు అనెడి; పతివి = భర్తవి; అరయన్ = తరచిచూసిన; కావు = కావు; మఱియున్ = ఇంకను; నీవున్ = నీవు; అన్య = వేరే; సీమంతిని = స్త్రీవి; అనియునున్ = అని; చర్చింపన్ = విచారించగా; పూర్వ = పాత; జన్మము = జన్మము; అందున్ = లో; పురుషుండవు = పురుషుడవు; అనియునన్ = అని; = బుద్ధిన్ = మనసులో; తలంచుట = భావించుట; అరయంగన్ = తరచిచూసిన; ఈ = ఈ; ఉభయమున్ = రెండును; అసత్యమున్ = నిజముకాదు; ఇంతయునున్ = ఇదియంతయు.
నీవున్ = నీవు; వైదర్భివి = విదర్భరాకుమారివి; కావు = కావు; వీరుడు = శూరుడు; ఇతండు = ఇతడు; వివరింపగా = తరచిచూడగా; కాడున్ = కాడు; విభుడు = భర్త; నీకున్ = నీకు; ఒగిన్ = వరుసగా; మున్ను = పూర్వము; పురముననున్ = పురములో; అనుపరుద్దు = ఆపబడినవానినిగా; చేసిన = చేసినట్టి; ఆ = ఆ; పురంజన = పురంజనుడు అనెడి; పతివి = భర్తవి; అరయన్ = తరచిచూసిన; కావు = కావు; మఱియున్ = ఇంకను; నీవున్ = నీవు; అన్య = వేరే; సీమంతిని = స్త్రీవి; అనియునున్ = అని; చర్చింపన్ = విచారించగా; పూర్వ = పాత; జన్మము = జన్మము; అందున్ = లో; పురుషుండవు = పురుషుడవు; అనియునన్ = అని; బుద్ధిన్ = మనసులో; తలంచుట = భావించుట; అరయంగన్ = తరచిచూసిన; ఈ = ఈ; ఉభయమున్ = రెండును; అసత్యమున్ = నిజముకాదు; ఇంతయునున్ = ఇదియంతయు.
మామకీనము = నాచేచేయబడినది; ఐ = అయ్యి; ఎసగు = అతిశయించెడి; మాయన్ = మాయ; చేసి = వలన; కల్పితమున్ = కల్పింపబడినట్టిది; అయ్యెన్ = అయినది; చర్చింపన్ = తర్కించిచూసిన; మనము = మనము; పూర్వమున = పూర్వకాలమున; హంసలమ = హంసలమే; అని = అని; పూని = నిశ్చయముగా; ఎఱుగన్ = తెలియునట్లు; పలికితి = చెప్పితిని; తెలియుము = తెలిసికొనుము; మనల = మన యొక్క; రూపంబున్ = స్వరూపమును; చూడు = చూడుము.
భావము:- నీవు విదర్భరాజు పుత్రికవు కావు. ఈ మలయధ్వజుడు నీకు మగడు కాడు. పూర్వజన్మలో పురంలో నివసించిన ఆ పురంజనుడవు కావు. నీవు ఈ జన్మలో ఇతని భార్యను అని, పూర్వజన్మలో పురుషుడను అని అనుకోవటం కూడా అసత్యమే. ఇదంతా నేను నా మాయచేత సృష్టించాను. మనం ఇద్దరం పూర్వం హంసలం (పరమ పరిశుద్ధులం) అని చెప్పాను కదా! మన స్వరూపాన్ని చూడు.

తెభా-4-851-వ.
ఏనే నీవు గాని యన్యుండవు గావు; నీవే నేఁ గాని యన్యుండంగా; నిట్లని యెఱుంగుము; విద్వాంసులు మన యిద్దఱ యందు నంతరంబు నీక్షింపరు; పురుషుండు దన్నొక్కనినె యాదర్శ చక్షువులందు భిన్నరూపునింగాఁ దలంచు చందంబున మన యిద్దఱికిని భేదంబు గలిగిన యట్ల తోఁచు; నని యివ్విధంబున నతం డతనిచేత నీవు పూర్వంబున మదీయసఖుండవైన హంస” వని తెలుపంబడి స్వస్థుండై తద్వియోగ నష్టంబైన జ్ఞానంబు గ్రమ్మఱం బొందె” అని చెప్పి నారదుండు ప్రాచీనబర్హిం జూచి యీ యధ్యాత్మతత్త్వంబు రాజకథామిషంబున నీకు నెఱింగించితి;"అనిన.
టీక:- ఏనే = నేనే; నీవున్ = నీవు; కాని = కాని; అన్యుండవు = ఇతరుడవు; కావు = కావు; నీవే = నీవే; నేన్ = నేను; కాని = కాని; అన్యుండన్ = ఇతరుడను; కాను = కాను; ఇట్లు = ఈ విధముగ; అని = అని; ఎరుంగుము = తెలిసికొనుము; విద్వాంసులు = జ్ఞానులు; మన = మనలను; ఇద్ధఱన్ = ఇద్ధరి; అందున్ = మధ్యన; అంతరంబున్ = తేడాను; ఈక్షింపరు = చూడరు; పురుషుండున్ = మానవుడు; తన్నున్ = తనను; ఒక్కనినే = ఒకడినే; ఆదర్శచక్షువులు = అద్దములు, ఆదర్శములనెడి కన్నులు; అందున్ = లో; భిన్న = విభిన్న; రూపునిన్ = స్వరూపముగా; తలంచున్ = అనుకొనెడి; చందంబునన్ = విధముగనే; మన = మనకు; ఇద్దఱి = ఇద్ధరి; కినిన్ = కి; భేదంబున్ = వేరువేరు అనేడి భావము; కలిగిన = ఉన్నట్టి; అట్ల = విధముగా; తోచున్ = అనిపించును; అని = అని; ఇవ్విధంబునన్ = ఈ విధముగ; అతండున్ = అతడు; అతని = అతని; చేతన్ = చేత; నీవున్ = నీవు; పూర్వంబునన్ = మొదటినుండి; మదీయ = నా యొక్క; సఖుండవు = స్నేహితుడవు; ఐన = అయిన; హంసవు = హంసవే; అని = అని; తెలుపంబడి = తెలియజేయబడి; స్వస్థుండు = చిత్తశాంతి కలవాడు, నిజస్థితిలో ఉన్నవాడు; ఐ = అయ్యి; తత్ = ఆ; వియోగ = వియోగమునందు; నష్టంబున్ = నష్టపోయినది; ఐన = అయిన; జ్ఞానంబున్ = జ్ఞానమును; క్రమ్మఱన్ = మరల; పొందెన్ = పొందెను; అని = అని; చెప్పి = చెప్పి; నారదుండు = నారదుడు; ప్రాచీనబర్హిన్ = ప్రాచీనబర్హిని; చూచి = చూసి; ఈ = ఈ; అధ్యాత్మ = అధ్యాత్మ; తత్త్వంబున్ = తత్త్వమును; రాజ = రాజు యొక్క; కథా = కథ యనెడి; మిషంబునన్ = వంకతో; నీకున్ = నీకు; ఎఱింగించితిన్ = తెలిపితిని; అనిన = అనగా.
భావము:- నేనే నీవు. నీవే నేను. అంతేకాని వేరుకాదు. పండితులు మనలో తేడాను చూడరు. ఒక్కటే అయినా అద్దంలో ప్రతిబింబించే రూపమూ, బింబరూపమూ వేరుగా తోచినట్లు మన ఇద్దరికీ భేదం లేకున్నా భేదం ఉన్నట్లు కనిపిస్తుంది” ఈ విధంగా అవిజ్ఞాతుడు చేసిన బోధవల్ల తేరుకొని అతని ఎడబాటువల్ల తాను కోల్పోయిన జ్ఞానాన్ని వైదర్భి రూపంలో ఉన్న పురంజనుడు పొందాడు” అని చెప్పి నారదుడు ప్రాచీనబర్హిని చూచి “ఈ ఆధ్యాత్మతత్త్వాన్ని రాజుకథ నెపంతో నీకు చెప్పాను” అని చెప్పగా…

తెభా-4-852-క.
విని భూమీశుఁడు నారద
ముని కను "భవదీయవచనములు సూరులు ద
క్కను గర్మ మోహితులమై
రెడు నే మెట్టు దెలియువారము చెపుమా."

టీక:- విని = విని; భూమీశుండు = రాజు {భూమీశుడు - భూముకి ప్రభువు, రాజు}; నారద = నారదుడు యనెడి; ముని = ముని; కిన్ = కి; అను = అనెను; భవదీయ = నీ యొక్క; వచనంబులు = మాటలు; సూరులు = జ్ఞానులు; తక్కనున్ = తప్పించి; కర్మ = కర్మములందు; మోహితులము = మోహముచెందెడివారము; ఐ = అయ్యి; వనరెడు = శోకించెడు; నేము = మేము; ఎట్టు = ఏ విధముగా; తెలియు = తెలిసికొనగల; వారము = వాళ్ళ మగుదుము; చెపుమా = చెప్పుము.
భావము:- ప్రాచీనబర్హి నారదమహర్షితో ఇలా అన్నాడు “నీ మాటలు పండితులు తప్ప కర్మబద్ధులమై దుఃఖించే మేము ఎలా తెలుసుకోగలం? కాబట్టి నాకు వివరించి చెప్పు”

తెభా-4-853-వ.
అనిన యోగీంద్రుండు రాజేంద్రున కిట్లనియె “నరేంద్ర! యేమి కతంబున నాత్మ చేత నేక ద్వి చతుష్పాదంబును బహుపాదంబును నపాదంబు నగుచుఁ బురంజను దేహంబు ప్రకటం బొనర్చు; నా కతంబున బురంజనుండు పురుషుం డయ్యె; నట్టి పురుషునకు నామ క్రియా గుణంబుల విజ్ఞాయమానుండు గాకుండుటం జేసి యవిజ్ఞాత శబ్దంబునం జెప్పంబడు; సఖుం డీశ్వరుండు; పురుషుండు సాకల్యంబునం జేసి దేహపరిగ్రహంబు చేయ నిశ్చయించు నప్పుడు నవద్వార కలితంబును ద్విహస్త చరణ యుక్తంబును నయిన పురం బేది గల, దది లెస్స యని తలఁచి యప్పురం బను దేహంబునందుఁ బురుషుం డింద్రియంబులం జేసి యే బుద్ధి నధిష్ఠించి విషయంబుల ననుభవించు; నహంకార మమకారంబులకు నే బుద్ధితత్త్వంబు గారణం బగు; నట్టి బుద్ధి ప్రమదోత్తమ యనంబడె; దానికి సఖులు జ్ఞానకర్మకారణంబులైన యింద్రియగుణంబులు; సఖీజనంబులు దదీయ వృత్తులు; పంచముఖోరగం బనం బంచవృత్తి యైన ప్రాణం; బేకాదశ మహాభటులన బృహద్బలుండు నుభయేంద్రియ నాయకుండునైన మనంబు; నవద్వార సమేతంబైన యప్పురంబు చుట్టివచ్చిన పాంచాలదేశంబు లనం బంచవిషయంబులు; నవద్వారంబు లన నక్షి నాసికా కర్ణ ముఖ గుద శిశ్నంబు; లందు నక్షినాసాస్యంబు లైదునుం బ్రాగ్ద్వార పురస్కృ తంబులు; దక్షిణోత్తర కర్ణంబులు దక్షిణోత్తరద్వారంబులు; గుద శిశ్నంబులు పశ్చిమద్వారంబు; లందు నేకస్థల నిర్మితంబులైన ఖద్యోతా విర్ముఖులు నేత్రంబులు; విభ్రాజితం బన రూపంబు; ద్యుమంతు డనం జక్షురింద్రియంబు; నళినీ నాళిను లన నాసికా ద్వారంబులు; సౌరభం బన గంధం: బవధూత యన ఘ్రాణేంద్రియంబు; ముఖ్య యన నాస్యంబు; విపణం బన వాక్కు; రసజ్ఞుం డన రసం; బపణం బన వ్యవహారంబు; బాహూదనం బన వివిధాన్నంబు; పితృహు వన దక్షిణకర్ణంబు; దేవహూ వన నుత్తరకర్ణంబు; చండవేగుం డనం గాలోపలక్షకం బైన సంవత్సరంబు; గంధర్వు లన దివంబులు; గంధర్వీ జనంబు లన రాత్రులు; పరీవర్తనం బన నాయుర్హరణంబు; గాలకన్యక యన జర; యవనేశ్వరుం డన మృత్యు; వతని సైనికులన నాధివ్యాధులు; ప్రజ్వారుం డనం బ్రాణిహింస యందు శ్రీఘ్రవేగంబు గలిగి శీతోష్ణ భేదంబులం ద్వివిధం బైన జ్వరంబు; దక్షిణ పాంచాలం బనం బితృలోక ప్రాపకంబును బ్రవృత్తి రూపకంబు నైన శాస్త్రం; బుత్తర పాంచాలం బన దేవలోక ప్రాపకంబు నివృత్తి సంజ్ఞికంబు నయిన శాస్త్రంబు; శ్రుతధరుం డన శ్రోత్రం; బాసురీ నామకం బనం బశ్చాద్ద్వారంబైన మేఢ్రంబు; గ్రామకం బన సురత సుఖంబు; దుర్మదుం డన గుహ్యేంద్రియంబు; నిరృతి నామకం బైన పశ్చిమద్వారం బన గుదంబు; వైశసం బన నరకంబు; లుబ్ధకుం డనం బాయువు; సంధు లన హస్త పాదంబు; లంతఃపురం బన హృదయంబు; విషూచి యన మనం;” బని వెండియు నిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; యోగి = యోగులలో; ఇంద్రుండు = ఇంద్రుని వంటివాడు; రాజ = రాజులలో; ఇంద్రున్ = ఇంద్రుని వంటివాని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; నరేంద్ర = రాజా {నరేంద్ర - నరులలో ఇంద్రుని వంటి వాడు, రాజు}; ఏమి = ఏమి; కతంబునన్ = కారణముచేత; ఆత్మ = ఆత్మ; చేతన్ = చేత; ఏక = ఒకటే (1) {ఏకపాదులు - ఒకటే మూలము కలవి, చెట్లు}; ద్వి = రెండు (2) {ద్విపాదులు - రెండు పాదములు కలవి, మానవులు పక్షులు}; చతుష్ = నాలుగు (4) {చతుష్పాదులు - నాలుగు పాదములు కలవి, జంతువులు మొదలైనవి}; పాదంబునున్ = పాదములు కలవి; బహుపాదంబునున్ = అనేక పాదములు కలవి {బహు పాదులు - అనేక పాదములు కలవి, కీటకాదులు}; అపాదంబునున్ = పాదములు లేనివి {అపాదములు - పాదములు లేనివి, పాములు మొదలగునవి}; అగుచున్ = అగుతూ; పురంజను = పురంజనుని; దేహంబున్ = శరీరము; ప్రకటంబున్ = వెల్లడి; ఒనర్చున్ = చేయునో; ఆ = ఆ; కతంబునన్ = కారణముచేత; పురంజనుండు = పురంజనుడు; పురుషుండు = పురుషుడు; అయ్యెన్ = అయ్యెను; అట్టి = అటువంటి; పురుషున్ = పురుషుని; కున్ = కి; నామ = పేర్లు; క్రియా = పనులు; గుణంబులన్ = గుణములతో; విజ్ఞాయమానుండు = తెలియబడువాడు; కాకుండుటన్ = కాకపోవుట; చేసి = వలన; అవిజ్ఞాత = అవిజ్ఞాత (తెలియబడనివాడు); శబ్దంబునన్ = పదముచేత, మాటచేత; చెప్పంబడున్ = చెప్పెదరు; సఖుండు = స్నేహితుడు; ఈశ్వరుండు = పరమాత్మ; పురుషుండున్ = పురుషుడు; సాకల్యంబునన్ = స్వప్న కలితము; చేసి = వలన; దేహ = శరీరము; పరిగ్రహంబున్ = స్వీకరించుట; చేయన్ = చేయుటకు; నిశ్చయించున్ = నిర్ణయించుకొను; అప్పుడున్ = అప్పుడు; నవ = తొమ్మిది (9); ద్వార = రంధ్రములు; కలితంబును = కలిగినది; ద్వి = రెండు (2); హస్త = చేతులు; చరణ = పాదములు; యుక్తంబునున్ = కలిగినది; అయిన = అయినట్టి; పురంబున్ = దేహము; ఏది = ఏదైతే; కలదు = కలదో; అది = అదే; లెస్స = సరియగునది; అని = అని; తలచి = భావించి; ఆ = ఆ; పురంబున్ = పురము; అను = అనెడి; దేహంబున్ = శరీరము; అందున్ = లో; పురుషుండు = పురుషుడు; ఇంద్రియంబులన్ = ఇంద్రియములను; చేసియే = వలననే; బుద్ధిన్ = బుద్ధిని; అధిష్ఠించి = ఆశ్రయించి; విషయంబులన్ = ఇంద్రియగోచరములను; అనుభవించున్ = అనుభవించును; అహంకార = నేను యనెడి అభావము; మమకారంబుల్ = నాది యనెడి అభావముల; కున్ = కు; ఏ = ఏ; బుద్ధి = బుద్ధి; తత్త్వంబున్ = లక్షణము; కారణంబున్ = కారణము; అగున్ = అగునో; అట్టి = అటువంటి; బుద్ధిన్ = బుధ్దిని; ప్రమదోత్తమ = ఉత్తమస్త్రీ {ప్రమదోత్తమ - ప్ర (మిక్కిలి) మద (మదించిన, మత్తు కలి గుండెడి) ఆమె (స్త్రీ) వారిలో ఉత్తమురాలు, ఉత్తమస్త్రీ}; అనంబడె = అనబడినది; దాని = దాని; కిన్ = కి; సఖులు = స్నేహితులు; జ్ఞాన = జ్ఞానములకు; కర్మ = కర్మలకు; కారణంబులున్ = కారణములు; ఐన = అయినట్టి; ఇంద్రియ = ఇంద్రియముల యొక్క; గుణంబులున్ = లక్షణములు; సఖీజనంబులున్ = స్నేహితురాళ్లు; తదీయ = వాని; వృత్తులు = నడవడికలు; పంచ = ఐదు (5); ముఖ = ముఖములు, పడగలుగల; ఉరగంబున్ = పాము; అనన్ = అనగా; పంచ = ఐదు (5); వృత్తి = ప్రవృత్తి; ఐన = అయిన; ప్రాణంబున్ = ప్రాణము {పంచప్రాణములు - 1 ప్రాణము 2 అపానము 3 న్యాసము 4 ఉదానము 5 సమాన వాయువులు}; ఏకాదశ = పదకొండు (11); మహా = గొప్ప; భటులు = భటులు; అనన్ = అనగా; బృహత్ = అతిమిక్కిలి; బలుండును = బలము కలవాడును; ఉభయ = రెండు (2) జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు; ఇంద్రియ = ఇంద్రియములకును; నాయకుండును = నియమించువాడు; ఐన = అయిన; మనంబున్ = మనస్సు; నవ = తొమ్మిది (9); ద్వార = రంధ్రములు; సమేతంబున్ = కలిగినది; ఐన = అయిన; ఆ = ఆ; పురంబున్ = పురము; చుట్టి = చుట్టును; వచ్చిన = వచ్చిన; పాంచాలదేశంబులు = పాంచాలదేశములు; అనన్ = అనగా; పంచ = ఐదు (5); విషయంబులున్ = ఇంద్రియార్థములు; నవ = తొమ్మిది (9); ద్వారంబులు = గుమ్మములు; అనన్ = అనగా; అక్షి = కన్నులు; నాసికా = ముక్కు రంధ్రము; కర్ణ = చెవులు; ముఖ = నోరు; గుద = మలద్వారము; శిశ్నంబులు = మూత్రద్వారము; అందున్ = వానిలో; అక్షి = కన్నులు; నాస = ముక్కు రంధ్రములు; అస్యంబున్ = నోరు; ఐదునున్ = అయిదు (5); ప్రాక్ = తూర్పు; ద్వార = గుమ్మములు; పురస్కృతంబులు = ముందున్నవి; దక్షిణ = కుడి పక్క; ఉత్తర = ఎడమ పక్క; కర్ణంబులున్ = చెవులు; దక్షిణ = దక్షిణపు దిక్కు; ఉత్తర = ఉత్తరపు దిక్కు; ద్వారంబులున్ = గుమ్మములు; గుద = మలద్వారము; శిశ్నంబులు = మూత్రద్వారములు; పశ్చిమ = పడమటిదిక్కు; ద్వారంబులున్ = గుమ్మములు; అందున్ = వానిలో; ఏక = ఒకే; స్థల = ప్రదేశమున; నిర్మితంబులు = ఏర్పరుపబడినవి; ఐన = అయిన; ఖద్యోత = ఖద్యోతుడు {ఖద్యోతుడు - ఆకాశమును వెలుగువాడు, సూర్యుడు}; అవిర్ముఖులు = అవిర్ముఖులు {ఆవిర్ముఖుడు - స్పష్టమైన ముఖము కలవాడు, చంద్రుడు}; నేత్రంబులు = కన్నులు; విభ్రాజితంబున్ = విభ్రాజితము; అనన్ = అనగా; రూపంబున్ = రూపము; ద్యుమంతుడు = ద్యుమంతుడు; అనన్ = అనగా; చక్షుః = చూసెడి; ఇంద్రియంబున్ = ఇంద్రియము; నళిని = నళిని; నాళినులు = నాళినులు; అనన్ = అనగా; నాసికా = ముక్కు; ద్వారంబులు = రంధ్రములు; సౌరభంబున్ = సౌరభము; అనన్ = అనగా; గంధంబున్ = వాసన; అవధూత = అవధూత; అనన్ = అనగా; ఘ్రాణేంద్రియంబున్ = వాసన చూసెడి ఇంద్రియము; ముఖ్య = ముఖ్యము; అనన్ = అనగా; ఆస్యంబున్ = నోరు; విపణంబున్ = విపణము, దుకాణము; అనన్ = అనగా; వాక్కు = వాగింద్రియము; రసజ్ఞుండు = రసజ్ఞుడు; అనన్ = అనగా; రసంబున్ = రుచి; ఆపణంబున్ = ఆపణము, వ్యాపారము; అనన్ = అనగా; వ్యవహారంబున్ = లోకవ్వహారము; బాహూదనంబున్ = బాహూదనము; అనన్ = అనగా; వివిధ = పలు రకములైన; అన్నంబున్ = ఆహారములు; పితృహువు = పితృహువు; అనన్ = అనగా; దక్షిణ = కుడి పక్క; కర్ణంబున్ = చెవి; దేవహువు = దేవహువు; అనన్ = అనగా; ఉత్తర = ఎడమ పక్క; కర్ణంబున్ = చెవి; చండ = భయంకరమైన; వేగుండు = వేగముకలవాడు; అనన్ = అనగా; కాల = కాలము యొక్క; ఉపలక్షకంబున్ = ఉప లక్షణము యైనది; ఐన = అయిన; సంవత్సరము = సంవత్సరము; గంధర్వులు = గంధర్వులు; అనన్ = అనగా; దివంబులు = పగళ్ళు; గంధర్వీజనంబులు = గంధర్వస్త్రీలు; అనన్ = అనగా; రాత్రులు = రాత్రుళ్ళు; పరీవర్తనంబున్ = పరీవర్తనంబు, మారిపోవుట; అనన్ = అనగా; ఆయుః = ఆయుష్షు; హరణంబున్ = వ్యయమగుట; కాలకన్యక = కాలకన్యక; అనన్ = అనగా; జర = ముసలితనము; యవనేశ్వరుండు = యవనేశ్వరుడు; అనన్ = అనగా; మృత్యువు = మరణదేవత; అతని = అతని యొక్క; సైనికుల్ = సైనికులు; అనన్ = అనగా; ఆధి = మానసిక; వ్యాధులు = జబ్బులు; ప్రజ్వారుండు = ప్రజ్వారుండు, మిక్కిలి జ్వరము; అనన్ = అనగా; ప్రాణి = ప్రాణుల; హింస = మరణసమయము; అందున్ = లో; శ్రీఘ్ర = త్వరతగల; వేగంబున్ = వేగము; కలిగి = ఉండి; శీత = చల్లదనము; ఉష్ణ = వేడి; భేదంబులన్ = తేడాలతో; ద్వి = రెండు (2); విధంబున్ = రకములు; ఐన = అయిన; జ్వరంబున్ = జ్వరము; దక్షిణపాంచాలంబున్ = దక్షిణపాంచాలము; అనన్ = అనగా; పితృలోక = పితృలోకమును; ప్రాపకంబున్ = లభింపజేయు; ప్రవృత్తి = కర్మల వర్తించవలసిన; రూపకంబున్ = పద్ధతులు కలవి; ఐన = అయిన; శాస్త్రంబున్ = శాస్త్రములు; ఉత్తరపాంచాలంబున్ = ఉత్తరపాంచాలము; అనన్ = అనగా; దేవలోక = దేవలోకమును; ప్రాపకంబున్ = లభింపజేయు; నివృత్తి = నివృత్తి, వైరాగ్యము; సంజ్ఞికంబున్ = పేరుకలవి; అయిన = ఐన; శాస్త్రంబున్ = శాస్త్రములు; శ్రుతధరుండు = శ్రుతధరుండు; అనన్ = అనగా; శ్రోత్రంబున్ = శ్రోత్రేంద్రియము; ఆసురీనామకంబున్ = ఆసురీనామకంబున్, రాక్షస సంబంధమైన; అనన్ = అనగా; పశ్చాత్ = పడమటిదిక్కు; ద్వారంబున్ = ద్వారము; ఐన = అయిన; మేఢ్రంబున్ = పురుషావయవము; గ్రామకంబు = గ్రామకంబు; అనన్ = అనగా; సురతసుఖంబున్ = సంభోగము; దుర్మదుండు = దుర్మదుండు; అనన్ = అనగా; గుహ్యేంద్రియంబు = రహస్యేంద్రియము; నిరృతి = నిరృతి అనెడి; నామకంబున్ = పేరు కలది; ఐన = అయిన; పశ్చిమ = పడమటిదిక్కు; ద్వారంబున్ = ద్వారము; అనన్ = అనగా; గుదంబు = మలద్వారము; వైశసంబున్ = వైశసము; అనన్ = అనగా; నరకంబున్ = నరకము; లుబ్ధకుండు = లుభ్ధకుండు, పిసినారి; అనన్ = అనగా; పాయువు = మలవిసర్జనము చేయు తావు; సంధులు = సంధులు; అనన్ = అనగా; హస్త = చేతులు; పాదంబులున్ = కాళ్ళు; అంతఃపురంబున్ = అంతఃపురము; అనన్ = అనగా; హృదయంబున్ = హృదయము; విషూచి = విషూచి ప్రమదోత్తమతో {విషూచి - మనసు, విష్వచ్ఛ, విషూచీన, (విష అంటే వ్యాపతౌ, వాచస్పతం) అన్ని వైపులకు (పరిపరి విధాల) పోవునది.}; అనన్ = అనగా; మనంబున్ = మనస్సు; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అనిన ప్రాచీనబర్హితో నారదుడు ఇలా అన్నాడు “రాజేంద్రా! ఏ కారణం చేత ఒక పాదం కలది (చెట్టు), రెండు పాదాలు కలది (మానవుడు, పక్షి), మూడు పాదాలు కలది, నాలుగు పాదాలు కలది (జంతువు), పెక్కు పాదాలు కలది (కీటకం), పాదాలు లేనిది (పాము) అయి పెక్కురకాలుగా చేతనతో కూడిన జీవునివల్ల దేహం వ్యక్తమవుతుందో ఆ కారణంచేత పురంజనుడు పురుషు డయ్యాడు. ఆ పురుషునికి నామ క్రియాగుణాలచే తెలియబడ్డ అవిజ్ఞాతుడు అనే మిత్రుడే ఈశ్వరుడు. పురుషుడు తొమ్మిది ద్వారాలతోను, రెండు చేతులతోను, పాదాలతోను కూడిన దోషరహితమైన దేహంలో ప్రవేశించాలని కోరుకుంటాడు. కాబట్టి పురం అంటే దేహం. పురుషుడు బుద్ధిని ఆశ్రయించి ఇంద్రియాలచేత విషయసుఖాలను అనుభవిస్తాడు. అహంకార మమకారాలను పొందుతాడు. కాబట్టి ఉత్తమ స్త్రీ అంటే బుద్ధి. ఆ బుద్ధికి స్నేహితులు అంటే జ్ఞాన, కర్మ కారణాలైన ఇంద్రియ గుణాలు. చెలికత్తెలంటే ఇంద్రియ వ్యాపారాలు. అయిదు తలల పాము అంటే పంచవృత్తి అయిన ప్రాణం. పదకొండుమంది మహాభటులు అంటే జ్ఞాన కర్మేంద్రియాలు పది, వాటిని ప్రేరేపించే మనస్సు (బృహద్బలుడు). తొమ్మిది ద్వారాలతో కూడిన ఆ పురాన్ని చుట్టి వచ్చిన పాంచాల దేశాలు అంటే శబ్దం మొదలైన పంచ విషయాలు. నవద్వారాలు అంటే రెండు కన్నులు, రెండు ముక్కు రంధ్రాలు, ఒక నోరు, రెండు చెవులు, గుదం, మగగురి. అందులో రెండు కన్నులు, రెండు ముక్కు రంధ్రాలు, ఒక నోరు ఈ ఐదు తూర్పున ఉండే ద్వారాలు. కుడి చెవి దక్షిణ ద్వారం. ఎడమచెవి ఉత్తర ద్వారం. గుదం, శిశ్నం అనేవి రెండు పడమటి ద్వారాలు. అందులో ఒకేచోట నిర్మింపబడిన ఖద్యోత, ఆవిర్ముఖి అంటే కన్నులు. విభ్రాజితం అంటే రూపం. ద్యుమంతుడు అంటే నేత్రేంద్రియం. నళిని, నాళిని అంటే ముక్కు రంధ్రాలు. సౌరభం అంటే గంధం. అవధూత అంటే ఘ్రాణేంద్రియం. ముఖ్య అంటే నోరు. విపణం అంటే వాగింద్రియం. రసజ్ఞుడు అంటే రసనేంద్రియం. ఆపణం అంటే సంభాషణం. బహూదనం అంటే పలురకాలైన అన్నం. పితృహువు అంటే కుడిచెవి. దేవహువు అంటే ఎడమ చెవి. చంద్రవేగుడు అంటే కాలాన్ని సూచించే సంవత్సరం. గంధర్వులు అంటే పగళ్ళు. గంధర్వీజనులు అంటే రాత్రులు. పరీవర్తనం అంటే ఆయుఃక్షయం. కాలకన్యక అంటే ముసలితనం. యవనేశ్వరుడు అంటే మృత్యువు. అతని సైనికులు ఆధివ్యాధులు. ప్రజ్వారుడు అంటే వేగంగా చావును కలిగించే జ్వరం. శీతం, ఉష్ణం అనే ఈ జ్వరం రెండు రకాలు. దక్షిణ పాంచాలం అంటే పితృలోకాన్ని పొందించేదీ, ప్రవృత్తి రూపకమూ అయిన శాస్త్రం. ఉత్తర పాంచాలం అంటే దేవలోకాన్ని పొందించేదీ, నివృత్తి రూపకమూ అయిన శాస్త్రం. శ్రుతధరుడు అంటే చెవి. ఆసురి అనే పేరు కలిగిన పడమటి ద్వారం శిశ్నం. గ్రామకం అంటే రతి. దుర్మదుడు అంటే యోని. నిరృతి అనే పేరు కలిగిన పడమటి ద్వారం గుదం. వైశసం అంటే నరకం. లుబ్ధకుడు అంటే మలద్వారం. సంధులు అంటే చేతులు కాళ్ళు. అంతఃపురం అంటే హృదయం. విషూచి అంటే మనస్సు” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

తెభా-4-854-సీ.
నఘాత్మ! వినుము జాయాత్మజులను గుణా-
క్తం బగు మఱి బుద్ధిత్త్వ మర్థి
వెలయ నేయే గతి వికృతి చేయం బడు-
నేయే తెఱంగుల నింద్రియములు
వికృతిని బొందు నా విధమునఁ దద్గుణా-
న్వితుఁడును వరుసఁ దద్వృత్తులకును
నుఁడు నుపద్రష్టయును దగు నాత్మయుఁ-
ద్వృత్తులను బలాత్కారమునను

తెభా-4-854.1-తే.
నుకరింపంగ నర్థిఁ జేయంగఁ బడుట
నవరత మాత్మమహిషిని నుసరించు
యు నెఱుఁగఁ జెప్పి యిట్టు లనియెను మఱియు
నవరేణ్యునితో యోగిత్తముండు.

టీక:- అనఘాత్మ = పుణ్యాత్మ; వినుము = వినుము; జాయా = భార్య; ఆత్మజుల్ = పుత్రులకు; అనుగుణా = అనుకూలముగా; ఆక్తంబున్ = ప్రవర్తించునది; అగు = అయిన; మఱి = ఇంక; బుద్ధి = బుద్ధి యొక్క; తత్త్వము = తత్త్వము; అర్థిన్ = కోరి; వెలయన్ = ప్రకటమగునో; ఏయే = ఏయే; గతిన్ = విధముగ; వికృతిన్ = మార్పులను; చేయంబడు = చేయబడునో; ఏయే = ఏయే; తెఱంగులన్ = విధములుగ; ఇంద్రియములున్ = ఇంద్రియములును; ఏయే = ఏయే; తెఱంగులన్ = విధములుగ; ఇంద్రియములున్ = ఇంద్రియములు; ఏయే = ఏయే; తెఱంగులన్ = విధములుగ; వికృతిన్ = మార్పులను; పొందున్ = పొందునో; ఆ = ఆ; విధమునన్ = విధముగా; తత్ = ఆయా; గుణ = గుణములతో; ఆన్వితుండునున్ = కూడినవాడు; వరుసన్ = వరుసగా; తత్ = ఆయా; వృత్తులు = వర్తనలు; కునున్ = కు; ఘనుడునున్ = గొప్పవాడు; ఉపద్రష్టయునున్ = గమనించువాడు; తగున్ = అన తగిన; ఆత్మయున్ = ఆత్మ; తత్ = ఆయా; వృత్తులను = వర్తనలను; బలాత్కారమునను = బలవంతముగ; అనుకరింపంగన్ = అనుకరించుటలు; అర్థిన్ = కోరి; చేయంగబడుటన్ = చేయబడుటలు; అనవరతమున్ = ఎల్లప్పుడు; ఆత్మ = తనయొక్క; మహిషిన్ = పట్టపురాణిని; అనుసరించుటయున్ = అనుయరించుట; ఎఱుగంగగన్ = తెలియునట్లు; చెప్పి = చెప్పి.
= = ఇటులు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; మఱియున్ = ఇంకనూ; జనవరేణ్యుని = రాజు {జనవరేణ్యుడు - జనులచే గౌరవింపబడువాడు, రాజు}; తోన్ = తో; యోగి = యోగులలో; సత్తముండు = సత్తువగలవాడు.
భావము:- “పుణ్యాత్మా! విను. భార్యాపుత్రులు అనే గుణలిప్తమైన బుద్ధితత్త్వం ఏయే విధంగా వికారాన్ని పొందుతుందో, ఏయే విధాలుగా ఇంద్రియాలు వికారాన్ని పొందుతాయో ఆ గుణాలు కలిగి ఆ వృత్తులను అనగా తమస్సత్త్వరజోధర్మలైన మోహ, ప్రసాద, హర్షాలను బలవంతంగా పురంజనుడు అనుకరించేవాడు” అని చెప్పి యోగివర్యుడైన నారదుడు రాజశ్రేష్ఠుడైన ప్రాచీనబర్హితో ఇలా అన్నాడు.

తెభా-4-855-వ.
“మఱియు నరదం బన దేహంబు; దురంగంబు లన నింద్రియంబు; లీషాద్వయం బన సంవత్సరంబునుం దత్కృత వయస్సును; చక్రద్వయం బనం బుణ్యపాప కర్మద్వయంబు; వేణుత్రయం బన గుణత్రయంబు; పంచబంధనం బనం బంచప్రాణంబులు; రశ్మి యన మనంబు; సారథి యన బుద్ధి; రథికోపవేశస్థానం బన హృదయంబు; కూబరంబు లన శోకమోహంబులు; పంచప్రహరణంబు లనం బంచేంద్రి యార్థప్రక్షేపంబు; పంచవిక్రమం బనం గర్మేంద్రియంబులు; సప్తవరూధంబు లన ధాతువులు; హైమోపస్కరం బన రజోగుణంబు; అక్షయతూణీరం బన ననంతవాసనాహంకారోపాధి; యేకాదశ చమూపతి యన నేకాదశేంద్రియంబైన మనం; బాసురీవృత్తి యనం బాహ్యవిక్రమంబు; పంచేంద్రియంబులచేత మృగయా వినోదంబు చందంబున హింసాదులం జేసి విషయంబు లనుభవించుటయ మృగయాచరణం; బీ విధంబున నుండ జీవుండు దేహంబున స్వప్న సుషుప్తి జాగ్రదవస్థల యందు నాధ్యాత్మి కాధిదైవి కాధిభౌతికంబులైన బహువిధ దుఃఖంబులం జేసి క్లేశంబు లననుభవించుచు నజ్ఞానావృతుండయి వర్షశతంబు నిర్గుణుం డయ్యును బ్రాణేంద్రియ మనోధర్మంబులం దనయందు నధ్యవసించి కామలవంబుల ధ్యానంబు చేయుచు నహంకార మమకార సహితంబుగాఁ గర్మాచరణంబు చేయుచుండు.
టీక:- మఱియున్ = ఇంకను; అరదంబున్ = రథము; అనన్ = అనగా; దేహంబున్ = శరీరము; తురంగంబులున్ = గుఱ్ఱములు; అనన్ = అనగా; ఇంద్రియంబులున్ = ఇంద్రియములు; ఈషా = కాడులు; ద్వయంబున్ = రెండు (2); అనన్ = అనగా; సంవత్సరంబున్ = సంవత్సరమును; తత్ = వానితో; కృత = జరుగు; వయస్సునున్ = వయస్సు; చక్ర = చక్రములు; ద్వయంబున్ = రెండు (2); అనన్ = అనగా; పుణ్య = పుణ్యవంతమైన; పాప = పాపపు; కర్మ = కర్మముల; ద్వయంబున్ = రెండు (2); వేణు = వేణు, వెదురు కఱ్ఱలు; త్రయంబున్ = మూడు; అనన్ = అనగా; గుణత్రయంబున్ = త్రిగుణములు {గుణత్రయము - సత్త్వరస్తమోగుణములు మూడు}; పంచ = ఐదు (5); బంధనంబు = కట్లు; అనన్ = అనగా; పంచ = ఐదు (5); ప్రాణంబులున్ = ప్రాణములు {పంచప్రాణములు - 1 ప్రాణము 2 అపానము 3 న్యాసము 4 ఉదానము 5 సాన వాయువులు}; రశ్మి = పగ్గము; అనన్ = అనగా; మనంబున్ = మనసు; సారథి = సారథి; అనన్ = అనగా; బుద్ధి = బుద్ధి; రథిక = రథమునెక్కినవాడు; ఉపవేశ = కూర్చుండు; స్థానంబున్ = స్థానము; అనన్ = అనగా; హృదయంబున్ = హృదయము; కూబరంబుల్ = కూబరము, నొగలు, సారథి ఉండు స్థానము; అనన్ = అనగా; శోక = దుఃఖము; మోహంబులున్ = మోహముచెందుటలు; పంచ = ఐదు (5); ప్రహరణంబులు = ప్రహరణములు, గంటలు; అనన్ = అనగా; పంచ = ఐదు (5); ఇంద్రియార్థ = విషయముల; ప్రక్షేపము = ప్రయోగించుట; పంచ = ఐదు (5); విక్రమంబున్ = విక్రమములు, శౌర్యములు; పంచ = ఐదు (5); కర్మేంద్రియంబులున్ = కర్మేంద్రియములు; సప్త = ఏడు (7); వరూధంబులు = కవచములు; అనన్ = అనగా; ధాతువులు = సప్తధాతువులు; హైమ = బంగారపు; ఉపస్కరంబున్ = అలంకారములు; అనన్ = అనగా; రజోగుణంబున్ = రజోగుణము; అక్షయతూణీరంబున్ = అక్షయతూణీరము; అనన్ = అనగా; అనంత = అంతులేని; వాసనా = పూర్వజన్మవాసనలు, సంస్కారములకు; అహంకార = అహంకారము అనెడి; ఉపాధి = ఆధారమైనది; ఏకాదశ = పదకొండు (11); చమూ = సైన్యమునకు; పతి = అధిపతి; అనన్ = అనగా; ఏకాదశ = పదకొండు (11); ఇంద్రియంబున్ = ఇంద్రియములు {ఏకాదశేంద్రియములు - మనసు పంచజ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు}; ఐన = అయిన; మనంబున్ = మనసు; ఆసురీవృత్తి = రాక్షసవర్తన; అనన్ = అనగా; బాహ్య = బయటి ప్రపంచము లోనికి; విక్రమంబున్ = విజృంభించుట; పంచేంద్రియంబుల్ = పంచేంద్రియముల; చేతన్ = చేత; మృగయా = వేట; వినోదంబున్ = క్రీడ; చందంబునన్ = వలె; హింస = హింసించుట; ఆదులన్ = మొదలగువాని; చేసి = వలన; విషయంబులన్ = ఇంద్రియగోచరంబులను; అనుభవించుటయ = అనుభవించుటే; మృగయాచరణంబున్ = వేటాడుట; ఈ = ఈ; విధంబునన్ = విధముగా; ఉండన్ = ఉండగా; జీవుండు = జీవుడు; దేహంబునన్ = శరీరమునందు; స్వప్న = స్వప్నావస్థ; సుషుప్తి = సుషుప్తి అవస్థ; జాగ్రదావస్తల్ = జాగ్రదావస్థల; అందున్ = అందు; ఆధ్యాత్మిక = ఆధ్యాత్మికము; ఆధిదైవిక = ఆధిదైవికము; ఆధిభౌతికంబులు = ఆధిభౌతికములు; ఐన = అయిన; బహు = అనేక; విధ = రకముల; దుఃఖంబులన్ = దుఃఖములు; చేసి = వలన; క్లేశంబులన్ = చింతలను, తిప్పలను; అనుభవించుచున్ = అనుభవించుతూ; అజ్ఞాన = అజ్ఞానముచేత; ఆవృతుండు = కప్పబడినవాడు; అయి = అయ్యి; వర్ష = సంవత్సరములు; శతంబున్ = నూటిని; నిర్గుంణుండున్ = గుణరహితుండున్; అయ్యున్ = అయినప్పటికిని; ప్రాణ = ప్రాణములు; ఇంద్రియ = ఇంద్రియములు; మనః = మనస్సు; ధర్మంబులన్ = ధర్మముల; అందున్ = అందు; అధ్యవసించి = నివసించి; కామ = కోరికలు; లవంబున్ = చిన్నచిన్నవాటిని; ధ్యానంబున్ = ధ్యానము; చేయుచున్ = చేయుచూ; అహంకార = నేననెడి వృత్తి; మమకార = నాది యనెడి వృత్తి; సహితంబుగాన్ = కూడినదిగా; కర్మ = కర్మములను; ఆచరణంబున్ = చేయుట; చేయుచున్ = చేయుచూ; ఉండు = ఉండును.
భావము:- ఇంకా రథం అంటే శరీరం. గుఱ్ఱాలు అంటే ఇంద్రియాలు. రెండు యుగాలు అంటే సంవత్సరం, దాని చేత ఏర్పడిన వయస్సు. రెండు చక్రాలు అంటే పుణ్యపాప కర్మలు. మూడు జెండాలు అంటే త్రిగుణాలు. పంచబంధనాలు అంటే పంచప్రాణాలు. పగ్గం అంటే మనస్సు. సారథి అంటే బుద్ధి. గూడు అంటే హృదయం. రెండు నొగలు అంటే శోకమోహాలు. పంచప్రహరణాలు అంటే ఐదు ఇంద్రియార్థాలు. పంచవిక్రమాలు అంటే కర్మేంద్రియాలు. సప్త వరూధాలు అంటే రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం అనే ఏడు ధాతువులు. స్వర్ణాభరణం అంటే రజోగుణం. అక్షయ తూణీరం అంటే అనంత వాసనాహంకార ఉపాధి. ఏకాదశ సేనాపతి అంటే పది ఇంద్రియాలు, మనస్సు. ఆసురీవృత్తి అంటే బాహ్య విక్రమం. పంచేంద్రియాల చేత హింసాదులను చేసి విషయాలను అనుభవించడమే వేట. పురుషుడు దేహంతో స్వప్న సుషుప్తి జాగ్రదవస్థలతో ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికాలైన బహువిధ దుఃఖాలచేత కష్టాలను అనుభవిస్తాడు. అజ్ఞానం చేత కప్పబడి నిర్గుణుడు ఐనా ప్రాణేంద్రియ మనోధర్మాలను తనలో ఆరోపించి కామలేశాలను ధ్యానిస్తూ, అహంకార మమకారాలతో కూడ వందయేండ్లు కర్మలను ఆచరిస్తాడు.

తెభా-4-856-క.
పురుషుఁడు నిజప్రకాశతఁ
గియు నలఘుఁడుఁ బరుండు గవంతుండున్
గురుఁడును నగు నయ్యాత్మను
రువడి నెఱుఁగంగ లేక ప్రకృతి గుణములన్.

టీక:- పురుషుడు = జీవుడు; నిజ = స్వయం; ప్రకాశతన్ = ప్రకాశత యందు; పరగియున్ = ప్రసిద్ధుడయ్యును; అలఘుడు = గొప్పవాడు; పరుండు = ప్రకృతికి పరమైనవాడు; భగవంతుండున్ = ఐశ్వర్యవంతుండును; గురుడును = గొప్పవాడు; అగు = అయిన; ఆ = ఆ; ఆత్మనున్ = పరమాత్మను; పరువడిన్ = యుక్తముగా; ఎఱుగంగన్ = తెలియ; లేక = లేకుండగ; ప్రకృతి = ప్రకృతి యొక్క; గుణములన్ = గుణములను.
భావము:- పురుషుడు తాను స్వయంప్రకాశుడనీ, ప్రకృతికి పరుడైన పరమాత్ముడనీ, గురుడనీ తెలుసుకోలేక ప్రకృతి గుణాలలో…

తెభా-4-857-క.
విను మెపుడు దగులు నప్పుడ
యొరంగ గుణాభిమానియును గర్మవశుం
నఁ దగు నా పురుషుఁడు దా
మగు త్రైగుణ్యకర్మ లితుం డగుచున్.

టీక:- వినుము = వినుము; ఎపుడున్ = ఎప్పుడున్; తగులున్ = ఆసక్తి కలవా డగు; అప్పుడు = అప్పుడు; ఒనరంగన్ = పొసగునట్లుగా; గుణా = గుణముల యందు; అభిమానియున్ = అభిమానము కలవాడు; కర్మ = కర్మమములకు; వశుండును = లొంగినవాడును; అనన్ = అనుటకు; తగు = తగును; ఆ = ఆ; పురుషుడు = పురుషుడు; తాన్ = తను; ఘనము = గొప్పది; అగు = అయిన; త్రైగుణ్య = త్రిగుణాత్మకమైన; కర్మ = కర్మములు; కలితుండున్ = కలిగినవాడు; అగుచున్ = అగుచూ.
భావము:- ఎప్పుడైతే అలా ప్రకృతి గుణాలలో ఆసక్తుడు ఔతాడో, అప్పుడు మానవుడు గుణాభిమాని అయి, త్రిగుణాలకు సంబంధించిన కర్మలలో మునిగి తేలుతూ, కర్మవశుడు అయి ఉంటాడు. …

తెభా-4-858-సీ.
ధృతి నొప్పుచున్న సాత్విక కర్మమునను బ్ర-
కాశ భూయిష్ఠ లోముల భూరి
రాజస ప్రకట కర్మమున దుఃఖోదర్క-
లోలక్రియా యాస లోకములను
గైకొని తామస ర్మంబునను దమ-
శ్శోక మోహోత్కట లోకములను
బొందుచుఁ బుం స్త్రీ నపుంసక మూర్తుల-
దే తిర్యఙ్మర్త్య భాములను

తెభా-4-858.1-తే.
లుగుఁ గర్మానుగుణములు గాఁగ జగతిఁ
బుట్టి చచ్చుచుఁ గ్రమ్మఱఁ బుట్టు చిట్లు
దివిరి కామాశయుం డైన దేహి యెప్డు
నున్న తానత పదముల నొందుచుండు.

టీక:- ధృతిన్ = ధారణతో; ఒప్పుచున్న = ఒప్పియున్నట్టి; సాత్విక = సత్త్వగుణముకల; కర్మముననున్ = కర్మములవలన; ప్రకాశ = ప్రభలు; భూయిష్ట = మిక్కుటమైన; లోకములన్ = లోకములను; భూరి = అత్యధికమైన; రాజస = రజోగుణముతో; ప్రకట = వ్యక్తమగు; కర్మమునన్ = కర్మలలో; దుఃఖ = దుఃఖము కలుగుట; ఉదర్క = రాగల ఫలముగా గల; లోల = చంచలములైన; క్రియా = పనుల వలన; ఆయాస = కష్టపడునట్టి; లోకములనున్ = లోకములను; కైకొని = పూని; తామస = తమోగుణముకల; కర్మమంబునన్ = కర్మములలో; తమః = ఆజ్ఞానము, చీకటి; శోక = దుఃఖము కలుగుట; మోహ = మోహములోపడుట; ఉత్కట = మోసపూరిత; లోకములనున్ = లోకములను; పొందుచున్ = పొందుతూ; పుం = పురుష; స్త్రీ = స్త్రీ; నపుంసక = నపుంసకములైన; మూర్తులన్ = రూపములను; దేవ = దేవతా, దైవత్వ; తిర్యక్ = జంతు, తిరుగట; మర్త్య = మానవ, మరణము యనెడి; భావములను = జన్మములను, భావములను; కలుగున్ = పొందును; కర్మా = కర్మములకు; అనుగుణములు = అనుకూలములు; కాగన్ = అగునట్లు.
జగతిన్ = ప్రపంచములో; పుట్టి = జన్మంచి; చచ్చుచున్ = చనిపోతూ; క్రమ్మఱన్ = మరల; పుట్టుచున్ = పుడతూ; ఇట్లు = ఈ విధముగా; తివిరి = యత్నిస్తూ; కామా = కామములయందు; ఆశయుండు = మనసుకలవాడు; ఐన = అయిన; దేహి = జీవుడు {దేహి - దేహమును ధరించెడివాడు, జీవుడు}; ఎప్డు = ఎల్లప్పుడును; ఉన్నత = ఉత్తమమైన, అభివృద్ధిగల; ఆనత = వంగిన; పదములన్ = స్థితులను; ఒందుచుండున్ = పొందుచుండును.
భావము:- సాత్త్విక కర్మల వల్ల ప్రకాశ భూయిష్ఠాలైన లోకాలను, రాజస కర్మల వల్ల దుఃఖ భూయిష్ఠాలైన లోకాలను, తామస కర్మల వల్ల తమశ్శోకమోహ భూయిష్ఠాలైన లోకాలను పొందుతాడు. ఒకప్పుడు పురుషుడై, ఒకప్పుడు స్త్రీయై, ఒకప్పుడు నపుంసకుడై ఆయా కర్మలకు తగినట్లు దేవ, మనుష్య, తిర్యక్ రూపాలతో జన్మిస్తాడు. ఈ విధంగా కామాసక్తుడైన పురుషుడు పుడుతూ, చస్తూ, మళ్ళీ పుడుతూ ఉన్నత స్థానాలను, నీచ స్థానాలను పొందుతూ ఉంటాడు.

తెభా-4-859-వ.
అని మఱియు నిట్లనియె.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని ఇంకా ఇలా అన్నాడు.

తెభా-4-860-మ.
యన్ క్షుత్పరిపీడఁ గుంది శునకం బింటింటికిం బోవఁ బూ
నినఁ దద్దైవిక మైన దండహతిఁ గానీ, కాక చౌర్యాన్న మై
ను గానీ తగఁ బొందు చందమున నెన్నన్ దైవయోగంబు పెం
పు నీ జీవుఁడు దాఁ బ్రియాప్రియములం బొందుం ద్రిలోకంబులన్.

టీక:- ఎనయన్ = మిక్కిలిగా; క్షుత్ = ఆకలిచే; పరిపీడన్ = బాధ యందు; కుంది = దుఃఖపడి; శునకంబున్ = కుక్క; ఇంటింటికిని = ప్రతి ఇంటికి; పోవన్ = వెళ్ళగా; పూనిన = దొరకిన; తత్ = తత్కాలపు; దైవికము = యాదృచ్ఛికతను, దేవనిర్ణయానుసారము; ఐన = అయిన; దండహతిన్ = కఱ్ఱదెబ్బలు; కానీ = కానీ; కాక = కాకపోతే; చౌర్య = దొంగతనము చేయబడిన; అన్నము = ఆహారము; ఐననున్ = అయిన; కానీ = కానీ; తగన్ = అవశ్యము; పొందున్ = పొందెడి; చందమునన్ = విధముగా; ఎన్నన్ = ఎంచి చూసిన; దైవ = దేవుని యొక్క; యోగంబున్ = కలసివచ్చుట; పెంపునన్ = అతిశయించుట వలన; ఈ = ఈ; జీవుడు = పురుషుడు; తాన్ = తాను; ప్రియా = ఇష్టమైనవి; అప్రియములన్ = అయిష్టమైనవి; పొందున్ = పొందును; త్రిలోకంబునన్ = ముల్లోకములలోను {ముల్లోకములు - 1భూలోకము 2భువర్లోకము 3సువర్లోకము}.
భావము:- ఆకలి బాధతో కుక్క ఇంటింటికీ తిరిగి దైవికంగా కఱ్ఱ దెబ్బలనో, దొంగకూడునో తిన్నట్లు జీవుడు దైవికంగా ప్రాప్తించిన ప్రియాప్రియాలను మూడు లోకాలలోను అనుభవిస్తాడు.

తెభా-4-861-చ.
గొకొని యిట్టి దుఃఖములకుం బ్రతికారము మానవేంద్ర! క
ల్గి విను తత్ప్రతిక్రియ యకించనవృత్తి జనుండు మస్తకం
బు నిడుమోపు మూఁపునను బూనినఁ దద్భరదుఃఖ మాత్మఁ బా
ని గతి జీవుఁడుం ద్రివిధమై తగు దుఃఖముఁ బాయఁ డెన్నడున్.

టీక:- గొనకొని = పూని; ఇట్టి = ఇటువంటి; దుఃఖముల్ = దుఃఖముల; కున్ = కి; ప్రతీకారము = విరుగుడు; మానవేంద్ర = రాజా {మానవేంద్రుడు - మానవులకు ప్రభువు, రాజు}; కల్గినన్ = ఉన్నప్పటికిని; విను = వినుము; తత్ = ఆ; ప్రతిక్రియ = విరుగుడు; అకించన = దరిద్రుని; వృత్తిన్ = విధముగా నున్న; జనుండు = వాడు; మస్తకంబున్ = తలపైని; ఇడు = పెట్టుకొన్న; మోపు = బరువును; మూపునన్ = భుజముపైకి; పూనినన్ = ధరించినను; తత్ = ఆ; భర = బరువు వలని; దుఃఖమున్ = బాధ; ఆత్మన్ = తనను; పాయని = విడువని; గతిన్ = వలె; జీవుడు = జీవుడు; త్రివిధము = మూడు (3) రకములు {త్రివిధదుఃఖములు - 1ఆదిభౌతికము 2అధ్యాత్మికము 3అధిదైవికము}; ఐ = అయ్యి; తగు = ఒప్పు; దుఃఖము = దుఃఖము; పాయదు = తొలగదు; ఎన్నడున్ = ఎప్పటికిని.
భావము:- ఇటువంటి దుఃఖాలకు ప్రతిక్రియ లేదు. ఒకవేళ ఉన్నా అది తాత్కాలికమే. బరువు మోసే నిరుపేద తన తలమీది బరువును భుజం మీదికి మార్చుకున్నా దాన్ని మోయటం వల్ల కలిగే దుఃఖాన్ని తప్పించుకోలేడు. అలాగే జీవుడు మూడు రకాలైన దుఃఖాన్ని తప్పించుకోలేడు.

తెభా-4-862-క.
దుఃఖ హేతు కర్మం
బును దత్ప్రతికార కర్మమును నివి మాయా
నము లగుటను బురుషుఁడు
నుఁ గలలోఁ దోఁచి నట్టి ల చందమునన్.

టీక:- ఘన = అత్యధికమైన; దుఃఖ = దుఃఖమునకు; హేతు = కారణమైన; కర్మంబునున్ = కర్మము; తత్ = దానికి; ప్రతీకార = విరుగుడు; కర్మమునున్ = కర్మము; ఇవి = ఈ కర్మములు; మాయా = మయవలన; జననములున్ = పుట్టినవి; అగుటను = అగుటచేత; పురుషుడు = పురుషుడు; కనున్ = కన్నట్టి; కల = స్వప్నము; లోన్ = లో; తోచిన = అనిపించిన; అట్టి = అటువంటి; కల = స్వప్నము; చందమునన్ = వలె.
భావము:- కలలో మళ్ళీ కల వచ్చినట్లు పురుషుడు దుఃఖాన్ని కలిగించే కర్మం, ప్రతీకార కర్మం అవిద్యచేత కలిగి….

తెభా-4-863-వ.
సవాసనోచ్ఛేదకంబు గా"దని వెండియు నిట్లనియె.
టీక:- సవాసనన్ = వాసనలోకలిపి, సహ వాసమువలన; ఉచ్ఛేదకంబు = నాశము చేయునవి; కాదు = కాదు; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- సహవాసం వల్ల నాశనం చెందేవి కావు” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

తెభా-4-864-సీ.
రనాథ! వినుము స్వప్నంబు చందంబున-
జ్ఞాన విలసితం గుటఁ జేసి
తివిరి మిథ్యాభూత దేహాదికమునకు-
రయ నివర్తనాయాస మేటి
ని యంటివేనియు ర్థంబు లేకున్న-
ర్థి సోపాధికం బైన మనము
వాంఛతో స్వప్నము ర్తింపఁ బురుషునిఁ-
బూని జాగ్రద్బోధచే నుపాధి

తెభా-4-864.1-తే.
చెడక స్వాప్నిక సంసృతి విడువనట్లు
త్త్వ విజ్ఞానమున నవిద్యా నివృత్తి
దార దేహాదిక నివృత్తి గులకున్నఁ
దివుట సంసృతి దా నివర్తింప కుండు.

టీక:- నరనాథ = రాజా {నరనాథుడు - నరుల (మానవుల)కు నాథుడు, రాజు}; వినుము = వినుము; స్వప్నంబున్ = కల; చందంబునన్ = వలె; అజ్ఞాన = అజ్ఞానముతో; విలసితంబున్ = విలసిల్లునది; అగుటన్ = అగుట; చేసి = వలన; తివిరి = పూని; మిథ్యాభూత = మిథ్యయైనట్టి; దేహ = శరీరము; ఆదికమున్ = మొదలగువాని; కున్ = కి; అరయన్ = తరచిచూసిన; నివర్తన = మానిపించెడి; ఆయాసము = శ్రమ; ఏటికి = దేనికి; అని = అని; అంటివేనియున్ = అనినచో; అర్థంబున్ = ప్రయోజనము; లేకున్నన్ = లేనిచో; అర్థిన్ = కోరి; స ఉపాధికంబున్ = ధారణములుతో కూడినది; ఐన = అయిన; మనమున్ = మనసు; వాంఛ = కోరిక; తోన్ = తోటి; స్వప్నమున్ = కలలో; వర్తింపన్ = ప్రవర్తిల్లిన; పురుషునిన్ = పురుషుని; పూని = యత్నముతో; జాగ్రత్ = మెలకువలోని; ఉద్బోధ = తెలియగలుగట; చేన్ = అందును; ఉపాధిన్ = ధారణమును.
చెడకన్ = చెరపివేయక; స్వాప్నిక = కలలోని; సంసృతిన్ = ప్రవృత్తిని; విడువన్ = వదలని; అట్లు = విధముగా; తత్త్వ = తత్త్వము, యదార్థస్థితిని; విజ్ఞానమున్ = విజ్ఞానమున, తెలియుటవలన; అవిద్యా = అజ్ఞానమును; నివృత్తిన్ = పోగొట్టుకొనుటద్వారా; దార = క్రమముగా; దేహ = శరీరము; ఆదిన్ = మొదలగువానిని; నివృత్తిన్ = తొలగుట; తగులకున్నన్ = స్పృశింపకపోయినను; తివుటన్ = కోరికతో; సంసృతిన్ = సంసారము; దానిన్ = దానిలో; వర్తింపకుండు = ప్రవర్తిల్లదు.
భావము:- “రాజా! విను. దేహం స్వప్నం వలె అజ్ఞానంవల్ల ప్రాప్తిస్తుంది కాబట్టి అసత్యమైనదే కదా! దానిని ప్రయాసపడి తొలగించుకోవటం ఎందుకు అని అనరాదు. ప్రయోజనం లేకపోయినా కలలో ఉపాధితో కూడిన మనస్సు పురుషుని ఆశ్రయించి మెలకువ వచ్చిన తరువాత కూడా స్వప్న సంసారాన్ని విడిచిపెట్టదు. అలాగే వైరాగ్య చేత అజ్ఞానాన్ని తొలగించుకోలేక పోయినా, భార్యను శరీరాన్ని విడిచిపెట్ట లేకపోయినా సంసారం నుండి విడుదల లేదు.

తెభా-4-865-చ.
పురుషార్థభూత మనఁగాఁ దగు నాత్మకు నే నిమిత్తమై
యొర ననర్థహేతు వన నూల్కొను సంసృతి సంభవించు న
ట్లయముఁ దన్నిమిత్త పరిహారక మర్థి జగద్గురుండు నాఁ
రిన వాసుదేవ పద తామరసస్ఫుటభక్తి యారయన్.

టీక:- ఘన = పరమ; పురుష = పురుష; అర్థభూతము = ప్రయోజన మైనట్టిది; అనగాన్ = అనుటకు; తగున్ = తగిన; ఆత్మ = ఆత్మ; కున్ = కు; ఏ = ఏ; నిమిత్తమున్ = కారణముగా; ఐన్ = అయితే; ఒనరన్ = సమకూరు; అనర్థ = కీడునకు; హేతువు = కారణము; అనన్ = అనగా; నూల్కొని = పూనుకొని; సంసృతిన్ = సంసారము; సంభవించున్ = కలుగునో; అట్లు = ఆ విధముగ; అనయమున్ = ఎల్లప్పుడు; తత్ = దాని; నిమిత్త = కారణమును; పరిహారకము = తొలగించునది; అర్థిన్ = అవశ్యము; జగత్ = భువనమునకు; గురుండున్ = గురువు; నాన్ = అనగా; తనరిన = విస్తరించిన; వాసుదేవ = విష్ణుమూర్తి యొక్క; పద = పాదములు అనెడి; తామరసన్ = పద్మముల ఎడ; స్ఫుట = వికసించిన; భక్తి = భక్తియే; ఆరయన్ = చరచి చూసినచో.
భావము:- పరమ పురుషార్థం అనదగిన ఆత్మకు ఏ కారణం వల్లనైనా అనర్థాలను కలిగించే సంసారం కలుగుతుందో, ఆ కారణాన్ని జగద్గురుడైన వాసుదేవుని పాదపద్మాలమీది భక్తి నశింపజేస్తుంది.

తెభా-4-866-క.
పూనిన తద్భక్తి సమీ
చీగతిం దెలియ ననఘ! చిర వైరాగ్య
జ్ఞా జనక మగు భక్తి ని
ధాము గోవింద వరకథాశ్రయమ యగున్.

టీక:- పూనిన = ధరించిన; తత్ = ఆ; భక్తిన్ = భక్తి; సమీచీన = పరిశుద్ధమైన, ఉచిత మగు; గతిన్ = విధముగా; తెలియన్ = తెలిసికొన్నచో; అనఘ = పుణ్యుడా; చిర = మిక్కిలి; వైరాగ్య = వైరాగ్యము; జ్ఞాన = జ్ఞానములను; జనకము = కలిగించునది; అగు = అయిన; భక్తిని = భక్తి యొక్క; నిధానమున్ = స్థానము; గోవింద = విష్ణుమూర్తి యొక్క; వర = ఉత్తమమైన; కథా = కథలను; ఆశ్రయమున్ = ఆశ్రయించి ఉండునది; అగున్ = అగును.
భావము:- పుణ్యాత్మా! వాసుదేవుని మీది పరిశుద్ధమైన భక్తి, శాశ్వతము లైన వైరాగ్య జ్ఞాములను కలిగిస్తుంది. ఆ భక్తికి నెలవు గోవిందుని గొప్ప కథలను ఆశ్రయించి ఉంటుంది.

తెభా-4-867-వ.
కావున నది తత్కథాకర్ణన గాన నిరతుండు, విశ్వాస సంయుక్తుండు నైన వానికి సంభవించు మఱియును.
టీక:- కావునన్ = అందుచేత; అది = అది, ఆభక్తి; తత్ = ఆ; కథా = కథలను; ఆకర్ణన = వినుట; గాన = పాడుట లందు; నిరతుండు = మిక్కిలి ఆసక్తి కలవాడు; విశ్వాస = నమ్మికతో; సంయుక్తుడు = చక్కగా కూడినవాడు; ఐన = అయిన; వాడు = వాడు; కిన్ = కి; సంభవించున్ = కలుగును; మఱియున్ = ఇంకను.
భావము:- కావున ఆ భక్తి ఎల్లప్పుడు వాసుదేవుని కథలను వినడం వలన, గానం చేయడం వలన కలుగుతుంది. ఇంకా…

తెభా-4-868-క.
సాధులు విమలాంతః
ణులు భగవద్గుణానుథనశ్రవణ
స్ఫురితస్వాంతులు ననఘులు
ధిషణులు నైన భాగత జనుల సభన్.

టీక:- ధరన్ = భూమిపైన; సాధులున్ = సాధన చేయువారు; విమల = స్వచ్ఛమైన; అంతఃకరణులు = మనసులు కలవారు; భగవత్ = భగవంతుని; గుణ = గుణములను; అనుకథన = చెప్పుకొనుట; శ్రవణ = వినుటలవలన; స్ఫురిత = కలిగెడి; స్వాంతులు = స్వాంతన చెందినవారు; అనఘులు = పుణ్యులు; వర = శ్రేష్ఠమైన; ధిషణులున్ = ధీశక్తి (బుద్ధి బలము) కలవారు; ఐన = అయిన; భాగవత = భాగవత అనుయాయు లైన; జనుల = వారి యొక్క; సభన్ = సమావేశమున.
భావము:- సాధుశీలురు, విమల మనస్కులు భగవంతుని గుణాలను కీర్తించటం చేత, వినటం చేస్త పరిశుద్ధమైన మనస్సు కలిగిన భక్తుల సభలలో…

తెభా-4-869-క.
సోదార మహాత్మ ము
రితము లగు మధువిరోధి మనీయ గుణో
త్క సురుచిర చరితామృత
రిపూరిత వాహినులను రమప్రీతిన్.

టీక:- సరస = రస పూరితములు; ఉదార = ఉదారమైనట్టి; మహాత్మ = మహాత్ములచే; ముఖరితములు = పలుకబడినవి; అగు = అయిన; మధువిరోధి = విష్ణుమూర్తి యొక్క {మధు విరోధి - మధుడు అనెడి రాక్షసుని శత్రువు, హరి}; కమనీయ = కోరదగిన; గుణ = గుణముల; ఉత్కర = సమూహము యొక్క; సు = చక్కని; రుచిర = కాంతివంతమైన; చరిత = వృత్తాంతములు యనెడి; అమృత = అమృతముతో; పరిపూరిత = నింపబడిన; వాహినులనున్ = ప్రవాహములను; పరమ = మిక్కిలి; ప్రీతిన్ = ప్రీతితో.
భావము:- మహాత్ముల నోట వెలువడిన రసవంతాలైన, గొప్పవైన విష్ణుకథలు అనే ప్రవాహాన్ని ఎంతో ఇష్టంతో…

తెభా-4-870-క.
మలరఁగ శ్రోత్రాంజలు
ను బానము చేయు పుణ్యుకు క్షుత్తృష్ణా
భయ శోక విమోహము
యంబును సోఁకకుండు వనీనాథా!

టీక:- మనమున్ = మనసు; అలరగన్ = సంతోషించగా; శ్రోత్రా = చెవులు యనెడి; అంజలులనున్ = దోసిళ్ళతో; పానమున్ = తాగుట; చేయు = చేసెడి; పుణ్యుల = పుణ్యుల; కున్ = కు; క్షుత్ = ఆకలి; తృష్ణా = దప్పులు; ఘన = గొప్ప; భయ = భయము; శోక = దుఃఖములు; విమోహముల్ = మిక్కిలి మోహములు; అనయంబున్ = ఎల్లప్పుడును; సోకకుండున్ = తగలకుండును; అవనీనాథ = రాజా.
భావము:- చెవులు అనే దోసిళ్ళతో తనివి తీరా త్రాగే పుణ్యులకు ఆకలి, దాహం, భయం, శోకం, విమోహం సోకవు.

తెభా-4-871-వ.
కావున నిట్టి భాగవత సహవాసంబు లేక తనంతన భగవద్భాగవత గుణాభి వర్ణన కథానుచింత నాదులయందుం బ్రవర్తించిన నాలస్యాది దోషంబు లొంది యీ జీవలోకంబు సహజక్షుధాదికంబున నుపద్రుతం బై సర్వేశ్వరకథామృత వాహిని యందు రతింజేయదు; దిది నిశ్చితం” బని మఱియు నిట్లనియె.
టీక:- కావునన్ = అందుచేత; ఇట్టి = ఇటువంటి; భాగవత = భాగవతులతోడి; సహవాసము = సాంగత్యము; లేకన్ = లేకుండగనే; తనంతనన్ = తనంతటతనే; భగవత్ = భగవంతుని; భాగవత = భాగవతుల; గుణ = గుణముల; అభివర్ణన = కీర్తించుట; కథా = కథలను; అనుచింతన = సంస్మరించుట; ఆదుల్ = మొదలగువాని; అందున్ = అందు; ప్రవర్తించినన్ = మెలగినను; ఆలస్య = ఆలస్యము; ఆది = మొదలైన; దోషంబుల్ = దోషములు; ఒంది = పొంది; ఈ = ఈ; జీవ = మానవ; లోకంబున్ = లోకమున; సహజ = సహజసిద్ధమైన; క్షుత్ = ఆకలి; ఆదికంబునన్ = మొదలగువానిచే; ఉపద్రుతంబున్ = పీడింపబడినది; ఐ = అయ్యి; సర్వేశ్వర = భగవంతుని; కథా = కథలు యనెడి; అమృత = అమృతపు; వాహిని = ప్రవాహము; అందున్ = అందు; రతిన్ = ప్రీతిని; చేయదు = కలుగజేయదు; ఇది = ఇది; నిశ్చితంబున్ = నిశ్చయము; అని = అని; మఱియున్ = ఇంకనూ; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- కావున ఇటువంటి సత్సంగం లేకుండా స్వయంగా భగవంతుని గుణాలను వర్ణించడం, కథలని వినడం వలన భక్తి కలుగదు. సహజాలైన ఆకలి దప్పుల చేత బాధపడే జీవులకు సోమరితనం వల్ల, రసావేశం లేనందువల్ల హరికథామృత పానంలో ఆసక్తి కలుగదు. ఇది నిశ్చయం” అని చెప్పి నారదుడు మళ్ళీ ఇలా అన్నాడు.

తెభా-4-872-సీ.
ద్మ సంభవుఁడును వుఁడును మనుకుల-
మితి దక్షాది ప్రజాపతులును
నైష్ఠికులైన సకముఖ్య మునులుఁ బు-
స్త్యుండు భృగువుఁ బుహుఁడుఁ గ్రతువు
త్రి మరీచియు నంగిరసుండు న-
రుంధతీవిభుఁడును రూఢి మెఱయ
హు పుణ్యులే కడల గాఁగ గల బ్రహ్మ-
వాదుల నందఱు వాక్కులకును

తెభా-4-872.1-తే.
నెయ నీశ్వరులై యుండియును సమగ్ర
తిఁ దపో యోగ విద్యా సమాధి వర వి
చారులై యుండియును సర్వసాక్షి యైన
యీశ్వరుని వెదకియుఁ గాన రిద్ధచరిత!

టీక:- పద్మసంభవుడును = బ్రహ్మదేవుడు; భవుడును = శివుడును; మను = మనువు యొక్క; కుల = వంశస్థుల; సమితిన్ = సమూహము; దక్ష = దక్షుడు; ఆది = మొదలైన; ప్రజాపతులును = ప్రజాపతులును {ప్రజాపతులు - ప్రజా (సంతానాభివృద్దిచేసెడి) పతులు (ప్రభువులు)}; నైష్టికులున్ = నిష్ఠాపరులు; ఐన = అయిన; సనక = సనకుడు; ముఖ్య = మొదలగు; మునులున్ = మునులు; పులస్త్యుండు = పులస్త్యుడు; భృగువు = భృగువు; పులహుడు = పులహుడు; క్రతువు = క్రతువు; అత్రి = అత్రి; మరీచియున్ = మరీచి; అంగిరసుండున్ = అంగిరసుడు; అరుంధతీవిభుడునున్ = వసిష్టుడు; రూఢిన్ = నిశ్చయముగా; మెఱయన్ = ప్రకాశించెడి; బహు = మిక్కిలి; పుణ్యులే = పుణ్యవంతులే; కడపలన్ = చివరికి; కాగన్ = అయిన; బ్రహ్మవాదుల్ = బ్రహ్మవాదులే; అందఱున్ = అందరును; వాక్కులకున్ = చెప్పవలెనంటే; ఎనయన్ = ఎంచిచూసిన; ఈశ్వరులు = దైవసమానులు; ఐ = అయ్యి.
ఉండియునున్ = ఉన్నప్పటికిని; సమగ్ర = సంపూర్ణమైన; మతిన్ = విధముగ; తపః = తపస్సు; యోగవిద్యా = యోగవిద్యా; సమాధిన్ = సమాధులలో; వర = శ్రేష్ఠమైన; విచారులు = జ్ఞానులు; ఐ = అయ్యి; ఉండియునున్ = ఉన్నప్పటికిని; సర్వ = అఖిలమునకు; సాక్షి = సాక్షీభూతమైనవాడు; ఐన = అయిన; ఈశ్వరుని = భగవంతుని; వెదకియున్ = వెతికినప్పటికిని; కానరు = చూడలేరు; ఇద్ధచరిత = ప్రసిద్ధమైననడవడికగలవాడా.
భావము:- “పుణ్యాత్మా! బ్రహ్మ, మహేశ్వరుడు, మనువులు, దక్షుడు మొదలైన ప్రజాపతులు, సనకాది మునులు, పులస్త్యుడు, భృగువు, పులహుడు, క్రతువు, అత్రి, మరీచి, అంగిరసుడు, వసిష్ఠుడు, వేదాంతులు, వాచస్పతులు, తపోయోగవిద్యా సమాధులు అనే ఉపాయాలతో ఆలోచించేవారు. అయినా సర్వసాక్షి అయిన పరమాత్ముని చూడలేరు.

తెభా-4-873-వ.
అది యెట్లంటేని.
టీక:- అది = అది; ఎట్లు = ఏ విధముగ; అంటేని = అనినచో.
భావము:- అది ఎలా అంటే…

తెభా-4-874-మ.
విస్తార మపార మద్వయ మనంగా నొప్పు వేదంబు దా
నువర్తించుచు మంత్రయుక్తి వివిధంబై నట్టి దేవాఖ్య శో
సామర్థ్యముచేత నింద్ర ముఖ రూపం బిష్టదైవంబుగాఁ
ని వేడ్కన్ భజియించు వారలు గనంగా నేర్తురే యీశ్వరున్.

టీక:- ఘన = అత్యధికముగా; విస్తారమున్ = పెద్దది; అపారము = అంతులేనిది; అద్వయము = సాటిలేనిది; అనంగాన్ = అనగా; ఒప్పు = తగినది; వేదంబున్ = వేదము; తామున్ = తాము; అనువర్తించుచున్ = అనుసరించుతూ; మంత్ర = మంత్రములతో; ఉక్తిన్ = ప్రయోగించుట యందు; వివిధంబున్ = అనేక రకములు గలది; ఐనట్టి = అయినట్టి; దేవ = దేవుళ్ళ; ఆఖ్యన్ = పేర్లు; శోభన = శోభాకర మగు; సామర్థ్యము = సమర్థతల; చేతన్ = చేత; ఇంద్ర = ఇంద్రుడు; ముఖ = మొదలగు; రూపంబున్ = రూపులను; ఇష్ట = యజించెడి; దైవంబుగన్ = దేవతలుగా; కని = గ్రహించి; వేడ్కన్ = వేడుకతో; భజియించు = పూజించెడి; వారలున్ = వారు; కనంగాన్ = దర్శించుట; నేర్తురే = చేయగలరా ఏమి (లేరు); ఈశ్వరున్ = భగవంతుని.
భావము:- మిక్కిలి విస్తారమైనదీ, అంతు లేనిదీ, అద్వితీయమైనదీ అయిన వేదాన్ని అనుసరించి మంత్రాలచేత పెక్కు దేవతలను ఆరాధిస్తూ ఇంద్రాది దేవతలను ఇష్టదైవతాలుగా భజించేవారు సర్వేశ్వరుడైన పరమాత్మను దర్శింపగలరా?

తెభా-4-875-క.
విను మాత్మ భావితుం డన
నెసిన భగవంతుఁ డెప్పు డెవ్వనిఁ గరుణం
రుచు ననుగ్రహించును
నుజేశ్వర! యపుడ వాఁడు హితాత్మకుఁడై.

టీక:- వినుము = వినుము; ఆత్మన్ = మనసున; భావితుండు = భావింప దగినవాడు; అనన్ = అనగా; ఎనసిన = అతిశయించిన; భగవంతుడు = ఈశ్వరుడు; ఎప్పుడున్ = ఎప్పుడు; ఎవ్వని = ఎవరిని; కరుణన్ = దయతో; తనరుచున్ = వృద్ధి గలుగునట్లు; అనుగ్రహించునున్ = అనుగ్రహించునో; మనుజేశ్వర = రాజా; అపుడున్ = అప్పుడు; వాడున్ = వాడు; మహిత = గొప్ప; ఆత్మకుడు = ఆత్మ గలవాడు; ఐ = అయ్యి.
భావము:- రాజా! విను. మనస్సులో భావింపదగిన భగవంతుడు ఎప్పుడు, ఎవరిని అనుగ్రహిస్తాడో వాడు మహితాత్ముడై…

తెభా-4-876-క.
ధీత నీ లోకవ్యవ
హారంబును వైదికంబు నఁదగు కర్మా
చాములందు వినిష్ఠిత
మై రూఢిఁ దనర్చు బుద్ధి ర్థిన్ విడుచున్.

టీక:- ధీరతన్ = బుద్ధిబలముతో; ఈ = ఈ; లోక = లౌకిక; వ్యవహారంబునున్ = వ్యవహారములను; వైదికంబున్ = వేదములకు చెందినవి; అనన్ = అనుటకు; తగు = తగిన; కర్మా = కర్మములను; ఆచారముల్ = ఆచరించు విధములు; అందున్ = లో; వినిష్ఠితము = చక్కటి స్ఠిర మగునది; ఐ = అయ్యి; రూఢిన్ = నిశ్చయముగా; తనర్చు = అతిశయించు; బుద్ధిన్ = బుద్ధిని; అర్థిన్ = కోరి; విడుచున్ = వదలివేయును.
భావము:- లోక వ్యవహారంలోను, వైదిక కర్మాచరణంలోను నెలకొన్న బుద్ధిని త్యజిస్తాడు.

తెభా-4-877-సీ.
కావున రాజేంద్ర! నీవును బరమార్థ-
రూపంబు లగుచుఁ బ్రరోచమాన
ములును గర్ణప్రియంబులును నస్పృష్ట వ-
స్తువులును నైన యీ వివిధ కర్మ
ములయందుఁ బురుషార్థబుద్ధి గావింపకు-
తి ఘన స్వాంతు లై ట్టివారు
రఁగు జనార్దన ప్రతిపాదకంబైన-
శ్రుతిఁ గర్మ పర మని చూపుచుండు

తెభా-4-877.1-తే.
వారు వేదజ్ఞు లనఁ దగువారు గారు
రూఢి మఱి వారు నిత్యస్వరూపభూత
మైన యీ యాత్మతత్త్వంబు లరు వేద
లిత తాత్పర్య మని యాత్మఁ దెలియ లేరు

టీక:- కావునన్ = అందుచేత; రాజ = రాజులలో; ఇంద్ర = ఇంద్రునివంటివాడా; నీవునున్ = నీవు; పరమార్థ = పరమార్థము యొక్క; రూపంబుల్ = రూపములు కలవి; అగుచున్ = అగుచూ; ప్రరోచమానములునున్ = మిక్కిలి కాంతివంతములు; కర్ణ = చెవులకు; ప్రియంబులునున్ = ఇంపైనవి; అస్పృష్ట = తాకబడని; వస్తువులునున్ = వస్తువులు; ఐ = అయ్యి; వివిధ = అనేకవిధములైన; కర్మముల్ = కర్మములు; అందున్ = ఎడల; పురుషార్థ = పరమార్థములు యనెడి; బుద్ధిన్ = అనుకొనుట; కావింపకుము = చేయకుము; అతి = మిక్కిలి; ఘన = నిండైన; స్వాంతులు = మనసుకలవారు; ఐనట్టి = అయినట్టి; వారున్ = వారు; పరగున్ = ప్రసిద్దమగు; జనార్థన = నారాయణుని {జనార్థనః - జనులకు పరమ ప్రయోజనము యైనవాడు, జనులచే పురుషార్థము కోరబడువాడు, విష్ణువు, విష్ణుసహస్రనమము, 126వ నామం శ్రీ శంకర భాష్యం}; ప్రతిపాదికంబులున్ = స్థాపించునవి; ఐన = అయిన; శ్రుతికర్మ = వేదవిధులే; పరము = పరమార్థము; అని = అని; చూపుచుండు = చూపెడి.
వారున్ = వారు; వేద = వేదములను; జ్ఞులున్ = తెలిసినవారు, జ్ఞానులు; అనన్ = అనటకు; తగు = తగిన; వారు = వారు; కారు = కారు; రూఢిన్ = నిశ్ఛయముగా; మఱి = మఱి; వారు = వారు; నిత్య = శాశ్వత; స్వరూపభూతము = స్వరూపమైనట్టిది; ఐన = ఐయిన; ఈ = ఈ; ఆత్మతత్త్వంబున్ = ఆధ్యాత్మతత్వములో; అలరు = ఒప్పియుండెడి; వేద = వేదములందు; కలిత = కల; తాత్పర్యము = పరమార్థము; అని = అని; ఆత్మన్ = మనసులో; తెలియన్ = తెలిసికొన; లేరు = సమర్థులుకారు.
భావము:- కాబట్టి రాజేంద్రా! పరమార్థాల వలె కనిపిస్తూ, ఆసక్తి కల్పిస్తూ, వినటానికి ఇంపై, అవాస్తవాలైన ఈ వివిధ కర్మలను పరమార్థాలు అని అనుకోకు. మలిన బుద్ధులు జనార్దనుని ప్రతిపాదించే వేదాన్ని కర్మపరమని వాదిస్తారు. వారు వేదతత్త్వం తెలిసినవారు కారు.

తెభా-4-878-వ.
కావునం; బ్రాగగ్రంబు లైన దర్భలచేత సకల క్షితిమండలాస్తరణంబు గావించి యహంకార యుక్తుండవు నవినీతుండవు నై పెక్కు పశువులఁ జంపనే కాని కర్మస్వరూపంబును విద్యాస్వరూపంబును నెఱుంగ; వా కర్మ విద్యా స్వరూపంబు లెట్టి వనిన సర్వేశ్వర పరితోషకం బేది యదియ కర్మం; బా సర్వేశ్వరుని యందు నేమిట మతి సంభవించు నదియ విద్య; యతండే దేహులకు నాత్మయు నీశ్వరుండు నగుచుండుఁ గావునఁ బురుషులకు క్షేమకరంబయిన యాశ్రయంబు దత్పాద మూలం; బతండు ప్రియతముండును సేవ్యమానుండును నగుచుండ నణుమాత్రం బయిన దుఃఖంబు లే; దట్టి యా భగవత్స్వరూపం బెవ్వం డెఱుంగు వాఁడు విద్వాంసుండును గురుండును హరియు” నని చెప్పి వెండియు నిట్లనియె.
టీక:- కావునన్ = అందుచేత; ప్రాక్ = తూర్పునకు; అగ్రంబులు = చివరలు ఉన్నట్టివి; ఐన = అయిన; దర్భలు = దర్భల; చేతన్ = చేత; సకల = సమస్తమైన; క్షితి = భూమి; మండల = ప్రదేశమును; ఆస్తరణంబున్ = పరచుట; కావించి = చేసి; అహంకార = అహంకారముతో; యుక్తుండవు = కూడినవాడవు; అవినీతుండవున్ = వినయము లేనివాడవు; ఐ = అయ్యి; పెక్కు = అనేకమైన; పశువులన్ = జంతువులను; చంపనే = చంపుటే; కాని = కాని; కర్మ = కర్మల యొక్క; స్వరూపంబునున్ = స్వభావమును; విద్యా = జ్ఞానము యొక్క; స్వరూపంబునున్ = స్వభావమును; ఎఱుంగవు = తెలియవు; ఆ = ఆ; కర్మ = కర్మలు; విద్యా = జ్ఞానములు; ఎట్టివి = ఎటువంటివి; అనినన్ = అనగా; సర్వేశ్వర = భగవంతుని; పరితోషకంబున్ = సంతోషకరములు; ఏది = ఏదైతే; అదియ = అదే; కర్మంబున్ = కర్మము; ఆ = ఆ; సర్వేశ్వరుని = భగవంతుని; అందున్ = ఎడల; ఏమిటన్ = దేనివలన; మతి = మనస్సు; సంభవించున్ = పుట్టునో; అదియ = అదే; విద్య = జ్ఞానము; అతండే = అతడే; దేహుల్ = శరీరుల; కున్ = కు; ఆత్మయున్ = ఆత్మ; ఈశ్వరుండున్ = ఈశ్వరుడును; అగుచుండున్ = అగుచూ ఉండును; కావునన్ = అందుచేత; పురుషుల్ = మానవుల; కున్ = కు; క్షేమ = శుభ; కరంబున్ = చేయునవి; అయిన = అయినట్టి; ఆశ్రయంబున్ = ఆశ్రయించ దగినవి; తత్ = అతని; పాద = పాదముల; మూలంబ = ద్వారా మాత్రమే; అతండున్ = అతడు; ప్రియతముండునున్ = అత్యంత ప్రియ మైనవాడు {ప్రియుడు - ప్రియతరుడు - ప్రియతముడు}; సేవ్య = సేవింపను; మానుండునున్ = తగినవాడును; అగుచుండను = అగుచూ ఉండును; అణు = అణువు; మాత్రంబు = అంత; అయినన్ = అయినను; దుఃఖంబున్ = దుఃఖము; లేదు = లేదు; అట్టి = అటువంటి; ఆ = ఆ; భగవత్ = భగవంతుని; స్వరూపంబున్ = స్వరూపమును; ఎవ్వడు = ఎవరైతే; ఎఱుంగున్ = తెలియునో; వాడున్ = వాడే; విద్వాంసుండును = విద్వాంసుడు; గురుండును = గొప్పవాడు; హరియున్ = కిరణము, ప్రసరించెడివాడు; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = ఇంకనూ; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- తూర్పువైపు కొనలు గల దర్భలను భూమండలమంతా పరచి అహంకారంతో, అవినయంతో అనేక పశువులను బలి చేశావు. కర్మ స్వరూపాన్ని విద్యాస్వరూపాన్ని తెలిసికోలేక పోయావు. ఆ కర్మ విద్యాస్వరూపాలను గురించి చెపుతాను విను. హరికి సంతోషాన్ని కలిగించేదే కర్మ. భగవంతునిపై మతిని నెలకొల్పేదే విద్య. హరియే దేహులకు ఆత్మ. హరియే పరమాత్మ. భద్రతను కోరేవారికి హరిపాద మూలమే శరణం. హరిని పరమ ప్రియునిగా భావించి కొలిచే వారికి ఆవంత ఐనా దుఃఖం కలుగదు. భగవత్సరూపాన్ని తెలిసికొన్నవాడే విద్వాంసుడు. అతడే గురువు. అతడే హరి” అని చెప్పి నారదుడు ఇంకా ఇలా అన్నాడు.

తెభా-4-879-క.
"అనీశ! యీ విధంబున
దీయప్రశ్నమిట్లు రిహృత మయ్యెం;
విలి యిఁక నొక్క గోప్యము
విరించెదఁ జిత్తగింపు విమలచరిత్రా!

టీక:- అవనీశ = రాజా; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; భవదీయ = నీ యొక్క; ప్రశ్నము = అనుమానము; ఇట్లు = ఈ విధముగ; పరిహృతమున్ = పరిహరింప బడినది (తొలగింపబడినది); అయ్యెన్ = అయినది; తవిలి = పూనుకొని; ఇకన్ = ఇంక; ఒక్క = ఒక; గోప్యమున్ = రహస్యమును; వివరించెదన్ = వివరముగా చెప్పెదను; చిత్తగింపుము = శ్రద్ధగావినుము; విమలచరిత్రా = స్వచ్ఛమైన వర్తన కలవాడా.
భావము:- “రాజా! నీ ప్రశ్నకు పూర్తిగా సమాధానం చెప్పాను. ఇక ఒక రహస్యం వివరిస్తాను. సావధానంగా విను.

తెభా-4-880-సీ.
లి సుమనో వాటిల యందు నల్ప ప్ర-
సూ మరంద గంధానుమోద
సంచారియును మృగీహితముఁ దన్నివే-
శి చిత్తమును మధువ్ర నినాద
మేదుర శ్రవణానుమోదితమును బురో-
భాగ చరన్నిజ ప్రాణహారి
దీపిత వృక గణాధిష్ఠితమును లుబ్ధ-
క్రూర ఘన సాయప్రభిన్న

తెభా-4-880.1-తే.
పృష్టభాగంబునై తగ నెదను మృత్యు
భీతి వాటిల్ల నొండు దప్పింప వెరవు
గాన కడవిఁ జరించు మృగంబు పగిది
భూవరోత్తమ! వినవయ్య! పురుషుఁ డెపుడు.

టీక:- లలిన్ = చక్కగా; సుమనః = పుష్పముల; వాటికలు = వరుసలు; అందున్ = లోని; అల్ప = చిన్న; ప్రసూన = పూల యందలి; మరంద = మకరందము యొక్క; గంధా = సువాసనలచే; అనుమోద = సంతోషించుచు; సంచారియున్ = చక్కగాతిరుగునది;
మృగీ = ఆడులేడితో; సహితమున్ = కూడియున్నది; తత్ = దానియందు; నివేశిత = లగ్నమైన; చిత్తమును = మనస్సుగలది; మధువ్రత = తేనెటీగల; నినాద = శబ్దములతో; మేదుర = దట్టమైన; శ్రవణ = వినుటకు; అనుమోదితమును = సంతోషించుచుయున్నది; పురో = ఎదుట; భాగ = వైపున; చరత్ = చరించుతున్న; నిజ = తన; ప్రాణ = ప్రాణములను; హారి = హరించు; దీపిత = చెలరేగిన; వృక = తోడేళ్ల; గణ = గుంపుచే; అధిష్ఠితము = దగ్గరనిలుచున్నది; లుబ్దక = వేటగాని యొక్క; క్రూర = క్రూరమైన; ఘన = పెద్ద; సాయక = బాణముచే; ప్రభిన్న = బద్దలైన. పృష్ట = వెనుక; భాగంబున్ = భాగముకలది; ఐ = అయ్యి; తగన్ = మిక్కిలి; ఎదను = హృదయమున; మృత్యు = మరణము యొక్క; భీతి = భయము; వాటిల్లన్ = కలుగుతుండగా; ఒండు = ఏ విధముగను; తప్పింపన్ = తప్పించుకొన; వెరవున్ = ఉపాయము; కానకన్ = కనుగొనలేక; అడవిన్ = అడవిలో; చరించు = తిరిగెడి; మృగంబున్ = లేడి; పగిదిన్ = వలె; భూవర = రాజులలో; ఉత్తమ = శ్రేష్ఠుడా; వినవు = వినుము; అయ్యా = తండ్రీ; పురుషుడు = పురుషుడు; ఎపుడున్ = ఎప్పుడును.
భావము:- అందమైన పూలతోటలో హాయిగా విహరిస్తూ చిన్నారి పూలతేనెలకు, కమ్మని సువాసనలకు, జుమ్మనే తుమ్మెద పాటలకు ప్రీతి చెందుతూ ఒక మగలేడి ఆడులేడితో కలిసి నెమ్మదిగా సంచరిస్తున్నది. దాని మనస్సు ఆడలేడి మీదనే నిమగ్నమై ఉంది. ఆ మగలేడికి ముందుభాగంలో ప్రాణాలకు హాని కలిగించే తోడేళ్ళ గుంపు తిరుగుతున్నది. ఇంతలో వెనుకనుండి ఒక బోయవాడు విడిచిన వాణి బాణం లేడి పృష్ఠభాగాన్ని చీల్చి వేసింది. తప్పించుకొనే దారిలేక ఆ మగలేడి అడవిలో మృత్యువు పాలయింది. రాజేంద్రా! విను. పురుషుడు ఆ మగలేడి వంటివాడే.

తెభా-4-881-వ.
అంగనా నివాసంబుల యందు క్షుద్రతమంబగు కామ్యకర్మ పరిపాకజనితంబైన జిహ్వోపస్థాది కామజనిత సుఖలేశంబుల నన్వేషించుచుఁ, గామినీ యుక్తుండును, దన్నివేశిత మానసుండును నతి మనోహర వనితాజనాలాప శ్రవణతత్పర చిత్తుండును, బ్రత్యక్షంబున, నాయుర్హరణ కారణాహోరాత్రాది కాలవిశేషగణనాపరుండును గాక పరోక్షంబునం గృతాంత శరనిర్భిన్న గాత్రుండును నగుచు నీ జీవుండు విహరించుచుండు; గావున నీవు నీ జీవుని మృగచేష్టితునిఁగా విచారించి శ్రోత్రాదు లందున్న శబ్దాదులం బోలె బాహ్య వృత్తులగు శ్రౌతస్మార్తాది రూపకర్మంబులను హృదయంబు నందు నియమించుచు నసజ్జనయూథ వార్తాసహితం బైన గృహాశ్రమంబు విడువుము; సకల జీవాశ్రయుండైన యీశ్వరుని భజియింపు; మిట్లు సర్వతో విరక్తుండవు గ”మ్మని నారదుండు పలికినం బ్రాచీనబర్హి యిట్లనియె.
టీక:- అంగనా = స్త్రీల; నివాసంబులన్ = నివాసముల; అందున్ = లోని; క్షుద్రతమంబున్ = బహు మిక్కిలి తుచ్ఛమైనది, {క్షుద్రము - క్షుద్రతరము - క్షుద్రతమము}; కామ్యకర్మ = కోరికలతో నిండిన పనులు చేయుట యందు; పరిపాక = ఫలించుట; జనితంబున్ = కలిగినవి; ఐన = అయిన; జిహ్వ = నాలుక; ఉపస్థ = జననేంద్రియము; ఆది = మొదలగువానిచే; కామ = కోరికల వలన; జనిత = కలిగెడి; సుఖ = సుఖము యొక్క; లేశంబులన్ = చిన్ని ముక్కలను; అన్వేషించుచున్ = వెతుకుకొనుచూ; కామినీ = స్త్రీలతో; యుక్తుండును = కూడినవాడు; తత్ = వారి యందు; నివేశిత = లగ్నమైన; మానసుండునున్ = మనస్సు కలవాడు; అతి = మిక్కిలి; మనోహర = మనసును హరించెడి; వనితా = స్త్రీ; జన = జనముల; ఆలాప = పలుకులను; శ్రవణన్ = వినుటయందు; తత్పర = లగ్నమైన; చిత్తుండునున్ = మనస్సుకలవాడు; ఆయుః = ఆయుష్షునకు; హరణ = హరింపబడుటకు; కారణ = హేతువులైన; అహము = పగలు; రాత్రి = రాత్రి; ఆది = మొదలగు; కాల = కాలము యొక్క; విశేష = విభాగములను; గణనా = లెక్కించుకొనుటయందు; పరుండును = లగ్నమైన వాడు; కాక = కాకుండగ; పరోక్షంబునన్ = గోచరింపకుండగ; కృతాంత = యముని; శర = బాణములచే; నిర్భిన్న = ముక్కలు చేయబడుతున్న; గాత్రుండునున్ = దేహము కలవాడును; అగుచున్ = అగుచూ; విహరించుచున్ = విహరిస్తూ; ఉండున్ = ఉండును; కావున = కనుక; నీవున్ = నీవు; ఈ = ఈ; జీవుని = జీవుని; మృగ = జంతువు వంటి; చేష్టితునిన్ = చేష్టలు కలవాని; కాన్ = అగునట్లు; విచారించి = భావించి; శ్రోత్రా = చెవులు; ఆదులు = మొదలగువాని; అందున్ = లో; ఉన్న = ఉన్నట్టి; శబ్ద = శబ్దము; ఆదులన్ = మొదలగువాని; పోలెన్ = వలె; బాహ్య = వెలుపలి ప్రపంచపు; వృత్తులు = ప్రవర్తనములు; అగు = అయిన; శ్రౌత = శ్రుతులకు సంబంధించినవి; స్మార్త = స్మృతుల సంబంధించినవి; ఆది = మొదలగు; రూప = రూపము కలిగిన; కర్మంబులను = కర్మములను; హృదయంబున్ = హృదయము; అందున్ = లో; నియమించుచున్ = పూనుకొనుచూ; సత్ = మంచి; జన = వారి; యూథ = సమూహముల; వార్తా = వృత్తాంతములతో; సహితంబున్ = కూడినది; ఐన = అయిన; గృహా = గృహస్థ; ఆశ్రమంబున్ = ఆశ్రమమును; విడువుము = వదలివేయుము; సకల = అఖిల; జీవా = జీవములకు; ఆశ్రయుండున్ = ఆశ్రయించ దగినవాడు; ఐన = అయిన; ఈశ్వరునిన్ = భగవంతుని; భజియింపుము = పూజింపుము; ఇట్లు = ఈ విధముగ; సర్వతః = అన్ని విధములగను; విరక్తుండవు = వైరాగ్యము కలవాడవు; కమ్ము = అగుము; అని = అని; నారదుండున్ = నారదుడు; పలికినన్ = పలుకగా; ప్రాచీనబర్హి = ప్రాచీనబర్హి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- పురుషుడు స్త్రీల యిండ్లను ఆశ్రయించి క్షుద్రమై, కామ్యపరిపాకం నుండి పుట్టిన జిహ్వ, ఉపస్థ మొదలైన కామ జనిత సుఖలేశాన్ని అన్వేషిస్తాడు. స్త్రీయందే మనస్సు నిల్పి మనస్సును కొల్లగొట్టే స్త్రీల మాటలను వినగోరుతాడు. కళ్ళముందే తోడేళ్ళ గుంపులాగా ఆయుస్సును హరించే రాత్రింబవళ్ళను లెక్కచేయడు. వెనుకనుండి బోయవాని వంటి యముడు శరీరాన్ని చీల్చివేస్తుండగా జీవుడు విహరిస్తాడు. కాబట్టి నీవు ఈ జీవుని లేడివంటి చేష్టలు కలవానిగా భావించు. బాహ్యవ్యాపారా లైన శ్రౌతస్మార్తాది రూపకర్మలను హృదయంలో నిగ్రహించు. అతి కాముకుల గాథలతో కూడిన సంసారాన్ని విడిచిపెట్టి, సర్వజీవులకు దిక్కైన భగవంతుని సేవించు. సంపూర్ణ విరక్తిని పొందు” అని నారదుడు చెప్పగా ప్రాచీనబర్హి ఇలా అన్నాడు.

తెభా-4-882-క.
"మునివర! భగవంతుండవు
నుపమ విజ్ఞాననిధివి నఁదగు నీ చే
ను వివరింపంగాఁ దగి
యెసిన యీ యాత్మతత్త్వ మిటు నాచేతన్.

టీక:- ముని = మునులలో; వర = ఉత్తముడా; భగవంతుండవు = మహితాత్ముడవు; అనుపమ = సాటిలేని; విజ్ఞాన = విజ్ఞానమునకు; నిధివిన్ = నిథి వంటివాడవు; అననన్ = అనుటకు; తగు = తగిన; నీ = నీ; చేతనున్ = చేత; వివరింపగాన్ = వివరముగా చెప్పుటకు; తగి = తగియుండి; ఎనసిన = అతిశయించిన; ఈ = ఈ; ఆత్మతత్త్వమున్ = ఆత్మతత్త్వమును; ఇటు = ఈ విధముగ; నా = నా; చేతన్ = చేత.
భావము:- “మునీంద్రా! భగవంతుడవు, మేటి జ్ఞానివి అయిన నీవు చెప్పిన ఆత్మ తత్త్వాన్ని…

తెభా-4-883-వ.
శ్రుతంబును విచారితంబును నయ్యె; గర్మనిష్ఠు లగు నుపాధ్యాయు లైనవార లీ యాత్మతత్త్వంబు నెఱుంగ; రెఱింగిరేని నుపదేశింపరు; కావునఁ దత్కృతంబైన మహాసంశయంబు నీ చేత నివృత్తం బయ్యె;” నని వెండియు నిట్లనియె.
టీక:- శ్రుతంబునున్ = వినబడినది; విచారితంబునున్ = తర్కించి తెలియబడినది; అయ్యెన్ = అయ్యెను; కర్మ = కర్మము లాచరించుట యందు; నిష్ఠులు = నిష్ఠ గల వారు; అగు = అయిన; ఉపాధ్యాయులు = తెలియజెప్పువారు; ఐన = అయినట్టి; వారలు = వారు; ఈ = ఈ; ఆత్మత్త్వంబున్ = ఆత్మతత్త్వమును; ఎఱుంగరు = తెలియరు; ఎఱింగిరేనిన్ = తెలిసినను; ఉపదేశింపరు = తెలియజెప్పరు; కావునన్ = అందుచేత; తత్ = వారిచే; కృతంబున్ = కలిగించబడినవి; ఐన = అయిన; మహా = గొప్ప; సంశయంబున్ = అనుమానములు; నీ = నీ; చేతన్ = చేత; నివృత్తంబున్ = తీర్చబడినవి; అయ్యెన్ = అయినవి; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- విని బాగా ఆలోచించాను. నాకు కర్మను బోధించిన ఆచార్యులకు ఈ ఆత్మతత్త్వం తెలియదు. తెలిస్తే కర్మని ఉపదేశింపరు కదా! ఆ ఆచార్యుల ఉపదేశం చేత నాకు ఆత్మతత్త్వం విషయంలో కలిగిన మహాసంశయం నీ వల్ల పటాపంచలయింది” అని ఇంకా ఇలా అన్నాడు.

తెభా-4-884-సీ.
నఘాత్మ! యేమిటి యందు నీ యింద్రియ-
వృత్తులు దగఁ బ్రవర్తింపకుండు
ను జేసి ఋషు లైన నముగ మోహింతు-
ట్టి యర్థము నందు నాత్మ సంశ
ము గల్గుచున్నది; ది యెట్టి దనినను-
బురుషుఁ డేయే దేహమునను జేసి
ర్మముల్ చేసి తత్కాయంబు నీ లోక-
మందునే విడిచి తా న్యదేహ

తెభా-4-884.1-తే.
ర్థితో ఘటియించి లోకాంతరమును
బొంది తత్కర్మఫలమును బొందు ననుచుఁ
బ్రకటముగ వేదవేత్తలు లుకుచుందు
న్న నది యెట్లు విన నుపన్న మగును?

టీక:- అనఘాత్య = పుణ్యాత్మ; ఏమిటి = దేని; అందున్ = అందు; ఈ = ఈ; ఇంద్రియ = ఇంద్రియముల; వృత్తులు = వర్తనలు; తగన్ = శ్రీఘ్రమే; ప్రవర్తింపకన్ = వర్తించకుండగ; ఉండుటనున్ = ఉండుట; చేసి = వలన; ఋషులు = ఋషులు; ఐన = అయిన; ఘనముగన్ = గొప్పగా; మోహింతురు = మోహించెదరో; అట్టి = అటువంటి; అర్థమున్ = ప్రయోజనము; అందున్ = అందు; ఆత్మన్ = మనసులో; సంశయమున్ = సంశయము; కల్గుచున్నది = కలుగుతున్నది; అది = అది; ఎట్టిది = ఎటువంటిది; అనిననున్ = అనినచో; పురుషుండు = పురుషుడు; ఏయే = ఏయే; దేహముననున్ = శరీరము; చేసి = వలన; కర్మముల్ = కర్మములు; చేసి = చేసి; తత్ = ఆయా; కాయంబున్ = దేహములను; ఈ = ఈ; లోకమున్ = లోకము; అందునే = లోనే; విడిచి = వదలివేసి; తాన్ = తను; అన్య = ఇంకొక; దేహమున్ = దేహమును; అర్థితోన్ = కోరి.
ఘటియించి = పొంది; లోక = లోకము; అంతరమునున్ = ఇంకొకదానిని; పొంది = పొంది; తత్ = ఆ; కర్మ = కర్మముయొక్క; ఫలమును = ఫలితమును; పొందును = పొందును; అనుచున్ = అని; ప్రకటముగన్ = ప్రసిద్ధముగ; వేద = వేదము; వేత్తలు = తెలిసినవారు; పలుకుచుందురు = చెపుతుంటారు; అన్నన్ = అనగా; అది = అది; ఎట్లు = ఏ విధముగ; వినన్ = అంగీకరించుటకు; ఉపపన్నము = సమంజసమైనది; అగును = అగుతుంది.
భావము:- పుణ్యాత్మా! ఇంద్రియ వృత్తులలో అప్రవృత్తులై ఋషులు మోహించే అర్థం గురించి నాకు సంశయం కలుగుతున్నది. పురుషుడు ఏ దేహం చేత కర్మలు చేస్తాడో ఆ దేహాన్ని ఈ లోకంలోనే విడిచిపెట్టి తాను మరొక దేహాన్ని ధరించి మరొక లోకాన్ని చేరి అక్కడ కర్మఫలాన్ని అనుభవిస్తాడని వేదవేత్తలు చెపుతారు. ఇది ఎలా పొసగుతుంది?

తెభా-4-885-వ.
అదియునుం గాక యాచరితంబైన కర్మంబు తత్క్షణంబ వినష్టం బగుటంజేసి జీవుండు దేహాంతరంబున లోకాంతరగామి యైన ఫలం బెట్లు సంభవించును;” అనిన ప్రాచీనబర్హికి నారదుం డిట్లనియె “నరేంద్రా! స్వప్నావస్థ యందు లింగశరీరాధిష్ఠాత యైన జీవుండు జాగ్రద్దేహాభిమానంబు విడచి తాదృశంబ కాని యతాదృశంబ కాని యైన శరీరాంతరంబు నొంది మనంబునందు సంస్కార రూపంబున నాహితంబైన కర్మంబు ననుభవించు చందంబునం బురుషుండే లింగ శరీరంబునం జేసి కర్మంబు నాచరించు నా లింగశరీరంబున లోకాంతరంబున దేహవిభేదంబు నొందక తత్ఫలం బనుభవించును; అదియునుం గాక దాన ప్రతిగ్రహాదుల యందు స్థూలదేహంబునకుం గర్తృత్వంబు గల దంటివేని నహంకార మమకార యుక్తుండయిన పురుషుండు మనంబునం జేసి యేయే దేహంబు పరిగ్రహించు, నాయా దేహంబున సిద్ధంబైన కర్మం బా జీవుం డనుభవించు; అట్లు గాకున్నఁ గర్మంబు పునరుద్భవ కారణం బగుట యుపపన్నంబు గాకుండుఁ; గావున మనఃప్రధానం బైన లింగశరీరంబునకే కర్తృత్వం బుపపన్నం బగు” నని వెండియు నిట్లనియె.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ; ఆచరితంబునున్ = ఆచరింపబడినది; ఐన = అయిన; కర్మంబున్ = కర్మము; తత్క్షణంబ = వెంటనే; వినష్టంబున్ = పూర్తిగాపోయినది; అగుటన్ = అగుట; చేసి = వలన; జీవుండు = పురుషుడు; దేహ = దేహము; అంతరంబునన్ = మరియొకదానితో; లోక = లోకము; అంతర = మరియెకదానికి; గామి = పోయిన; ఐన = ఎడల; ఫలంబున్ = ఫలితమును; ఎట్లు = ఏ విధముగ; సంభవించును = కలుగును; అనినన్ = అనగా; ప్రాచీనబర్హి = ప్రాచీనబర్హి; కిన్ = కి; నారదుండున్ = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; నరేంద్ర = రాజా {నరేంద్రుడు - నరులకు ఇంద్రుని వంటివాడు, రాజు}; స్వప్న = కలగనెడి; అవస్థ = పరిస్థితి; అందున్ = లో; లింగశరీర = లింగశరీరమున {లింగశరీరము - సంస్కారశరీరము, తనను గుర్తించుకొను కర్మమయ భావమయ దేహము}; అధిష్ఠాత = అధిష్ఠించి ఉండువాడు; ఐన = అయిన; జీవుండు = పురుషుడు; జాగృత్ = మెలకువ యందున్న, భౌతిక; దేహ = శరీర మందలి; అభిమానంబున్ = ఆసక్తిని; విడిచి = వదలి; తాదృశంబ = అటువంటిది; కాని = కాని; అతాదృశంబ = వేరొక విధమైనది; కాని = కాని; ఐన = అయినట్టి; శరీర = దేహము; అంతరంబున్ = ఇంకొకటి; పొంది = పొంది; మనంబున్ = మనసు; అందున్ = లో; సంస్కార = వాసనా; రూపంబునన్ = రూపములో; ఆహితంబు = వచ్చినది; ఐన = అయిన; కర్మంబున్ = కర్మఫలితమును; అనుభవించు = అనుభవించెడి; చందంబునన్ = విధముగా; పురుషుండు = పురుషుడు; లింగశరీరంబునన్ = లింగశరీరము {లింగశరీరము - సంస్కారశరీరము, తనను గుర్తించుకొను కర్మమయ భావమయ దేహము}; చేసి = వలన; కర్మంబున్ = కర్మములను; ఆచరించున్ = ఆచరించును; ఆ = ఆ; లింగశరీరంబునన్ = లింగశరీరముతోనే; లోక = లోకము; అంతరంబునన్ = మరియొక దానిలో కూడ; దేహ = లింగశరీర; విభేదంబున్ = మార్పును; ఒందకన్ = పొందకనే; తత్ = వాని; ఫలంబున్ = ఫలితమును; అనుభవించును = అనుభవించును; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; దాన = దానము; ప్రతిగ్రహా = పుచ్చుకొనుట; ఆదుల = మొదలగువాని; అందున్ = అందు; స్థూల = భౌతిక; దేహంబున్ = దేహమున; కున్ = కు; కర్తృత్వంబున్ = చేయు నధికారము; కలదు = ఉన్నది; అంటివేని = అనినచో; అహంకార = నేనడి భావము; మమకారము = నాదనెడి భావము; యుక్తుండున్ = తో కూడినవాడు; అయిన = అయిన; పురుషుండు = పురుషుడు; మనంబునన్ = మనసు; చేసి = వలన; ఏయే = ఏయే; దేహంబున్ = దేహములను; పరిగ్రహించున్ = ధరించు; ఆయా = ఆయా; దేహంబునన్ = దేహములలో; సిద్ధంబున్ = ప్రాప్తించినవి; ఐన = అయిన; కర్మంబున్ = కర్మములను; ఆ = ఆ; జీవుండు = పురుషుడు; అనుభవించున్ = అనుభవించును; అట్లు = ఆ విధముగ; కాకున్నన్ = కాకపొయినచో; కర్మంబున్ = కర్మము; పునురుద్భవ = పునర్జన్మమునకు; కారణంబున్ = కారణము; అగుటన్ = అగుట; ఉపపన్నంబున్ = సాధ్యపడినది; కాకుండున్ = కాకపోవును; కావునన్ = అందుచేత; మనః = మనసు; ప్రధానంబున్ = ప్రధానమైనది; ఐన = అయిన; లింగశరీరంబునన్ = లింగశరీరమున {లింగశరీరము - సంస్కారశరీరము, తనను గుర్తించుకొను కర్మమయ భావమయ దేహము}; కే = కే; కర్తృత్వంబున్ = కర్తగా బాధ్యత; ఉపపన్నంబున్ = సాధ్యపడినది; అగును = అగును; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అంతేకాదు. చేసిన వేదోక్తమైన కర్మ ఆ క్షణంలోనే నశిస్తుంది కదా! ఇంక జీవుడు మరొక దేహం పొంది లోకాంతరంలో ఎలా అనుభవించగలడు?” అని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు ప్రాచీనబర్హితో ఇలా అన్నాడు “రాజా! లింగశరీరాన్ని ఆశ్రయించి ఉండే జీవుడు కలలో జాగ్రద్దేహాభిమానాన్ని విడిచి, అటువంటిదో లేక అటువంటిది కానిదో అయిన మరొక శరీరం పొందుతాడు. మనస్సులో సంస్కార రూపంలో ఆ హితమైన కర్మని ఆచరిస్తాడు. అలాగే జీవుడు ఏ లింగ శరీరం చేత కర్మని చేస్తాడో ఆ లింగశరీరం చేతనే లోకాంతరంలో ఆ ఫలాన్ని అనుభవిస్తాడు. భిన్న దేహాన్ని పొందడు. ఇవ్వటం, పుచ్చుకొనడం మొదలైన వానిలో స్థూల దేహానికి కర్తృత్వం ఉన్నదని భ్రమించకూడదు. జీవుడు అహంకారంతోను మమకారంతోను కూడినవాడు. ఆ జీవుడు మనస్సు చేత ఏ దేహాన్ని పొందుతాడో, ఆ దేహం చేతనే ప్రాప్తించిన కర్మని అనుభవిస్తాడు. అలా కాకుంటే కర్మ పునర్జన్మకు కారణం కావటం పొసగదు. కాబట్టి మనః ప్రధానమైన లింగశరీరానికే కర్తృత్వం పొసగుతుంది” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

తెభా-4-886-క.
క్షితి నుభయేంద్రియ కర్మ
స్థితు లనుభవ మందఁబడిన చిత్తము పగిదిన్
ధృతిఁ జిత్తవృత్తులను ల
క్షి మగుఁ దత్పూర్వ దేహకృత కర్మంబుల్.

టీక:- క్షితిన్ = భూలోకమున; ఉభయ = రెండు (2), జ్ఞాన కర్మ; ఇంద్రియ = ఇంద్రియములచే; కర్మ = చేయబడిన కర్మల; స్థితులను = పరిస్థితుల యొక్క; అనుభవమున్ = అనుభవమును; అందబడిన = అందుకోబడిన; చిత్తము = మనసు; పగిదిన్ = వలె; ధృతిన్ = ధరించిన; చిత్తవృత్తులను = ప్రవర్తనములను; లక్షితము = గమనింపబడినది; అగున్ = అగును; తత్ = దాని; పూర్వ = ముందటి; దేహ = శరీరముచే; కృత = చేయబడిన; కర్మంబుల్ = కర్మములు.
భావము:- జ్ఞానరూపాలు, కర్మరూపాలు అయిన ఇంద్రియాల కర్మ ప్రపంచంచేత చిత్తాన్ని ఊహింపవచ్చు. అలాగే చిత్త వృత్తులను బట్టి పూర్వదేహం చేత చేయబడిన కర్మలను ఊహించవచ్చు.

తెభా-4-887-వ.
అది యెట్లనిన నీ దేహంబునం జేసి యే రూపంబు నే ప్రకారంబున నెప్పు డెచ్చట నగు; నది యననుభూతంబును నదృష్టంబును నశ్రుతంబునునై యుండు; నట్టిది యొకానొక కాలంబున వాసనాశ్రయుం డయిన పురుషునకుఁ దదనుభవాది యుక్తంబగు పూర్వదేహంబున ననుభూతంబును దృష్టంబును శ్రుతంబును నని విశ్వసింపు; మీ మనంబు నననుభూతార్థంబు గోచరింపఁజాల; దీ మనంబె పురుషులకు శుభాశుభ నిమిత్తంబు లైన పూర్వాపరదేహంబులం బ్రకాశింపంజేయుచుం; డీ మనంబునందు నదృష్టంబు నశ్రుతంబునైన యర్థంబు స్వాప్నాదికమందుం దోఁచు నంటివేని నది దేశకాలక్రియా శ్రయంబని తలంపందగు; నీ సమస్త విషయంబులుఁ గ్రమానురోధంబున మనంబునంజేసి భోగ్యంబులగు” నని మఱియు నిట్లనియె.
టీక:- అది = అది; ఎట్లు = ఏ విధముగ; అనినన్ = అనినచో; ఈ = ఈ; దేహంబునన్ = దేహము; చేసి = వలన; ఏ = ఏ; రూపంబునన్ = రూపములో; ఏ = ఏ; ప్రకారంబునన్ = విధముగా; ఎప్పుడున్ = ఎప్పుడు; ఎచ్చటన్ = ఎక్కడ; అగున్ = అగును; అది = అది; అననుభూతంబు = అనుభవింపబడనిది; అదృష్టంబును = చూడబడనిది; అశ్రుతంబునున్ = వినబడనిది; ఐ = అయ్యి; ఉండున్ = ఉండునో; అట్టిది = అటువంటిది; ఒకానొక = ఒక్కొక; కాలంబునన్ = సమయములో; వాసనా = పూర్వ సంస్కారములను; ఆశ్రయుండున్ = ఆశ్రయించినవాడు; అయిన = అయిన; పురుషున్ = పురుషుని; కున్ = కి; తత్ = ఆ; అనుభవాది = అనుభవములు; ఆది = మొదలగువానితో; యుక్తంబున్ = కూడినది; అగు = అయిన; పూర్వ = పూర్వజన్మ మందలి; దేహంబునన్ = దేహములో; అనుభూతంబు = అనుభవింపబడినవి; దృష్టంబును = చూడబడినది; శ్రుతంబునున్ = వినబడనిది; అని = అని; విశ్వసింపుము = నమ్ముము; ఈ = ఈ; మనంబునన్ = మనసులో; అనభూతంబును = అనుభూతము కానిది; అర్థమున్ = వంటిదానిని; గోచరింప = చూచుటకు; చాలదు = వీలుకాదు; ఈ = ఈ; మనంబె = మనసే; పురుషుల్ = పురుషుల; కున్ = కు; శుభ = శుభములకు; అశుభ = అశుభములకును; నిమిత్తంబులు = కారణభూతములు; ఐన = అయిన; పూర్వ = ముందటి; పరా = తరువాతి; దేహంబులన్ = దేహములను; ప్రకాశింపన్ = బయల్పడునట్లు; చేయుచుండున్ = చేయుచుండును; ఈ = ఈ; మనంబున్ = మనసు; అందున్ = లో; అదృష్టంబును = కనబడనిది; అశ్రుతంబునున్ = వినబడనిది; ఐన = అయిన; అర్థంబున్ = విషయములు; స్వప్న = కలలు; ఆదికంబున్ = మొదలగువాని; అందున్ = లో; తోచున్ = తోచును; అంటివేని = అనినచో; అది = అది; దేశ = దేశము; కాల = కాలము; క్రియా = పనులకు; ఆశ్రయంబు = ఆశ్రయించునది; అని = అని; తలంపన్ = భావింపను; తగు = తగును; ఈ = ఈ; సమస్త = సమస్తమైన; విషయంబులున్ = విషయములును; క్రమ = క్రమమును; అనురోధంబునన్ = అనుసరించి నడచుట వలన; మనంబునన్ = మనసు; చేసి = వలన; భోగ్యంబులు = అనుభవింపదగినవి; అగున్ = అగును; అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అది ఎలాగంటే దేహం చేత అనుభవింపబడనిది, చూడబడనిది, వినబడనిది అయినట్టిది, వాసనాశ్రయుడైన జీవునికి పూర్వ దేహంలో అనుభవింపబడినది, చూడబడినది, వినబడినది అవుతుంది. అనుభవింపబడిన విషయం మనస్సులో స్ఫురించదు. ఈ మనస్సే జీవులకు శుభాశుభాలకు కారణమైన పూర్వపర దేహాలను తెలుపుతుంది. ఈ మనస్సులో చూడబడనిది, వినబడనిది అయిన విషయం కలలో కనిపించే మాట నిజమే. కాని ఆ కల దేశకాల క్రియలను ఆశ్రయించి ఉంటుంది. సమస్త విషయాలు క్రమాన్ని అనుసరించి మనస్సుచేత అనుభవింపబడతాయి.

తెభా-4-888-చ.
సుహిత శుద్ధ సత్త్వగుణ శోభితమున్ సరసీరుహోద రో
త్త గుణచింతనాపరము న్యము నైన మనంబునందు భూ
ణ! సుధాంశునందు నుపరాగమునన్ దివిఁ దోచు రాహు చం
మునను గోచరంబగు నుదారత నీ యఖిలప్రపంచమున్. "

టీక:- సు = మిక్కిలి; మహిత = గొప్పదైన; శుద్ధ = స్వచ్ఛమైన; సత్త్వగుణ = సత్త్వగుణములచే; శోభితమున్ = శోభించెడిది; సరసీరుహోదర = విష్ణుని {సరసీరు హోదరుడు - సరసీరుహము (పద్మము) ఉదరమున గలవాడు, విష్ణుమూర్తి}; ఉత్తమ = ఉత్తమమైన; గుణ = గుణములను; చింతనా = ధ్యానించుట యందు; పరమున్ = లగ్నము; ధన్యమున్ = పుణ్యవంతము; ఐన = అయిన; మనంబున్ = మనసు; అందున్ = అందు; భూరమణ = రాజా {భూరమణుడు - భూమికి మగడు, రాజు}; సుధాంశున్ = చంద్రుని; అందున్ = లో; ఉపరాగమునన్ = గ్రహణ సమయము నందు; దివిన్ = ఆకాశమున; తోచున్ = తోచెడి; రాహు = రాహువు; చందముననున్ = వలె; గోచరంబున్ = కనిపించెడిది; అగున్ = అగును; ఉదారతన్ = గొప్పగా; ఈ = ఈ; అఖిల = సమస్తమైన; ప్రపంచమున్ = లోకమును.
భావము:- శుద్ధ సత్త్వగుణం కలిగి వాసుదేవుని ఉత్తమ గుణాలను ధ్యానించటంలో నిమగ్నమైన మనస్సులో, గ్రహణం నాడు చంద్రమండలంలో రాహువు కనిపించినట్లు ప్రపంచం సర్వం కనిపిస్తుంది”.

తెభా-4-889-వ.
అని వెండియు నిట్లనియె "లింగదేహమునకుఁ గర్తృత్వ భోక్తృత్వంబులు స్థూలదేహద్వారకంబు లగుటంజేసి స్థూలదేహ వినాశంబు గలుగం జీవునకుఁ గర్తృత్వ భోక్తృత్వంబులు లేకుండుటంజేసి ముక్తిగలుగు నంటివేని నీ స్థూలదేహ సంబంధంబు జీవుని యందు బుద్ధిమనో మోక్షార్థగుణవ్యూహరూపాది లింగ శరీర భంగ పర్యంతంబు గలుగుచుండును; సుషుప్తి మూర్ఛాదుల యందు నిష్ఠవియోగాది దుఃఖ మందు నహంకారంబు గలిగి యుండు; నది యింద్రియోపహతింజేసి యమావాస్య యందలి చంద్రుండునుం బోలెఁ దరుణ పురుషునకు గర్భబాల్యావస్థల యందు నింద్రియ పౌష్కల్యంబు లేకుండుటంజేసి యేకాదశేంద్రియ స్ఫురణ సమర్థంబైన యహంకారంబు గర్భాదులకుఁ బ్రకాశింపని చందంబునం దోఁపకుండుఁ గావున స్థూలదేహ విచ్ఛేదకంబు లేకుండుటంజేసి వస్తుభూతార్థంబు లేకున్న నీ సంసారంబు విషయంబులయం దాసక్తుండగు జీవునకు స్వాప్నికానర్థాగమనంబునుం బోలె నివర్తింప; దీ తీరునఁ బంచతన్మాత్రాత్మకంబును ద్రిగుణాత్మకంబును షోడశ వికారాత్మకంబునై విస్త్రుతంబునునయిన లింగశరీరంబు నధిష్ఠించి చేతనాయుక్తుండైన జీవుండని చెప్పంబడు; మఱియును.
టీక:- అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; లింగదేహమున్ = లింగశరీరమున {లింగదేహము - సంస్కారశరీరము, తనను గుర్తించుకొను కర్మమయ భావమయ దేహము}; కున్ = కు; కర్తృత్వ = కర్త యగు లక్షణములు; భోక్తృత్వంబులు = భోక్త యగు లక్షణములు; స్థూలదేహ = భౌతిక దేహము; ద్వారకంబులు = ద్వారా కలుగునవి; అగుటన్ = అగుట; చేసి = వలన; స్థూలదేహ = భౌతిక దేహము; వినాశంబున్ = మరణము; కలుగన్ = కలిగిన; జీవున్ = జీవుని; కున్ = కి; కర్తృత్వ = కర్తృత్వ; భోక్తృత్వంబులు = భోక్తృత్వంబులు; లేకుండుటన్ = లేకపోవుట; చేసి = వలన; ముక్తి = ముక్తి; కలుగున్ = కలుగును; అంటివేని = అనినచో; స్థూలదేహ = భౌతిక దేహముతో; సంబంధంబున్ = సంబంధము; జీవుని = జీవుని; అందున్ = అందు; బుద్ధి = బుద్ధికి; మనః = మనసునకు; మోక్ష = విమోచనముకలుగుట; అర్థ = ప్రయోజనము; గుణ = గుణము; వ్యూహ = రచన; రూప = ఆకారము; ఆది = మొదలగు; లింగశరీర = లింగదేహము; భంగ = తొలగు; పర్యతంబున్ = వరకు; కలుగుచుండునున్ = కలుగుతుండును; సుషుప్తి = నిద్ర; మూర్ఛ = మూర్ఛ; ఆదుల్ = మొదలగువాని; అందున్ = అందు; ఇష్ట = ఇష్టమైనవి; వియోగ = దూరమగునవి; ఆది = మొదలగువానివలన; దుఃఖమున్ = దుఃఖము; అందున్ = లోను; అహంకారంబున్ = నాది యనె డిభావము; కలిగి = కలిగి; ఉండునది = ఉండెడిది; ఇంద్రియ = ఇంద్రియముల; ఉపహతిన్ = ఉద్రేకము; చేసి = వలన; అమావాస్య = అమావస్య; అందలి = అందలి; చంద్రుండునున్ = చంద్రుడును; పోలెన్ = వలె; తరుణ = యుక్తవయసు నందలి; పురుషున్ = పురుషుని; కున్ = కి; గర్భ = గర్భస్థ మగు; బాల్య = బాల్యము నందలి; అవస్థలన్ = స్థితుల; అందున్ = లో; ఇంద్రియ = రేతస్సు యొక్క; పౌష్కల్యము = సమృద్ధి; లేకుండుటన్ = లేకపోవుట; చేసి = వలన; ఏకాదశేంద్రియ = ఏకాదశేంద్రియముల {ఏకదశేంద్రియములు - పంచజ్ఞానేంద్రియములు (5) పంచకర్మేంద్రియములు (5) మనస్సు (1) మొత్తము పదకొండు(11) ఇంద్రియములు}; స్ఫురణ = వ్యక్తమునకు; సమర్థంబున్ = సామర్థ్యము కలిగినది; ఐన = అయిన; అహంకారంబున్ = అహంకారము, నే ననెడి భావము; గర్భా = గర్భావస్థ; ఆదుల్ = మొదలగువాని; కున్ = కి; ప్రకాశింపని = వెల్లడి కలుగని; చందంబునన్ = విధముగ; తోపకుండు = తోచకుండును; కావునన్ = అందుచేత; స్థూలదేహ = భౌతికదేహము; విచ్ఛేదకంబున్ = నశించుట; లేకుండుటన్ = లేకపోవుట; జేసి = వలన; వస్తుభూత = వస్తువు లైనవాని; అర్థంబున్ = సత్యత్వము; లేకున్నన్ = లేకపోయినను; ఈ = ఈ; సంసారంబు = సంసారము యొక్క; విషయంబుల్ = విషయముల; అందున్ = లో; ఆసక్తుండు = ఆసక్తి కలవాడు; అగు = అయిన; జీవున్ = జీవుని; కున్ = కి; స్వాప్నిక = కలతాలూకు; అనర్థ = కీడు; ఆగమనంబునున్ = కలుగుట; పోలెన్ = వలె; నివర్తింపదు = ఉడుగదు; ఈ = ఈ; తీరునన్ = విధముగ; పంచతన్మాత్రకంబున్ = ఐదు తన్మాత్రలు కలది {పంచతన్మాత్రలు - 1శబ్ద 2స్పర్శ 3రూప 4రస 5గంధతన్మాతలు అయిదు}; త్రిగుణాత్మకంబునున్ = గుణత్రయము కలది {త్రిగుణములు - సత్త్వరజస్తమోగుణములు మూడు}; షోడశవికారాత్మకంబున్ = పదహారు వికారములు కలది {షోడశవికారములు - పదహారు (16)మనోవికారములు, 1 కామము 2 క్రోధము 3 లోభము 4 మోహము 5 మదము 6 మాత్సర్యము 7 రోగము 8 ద్వేషము 9 ఈర్ష్య 10 అసూయ 11 దర్పము 12 దంభము 13 భయము 14 అహంకారము 15 స్వప్నము 16 భ్రాంతి}; ఐన = అయిన; విస్తృతంబును = విస్తారము కలది; అయిన = అయినట్టి; లింగశరీరంబున్ = లింగశరీరమును; అధిష్ఠించి = ఆశ్రయించి; చేతనా = చైతన్యము; యుక్తుండున్ = తోకూడినవాడు; ఐన = అయిన; జీవుండు = జీవుడు; అని = అని; చెప్పంబడున్ = చెప్పబడును; మఱియును = ఇంకను.
భావము:- అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. “స్థూలదేహం ద్వారానే లింగదేహం కర్తృత్వ భోక్తృత్వాలు పొందటం చేత స్థూలదేహం నశించగానే జీవునికి కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు. కాబట్టి ముక్తి కలుగుతుంది అని చెప్పటం సరికాదు. లింగశరీరం ఎందాక ఉంటుందో అందాక స్థూలదేహంతో జీవునికి సంబంధం ఉంటుంది. గాఢనిద్ర, మూర్ఛ మొదలైన వానిలో అహంకారం ఉన్నప్పటికీ ప్రకాశించదు. అమావాస్యనాడు చంద్రునిలాగా బాల్యంలో అహంకారం స్పష్టపడదు. స్థూలదేహంతో ఎడబాటు ఉండదు. కాబట్టి అర్థం లేకపోయినా విషయాసక్తుడైన వానికి కలలో అనర్థ దర్శనం కలిగినట్లు సంసారం (జన్మ) ఉడుగదు. ఈ విధంగా లింగ శరీరాన్ని ఆశ్రయించి చైతన్యాన్ని కలిగించే పురుషుడే జీవుడు అని చెప్పబడతాడు. ఇంకా…

తెభా-4-890-సీ.
తివిరి యప్పురుషుండు దేహంబుననుజేసి-
నయంబుఁ బెక్కు దేహాంతరముల
నంగీకరించుచు వి విసర్జించుచు-
సుఖ దుఃఖ భయ మోహ శోకములను
బొలుపొందు తద్దేహములనె పొందుచు నుండు-
ది యెట్టు లన్నను గ్రభాగ
తృణమూఁది మఱి పూర్వతృణ పరిత్యాగంబు-
గావించు తృణజలూయును బోలె

తెభా-4-890.1-తే.
జీవుఁ డవనిఁ గొంత జీవించి మ్రియమాణుఁ
గుచు నొండు దేహ ర్థిఁ జెంది
కాని పూర్వమైన కాయంబు విడువఁడు
గాన మనమె జన్మకారణంబు

టీక:- తివిరి = పూని; ఆ = ఆ; పురుషుండు = పురుషుడు; దేహంబునను = శరీరము; చేసి = వలన; అనయంబున్ = ఎల్లప్పుడు; పెక్కు = అనేక; దేహ = దేహముల; అంతరములన్ = భేదములను; అంగీకరించుచున్ = అంగీకరించుతూ; అవి = వానిని; విసర్జించుచున్ = వదలివేయుచూ; సుఖ = సుఖములు; దుఃఖ = దుఃఖములు; భయ = భయములు; మోహ = మోహములు; శోకములను = శోకములందు; పొలుపొందున్ = ఒప్పుతూ; తత్ = ఆ; దేహములనె = శరీరములనే; పొందుచున్ = పొందుతూ; ఉండున్ = ఉండును; అది = అది; ఎట్టులు = ఏ విధముగ; అన్ననున్ = అనినను; అగ్రభాగ = పైకొస; తృణము = గడ్డిపరకని; ఊది = పట్టుకొని; మఱి = మరి; పూర్వ = ముందటి; తృణ = గడ్డిపరకని; పరిత్యాగంబున్ = వదలుట; కావించున్ = చేసెడి; తృణజలూకయునున్ = ఆకుపురుగు, గడ్డిజలగ; పోలెన్ = వలె.
జీవుడవు = జీవుడవు; అవనిన్ = భూమిపై; కొంత = కొంతకాలము; జీవించి = బ్రతికి; మ్రియమాణుడు = మరణించినవాడు; అగుచున్ = అగుచూ; ఒండు = మరియొక; దేహమున్ = దేహమును; అర్థిన్ = కోరి; చెంది = చెందిన; కాని = కాని; పూర్వము = పాతది; ఐన = అయిన; కాయంబున్ = శరీరమును; విడువడు = వదలడు; కాన = కనుక; మనమె = మనసే; జన్మ = పునర్జన్మమునకు; కారణంబున్ = కారణభూతము.
భావము:- పురుషుడు ఈ లింగశరీరం చేత ఒక స్థూలదేహాన్ని విడిచి, మరొక దేహాన్ని పొందుతూ, తిరిగి దానిని విడిచిపెడుతూ సుఖ దుఃఖ భయ మోహ శోకాలను ఈ లింగదేహం చేతనే అనుభవిస్తాడు. ఆకుపురుగు తన ముందున్న తృణాన్ని పట్టుకొని ఆ తరువాతనే వెనుకటి తృణాన్ని విడిచిపెడుతుంది. అలాగే జీవుడు కొంతకాలం బ్రతికి చనిపోతూ మరొక దేహం పొందిన తరువాతనే పూర్వదేహాన్ని విడిచిపెడతాడు. కాబట్టి మనస్సే జన్మకు హేతువు.

తెభా-4-891-త.
వరోత్తమ! యట్లు గాన మనంబె జీవుల కెల్ల సం
ణకారణ; మట్టి కర్మవశంబునన్ సకలేంద్రియా
ణుఁ డౌట నవిద్య గల్గును; సంతతంబు నవిద్యచేఁ
రఁగుటన్ బహుదేహకర్మనిబంధముల్ గలుగుం జుమీ!

టీక:- నరవర = రాజులలో; ఉత్తమ = ఉత్తమమైనవాడ; అట్లు = ఆ విధముగ; కాన = అగుటచేత; మనంబె = మనసే; జీవుల్ = జీవుల; కున్ = కు; ఎల్లన్ = అన్నిటికి; సంసరణ = సంసారము యొక్క; కారణము = కారణము; అట్టి = అటువంటి; కర్మ = కర్మమునకు; వశంబునన్ = వశమగుటచే; సకల = సర్వ; ఇంద్రియా = ఇంద్రియములవెనుక; చరణుడు = చరించెడివాడు; ఔటన్ = అగుటచేత; అవిద్య = ఆత్మవిద్యకానిది; కల్గును = కలుగును; సంతతంబున్ = ఎల్లప్పుడు; అవిద్య = అవిద్య; చేన్ = చేత; పరగుటన్ = ప్రసిద్ధుడు అగుటవలన; బహు = అనేక; దేహ = శరీరములు; కర్మ = కర్మములు; నిబంధముల్ = గట్టి బంధములు; కలుగున్ = కలుగును; చుమీ = సుమా.
భావము:- రాజా! కాబట్టి మనస్సే జీవులందరికీ జన్మకారణం. కర్మ వశాన అవిద్య కలుగుతుంది. అవిద్య చేత దేహానికి కర్మబంధం కలుగుతుంది. కర్మబంధం వల్ల బహు జన్మలను పొందక తప్పదు సుమా!

తెభా-4-892-చ.
విను మది గాన భూవర! యవిద్య లయించుటకై రమాపతిన్
జననస్థితిప్రళయ కారణభూతునిఁ బద్మపత్రలో
నుఁ బరమేశు నీశ్వరుని ర్వజగంబుఁ ద దాత్మకంబుగాఁ
నుగొనుచుం దదీయపదకంజము లర్థి భజింపు మెప్పుడున్.”

టీక:- వినుము = వినుము; అదిగాన = అందుచేత; భూవర = రాజా; అవిద్య = అవిద్య; లయించుట = హరించుట; కై = కై; రమాపతినిన్ = విష్ణుమూర్తిని {రమాపతి - రమ (లక్ష్మీదేవి)కి పతి (భర్త), విష్ణువు}; ఘనజననస్థితిప్రళయకారణభూతునిన్ = విష్ణుమూర్తిని {ఘన జనన స్థితి ప్రళయ కారణభూతుడు – గొప్ప సృష్టి స్థితి లయములకు కారణమైనవాడు, విష్ణువు}; పద్మపత్రలోచనున్ = విష్ణుమూర్తిని {పద్మ పత్ర లోచనుడు - పద్మ (తామర) పత్ర (ఆకుల)వంటి లోచనుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; పరమేశున్ = విష్ణుమూర్తిని {పరమేశుడు - అత్యున్నతమైన ఈశత్వము కలవాడు, విష్ణువు}; ఈశ్వరుని = విష్ణుమూర్తిని; సర్వ = సకల; జగంబున్ = జగత్తును; తత్ = అతని; ఆత్మకంబున్ = ఆత్మగా గలది; కాన్ = అగునట్లు; కనుగొనుచున్ = తెలిసికొనుచూ; తదీయ = అతని యొక్క; పద = పాదములు యనెడి; కంజమున్ = పద్మములను; అర్థిన్ = కోరి; భజింపుము = సేవింపుము; ఎప్పుడున్ = ఎల్లప్పుడు.
భావము:- రాజా! విను. కనుక అటువంటి అవిద్యను నాశనం చేయడానికి లక్ష్మీపతి, సృష్టి స్థితి లయ కారకుడు, కమలలోచనుడు, పరమేశ్వరుడు అయిన వాసుదేవుని ఈ జగత్తుకంతటికీ ఆత్మరూపంగా భావించి సేవిస్తూ ఉండు”.

తెభా-4-893-క.
ని యీ గతి భగవంతుం
ఘుఁడు భాగవతముఖ్యుఁ గు నారదుఁ డా
నునకు జీవేశ్వర గతి
కృప నెఱిఁగించి సిద్ధ తిఁ జనిన యెడన్.

టీక:- అని = అని; ఈ = ఈ; గతిన్ = విధముగ; భగవంతుండు = భగవంతుడు; అనఘుడు = పుణ్యుడు; భాగవత = భాగవతులలో; ముఖ్యుడు = ముఖ్యమైనవాడు; అగు = అయిన; నారదుడు = నారదుడు; ఆ = ఆ; ఘనున్ = గొప్పవాని; కున్ = కి; జీవ = జీవుడు; ఈశ్వర = ఈశ్వరుల; గతిన్ = మార్గములను; ఘన = గొప్ప; కృపన్ = దయతో; ఎఱిగించి = తెలిపి; సిద్ధ = పరమహంసల; గతిన్ = మార్గమున; చనినన్ = వెళ్ళిన; ఎడన్ = సమయములో.
భావము:- అని ఈ విధంగా భక్త శ్రేష్ఠుడైన నారదుడు ప్రాచీనబర్హికి జీవేశ్వరుల తత్త్వాన్ని తెలిపి సిద్ధలోకానికి వెళ్ళాడు.

తెభా-4-894-సీ.
రాజర్షి యైనట్టి ప్రాచీనబర్హి దా-
గఁ బ్రజాపాలనార్థంబు సుతుల
రకు నియోగించి పము చేయుటకునై-
పిలాశ్రమంబున పుడు పోయి
చ్చట నియతి నేకాగ్రచిత్తుండును-
ముక్తసంగుండును భూరిధైర్య
యుక్తుండు నగుచును క్తియోగంబున-
నఘ! గోవిందపదారవింద

తెభా-4-894.1-తే.
చింతనామృత పాన విశేషచిత్తుఁ
గుచు విధిరుద్ర ముఖ్యుల కందరాని
వ్యయానందమయ పద మందె నప్పు
నుచు మైత్రేయముని విదురుకుఁ జెప్పి.

టీక:- రాజర్షి = రాజులలో ఋషితుల్యుడు; ఐనట్టి = అయినట్టి; ప్రాచీనబర్హి = ప్రాచీనబర్హి; తాన్ = తను; తగ = శ్రీఘ్రముగ; ప్రజాపాలన్ = పరిపాలించెడి; అర్థంబున్ = కొరకు; సుతులన్ = పుత్రులను; ధర = భూమి; కున్ = కి; నియోగించి = ఏర్పరచి; తపమున్ = తపస్సును; చేయుట = చేయుట; కున్ = కు; ఐ = అయ్యి; కపిల = కపిలుని; ఆశ్రమంబున్ = ఆశ్రమము; కున్ = కి; అపుడున్ = అప్పుడు; పోయి = పోయి; అచ్ఛట = అక్కడ; నియతిన్ = నియమించుకొనిన; ఏకాగ్ర = ఏకాగ్రమైన; చిత్తుండును = మనసుకలవాడు; ముక్త = తొలగిన; సంగుండును = కోరికలుకలవాడు; భూరి = అత్యధికమైన; ధైర్య = ధైర్యము; యుక్తుండున్ = కలగినవాడు; అగుచున్ = అగుతూ; భక్తియోగంబునన్ = భక్తిమార్గమున; అనఘ = పాపములులేనివాడ; గోవింద = హరి; పద = పాదములు యనెడి; అరవింద = పద్మములను; చింతన = ధ్యానించుటయనెడి; ఆమృత = అమృతమును; పాన = తాగుటచేత; విశేష = విశిష్టమైన; చిత్తుడున్ = మనసుకలవాడు; అగుచున్ = అగుతూ.
= విధి = బ్రహ్మదేవుడు; రుద్ర = శివుడు; ముఖ్యుల్ = మొదలగువారి; కున్ = కిని; అందరాని = అందుకోలేని; అవ్యయ = తరుగని; ఆనంద = ఆనందముతో; మయ = నిండిన; పదమున్ = స్థితిని; అందెన్ = అందుకొనెను; అప్పుడు = అప్పుడు; అనుచున్ = అనుచూ; మైత్రేయ = మైత్రేయుడు యనెడి; ముని = ముని; విదురున్ = విదురుని; కున్ = కి; చెప్పి = చెప్పి.
భావము:- రాజర్షి అయిన ప్రాచీనబర్హి ప్రజారక్షణకు కొడుకులని నియోగించి, తప్పస్సు చేయటానికి కపిలాశ్రమానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో ముక్తసంగుడై, ఏకాగ్రచిత్తంతో, సద్భక్తియోగంతో గోవిందుని పాదపద్మాలను ఆరాధించాడు. బ్రహ్మ రుద్రాదులకు పొంద శక్యంకాని అవ్యయానందమయమైన పదాన్ని పొందాడు” అని మైత్రేయుడు విదురునితో చెప్పి…