పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/వామనుని సమాధానము

వామునునిసమాధానము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


=

తెభా-8-548-వ.
మఱియు నయ్యజమానుం డభ్యాగతున కిట్లనియె .
టీక:- మఱియున్ = అటుపిమ్మట; ఆ = ఆ; యజమానుండు = యజ్ఞముచేయువాడు; అభ్యాగతున్ = విచ్చేసినవాని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా కాళ్ళు కడిగి తలపై జల్లుకున్న ఆ చక్రవర్తి విచ్చేసిన ఆ వామనునితో ఇలా అన్నాడు.

తెభా-8-549-మ.
"డుగా! యెవ్వరివాఁడ? వెవ్వఁడవు? సంవాసస్థలంబెయ్య? ది
య్యెకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మముం;
డుధన్యాత్ముఁడనైతి; నీ మఖము యోగ్యంబయ్యె; నా కోరికల్
తేఱెన్; సుహుతంబులయ్యె శిఖులుం; ల్యాణ మిక్కాలమున్
.
టీక:- వడుగా = బ్రహ్మచారి; ఎవ్వరివాడవు = ఎవరిపిల్లవాడవు; ఎవరవు = ఎవరివినీవు; సంవాస = ఉండెడి; స్థలంబు = చోటు; ఎయ్యెడకున్ = ఎక్కడ; నీవు = నీవు; అరుదెంచుటన్ = వచ్చుటచేత; సఫలము = సార్థకము; అయ్యెన్ = అయినది; వంశమున్ = (నా) వంశము; జన్మమున్ = పుట్టుక; కడు = మిక్కిలి; ధన్యాత్ముడను = పుణ్యాత్ముడను; ఐతిన్ = అయ్యాను; ఈ = ఈయొక్క; మఖమున్ = యాగము; యోగ్యంబు = పవిత్రమైనది; అయ్యెన్ = అయినది; నా = నా యొక్క; కోరికల్ = మనోవాంఛితములు; కడతేఱెన్ = తీరిపోయినవి; సుహుతంబులు = చక్కగాకాలుతున్నవి; అయ్యెన్ = అయినవి; శిఖులున్ = అగ్నులు; కల్యాణము = మిక్కిలి శుభదాయకము; ఈ = ఈ; కాలమున్ = సమయము.
భావము:- “ఓ బ్రహ్మచారీ! నీపేరేమిటి? ఎవరి పిల్లవాడవు? నీవు నివసించే చోటేది? ఇక్కడికి నీవు రావడంవల్ల నావంశమూ నా జన్మ సఫలము అయ్యాయి. నేను చాలా పుణ్యాత్ముడను అయ్యాను. ఈ యజ్ఞం పవిత్రం అయింది. నా కోరికలు నెరవేరాయి. అగ్నులు బాగా వేల్వబడ్డాయి. ఈ సమయం చాలా శుభదాయకం అయింది.

తెభా-8-550-మ.
చేలంబులొ మాడలో ఫలములో న్యంబులో గోవులో
రులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
రులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ణీ ఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా! "

టీక:- వర = మంచి; చేలంబులో = బట్టలుకాని; మాడలో = సువర్ణ నాణెములుకాని {మాడ - అరవరహా, ఒక సువర్ణనాణెము}; ఫలములో = పళ్ళుకాని; వన్యంబులో = వనములుకాని; గోవులో = పశువులుకాని; హరులో = గుఱ్ఱములుకాని; రత్నములో = మణులుకాని; రథంబులో = రథములుకాని; విమృష్టాన్నంబులో = మంచిఆహారములుకాని; కన్యలో = స్త్రీలుకాని; కరులు = ఏనుగులుకాని; కాంచనమో = బంగారముకాని; నికేతనములో = ఇళ్శుకాని; గ్రామంబులో = ఊళ్ళుకాని; భూములో = పొలములుకాని; ధరణీఖండమో = భూభాగముకాని; కాక = కాకపోతే; ఏమి = ఏది; అడిగెదో = అడిగెదవు; ధాత్రీసుర = బ్రాహ్మణ; ఇంద్ర = శ్రేష్ఠులలో; ఉత్తమా = ఉత్తముడా.
భావము:- ఓ బ్రాహ్మణోత్తముడా! నీకేం కావాలో కోరుకో. మేలైన వస్త్రములా, డబ్బులా, పండ్లా, అడవి సంపదలా, గోవులా, గుఱ్ఱములా, రత్నాలా, రథాలా, మంచి ఆహారాలా, కన్యలా, ఏనుగులా, బంగారమా, భవనాలా, గ్రామాలా, పొలాలా, భూభాగాలా లేకపోతే ఇవి కాకుండా ఇంకేమైనా కోరుకుంటున్నావా?”

తెభా-8-551-వ.
అని ధర్మయుక్తంబుగాఁ బలికిన వైరోచని వచనంబులు విని సంతోషించి యీశ్వరుం డిట్లనియె .
టీక:- అని = అని; ధర్మయుక్తంబుగాన్ = ధర్మబద్ధముగా; పలికిన = అడిగిన; వైరోచని = బలిచక్రవర్తి {వైరోచని - విరోచనుని పుత్రుడు, బలి}; వచనంబులు = మాటలు; విని = విని; సంతోషించి = ఆనందించి; ఈశ్వరుండు = భగవంతుడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
భావము:- ఇలా ధర్మబద్ధంగా బలిచక్రవర్తి పలికిన పలుకులకు సంతోషించిన భగవంతుడైన వామనుడు ఇలా అన్నాడు.