పదబంధ పారిజాతము/అం
విషయాలు:- అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఎ ఏ ఒ ఓ అం అః క ఖ గ ఘ చ ఛ జ ఝ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష ఱ |
---|
- అం అనిన ఢం అన నేరడు
- అక్షరక్రమం తెలియదు, చదువేమాత్రం రాదు.
చూ. ఓ అంటే నా రాదు.
"అక్కట ! పొట్ట చించిన నొకక్షరమైనను రాదు, టెక్కులుం డక్కులు గాని య మ్మనిన ఢ మ్మన నేరడు." - శుక. 4.38.
- అంకకా డగు : చలము పట్టువా డగు.
"కలహమున కంకకా డయి కాలు ద్రవ్వు." - ఆము. 5.84.
- అంక చండాల మగు : నానా బీభత్స మగు; రోత పుట్టించున దగు.
"చాపకూ డటె వానిజన్మ మాఱడి వోవ నంక చండాల మైనది మతమ్ము." - నాయకు. 21 పు.
- అంకపొంకాలుగ (జ్వరం కాయు) : విపరీతంగా...
"అంకపొంకాలుగా జ్వరం కాస్తూ ఉంది." - బ్రౌను.
- అంకమాలికలు : దేవునిపేరు ఉన్న స్తోత్రములు.
"లీల నీశ్వరు నంకమాలిక ల్వాడుచో గీతభేదంబుల రీతు లెఱిగె". కుమా. 3.38.
- అంకమ్మశోకాలు : వెఱ్ఱి యేడ్పులు.
- అంకమ్మసివాలు : పూనకం వచ్చినట్లు వేయు గంతులు.
- అంకవన్నె : రికాబు. గుఱ్ఱపుజీనుకు అటూ ఇటూ వ్రేలాడుతూ కాలు పెట్టుకొనుటకైన ఇనుప కడెము.
- "అంకవన్నె యొకటి సాహిణి యవ్వల నూదిపట్ట దనయనుగు చెలికాడు కైదండ యొసగ" - ప్రభా. 2.38.
"ఇల బాదద్వయి రాయ నళ్కొసగు నెందో పాఱుచో నంకవన్నెలు రెండై." - ఆము. 2.27.
చూ. అంకెవన్నియ; అంకెవన్నె.
- అంకాపొంకములు : కోపము; వైరము; తీవ్రము.
"అంకాపొంకాలు దరికొనంగ నిరంకుశ సాహస సమర్ధు డగు దశముఖుడున్." - రామా. 7.49.
"బెడిద మౌ శృంగార భూభత్సములకు నంకాపొంకములు." - కవిస. 1 ఆ.
"జ్వరము అంకాపొంకములుగా వచ్చినది." - శ.ర.
- అంకిత మిచ్చు : కృతి యిచ్చు. (2) అంకి.................అంకె
తిక్కన తన భారత భాగాన్ని హరి హర నధునకు అంకిత మిచ్చినాడు.వా.
- అంకితము చేయు: కృతి ఇచ్చు.
పోతన తన భాగతాన్ని శ్రీరామ చందునకు అంకితం చేసి నాడు. నా.
- అంకిత మొనర్చు: అంకిత మిచ్చు.
అంకిత మొనర్చు దెనుగునే ళ్ళరసి కూర్చి, గరిమతో నాంధ్ర నామ సంగ్రహమనంగ. అం.నా. దే. 3
- అంకిలి నొక్కుకొని పోవు: నోట మాట రాక పోవు. కొత్త. 13
- అంకిలి పడు: ఆగిపోవు.
అంకిలి పడి యడుపనులకు, సంకట పడుటదియు నొక విచారమె. భోజ. 6 అ. 376
- అంకిలి పెట్టు: అడ్డు, ఆపు. వాడాయిత శక్తి నన్ను నిట నంకిలి పెట్టినయప్డు. భా.రా.సుం.71.
- అంకిలి సేయు: వెనుదీయు. అంకిలి సేయక తూగ నోపినన్. భోజ. 7.17
- అంకురారోపణము: ఆరంభము. ఏ శుభ కార్య ప్రారంభంలో నైనా పాలికా పూజ చేసి, అందులో నవ ధాన్యాలు చల్లి మొలక పోస్తారు. అందుపై వచ్చిన పలుకు బడి. ఈనాదు మన కృషికి అంకురారోపణం జరిగింది.;;
- అంకురార్పణము: చూ. అంకురారోపణము. . చెల్వపు గ్రొవ్వు పెంపునంబొదరెడురంభకున్ సవతి పోరు గొంత చేసితి. కళా. 2.3
- అంకుశమునకు రానిది: మాట విననిది. ఏనుగు అంకుశంతో పొడిస్తే మాట వింటుంది. అలా విననప్పుడు అంకుశానికి రానట్టు. లక్షణయా మాట విననిది. వశమునకు రానిది.
- అంకెకు రాని: వశమునకు రాని. అంగన నమ్మ రాదు తనయంకెకురాని మహా బలాఢ్యు వే, భంగుల మాయ లొడ్డి చెలుపందలపెట్టు.
- అంకెకు వచ్చు: దారికి వచ్చు. ఇల నాయంకెకు రావు ఇంద్రియములు నాపైనా కలసి నా మర్మములే కాడి పారీ గానీ. తాళ్ళ. సం 10.58
- అంకెగొను: ఆక్రమించు, వశము చేసుకొను. (3) అంకె......................అంగ.
మబ్బులదరి పూత్కృతి రవి మధ్య మంకెగొనగ జిక్కు వడక చరించునందొక్క కరటి.; రా.వి.3.49.
- అంకెవన్నియ
- రికాబు. గోమేధికంబుల గొన్మరొందుకళ్ళెంబు పజాలమే లంకెన్నియులుమ.
ఉ.ర.7.అ. 397. చూ. అంకవన్నె.
- అంకెవన్నె
- రికాబు. వడి గట్టి కవారలు పావడ మిడి హెచ్చరిక రాయ వర గండ యనన్, బెడ యంకెనన్నెపై గా, లిడ కపుడు చివుక్కు మనగ నెక్కెండేజిన్. కువల 2, ఆ, 56
చూ. అంకవన్నె; అంకవన్నియ.
- అంకె వేసుకొను
- కాడిని మెడ క్రింది వేసుకొని ఎద్దు ముందుకు నడవ నిరాక రించు. ఇంక బండి ఏం నడుస్తుంది. వలపటి గిత్త కాస్తా అంకె వేసుకున్నది. వా
- అంకగొను
- అడుగు వేయ - ముందుకు నడుచు. అపఖ్యాతి నీకు నని నంగ గొని కొలి పించితి గొలుచు.
పండ్సితా. ప్రధ. పురా. పుట 288.
- అంగజాల
- కంచుకు, రాణి వాసం కాపలా మనిషి. అంగ జాలలు కాలు కాలం బెనచుకొని చాప కట్టు వడం గూలిన. కాశీ. 6 .అ. 227
- అంగట్లో పెట్టు
- అంగడి పెట్టు, బహిర్గతము చేయు. చూ. అంగడి పెట్టు.
- అంగడి కెక్కు
- వీధి కెక్కు, బజారు కెక్కు, బహిరంగ మవు.
మారుని చేతి ఘాత నభిమానము లోక సఖీ జనంబ్ ఉచే, నారడి గప్పినన్ వలపు లంగడి కెక్కక కోరి నప్పుడే, కూరిమి వల్లభుం గలిసి కోర్కి ఫలించి సుఖించు కన్నియల్.... కనిక. 3.82
- అంగడికెత్తిన దివ్వె
- ఇతరుల కుపయోగపడునది. చూ. బయల నెత్తిన దెవ్వె. తాళ్ళ.సం. 5-1
- అంగడి నమ్మికొను
- అందులోనె పడి తన్ను కొను.
ఆపద లంగడి నమ్మీ కొనరోపాపాత్ములు పైపై బడకా. తాళ్ళ. సం. 5.42
- అంగడి పెట్టు
- బట్టబయలు చేయు. బట్టబయలు చేయు.
తలపున నెంత మోహపర్తాపము గల్గిన దాచుకొందురో, యలయిక లేక యీ కరణి నంగడి పెట్టుదురో లతాంగులు.... కువల. 3.43 పేద తెవులింక నంగడి బెట్టకున్న దీఱదు. సుదక్షి. 2.51
- అంగడి బడు
- పాఱి పోవు, బజారున బడు 4
అంగ........................................అంగ
అవల భయపడ్డ వారంగడి బడితే దొర, లోపుల విచారించి వూరడింతు రంత లోనె. తాళ్ళ. సం. 80-70
- అంగడివాడ
- బజారు, అంగడి వీధి.
- అంగడివీధి
- బజారు.
చిత్తూరు జిల్లాలో నేటికి బజారును అంగడి వీధి అనే అంటారు. అంగళ్ళున్న వీధి.
- అంగదట్టము
- పావడ, గాగర, (అంగధట్టి = కన్నడం)
తతనితంబా భోగ ధవళాంశుకములోని యంగదట్టపు గావి రంగు వలన, శసి కాంత మణి పీకి జాజు వారగ. మను: 2.27
- అంగన్యాసం
- జపానికి ముందు ఆయా అవయవాలను ఆయా మంత్ర భాగం అంటూ తాకుట.
చూ: కరన్యాసం.
- అంగ ప్రదక్షిణం
- ఏ దేవాలయాన్నో తిరిగి ప్రదక్షిణం చేయ కుండా తానే గిరగిర తిరిగి ప్ర్దక్షిణం చేయుట.
- అంగబిళ్ళ
- మాన బిళ్ళ. ఆడ పిల్లల మొలకు కట్టే బిళ్ళ.
- అంగభోగము
- అంగ పూజ.
పండితా. ప్రధ. దీక్షా. పుట 200
- అంగమొల
- దిసమొల ... బట్టాబాతా లేని స్థితి.
- అంగమొల లగు
- దిగంబరులగు:
మదన భూతము సోకిన మగువలు పురుషులు, అదనవిరదలై అంగ మొల లై పెదవి నెత్తురు లీర్చి. ---తాళ్ళ. సం. 9-2=5
- అంగయినచోటు
- అన్నీ అమరిన చోటు:
- అంగరంగ భోగములు
- అంగరంగ్ద వైభవము.
- అంగరంగ వైభవము
- దేవుని ఊరేగింపులో అన్ని హంగులూ ఏర్పరచి బయలు దేర దీసినప్పటి వైభవం.సారం. 1.24
రంగడు అంగరంగ వైభవములతో వేంచేస్తున్నాడు. [బ్రౌన్]
- అంగ రక్ష
- 1. తాయెత్తు, లేక యంత్రము. 2. రక్షకము.
మంత్ర శాస్త్రములో కొన్ని యంత్రాలను రాగి రేకులపై వ్రాసి అట్లే కాని, ఆ రేకులను తాయెత్తులో ఉంచి కాని కట్టితే ఆయా పీడలు ఆయా యంత్రాల మూలంగా తొలగునని అంటారు. .... వర. రా. బా. పు. 116 పంక్తి. 18 అంగ_______అంగి 5 అంగి_______అంగు
అంగరొల్లెలు
- ఒకరక మైనపిండివంట. హంస. 1,105.
అంగలార్చు
- ఏడ్చు, వగచు
- "అకంఠంబుగ నీవు మాధుకరభిక్షాన్నంబు భక్షింపగా లేకున్నన్ గడు నంగలార్చెదవు మేలే లెస్స." కాశీ. 7,162.
- "రాలేదు రాలేదు అని ఊరికే అంగలారుస్తూ కూర్చుంటే ఏం లాభం రా ? ఏదో ఒకటి చెయ్యాలి గాని." వా.
అంగలు వేయు
- కాలు చాచి అడుగుడు, గబ గబా నడచు
- "వాడు అంగలు వేసుకొంటూ వెళ్లాడు." "వాడు అంగలు వేసుకుంటూ నాలుగు నిమిషాల్లో ఇల్లు చేరుకున్నాడు." వా. చూ. అంజెలు వేయు.
అంగళ్ళవాడ
- .బజారు, అంగడివీధి
అంగవస్త్రము
- పై పంచ-ఉత్తరీయము.
అంగిట నూరు అమృతము
- అందుబాటులో ఉన్న మనోరథపరిపూర్తి కారకము.
- ముంగిటపెన్నిధి అనుట.
- ఏమాత్రం శ్రమించక అంగిటనే అమృత మూరుతుంటే ఇం కేం? ఎంతైనా త్రాగవచ్చు గదా. అందుపై వచ్చినది.
- "ముంగిటపెన్నిధి దంగేటిజున్ను, నంగిట నూరెడునమృతం బనంగ"
- చూ. ముంగిటపెన్నిధి.
అంగిటబెల్ల మై
- ఏమీ అన లేక
- "అధిపు డాడుమాట కంగిటి బెల్ల మై కూరుచుండి రొదిగ గుటక లిడుచు."
- నాయకు. 44 పు.
అంగిటముల్లు
- కిఱునాలుక, కొండనాలుక అగు.
- "నీకు నఱిమియో? కోనయో? యంగిట ముల్లొ? ఎఱుగను మందు ంరాకేమి?" బసవ. 3 అ. 59 పు.
అంగిటము ల్లొత్తు
- చిఱునాలుక లేక కిఱునాలుక-కొండనాలుక జారినప్పుడు దగ్గు వస్తుంది. దానిని వెల్లుల్లి, మిరియం దంచి నడిమివేల నుంచుకొని ఒత్తుతారు. అది పైకి వెళ్ళి పోతుంది.
- బస. 3 అ. 58 పుట.
- చూ. చిఱునాలు కగు. కొండనాలుకగు.
అంగుటమున నేల వ్రాయు
- కాలి బొటనవ్రేలితో నేల వ్రాయు. ఇది సిగ్గును సూచించును.
- ద్విప. భాగ. 134 పు.
అంగుడుదుడువు
- మాటలు మోసేవాడు, తంటాలమారి. అంగు______అంచ 6 అంచి______అంచు
అంగుడు లేదు
- నోరు చచ్చినవా డనుఓట్ల ఉపయోగించేమాట.
- "అంగుడు లేనట్టుగా అలా కూర్చున్నావేమి రా?" వా.
అంగుదారు
- ప్రోత్సాహకుడు
- బోగంమేళంలో వెనుకపాట పాడేవారిని అంగుదారు లంటారు. తద్ద్వారా వచ్చిన పలుకుబడి.
- చూ. హంగుదారు.
అంగుష్ఠమాత్రుడు
- పొట్టివాడు.
- "అంగుష్ఠమాత్రుడికి ఆ అమ్మాయిని అలా యిస్తాము. అదేమో ఒడ్డూ పొడుగూ అయిన పిల్ల.""
అంగోస్త్రపు పొట్ట
- లావాటి మనిషి.
అంచనా వేయు
- ఏపని కయినా ముందు ఇంత కావచ్చు నని ఉజ్జాయింపుగా లెక్క వేయు.
- "ఈ ప్రాజెక్టుకు యాభైలక్షలు అవుతుందని అంచనా వేశారు."
- "ఈపని రెండునెలలలో కావచ్చు నని అంచనా వేశాము. చూడాలి." వా.
- చూ. అంచించు/
అంచపదము
- హంసపాదు.
- వ్రాతలో ఏ దయినా మరిచి పోతే హంసపాదము వంటి గురుతు వేసి పైన వ్రాస్తారు. అందుపై వచ్చినపలుకుబడి.
అంచించు
- అంచనా వేయు.
- తమి. "అంజిత్తల్."
- చూ. అంచనా వేయు.
అంచి పుచ్చు
- పంపు.
- "ప్రతిగ నందుల కంచి పుచ్చు."
- భార. అశ్వ. 3
అంచు గట్టుకొని వచ్చు
- అంతము సమీపించు, ముగియ వచ్చు.
- "వాడి కేదో అంచు గట్టుకొని వచ్చింది. అందుకే నాతో చెల్లాటం ఆడుతున్నాడు." వా.
- "ఆ వ్యవహారం అంచు గట్టుకొని వచ్చింది. ఇక తెలుస్తుంది అయ్యపని." వా.
అంచుముట్టని
- వగ దెగని
- "ఈయంచుముట్టని సింగారము లేమి?"
- పాంచా. 4 అ.
- "ఇంకా యీపని అంచుముట్ట లేదు. ఇదేమి అంచు ముట్టే వ్యవహారంగా లేదు." వా.
అంచులవాడు
- చిత్రకారుడు, బట్టలకు రంగులు వేయువాడు.
అంచులు తీరినవయసు
- సమగ్రయౌవనము.
- "అంచులు తీరినవయస్సులో ఉందా? అలా చేయక ఏం చేస్తుంది?" వా. అంచు______అంజ 7 అంజ_______అంజె
అంచులు తీరు
- సమగ్ర మగు, నిం డగు.
- చూ. అంచులు తీరిన వయసు.
అంచెలు గట్టు
- బారులు కట్టు.
- "అనిలంబు లేడును నంచెలంచెలు గట్టి యాకాశవీధి నందంద నడవ."
- కాశీ. 1. 182.
- "అంచెలు గట్టి కాళ్లతొడు పై చననీవు గదమ్మ ప్రోదిరాయంచలు?
- మను. 5. 61.
అంచెలంచెలుగా
- అక్కడక్కడా ఆగుతూ దశలవారీగా.
- అలుగురాజు. 42 పు.
అంచెలమీద
- అక్కడక్కడా గుఱ్ఱాలను మారుస్తూ.
- పూర్వం తపాలు తీసుకొని పోవుటకూ, ఏదయినా రాజ కార్యముమీద పోవునపుడూ సరాసరి ఒకే గుఱ్ఱం లేదా గుఱ్ఱాలజత చాలదూరం పోవడం అసంభవం కనుక అక్కడక్కడా వానిని మార్చి వెళ్లేవారు. దానిమీద వచ్చిన పలుకుబడి.
అంజనమున మాటలాడ నేల?
- కనబడుతున్న దానికి వర్ణన యెందుకు?
- నిధులు తెలుసుకొనుటకు అంజనమును వేసేవారు, ఏవో కొన్ని మూలికలను కాల్చి ఆపొడిని నూనెలో కలిపి అంజనం తయారు చేస్తారు. దానిని తమలపాకువంటి దాని మధ్యలో బొట్టుగా పెట్టి దీపంముందు దాని నుంచి ఎవరినో-సామాన్యంగా పిల్లలను చూడ మంటారు. అందులో అవన్నీ వారికి స్పష్టంగా కనిపిస్తాయని అంటారు. కనబడుతున్న దానికి ఇక చెప్పవలసిన అవసరం లేదు కదా! అందుపై వచ్చినపలుకుబడి.
- "అంజనంబున మాటలాడ నేమిటికి? ముంజేతి కంకణంబున కద్ద మేల?"
- సారం. 1. 844.
అంజలి గుంజలి యార్చు
- గట్టిగా అఱచు.
- "అంజలి గుంజలి యార్చి."
- బసవ. 4. 194.
అంజలి చేయు
- నమస్కరించు.
- "అనలుం డంజలి చేసె నంతకుడు సాష్టాంగంబు గావించె." పారి. 3. 7.
అంజలి యొనర్చు
- నమస్కరించు.
- "జయదేవ సుకవి కంజలి యొనర్చి."
- రుక్మాం. 1. 13.
అంజెలు వేయు
- గబగబ నడచు.
- "ఆ అమ్మాయి వచ్చిం దనేసరికి వాడు