13 పొలిగాడు

——పొలిగాడు పంటలను సిద్ధింపజేసే దేవుడు. ఎక్కడైనా కుప్పనూర్పులు పొన్నలన్నీ దాటి పొలిగాడు అక్కడ తయారు!

ఒలియా ఒలియా ఒలియా
రావేలు గలవాడ రార పొలిగాడ
తూర్పునా ఒకవాన తుమ్మెదలమోత
పడమట ఒకవాన పట్టి కురవంగ
ఈ వాన ఆ వాన ఏక జడివాన
ఏదిలీ చేసుకూ ఎడ వాన లాయె
వెండి తూముల కింద వెల్లడము పండు
పైడి తూముల కింద పాలంకి పండు
రావేలు పోవేలు రాసి పదివేలు
రావేలు మీదయ్య రాసి మాదయ్య
పొలో పొలి పొలి పొలి
తిరుప తెంకన్నిచ్చిన పొలి
విను కొండెం కమ్మిచ్చిన పొలి
పొలేలుగా చాల పొలి

———

పొలిపాట


                        ఒలియ వోలియ...
                        ఒలియ వోలియా...వొలియా
కోటేలు గలవాడ రార పోలిగాడా
కోటేలు మీదయ్య కొండ మాదయ్యా
వెయ్యేలు కలవాడ రార పొలిగాడ
వెయ్యేలు మీదయ్య వెన్నొ మాదయ్య
నూరేలు గలవాడ రార పొలిగాడా
నూరేలు మీవయ్య నూగు మాదయ్య
పది వేలు గలవాడ రార పొలిగాడా
పదివేలుమీదయ్య పంట మాదయ్య
రావేలు గలవాడ రార పొలిగాడా
రావేలు మీదయ్య రాశి మాదయ్య
ఎద్దులూ తొక్కంగ యెదిగెనే రాశి
కోడెలూ తొక్కంగ కొల్లాయే రాశి
పెయ్యలూ తొక్కంగ పేరిగెనే రాశి
పొలిగాడు కొట్టంగ పోగాయె రాశి
వచ్చెనే పొలిగాడు పొన్నలూ దాటీ
దాగెనే పొలిగాడు దండాకొట్ట *[1]ల్లో

పొలిపాట


వలియొ వలియొ వలియొ - రాగాల వలియొ
రావేలు గలవాడ - రార పొలిగాడ ౹౹ వలియొ ౹౹
చైట కమ్మని బిడ్డ - చంద్రుణ్ణి బోలు "
చుట్టుండు కాపూలు - చుక్కల్ల బోలు "
ఊరికి ఉత్తరాన - ఉత్తముడి సైక "
ఉత్తముడి సైకలో - రత్నాల పందిరి "
రత్నాల పందిట్లో - ముత్యాల కొలిమి "
మానెడు ముత్యాలు - మరుగైన కొలిమి "
తవ్వెడు ముత్యాలు - తరుసైన కొలిమి "
గిద్దెడు ముత్యాలు - గిలకలా కొలిమి "
వేసేటి సంపెట్లు - పిడుగులా బోలు "
లేసేటి రవ్వల్లు - చుక్కలా బోలు "
పల్లాపు చేలాకి - పదునాయె వాన "
గుంటకల నన్నూరు - గోర్రెలు మున్నూరు "
రఘురాము గొర్రుబట్ట - రంభ ఎదబెట్లు "
శ్రీరాము గొర్రుబట్ట -- సీత ఎడ బెట్టు "
సీత బెట్టిన పైరు -- చిగురాకు లేసు "
రంభ బెట్టిన పైరు - రవికాకు లేసు "
దున్నలూ దొక్కంగ - దిన్నెలా పొడుగు "
ఎద్దులూ దొక్కంగ - ఎన్నులా పొడుగు "

వచ్చెరా పొలిగాడు - వరగాలి మీద ౹౹వలియొ౹౹
దండె గట్లలోన - దాగెరా పొలిగాడు "
రావేలు గలవాడ - రార పొలిగాడ "


పొలిపాటలో కొలిమి ప్రశంస వచ్చినది. ఇది స్రక్షిప్తమయినా కావచ్చును. అయినా ఎంత చక్కని వర్ణన ! పడుగుల వంటిపిమ్మత వెట్లు నాగలి చరిచిన నప్పుడు కావచ్చును. లేచేటి రవ్వలు చుక్కలు . . . నూర్పు పనిలో కుటుంబము వారంతా చెయ్యివేస్తారు. ఈ

సన్నివేశమే "శ్రీరాము గోర్రు బట్ట, సీత ఎండబెట్టు " ననికుంది. రంభయనగా అందపు ఒట్టు, భార్యయనే అర్థము చెప్పుకోవాలె.

ఒలియొ ఒలియొ

ఒలియో ఒలియో ఒలియో ఒలియాలే
రావేలు కలవాడా రార పొలిగాడా"
రావేలు మీవయ్యా రాశి మీదయ్యా
     పొలిశాడే గొట్టంగ పోయెరా రాశీ
     వచ్చెరా పొలిగాడు వాయువేగానా
పోయెరా పొలిగాడు పొన్నల్లుదాటీ
దాగెరా పొలిగాడు దండకట్టుల్ల
     కోడెలూ తొక్కగ కొల్లలై రాశీ
     ఎద్దులూ తొక్కంగ ఎదిగెరా రాశీ
దున్నలూ తొక్కంగ దిన్నెలై రాశీ
పెయ్యలూ తొక్కంగ పెర గెరా రాశీ
     శ్రీశైలపర్వతము శిఖదేలె రాశీ
     తిరుపతిగట్టులా దివ్యమై రాశీ
     కాళహస్తి లాగు కళలూరె రాశీ
     కోటప్పకొండలా గొప్పదై రాశీ
     మంగళాగిరిలాగ పొంగెరా రాశీ
     వేదాద్రిగట్టులా వెలిగెరా రాశీ
     దుర్గ గట్టులాగ తోచెరా రాశీ
     సింహాద్రిగట్టులా చెన్నొందె రాశీ

రాశి యెత్తును చూచికూడా రైతు భగవంతుణ్ణి మరవడు ! రాశి ఆతడు తిరిగే తిరువ్వా తములవలెనే కనపడుతోంది!

నూర్పు పాట

అయిపోయె గౌరమ్మ అయిపోయెనమ్మ
ఆపైన గిరిమీద ఆడిరావమ్మ
మా జోన్నలయిపోయె మేము పోతాము
మళ్ళోచ్చి నీపాటలెల్లపాడేము

ఇలా పొలిపదం


-రైతు 3 వికక్కు- వాడైతే ఎంక సంబయి నా గుపుకోయిస్వాహా అవుతుం 3. చివరకి ము లేది ఏమిటి? చిత్తగించండి.

కల్లుదుర్గా మోచ్చి; గూగుమ్మడీ;
కళ్లములో, కూకుండె: గూగుమ్మడీ,
చేత పైసాలేదు, గూగుమ్మడి,
ఏం పెట్టి త్రాగేది ? గూగుమ్మడీ
       కాడి యెద్దులనమ్మ; గూగుమ్మడి
       కల్లు త్రాగయ్య; గూగుమ్మడీ.
కల్లుదుర్గా మోచ్చి, గూగుమ్మడీ;
కళ్లములలో, కూకుండె; గూగుమ్మడీ.
చేత పైసాలేదు. గూగుమ్మడీ
ఏంపెట్టి తాగేది ? గూగుమ్మడీ,
       పాడి బర్లానమ్మి; గూగుమ్మడీ
       కల్లు త్రాగవయ్య; గూగుమ్మడీ.
కల్లుదుర్గా మొచ్చి; గూగుమ్మడీ;
కళ్లములో, కూకుండే; గూగుమ్మడీ;
చేత పైసాలేదు. గూగుమ్మడి;
ఏంపెటి త్రాగేది? గూగుమ్మడీ
       తల్లిదండ్రులనమ్మి; గూగుమ్మడీ;
       కల్లు త్రాగవయ్య, గూగుమ్మడీ,

కల్లుదుర్గా మొచ్చి, గూగుమ్మడీ;
కళ్లములో, కూకుండె; గూగుమ్మడీ;
చేత పైసాలేదు. గూగుమ్మడి
ఏం పెట్టి త్రాగేది? గూగుమ్మడీ;
       పెళ్లాన్ని పరులకమ్మి; గూగుమ్మడీ;
       కల్లు త్రాగవయ్య; గూగుమ్మడీ;
పెళ్లాన్ని పరులకమ్మి; గూగుమ్మడీ;
బ్రతుకకుంటే నేమి? గూగుమ్మడీ;
       కల్లుదుర్గామపుడు, గూగుమ్మడీ;
       కళ్ల మొదిలీపోయె, గూగుమ్మడీ.

చావుకు పెట్టిననేగాని లంఖణాలవరకూ రాదు. పెళ్లాన్ని పరులకమ్మేవరకూ నడుపుతుండా కల్లుత్రాగుడు ? అయితే వద్దన్నాడు. కల్లుదుర్గము కళ్లమువదలి, పారిపోయినది.

  1. *కూర్పారబట్టినప్పుడు ఏర్పడే ధాన్యపు చార.