అటి_____అటి 53 అక్వ్తి_____అతి

  • "ఎడ్లబండిలో ఆ పదిమైళ్లూ ప్రయాణం చేసేటప్పటికి ఒళ్ళంతా అతలకుతల మై పోయింది."
  • "మిలిటరీవాళ్లు దిగడంచేత ఆ ఊరంతా అతలకుతలం అయిపోయింది." వా.

అతిక మాత్ర

  • అధిక ప్రసంగి.
  • ఇది చిత్తూరుజిల్లాలో విశేషంగా ప్రచారంలో ఉండే పలుకుబడి.
  • చూ. అదనప్రసంగి.

అతిగహనము

  • చాల క్లిష్ట మయినది.
  • "దీని విధానం బెఱుగంగా.......దా నతిగహనంబు." భార. అర. 1. 330.

అతిథీ అభ్యాగతీ

  • వేళకు వచ్చే పథికులూ వారూ. జం.
  • "వాళ్లింటికి రోజూ అతిథో అభ్యాగతో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు." వా.

అతి పనికి రాదు

  • ప్రతిదానికి పరిమితి ఉండా లని చెప్పునపుడు అనేమాట.
  • "స్నేహాలూ, ప్రేమలూ, రావడాలూ, పోవడాలూ ఇవన్నీ ఉండవలసిందే కాని అతి పనికి రాదు రా బాబూ!" వా.

అతిమనిషి

  • మితి మించి ప్రవర్తించు వాడు.
  • "వాడు వట్టి అతిమనిషి. ఏమాత్రం చను విచ్చినా నెత్తిన కూర్చుంటాడు.? వా.

అటిరథులూ మహారథులూ

  • ఎత్తిపొడుపుగా, వాళ్ళంతా చాల గొప్పవాళ్లు లే అన్నట్లు ఉపయోగించేపలుకుబడి.
  • ప్రాచీనయుద్ధ పరిభాషద్వారా వచ్చినది.
  • "ఉన్నారు గా మీ వాళ్ళంతా అతిరథులూ, మహారథులూ. నా సాయం ఎందుకు కావలసి వచ్చింది." వా.

అతిరసాలు

  • ఒక పిండివంట.

అతివాసము

  • చూ. అధివాసరము.

అతివినయము

  • ధూర్తత.
  • అతివినయం ధూర్తలక్షణం అనే నీతివాక్యంపై ఏర్పడినది.
  • "అదంతా వినయం కాదు. అతివినయం సుమా." వా.

అతివృష్టీ అనావృష్టీ

  • ఏ దొచ్చినా ఎక్కువే అనుట.
  • వర్ష సంబంధ మైన పలుకుబడి.
  • "వాడు వస్తే రోజూ వస్తాడు. లేదా కొన్ని నెలలు కనిపించడు. వాడి దంతా అతివృష్టీ అనావృష్టీ." వా.

అతిశయం

  • గర్వం.
  • "కలవారింటి కోడ లని దానికి మహా అతిశయం." వా.
  • "అంత అతిశయాలకు పోవద్దురా? మన మేమి ఉన్న వాళ్లమా? ఏ మన్నానా?" వా. అతి_____అతు 54 అత్త_____అట్ట

అతి సర్వత్ర వర్జయేత్

  • ప్రతిదానికీ పరిమితి ఉండాలి అని చెప్పవలసినపుడు అనే మాట.
  • "నీవు మరీ వాడితో అంత పూసుకొని తిరుగుతున్నా వేమిరా? అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు." వా.

అతీ గతీ లేదు

  • దానినిగురించి ఏమీ తెలియదు. జం.
  • "వాడికి పదిజాబులు రాసినా అతీ గతీ లేదు." వా.

అతుకులబొంత

  • చిన్న చిన్న బట్ట పేలికలను అన్నిటినీ చేర్చి, బొంతగా కుట్టడం పల్లెలలో నేటికీ అలవాటు. దానిపై వచ్చిన పలుకుబడి.
  • "ఆ కావ్యం అతుకులబొంతగా తయారైంది. దాన్లో కొంత దీన్లో కొంత తీసి కుట్లు వేస్తే అంతకంటే యేమవుతుంది?"
  • "ఈ అతుకులబొంత సంసారం నేను చెయ్యలే నమ్మా. ఒకటి ఉంటే ఒకటి ఉండదు." వా.

అతుకులసంసారం

  • చాలీ చాలని ఆదాయం గల సంసారం.
  • "మే మేదో అతుకుల సంసారం చేస్తున్నాము. మా కవన్నీ రావా లంటే ఎక్క్క్వడ వస్తాయి?" వా.

అత్తకోక తొలగినట్లు

  • ఏ మనడానికీ వీలు లేనిపరిస్థితి యేర్పడినప్పు డనేమాట.
  • కోక తొలగిం దని చెప్పినా బాగుండదు, చెప్పక పోయినా భా గుండదు.
  • "నక్క యురులలోన జిక్కుకొన్న వితానం, గోరి మనము చేసికొన్న పనికిం, బేగులలోనితీట విత మాయె నన రాసు, అత్తకోక తొలగినటుల బలుక."
  • రాధికా. 3 ఆ.

అత్తగంతు

  • వేశ్యామాతల గుంపు.
  • కుమా. 8. 135.

అత్తగారి సాధింపు

  • ప్రతి చిన్న దానికీ దెప్పిపొడుచుట.

అత్తపోరు

  • అత్త కోడలిని పెట్టుఆరడి.
  • "ఈ సంబంధం చాలా మంచిది. అత్తపోరూ, ఆడబిడ్డపోరూ ఏమీ లేదు. ఒంటిగాడు. లక్షణమైన సంబంధం." వా.

అత్తమామల పోరు లేని కాపురం

  • కొత్తగా వచ్చినకోడలిని అత్తమామలు ఊరికే తప్పు పట్టుతూ పోరి బొక్కలాడుతారు. అట్టి పెద్ద లెవరూ లేని కాపురము. అనగా స్వేచ్ఛ ఉన్న దనుట.
  • "నిలనీని వంటవార్పుల నత్తమామల పోరును లేనికాపురము గలిగె."
  • శుక. 3 ఆ. 66 ప. అత్త_____అత్తా 55 అత్తి_____అద

అత్తముండ

  • నిరసనగా అనునప్పుడు అత్తను గూర్చి అనుమాట.
  • "ఉత్తముండకంటే అత్తముండ మేలు." సా.

అత్తమీద కన్నులు అంగడిపై చేతులు

  • "నందసుతుడు మున్ను నామీది ప్రేమచే, నొకటి సేయ బోయి యొకటి సేయు, అత్తమీద గన్ను లంగటిపై జేఉ, లాయె ననుచు జెలియ లరసి నవ్వ."
  • రాధి. 3 అ.

అత్తలాగ

  • అత్తవలె పోరు ననుట.*
  • "అత్త లేకపోతే నేం. మా ఆయన ఉన్నాడుగా. ఆయనే నా కత్తగారు."
  • "ఆ మేనేజరు అత్తలాగ అస్తమానం పోరుతుంటా డంటే నమ్ము." వా.

అత్త లేనికోడలు ఉత్తమురాలు

  • దండించువా రెవరూ లేరు. కనుకనే ఆమె తప్పులు బయటపడ వనుట.
  • "అత్తలేని కోడ లుత్తమ్మురాలు." పా. పా.

అత్తా లేదు ఆడబిడ్డా లేదు

  • దండించువారు, తప్పు పట్టువారు ఎవరూ లే రనుట.
  • "అత్తా లేదు. ఆడబిడ్డా లేదు. దానికేం? ఏ మయినా చేస్తుంది." వా.

అత్తారబత్తంగా

  • ముడుపులాగా.
  • క్రొత్త. 29.

అత్తింటికాపురం

  • పరతంత్రజీవనం.
  • "అక్కడ పని చేయడం అత్తింటి కాపురంగా ఉంది. ఏం చేసినా తప్పే. ఏం చేయ కున్నా తప్పే." వా.

అత్తింటికుంది

  • ద్వేషముతో చూడబడునది.

అత్తింటికోడలు

  • మగనాలు.
  • "అత్తింటికోడలికి గా, హత్తుక నత డుండె నొక యువాగ్రణికొఱకై."
  • హంస. 2. ఆ. 246 ప.

అత్తిల్లు చేరి బ్రతుకు

  • నీచముగా జీవించు.
  • కృష్ణనీ. 76.

అత్తెసరు పెట్టు

  • సరియెసురు పెట్టు.
  • బియ్యానికి పైన చేతివ్రేళ్లు మునిగేదాకా నీ ళ్లుండునట్లు ఉంచి పొయ్యిమీద పెట్టుట. అది ఉడి కేటప్పటికి సరిగ్గా ఆ నీళ్లు సరిపోతవి. వార్చవలసిన అవసరం ఉండదు. దీనినే రాయలసీమలో సరియెసురు, సరెసురు అంటారు.
  • "నే బయట ఉన్నానా? మా ఆయన కుంపటిమీద అత్తెసరు పెట్టి వెళ్ళిపోతారు? మా యెడపిల్లతోనే దాన్ని పొయ్యిమీదినుంచి దింపించి ఉంచుతాను." వా.

అదటడచు

  • పొగ రడచు. అద______అద 56 అద______అద
  • "అదయత బోనీక పొదివి యద టడచె." భాస్క. యుద్ధ. 1808.

అదనప్రసంగి

  • అనవసరంగా కల్పించుకొని మాటలాడువాడు.
  • చిత్తూరు జిల్లాలో ఎక్కువ వాడుకలో నున్నరూపం.
  • "వాడు వట్టి అదనప్రసంగి. వాడితో ఎవరు పెట్టుకుంటారు.?" వా.
  • చూ. అధిక ప్రసంగి.

అదనవిరిద లగు

  • అదవద లగు.
  • "మదనభూతము సోకినమగువలు పురుషులు అదనవిరిద లై అంగ మొల లై పెదవి నెత్తురు లీర్చి."
  • తాళ్ల. సం. 9. 205.

అదను పదను

  • తగినసమయము. జం.
  • "అదనుపదనునె కూర్చి మాయప్పు దీర్చి, పొమ్ము నీ వన్న బోమె యీ పోరు మాని."
  • హరి. 4. 37.

అదరంట

  • బాగా, లోతుగా.
  • "అదరంటగా నొక్కి యాన బోకు." రాధి. 1. 113.

అదరగొట్టు

  • అడలగొట్టు.
  • "వాడు మాటలతో ఇతరులకు అదరగొట్టేస్తాడు." వా.
  • చూ. అదరవైచు.

అదరవైచు

  • బెదరించు.
  • "అదరవైచియు బుజ్జగించియు బోధించియు." ప్రభావ. 3. 143.
  • చూ. అదరగొట్టు.

అదరువేటు

  • ప్రాణానికి మొప్పం లేకుండా భయపెట్టుటకు మాత్రమే కొట్టు దెబ్బలు. రాయలసీమలో విరివిగా వాడుకలో నున్న పలుకుబడి.
  • "నాలుగు అదురువేట్లు వేసి పంపితే సరి." వా.

అదవ

  • 1. వుకల మయిన.
  • "వాడిది కొంచెం అదవచేయి."
  • "వాడికి కాలు అదవ కనక యీడుస్తూ నడుస్తాడు." వా.
  • 2. ఒకరికింద ఉన్న వాడు, దుర్బలుడు. అందువల్లనే తెలివి తక్కువవాడు.
  • వావిళ్ల వగైరా కోశాలలో ఉన్న అస్థిరుడు అన్న అర్థం సరి కాదు. ఇది నేటికీ రాయల సీమలో ప్రచురంగా అలవాటులో ఉన్న పదం.

అదవకాపుర ముండు

  • 1. ఎత్తుడు కాపుర ముండు.
  • 2. ఒకరిపై బ్రతుకు.
  • లక్షణయా అదవ కాపుర మనగా అదవవాని కాపురము వంటి కాపుర మనుట. అద_____అద 57 అద______అది
  • "కెడసిన గరిసెలక్రింద లాగల గ్రుస్సి యదవకాపుర ముండు నాఖుతతుల." ఆము. 6. 13.
  • చూ. అదవత్రావుడు.

అదవచిక్కు

  • అధీనములో నుండి లోకువ యగు.
  • "నీకు నే నేం అదవ చిక్కి నా ననా? అన్నిమాట లంటున్నావు?" వా.
  • "వాడు అదవ చిక్కినవాడు కనుక నువ్వేం చేసినా చెల్లుతూ ఉంది. ఇం కెవడైనా అయితే ఓర్చుకుంటాడూ?" వా.

అదవత్రావుడు

  • తిరిపెపుత్రాగుడు.
  • ఒకరు త్రాగుతూ - వీడు ఎదురుగా ఉంటే పోనీ వాడికీ ఒక ముంత ఇవ్వు అని - యిప్పించునది. అదవ అంటే లోకువ, క్రిందివాడు అనే అర్థాలలో అనేక ప్రయోగాలు కాన వస్తాయి. అదవనాయాలా ఒక తిట్టు.
  • "తన చెలులిండ్లయం దదవత్రావుడు త్రావుచు..." పాండు. 3 ఆ. 19 ప.

అదవదపడు

  • వ్యథపడు.
  • "భేతాళు బురికొల్పి పృథివీశు నసిధార, సాతండు దెగి కూల నదవదపడి."
  • రామకథా. బాల. 7. 476.

అదవద పొందు

  • కలతచెందు.
  • "అదవద బొంద బా లయితి నక్కట!" హరి. ఉ. 8. 199.

అదవద లగు

  • చెల్లా చెదరు లగు, కలత చెందు.
  • "అదవద లైన పయ్యెదలు నందము తప్పిన హారవల్లులున్." విక్ర. 5 ఆ.

అదవనాయాలు

  • ఒక తిట్టు.
  • "పోరా అదవనాయాలా. నీతో నేం నాకు?" వా.
  • చూ. అదవ.

అదవబతుకు

  • నీచపుబతుకు.
  • "నాది వట్టి అదవబతుకు అయిపోయింది." వా.

అదవెట్టు.

  • మొఱపెట్టు.
  • "అని యిట్లు ధరణీసురుం డదవెట్ట భాగవతక్షోభమునకు భువనభర్తయు భయంపడి." ఆము. 7. 48.

అదాట్టుగా

  • హఠాత్తుగా.
  • "వాడు అదాట్టుగా వచ్చి పట్టు కొన్నాడు." వా.

అది ఒకటే కొదవ

  • కావలసి నన్నీ అయినవి, అదొక్కటే తక్కువ అనుట.
  • "ప్రజలయిండ్ల గన్న పెట్టని దొక్కటే కాని కొదవ, కడకు దుర్వృత్తులన్నియు గఱచె నతడు."
  • నిరంకు. 2. 26. అది_____అది 58 అది_____అది
  • "వాడు దివాలా తీయడం ఒక్క టే కొదవ." వా.
  • 2. ఏ మున్నాయి గనుక అది లే దని?
  • "ఒకరు:- ఎంతమంచి షిఫాను చీరలు వచ్చా యనుకున్నావు!
  • "మరొకరు:- అదొక్కటే తక్కువమ్మా! నా మొహానికి." వా.

అది కాదు

  • వాక్యోపస్కారకము.

అది గాక

  • అంతే కాక.
  • ఏ దైనా ఒకటి చెప్పి మరొకటి చెప్పునప్పుడు ఉపయోగిస్తారు.
  • "వానికి మన మంటే పడదు. వాడా లోభి. ఇలాంటప్పుడు మనం పోయి అడిగితే వా డిస్తాడా చస్తాడా? అది గాక అంతదూరం మనం పోయి వచ్చేంత సావకాశం కూడా లేదు." వా.
  • చూ. అదీ గాక.

అది నేరమా?

  • అది ఒక తప్పా?
  • ఏదో కొంత పొరపా టున్నా అదంత పెద్ద తప్పుకాదు అని చెప్పుటలో ఉపయోగించే పలుకుబడి.
  • "ముదురు చందురు గావి కెమ్మోని మీద, నాట నొత్తిని పలుగంటి నాటుపట్ల... అది నేరమా తలంప."
  • రాజగో. 3. 36.
  • "ఆయన వచ్చేటప్పటికి నేను ఇంట్లో లేను. అదీ ఒక నేరమా? దాని కింత గొడవ పెట్టాలా? ఇంతకూ ఆయనకు కాఫీపొడికోసమే వెళ్లాను."
  • "వాడిని చేరదీసి అన్నం పెట్టాను. అదీ ఒక నేరమా?" వా.

అది మొదలుకొని

  • అక్కడినుండి.
  • "అది మొదలుకొని చెప్పు మునిద యనిన." కళా. 3. 287.

అది య ట్లుండె

  • "అది యట్లుండె నవ్విధంబున వివిధోపచారంబుల సంఘటింప బెంపునం బ్రవర్తిల్లుచుండు."
  • ప్రభా. 1. 80.
  • "అది అలా ఉండనీ..." వా.

అది యెంతమాత్రము?

  • అదెంత పని?
  • అతిసులభ మనుట.
  • "చేసి కావలె... అన నది యెంతమాత్రము ధరామర నందన వేడు మింక నొండు..." నిరం. 4. 122.
  • "అ దెంతపని? ఒక నిమిషంలో చేసేస్తాను." వా.
  • "నాలుగు పద్యాలూ ఇప్పుడు రాస్తాను. అ దెంత మాత్రం." వా.

అదిరిపాటు

  • 1. అకస్మాత్తు, హఠాత్తు.
  • 2. మిడిసిపాటు.
  • "అదిరిపాటెవ్వ డీక్షించె నాకసమున హాటకపు నుష్ణపింగళు డైనపురుషు, నాతనికి వత్సరద్వయం బవధి చూవె." కాశీ.
  • "వాడి అదిరిపాటు చెప్పడానికి తరం కాదు." వా. అది_____అదీ 59 అదు_____అదు

అదిశం

  • విచిత్రం, వింత, అరుదు. ఇది 'అతిశయం' మారి వచ్చినపలుకుబడి.
  • దక్షిణాంధ్రంలో ప్రచురంగా వినిపించేపలుకుబడి.
  • "వా ళ్లేదో ఆబిడ్డను అడుగు కింద పెట్టనీయకుండా సాకుతున్నారు. మహా అదిశంగా వీళ్లకే పిల్ల ఉన్నట్టు."
  • "అదేం అదిశ మమ్మా! పిల్లను అత్త వారింటికి పంపడానికి అంత యిదయి పోతున్నారు." వా.

అది సంపాయిస్తున్నది

  • ఒడ లమ్ముకొని డబ్బు చేసుకుంటున్నది అనుట.
  • చిత్తూరుజిల్లాలో ఇది యెక్కువగా వినవస్తుంది.

అది సుత

  • అది మొదలు.
  • నాయకు. పు. 9.

అదీ ఒక గొప్పా

  • గొప్ప కా దనుట.
  • "భండనమందు నాకు నొక పాండవు లెంతటివారు." పాం. విజ.
  • "వా డేదో నాలుగుపద్యాలు రాశాడట. అదీ ఒక గొప్పే?" వా.

అదీ ఒక తప్పా?

  • "ఆయన బజారులో వెడుతూ ఉంటే నేను అరుగుమీదినుంచి లేవలే దట. అదీ ఒక తప్పా? వాడితో అన్ని మాట లన్నా డట."
  • "వా డేదో పద్యాలు వినిపించాడు. సరే. విన్నాను గదా. తా నేదో కాళిదాసును మించిపోయాడు అని నే నన లే దట. అదీ ఒక తప్పా? వాడు నన్ను దు మ్మెత్తిపోస్తున్నాడు." వా.
  • చూ. అది నేరమా?

అదును బదును

  • ఆనుపాను. జం.
  • "అదనుం బదను నెరింగి అండ నుంటే చాలు." తాళ్ల. సం. 3. 582.

అదుపు ఆజ్ఞ

  • కట్టుబాటు. జం.
  • "వాడు ఈమధ్య బొత్తిగా అదుపూ ఆజ్ఞా లేక తిరుగుతున్నాడు." వా.

అదురుగుండె

  • భయస్థుడు.
  • "వాడు వట్టి అదురుగుండె. ఒంటరిగా ఒంటికి కూడా పోలేడు." వా.

అదురుగుండె, పిక్కబెదురు లేమి

  • నిర్భీకత్వము.
  • "మేర మీఱు సంఖ్య మెఱయుదు రవ్వీట, నదురుగుండె పిల్ల బెదురు లేక." రంగా. 1. 18 పే.

అదురుతిక్క

  • ఒక పశురోగం.
  • "ఉంగిడి, యదురుద్రిక్క యనువానికి నా పేరు సెప్పినం జాలు."
  • భార. విరా. 1. 286.
  • "నరిడి పప్ప కప్ప నావురు కడుపూద, యదురుద్రిక్క యనగ నడరి మరియు, దెవులు లెన్ని యేని దవిలి యంతయు మహో, గ్రంబు లయ్య బశుగణంబు నందు." హరి. పూ. 6. 46.

అదురు బెదురు

  • భయము. జం. అదు____అదే 60 అద్ద____అద్ద
  • "వాడు ఎంత కటిక చీకటిలో అయినా అదురూ బెదురూ లేకుండా పోతాడు." వా.

అదురూ బెదురూ లేక

  • జంకూ కొంకూ లేక. జం.
  • "వాడు అదురూ బెదురూ లేక అర్ధ రాత్రిలో ఆ అడివిలో నడచి పోతాడు." వా.

అదురుమనిషి

  • భయస్థుడు.

అదేం గగనం?

  • అ దేమి గొప్ప. అదేమి ఘన కార్యం?
  • "ఆ పుస్తకం ఒకరోజులో చదవడం అదేం గగనమా?"
  • "అదేం గగనం లెద్దూ." వా.

అదేం బంగారమా?

  • అంత విలువ కానిది అనుట.
  • "వాడు ఆ పుస్తకం చూచి యిస్తానంటే యియ్య లేదు. అదేం బంగారమా?" వా.

అదే పదివేలు

  • అంతమాత్రం చాలు. అదే గొప్ప.
  • "చేరిక నిచ్చి పాదముల జేర్పు డదే పదివేలు." పాణి. 6. 107.
  • "మీరు జాబు రాస్తే చాలు. అదే పదివేలు. రా నక్కఱ లేదు." వా.

అదే పనిగా

  • తదేక దీక్షతో.
  • "తిరిగితి మెల్ల దేశము లదే పనిగా." నానా. 83.

అద్దంతరపు సిరి

  • నడమంత్రపు సిరి.
  • కొత్త. 14.

అద్దపునీడ

  • అశాశ్వతము.
  • తాళ్ల. సం. 5. 311.

అద్దము చూచు

  • ముకురవీక్ష చేయు.
  • వేశ్యలకు కన్నెరికం పెట్టే ముందు అద్దం చూపించడం అనేది ఒక ఆచారం.
  • "పుష్యనక్షత్రమునందు నీయనుగు గాదిలికూతురు చూచు నద్దమున్."
  • క్రీడా. పు. 62.

అద్దములాగ

  • పరిశుభ్రంగా, మినమినలాడు నట్లుగా.
  • "వాళ్ల యిల్లు అద్దంలాగ ఉంటుంది. పాలు పోసి పాలు ఎత్తుకో వచ్చు." వా.

అద్దములోని ముడుపు

  • వట్టి దనుట.
  • అద్దములో ప్రతిఫలించినడబ్బు తీసుకొనుటకు రాదు కదా. తె. జా.

అద్దములో నీడ కాసపడు

  • అలభ్యమునకై వేకారు.
  • "బుద్దులు తప్పె నేమిటికి బోయిన నీళ్లకు గట్టవెట్ట నీ, యుద్దములోని నీడ కెటు లాసపడం బొసంగుం దలోదరీ." ఉ. హరి. 5. 157. అద్దు_____అధా 61 అధి______అధీ

అద్దు పద్దు.

  • అదుపు ఆజ్ఞ. జం.
  • "అద్దూ పద్దూ లేక వా డీమధ్య మితిమీఱి పోతున్నాడు." వా.

అద్దు ముద్దు

  • ముద్దు ముచ్చట. జం.
  • "అద్దుముద్దు మీఱి యాడది మగ డంచు, గుడిమాడి యాడ జూడ దలచి." రాధి. 3 ఆ.

అద్దెకు తిప్పు

  • అద్దెకు ఇచ్చు.
  • "వాడు ఉన్న నాలుగు ఇళ్లూ అద్దెకు తిప్పుతూ జీవిస్తున్నాడు." వా.

అద్భుత పడు

  • ఆశ్చర్యపడు.
  • "అశ్వము గొం చుడువీధి నేగ నద్భుతపడి." జైమి. 2. 29.

అద్వైతము

  • చాదస్తము.
  • "వాడి దంతా ఒట్టి అద్వైతం." వా

అధవా.

  • ఒక వేళ.
  • "వసుమతిపై నధవా నన్ను బుట్టింప నూహ కల్గెనేని." వరాహ. 2. 156.
  • "నీవు వస్తే మంచిది. అధవా ఏకారణం వల్ల యినా నువ్వు రాలేక పోతే మీ వా ణ్ణయినా తప్పకుండా పంపించు." వా.

అధాయకుడా విధాయకుడా ?

  • వాడికి చెప్పి ఏమి ప్రయోజనం? వా డిందులో చేయ గలది యేమి కలదు అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "వా డేమి అధాయకుడా ? విధాయకుడా ? వా డేమంటే నేమి? వా.

అధిక ప్రసంగము చేయు

  • అనవసరముగా జోక్యము కలిగించుకొని మాట్లాడు.

అధిక ప్రసంగి

  • వాచాలుడు.
  • చూ. అదనప్రసంగి.

అధిక మాసము.

  • సూర్యుడు ఒకే రాశిలో ఉండగా రెండు చాంద్రమాన మాసము లారంభ మైతే తొలిది అధికమాసం. రెంటికీ ఒకేపేరు ఉంటుంది.
  • అధికచైత్రము, నిజచైత్రము ఇత్యాదులు.

అధికాచమానం

  • బహిర్దేశమునకు వెళ్లుట వైదికుల పరిభాష.
  • చూ. అల్పాచమానం.

అధివాసరము

  • తద్దినానికి ముందునాటిరాత్రి ఉపవసించుట. దీనినే అతివాస మనీ వాడుకలో అంటారు.
  • (రూపం) అతివాసము.

అధీతి బోధాచరణ ప్రచారణములు

  • చదుట, ఇతరులకు చెప్పుట, ఆ ప్రకారం ఆచరించుట, వానిని అనుసరించ మని యిత