పంచతంత్రము (బైచరాజు)/ద్వితీయాశ్వాసము
శ్రీరస్తు
పంచతంత్రము
ద్వితీయాశ్వాసము
గౌరీవక్షస్తను | 1 |
వ. | దేవా సుహృల్లాభాభిధాన ద్వితీయతంత్ర మాకర్ణింపు మధీతనీతిశాస్ర్రమర్ముం | 2 |
క. | సాధించెఁ గార్యముల ధన, సాధనములు లేక సారసౌహార్దసమా | 3 |
క. | నా విని రాజకుమారకు, లావిప్రునిఁ జూచి పలికి రదియెట్లు నయ | 4 |
క. | శతమఖవనసఖవిటప, స్థితిమహిళారోప్యనగరిచేరువఁ గల ద | 5 |
సీ. | వసుధ నెవ్వనిసదన్వయకర్త జేజేలఱేనికిఁ గుల ముద్ధరించుకొడుకు | |
తే. | ప్రజ్ఞ పెంపున నెవ్వానిబలమునకును, బ్రహ్మకొడుకైన లెక్కఁ జెప్పంగచాల | 6 |
క. | ఆకాకి నాకపథమున; నేకాకిత మేఁతలాడ నీరము గములం | 7 |
చ. | వెడవెడఁ జంకఁ జిక్కమున వ్రేలెడుచల్దియు సందిలోహపుం | |
| బడిశము జుంజుఱుందల తపారము జేగురుబొట్టు మేఖలం | 8 |
క. | వచ్చిన వాయసపతి దన, యిచ్చ న్వెఱబొమ్మవంటియితఁ డెందులకై | 9 |
క. | పులుగుడిసెఁ బన్ని వల శా, డ్వలధరణిం బాఁదుపఱిచి వ్రస్సినకన్ను | 10 |
శా. | చిత్రగ్రీవుఁ డనంగ నొక్కవిహగశ్రేష్టుండు సత్కృత్యకృ | 11 |
క. | పులుఁగులఁ బినుఁగు కిరాతుఁడు, వలఁ దవులఁగఁ దిగిచి తగ్గి వగ్గెరపగ్గం | 12 |
వ. | అంతఁ బతత్రిసుత్రాముం డనుజీవులఁ గేవలయత్నంబునం బిలిచి దుష్కర్మానుకూ | 13 |
క. | ఆవిధి విధిమూఁడక వడిఁ, బోవఁగ నిది యననుభూతపూర్వం బనుచున్ | 14 |
ఉ. | ఎప్పుడు నేల వ్రాలు శ్రమ మేర్పడ ఱెక్కలు నొచ్చి పెచ్చుగా | 15 |
క. | అతిలాఘవమున నల లఘు, పతనకుఁడు న్దత్కపోతపతివెంబడి న | 16 |
క. | జాలగ్రాహివిహంగమ, జాలముఁ బరికింపలేక జాఱనిజాలిం | 17 |
క. | ఆవడువున నలచిత్ర, గ్రీవుఁడు దూరంబు నరిగి భృత్యుల నటుసం | |
| భావించి పలికె నోహో, ధావన మఱి యిచట వ్రాలుదమె యిందఱమున్. | 18 |
చ. | సకలపధీనమానసుఁడు శాంతిసమగ్రుఁ డజాతశత్రుఁ డం | 19 |
చ. | నిలువుఁడు నావిహంగములు నిల్చె బిలస్థలభూమి నంత న | 20 |
చ. | పలికె సఖా యఖండనయపారగతుండవు దీర్ఘదర్శి వే | 21 |
క. | అని వగచుహిరణ్యకుఁ గనుఁ, గొని చిత్రగ్రీవుఁ డనియె గూర్మిసఖా నా | 22 |
క. | ఏవాసరమున నెద్దెస, నేవయసున నెట్టికర్మ మేమఱఁ డెవ్వాఁ | 23 |
క. | కలకాలము లే దలమట, కలకాలము లేదు సుఖము కాయము మోసం | 24 |
క. | దైవికము లైనపనులకు, వావిడువఁ డవార్యధైర్యవంతుఁడు నయరే | 25 |
వ. | అనుచిత్రగ్రీవునకు హిరణ్యకుం డిట్లనియె. | 26 |
క. | వేసట నొందక లఘువి, న్యాసంబున నూఱుయోజనము లరిగి సుఖ | 27 |
క. | అక్కట యాపల్లతలం, జిక్కక నయసరణిఁ ద్రొక్కు చిత్రగ్రీవుం | 28 |
క. | ఆపత్సంపద లలఁతులఁ, బ్రాపింపవు ఘనులగాని ప్రజ్ఞంబొడవై | 29 |
చ. | ఉరి విహగవ్రజంబునకు [3]నోదము దంతికి ముందు చిల్వకుం | 30 |
చ. | గగనమునం జరించుపతగంబు లగాధసముద్రవారిలోఁ | 31 |
క. | అని [4]యాఖులేఖపతి నె, మ్మనమున నస్తోకశోకమగ్నుండై వ | 32 |
వ. | అప్పు డవార్యధుర్యతుహినగ్రావుండగు చిత్రగ్రీవుండు సుహృల్లోకశరణ్యుండగు | 33 |
క. | పరహితచరితా యస్మ, త్పరివృతబంధములఁబోలెఁ బరిచరబంధో | 34 |
క. | సిరి గూడదు కూడినఁ బదు, గురుగలవాఁ డడఁచి పుచ్చుకొనుఁ బరవీరుల్ | 35 |
వ. | అరునప్పలుకుల కలరి హిరణ్యకుండు. | 36 |
క. | హితభృత్యులతో నేభూ, పతి కలఘుస్నేహసంవిభాగము లమరున్ | 37 |
క. | పరివారముపట్టున నా, దరలేశము లేని భూమిధవుఁ డభివృద్ధిం | 38 |
చ. | అదననుజీవితం బిడమి యారజమాడుట లేనినేరము | 39 |
ఆ. | సైన్యధాన్యబంధుసమ్మర్ధముల నెవ్వఁ, డోర్సు గలిగి పుడమి నుల్లసిల్లు | 40 |
క. | అని బలికి జాలగుణము, ల్దునియలుగాఁ జేసి ఖగపతుల వెడలించెన్ | |
| జనితాదృతి మూషకపతి, ఘను లాప్తులసేగి కోర్వఁగాలేరుగదా. | 41 |
శా. | చిత్రగ్రీవునిఁ గౌఁగిలించుకొని తత్సేనం దురంతాదృతి | 42 |
క. | జాలము నఱికి విహంగమ, జాలము బ్రతికించి కొలముసాముల హేలా | 43 |
సీ. | పదధరాధిపభేదకరము నీకరము నీవివరంబు బహుమార్గవిశ్రుతంబు | |
తే. | నీకరుణ లక్ష్మి వాటిల్లు నీరసజ్ఞ, సత్యభారతి నిలుచు నీసన్నిధాన | 44 |
క. | ప్రతిలేనికరుణ నీడజ, పతిమృతికిం బాపి సుగతిఁ బడసితి నీసం | 45 |
క. | భవదీయస్నేహము నా, కవిరళతేజోవిధాయి యగు నెయ్యుఁడవై | 46 |
క. | కయ్యమునకు నెయ్యమునకు, వియ్యమునకు సమత వలయు వేఱొకఁడైనన్ | 47 |
క. | బలహీనుఁడ నేను మహా, బలుఁడవు నీ వధముఁ డెట్లు బలవంతునితోఁ | 48 |
క. | అమరదు నీపొత్తు వృథా, శ్రమఁ బెట్టకు భోక్త నీవు భక్ష్యమ నే నం | 49 |
క. | బలవంతము కాకము నే, బలహీనుఁడ ననుచు విడిచి పలుకకు ప్రజ్ఞా | 50 |
క. | తల ద్రివ్వక మింగెద వని, పలికెద వే నట్టిదుస్స్వభావుఁడనే నీ | 51 |
క. | నీవంటియుత్తముఁడు సుఖ, జీవితుఁడై యున్న నేను జిరజీవిఁ జుమీ | 52 |
చ. | పరుషవిశృంఖలాలపనపంక్తుల సాధుమనంబు లీక్రియం | |
| ధరపరిరంభసంభ్రమణతత్పరతుంగతరంగహస్తదు | 53 |
క. | అనులఘుపతనకుపలుకులు, విని మూషకరాజు పలికె వెఱ్ఱీ నీతో | 54 |
క. | తనగుణముఁ బూనియున్నాఁ, డని పగతుని నమ్మబోల దనిశము మదిలో | 55 |
క. | పోలినది పోలు నెచ్చోఁ, బోలనియది పోల దంబుపూరంబునఁ బోఁ | 56 |
క. | మోసం బూరక తలఁచుం, జేసినమే ల్మఱచు విశ్వసించినఁ జెఱుచున్ | 57 |
వ. | సుజనశబ్దంబు పురాణోక్తంబుగా విచారించెద నిష్టుం డయ్యును బహుసుకృతోపలా | 58 |
క. | పరపురుషచింత యంతః, కరణంబునఁ గలిగి మగనిఁ గరఁగించుతలో | 59 |
క. | నేరము లొనరించిన నుప, కారము సేయుదుము నొవ్వఁగాఁ బల్కినఁ గై | 60 |
ఉ. | కావున నిన్నువంటి బలగర్వసమగ్రులతోడిమైత్రి దుః | 61 |
క. | చెలిమికి దూరస్థుఁడవై, తొలఁగి చన న్మదిఁ దలంచెదో యది నాతో | 62 |
క. | అనలమునఁ గాఁచి లోహము, నెనయించినకరణి వేఁడినేనియుఁ బ్రజ్ఞా | 63 |
క. | ఖలుఁడు సుఖభేద్యుఁ డతిమృ, త్కలశగతి న్సజ్జనుండు గాఢాగ్నిశిఖా | 64 |
తే. | అట్లు గావున నినువంటి యనఘచరితు, వెఱపుపనినైన సఖునిఁ గావించుకొనఁగ | 65 |
క. | అరివలె నుండుట క్రియలం, బరమాప్తస్ఫూర్తిఁ దేటపఱుచుట యదివో | 66 |
క. | మతిశంక లేక మూషక, పతి వివరము వెడలి కరటకపరివృఢుతో న | 67 |
వ. | అట్లు కృతసఖ్యుండగు నయ్యుందురుముఖ్యుండు విందుఁ బెట్టి వీడ్కొలిపిన దరి | 68 |
ఉ. | పోయెద నిప్పు డన్యవనభూమికిఁ బ్రాణసఖా ప్రమోదసం | 69 |
చ. | ఇట నను డించి యేమికత మేఁగెదు చెప్పఁగదన్న యెట్టు లె | 70 |
చ. | అని కనుదోయి చెమ్మగిల నాకృతి విస్మృతి నొంద మూర్ఛవో | 71 |
ఉ. | నాపయనంబు విన్ము కరుణావరుణాలయ వృత్రశాత్రవా | 72 |
ఉ. | అతఁడు నాకుఁ బ్రీతివశుఁడై యొనరించు ననూనమీనమాం | 73 |
చ. | ఉడుగనివంత నింతతడ వూఱట లేక పరాకువోలె మే | 74 |
వ. | లఘుపతనకుం డిట్లనియె. | 75 |
ఉ. | కాదన నేల వచ్చెదవుగాక సఖా వెఱఁ గావహిల్లె ని | 76 |
క. | నావుడు దత్తప్రతిభా, షావర్గుం డగుచు వాయసస్వామి నయ | 77 |
వ. | పఱచి యగాధకరంబగు తత్సరోవరంబున కరిగి తీరంబున హిరణ్యకు నునిచి లఘుపతన | 78 |
చ. | అనుదినదూరితాఖిలశఠా కమఠా యితఁ డాఖుఁలేఖరా | 79 |
క. | క్షణభంగురములు కపట, ప్రణయంబులు ప్రాణపతనపర్యంతంబున్ | 80 |
క. | చావునకుఁ బాపెఁ జిత్ర, గ్రీవుని నిటువంటిపుణ్యకృత్యము లాహా | 81 |
వ. | అని లఘుపతనకుం డుత్కర్షించిన నాశ్చర్యధుర్యండై కమఠవర్యుండు హిరణ్యకున | 82 |
ఉ. | వీనుల నీచరిత్రములు వింటిఁ గృతార్థుఁడనైతి సత్యభా | 83 |
ఆ. | అనఘ సఖ సఖుండ వగునీకు మామక, వ్యథనకథన మభినయం బొనర్చి | 84 |
సీ. | విను మహిళారోప్యమనుపట్టణము సర్వసౌభాగ్యవిలసనాస్పదము గలదు | |
తే. | పెట్టుకొని పెద్దగాలంబు నిలువవలసి, స్నాన మొనరింపఁ డోంకారజపముఁ దడవఁ | 85 |
క. | కుక్షింభరుఁ డగునలయా, భిక్షుఁడు వేసరక తిరిగి భిక్షించిన యా | 86 |
క. | ఆయతికూరిమిసఖుఁడు క, థాయతశతపారగుఁడు బృహస్వీకనువాఁ | 87 |
క. | వచ్చి పురాణోక్తకథల్, నెచ్చెలి వినుమనుచు నాతనికి రసధారల్ | 88 |
క. | అగుటయుఁ గథకుం డాయతి, మొగ మారసి పలికె మాఱుమొగ మైతి వయో | 89 |
శా. | నా కీచందముఁ దెల్పి చెప్పు మన విన్నంబోయినం బల్కెఁ జూ | 90 |
క. | నా కెక్కడిది పరా క, స్తోకంబగు నలుక నెలుకఁ జూచెద నని చూ | 91 |
క. | ఇక్కలుఁగున నిమ్మూషక, మెక్కటి మెలఁగుటకు వలయు హేతువు గలఁగన్ | 92 |
క. | ఒలువనితిలలకు నొలిచిన, తిల లీ నఱ్రాడువసుమతీసురభార్యా | 93 |
క. | ఆకరిణి జాంగలంబున, నేకాకితఁ దిరుగునెలుకయెడ నూహింతుం | 94 |
క. | ఒలువనితిలలకు నొలిచిన, తిల లీ నఱ్రాడువసుమతీసురభార్యా | 95 |
వ. | బృహస్వి కిట్లనియె. | 96 |
క. | తొలుత నొకానొకభూసుర, నిలయము కడువసతి యగుట నివసించితి న | 97 |
క. | బాలా బుధసంతర్పణ, కాలం బిది యదనుగూడఁ గావింపు శుచి | 98 |
క. | చెప్పిన యజమానుఁడు సతిఁ, దప్పక వీక్షించి పలికెఁ దన్వీ గృహమం | 99 |
క. | సంచయ ముచితంబగు నతి, సంచయ మనుచితము సర్వజనులకు నెందున్ | 100 |
క. | నావిని వాతెరపై నొఱ, పై విన్నాణంపునగవు లత్తమిల న్ల | 101 |
చ. | అవిహితబుద్ధి విను మధురాధర యామిషగంధధిక్కణం | 102 |
క. | వాలికతూపుల వేటం, గూలిన యలకొండగొఱియఁ గొని తనియక నా | 103 |
వ. | ముందఱ నొకశాడ్వలంబున. | 104 |
ఉ. | క్రమ్మి చతుష్ఖురిం జమురు కాలువలై ప్రవహింప రోమపుం | 105 |
క. | కలముం బోలినయీయే, కలము మదాహారమునకుఁగా దైవం బీ | 106 |
ఉ. | ఏసిన బద్ధరోషమున నేకల మేడ్తెఱఁ దూఱి పుల్కసా | 107 |
వ. | ఇట్లున్న మృగనరశవంబుల గాలివాఱఁ గాలప్రేరితంబై దహ్యకనామధేయం | |
| నరుఁడు నాల్గువారంబులకుం జాలుఁ గృతసుకృతవిశేషంబునం గాక యీబహు | 108 |
క. | ఆపిసినినక్క చాపము, కోఁపంగిట నిఱికి నరముఁ గొఱికిన రభసం | 109 |
క. | అతిసంచయపల మిది పో, రతిబోటీ వలదు దాఁపురంబన నగుచుం | 110 |
గీ. | ఱోలఁ దిలలు గ్రమ్మి తైలంబుఁ దివిచి ధూ, తాఘవిసరకృసర మాచరింతుఁ | 111 |
క. | నూనియఁ దివియుటకై తిల, లానీరజనయన దెచ్చునపు డొకకాల | 112 |
క. | జనఁ జెల్లాచెదరై, నేలం దిల లొలికె నంత నివ్వెఱఁగున న | 113 |
క. | కలికి యున్నట్టె యీక్రియ, నొలికినతిల లెత్తి దంపు మోర్పున నన న | 114 |
క. | ఆమహిసురశరణమునకుఁ, గామందకి యనఁగ నొక్కగానులది సుతుల్ | 115 |
క. | ఏతెంచినఁ బలుకుల సరి, నాతీ ముడినువ్వు లిత్తె నా కని విప్ర | 116 |
వ. | అట్లు బుద్ధికౌశలంబున నేను నియ్యుఱియ యెలుకచోట నిక్షేపంబు గలదని నిశ్చ | 117 |
క. | అతిరక్షితార్ధమంతయు, నితరులపా లయ్యెఁ జెడుగు టెలుకా నీయు | 118 |
క. | ధన ముడిగిన నుడుగదు నీ, తనుజనితం బైనదుర్మదము నేఁ డనుచున్ | |
| గన లునికిఁ గనికరం బఱి, తనపదిలినకోలచే నతఁడు నను వ్రేసెన్. | 119 |
క. | వ్రేసినవ్రేటు దురంత, త్రాసంబున నోహటించి తప్పించుకొనన్ | 120 |
క. | అర్థమునఁ బండితుండగు, నర్ధమునం బలసమగ్రుఁడగు నర్థమునన్ | 121 |
గీ. | అన్వవాయవృద్ధు లాచారవృద్ధులు, శౌర్యవృద్ధు లిద్ధసత్యవృద్ధు | 122 |
చ. | వినఁ డని రోయ కంధుఁడని వీఁగరు తుందిలుడంచు గేలిఁ గాఁ | 123 |
చ. | కనకముఁగూర్చి యెన్నఁబడుఁ గాదె సమస్తగుణంబు లర్థ మె | 124 |
క. | కలవానికిఁ జుట్టంబులు, గలరు హితు ల్గలరు భటులు గల రఖిలంబున్ | 125 |
క. | చిట్టడుగు లేనియిల్లును, జుట్టంబులు లేనిచోటు మాన్యము శూన్యం | 126 |
క. | ధనహీనుఁ డధముఁ డల్పుఁడు, ధనహీనుఁడ మూఢుఁ డప్రధానుఁడు ధర న | 127 |
వ. | అని భిక్షుకుఁడు న న్నధిక్షేపించిన రోసి నివాసత్యాగంబు చేసి వచ్చితి నిన్నుం | 128 |
క. | త్రిదశవిమానారోహణ, మొదవిన నవమానధరణి నుండుట కష్టం | 129 |
క. | యమయాతన యవమాన, క్షమబాధ యిఁకెద్ది దానిఁ గడచినవిద్యా | 130 |
క. | పరదేశం బెఱుఁగక తగు, గరగరిక న్విడువముడువఁ గలిగి నడుమఁ బే | 131 |
ఆ. | వెల్లివిరిసెఁ బెంటివిద్యలు మగవిద్య, లడుగువెట్టె గ్రిందు వడిరి బుధులు | |
| హీనజాతిపురుషు లెచ్చిరి యాచింపఁ, బోవు టెట్లు నేఁటిభూమిపతుల. | 132 |
శా. | ఏల ల్తందనతాన లేమయినలేవే యంచు బోధించునే | 133 |
క. | అనుచితభాషణముఖరా, ననులమొ విటగాయకులమొ నటులమొ గాఢ | 134 |
ఉ. | కోరినగద్యపద్యముల గూరిచి యిచ్చెద వంటినేని ని | 135 |
చ. | పలుకులశబ్దసర్గశతపత్రభవంబులు జాతవర్ణముల్ | 136 |
చ. | మెఱసి బహుప్రబంధతను మెచ్చుట మెచ్చుట యొచ్చమంటి పా | 137 |
క. | పరిహాసకులకు నటులకుఁ, దరుణులకును లంజెదారితమ్ములకుం గా | 138 |
ఉ. | ఏపున సంచితార్ధము పరేంగితభావ మెఱింగి యీఁగి మే | 139 |
ఉ. | దాతలు దాత లం డ్రదియ తథ్యము లోకమునందు లేఁడుపో | 140 |
క. | తలలెత్తి చూడవెఱతురు, వెలవెలనై మాఱు పలుక వెఱతురు నెఱయం | |
| జలియించిపఱతు రిస్సీ, కొలకపగతులు గారె యాచకులు లోభులకున్. | 141 |
క. | చరణములు వడఁకు భీతిం, బరవశమౌ నొడలు రాలుపడు నెలుఁ గాహా | 142 |
వ. | అట్లగుటఁ జింతించి యాచకత్వంబునఁ జిత్తం బొడఁబాటుగాదు దారిద్ర్యం | 143 |
చ. | సముచితభాషణంబులకుఁ జాతురి సాలక యున్న మౌన ము | 144 |
క. | దీపమునఁ దమము రోగ, వ్యాపృతిఁ జెలువంబు హరిహరాఖ్యానముచేఁ | 145 |
చ. | అలఘులఘుత్వమూలమగునర్థిత కంజలిఁ జేసి మ్రొక్కి వీ | 146 |
క. | తా నీఁగొఱమాలి మహా, హీననరాధిపుఁడు భాగ్యహీనుఁడను న్స | 147 |
వ. | అట్లగుట రాజసంశ్రయంబును గూడదు ప్రేక్ష్యభావంబు మృత్యుద్వారంబు రోగి | 148 |
క. | సంతుష్టివర్మసంగు, ప్తాంతఃకరణునకు వెఱచు నతిశయతృష్ణా | 149 |
ఉ. | వీతఖలీనమై యతులవేగమున న్మొనగాలు ద్రొక్కు తృ | 150 |
క. | ఆశాశృంఖలఁ బడి నా, నాశాభూములఁ జరించునదిపో యసుఖ | |
| శ్రీశోభితుఁడై నిలుచును, ధీశరధీ మనుజుఁ డొక్కదెస యరుదేరన్. | 151 |
క. | పొట్టకుఁగా బట్టకుగాఁ, జెట్టాడుం దెలివిలేనిజీవి నిజంబౌ | 152 |
క. | కూరలు నారలు చాలవె, పూరింప న్మృష్టమేల పొట్టకు మఱి యే | 153 |
ఉ. | ఊయెలమంచము ల్పసిఁడియుప్పరగ ల్గపురంపువీడెము | 154 |
చ. | ఒకరుని కిచ్చు నిచ్చి తిరియు న్మఱియొక్కతఱి న్మహోగ్రుఁడై | 155 |
వ. | అట్లగుట మేలుగీళ్ళు దేహధారులకుకు భోగ్యంబులు గదా యని తెలిసి మదిం బదిలంబు | 156 |
క. | నెలవునఁ బూజ్యంబులు నఖ, ములు దంతంబులు శిరోజములు గాలగతిన్ | 157 |
క. | హరి పెంపువడయుఁ గరి, పెద్దరికముఁ గను సజ్జనుండు తగఁ బూజ్యుండౌ | 158 |
క. | అరివిదళన పరుషుండగు, పురుషుం డెచ్చోటనయినఁ బూజ్యుఁడు గాఁడే | 159 |
క. | కదలనినీటికి మీనము, లెదురెక్కునె యుఱిదిఁ బాఱు నేటికిఁ బోలెం | 160 |
క. | తనపుణ్యపాపవశమునఁ, దనివిసన న్వచ్చు సంపదలు నాపదలున్ | 161 |
క. | శకటగతచక్రభంగి, న్సుకరములై తిరుగుచుండు సుఖదుఃఖము లిం | 162 |
మ. | సతతోత్సాహపరుం గ్రియానిపుణు భాస్వద్దీర్ఘసూత్రుం గృత | |
| ర్జితకాముం దనుఁ దా వరించు సిరి నిర్ణిద్రానురాగంబునన్. | 163 |
క. | అవివేకి నలసు విగత, వ్యవసాయున్ హీనుఁ గుటిలవర్తను నధముం | 164 |
క. | సరసప్రజ్ఞోత్సాహ, స్ఫురితుఁడ వీ వెచట నున్నఁ బూజ్యుఁడవు గుణా | 165 |
చ. | అడఁగని లేమిఁ బొట్టుపొఱ లయ్యును ధీరుఁ డొకానొకప్పుడున్ | 166 |
క. | ధనవంతుఁడనని మదమున్, ధనహీనుఁడ నని విషణ్ణతం బొందవు హ | 167 |
సీ. | జలధరచ్ఛాయయు ఖలమైత్రియును నవసస్యంబు యువతియు జవ్వనంబు | |
తే. | జనుఁడు బ్రతుకు నూఱుసంవత్సరము లంత, కాల మెవ్వడుండు మేలుతోడఁ | 168 |
వ. | దానతుల్య యగువిధియును సంతోషసమం బగుసుఖంబును శీలసదృశం బగుభూ | 169 |
క. | శమితశఠాకమఠాని, ర్గమనప్రమదంబు హృదయగతచింతాశ | 170 |
క. | ధరలో సత్పురుషులు సత్పురుషాపద్ధరణహేతుభూతులు గారే | 171 |
క. | నిధిసాధకుఁడు ఘనాంజన, విధినిక్షేపంబుఁ జూపువిధమున సుజనుం | 172 |
మ. | కరనీరేరుహ మర్థి పాపఁ బ్రతిపక్షత్రస్తుఁడై వచ్చి కా | |
| బొరయం గోరనివాఁడువో పురుషుఁ డొప్పు న్వానిఁ కీర్తింపగాన్. | 173 |
చ. | విటపసమృద్ధిభూజముల వీవలుల న్విరుల న్మరందలి | 174 |
వ. | అని లఘుపతనకుం డనేకప్రకారంబుల మందరకు నుత్కర్షింపుచుండె నాసమయంబున. | 175 |
మ. | చకితస్వాంతముతో మహామహిరజశ్ఛన్నప్రతీకంబుతో | 176 |
క. | మ్రానికిఁ బొఱియకు సలిల, స్థానమునకుఁ గాక వివరసజ్జలచరముల్ | 177 |
క. | క్షితిజాతాగ్రస్థితలఘు, పతనకుఁ డద్దిక్కులెల్లఁ బరికించి యుప | 178 |
వ. | హిరణ్యకమందరకులు బహిర్నిర్గమనం బొనర్చి వెగడుపడియున్నమృగంబు నూఱ | 179 |
సీ. | ఆహారవాంఛఁ జిత్రాంగదుఁ డడవికి బఱచి యొండొకకుంటఁబడియచోట | |
తే. | నేమి సేయుదు ననుచు నహీనవేగ, కలన ఱెక్కల పటపటాత్కార మెసఁగ | 180 |
మ. | చెలికాఁడా పదబంధ మేవలన వచ్చెం జెప్పుమా నివ్వెఱం | 181 |
చ. | మనుపఁ బ్రియంబయేనిఁ జనుమా యన నాయన నిర్భరత్వరం | 182 |
క. | నావిని మూషకపతి దుః, ఖావేశితహృదయుఁడై సఖా పోవలయుం | 183 |
వ. | అని పలికిన నతని మృదురీతిం గఱుచుకొని చని వాయసకులవల్లభుండు నికటం | 184 |
క. | మృగయుభయంబునఁ జీకా, కగుచున్నది మది భుజంగమాకృతిఁ గాలం | 185 |
క. | మందరకుండును గరటపు, రందరుఁడును నేను నీపరామర్శ న్మే | 186 |
క. | విచ్చలవిడి వాగురికుఁడు, వచ్చినఁ బ్రాణములమీఁద వచ్చును గృప నేఁ | 187 |
కె. | వెఱవకు వాగుర దునియం, గొఱుకుట యన నెంత నీతికోవిద నీ కే | 188 |
క. | అనిన నిది నేఁడ కా దట, మును గలదన నతనిఁ జూచి మూషకరా జో | 189 |
ఉ. | రంగదుపాయపారగు హిరణ్యకుఁ గన్గొని యొప్పఁ బల్కెఁ జి | 190 |
చ. | నరనుతకీర్తియౌత్కలమునాఁ గటకంబునఁ బుష్కరుండు భా | 191 |
మ. | తుటుమై యొక్కటఁ గూడి గూడెపుఁగిరాతు ల్నేను వీక్షింపఁగా | |
| ల్గిటిదంష్ట్ర ల్గరిదంతము ల్సవరము ల్డేగ ల్శివాశృంగముల్ | 192 |
గీ. | మ్రొక్కి చేమోడ్చిమాయున్నచక్కిఁ జెప్పి, యెన్నిహరు లెన్నియేనుగు లెన్నిపందు | 193 |
సీ. | కొసవెంట్రుకల బట్టి కూపెట్ట సింగంబుఁ బట్టి తేకున్న నీబంటఁ గాను | |
తే. | గబ్బిబెబ్బులి డాకాల ద్రొబ్బి విరియఁ బ్రామి రూపార్పకున్న నీబంట గాను | 194 |
వ. | అని మృగారాతు లక్కిరాతులు పంతంబులు పలికి మృగయావినోదంబునకు | 195 |
సీ. | అడంగించుఁబో యిమ్మహాసారమేయంబు జముఁ డెక్కు కాసరస్వామినైనఁ | |
తే. | ననఁగఁ బులిగాఁడు చిలుకుట మ్మచ్చపచ్చి, మిరియ మురిద్రాడు కాట్రేఁడు మెఱుపుదీగ | 196 |
గీ. | పరుసుకరసానఁ దీఱినపందిపోట్లు, భూరిభుజపీఠములయందుఁ బొందుపఱిచి | 197 |
క. | ఏలలఁ బాడుచుఁ దగ విలు, గోలలఁ గొని నల్లప్రజలు గుములై నడవ | 198 |
క. | ఎక్కినఁ ద్రొక్కనిచోటులఁ, ద్రొక్కుచు గుఱ్ఱంబు నడవ దూరము లగుమా | 199 |
తే. | వచ్చి మాయున్నపొలమెల్ల వల్లెవైచు, చందమునఁ జుట్టుకొనినఁ బోసందు లేక | 200 |
వ. | అంత. | 201 |
క. | పవికల్పప్రదరంబున, నవనీపతి దుప్పిదుప్పురనఁ బడనేసెన్ | 202 |
క. | శిఖిధూమశ్యామలములు, ప్రకరగరుద్విసరభాసురము లుద్యజ్జ్యా | |
| ముఖరితములు రాజశిలీ, ముఖములు బహుపుండరీకముఖముల వ్రాలెన్. | 203 |
క. | తారలు చెడ నుడ్డీనో, దారగతు ల్నెఱపి గగనతలమున జవవ | 204 |
క. | తులలేని శైత్యములుఁ జిఱు, బిలముల బురుడించుదొనలఁ బెరిగినశరముల్ | 205 |
క. | నిరవధికదానవిద్యా, పరఘనుఁ డాఘనుఁడు దాత ప్రజ్ఞాని వనే | 206 |
క. | సమయించె ఖడ్గముల ఖ, డ్గములం గ్రూరాచ్ఛభిల్లగణముల జగతీ | 207 |
వ. | అయ్యాఖేటనంబు శాసితపశుప్రకరంబు గావున యజనవాటంబును ధ్వనిప్రధా | 208 |
క. | పోలములు వెదకి పక్కణ, పాలురు తఱుముటయుఁ దల్లి ప్రజ లుద్ధురజం | 209 |
క. | నను నంతఁ జిత్రవర్ణుఁడు, గనిఁ జంపక తెచ్చి పతికిఁ గైకానుకగా | 210 |
వ. | తిరిగి మహిమహిళాకటకం బగుకటకంబునకు వచ్చి రాజు యువరాజునకు న న్నిచ్చె | 211 |
క. | ప్రతిగర్జత్కేసరియై, యతికంపజ్జంతుహృదయమై నిర్భన్న | 212 |
మ. | తనకర్ణంబుల కెంతయాఘననినాదం బూర్జితామోదకం | |
| వనుల న్సద్వనులం గులప్రభులతో వర్తింతుఁగా యంచు బా | 213 |
చ. | విని యువరాజు ద్రాపరసవిహ్వలుఁడై సదనంబు నల్దెస | 214 |
క. | అని తనువు వేఁగ వేగినఁ దన కాపుష్కకనరేశుతమ్ముఁడు నెమ్మిం | 215 |
క. | ఎఱిఁగించి మృగము లెక్కడ, తరి నేతన్మనుజభాషితము లెక్కడ నే | 216 |
క. | యువరాజుఁ జూచి ధరణీ, ధవనందన యేల వెఱచెదవు మృగజాతుల్ | 217 |
క. | నరసంచారవిహీనో, ర్వర వని చెప్పుటయు భయము వదలి నృపాలా | 218 |
క. | ఇది నాకు నేఁడ కా ద, మ్మొదలం గల దనుచుఁ దెల్లముగ మృగము జగ | 219 |
క. | అతివేలచింత నంతట, వెత మదిలో నెరపి సరసి వెలుబడి మంద | 220 |
క. | ఏతెంచిన భీతి విని, ర్ఘాతహతిం ధృతినగంబు వ్రయ్యలుగా జిం | 221 |
చ. | అరయ నుపాయపారగుఁడ వయ్యు నయోదధివయ్యు సంతత | 222 |
చ. | అతివిమలాత్ముఁ డైనసఖువందును బెంపొనరించుధారుణీ | 223 |
చ. | అనునెడ వేఁటకాఁ డదయుఁ డప్ప డుపస్థితుఁ డైన దైన్య మా | |
| డనునయవాక్యము ల్మెఱయ నాక్షణ మంఘ్రిపరీతవాగురం | 224 |
క. | జలచరుఁడు గనవరత్వర, నిలబోవం జేవలేక యెప్పటిచో ని | 225 |
క. | సరినురికిఁ బాసి గాఢ, త్వరఁబఱచినమృగముఁ జూచి దారుణచింతా | 226 |
వ. | అట్లుండి ముందర మందరకుం గాంచి పట్టుకొని త్రాటం గట్టుకొని వింటికోపునం | 227 |
ఆ. | అంబురాశిపార మైనను గనవచ్చు, నిశ్చయింపవచ్చు నింగిపొడవు | 228 |
తే. | అదియ సువ్యక్త మది నిజప్రాణతుల్య, మదియ నిర్వాచ్య మట్లు గాదయ్యెనేని | 229 |
సీ. | కర్మచేష్టితములు గాలాంతరావర్తితము లగుమేలుగీ ళ్శమరు నైనఁ | |
తే. | యెట్లు నిలువఁగూడు నెబ్భంగి రుచియించుఁ, గూడు కంటి కెట్లు గూర్కు వచ్చు | 230 |
క. | ఈయధముఁ డెంతదూరము పోయెడునో యెంతదవ్వు పోదము సర్వో | 231 |
క. | నావిని లఘుపతనకుఁడును, లావుపసం బోర నలఁతులము మందరకుం | 232 |
సీ. | అశ్రుమిశ్రితనేత్రుఁ డైనహిరణ్యకుఁ డనియె నిప్పాపాత్ముుఁ డరుగుత్రోవ | |
తే. | వేగఁ గేడించి యన్నీచు వెనుకఁ జేసి, యరుగు మచ్చక్కి కనికూర్చి యనుచుటయును | 233 |
సీ. | చిత్రాంగదుండు చచ్చినవానిగతిఁ బుతస్సరణసరస్తీరధరణి నుండె | |
| వానిమస్తకమున వ్రాలి వాయసకులాగ్రణి కనుగ్రుడ్డులు గఱిచి పెఱికి | |
తే. | కలిగెఁ దెక తేర నేతన్మృగం బనుచును, మందరకు డించి కాకి బల్మఱు నదల్చి | 234 |
క. | కొరికిన మందరకుఁడు దె, ప్పరపువడిం బఱచి సరసిఁ బడె మూషకరా | 235 |
తే. | అట్లు విఫలప్రయత్నుఁడై యడవిఁ బాసి, విన్నబాటునఁ జనియెను వేఁటకాఁడు | 236 |
వ. | సుహృల్లాభంబున సాధింపరానికార్యంబులు గలవే యని సుదర్శనకుమారులకు విష్ణు | 237 |
క. | విని రాజకుమారకు లన, ఘు నయాంశవిలాసదివిజగురు నిజగురునిన్ | 238 |
మ. | అతికారుణ్యకటాక్షసర్వభువనైకాధ్యక్షరాధాసుత | 239 |
క. | మాయాతీతమహాసిత, కాయభటీకృతమరున్నికాయతపస్వి | 240 |
మాలిని. | నిరనుమితమహత్త్వానిశ్చలానందతత్త్వా, నిరతసుఖితలోకానిత్యపుణ్యావలోకా | 241 |
గద్యము. | ఇది శ్రీవేంకటనాథకరుణాలబ్ధసరససాహిత్యనిత్యకవితావిలాస సకలసు | |