అంట_______అంట 8 అంట_______అంట

అంజెలు వేసుకుంటూ వెళ్లాడు." వా.

  • చూ. అంగలు వేయు.

అంటకత్తెర వేయు

  • వెంట్రుకలు కుఱుచుగా కత్తిరించు.

అంటక ముట్టక

  • చూ. అంటి ముట్టక.

అంటకాగు

  • జతగా దగ్గఱ ఉండు.
  • కొత్త. 102.

అంటకుండి ఆడుప్రాయము

  • చిఱుతప్రాయము.
  • సంసారంలో కల్పించుకోకుండా ఆడుతూ పాడుతూ గడిపేప్రాయం అనుట.
  • "అంటకుండి యాడునట్టి ప్ర్రయ మొకింత నడుచు నంతలోన..."
  • కళా. 6. 76.
  • చూ. అంటి కుంచి ఆడుప్రాయము.

అంటగట్టు

  • 1. బలవంతముగా తగులగట్టు.
  • "నే నెంత వద్దని మొత్తుకున్నా వినకుండా ఆపిల్లను నా కంట గట్టినాడు. నేను నానాబాధా పడుతున్నాను." వా.
  • "నేను పోయేది లేదు. పెట్టేది లేదు. వద్దంటే వినకుండా అదేదో బెనిఫిట్ నాటక మని వాడు నా కొకటిక్కెట్టు అంటగట్టి పోయినాడు."" వా.
  • 2. ఆరోపించు.
  • ఎవడో చేసినతప్పు నా కంట గట్టాడు." వా.

అంటగట్టుకొని

  • వెంటబెట్టుకొని, కలిసి యుండి.
  • "రాకుమారుని నంటం గట్టుకొని శంఖ లిఖితుల కట్టెదురం దెచ్చి."
  • జైమి. 4. 125.
  • "వాడు ఎక్కడికి వెళ్లినా భార్యను అంటగట్టుకొని పోతుంటాడు." వా.
  • "వాళ్లిద్దరూ ఎప్పుడూ అంటగట్టుకొని తిరుగుతూ ఉంటారు." వా.
  • చూ. అంటగట్టు.

అంట గదుము

  • తుదివరకూ తరుముకొనిపోవు.
  • "ఎడబాయనీక బల్విడి నంట గదుముచు, నట్టిట్టు వడి ద్రోపులాడు నవియు." కళా. 8. 81.

అంటగ నేయు

  • నాటునట్లు వేయు.
  • "కుశు నురం బానక పర్వశరాహతిచే నంటగ నేసి." జైమి. 6. 185.

అం టగు

  • ము ట్టగు.
  • "కోడలు అంటయింది. మాటాడుతూ కూర్చుంటే ఎట్లా అమ్మా!" వా.

అంట దఱుము

  • దొరికేవరకూ తరుము.
  • "అగ్ని నాలుక లేడు నంట దఱిమి."
  • కాశీ. 3. 31.

అంట పొడుచు

  • బాగా నాటునట్లు పొడుచు.

అంట బలియు

  • బాగా బలియు, రెండూ కలిసి పోవునట్లు అనుట.
  • "అంట బలిసినతొడలు."
  • గౌర. హరిశ్చం. పం. 1088. అంట_______అంటి 9 అంటి________అంటి

అంటముట్టరాని అగ్రహారము

  • మతీ సున్నిత మైనమనిషి - ఏమన్నా ఓర్చుకో లేనివాడు అనుపట్ల ఉపయోగిస్తారు.

అంటరానివాడు

  • అస్పృశ్యుడు.
  • లక్షణయా సంబంధ ముంచు కొనరానివా డని అర్థ మయినది.
  • "వాళ్లందరూ కలిసి న న్నంటరాని వాణ్ణిగా చూస్తున్నారు." వా.

అంటలుగట్టు

  • అతుకుకొనిపోవు, గుంపు చేరు.
  • "వాడు చాలనాళ్లు జబ్బుపడ్డాడు. వెంట్రుక లన్నీ అంటలు గట్టుకొని పోయినవి."
  • "జనం అంటలు గట్టుకొని ఆతిరు నాళ్లను చూస్తున్నారు."

అంటించు

  • ముట్టించు, కొండెములు చెప్పు.
  • "సాయంత్రం అయింది. దీపం అంటించు. పొయ్యి అంటించు."
  • "ఇక్కడ ఒకమాట అనీ అనక ముందే వాడు పక్కింటికి వెళ్లి అంటించి ఉంటాడు. అందుకే వాడంటే భయం నాకు." వా.

అంటి కుంచు ఆడుప్రాయము

  • చిన్న తనము.
  • ఆడుకొనువయసు అనుట.
  • "అంటి కుంచి యాడునట్టిప్రాయ మొకింత, నడచునంతలోన నాదుసతులం, బుణ్యశీలయుతల బోకార్చుకొన్నట్టి, నాకు బుత్రు లనుట నగవు గాదె!"
  • కళా. 6. 75.
  • చూ. అంటకుండి ఆడు ప్రాయము.

అంటితే మసి అవుతుంది

  • కల్పించుకొంటే ఏమి వస్తుందో అని దూరదూరంగా ఉండేవారివిషయంలో అనేమాట. వంటయింటిలో పుట్టినపలుకుబడి కావచ్చును.
  • "వాడు అంటితే మసి అవుతుంది అన్నట్లు ప్రవర్తిస్తుంటాడు." వా.

అంటి బాస చేయు

  • ఒట్టు పెట్టుకొను.
  • "అంటు పడ లేదటంచు మి మ్మంటి యిపుడు, బాస లెల్లను జేసెద భాసురాంగి." రాధి. 4. 10.

అంటి ముట్టక

  • తనకు సంబంధము లేనట్లు.
  • "వాడు ఈవిషయంలో అంటి ముట్టక తిరుగుతున్నాడు." వా.

అంటి ముట్టరాని అగ్రహారము

  • సున్నిత మైనది.
  • అగ్రహారాల్లో పూర్వం బ్రాహ్మలే ఉండేవారు. కాబట్టి అది చాలా ఆచారవంత మైనది అనుటపై యేర్పడిన పలుకుబడి. ఏమి అన్నా నొచ్చు కొనేవారి విషయంలో ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటి_______అంటు 10 అంటు________అంటు
  • "ఇంత అంటిముట్టరాని అగ్రహార మైతే నలుగుర్లో తిరగడ మెందుకురా? నలుగురితో కలిశాక ఎవరో ఒకరు ఏదో ఒకటి అననే అంటారు." వా.

అంటి ముట్టేవారు

  • కులస్థులు.
  • "అంటిముట్టేవాళ్లు లేనిఊళ్లో ఉండడం కష్టం." వా.

అంటుకాడు

  • స్నేహితుడు, ప్రియుడు.
  • "అటువలె నంటుకాడు చనినంత." శశాం. 4. 28.

అంటుకుంటే వదలడు

  • వట్టి కబుర్లపోతును చూచి అనేమాట.
  • "అదుగో వా డొస్తున్నాడు. అంటుకుంటే వదలడు. త్వరగా వెళదాం పద." వా.

అంటుకుండ

  • వంట చేసి కడుగనికుండ.

అంటుకొనిపోవు

  • కఱచుకొనిపోవు, తగులుకొను.
  • "కాగితాలు అంటుకొని పోయినవి"
  • "వాడు దాన్ని అంటుకొని పోయినాడు." వా.

అంటునూనె

  • తలంటు నూనె.

అంటుపట్టు

  • అశౌచము వచ్చు.
  • తనవాళ్లు చనిపోయినప్పుడో, ప్రసవించినప్పుడో వచ్చే మైలను అశౌచం, అంటు అని అంటారు.- జాతాశౌచం, మృతాశౌచం - అని అది ద్వివిధం. తద్ద్వారా వచ్చిన పలుకుబడి.
  • "ఈనెలలో సత్యనారాయణవ్రతం చేసుకుందా మనుకుంటూంటే యింతలో మా బావగారు చనిపోయి మాకు అంటు వచ్చింది." వా.

అంటుపడు

  • ము ట్టగు.
  • చూ. అంటుపడు.

అంటుపోగులు

  • చెవులకు అంటుకొనునట్లుగా చేసిపోగులు.

అంటుమోవ తెగు

  • పూర్తిగా తెగు.
  • "కలనూ లెల్లను నంటుమోవ దెగిరాగా గొంతసే పుండి." ఆము. 4.3.

అంటుఱాయి

  • సూదంటురాయి, అయస్కాంతము.
  • "ఇను మంటుఱాతికి నెగసినభంగి." భాగ. 7 స్కం.

అంటువడు

  • ము ట్టగు.
  • "మా ఆవిడ అంటుపడ్డది. ఇంక నేనే చేయి కాల్చుకోవాలి." వా.

అంటు వాయకుండు

  • విడువక తిరుగు.
  • "గమనించుతఱి మందగమనశృంగారాప్తి, నంటు వాయక వెంట వెంట సెయిదు." సుక. 1. ఆ. 391 ప.
  • చూ. అంటి యుండు, వెన్నంటి యుండు