పదబంధ పారిజాతము/అడుగు
అడు_____అడు 45 అడు_____అడు
అడుగవచ్చినవారు
- పిల్లకు పెత్తనము వచ్చిన వారు.
- "అడుగ వచ్చినవార లయ్యబలరూప, శిలకులగుణవిఖ్యాతి చాల మెచ్చి."
- శుక. 2. ఆ. 153 ప.
అడు గామడ యగు
- ఒక కొంత దూరమే ఆమడ దూరముగా తోచు - దౌర్బల్యాదులవలన.
- "పొడలు పెట్టుచు దన కడుగామ డై యుండ." కా. మా. 3. 193.
- "నల్ల రేగడభూమి, వర్షాకాలంలో నడిచే వారికి అడుగు ఆమడగా నుండును."
- కాశియా. పు. 51.
అడుగు ఆమడగా నడుచు
- మహాభారముతో, శ్రమతో నడుచు.
- "ఆ గర్భిణీస్త్రీ అడుగామడగా నడిచివస్తే నీవు ఏమాత్రం కనికరం లేకుండా పొమ్మంటే యెక్కడకు పోతుంది?" వా.
అడుగుకొని తిను
- యాచించు.
- "వాడు ఊళ్లో అడుగుకొని తింటున్నాడు. అస్తా? పాస్తా?" వా.
అడుగుగులాము
- పాదదాసుడు.
"రమ్మని పొమ్మని తెమ్మని
యిమ్మని కానిమ్మ టంచు నే గొమరుంబ్రా
యమ్మున నానల నిడుసమ
యమ్ముననీదృశులు నాదునడుగుగులాముల్"
- భద్రావత్య. 2. ఆ.
అడుగు తప్పని
- జవదాటని.
- నా. మా. 94.
అడుగు దప్పక
- జవదాటక.
"పతిభక్తితోడ జరిపెడు,
వ్రతములు వల దనెడునట్టి వనితలు గలరే?
పతిమాట కడుగు దప్పక,
సతులకు ననుకూలబుద్ధి జరియింప దగున్." రుక్మాం. 4. 79.
అడుగు దప్పినచో దప్పు పిడుగు
- కొంచెము పొరపాటు చేసినా ప్రమాద మగును; కొంచెం జాగర్తపడితే అది తప్పును అనుట. పిడుగు పడునప్పుడు ఒక అడుగు అటు వేసిన ప్రమాదము, ఇటు వేసిన ఆ ప్రమాదం తప్పును. తద్వారా యేర్పడినపలుకుబడి.
- "అడుగు దప్పినచో దప్పు బిడు గటంచు."
- శుక. 1. ఆ. 319 ప.
అడుగు దాటడు
- ఏమాత్రం మాట నతిక్రమించడు అనుట.
- "వాడు అన్నమాట అడుగు దాటితే ఒట్టు." వా.
అడుగు దీయక
- వెనుకంజ వేయక.
- "కడగి సింహముమీద గవిసిన నైన నడుగు దీయక గుండె లవియు మోదుదుము."
- గౌ. హరి. ప్రథ. పంక్తి 477-78. అడు_____అడు 46 అడు_____అడు
అడుగున పడు
- విస్మృత మగు.
- "వాడు కౌముది అంతా చదువుకున్నాడు. కాని అది అంతా యిప్పుడు అడుగున పడి పోయింది." వా.
- "నా అర్జీ అడుగున పడి పోయింది. విచారించేనాథుడు లేదు. వా.
అడుగుపఱచు
- తక్కువపఱచు.
- "లలి గొ ప్పెక్కించితి మధుపుల, శుకులను నడుగుపఱచి పుష్పాస్త్రా! మా,లలకును మంచంబులు బా పలకును బీట లనుమాట బళి నిజమయ్యెన్." చంద్రా. 5. 91.
అడుగు పెట్టకుండు
- ముందుకు సాగకుండు.
- "...ఎంత చేసిన నాసింహ మెదుటి కడుగు వెట్ట దయ్యెను." కళా. 3. 86.
అడుగు బట్టు
- మూలబడిపోవు, క్రిం దగు.
- "బలు సెక నించువి ల్లడుగుబట్టినదే యిపు డాకు బూదిగెంపుల ద్రిరుచిత్వ మూది." ఆము. 4. 96.
అడుగు బడుగు
- కుండలో ఆఖరున మిగిలినది.
- "కాస్త అడుగో బడుగో యేదో ఒకటి వేయం డమ్మా. ఆకలిగా ఉంది." వా.
అడుగుభద్రం<.big>
- నెమ్మది, నిదానం, పదిలం.
- "వాడు వట్టి అడుగుభద్రం లేనిమనిషి. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలీదు." వా.
- చూ. అడుగు లేనిగిన్నె.
అడుగు మాడు
- చూ. అడుగంటు.
అడుగుమనిషి
- పాదసేవకుడు.
- పాండు. 4. 304.
అడుగు మాలిపోవు
- నిర్మూల మగు.
- "అనుజ తనుజులు జెలులు వియ్యములు నడుగు, మారిసోదరు నీకు గా మనుజ నాథ!, దొరకు గులనాశనుం డనుదూఱు మేలె, పాండవులతోడ నొడ గూడి బ్రదుక వయ్య."
- భార. ఉద్యో. 3. 341.
అడుగు ముట్టా
- పూర్తిగా.
- "ఆవిషయం అడుగుముట్టా తెలుసుకునే దాకా వదిలిపెట్ట దలచుకో లేదు." వా.
అడుగులకు మడుగు లొడ్డు (లొత్తు)
- అతిభక్తితో సేవించు.
- పూర్వం ఎవరైనా గొప్పవారు వస్తే వారి అడుగులు నేలకు తగులకుండా ఉతికిన బట్ట పరచి దానిమీద నడిపించుకొంటూ వచ్చేవారు. అందుపై వచ్చినపలుకుబడి. ఇప్పటికీ కొందఱి పెండ్లిండ్లలోనూ, శ్రాద్ధాలలోనూ గౌరవసూచకంగా బట్టలు పఱచి నడిపించుట కానవస్తుంది. అడు_______అడు 47 అడు_______అడు
- "జనయిత్రీజనకులం గని మది నడరుచు నడుగులకు మడుగు లొడ్డుచు నరుగు సెడ."
- పాండు. 2. 25.
అడుగుల వ్రాలు
- పాదాభివందనము చేయు.
- "దశరథు డడుగుల వ్రాలు తనయుల నిర్వుర దా గౌగిలించి."
- వర. రా. బా. పు. 207 పంక్తి 18.
అడుగు లాన
- పాదాల సాక్షిగా.
- ఒట్టు పెట్టేటప్పుడు చెప్పే మాట.
- "నీ యడుగులాన." కాశీ. 7. 179.
అడుగులు తడబడు
- "అడుగులు తడబడ నడరెడు నడపుం గడకల నడుములు గడగడ వడకం..." కళా. 6. 251.
- "అడుగులు తడబడ బులకలు, పొడమగ సఖివెనుక కొదుగ బోవుచు నరసెం." కళా. 7. 147.
అడుగుల కెఱగు
- నమస్కరించు.
- "సంతసంబున వచ్చి యా సంయ మీంద్రు, నడుగులకు నెఱగుడు నత డాదరమున." పారి. 2. 22.
అడుగులు సడుగులు
- చూ. అడిగండ్లు మడిగండ్లు.
అడుగులేని గిన్నె
- కుదురు లేని మనిషి.
- "వాడు వట్టి అడుగు లేనిగిన్నె. ఎక్కడా నాలుగునాళ్లు పని చేయలేడు." వా.
అడుగులో అడుగు వేసుకొంటూ
- మెల్లగా.
- "ఇలా అడుగులో అడుగు వేసుకొంటూ వెడితే యిక మనం చేరినట్టే." వా.
అడుగులో దాటిపోవు
- కొంచెములో తప్పిపోవు.
అడుగులో హంసపాదు.
- ఆరంభంలోనే విఘ్న మనుట. 'ప్రథమకబళే మక్షి కాపాత:' వంటిది.
- "వాళ్లు పిల్లను చూడ్డానికి వచ్చేసరికి మా అమ్మాయి ముట్టయి కూర్చుంది. అడుగులోనే హంసపాదు. ఏ మవుతుందో ఏమో!"
- చూ. అంచపదము.
అడుగువట్టు
- నీటిలో అడుగుభాగమునకు దిగిపోవు.
- నౌకలు మొదలగువానివిషయంలో నీరు లోతు తగ్గగా నేల తాకి ఆగిపోయినప్పుడు కూడా అడుగుపట్టిన దంటారు.
- "నిర్భరగతి ద్రచ్చుచో నడుగువట్టిన తద్గిరి యెత్తవే." పారి. 3. 29.
అడుగు వాసినచో నక్కఱ వాయు
- ఇల్లు దాటిపోతే ఇంక ఇంటి ధ్యాస ఉండదు.
- ఇది సామాన్యంగా మగ వాళ్లను గూర్చి చెప్పుటలో ఆడవా ళ్లుపయోగించే పలుకుబడి.