పదబంధ పారిజాతము/అడ్డం
అడు_______అడు 47 అడు_______అడు
- "జనయిత్రీజనకులం గని మది నడరుచు నడుగులకు మడుగు లొడ్డుచు నరుగు సెడ."
- పాండు. 2. 25.
అడుగుల వ్రాలు
- పాదాభివందనము చేయు.
- "దశరథు డడుగుల వ్రాలు తనయుల నిర్వుర దా గౌగిలించి."
- వర. రా. బా. పు. 207 పంక్తి 18.
అడుగు లాన
- పాదాల సాక్షిగా.
- ఒట్టు పెట్టేటప్పుడు చెప్పే మాట.
- "నీ యడుగులాన." కాశీ. 7. 179.
అడుగులు తడబడు
- "అడుగులు తడబడ నడరెడు నడపుం గడకల నడుములు గడగడ వడకం..." కళా. 6. 251.
- "అడుగులు తడబడ బులకలు, పొడమగ సఖివెనుక కొదుగ బోవుచు నరసెం." కళా. 7. 147.
అడుగుల కెఱగు
- నమస్కరించు.
- "సంతసంబున వచ్చి యా సంయ మీంద్రు, నడుగులకు నెఱగుడు నత డాదరమున." పారి. 2. 22.
అడుగులు సడుగులు
- చూ. అడిగండ్లు మడిగండ్లు.
అడుగులేని గిన్నె
- కుదురు లేని మనిషి.
- "వాడు వట్టి అడుగు లేనిగిన్నె. ఎక్కడా నాలుగునాళ్లు పని చేయలేడు." వా.
అడుగులో అడుగు వేసుకొంటూ
- మెల్లగా.
- "ఇలా అడుగులో అడుగు వేసుకొంటూ వెడితే యిక మనం చేరినట్టే." వా.
అడుగులో దాటిపోవు
- కొంచెములో తప్పిపోవు.
అడుగులో హంసపాదు.
- ఆరంభంలోనే విఘ్న మనుట. 'ప్రథమకబళే మక్షి కాపాత:' వంటిది.
- "వాళ్లు పిల్లను చూడ్డానికి వచ్చేసరికి మా అమ్మాయి ముట్టయి కూర్చుంది. అడుగులోనే హంసపాదు. ఏ మవుతుందో ఏమో!"
- చూ. అంచపదము.
అడుగువట్టు
- నీటిలో అడుగుభాగమునకు దిగిపోవు.
- నౌకలు మొదలగువానివిషయంలో నీరు లోతు తగ్గగా నేల తాకి ఆగిపోయినప్పుడు కూడా అడుగుపట్టిన దంటారు.
- "నిర్భరగతి ద్రచ్చుచో నడుగువట్టిన తద్గిరి యెత్తవే." పారి. 3. 29.
అడుగు వాసినచో నక్కఱ వాయు
- ఇల్లు దాటిపోతే ఇంక ఇంటి ధ్యాస ఉండదు.
- ఇది సామాన్యంగా మగ వాళ్లను గూర్చి చెప్పుటలో ఆడవా ళ్లుపయోగించే పలుకుబడి. అడు____అడ్డ 48 అడ్డ____అడ్డ
- "శీఘ్రము పఱతెంచెద ననుట యడుగు వాసినచో నక్కఱ వాయు ననుట నిజమని యెఱుగరు గా." శుక. 3. ఆ. 146. ప.
అడుగూ బడుగూ
- వంట చేసినపాత్రలో మిగిలిన అంటూ సొంటూ.
- "వాళ్లంతా తిని కుడిచినతర్వాత ఇంత అడుగూ బడుగూ ఉంటే నా మొహాన వేస్తారు." వా.
అడువపుట్టువు
- తక్కువవాడు - ఒకరికింద పడి ఉండేవాడు.<.big>
- శ. ర. లో కాపువాడు అని ఉన్నది. అది సరికాదు. ఈ అడువ, అడవ, అదువ, అదవ దాదాపు సామాన్యార్థ కాలు.
అడుసున పాతినకంబము
- అస్థిరము.
అడ్డంగా చీల్చి పారేస్తాను
- తిట్టునప్పు డనుమాట.
- "మళ్ళీ యింకోసారి యిలాగే అన్నావంటే అడ్డంగా చీల్చి పారేస్తాను." వా.
అడ్డంగా పెరుగు
- లా వగు.
- "వా డీ మధ్య అడ్డంగా పెరిగి పోతున్నాడు." వా.
అడ్డం పుట్టినవాడు
- మొండివాడు, మూర్ఖుడు.
- "వాడు అడ్డం పుట్టినవాడు. వాణ్ణి ఒప్పించడం బ్రహ్మతరం కాదు." వా.
అడ్డకత్తి
- పట్టాకత్తి.
అడ్డ కట్టుకొని
- ఆకట్టుకొని, స్వాధీనము చేసికొని.
"ధీయుత! యడ్డకట్టుకొని తెచ్చి నరుల్
తమ కెక్కిరింతలన్, జేయుట నీతివైభవ
విశేషము గాదె తలంచి చూడగన్."
కళా. 7. 262.
అడ్డ కమ్మి
- గుమ్మముకమ్మి, లక్ష్మికమ్మి.
అడ్డకఱ్ఱలు
- ఒక రక మైన సుఖరోగము, విఘ్నములు.
- చూ. అడ్డకఱ్ఱ వేయు.
అడ్డకఱ్ఱ వేయు
- ఆటంక పెట్టు.
అడ్డకాలు వేయు
- విఘ్నము కలిగించు.
- ఎవరైనా పోతుండగా కాలు అడ్డం పెట్టినట్టు అనుట.
"తలగలిగిన గుళ్ళాయులు, గల వేవగ
నైన నీవు గలిగిన దాదృ, క్కలరవము
లెన్ని యైనం, గలిగెడు బోకు మని
యడ్డగాల్ వేయంగన్." సా. ఆ. 2.
అడ్డకు పడ్డ పెట్టుకొను
- కొంచానికి ఎక్కువ నష్టపెట్టుకొను.
అడ్డ గఱ్ఱమాట
- అడ్డుమాట.
- "నీ యడ్డ గఱ్ఱమాటల కీయెడ బని లేదు." రుక్మాం. 5. 90.