పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/స్వర్గ వర్ణనము

స్వర్గవర్ణనము

తెలుగు భాగవతము ( స్వర్గ_వర్ణనము)
రచయిత: పోతన



తెభా-8-445-వ.
ఇట్లు బలవంతుఁడగు బలి సురేంద్రుని సాధింప సమకట్టి దండ గమనంబులు జేసి, నిడుద పయనంబులం జనిచని.
టీక:- ఇట్లు = ఇలా; బలవంతుడు = బలశాలి; అగు = అయిన; బలి = బలి; సురేంద్రుని = దేవేంద్రుని; సాధింప = పగదీర్చుకొనుటకు; సమకట్టి = పూనుకొని; దండగమనంబులు = దండయాత్రలు; చేసి = చేసి; నిడుద = దీర్ఘమైన; పయనంబులన్ = ప్రయాణములు; చనిచని = సాగించి.
భావము:- బలశాలి అయిన బలిచక్రవర్తి ఇలా దేవేంద్రునిపై పగ తీర్చుకోవాలని సంకల్పించుకుని, వేగంగా దీర్ఘమైన ప్రయాణాలు సాగించి సాగించి...

తెభా-8-446-మ.
నియెం బుణ్యజనౌకమున్ విగతరోస్వప్న పీడాన్న ఖా
సంశోకముఁ బుష్ప పల్లవ ఫలోద్దామద్రుమానీకమున్
స్వనితోద్ధూత పతాకముం బ్రవిచరద్వైమానికానీకమున్
గంగాసలి లైకమున్ మఘవయుక్తశ్రీకమున్ నాకమున్.

టీక:- కనియెన్ = చూచెను; పుణ్యజనౌకమున్ = స్వర్గమును; విగత = పూర్తిగాపోయిన; రోగ = జబ్బులు; స్వప్న = దుస్వప్నములు; పీడ = బాధలు; అన్నఖాదన = ఆకలి; సంశోకమున్ = దుఃఖములు; పుష్ప = పూలు; పల్లవ = చిగుళ్ళు; ఫల = పండ్లు; ఉద్దామ = నిండుగాగల; ద్రుమ = వృక్షముల; అనీకమున్ = సమూహములుగలది; స్వనిత = ఉఱుములు వలె; ఉద్ధూత = ఎగురుతున్న; పతాకమున్ = జండాలుగలది; ప్రవిచరత్ = అధికముగతిరుగుచున్న; వైమానికా = విమానముల; అనీకమున్ = సమూహములు గలది; ఘన = గొప్ప; గంగా = ఆకాశగంగా; సలిల = జలములు; ఏకమున్ = కలది; మఘవయుక్త = ఇంద్రునివలన; శ్రీకమున్ = సంపత్కరము; నాకమున్ = స్వర్గము.
భావము:- బలి స్వర్గ లోకాన్ని సమీపించాడు. ఆ స్వర్గం పుణ్యాత్ములకు నివాస స్ధానం. అక్కడ రోగాలూ, చెడుకలలు, ఆకలి బాధలూ, దుఃఖాలూ ఉండవు. అక్కడ పూలు పండ్లూ నిండుగా ఉండే చెట్లు దండిగా ఉంటాయి. గాలికి సవ్వడి చేస్తూ జెండాలు ఎగురుతుంటాయి. దేవతల విమానాలు తిరుగుతుంటాయి. పవిత్రమైన ఆకాశగంగానదీజలాలు ప్రవహిస్తూ ఉంటాయి. అట్టి స్వర్గసీమలోని అమరావతి చేరి బలి....

తెభా-8-447-వ.
కని రక్కసులఱేఁడు వెక్కసంబై చాల్పుగల వేల్పుల నెలవు దఱియం జొచ్చి, చెచ్చెర ముందటికిం జనిచని, ముందట నెడపడక మొన మోపి, యిగురుచు చిగురు తలిరాకు జొంపంబు ననమొగుడు మొగ్గ యరవిరి నెఱవిరి గుత్తి పిందె పూఁప దోరకాయ పండు గెలలతండంబుల వ్రేగు లాఁగలేక మూఁగి వీఁగి వ్రేఁకలగు మ్రాకుల ప్రోక లకుఁ బేఁట లగు పెందోఁటలును; దోఁటల గాటంబులై నివ్వటిల్లు మవ్వంపుఁ గ్రొవ్విరులకుఁ గవలువివ్వక కసిమసలు కలిగి ముసిరి కొసరి పూనిపోని తేనియ లాని విసరు గలిగి మసరు కవిసి క్రొవ్వి రిమ్మ గొని జుమ్ము జుమ్మనుచు జంజాటించు తేఁటి దాటులును; దాఁటు పడక నాఁటుకొని పూవిడుచు కూడి జోడువీడక క్రోమ్మావుల కమ్మని కొమ్మల నిమ్ముల ముసరి పసిమి గల కిసలయమ్ములు పొసగంగ మెసంగి కిసరుపడక కసరుచెడి బిట్టు రట్టడితనంబు లలమి మించి కరాళించు కోయిలల మొత్తంబులును; మొత్తంబులయి చిత్తంబుల మత్తంబులుగఁ దత్తఱంబున దియ్యని పండ్లకుఁ గయ్యంబులు చేసి చయ్యన నేసరేఁగి బేసంబులు గాసంబులుగొని వాసికెక్కి పలుబాస లాడుచు బహుప్రకారంబులగు కీరంబులునుఁ; గీరంబులకు సరిఁగడచి మింటనంట నెగసి పెట్టలం బట్టి చీరి యిట్టట్టు చనక నెట్టుకొని నెలవుల వ్రాలుచు నింపుగల రవమ్ములుఁ గలుఁగు కలరవమ్ములును గలరవమ్ము లలరం దొలంకుల కొలంకుల కెలంకులఁ గడంకల బ్రియల నిడుకొని క్రమ్మిదొమ్మిచేసి యెలదమ్మి తూఁడులవాఁడు లగు చంచువులం జించి మెక్కి చొక్కి మిక్కిలి కలఁకలం బడుచు నలబలంబులు చేయు కలహంసంబులును; హంసరుచి జనిత వికసనముల వికవిక నగుచుం బసఁగలిగి మిసమిస మెఱచు పసిఁడి కెందమ్ము లిందిరా మందిరమ్ముల చందమ్ములుగ నందమ్ములగు కొలంకులును; కొలంకుల కరళ్ళఁ దడిసి వడవడ వడంకుచు నల్లిబిల్లులుగొని సాఁగిన తీగెయిండ్ల గండ్ల యీఱములం దోరములుచెడి పలువిరుల కమ్మ వలపుల వ్రేఁగునం దూఱలేక యీడిగలంబడు గాడ్పులును, గాడ్పుల వలన నెగసి గగనమున విరిసి పలువన్నెలం జెనగు మేలుకట్టుఁ బుట్టంబుల తెఱంగున దట్టంబులయిన కుసుమ పరాగంబులును; బరాగంబుల సరాంగంబులగు వాఁగు వ్రంతల చెంతల గుంపులుగొని గఱికి జొంపంబుల లంపులు దిని మంపులుగొని పెల్లు నెమర్లుపెట్టుచు నొదుఁగుల పొదుగులు గదల వాడల వాడల జాడలం బరుగులిడు దూడల క్రీడల వేడుకలం గూడుకొని యిండ్ల వాకిండ్లకుం జేరి పౌరుల కోరికల కనుసారికలగుచు నమృతంబుఁ గురియు కామధేనువులునుఁ; గామధేనువులకు నిలువ నీడ లగుచు నడిగిన జనమ్ములకు ధనమ్ములు ఘనమ్ముగఁ బుడుకు కల్పతరువులును; కల్పతరువుల పల్లవ మంజరులఁ గుంజరులకు విఱిచి యిచ్చుచు మచ్చికల కలిమి నిచ్చ మెచ్చుచు గృతక గిరుల చఱుల సిరుల నడరు పడఁతుల నడలకు గురువులగుచు మెఱయు మురువుల నొత్తరించు మత్తేభంబులును, నిభంబుల సరస నొరసికొని వరుసఁ బరుసఁదనములెడలి సుకరములగు మకరతోరణ స్తంభంబులును; తోరణస్తంభంబుల చేరువ నిలిచి చెఱకువిలుతుం డొఱపెఱికిన బెడిదము లగు నవకంపు మెఱుఁగుం జిగురు టడి దముల తెఱంగున నిలుకడ సంపదలు గలుగు శంపల సొంపునం గరచరణాది శాఖలుగల చంద్రరేఖల పోఁడిమిని వాహిని గల మోహినీ విద్యల గ్రద్దనఁ జూపులకుం దీపు లొదవించుచు మర్మకర్మంబు వశంబు లరయు యశంబులు గలిగి యనూనంబులగు విమానంబు లెక్కి చచ్చివచ్చిన సచ్చరిత్రులకుం జెచ్చెర నెదురు చని తూకొని తోడ్కొని పోవు రంభాది కుంభికుంభకుచల కలకలంబులును; గల హంస కారండవ కోక సారసబృంద సుందర సుందరియు; నిందీవరార విందనందదిందిందిరయు; నభంగయు సభంగయునగు గంగ నింగి కిం బొంగెనో యని మిగుల దిగులుపడఁ బొగడ్తల కెక్కిన యగడ్తలును నగడ్తల మిన్నేటి తేటనీట నీటులీను పాటి సూటిచల్లులాటల మేటి కూటువలు గొనుచు నేచిన ఖేచర కన్యకావారంబులును; వారవనితా సుపూజిత విరాజిత దేహళీ పాటవంబు లగు గోపుర కనక కవాటంబులును; గవాట వేదికాఘటిత మణిగణ కిరణోదారంబులగు నింద్రనీల స్తంభ గంభీరతలును; గంభీర విమల కమలరాగ పాలికా వారంబులగు చతుర్ద్వారంబులును; ద్వారదేశంబుల చావిళ్ళం గావళ్ళుండి ప్రొద్దు పోక పెద్ద రక్కసుల వేల్పుల కయ్యంబులు నెయ్యంబులం జెప్పికొనుచున్న యస్త్ర శస్త్ర ధారులు శూరులు నయిన మహాద్వార పాలక వీరులును; వీర రస జలధి వేలోదారంబులయి శుద్ధస్ఫటిక బద్ధ మహోత్తానంబులగు సోపాన సుభగాకారంబులును; సుభగాకార ప్రదీపంబు లగు వజ్ర మహారజిత వప్రంబులును; వ ప్రోపరి వజ్ర కుడ్య శిరోభాగ చంద్రకాంత తరుణ హిమకరకిరణ ముఖరంబులగు సాలశిఖరంబులును, శిఖర స్తోమధామ నికృత్త తారకంబులును, దార తార మణి శిలా కఠోరంబులగుచు మిగుల గరిత యగు నగరిసిరి మీఱ నమరు మొగులు పొడగని నిలుకడలకు నలువ నడిగికొని పడసిన పసిఁడి తెరల వలువల బెడంగునం దోరంబులగు ప్రాకారంబులునుఁ; బ్రాకార కాంచనాంచిత యుద్ధసన్నద్ధ మహాఖర్వ గంధర్వ వాహినీ పాలకంబులగు మరక తాట్టాలకంబులును; నట్టాలకోత్తుంగ వజ్రమయ స్తంభోదంచనంబులునుఁ; బరభట ప్రాణ వంచనంబులు సముదంచనంబులు నగు దంచనంబులును; దంచనంబుల తుదలు రథంబుల యిరుసులు నొరసికొనం, గోట యీవలి యావలి తివియని దివియల కరణి రుచిరము లగుచుఁ బచరించు నహిమకర హిమ కర మండలంబులును; హిమకర మండలంబు నిద్దంపు టద్దంబని మూఁగి తొంగి చూచుచు నలిక ఫలకంబులఁ గులకములుఁగొను నలకములం దరపి తిలకములం దెఱంగు పఱచుకొను సమయముల వెనుక నొదిఁగి కదిసి ముకురంబులం బ్రతిఫలితులైన పతు లితర సతుల రతుల కనుమతులని కనుకనిన్ మరలి నీడ తలంగినఁ గలంగి చని కాంతులు పొలయ నలయు ముగుదలకు నేకాంతంబులై గగన సముత్సేధంబు లైన రాజసౌధంబులును; సౌధంబుల సీమల ముత్తియంపు సరుల తోడి నిబ్బరపు గుబ్బచన్నులకు చెన్నులం బ్రక్కలం జుక్కలపదవులుండ మండిత సౌధశిఖరంబులకు శృంగారంబులయిన భృంగారంబులును; భృంగారశయన జాలక డోలికా నిశ్రేణికాది విశేష రమ్యంబులయిన హర్మ్యంబులును; హర్మ్య కనక గవాక్షరంధ్ర నిర్గత కర్పూర కుంకుమాగరు ధూపధూమంబులును; ధూమంబులు జీమూత స్తోమంబులని ప్రేమంబు లుబ్బ గొబ్బునం డబ్బాటు పబ్బంబు లబ్బె నని మరులుఁగొని పురుల వన్నియల సిరులు సరులుగొనం గుటవిటపములఁ దటపెట నటించుచుఁ బలుకులు విరిసి కికురుపొడుచు వలఱేని మఱుపుఁ జదువుల టీక లనం గేకలిడు నెమిళ్ళును; నెమిళ్ళ పురుల నారలు నారులగు రతనంపు విండ్ల నినదములను తలంపులం దోఁకలు జడిసి వీఁకలు మెఱసి మూఁకలుఁగొని దివికెగిరి రవికిం గవిసిన రాహువు క్రియం దివిఁ దడంబడు పడగలును; బడగలును గొడుగులును దమకునాలంబులకు నడియాలంబులుగఁ దోరంబులైన సారంబుల బీరంబులు మెఱసి బెబ్బులుల గబ్బునం గరుల సిరుల సింగంబుల భంగుల శరభంబుల రభసంబుల ధూమ కేతువుల రీతుల వైరిం జీరికిం గొనక శంకలుడిగి ఱంకె లిడుచు లంకెలై లెక్కకు మిక్కిలి యగుచు రక్కసుల చక్కటి యెక్కటి కయ్యముల డయ్యము లెఱుంగం దిరుగు వీరభటకదంబులును; గదంబ కరవాల శూలాదుల మెఱుంగులు మెఱపుల తెఱంగులం దిశల చెఱంగులం దుఱంగలింప నేమి నినదంబులు దరములగు నుఱుములుగ నడమొగిళ్ళ పెల్లునం బ్రవర్షిత రథిక మనోరథంబు లగు రథంబుల గములును; గములుఁగొని గమన వేగంబు వలన హరిహరుల నగి గాలిం జాలింబడం గేలికొని ఘనంబులగు మనంబులం దెగడి నెగడు సురంగంబు లగు తురంగంబులును; రంగదుత్తంగ విశద మదకల కరటి కటతట జనిత మదసలిల కణగణ విగళిత దశశతనయన భుజ సరళ మిళిత లలిత నిఖిలదిగధిపతి శుభకర కరకనక కటకఘటిత మణి సముదయ సముదిత రేణువర్గదుర్గమంబు లయిన నిర్వక్ర మార్గంబులును; మార్గస్థలోపరిగతాగత శతశతాయుతానేక గణనాతీత రోహణాచలతట విరాజమానంబులగు విమానంబులును; విమాన విహరమాణ సుందర సుందరీ సందోహ సంవాదిత భూరిభేరీ వీణా పణవ మృదంగ కాహళ శంఖాది వాదనానూన గాన సాహిత్య నృత్య విశేషంబులును; విశేషరత్నసంఘటిత శృంగార శృంగాటక వాటికా దేహ దేహళీ ప్రదీపంబులును, దీపాయమాన మానిత సభామండప ఖచిత రుచిరచింతారత్నంబులునుం, గలిగి రత్నాకరంబునుం బోలె ననిమిష కౌశిక వాహినీ విశ్రుతంబయి, శ్రుతివాక్యంబునుంబోలె నకల్మష సువర్ణ ప్రభూతంబయి భూతపతి కంఠంబునుం బోలె భోగిరాజకాంతంబయి, కాంతాకుచంబునుం బోలె సువృత్తం బయి, వృత్తజాతంబునుంబోలె సదా గురులఘు నియమాభిరామం బయి, రామచంద్రుని తేజంబునుం బోలె ఖరదూషణాది దోషాచరా నుపలబ్ధంబయి, లబ్ధవర్ణుచరిత్రంబునుం బోలె విమలాంతరంగ ద్యోత మానం బయి మానధనుని నడవడియునుం బోలె సన్మార్గ భాతి సుందరం బయి సుందరోద్యానంబునుం బోలె రంభాంచితాశోక పున్నాగంబయి, పున్నాగంబునుం బోలె సురభిసుమనోవిశేషం బయి, శేషాహి మస్తకంబునుంబోలె నున్నత క్షమా విశారదంబయి, శారద సముదయంబునుంబోలె ధవళ జీమూత ప్రకాశితంబయి, సితేత రాజిన దానంబునుం బోలె సరస తిలోత్తమంబయి, యుత్తమ పురుష వచనంబునుం బోలె ననేక సుధారస ప్రవర్షంబై, వర్షాదియు నుంబోలె నుల్లసదింద్ర గోపంబయి, గోపతి మూఁపురంబునుంబోలె విచక్షురార్యాలంకృతంబై, కృతార్థం బయిన యమరావతీ నామ నగరంబు చేరం జని కోటచుట్టునుం బట్టు గలుగ బలంబులఁ జలంబున విడియం బంచి పొంచి మార్గంబు లెల్ల నరికట్టుకొని యేమఱక యుండె; నంత.
టీక:- కని = చూసి; రక్కసుల = రాక్షసుల; ఱేడు = రాజు; వెక్కసంబు = దుస్సహమైనది; ఐ = అయ్యి; చాల్పు = విశాలము; కల = కలిగినది; వేల్పులనెలవున్ = స్వర్గమును; దఱియన్ = దరికిచేరి; చొచ్చి = ప్రవేశించి; చెచ్చెరన్ = వేగముగ; ముందటి = ముందు; కిన్ = కున్; చనిచని = వెళ్ళి; ముందటన్ = ఎదురుగ; ఎడపడకన్ = ఎడతెగని; మొనమోపి = పొటమరించెడి; ఇగురుచున్ = లేచిగురు; చిగురు = చిగుర్లు; తలిరాకు = లేతాకులు; జొంపంబునన్ = గుబురులలో; అనమొగుడు = అరమొగ్గలు; మొగ్గ = మొగ్గలు; అరవిరి = అరవిరిసినపూలు; నెఱవిరి = బాగవిరిసినపూలు; గుత్తి = పూగుత్తులు; పిందె = లేతకాయలు; పూప = పచ్చికాయలు; దోరకాయ = అరముగ్గినకాయలు; పండు = ముగ్గినపండ్లు; గెలక = గెలలు; తండంబులన్ = సమూహములతో; వ్రేగులు = బరువులకు; ఆగ = మోయ; లేక = లేక; మూగి = దట్టమైన; వీగి = వంగి; వ్రేకలు = బరువెక్కినవి; అగు = అయిన; మ్రాకుల = చెట్ల; ప్రోకల్ = సమూహముల; కున్ = కు; పేటలు = దట్టములైన; అగు = అయిన; పెందోటలును = పెద్దతోటలు; తోటలన్ = తోటలందు; గాటంబులు = అధికములు; ఐ = అయ్యి; నివ్వటిల్లు = నిండైన; మవ్వంపు = కోమలమైన; క్రొవ్విరుల్ = కొంగ్రొత్తపూల; కున్ = కు; కవలువు = జంటను; ఇవ్వక = వదలక; కసిమసలు = తొట్రుపాటు; కలిగి = కలిగి; ముసిరి = మూగి; కొసరి = కొసరికొసరి; పూనిపోని = పొంగిపోని; తేనియలన్ = మకరందమును; ఆని = తాగి; విసరు = తూగుట; కలిగి = కలిగి; మసరు = మత్తు; కవిసి = ఎక్కి; క్రొవ్వి = బలిసి; రిమ్మగొని = కైపెక్కి; జుమ్ముజుమ్ము = జుంజుం; అనుచు = అనుచు; జంజాటించు = రవములుచేయుచున్న; తేటి = తుమ్మెదల; దాటులును = సమూహములు; దాటుపడక = దాటిపోకుండగ; నాటుకొని = తగులుకొని యుండి; పూవిడుచు = విరిపూలను; కూడి = కలిసి; జోడు = కలియిక; వీడక = వదలక; క్రొమ్మావుల = గున్నమామిడుల; కమ్మని = రుచికరమైన; కొమ్మలన్ = చిగురుకొమ్మల; ఇమ్ముల = ఉత్సాహముతో; ముసరి = మూగి; పసిమి = లేతదనము; కల = కలిగిన; కిసలయమ్ములున్ = చిగుళ్ళను; పొసగంగ = చక్కగ; మెసంగి = మెక్కి, అధికముగతిని; కిసరు = చిరాకు; పడకన్ = పడకుండ; కసరు = కోపము; చెడి = పోయి; బిట్టు = మిక్కిలి; రట్టడితనంబులన్ = పెంకితనముతో; అలమించి = చెలరేగి; కరాళించు = కూసెడి; కోయిలల = కోయిలల యొక్క; మొత్తంబులును = సమూహములును; మొత్తంబులయి = గుంపులుకట్టి; చిత్తంబులన్ = మనసులు; మత్తంబులుగన్ = ఉత్సాహపు; తత్తఱంబునన్ = తొట్రుపాటుతో; తియ్యని = తియ్యగానున్న; పండ్లు = ఫలముల; కున్ = కు; కయ్యంబులున్ = పోట్లాటలు; చేసి = చేసి; చయ్యన = చటుక్కున; ఎసరేగి = విజృంభించి; బేసంబులు = పేసములను; గాసంబులు = ఆహారముగ; కొని = తీసికొని; వాసికెక్కి = ప్రసిద్ధమగు; పలు = అనేకమైన; బాసలు = పలుకులు; ఆడుచు = పలుకుచు; బహు = అనేక; ప్రకారంబులు = రకములు; అగు = అయిన; కీరంబులును = చిలుకలు; కీరంబుల్ = చిలుకల; కున్ = కు; సరిగన్ = పోటీ; కడచి = పడి; మింటన్ = ఆకాశమును; అంటన్ = అందు; ఎగసి = ఎగిరి; పెట్టలన్ = ఆడపక్షులను; పట్టి = ఉద్దేశించి; చీరి = పిలిచి; ఇట్టట్టు = ఇటునటు; చనక = పోకుండగ; నెట్టుకొని = తోసుకొని; నెలవులన్ = వాసములందు; వ్రాలుచున్ = వాలుతూ; నింపుగల = నిండైన; రవమ్ములన్ = ధ్వనులు; కలుగు = చేసెడి; కలరవమ్ములున్ = పావురములు; కలరవమ్ముల్ = కలకలధ్వనులు; అలరన్ = చక్కదనములతో; దొలంకులన్ = పొర్లుచున్న; కొలంకుల = సరస్సుల; కెలంకులన్ = ప్రక్కల; కండకలన్ = సమీపమున గల; ప్రియలన్ = ప్రియురాళ్ళను; ఇడుకొని = ఉంచుకొని; క్రమ్మి = మూగి; దొమ్మిచేసి = పెనగులాడి; ఎల = పరువుకొచ్చిన; తమ్మి = కలువల; తూడులన్ = తూండ్లను; వాడులు = వాడిగలవి; అగు = అయిన; చంచువులన్ = ముక్కులతో; చించి = చీల్చికొని; మెక్కి = తిని; చొక్కి = సోలి; మిక్కిలి = అధికముగ; కలకలంబు = కలకలారావములు; పడచు = పెడుతు; అలబలము = గోలలు; చేయు = చేసెడి; కలహంసంబులును = కలహంసలును; హంస = హంసల; రుచి = ప్రకాశము; జనిత = కలిగిన; వికసనములన్ = వికాసములతో; వికవిక = పకపక; నగుచున్ = నవ్వుతూ; పసగలిగి = సారము కలిగి; మిసమిస = మిసమిసమని; మెఱచు = మెరుస్తూ; పసిడి = బంగారు; కెందమ్ముల = సరోజములు; ఇందిర = లక్ష్మీదేవియొక్క; మందిరమ్ముల = నివాసముల; చందమ్ములున్ = వలె; కనన్ = అనిపించెడి; తమ్ములు = పద్మములు; అగు = కలిగిన; కొలంకులును = సరస్సులు; కొలంకుల = సరస్సులయొక్క; కరళ్ళన్ = అలలలో; తడిసి = తడిసి; వడవడ = వడవడమని; వడంకుచున్ = వణకిపోతూ; అల్లిబిల్లులున్ = అడ్డదిడ్డముగ; కొని = అల్లుకొని; సాగిన = పాకినట్టి; తీగె = తీవెల; ఇండ్లన్ = పొదలలోని; కండ్ల = దగ్గరి; ఈఱములన్ = దట్టములైన; తోరములు = బలముతగ్గి; పలువిరుల = రాలినపూల; కమ్మ = కమ్మని; వలపులన్ = సువాసనలతో; వ్రేగునన్ = లోపలకు; దూఱ = చొర; లేక = లేక; ఈడిగలబడు = చతికిలబడెడి; గాడ్పులును = గాలులు; గాడ్పుల = గాలుల; వలన = వలన; ఎగసి = ఎగిరి; గగనమున = ఆకాశమునందు; విరిసి = విరిసిన; పలు = అనేక; వన్నెలన్ = రంగులతో; చెనగు = చెలరేగెడి; మేలుకట్టున్ = మేలుకట్టు; పుట్టంబుల = చాందినీల; తెఱంగున = విధముగ; దట్టంబులు = చిక్కగానున్నవి; అయిన = అయిన; కుసుమ = పూల; పరాగంబులును = పుప్పొడిరేణువులును; పరాగంబుల = పుప్పొడిరేణువుల; సరాగంబులు = రంగులుపొందినవి; అగు = అయిన; వాగు = వాగుల; వ్రంతల = ఏఱుల; చెంతల = పక్కలందు; గుంపులు = సమూహములు; కొని = కట్టి; గఱిక = పచ్చిక; జొంపంబులన్ = గుబురులు; లంపులు = మేతలు; తిని = తిని; మంపులుగొని = మత్తిలి; పెల్లు = పెద్ద; నెమర్లు = నెమరువేయుటలు; పెట్టుచున్ = చేయుచు; ఒదుగుల = సమృద్ధములగు; పొదుగులు = పొదుగులు; కదలన్ = కదులుతుండగ; వాడలవాడల = అన్నివాడలలోను; జాడలన్ = దారులమ్మట; పరుగులు = పరుగులు; ఇడుచు = పెడుతు; దూడల దూడల; క్రీడల = ఆటలలో; వేడుకలన్ = ఇష్ట; కూడుకొని = పూర్తిగా; ఇండ్ల = నివాసముల; వాకిండ్ల = ముందు ప్రదేశముల; కున్ = కు; చేరి = చేరి; పౌరుల = పురజనుల; కోరికల్ = కోరికల; అనుసారికలు = ప్రకారముగ; అమృతంబున్ = అమృతమును; కురియు = కురిసెడి; కామధేనువులును = కామధేనువులు; కామధేనువుల = కామధేనువుల; కున్ = కు; నిలువ = నిలబడుటకు; నీడలు = నీడలనిచ్చెడివి; అగుచున్ = అగుచు; అడిగిన = కోరిన; జనమ్ముల = వారి; కిన్ = కి; ధనమ్ములున్ = సంపదలను; ఘనమ్ముగన్ = అధికముగ; పుడుకు = తీర్చెడి; కల్పతరువులును = కల్పవృక్షములును; కల్పతరువుల = కల్పవృక్షముల; పల్లవ = చిగుళ్ళను; మంజరులన్ = పూలగుత్తులను; కుంజరుల = ఆడ ఏనుగుల; కున్ = కు; విఱిచి = కోసి; ఇచ్చుచు = ఇస్తూ; మచ్చికల = మరుల; కలిమి = సంపదలను; ఇచ్చన్ = సంతోషముతో; మెచ్చుచున్ = మెచ్చుకొనుచు; కృతక = క్రీడా; గిరుల = పర్వతముల; చఱులన్ = చరియల; సిరుల = సొగసులతో; అడరు = అతిశయించెడి; పడతుల = స్త్రీల; నడకల = గమనముల; కున్ = కు; గురువులు = నేర్పెడివి; అగుచున్ = అగుచు; మెఱయు = ప్రకాశించెడి; మురువులన్ = మురిపములతో; ఉత్తరించు = దాటెడి; మత్తేభంబులును = ఏనుగులును; నిభంబుల = ఏనుగుల; సరసన్ = దగ్గర; ఒరసికొని = రాసుకొనుచు; వరుసన్ = వరుసగా; పరుసదనములు = కరకుదనములు; ఎడలి = తేరి; సుకరములు = నున్నగానైన; మకరతోరణ = మకరతోరణముల; స్తంభంబులును = స్తంభములును; తోరణస్తంభంబుల = తోరణస్తంభముల; చేరువన్ = దగ్గర; నిలిచి = నిలబడి; చెఱకువిలుతుండు = మన్మథుడు; ఒఱన్ = ఒరనుండి; పెఱికిన = తీసిన; బెడిదములు = భయంకరములైనవి; అగు = అయిన; నవకంపు = సరికొత్త; మెఱుగున్ = మెరుపులవంటి; చిగురు = వాడియైన; అడిదములన్ = కత్తుల; తెఱంగునన్ = వలె; నిలుకడ = నిలబడిన; సంపదలు = ప్రకాశములు; కలుగు = కలిగుండెడి; శంపల = మెరుపుతీగల; సొంపునన్ = అందముగల; కర = కాళ్ళు; చరణ = చేతులు; ఆది = మున్నగు; శాఖలు = అవయవములు; కల = కలిగిన; చంద్రరేఖల = నెలవంకల; పోడిమిని = చక్కదనములు; వాహిని = వాక్చాతుర్యము; కల = కలిగిన; మోహినీ = మోహింపజేసెడి; విద్యలన్ = విద్యలతో; గ్రద్దన = శ్రీఘ్రముగ; చూపుల = చూపుల; కున్ = కు; తీపులు = హాయి; ఒదవించుచున్ = కలిగించుచు; మర్మ = శృంగారరహస్య; కర్మంబు = క్రియలను; వశంబులు = వశవర్తములు; అరయు = తెలియు; యశంబులు = పేరుప్రతిష్టలు; కలిగి = కలిగి; అనూనంబులు = అసమానములు; అగు = అయిన; విమానంబులు = విమానములను; ఎక్కి = ఎక్కి; చచ్చి = మరణానంతరము; వచ్చిన = వచ్చినట్టి; సచ్చరిత్రుల్ = పుణ్యవర్తనుల; కున్ = కు; చెచ్చెరన్ = శ్రీఘ్రముగ; ఎదురు = ఎదురు; చని = వెళ్ళి; తూకొని = పూని; తోడ్కొని = కూడా తీసుకొని; పోవు = వెళ్ళడి; రంభ = రంభ; ఆది = మున్నగు; కుంభి = ఏనుగు; కుంభ = కుంభములవంటి; కుచల = స్తనములుగలవారి; కలకలంబులును = కలకలారావములు; కలహంస = కలహంసలు; కారండవ = కారండవపక్షులు; కోక = జక్కవపక్షులు; సారస = బెగ్గురుపక్షులు; బృంద = సమూహములతో; సుందర = అందమైన; సుందరియున్ = స్త్రీలు; ఇందీవర = కలువలు; అరవింద = కమలముల; నంద = సంతోషించెడి; ఇందిందిరయు = తుమ్మెదలు {ఇందిందిరము - వ్యు. పద్మసంపదలతో కూడినది (విద్యార్థి కల్పతరువు)}; అభంగ = శాశ్వతమైనది; సభంగయున్ = అలలుగలది; అగు = అయిన; గంగ = గంగానది; నింగి = ఆకాశమున; కిన్ = కి; పొంగెనో = పొంగినదిఏమో; అని = అని; మిగుల = మిక్కిలి; దిగులపడన్ = వెరపుకలిగించుచు; పొగడ్తల = పెంపుల; కిన్ = కి; ఎక్కిన = ఎక్కినట్టి; అగడ్తలున్ = అగడ్తలు; అగడ్తల = అగడ్తల; మిన్నేటి = ఆకశగంగయందలి; తేట = శుభ్రమైన; నీటన్ = నీటిలోని; నీటులు = మురిపముల; ఈనుపాటి = కలిగించెడి; సూటిచల్లులాటల = జలకాకలాటలలో; మేటి = చక్కగా; కూటువలుగొనుచు = కూడుకొనుచు; ఏచిన = అతిశయించిన; ఖేచరకన్యక = దేవకన్యల; ఆవారంబులును = సమూహములును; వారవనితా = దేవవేశ్యలచే; సుపూజిత = చక్కగా పూజింపబడెడి; విరాజిత = విరాజిల్లెడి; దేహళీ = గడపల; పాటవంబులు = గొప్పదనములుగలవి; అగు = అయిన; గోపుర = గోపురముల; కనక = బంగారపు; కవాటంబులును = ద్వారములును; కవాట = ద్వారములదగ్గరి; వేదికా = అరుగులపై; ఘటిత = పొదగబడిన; మణి = రత్నముల; గణ = సమూహముల; కిరణ = కాంతులతో; ఉదారంబులు = మిక్కిలినవి; అగు = అయిన; ఇంద్రనీల = ఇంద్రనీలముల; స్తంభ = స్తంభములతో; గంభీరతలును = గంభీరమైనవి; గంభీర = గంభీరము; విమల = స్వచ్ఛమైన; కమలరాగ = పద్మరాగ; పాలికా = మాలలు; అవారంబులు = అధికముగగలవి; అగు = అయిన; చతుః = నాలుగు (4); ద్వారంబులును = ద్వారములును; ద్వారదేశంబుల = గుమ్మములముందు; చావిళ్ళన్ = చావిడిలలో; కావళ్ళు = కాపాలా; ఉండి = ఉండి; ప్రొద్దుపోక = సమయముగడవక; పెద్ద = పెద్దపెద్ద; రక్కసులవేల్పుల = దేవదానవుల; కయ్యంబులున్ = యుద్ధములు; నెయ్యంబులున్ = ముచ్చట్లను; చెప్పికొనుచున్న = చెప్పుకొంటున్న; అస్త్రశస్త్ర = శస్త్రాస్త్రములను; ధారులు = ధరించినవారు; శూరులు = వీరులు; అయిన = ఐన; మహా = ముఖ్య; ద్వారపాలక = ద్వారపాలకులైన; వీరులును = వీరులు; వీరరస = వీరరసము యనెడి; జలధి = సముద్రపు; వేలా = చెలియలికట్టల; ఉదారంబులు = వంటిపెద్దవి; అయి = అయ్యి; శుద్ధ = స్వచ్ఛమైన; స్ఫటిక = స్ఫటికములు; బద్ధ = పొదిగిన; మహా = మిక్కిలి; ఉత్తానంబులు = ఎత్తైనవి; అగు = అయిన; సోపాన = మెట్లతో; సుభగాకారంబులును = శోభాకరములు; సుభగాకార = శోభాయమానములను; ప్రదీపంబులు = వెదజల్లెడివి; అగు = అయిన; వజ్ర = వజ్రములు; మహారజిత = బంగారు; వప్రంబులును = కోటలు; వప్ర = కోటల; ఉపరి = పైనగల; వజ్ర = వజ్రముల; కుడ్య = గోడల; శిరో = పై; భాగ = భాగమునందలి; చంద్రకాంత = పాలరాళ్ళతోకట్టబడిన; తరుణ = నిండు; హిమకర = చంద్రుని; కిరణ = కిరణములలో; ముఖరంబులు = వెల్లివిరిసెడివి; అగు = అయిన; సాల = ప్రాకార; శిఖరంబులును = బురుజులును; శిఖర = బురుజుల; స్తోమ = సమూహముల; ధామ = మధ్య; నికృత్త = చొరబడుతున్న; తారకంబులును = తారకలు; ఉదార = మిక్కిలి; తార = మెరిసెడి; మణి = వజ్రపు; శిల = రాళ్ళువలె; కఠోరంబులు = గట్టివి; అగుచున్ = అగుచు; మిగుల = మిక్కిలి; గరిత = గొప్పదనములుగలవి; అగు = అయిన; నగరి = నగరముయొక్క; సిరి = ఐశ్వర్యమును; మీఱన్ = అతిశయించునట్లు; అమరు = అమరియన్నట్టి; మొగులు = మబ్బులను; పొడగనిన్ = కనబడెడి; ఇలు = రెండు (2); కడలు = వైపుల; కున్ = కు; నలువన్ = బ్రహ్మదేవుని; అడగికొని = అడిగి; పడసిన్ = పొందిన; పసిడి = బంగారు; తెరల = మరుగు; వలువల = బట్టలవంటి; బెడంగునన్ = కఠినమైనవి; తోరంబులు = బలమైనవి; అగు = ఐన; ప్రాకారంబులును = ప్రహారీగోడలు; ప్రాకార = ప్రహారీలకు; కాంచన = బంగారము; అంచిత = తాపడముచేసిన; యుద్ధ = యుద్ధమునకు; సన్నద్ధ = సిద్ధమైన; మహాఖర్వ = అధికసంఖ్యలోగల; గంధర్వ = గంధర్వుల; వాహినీ = సేనలచే; పాలకంబులు = కాపాలాకాయబడెడివి; అగు = అయిన; మరకత = మరకతపు; అట్టాలకంబులును = కోటగోడలు; అట్టాలక = కోటగోడలంత; ఉత్తుంగ = ఎత్తైన; వజ్ర = వజ్రములు; మయ = పొదిగిన; స్తంభ = స్తంభములపైకి; ఉదంచనంబులును = ఎత్తబడినవి; పరభట = శత్రువుల; ప్రాణ = ప్రాణములను; వంచనంబులు = తీసెడివి; సమ = మిక్కిలి; ఉదంచనములు = ఎత్తబడినవి; అగు = అయిన; దంచనంబులును = శతఘ్నులు; దంచనంబుల = శతఘ్నుల; తుదలు = చివర్లు; రథంబుల = రథములయొక్క; ఇరుసులన్ = ఇరుసులను; ఒరసికొనన్ = రాసుకొనుచున్న; కోట = కోటకు; ఈవలి = ఇవతలివైపు; ఆవలి = ఆవతలివైపు; తివియని = ఆరిపోని; దివియల = దీపముల; కరణిన్ = వలె; రుచిరముల్ = కాంతివంతములు; అగుచున్ = అగుచు; పచరించు = తిరిగెడి; అహిమకర = సూర్య; హిమకర = చంద్ర; మండలంబులును = మండలములు; హిమకర = చంద్ర; మండలంబున్ = మండలమును; ఇద్దంపుటద్దంబు = నిగ్గుటద్దము; అని = అని; మూగి = చేరి; తొంగిచూచుచున్ = తొంగిచూస్తూ; అలిఫలకంబులన్ = నుదిటి; కులకములుగొను = గుంపుగూడెడి; అలకములన్ = ముంగురలను; తరపి = సరిదిద్దుకొని; తిలకములన్ = బొట్టులను; తెఱంగుపఱచుకొను = సరిచేసికొనెడి; సమయములన్ = సమయములందు; వెనుకన్ = వెనకపక్క; ఒదిగి = పక్కకువంగి; కదిసి = చేరి; ముకురంబులన్ = అద్దములలో; ప్రతిఫలితులు = ప్రతిబింబిచుచున్నవారు; ఐన = అయిన; పతులు = భర్తలు; ఇతర = ఇతర; సతుల = భార్యలతో (స్త్రీలతో); రతుల్ = వలపుల; కిన్ = కు; అనుమతులు = అంగీకరించువారు; అని = అని; కనుకనిన్ = సంభ్రమించి; మరలి = మళ్ళా; నీడ = ప్రతిబింబములు; తలంగినన్ = మాసిపోగా; కలంగి = కలతచెంది; చని = వెళ్ళి; కాంతులు = భర్తలు; పొలయన్ = కలియుటకై; అలయు = ఎదురుచూచెడి; ముగుదల = ముగ్ధల, సుందరీమణుల; కున్ = కు; ఏకాంతంబులు = ఏకాంతమునకు వీలైనవి; ఐ = అయ్యి; గగన = ఆకాశముతో; సమ = సమానమైన; ఉత్సేధంబులు = ఎత్తైనవి; ఐన = అయిన; రాజసౌధంబులును = అంతఃపురమేడలు; సౌధంబులన్ = మేడల; సీమల = డాబాలపైన; ముత్తియంపు = ముత్యాల; సరుల = హారముల; తోడి = తోటి; నిబ్బరపు = పెద్దపెద్ద; గుబ్బ = గుండ్రని; చన్నుల = స్తనముల; చెన్నులన్ = అందముల; ప్రక్కలన్ = పక్కనే; చుక్కల = తారకల; పదవులు = మండలములు; ఉండన్ = ఉండునట్లు; మండిత = అలంకరింపబడిన; సౌధ = మేడల; శిఖరంబుల్ = శిఖరాల; కున్ = కు; శృంగారంబులు = ఆభరణములు; అయిన = ఐన; భృంగారంబులును = బంగారుకలశములు; భృంగార = బంగారపు; శయన = పాన్పులు; జాల = కిటికీలు; డోలిక = ఊయలలు; ఆనిశ్రేణిక = మెట్లవరుసలు; ఆది = మున్నగు; విశేష = మిక్కిలి; రమ్యంబులు = మనోహరములు; అయిన = ఐనట్టి; హర్మ్యంబులును = మేడలు; హర్మ్య = మేడల; కనక = బంగారు; గవాక్ష = కిటికీల; రంధ్ర = కన్నములనుండి; నిర్గత = వెలువడెడి; కర్పూర = కర్పూరము; కుంకుమ = కుంకుమపువ్వు; అగరు = అగరులయొక్క; ధూప = సువాసనల; ధూమంబులును = పొగలు; ధూమంబులు = పొగలను; జీమూత = మేఘముల; స్తోమంబులు = సమూహములు; అని = అని; ప్రేమంబులు = ప్రేమలు; ఉబ్బ = పెరిగిపోగా; గొబ్బున = శ్రీఘ్రముగ; డబ్బాటు = అనుకోకుండగ; పబ్బంబులు = ఉత్సవములు; అబ్బెను = కలిగినవి; అని = అని; మరులుగొని = మురిసిపోయి; పురుల = పింఛముల; వన్నియల = రంగుల; సిరులు = ఐశ్వర్యములు; సరులుగొనంగుటన్ = వర్ధిల్లుటవలన; విటపములన్ = చెట్లపై; తటపెట = తపతప; నటించుచున్ = నాట్యములుచేయుచు; పలుకులు = కేకలు; విరిసి = విరిసి; కికురుపొడుచు = వంచించెడి; వలఱేని = మన్మథుని; మఱుపు = శృంగారపు; చదువుల = చదువులయొక్క; టీకలు = అర్థములు; అనన్ = అన్నట్లుగా; కేకలు = కేకలు; ఇడు = పెట్టెడి; నెమిళ్ళును = నెమలులు; నెమిళ్ళ = నెమలులయొక్క; పురులన్ = పింఛములను; నారలున్ = అల్లెతాళ్లుగను; ఆరులన్ = అరుపులను, కేకలను; కురతనంపు = గట్టి; విండ్ల = ధనుస్సుల యొక్క; నినదములను = టంకారములు; అను = అనెడి; తలంపులన్ = భావములతో; తోకలు = తోకలు; జడిసి = చలింపించి; వీకలు = పరాక్రమములు; మెఱసి = అతిశయించి; మూకలుగొని = గుంపులుగొని; దివి = ఆకాశమున; కిన్ = కి; ఎగిరి = ఎగిరి; రవి = సూర్యుని; కిన్ = కి; గవిసిన = చేరిన; రాహువు = రాహువు; క్రియన్ = వలె; దివిన్ = ఆకాశమున; తడంబడు = చలించెడి; పడగలును = జండాలు; పడగలును = జండాలు; గొడుగులునున్ = గొడుగులు; తమ = వారల; కున్ = కు; ఆలంబుల్ = యుద్ధముల; కున్ = కు; అడియాలంబులుగన్ = చిహ్నములుగ; తోరంబులు = బలమైనవి; ఐన = అయిన; సారంబులన్ = చేవగల; బీరంబులు = పరాక్రమములతో; మెఱసి = విజృంభించి; బెబ్బులుల = పెద్దపులుల; గబ్బునన్ = వలె; కరుల = ఏనుగుల; సిరులన్ = ఐశ్వర్యమువలె; సింగంబుల = సింహముల; భంగులన్ = వలె; శరభంబుల = శరభమృగముల; రభసంబులన్ = గొడవలవలె; ధూమకేతువుల = తోకచుక్కల; రీతులన్ = వలె; వైరిన్ = శత్రువునకు; చీరికింగొనక = లెక్కజేయక; శంకలు = సందేహములు; ఉడిగి = విడిచిపెట్టి; ఱంకెలు = గట్టికేకలు; ఇడుచున్ = వేస్తూ; లంకెలు = గుంపుకూడినవారు; ఐ = అయ్యి; లెక్కకుమిక్కిలి = అత్యధికముగ; అగుచున్ = అగుచు; రక్కసులన్ = రాక్షసుల; చక్కటి = చక్కనైన; ఎక్కటికయ్యముల = ద్వంద్వయుద్ధములందు; డయ్యములు = భయములు; ఎఱుగన్ = తెలియకుండ; తిరుగు = విహరించెడి; వీర = వీరులైన; భట = సైనికుల; కదంబులును = సమూహములును; కదంబ = మిళితములైన; కరవాల = కత్తులు; శూల = బల్లెములు; ఆదులన్ = మున్నగువాని; మెఱుంగులు = తళతళలు; మెఱపుల = మెరుపుల; తెఱంగులన్ = వలె; దిశయన్ = దిక్కుల; చెఱంగుల్ = అంచులవరకు; తుఱంగలింపన్ = వ్యాపించగా; నేమి = రథములఇరుసుల; నినదంబులు = శబ్దములు; తరములు = తముకుల; ఉఱుములుగన్ = ఉరుములుగా; అడ = దట్టమైన; మొగిళ్ళు = మేఘములవలె; పెల్లునన్ = పెళ్ళుమని; ప్రవర్షిత = అధికముగవర్షించెడి; రథిక = రథములోనిశూరుల; మనోరథంబులు = కోరికలుగలవి; అగు = అయిన; రథంబుల = రథముల; గములును = సమూహములు; గములుగొని = గుంపులువారి; గమన = పరిగెత్తెడి; వేగంబు = వేగముల; వలన = వలన; హరి = సూర్యుని; హరులన్ = గుఱ్ఱములను; నగి = వెక్కిరించి; గాలిన్ = వాయువును; జాలింబడన్ = దీనుడగునట్లు; గేలికొని = వేళాకోళముచేసి; ఘనంబులు = గొప్పవి; అగు = అయిన; మనంబులన్ = మనస్సు ల (వేగమును); తెగడి = ఓడించి; నెగడు = అతిశయించెడి; సురంగంబులు = మంచివడిగలవి; అగు = అయిన; తురంగంబులును = గుఱ్ఱములు; రంగత్ = సొగసైన; ఉత్తుంగ = ఎత్తైన; విశద = మిక్కిలి; మద = మదము; కల = కలిగినట్టి; కరటి = ఏనుగుల; కటతట = కణతలందు; జనిత = పుట్టిన; మదసలిల = మదజల; కణ = బిందువుల; గణ = సముదాయములుగ; విగళిత = జారునవి; దశశతనయన = దేవేంద్రుని; భుజసరళిన్ = భుజబలముతో; మిళిత = కలిసిన; లలిత = మనోజ్ఞమైన; నిఖిల = సమస్తమైన; దిగధిపతి = దిక్పాలకుల; శుభకర = శుభకరములైన; కర = చేతుల; కనక = బంగారు; కటక = కంకణములందు; ఘటిత = పొదగిన; మణి = మణుల; సముదయ = సమూహముల; సముదిత = రాలిన; రేణు = ధూళికణముల; వర్గ = సమూహములచే; దుర్గమంబులు = దాటరానివి; అయిన = ఐనట్టి; నిర్వక్ర = వంకరలులేని; మార్గంబులును = దారులు; మార్గస్థల = మార్గములందలిచోటు; ఉపరిగతా = పైన; ఆగత = పడిన; శతశతాయుత = వందవందలఆయతముల; అనేక = అనేకమైన; గణనాతీత = లెక్కింపరాని; రోహణ = రోహణ యనెడి; అచల = పర్వత; తట = చరియలందు; విరాజమానంబులు = విరాజిల్లెడివి; అగు = అయిన; విమానంబులును = విమానములు; విమాన = విమానములందు; విహరమాణ = విహరించుచున్న; సుందర = అందమైన; సుందరీ = స్త్రీల; సందోహ = సమూహములచే; సంవాదిత = చక్కగావాయింపబడెడి; భూరి = అతిపెద్ద; భేరీ = రాండోళ్ళు; వీణా = వీణలు; పణవ = తప్పెట్లు; మృదంగ = మృదంగములు; కాహళ = బాకాలు; శంఖ = శంఖములు; ఆది = మున్నగు; వాదన = వాయిద్యముల; అనూన = సాటిలేని; గాన = పాటలుపాడుట; సాహిత్య = కవితలుపలుకుట; నృత్య = నాట్యముల; విశేషంబులన్ = గొప్పదనములతో; విశేష = అధికమైన; రత్న = రత్నములు; సంఘటిత = పొదగబడి; శృంగార = అలంకరింపబడిన; శృంగాటక = గద్దెల; వాటికా = సభామండప; దేహ = గృహములందు; దేహళీ = గుమ్మములందు; ప్రదీపంబులును = వెలగింపబడిన; దీపాయమాన = దీపములుచే; మానిత = అలంకరింపబడిన; సభామండప = సభామండపములందు; ఖచిత = పొదగిన; రుచిర = కాంతివంతములైన; చింతారత్నంబులునున్ = చింతామణులును; కలిగి = కలిగి; రత్నాకరంబునున్ = సముద్రమును; పోలెన్ = వలె; అనిమిష = చేపలతో, దేవతలతో; కౌశిక = ముంగిసలు; వాహినీ = ప్రవాహములతో, ఆకాశగంగతో; విశ్రుతంబు = ప్రసిద్ధమైనది; అయి = అయ్యి; శ్రుతి = వేద; వాక్యంబులనున్ = వాక్కులను; పోలెన్ = వలె; అకల్మష = నిర్మలమైన, పవిత్రమైన; సువర్ణ = బంగారముతో, అక్షరములతో; ప్రభూతంబు = పెంపొందినది, నిండినది; అయి = అయ్యి; భూతపతి = పరమశివుని; కంఠంబునున్ = కంఠము; పోలెన్ = వలె; భోగి = సర్ప, సంపన్నులైన; రాజ = రాజులచే, ప్రభువులచే; కాంతంబు = ప్రకాశించుతున్నది, ఒప్పుచున్నది; అయి = అయ్యి; కాంత = స్త్రీల; కుచంబునున్ = స్తనముల; పోలెన్ = వలె; సువృతంబు = గుండ్రనిది, మంచిచరిత్రగలది; అయి = అయ్యి; వృత్తజాతంబునున్ = పద్యముల సమూహముల, జీవనప్రదము; పోలెన్ = వలె; సదా = ఎల్లప్పుడు; గురు = గురువులతోను, బృహస్పతితోను; లఘు = లఘువులతోను, నీతి; నియమ = యతులతోను, నియమములతోను; అభిరామంబు = ఒప్పుచున్నది, కూడినది; అయి = అయ్యి; రామచంద్రుని = రామచంద్రుని యొక్క; తేజంబునున్ = తేజస్సు; పోలెన్ = వలె; ఖర = ఖరుడు, కఠినమైన; దూషణ = దూషణుడు, నిందించుటలు; ఆది = మున్నగు; దోషాచరా = రాక్షసులకు, దోషములు ఆచరించువారికి; అనుపలబ్ధంబు = చేరశక్యముకానిది, పొందశక్యముకానిది; అయి = అయ్యి; లబ్ధవర్ణు = పండితుని, మంచి రాగములు కలదాని; చరిత్రంబునున్ = చరిత్ర; పోలెన్ = వలె; విమల = స్వచ్ఛమైన, నిర్మలమైన; అంతరంగ = హృదయములకు, మనస్కులకు; ద్యోతమానంబు = స్ఫురించునది, ప్రకాశించునది; మానధనుని = అభిమానవంతుని; నడవడియున్ = చరితము; పోలెన్ = వలె; సన్మార్గ = మంచిమార్గము, ఆకాశమార్గమున; భాతి = వలె, చుక్కలతో; సుందరంబు = చక్కనైనది, అందమైనది; అయి = ఐ; సుందర = అందమైన; ఉద్యానంబునున్ = తోట; పోలెన్ = వలె; రంభా = అరటిచెట్లతో, రంభతో; అంచిత = కూడిన; అశోక = అశోకవృక్షములు, ఆనందముగానున్న; పున్నాగంబు = సురపొన్నచెట్లుగలది, పురుషశ్రేష్ఠులుగలది; అయి = ఐ; పున్నాగంబునున్ = సురపొన్నచెట్లు; పోలెన్ = వలె; సురభి = సువాసనలతోకూడిన, కామధేనువు; సుమనో = పుష్పములుతో, దేవతలతో; విశేషంబు = అతిశయించినది, నిండినది; అయి = ఐ; శేష = ఆదిశేష; అహి = సర్పముయొక్క; మస్తకంబునున్ = శిరస్సు; పోలెన్ = వలె; ఉన్నత = మహోన్నతమైన, విశేషమైన; క్షమా = భూమండలము, క్షమించెడిగుణముతో; విశారదంబు = కలది, ఒప్పుచున్నది; అయి = ఐ; శారద = శరత్కాలము; సముదయంబునున్ = విరిసిన; పోలెన్ = విధముగ; ధవళ = తెల్లని; జీమూత = మేఘములతో, కొండలతో; ప్రకాశితంబు = విరాజిల్లెడిది, ప్రకాశించునది; అయి = ఐ; సితేతరాజిన = కృష్ణాజిన, ముగింపులేని జయము; దానంబునున్ = దానము, వరములు; పోలెన్ = వలె; సరస = మంచి, సరసురాలైన; తిలోత్తమంబు = నవ్వులతోచక్కనిది, తిలోత్తమతోకూడినది; అయి = ఐ; ఉత్తమపురుష = ఉత్తముని, ఉత్తమపురుషలోని; వచనంబునున్ = వాక్కులు, మాటలు; పోలెన్ = వలె; అనేక = అనేకమైన, అఖండమైన; సుధారస = తీయదనమును, అమృతమును; ప్రవర్షంబు = మిక్కిలిగ నిచ్చెడివి, వర్షించెడివి; ఐ = అయ్యి; వర్ష = వర్షము, వర్షఋతువు; ఆదియునున్ = ప్రారంభమువలె; ఉల్లసత్ = ఉల్లాసవంతమైన, ప్రకాశించెడి; ఇంద్రగోపంబు = ఆరుద్రపురుగులుగలది, ఇంద్రునిచే పాలింపబడెడిది; అయి = ఐ; గోపతి = నందీశ్వరుని; మూపురంబునున్ = మూపురము; పోలెన్ = వలె; విచక్షురార్యా = శివపార్వతులతో, దేవతోత్తములతో; అలంకృతంబు = అలంకరింపబడినది, విరాజిల్లుచున్నది; ఐ = అయ్యి; కృతార్థంబు = తగిన పేరు గలది, ధన్యమైనది; అయిన = ఐనట్టి; అమరావతీ = అమరావతి యనెడి; నామ = పేరుగల; నగరంబున్ = పట్టణమును; చేరన్ = దగ్గరకు; చని = వెళ్ళి; కోట = కోటకు; చుట్టునుంబట్టుగలుగన్ = చుట్టుముట్టుటకు; బలంబులన్ = సైన్యములను; చలంబునన్ = శ్రీఘ్రతతో; విడియన్ = విడిదిచేయుటకు; పంచి = అనుజ్ఞయిచ్చి; పొంచి = దాగియుండి; మార్గంబులు = దార్లు; ఎల్లన్ = అన్నిటిని; అరికట్టుకొని = అడ్డగించుచు; ఏమఱక = ఏమరుపాటులేక; ఉండెను = ఉండెను; అంత = అంతట.
భావము:- బలిచక్రవర్తి మిక్కిలి విశాలమైన దేవతల పట్టణం అమరావతీ నగరం దరిచేరి వేగంగా ముందుకు సాగాడు మొదట పెద్ద పెద్ద తోటలు కనిపించాయి. ఆ తోటలలోని చెట్లు ఎల్లప్పుడూ అందంగా పొటమరించే చిగురుటాకులతో, రెమ్మలతో, మొగ్గలతో సగంవిచ్చిన విరులతో, నిండుగా విరిసిన పూలగుత్తులతో, పూపిందెలతో, లేతకాయలతో, దోరకాయలతో, పండ్లగెలలతో నిండి బరువెక్కి వంగి ఉన్నాయి.
దట్టమైన ఆ తోటలలో తుమ్మెదల గుంపులు జంటలు వదలకుండా సొగసైన క్రొత్త పూలలో నిండా ఉన్న మకరందాన్ని కొసరి కొసరి త్రాగి బలిసి కైపెక్కి జుంజుమ్మని సంతోషంతో విహరిస్తూ ఉన్నాయి. కోయిల గుంపులు జంట బాయక కలిసి మెలిసి గున్నమామిడి చెట్లకొమ్మలలో ముసరి సొంపుగా చిగురుటాకులు మెక్కి ఉత్సాహంతో గానాలు చేస్తున్నాయి. చిలుకల గుంపులు మత్తెక్కి త్వరపడుతూ పోరాడుతూ చెలరేగి నేర్పుతో తియ్యని పండ్లు తిని కలకల ధ్వనులు సలుపుతున్నాయి. పావురాలు చిలుకలను మించి ఆకాశానికి ఎగురుతూ ఆడపావురాలను చెంతకు పిలుస్తూ అటూ ఇటూ పోనీయకుండా అడ్డగిస్తూ తమ నెలవులపై వ్రాలి కువకువ లాడుతున్నాయి.
రాయంచలు చెలువైన సరస్సులవద్ద ఉత్సాహంగా పెంటిహంసలతో కలిసి తమ వాడిముక్కులతో లేతతామరతూండ్లు చీల్చి తిని సంతోషంగా సవ్వడి చేస్తున్నాయి. అందమైన ఆ సరస్సులు హంసల కాంతికంటే అధికంగా మిలమిల మెరుస్తూ లక్ష్మీమందిరాలవంటి బంగారు సరోజాలతో విరాజిల్లుతున్నాయి.ఆసరస్సుల అలలలో తడిసిపోయి వడ వడ వణుకుతూ అల్లిబిల్లిగా అల్లుకుని నేల వ్రాలిన దట్టమైన తీగల సందులలో జొరబడి ఇంపైన పూలవాసనలతో బరువెక్కి లోపలకు దూరలేక చల్లగాలులు చతికిలపడుతున్నాయి.ఆ గాలులతో కలిసి పైకెగిరిన పుప్పొడులు ఆకాశంలో నిండి రంగురంగుల మేలుకట్టు చాందినీలను సృష్టిస్తున్నాయి.
పుప్పొడి రంగులతో కలసిన కాలువల గట్లపై ఇచ్చవచ్చినట్లు పచ్చిక గుబురులు మేస్తూ మైమరచి నెమరువేస్తూ తమ పెద్ద పొదుగులు కదలిస్తూ కామధేనువులు నడచివస్తున్నాయి. వాటి దూడలు వాడవాడలలో చెంగుచెంగున దూకి ఆడుకుంటూ తల్లుల వెంట వెడుతున్నాయి. కామధేనువులు దూడలతో కూడి ఇండ్లు వాకిండ్లు చేరి పౌరులు కోరినంత పాలు కురిపిస్తున్నాయి. కోరినవారి కోరికలు తీర్చే కల్పవృక్షాలు ఆ కామధేనువులకు నిలువనీడలు ఇస్తున్నాయి. ఆ కల్పవృక్షాల చిగుళ్ళనూ పూలగుత్తులనూ కోసి మదపుటేనుగులు ఆడఏనుగులకు ప్రేమతో ఇచ్చి సంతోషింపచేస్తున్నాయి. ఆమదపుటేనుగులు క్రీడాపర్వతాల సొగసుతో ఒప్పారుతున్నాయి. అవి పడచు పడతులకు నడకలు నేర్పు గురువులై మురిపెంగా నడుస్తున్నాయి. ఆ ఏనుగుల శరీరాలు రాచుకోవడం వల్ల కరకుతనంపోయి నున్నబడుతున్న మకరతోరణ స్తంభాలు కన్నులవిందు చేస్తున్నాయి.
మకరతోరణాల స్తంభాలవద్ద రంభ మొదలైన అప్సరసలు నిలబడి ఉన్నారు. వారు మన్మథుని ఒరలోనుండి తీసిన వాడికత్తులవలె తళతళ మెరుస్తున్నారు. నిలకడగల మెరుపు తీగలవలె ఉన్నారు. కాళ్ళు చేతులు మొదలైన అవయవాలు కలిగిన నెలవంకల వలె ఉన్నారు. రూపుదాల్చిన మోహినీ విద్యలవలె చూపులకు హాయి కలిగించుతూ శృంగార రహస్యాలు తెలుసుకోవడంలో పేరుపొందిన వారై విమానాలపై స్వర్గలోకానికి వచ్చె పుణ్యాత్ములకు త్వరగా ఎదురుపోయి సగౌరవంగా తోడ్కొనిపోతున్నారు.
ఆ పట్టణానికి చుట్టూ అందమైన అగడ్తలు ఉన్నాయి. ఆ అగడ్తల నీటిలో కలహంసలూ, రాజహంసలూ, చక్రవాకాలు, బెగ్గురు పక్షులూ విహరిస్తూ ఉన్నాయి అందలి కలువలలోనూ కమలాలలోనూ తుమ్మెదలు సంతోషంతో సంచరిస్తుంటాయి. ఆ అగడ్తలు తరంగాలు లేని గంగానది ఆకాశానికి పొంగినట్లు వెరగు కలిగిస్తుంటాయి. దేవకన్యలు గుంపులు గుంపులుగా చేరి వాటిలోని తేటనీటిలో అందంగా హయిగా జలకాలాడతూ ఉంటారు.
ఆ పట్టణం ముంగలిలో భద్రమైన బంగారు తలుపులుగల పెద్ద గోపురాలున్నాయి ఆ గోపురద్వారాల గడపలను దేవ వేశ్యలు పూజిస్తుంటారు. ఆద్వారాల ప్రక్కన అరుగులపైన రత్నాల కాంతులు వెదజల్లె ఇంద్రనీలాల స్తంభాలున్నాయి. ఆ నాలుగు ద్వారాలకూ పద్మరాగాల మాలలు వ్రేలాడుతున్నాయి. ఆ ద్వారాల దగ్గర ఉన్న చావిళ్ళలో పరాక్రమవంతులైన ద్వారపాలకులు ఆయుధాలు ధరించి మెలుకువతో కాపలా కాస్తున్నారు. వారు దేవదానవుల యుద్ధాల కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అచ్చటి ఎత్తైన మెట్ల వరుసలు వీరరస సముద్రపు చెలియలికట్టలవంటి అచ్చమైన పాలరాళ్ళతో కట్టబడిఉన్నాయి. అచ్చటి తోటలు అత్యంత శోభాయమానములై వజ్రాలతోనూ వెండితోనూ నిర్మింపబడిఉన్నాయి ఆ కోటల పైభాగాలు నిండుచంద్రుని కిరణాలు వెల్లివిరిసే తెల్లని అద్దాలవలె ఉన్నాయి. వాటి కాంతులు చుక్కలను ధిక్కరిస్తుంటాయి. ఆ పట్టణలక్ష్మి ప్రాయంతో నిండిన యువతివలె మేఘాలను చూస్తూ బ్రహ్మను ప్రార్థించి సంపాదించిన బంగారు పరదాలవలె పెద్ద పెద్ద వెండి ప్రాకారాలు ప్రకాశవంతములై ఉన్నాయి. ఆప్రాకారాలపై మరకతమణులతో నిర్మంచిన బురుజులు ఉన్నాయి. కోట్లకొలది గంధర్వ సైనికులు యుద్ధసన్నద్ధులై వాటిని కాపాడుతుంటారు. ఆ బురుజులపై ఎత్తైన వజ్రాల స్తంబాలు ఉన్నాయి. వాటిమీద శత్రువీరుల ప్రాణాలు తీసే శతఘ్నులు అమర్చబడి ఉన్నాయి. వాటికి రెండువైపులా రథాల ఇరుసులు రాచుకుంటూ ఆరిపోని ద్వీపాలవలే సూర్య చంద్ర మండలాలు వెలుగుతూ ఉంటాయి.
ఆ పట్టణంలోని మేడలు ఆకాశాన్ని తాకుతుంటాయి. అందలి సుందరీమణులు చంద్రబింబాన్ని నిగ్గుటద్దంగా భావించి తొంగిచూస్తూ తమ నొసటిపైని ముంగురులను సరిదిద్దుకొని తిలకాలను అలంకరించుకుంటారు. అప్పుడు వారి వెనుకవైపుగా వచ్చిన వారి ప్రియుల ప్రతిబింబాలు కనిపించగానే తమ భర్తలు ఇతర స్త్రీలను వలచి వారికి వశుల అయ్యారని భ్రమించి తత్తరపాటుతో వెనుతిరిగి అంతలో ప్రతిబింబాలు మాసిపోగానే ఆ స్త్రీలు ఏకాంతంగా తమ ప్రియుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ముత్యాల హారాలతో కూడిన ఆముద్దుగుమ్మల గుబ్బచన్నుల సొగసుతో ప్రక్కల చుక్కలు మెరుస్తుండగా ఆ మేడల శిఖరాలను సింగారిస్తూ బంగారు కలశాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ మేడల లోపల బంగారుమయములైన పరుపులూ కిటికీలు ఉయ్యాలలూ మెట్లూ మొదలైనవి ఎంతో మనోహరంగా విరాజిల్లుతున్నాయి.
ఆ మేడల బంగారు కిటికీల సందుల గుండా కర్పూరమూ కుంకుమపువ్వు సాంబ్రాణి కలసిన సువాసనల పొగలు వెలువడుతుంటాయి. ఆ పొగలను చూసి మేఘాలు అని భ్రమపడిన నెమళ్ళు అనుకోకుండా తమకు పండగ వచ్చిందని ఆనందంతో తమ రంగురంగుల పింఛాలు విప్పి చెట్ల కొమ్మలపై నాట్యాలు చేస్తుంటాయి. అవి మన్మథుని శృంగార శాస్త్రాలకు, పదాలకు టీక వివరిస్తున్నట్లు, అర్థాలు చెప్తున్నాయా అన్నట్లు కేకలు వేస్తుంటాయి. అప్పుడు నెమళ్ళ పింఛాలను అల్లెత్రాళ్ళుగానూ వాటి కేకలను ధనుష్టంకారాలుగాను భావించి వెంటనే సూర్యుని పైకి ఉరికే రాహువు వలె జెండాలు ఆకాశానికి ఎగురుతున్నాయి. జెండాలు గొడుగులు తమ యుద్ధలక్షణాలుగా అవక్ర పరాక్రమంతో విజృంభించి పెద్దపులులవలె, ఏనుగులవలె, సింహాలవలె, శరభాలవలె, తోకచుక్కలవలె శత్రువులను లెక్కచేయకుండా కేకలు వేస్తూ గుంపులు గుంపులుగా సైనిక సమూహాలు రాక్షసులతో ద్వంద్వయుద్ధాలు చేయడంకోసం దుముకుతున్నారు.
కత్తులూ శూలాలూ మొదలైన ఆయుధాల తళతళలు మెరుపువలె దిక్కుల అంచులవరకు వ్యాపిస్తున్నాయి. చక్రాల ధ్వనులు ఉరుములవలె ధ్వనిస్తున్నాయి. వీరుల శరవర్షాలతో మేఘాలవలె ఒప్పుతున్న రథాలు రాజిల్లుతున్నాయి. ఆ రథాలకు సూర్యుని గుఱ్ఱాలనూ వాయువును మనస్సును మీరిన వేగంతో పరుగెత్తగల గుఱ్ఱాలు పూన్చబడి ఉన్నాయి. ఆ పట్టణంలో ఎత్తైన తెల్లని మదపుటేనుగులు ఉన్నాయి. వాటి చెక్కిళ్ళమీద మదజలకణాల సమూహాలు సహస్ర నయనుడైన దేవేంద్రుని ఔదార్య విశేషాలను లెక్కిస్తున్నట్లు ఉంటాయి. ఇంద్రుని సందర్శించడానికి గుమికూడిన సమస్త దిక్పాలకుల శుభంకరములైన బంగారుకంకణాల నుండి రాలిన ధూళికణాలతో ఆ పట్టణంలోని వీధులన్నీ నిండి ఉన్నాయి. ఆ మార్గాలకు పైభాగాలలో లక

తెభా-8-448-క.
మారు నగవులకును గను
మూరు కాలంబు కతన ముదియరు ఖలులన్
డారు పుణ్యజనంబుల
బారు సురరాజ వీటి ప్రమదాజనముల్
.
టీక:- మాయరు = చెరగనివ్వరు; నగవుల్ = నవ్వుల; కునున్ = కు; కనుమూయరు = మరణించరు, కన్నులార్పరు; కాలంబు = కాలము యొక్క; కతనన్ = ప్రభావమువలన; ముదియరు = ముసలివారుకారు; ఖలులన్ = దుష్టులను; డాయరు = దరిచేరరు; పుణ్యజనంబులన్ = పుణ్యవంతులను; పాయరు = విడువరు; సురరాజ = దేవేంద్రుని; వీటి = పట్టణపు; ప్రమదా = స్త్రీ; జనముల్ = జనములు.
భావము:- దేవేంద్రుడి పట్టణంలోని స్త్రీలు ఎల్లప్పుడూ నవ యౌవ్వన యువతులుగానే ఉంటారు. వారికి చిరునవ్వులతో అలసట, వడలిపోవడం లాంటివి ఉండవు. కన్నులార్పడం ఉండదు (అందుకే దేవతలను అనిమిషులు అంటారు). కాల ప్రభావానికి లొంగి ముసలివారు కారు. దుష్టులను దరిచేరనీయరు. పుణ్యాత్ములను ఎడబాయరు.