పల్లెపదాలు/ఏతాము
పల్లె పాతలు
ఏతాము
పాట భారతీయులకు జాతీయకళ. పుట్టిన రోజున పాట, తొట్టెబెట్టినప్పుడు పాట, అన్నప్రాశనానికి పాట, విద్దెము చేసినప్పుడు పాట, ఆడుతూ పాట, పెండ్లికి పాట, శోభనానికిపాట, సీమంతానికి పాట, భారతీయుల జీవితాన్నంతా పాట పడవాయి తేల్చి సాగిస్తుంది. గాన సరస్వతీ అర చేత పెరిగిన "తెలుగుబిడ్డ ఆటలలోనూ పాటలలోనూమాత్రమే కాక పనిపాటలలో కూడా పాడుకుంటూనే కష్టపడతాడు.
ఏతాము విరిగి నట్లయితే, ముగ్గురికి చావు. అట్లు ఏతాముపట్టణము మానగలరా? గూళ్లు నొప్పనకుండా గూనలు లాగేననే మెఱక చేలు తడిసి గింజలు పండగలవు.
ఏతాము తోడరా తమ్ముడా, నీ
చేతైన సాయమదే తమ్ముడా
పాతాళ గంగమ్మ పైకుబికి పొంగింది
యేతాముతోడి మెఱక సేలన్ని తడపొలి
గూళ్ళు నొప్పనకుండ గూనలులాగాలి బేగి
సేలన్ని తడిసి మరి మూసలు బాగెదగాలి
కట్ట తెగిపోకుండ కట్టండి గట్లన్ని
బద్దిపై సిన్నోడ భద్రముగా నడవాలి
పట్టుతప్పితె పళ్లు పలపలరాలాయిగాని
ఏత మెక్కినవాడు ఏరు కట్టినవాడు
ఏటేట పంటలతో యెలగాలీ పదినాళ్ళు
ఏతాము పాట
ఆశలు ఆశలనంటును. పాపము ఆచణలో ఏతాము రైతుపాట్లు చూపండి.
ఏటి కేతంబెట్టి వెయిపుట్లు పండించి
ఎన్నడూ మెతుకెగరన్నా
నేను గంజిలో మెతుకెరగరన్నా
కాల్టేయి కడుక్కొని కట్టమీద కూసుంటే
కాకి దన్నీపాయెరన్నా - కాకి
పిల్ల దన్నీ పాయెరన్నా
పోరుకూ జాల్లేక పొయికాడ కూసుంటే
పోరి దన్నీ పోయెరన్నా - పోరి
తల్లీ దన్నీ పోయెరన్నా
చుక్క పొద్దున లేచి బొక్కె నెత్తాపోగ
బొక్కబోర్లా పడితిరన్నా
నాదేటి బ్రతుకాయెరన్నా
నేను నాడే చావకపోతిరన్నా
వీడెవడో ప్రత్యేకముగా దురదృష్టవంతుడు. మెకుకుమాట దేవు డెరుగును, కాకిపిల్ల తన్నులు కూడా తిన్నాడు.