పదబంధ పారిజాతము/అడ్డు
అడ్డ_____అడ్డ 49 ఆద్ద_____అడ్డ
అడ్డగాడిద
- తిట్టు, పనీపాటా లేకుండా తిరిగేవాడు.
- అల్లరిచిల్లరిగా తిరిగేవాడు.
- మాటా. 9.
- "వాడు అడ్డగాడిదలా ఊరంతా ఎప్పుడూ తిరుగుతుంటాడు." వా.
అడ్డగాలు వేయు
- అడ్డగించు.
- "పోకు మని యడ్డగాల్ వేయంగన్." సారం. 2. 16.
అడ్డగోడ
- కొంచెం ఎత్తుగా హద్దు నేర్పరుస్తూ పెట్టుగోడ.
- "వాళ్లింటికీ వీళ్లింటికీ మధ్య అడ్డగోడ ఒక్కటే వ్యవధానం. వా ళ్లెప్పుడూ అన్న దమ్ముల్లాగా ఉంటారు." వా.
అడ్డగోడమీద దీపం పెట్టినట్లు
- అటూ యిటూ కూడా ఉన్నట్లుండు. ఎటోఒక వైపు మొగ్గక అనుట.
అడ్డగోడమీది పిల్లి
- చూ. గోడమీది పిల్లి.
అడ్డగోలుగ
- ఎటు పడితే అటు.
- రుద్రమ. 84. పు.
అడ్డగోలు వ్యవహారం
- గందరగోళపు వ్యవహారము.
అడ్డపట్టుపాప
- అడ్డపాప.
- "అడ్డపట్టెడు పాప డంటవె యోయమ్మ." సారం. 2. ఆ.
- చూ. అడ్డపాప.
అడ్డపట్టుల పాప
- చిన్ని పాప.
- అడ్డాలలోని పాప. తె. జా.
అడ్డపచ్చ
- ముదురుపచ్చ.
- "సుకుమార శుకచ్ఛదచ్ఛటా దాయా దంబు లై యడ్డపచ్చ గొనునవియును."
- కాశీ. 7. 26.
అడ్డపడు
- 1. కాళ్ళమీద పడు. 2. అడ్డు వచ్చు.
- "నెగులున నడ్డపడి యేడ్చి." సారం. 3. 199.
- "తప్పుదు బ్రహ్మశతం బడ్డపడిన." గౌర. హరిశ్చం. పం. 1078.
- "అడ్డపడి చెప్పుకుంటే వినక పోతాడా." వా.
అడ్డపాప
- పసిబిడ్డ.
- చిన్న తనంలో పసిపిల్లలను చేతులపై అడ్డముగా పెట్టుకొని పోవుటపై వచ్చిన పలుకుబడి. అడ్డాలలో బిడ్డ డనుట.
"...నోరిలోపలన్ వ్రేలిడినప్పుడన్
గఱవనేరడు నీసుతు డడ్డపాప యౌ." సారం. 3. 58.
- చూ. అడ్డపట్టుపాప.
అడ్డపెట్టు
- అడ్డగించు.
- "ధర్మపరిపాలుర మమ్ము నడ్డపెట్ట..." భాగ. షష్ఠ. 81. ప. అడ్డ____అడ్డ 50 అడ్డ____అడ్డ
అడ్డపెట్టు లేక
- ఆటంకము లేకుండ.
- "బొడ్డనబావుల నడ్డ పెట్టు లేక విహరించుటకు వజ్రనాముదల యడిగి." ప్రభా. 1. 121.
అడ్డ పేరు
- ఏదో ఒకందుకై నడుమ ఎవరో పెట్టిన పేరు.
- "అతని పేరు శంకరశాస్త్రే అయినా కూరగాయల కెప్పుడూ దేవిరిస్తూ ఉండడంచేత కూరగాయలశాస్త్రి అని అడ్డపేరు వచ్చింది." వా.
అడ్డపొగ వేయు
- అడ్డు వేయు.
అడ్డబాస
- బులాకీ. తె.జా.
అడ్డమాడు
- వ్యతి రేకించు.
- రుద్రమ. 40 పు.
అడ్డము చెప్పు
- వ్యతి రేకించు.
- "ఏది చెప్పినా వాడు అడ్డం చెప్తాడు." వా.
అడ్డముపడు
- అడ్డు వచ్చి కాపాడు.
- "దాని కడ్డముపడ నెవరు వచ్చిన సమ యింపుము." మార్కం. 6. 158.
- ఎవ రడ్డం వస్తారో చూస్తాను అనే రీతిగా కూడా వినవస్తుంది.
అడ్డము వచ్చు
- అడ్డము వచ్చి కాపాడు. అడ్డుపడు.
- "అమ్మధురాపురీరమణు లడ్డము వత్తురు గాక." భాగ. దశ. పూ. 1474.
అడ్డ మూడే కళ్లుగా తినువాడు
- అడ్డబియ్యం వండగా మూడు ముద్దలతో మింగి వేస్తా డనుట.
- అంటే తిండిపోతు.
అడ్డమైన
- ఏది పడితే అది, సమయాను కూలంగా, నీతీ నియమం లేకుండా.
- కాశీ. 7. 232.
- "వాడు అడ్డ మైనకూళ్లూ తింటాడు."
- "అడ్డ మైనవాళ్ల కాళ్లు పట్టుకొంటాడు."
- "అడ్డ మైనపని చేస్తాడు." వా.
అడ్డమైన కూళ్లు కుడుచు
- అన్ని నీచాలకూ పాల్పడు.
- "వాడు అడ్డమైన కూళ్లూ కుడుస్తున్నాడు." వా.
అడ్డమైన గడ్డి తిను
- నీచానికి లోబడు.
- చూ. అడ్డ మైనకూళ్లు కుడుచు.
అడ్డమైన చాకిరీ
- నానా పనులూ
- "వాడు నాచేత అడ్డమైన చాకిరీ చేయించుకొని తరిమేశాడు." వా.
అడ్డమైన వాడు
- 1. ఎవడు పడితే వాడు. అడ్డ______అడ్డా 51 అడ్డా_____అడ్డు
- "ఆ ఊళ్లో అడ్డమైనవాడూ పెద్ద మనిషే." వా.
- 2. ప్రతివాడు.
- "అడ్డమైనవాడూ నన్ను ఆక్షేపించే వాడే."
- "ఆ సత్రంలో అడ్డమైనవాళ్లూ దిగుతుంటారు." వా.
అడ్డమైన మాటలు మాటలాడు
- నోటికి వచ్చినట్లు మాట్లాడు.
- "వా డక్కడికి వెళ్లేసరికి అడ్డమైన మాటలూ మాట్లాడాడు." వా.
అడ్డవాటు
- అడ్డుపుల్ల.
- "అడ్డవాట్లు వేసి చెఱచినం గాని నీకు గునుకు పట్టదు." తె. జా.
అడ్డవాతియమ్ము
- అర్ధ చంద్రబాణము.
అడ్డదిడ్డముగా
- వక్రముగా.
- "వా డెప్పుడూ అడ్డాదిడ్డంగా మాట్లాడుతాడు." వా.
అడ్డాదిడ్డిగా
- ఇష్టం వచ్చినట్లుగా, ఒక క్రమం లేక అనుట.
- "ఆ ఊరు అడ్డాదిడ్డిగా పెరిగిపోతూ ఉంది. అందమా? చందమా?" వా.
అడ్డాదిడ్డులు
- ఆటంకాలు. జం.
- "వినయంబుతో జేరి పని యేమి యను వాడె, యరయ కడ్డాదిడ్డు లనుప సాగె." కువల. 2. 24.
అడ్డాయుధము
- కత్తి - అడ్డకత్తి.
- బస. 5 ఆ. 147 పుట.
అడ్డావిడ్డము తిరుగు
- ఎటు పడితే అటు తిరుగు.
- "అడ్డావిడ్డము తిరిగే, తెడ్డెఱుగునె పాలతీపి." వేమన.
అడ్డాదిడ్డములు
- అవీ ఇవీ.
- "వడ్డించు మనుచు గుడుచుచు, నడ్డా విడ్డములు పలుకునంతటిలోనన్." బసవ. 6. 191.
- చూ. అడ్డాదిడ్డులు.
అడ్డిపోవు
- ఆగిపోవు.
- కొన్ని ప్రాంతాలలో విరివిగా వినిపించేపలుకుబడి.
- "అంతా యేర్పా ట్లయిన తర్వాత ఉన్నట్లుండి ఆ పెండ్లి అడ్డిపోయింది." వా.
అడ్డుకఱ్ఱ వేయు
- విఘ్నము కలిగించు.
- అడ్డుకఱ్ఱ - ఆటంకము.
అడ్డు గఱ్ఱమాటలు
- అడ్డుమాటలు.
- "నీయడ్డుగఱ్ఱమాటల కీ యెడ బని యేమి?" రుక్మాం.
- చూ. అడ్డుపుల్ల వేయు.
అడ్డుపుల్ల వేయు
- విఘ్నము కలిగించు.
- "వాడు ఎక్కడికి వచ్చినా ఏమి జరుగుతున్నా ఏదో ఒక అడ్డుపుల్ల వేయకుండా ఉండడు." వా. అడ్డువాట్లు వేయు
- విఘ్నము కలిగించు.
- రుద్రమ. 70.
అడ్డేటుమీద గుడ్డేటు
- కాక తాళీయంగా తగిలిన దెబ్బ పై మరొక దెబ్బ తగులు.
అణక వేసుకొను
- మెడమీద నున్న కాడిమాను మెడకిందికి వచ్చునట్లుగా ఎద్దు ఎద్దు తిరుగ బడు.
- "ఆ యెద్దు అణికె వేసుకుంది. దాన్ని లేపేదాకా మనం గోళ్లు గిల్లుకుంటూ మూర్చోవలసిందే." వా.
అణుమాత్రము
- ఏకొంచెమున్ను.
- "అణుమాత్రమును గర్వగుణము లేక." కా. మా. 2.7.
- "నా కా విషయంలో అణు మాత్ర మైనా సందేహం లేదు."
- "వాడికి అణుమాత్రం కూడా కృతజ్ఞత లేదు." వా.
అణో రణీయాన్ మహతో మహీయాన్
- చిన్నలలో అతిచిన్న, పెద్దలలో అతిపెద్ద.
- "భగవంతుని విషయంలో ఉపయోగించే వైదికసూక్తి.
అతంత్రపుమనిషి
- నమ్మడానికి వీలులేని మనిషి.
- "వాడు చాలా అతంత్రపు మనిషి. వాణ్ణి నమ్మి యే పనిలోకి దిగడానికి వీలు లేదు." వా.
అతంత్ర మయిన
- భద్రంగా లేని.
- శ. ర. లో అతంత్రం అంటే స్వాతంత్ర్యము తప్పినది అనుట సరి కాదు. ఇది నేటికీ వాడుకలో భద్రంగా లేదు అన్ంస్ అర్థంలో విరివిగా వినవస్తున్నది.
- "మా తామహుయాగతంత్రము నతంత్ర (ద్ర)ము చేసి." కాశీ. ఆ. 6.
- "ఈ యిల్లు చాలా అతంత్రంగా ఉంది. ఇంతమంది పిల్లలతో వానాకాలంలో ఉండా లంటే భయంగా ఉంది."
- "ఆ కుర్చీకాలు కాస్త అతంత్రంగా ఉంది. జాగ్రత్తగా కూర్చో." వా.
అతకుత లగు
- అతలకుతల మగు.
- "అకట యవి సవరింపగా నతకుతలయి." బాల. 7.
అతనిచేతులలో చెంగలమ్మగొట్ట
- ఒక సాపెన.
- "అకట! వయ్యాళి గాగ బొమ్మనుచు గొట్టు, నతని చేతులలో జెంగలమ్మ గొట్ట."
- శుక. 3 ఆ. 403 ప.
- చూ. అతని చేతులు పడిపోను.
అతని చేతులు పడిపోను
- ఒకసాపెన.
- "ఎంత దెబ్బ వేశాడు - అతని చేతులు పడిపోను." వా.
అతలకుతల మగు
- క్రక్కదలిపోవు.
- "కుతలము పడహతుల నతలకుతలం బయ్యెన్."
- సింహా. 1. 154. అటి_____అటి 53 అక్వ్తి_____అతి
- "ఎడ్లబండిలో ఆ పదిమైళ్లూ ప్రయాణం చేసేటప్పటికి ఒళ్ళంతా అతలకుతల మై పోయింది."
- "మిలిటరీవాళ్లు దిగడంచేత ఆ ఊరంతా అతలకుతలం అయిపోయింది." వా.
అతిక మాత్ర
- అధిక ప్రసంగి.
- ఇది చిత్తూరుజిల్లాలో విశేషంగా ప్రచారంలో ఉండే పలుకుబడి.
- చూ. అదనప్రసంగి.
అతిగహనము
- చాల క్లిష్ట మయినది.
- "దీని విధానం బెఱుగంగా.......దా నతిగహనంబు." భార. అర. 1. 330.
అతిథీ అభ్యాగతీ
- వేళకు వచ్చే పథికులూ వారూ. జం.
- "వాళ్లింటికి రోజూ అతిథో అభ్యాగతో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు." వా.
అతి పనికి రాదు
- ప్రతిదానికి పరిమితి ఉండా లని చెప్పునపుడు అనేమాట.
- "స్నేహాలూ, ప్రేమలూ, రావడాలూ, పోవడాలూ ఇవన్నీ ఉండవలసిందే కాని అతి పనికి రాదు రా బాబూ!" వా.
అతిమనిషి
- మితి మించి ప్రవర్తించు వాడు.
- "వాడు వట్టి అతిమనిషి. ఏమాత్రం చను విచ్చినా నెత్తిన కూర్చుంటాడు.? వా.
అటిరథులూ మహారథులూ
- ఎత్తిపొడుపుగా, వాళ్ళంతా చాల గొప్పవాళ్లు లే అన్నట్లు ఉపయోగించేపలుకుబడి.
- ప్రాచీనయుద్ధ పరిభాషద్వారా వచ్చినది.
- "ఉన్నారు గా మీ వాళ్ళంతా అతిరథులూ, మహారథులూ. నా సాయం ఎందుకు కావలసి వచ్చింది." వా.
అతిరసాలు
- ఒక పిండివంట.
అతివాసము
- చూ. అధివాసరము.
అతివినయము
- ధూర్తత.
- అతివినయం ధూర్తలక్షణం అనే నీతివాక్యంపై ఏర్పడినది.
- "అదంతా వినయం కాదు. అతివినయం సుమా." వా.
అతివృష్టీ అనావృష్టీ
- ఏ దొచ్చినా ఎక్కువే అనుట.
- వర్ష సంబంధ మైన పలుకుబడి.
- "వాడు వస్తే రోజూ వస్తాడు. లేదా కొన్ని నెలలు కనిపించడు. వాడి దంతా అతివృష్టీ అనావృష్టీ." వా.
అతిశయం
- గర్వం.
- "కలవారింటి కోడ లని దానికి మహా అతిశయం." వా.
- "అంత అతిశయాలకు పోవద్దురా? మన మేమి ఉన్న వాళ్లమా? ఏ మన్నానా?" వా.