పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/విష్ణుని అనుగ్రహవచనము

విష్ణుని అనుగ్రహవచనము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-170-శా.
" రీతిం జతురాననాది నుతుఁడై యేపార జీమూత గం
భీరంబైన రవంబునం బలికె సంప్రీతాత్ముఁడై యీశ్వరుం
డా రోమాంచిత కాయులన్ నవవిముక్తాపాయులం బ్రేయులం
బ్రాబ్ధోగ్ర మహార్ణవోన్మథన వాంఛానల్పులన్ వేల్పులన్.

టీక:- ఈ = ఈ; రీతిన్ = విధముగ; చతురానన = చతుర్ముఖబ్రహ్మ {చతురానననుడు - చతుర్ (నాలుగు, 4) ఆనననుడు (ముఖములు గలవాడు), బ్రహ్మ}; ఆది = మొదలగువారిచే; నుతుడు = స్తుతింపబడినవాడు; ఐ = అయ్యి; ఏపారన్ = అతిశయించగా; జీమూత = మేఘమువంటి; గంభీరంబు = గంభీరము; ఐన = అయిన; రవంబునన్ = స్వరముతో; పలికెన్ = అనెను; సంప్రీత = సంతోషించిన; ఆత్ముడు = మనసు గలవాడు; ఐ = అయ్యి; ఈశ్వరుండు = భగవంతుడు; ఆ = ఆ; రోమాంచిత = పులకించిన; కాయులన్ = దేహము గలవారిని; నవ = అప్పుడే; విముక్తా = వదలిన; అపాయులన్ = కష్టములు గలవారిని; ప్రేయులన్ = ప్రేమపాత్రులను; ప్రారబ్ధ = ప్రారబ్ధము యనెడి; ఉగ్ర = భయంకరమైన; మహా = గొప్ప; ఆర్ణవ = సముద్రమును; ఉన్మథన = చిలికెడి; వాంఛ = కోరెడి; అనల్పులన్ = గొప్పవారిని; వేల్పులన్ = దేవతలను.
భావము:- అలా బ్రహ్మదేవ ప్రముఖులు ప్రార్థించగా భగవంతుడు సంతోషించాడు. దేవతల దేహాలు నిలువెల్ల పులకించాయి. అప్పుడే తమ కష్టాలనుండి గట్టెక్కినట్లు తలచారు. భయంకరమైన ప్రారబ్ధమనే సముద్రాన్ని మథించడానికి ఉత్సాహపడ్డారు. అప్పుడు భగవంతుడు విష్ణుమూర్తి మేఘ గంభీరమైన కంఠస్వరంతో ఇలా అన్నాడు.

తెభా-8-171-క.
"ఓ! లువ! యో! సురేశ్వర!
యో! నిటలతటాక్ష! యో! సురోత్తములారా!
దావులతోడ నిప్పుడు
మానుగ బోరామి గలిగి నుటే యొప్పున్.

టీక:- ఓ = ఓ; నలువ = బ్రహ్మదేవుడా {నలువ - నలు (నాలుగు) వా (మోములుగలవాడు), బ్రహ్మ}; ఓ = ఓ; సురేశ్వర = ఇంద్ర {సురేశ్వర - సురలకు ఈశ్వరుడు, ఇంద్రుడు}; ఓ = ఓ; నిటలతాక్ష = పరమశివ {నిటలతటాక్షుడు - నిటలతట (నుదట భాగమున) అక్షుడు (కన్ను గలవాడు) శివుడు}; ఓ = ఓ; సుర = దేవతలలో; ఉత్తములారా = ఉత్తములు; దానవుల్ = రాక్షసుల; తోడన్ = తోటి; ఇప్పుడు = ఇప్పుడు; మానుగ = మనోజ్ఞముగ; పోరామి = స్నేహం; కలిగి = కలిగి; మనుటే = బతుకుటయే; ఒప్పున్ = సరియైనపని.
భావము:- “ఓ చతుర్ముఖ బ్రహ్మ దేవుడా! ఓ దేవతలకు ప్రభువు అయిన దేవేంద్రుడా! నుదుటి కన్నుగల ఓ త్రినేత్రుడా రుద్రుడా! ఓ దేవతాముఖ్యులారా! ప్రస్తుతం మీరు రాక్షసులతో మంచిగా ఉండి, స్నేహం చేసి జీవించడమే మంచిది.

తెభా-8-172-వ.
అది యెట్లంటి రేని.
టీక:- అది = అలా; ఎట్లు = ఎలా; అంటిరి = అనిన; ఏని = చో.
భావము:- అది ఎలాగంటే.

తెభా-8-173-క.
ప్పుడు దనకును సత్త్వము
చొప్పడు నందాఁక రిపులఁ జూచియుఁ దనమైఁ
ప్పికొని యుండవలయును
నొప్పుగ నహి మూషకమున కొదిఁగిన భంగిన్.

టీక:- ఎప్పుడు = ఎప్పుడైతే; తన = తన; కును = కు; సత్త్వము = బలము; చొప్పడున్ = సమకూరుతుందో; అంత = అప్పటి; దాక = వరకు; రిపులన్ = శత్రువులను; చూచియున్ = చూసినప్పటికిని; తన = తను; మైగప్పికొని = ఒదిగి {మైగప్పికొని - మేను దాచుకొని, ఒదిగి}; ఉండవలయును = ఉండవలెను; ఒప్పుగ = చక్కగా; అహి = పాము; మూషకమున్ = ఎలుక; కున్ = కోసము; ఒదిగిన = ముడుచుకొని యుండు; భంగిన్ = విధముగ.
భావము:- ఎలుకకోసం పాము పొంచి ఉండే విధంగా, బలం చేకూరేదాకా సమయంకోసం నిరీక్షిస్తూ శత్రువుల బారినుండి శరీరాన్ని దాచుకుని ఉండటం ఉత్తముల లక్షణం.

తెభా-8-174-క.
మృతోత్పాదన యత్నము
విల మతిం జేయు టొప్పు; వేల్పులు! వినుఁడీ
మృతంబుఁ ద్రావి జంతువు
మృతగతిన్ బ్రతుకుచుండు నాయుర్వృద్ధిన్.

టీక:- అమృత = అమృతమును; ఉత్పాదన = తయారుచేసెడి; యత్నమున్ = ప్రయత్నమును; విమల = నిర్మలమైన; మతిన్ = మనసులతో; చేయుట = చేయుట; ఒప్పు = మేలు; వేల్పులు = దేవతలు; వినుడీ = వినండి; అమృతంబున్ = అమృతమును; త్రావి = తాగినచో; జంతువుల్ = జీవులు; అమృత = మరణములేని; గతిన్ = విధముగ; బ్రతుకుచున్ = జీవించుచు; ఉండున్ = ఉండును; ఆయుః = ఆయుష్షు; వృద్ధిన్ = పెంపొందుటచేత.
భావము:- ఓ దేవతలారా! వినండి. మీరు అమృతాన్ని పుట్టించే ప్రయత్నం స్వచ్ఛమైన మనసులతో చేయటం మేలు. అమృతాన్ని త్రాగినవారికి ఆయుస్సు పెరుగుతుంది. మరణంలేని మనుగడ లభిస్తుంది.

తెభా-8-175-సీ.
పాలమున్నీటి లోల సర్వతృణలతౌ-
ధములు దెప్పించి చాల వైచి
మందరశైలంబు మంథానముగఁ జేసి-
నర వాసుకిఁ దరిత్రాడు జేసి
నా సహాయతచేత లి నందఱును మీరు-
రువుఁడు వేగ మతంద్రు లగుచు;
లము మీఁదయ్యెడు; హుళ దుఃఖంబులఁ-
డుదురు దైత్యులు పాపమతులు;

తెభా-8-175.1-ఆ.
లసటేమి లేక ఖిలార్థములుఁగల్గు;
విషధిలోన నొక్క విషము పుట్టుఁ;
లఁగి వెఱవ వలదు కామరోషంబులు
స్తుచయము నందు లదు చేయ."

టీక:- పాలమున్నీటి = పాలసముద్రము; లోపలన్ = అందు; సర్వ = అన్నిరకముల; తృణ = తృణములు {తృణములు - విత్తనమునాటక పండెడి గడ్డి చేమ తాడి కొబ్బరి మున్నగునవి}; లత = తీగలు; ఓషధములున్ = ఓషధులను {ఓషధి - పండుటతోడనే నశించునవి - వరి గోధుమ అరటి మున్నగునవి}; తెప్పించి = తెప్పించి; చాలన్ = విరివిగా; వైచి = వేసి; మందర = మందరము యనెడి; శైలంబున్ = పర్వతమును; మంథానము = కవ్వము; కాన్ = అగునట్లుగ; చేసి = చేసి; తనరన్ = అతిశయించి; వాసుకిన్ = వాసుకియనెడిసర్పమును; త్రాడు = తాడుగా; చేసి = చేసి; నా = నాయొక్క; సహాయత = సహాయము; చేతన్ = వలన; నలిన్ = తగినట్లుగ; అందఱునున్ = అందరుకలిసి; మీరు = మీరు; తరువుడు = చిలకండి; వేగము = వేగముగ; అతంద్రులు = సోమరితనము విడిచినవారు, కునుకు లేని వారు; అగుచున్ = అగుచు; ఫలము = ఫలితము; మీది = మీదే; అయ్యెడున్ = అగును; బహుళ = అనేకములైన; దుఃఖంబులన్ = కష్టములను; పడుదురు = చెందెదరు; దైత్యులు = రాక్షసులు {దైత్యులు - దితియొక్క సంతానము, రాక్షసులు}; పాపమతులు = పాపాత్ములు.
అలసట = ఆయాసము; ఏమి = ఏమాత్రము; లేక = లేకుండగ; అఖిల = సమస్తమైన; అర్థములన్ = సంపదలు; కల్గున్ = కలుగును; విషధి = సముద్రము {విషధి - విషము (నీటి)కి నిధి, సాగరము}; లోనన్ = అందు; ఒక్క = ఒక; విషము = గరళము; పుట్టున్ = జనించును; కలగి = కలతచెంది; వెఱవన్ = భయపడ; వలదు = వద్దు; కామ = ఇష్టము; రోషంబులు = కినుకలు; వస్తుచయమున్ = సంపదల; అందున్ = ఎడల; వలదు = వద్దు; చేయన్ = చేయుట.
భావము:- మీరందరూ పాలసముద్రంలో రకరకాల తృణధాన్యాలనూ, ఔషధాలనూ, మొక్కలనూ, తీగలనూ, విరివిగా తెప్పించి వేయండి. మందరపర్వతాన్ని కవ్వంగానూ, సర్పరాజు అయిన వాసుకిని కవ్వం త్రాడుగానూ చేసుకుని నా సహాయంతో పాలసముద్రాన్ని చిలకండి. అందువల్ల, మీకు ప్రయోజనం కలుగుతుంది. పాపత్ములైన రాక్షసులు అనేక కష్టాల పాలవుతారు. అన్ని సంపదలూ మీకు లభిస్తాయి. ఆ పాలకడలి నుండి ఒక విషం పుడుతుంది. అందుకు మీరు కలతచెంది భయపడరాదు. అలా చిలికేటప్పుడు, ఇంకా అనేక వస్తువులు పుడతాయి. వాటి పట్ల ఇష్టానిష్ఠాలు చూపరాదు,

తెభా-8-176-వ.
అని యాదేశించి.
టీక:- అని = అని; ఆదేశించి = ఆజ్ఞాపించి.
భావము:- అలా క్షీరసాగర మథనం చేయమని ఆజ్ఞాపించి.

తెభా-8-177-క.
అంతాది రహితుఁ డచ్యుతుఁ
డంర్ధానంబు నొందె; జ ఫాలాక్షుల్
సంతోషంబునఁ దమతమ
కాంతాలయములకుఁ జనిరి గౌరవ మొప్పన్.

టీక:- అంతాదిరహితుడు = విష్ణుమూర్తి {అంతాదిరహితుడు - అంతాది (ఆద్యంతములు) రహితుడు (లేనివాడు), విష్ణువు}; అచ్యుతుడు = విష్ణుమూర్తి {అచ్యుతుడు - భ్రంశమునొందని వాడు, విష్ణువు}; అంతర్ధానంబు = మాయమగుటను; ఒందెన్ = పొందెను; అజ = బ్రహ్మదేవుడు {అజుడు - పుట్టుకలేనివాడు, బ్రహ్మ}; ఫాలాక్షుల్ = శివుడు {ఫాలాక్షుడు - ఫాలమున (నుదుట) అక్షుడు (కన్ను గలవాడు), శివుడు}; సంతోషంబునన్ = సంతోషముతో; తమతమ = వారివారి; కాంతాలయముల్ = నివాసములు {కాంతాలయము - కాంత (భార్య) ఉండెడి ఆలయము (ఇల్లు), నివాసము}; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; గౌరవము = చక్కదనము; ఒప్పన్ = ఒప్పునట్లు.
భావము:- ఆదీ ఆంతమూ లేని అచ్యుత భగవానుడు అయిన శ్రీమహా విష్ణువు అదృశ్యం అయ్యాడు. బ్రహ్మదేవుడూ, పరమశివుడూ సంతోషంగా తమతమ నిలయాలకు వెళ్ళారు.