నీతి రత్నాకరము/మొదటి వీచిక

శ్రీః

నీతిరత్నాకరము

-: ఇష్ట దేవతా ప్రార్థనము.:-


చ.

సిరియని గౌరియంచు సమ సీరు దాసంభవురాణియంచు ని
ర్జరులు మునీంద్రు "లెల్లప్పుడు సన్నుతి చేయుచుఁ గొల్వ దిక్పతుల్
నిరతము పాదపద్మముల , నెమ్మి శిరంబుల: దాల్ప నాద్యయై
పరశివయుక్తి భక్తజన పాతిని బాఁదగు దేవిఁ గొల్చెదన్.


చ.

 తెలియనివారి కెప్పగిదిఁ+ దేటగ నీతులఁ దెల్ప వచ్చు న
ప్పలుకుల దెల్పకున్న నగు బాటగుఁ గానఁ గథావిధాన మే
సులలిత మార్గ మప్పనికిఁ జొప్పడియుండునటంచు నెంచి నేఁ
దెలిపెదఁ దద్విధంబును ,సుధీవరసమ్మత మాతెఱంగునన్ .


మొదటి వీచిక.

ఆరోగ్యభాగ్యముల నిచ్చుపదార్థములయందెల్ల నదులగ్రస్థానము నాక్రమింపఁ దగినవి. పూర్వలు దానిని బరమపావనములని, సేవింపఁదగినవని, సకల పాపముల నడంచునని తెలిపి యున్న వారు. జలములు భూమిని బవిత్రముగాఁ జేయునని, ఆభూమి మానవులను బవిత్రులనుగా నొనరించునని వేదములు తెలుపుచున్నవి. సకలకల్మషముల నదులు హరించుననుట నిక్కము. కల్మషమనగా దేహమాలిన్యమని కొంద ఱర్థము చెప్పుదురు. ప్రవాహోదకముల యందుదయకాలమునకు ముందు స్నానము చేసిన సకల రోగములు నశించునని యాయుర్వేదము తెలుపుచున్నది. దీనినెల్ల నంగీరించియే యున్నారు. పదార్థ విజ్ఞానశాస్త్ర వేత్తలు లక్ష్యలక్షణ పురస్సరముగా దీనిని దృఢ పఱచుచున్నారు. ఆరోగ్యముకలిగినపుడు. మనస్సు పరిశుద్ధముగ నుండుననియు, నది మంచి కార్యములు చేయఁబూనుననియు నార్యులభావము. కావున నదులు పాపములు తొలఁగించుననుట యుక్తియుక్తమే యనవచ్చును.

నదులు సమీపముననున్న దేశములు ధనసంపన్నములుగా నుండుట సాధారణము. ఆదేశములకు నదీమా తృకములని పేరు. తల్లివలె నదులు పయః ప్రధానమున నెల్ల భంగులంబోషించుటంజేసి నదీమాతృకములనుపే రాదేశములకుఁ గలిగె నని పెద్దలందురు. ఆయర్థము యుక్తి కనుకూలముగనే యున్నది. సస్యములకు ఆరోగ్యమునకు నదులు మహోపకారకములను సిద్ధాంతము సర్వజనాంగీకారమును బడసినది. నదుల యిరుదరులకుఁ బరిసరమున నున్న భూములు సారసంతము లయి యుండుట సర్వజనవిదితమగు విషయముగాని మాఱు మూలనుండునది కాదు. ఏయేభాగములనుండియో యొండు మట్టిని దెచ్చి భూములం గప్పును. సస్యములు సమృద్దిగ దానిచే ఫలించును. కర్షకుల కింతకంటే మహోపకారము చేయుటెట్లు? ఏఁబదియాఱు దేశములుగా నీ భరతఖండము విభజింపబడి యుండెడిది. ఏబదియాఱు భాషలుండెనని కొంద ఱందురు. అన్ని యుండవనియు సంస్కృతము ప్రాకృతాది షడ్బాషలు, వీనివికారములుగా భాష లుండెనని కొంద ఱందురు.ఇప్పటి భాషలంబట్టి యా కాలపుభాషల నిర్ణయించు టంత మంచిదిగాదు. ఆ దేశములయందు మహారాష్ట్ర దేశము మిగులఁ బ్రఖ్యాతిని మించియుండెను. మహారాష్ట్ర దేశీయులు మిగుల బలాఢ్యులు. సదాచార పరాయణులు. ప్రతిక్షణ విలక్షణపరిణామములగు నాచారములసలయించు నూహలు గలవారు కారు. పూర్వులయందు గౌరవము, దేశమందు విశ్వాసము, శాస్త్రములయందుఁ బ్రీతి , భగవంతునియందు భక్తి యను నివి వారికిఁ దోడఁబుట్టినగుణములు. స్వదేశాభిమానము మెండు బలప రాక్రమములయం దాఱితేరిన వారలయ్యు నొరుల హింసించునలవాటుగలవారు కారు. ఊరకూరక తమ్మలయించినపుడు మాత్రము ప్రతిఘటింతురు. ప్రతిఘటించిరిపో కార్యము పండుటయో మేనులఁ దొలఁగుట యో కావలసినదే కాని నడుమ వదలుకొను నాచార మాదేశీయు లకు లేదు. వారికి జీడిమచ్చలని పేరుగల్గుటకుఁ గారణమిదియే యయి యుండనోపు. సామాన్యముగా నెల్లరు భవానిని బూజించువా రనవచ్చును. ఆమెకరుణ లేక వృద్దికాఁజాలమను విశ్వాసము వారలకు సుగ్గులోఁ బెట్టినట్టిది. కావుననే శ్రద్ధా భక్తుల భవాని నారాధింతురు బలుల నర్పింతురు. గవ్వలతో నాదేవిని బూజించువారు కొందఱు గలరు. నిర్మలమగు వస్తువుల నర్చించిన నిర్మలముగా బుద్ధియుండునని వారియూహ కాఁబోలు. వారలకు గవ్వలు కూర్చిన హార ముండును. అది కుంకుమపంకలిప్తముగనుండును.

అట్టి మహారాష్ట్ర దేశమున నొక పుణ్యనదీపరిసరమున విలాసథామ మనునగరము గలదు. నదీతటమున నదికట్టఁబడుటచే బ్రవాహసమయమున బాధకలిగినను దక్కుఁగలకాలములయందు సుఖసమృద్దికిఁ గొదువలేకుండెను. కావున నా నగరము సుఖధామ మనుప్రఖ్యాతిని గాంచెను. నగర మతివిశాలభూభాగము నాక్రమించి యుండెను. గృహములు క్రిక్కిఱిసియుండక యెడముగలిగి ప్రాకారవేష్టితము లై యుండెను. కావున నారోగ్య భాగ్యమునకుఁ గొదువ లేదనవచ్చును. గృహచతుర్బాగముల గ్రిక్కిరిసి వృక్షము లుండవలయునని రాజశాసనము.కావున శీతలచ్చాయా ద్రుమములు విశేషించి యుండెను. ఎండ వేడిమి విశేషించి సోకకయుండ నాద్రుమములు కాపాడుచుండఁగా నిఁక వాసయోగ్యము కాదనుట యెట్లు ! పురము నలుప్రక్కలనుండు భూభాగము తగ్గుగా నుండెను. నగరము గలభూభాగ మున్నతము. కావున ముఱికి నీరు నిలువక పోవుచుండఁగా నెంతయో యారోగ్యముగా నుండెను.

సౌధ పంక్తులు చక్కఁగాఁ దీర్చికట్టిన ట్లుండెను. వీధులు విశాలములు. రెండు ప్రక్కలను జాలుగ ఛాయాద్రుమములు గలవు. వానిమూలముల నరుఁగులు వేయఁబడి యుండెను. బాటసారు లందుఁ గూరుచుండి యలసట తీర్చుకొనుచుందురు. కొత్తవా రానగరమును జూడవత్తురు, ఆనందయాత్ర యని దానిపేరు. ఆ పేరు మిగులఁ బ్రఖ్యాతి వహించెను, ఏటేట వేసవి కాయాత్ర దూరదేశాగతజనులచే సాగింపఁబడును. ఆనగరమును జూచి యందుఁ బనది దినములుండి యా శీతలమారుతమును సేవించి కృతకృత్యులై మరలి పోవుచుందురు. కన్నులు భగవంతుఁడొసంగినందులకు ఫల మానగరమును జూచుటయే యని యెల్లవారనుచుందురు. యాత్రార్థులకుఁ గొన్నియిండ్లు నిర్మింపఁబడి యుండును. గృహభృతి యించుకంతయేగాని వృద్ధి చేయరాదని రాజశాసనము కలదు. కావున బాటసారుల కేమాత్రము కష్టము కలుగ నవకాశము లేదు. కావుననే యానందయాత్ర యను పేరు సార్థకమయ్యెను.

ఆ దేశమేలు భూజాని కరుణాకరుఁ డని ధరాత్ముఁ డని విఖ్యాతినొందెను. ఆవిఖ్యాతికిఁ గారణము న్యాయ పరిపాలనమే గాని వేఱొకటి కాదు. ప్రజలు రాజును భగవంతునిగా భావించు చుండిరి. కావున నే యారాజ్యము శాంతకి సంస్థాసమయి యుండెను. అపరాధములకు శాసనములు గలవుగాని వాని నుపయోగించునవసరము లేకుండెను.న్యాయాధికారులనీ, కారాగృహాధికారు లని కొందఱుండిరి . కాని వారికి నెప్పుడో యొకప్పుడు తప్ప దక్కినపుడు కాలము పుచ్చునుపానము లేక పురాణములం జదువుకొనుచుండిరి. ఆ విలాసథామమున వీధికొక్క పుస్తక భాండాగారము నెలకొల్పఁబడి యుండెను సకలగ్రంథము లందు దొరకుటంబట్టి యవకాశము దొరకినపుడెల్ల జనులచటికింబోయి చదువుచుండిరి. అందందు నాటకశాలలు గలవు. అవి పౌరజన సంతృప్తి నొనరించుటపొందనే ఱ్పరుపబడినవే ఇట్టి వెన్నియో జనోపకారములుగ నిర్మింపఁబడినందునే యా నగరము వాసయోగ్య మయ్యెను. ఆనగరమున నొక ధనవంతుఁ డుండెను. అతని పేరు శ్రీనివాసుదాసు. తలిదండ్రులాతనికి వివాహమువ ఱకుఁ గలసంస్కారము లొనరించి గతించిరి . భార్యంగూడి శ్రీనివాసదాసు సద్వృత్తి గాలముఁ బుచ్చుచుండెను. లక్ష్మీనారాయణులవలె వారలున్నవారని యెల్ల వారు వాడుచుండిరి. పరోపకారము వారికి నైజ గుణము. కాని ముఖస్తుతులను జేయువారిని మాత్ర మాదాసాదరింప కుండెను దీనాంధబధిరాదు లాత నియిల్లు కల్పవృక్ష ముని కాచుకొని యుందురు. అన్నదానము వస్త్ర దానము నను నీ రెండు నాతఁ డెక్కుడుగాఁ చేయువాడు. తక్కినదానములు యథోచితముగా జేయుచుండును. బంధువుల రాకకు బరిమితిలేకుండెను. వ్యాపారమున ధన మెక్కువగా లభించుచుండుటచే వ్యయము నాతనిమదికి లెక్కింప దగినది కాకయుండెను. ఆవ్యాపార ము న్యాయము నతిక్రమింపక చేయఁబడుచున్నందున దినదినాభి వృద్ధి నొందుచుండెను,

ధర్మంబు చెరుపఁ జెఱచును,
ధర్మము రక్షించువారిఁ * దా రక్షించున్ .

అన్న సూక్తి యేల తప్పును! ఆ వ్యాపార మాతని కాలమున నారంభింపబడినది కాదు. కులవృత్తి. కావున శాస్త్రీయమే యన వలయుఁగదా.

శ్లో. “స్వే స్వే కర్మణ్య భిరతస్సంసిద్ధిం లభతే నరః."

అను భగవద్గీతా వాక్యము ప్రమాణము కదా. ఆవ్యాపారమునే పాటించి కులవృత్తియని భగత్ప్రతిపాదితమని కర్తవ్య మని యాతం డొనరించుచు దేహమంతయుఁ గన్నులుగా సంచరించు చుండెను. కులవృత్తి భగవద్ద్రూపముగా దలంచుచు దాని ననుసరించినఁ గృతార్థునిం జేయు నని పెద్దలందురు.

శ్రీనివాసదాసునకు నాలుగుసంవత్సరముల దనుక సంతానము లేకుండెను. కళత్రము మనసున నించుకవిచారమూనుచుండెను. పతికి నెదురాడనోడునట్టి శీలముకలది. కావున బయలుపడనీయక యుండెను. ఎట్టులో యా భేదమును భర్త యెఱింగెను. సత్కళత్రము చింతదీర్చుట పతికి హితముగదా యని సన్మతి నాలోచించి యిట్లు తలపోయఁ జొచ్చెను. మానుషానంద మెల్లరకుఁ గావలసినవిదియే. దానిం గాంక్షించుట పొరపాటు గాదు. ధర్మ ప్రజావృధ్యర్థము కదా వివాహము చేసికొనుట. దీనికి బురాకృతపుణ్యము తోడు పడవలయు దానికి మానవ యత్నము కూడఁ గావలయును. దైవపరులు కొందఱు మానవ ప్రయత్న మేలయందురు. అది పాటింపఁదగినమాట యనవలయును. భగవంతుని సేవించుట ప్రధానము. బాన నిహపరములు గలవు. దాని మాన నీ రెండును జెడును. కాఁబట్టి యీశ్వరు నారాధించు టుచితము. ఆ యారాధనము కూడఁ దొలుదొలుత విశ్వాసమును బుట్టించు నదిగ సుండవలయుఁ గదా. లేనిచో స్త్రీలకు భక్తి కుదరదు. ధర్మార్థకామమోక్షములను పురుషార్థములు నాలుగు వాంఛింపదగినవే యని పురాణములు తెలుపుచున్నవి. కనుక నిపుడు శ్రీకృష్ణు నారాధించుట యెంతయుఁ దగియుండెడు. అందును సంతానగోపాలనామమున శ్రీకృష్ణు నారాధించుట సమంచితమగు.ఈ నామమును విన్న యంతనే నాకళత్రము ________________

నీతిరత్నాకరము ఆనగరమున నొక ధనవంతుఁ డుండెను. అతని పేరు శ్రీని వాసదాసు. తలిదండ్రు లాతనికి వివాహమువఱకుఁ గలసంస్కారము లొనరించి గతించిరి. భాగ్యంగూడి శ్రీనివాసదాసు సద్వృత్తిఁ గాలముఁ బుచ్చుచుండెను. లక్ష్మీనారాయణులవ లే వారు లున్న వారని యెల్ల వారు వాడుచుండిరి. పరోపకారము వారికే నైజ గుణము. కాని ముఖస్తుతులను జేయు వారిని మాత్ర మాదా సాదరింప కుండెను దీనాంధబధి రాదు లాతనియిల్లు కల్ప వ్రుక్షమని కాచుకొని యుందురు. అన్న దానము వస్త్ర దానము ననునీ రెండు వాతఁ డెక్కుడు గాఁ జేయువాఁడు. తక్కినదానములు యధోచిత ముగా: జేయు చుండును. బంధువుల రాకకుఁ బరిమితి లేకుండెను. వ్యాపారమున ధన మెక్కువగా లభించుచుండుటనే

వ్యయము నాతనిమదికి లెక్కించగినది కాకయుండెను. ఆవ్యాపారము: న్యాయము నతిక్రమింపక చేయఁబడుచున్నందున దినదినానాభివృద్ధి నొందుచుండెను.

ధర్మంబు చెఱుపఁ జెఱచును,
ధర్మము రక్షించువారిఁ దా రక్షించున్.

అన్న సూక్తి యేల తప్పును ! ఆవ్యాసార మాతని కాలమున: నారంభింపబడినది కాదు.. కులవృత్తి. "కావున శాస్త్రీయ మే యన, వలయుఁగదా.

శ్లో. “స్వే స్వే కర్మణ్య భిరతస్సంసిద్ధిం లభతే నరః."

అను భగవద్గీతా వాక్యము ప్రమాణము కదా. ఆవ్యాపారమునే పాటించి కులవృత్తియని భగత్ప్రతిపాదితమని కర్తవ్య మ్మని యాతఁ డోనరించుచు దేహమంతయుఁ గన్నులుగా సంచరించు చుండెను. కులవృత్తి భగవద్దూపముగాఁ దలంచుచు దాని సనుసరించినఁ గృతార్థునిం జేయు సని పెద్ద లందురు.

శ్రీనివాసదాసునకు నాలుగుసంవత్సరముల దనుక సంతానము లేకుండెను. కళత్రము మనసున నించుక విచార మూనుచుండెను. పతికి నెదురాడనోడునట్టి శీలముకలది. కావున బయలుపడనీయక యుండెను. ఎట్టులో యా ఖేదమును భర్త యెఱిం గెను. సత్కళత్రము చింత దీర్చుట పతికి హితముగదా యని సన్మతి నాలోచించి యిట్లు తలపోయఁ జొచ్చెను. మానుషానంద మెల్ల రకుఁ గావలసినదియే. దానిం గాంక్షించుట పొరపాటు గాదు. ధన ప్రజావృధ్యర్ధము కదా వివాహము చేసికొనుట. దీనికిఁ బురాకృతపుణ్యము తోడు పడవలయు దానికి మానవ ప్రయత్నము కూడఁ గావలయును. దైవపరులు కొందఱు మానన ప్రయత్న మేలయందురు. అది పాటింపఁదగినమాట యనవలయును. భగవంతుని సేవించుట ప్రధానము. దాన నిహపరములు గలవు. దాని మాన నీ రెండును జెడును. కాఁబట్టి యీశ్వరు నారాధించు టుచితము. ఆ యారాధనము కూడఁ దొలుదొలుత విశ్వాసమును బుట్టించునదిగ నుండవలయుఁ గదా. లేనిచో స్త్రీలకు భక్తి కుదరదు. ధర్మార్ధకామమోక్షములను పురుషార్థములు నాలుగు వాంఛింపదగినవే యని పురాణములు తెలుపుచున్నవి. కనుక నిపుడు శ్రీకృష్ణునారాధించుట యెంతయుఁ దగియుండెను. అందుకు సంతాన గోపాలనామమున శ్రీకృష్ణు నారాధిఁ చుట సమంచితమగు. ఈనామమును విన్నయంతనే నాకళత్రము భక్తిప్రీతులు గలదగును. అవి రెండును గుదిరినఁ గాని యారాధనము సఫలము కాదు. ఆని యాలోచించి యది లెస్సగా మదికి సరిపడినందున నవకాశము కలిగింపక మున్ను తన్నెఱింగిన వృద్ధభూసురవరేణ్యుని బిలువంబంచి యుచితసపర్యల జరపి యుదంత మెఱింగించెను, మహనీయుఁ డా ప్రశ్నమున కానందించి నీవాంఛితము ఫలించును. సత్యము. శ్రీఘ్రంబ సంతానగోపాలమూర్తిని బూజింపుము. ఆపధ్ధతి నాలకింపుము.

శుభముహూర్తమున విత్తశాఠ్య మొనరింపక రత్న సువర్ణ రజతాదులచే శ్రీకృష్ణు నాకృతిని స్థండిలమున నునుపసలయును. సకలవిధాలంకృతమండపము నమరించి తన్మధ్య కల్పిత స్థండిలమున నునిచిన శ్రీ సంతానగోపాలమూర్తిని బూజింప వలయును. ఆనాఁడు ప్రతియామమునను బూజ చేయవలయును. గోభూ ప్రభృతిదానములను యథాశక్తి నొనరింప వలయును. సాధువ్రతపరాయణులగు విప్ర ప్రవరులకు భోజనం బిడవలయు. దీనాంధక బధిర కుబ్జుల నన్న దానమున సంతృపులం చేయవలయు. ఆవలఁ దాను సభార్యుఁ డై భుజిుచి యా ప్రతిమను శుద్ద శ్రోత్రియునకు దానము చేయవలయును. ఈ భగవత్పూజ భక్తితో జేయవలయును. దంభాచారున కది ఫలము నీయదు. మనోవాక్కుల నేక రీతిగా భావ మల రారఁ బూజించిన నే ఫలము గలుగును. ఈ పూజ సాంగముగా నేఱవేఱిన సంతానము కలుగును. రాధామాధవులయం దెవ్వ రిపై నధికభక్తి, కలుగునో తదంశము గలసంతానము గలుగును. ఇది సత్యము. అని వ్రతవిధానమును దెలుప శ్రీని వాసదాసు సంతోషించెను. ఆయన ధర్మపత్ని యిందిరాదేవి పరమానందభరితురా లయ్యెను. వృద్దవి ప్ర ప్రవరుఁడు తన యింటికిం బోయెను.

తరువాత నాదంపతు లాలోచించుకొని సుముహూర్తము నిశ్చయింపఁబడఁగా వ్రతమునకుఁ గడంగిరి. సద్బ్రాహ్మ ణుల రావించిరి. విత్తశాఠ్యము లేక ప్రతిమను 'జేయించిరి. యథో క్తముగా వ్రతము నాచరించిరి. ఇంచుక యేనియు గొఱంత గాంచక యావ్రతము పూర్తిచేయఁబడియెను. ఎల్లరా వ్రతమును దిలకించి తప్పక సంతానముకలుగునని విశ్వసించిరి. వారి భక్తిశ్రద్దలు చూచువారి కెంతయు నచ్చెరువు గలుగఁ జేసెను. ఇంచుకంతయు లోప మేవిషయమునందును గలుగక యుంచెను. కొలఁదిదినములు జరగ నాయిందిరా దేవి గర్బవతి యన్న సువార్త మెల్ల మెల్లన నలుదెసలకుం బ్రాంకెను. దాని విన్న వారెల్ల నానందాంభో రాశి నోలలాడిరి. గర్భ సంస్కారములగు పుంసవనాదులు చేయఁబడియె, నెలలునిండెను. ఒక్క నాఁ డాయిందిరా దేవి కలగాం చెను. అందొక్క సువాసిని సకలాభరణములం దాల్చి తాంబూలచర్వణము చేయుచు వచ్చి యొక్క చక్క నిఫల మిందిరాహస్తమున నిడ దీని ననుభవింపుమని పలికి యదృశ్యు రా లయ్యెను. ఆవల మేల్కాంచి సమీపతల్పమున శయనించియున్న ప్రాణనాథునిఁ బిలిచెను. అయ్యది నాలవజాము కావున నాతఁ డనుస్మృతిని బారాయణము చేయుచుండెను. భార్య పిలువఁగనే చెంతకుం బోయి కూరుచుండి యేల పిలిచితివని యడిగెను. ఇందిర స్వప్న వృత్తాంతమును దెలిపెను. ఇరువురు తలపోసికొని కుమారిక కలుగునని యూహించిరి.

మఱుదినము శుక్ర వారము. ఆనాడు రెండవజాము రాఁగానే ప్రసవచిహ్న ములు కనఁబడుటయు నాలస్యము లేక ప్రసవించుటయు శిశువు కన్యకయగుటయుఁ దెలియవచ్చెను. దాసు తమరూహించినట్లే సాగెనని యానందించెను. దైవజ్ఞులు గ్రహగతులఁ బరికించి బాలారిష్టాదిదోష లేశములు లేక దీర్ఘాయువుకలదని ప్రశంసించిరి. జాతక ర్మాదికృత్యములు యథా విధి నొనరింపఁ బడియెను. నామకరణ మహోత్సవకాలమున యథోచితసత్కారముల నెల్లరం దనిపి రాధిక యను పేరు ప్రక టించి దాసు కృతకృత్యుఁ డయ్యెను 'బాలయు దినదిన ప్రవర్ధ మానయై శశికలను దిరస్కరించుచుండెను. రాధిక పుట్టినది మొదలు దంపతులకు సంపల్లాభము మెండయ్యెను. దాన నాకన్య కారత్న మదృష్టవంతురాలని యెల్ల రనుకొను నట్లే వారు నూహింపసాగిరి. క్రమముగా నామెజీవితమున నెనిమిది 'యేండ్లు గడచెను. ఆవయస్సునకే విద్యావతియన్న పేరు వచ్చెను. ఒక్క పర్యాయము చెప్పిన పాఠము మరల మఱపు నకు రాకుండెను. విద్యాభ్యాసమున నాలుగువత్సరములు గడచెను. పదుమూఁడవయేఁడు రాఁగా సంగీతము చెప్ప నారంభించిరి. కంఠస్వర మనుపమానము. వర్ణనము 'లేల కాని కిన్నరీకంఠమును బోలియుండెననుట యధార్ధము. విపంచీ నినాదము నా మెకంఠము కలిసిపోవుచు వేఱుపఱుప నశక్య ముగ నుండెను. ముఖచిహ్న లేశములఁ బరికించి పాడుచున్న దనవలయునే కాని దూరమున నున్న యెడల వీణావాద నమే యనఁదగును గాని, వేఱోకనాదము దానిం గలిసియున్న దన వలనుపడక యుండెను. సంగీతముతోడఁ జిత్ర లేఖన మారంభింపఁబడియెను. చిత్ర లేఖనమున మానవులపరీక్ష, యంత మంచిది కాదని బుద్ధిమంతు లూహింతురు. పశుపక్ష్యాదులు దానింగాంచి యాసక్తములై చెంతకుంబోవ నదియే దానికౌశల మని పెద్దలందురు.

ఒక్కనాఁ డాదంపతులు వేడుక కై ద్రాక్షాఫలముల నిర్మింపుమని రాధికకుం దెలిపిరి, అట్లే యొనరింతు నని వర్ణకములఁగలిపి యామె యాఫలముల నలవరించెను. వాని నాదంపతులు చూడక రాధికా! అవి బాగుండు నని యెట్లు కనుఁ గొనవచ్చు నని ప్రశ్నించిరి. పందిరికి వ్రేలాడఁగట్టిన 'వానియం దము ప్రకటమగు నని యామే పలికెను. గృహమునకు దూర ముగనుండు నొకపందిరికి వాని వ్రేలాడఁగట్టిరి. దూరమున నుండి పరీక్షించుచుండిరి. కొలఁది నిమేషములకుఁ బక్షులు వచ్చి వానిం బొడువ నారంభించెను. చిలుకలు తటాలున నా చెంత వ్రాలెను. పటపటమని పొడువసాగెను. పరీక్షకులు చిత్రంపడిరి. తండ్రి, రాధికను జెంతకుఁ దీసికొని యుపలాలిం చెను. వేఱోకనాఁ డా రాధిక యొక చిలుకను బావురమును జేవ్రాసి వర్ణకముల వాని సింగారించెను. దూరముగ నిలిపెను. చిలుకలు మొత్తముగా వచ్చి దానిం బొడుచుచుఁ బోవసాగెను. ఎక్కడనుండీయో యొక శ్యేనము బుస్సున వచ్చి పావురమును దన్నెను. దానిం గాంచినవారెల్ల నిగి ప్రకృతి చిత్రకమే యని పలికిరి. ఇట్లే యామె పెక్కుతడవలు చిత్రించుచు వానిం బరీక్షించుచు దానియంద మిట్లుండినఁ గాని, ఫలింప దని యూహించుచుండెను.

సంగీత మామె పాడఁగా విన్న వారెల్ల నొక్కదినము చక్క నాలోచించి సభచేసి యామె 'కాశీః పురస్సరముగా నొకపదక మీయ నిశ్చయించిరి. ఆయుదంతము తల్లి దండ్రులకు ముందుగాఁ దెలిపి వారి యనుమతినొంది. పెద్దల 'కెల్ల రకుం దెలిపిరి. ఆనాఁ డొకచోటఁ బేరోలగము గూడెను. సంగీత శాస్త్ర పారంగతులే యందుఁ బెక్కం డ్రుండిరి. తల్లిదండ్రు, లా రాధికను ఘోటకశకటమునఁ గొనివచ్చి యర్హస్థానమునఁ గూరుచుండఁ జేసిరి. పురపురంద్రులెల్ల నొకచోఁ గూరుచుండి వేడుక చూచుచుండిరి. వారి కించుక దూరమునఁ బురుషులు కూరుచుండ వారియంతికమున నొకవ్యాళ గ్రాహి యుండెను. వాఁ డేల యీ విద్వత్సభలో నున్న వాఁ డని కొందఱు సంశ యించుచుండిరి. కొందఱు వాడు సంగీతమున నిధి యనిరి. కొందఱు చూడవచ్చె ననిరి. మఱియుఁ గొందఱు వాఁ డేదో పనియుండి వచ్చియుండుననిరి. ఇంకను గొందఱు మహాసభకు ధనవంతు లెందఱో యరు దెంతురు గాన వారిని యాచింప వచ్చె ననిరి. ఇఁకఁ గొందఱు వాఁడుకూడఁ బరీక్ష కుఁడే యనిరి. మణికొందఱు దృష్టిదోషము తగులకయుండ రక్షఁగట్టఁ బిలి పించియుందు రని యూహించిరి. ఒక్కఁడు మాత్రము కాదు కాదు. మీయూహలు పరిహాసమునకుఁ దగినవి. ఆకన్యకను భయపెట్టి యామెకు శక్తి యెంత గలదో కసఁబఱపవలయు నని వచ్చె నని చెప్పెను. ఇట్లు నానాముఖముల వారియూహాలు ప్రాఁకుచుండెను. నియత కాలమున కాసభాధిపతి లేచి యానాఁటిసభా సమావేశ హేతువును వివరించి రాధికకుం గల సంగీత కౌశలమును బరీక్షీంచుసమయ మిదియే యనియు, నోపికమైఁ జూడవలయు ననియుఁ, గోలాహల మొనర్ప ని ది సమయము కాదనియు విన్నవించెను. ఆయుత్తరక్షణమున నిస్తరంగమహా సాగరము భంగి నాసభాభవన మెల్ల నిశ్శబ్దమయ్యెను. పరీక్షకు లంతకుముందే నిర్ణయింపఁబడియున్నను దత్కాలమున వారి పేరులు సభాధిపతి చెప్పుటయు నెల్లరు నామోదించుటయు జరగవలసిన యాచార మగుట నట్లే యొనర్పఁబడియెను, వారు మూవురు లేచి యాచోటున నమరుపఁబడిన యుత్తుంగాసనముల పయిం గూరుచుండిరి. రాధికయు వారి చెంతనున్న యా స్తరణమున నుపవిష్టురా లయ్యెను. ఎల్లర కామె కనఁ బడుచుండవలయు నని యట్లోనర్పఁబడియె నఁట. పరీక్షకులు మూవురును వ్యాళ గ్రాహిని జేరిరి. ఆతఁడును రాధిక సమీప మునఁ గూరుచుండెను. ఏటికో యని యెల్లరు సంశయసమా క్రాంతస్వాంతులే యైరి. కాని 'యిదమిత్థ' మ్మని యొక్కరును నిర్ణయింపఁజాల కుండిరి.

పరీక్షకులలో నొక్కఁడు శివశంకరశాస్త్రి, మఱొక్కఁడు రామచంద్ర రాజు, మూఁడవవాడు సుదర్శన ప్రసాద పాండ్య, అని యెల్ల రెఱుంగవలయును. శివశంకరశాస్త్రి రాధికం గాంచి “ఆమ్మాయీ! శంకరాభరణ రాగము విపంచికయందు మేళవించి పాడుమా" యని యను రాగ మతి శయిల్లఁ బలికెను. 'రాధికను విపంచికస వ్యాంక సీమఁ గుదురు పఱచి తంత్రులమీటెను. ఆస్వరము సర్వజనశ్రుతిపుటపేయ మయ్యెను. రామచంద్రరాజు "కుమారీ! నీయెదుటనున్న వాఁడహితుండికుడు సుమీ! వాని చెంతనున్న పేటిక యందు నవీన కాల భుజంగ రాజమున్న ది. శంకరాభరణ మాలాపించి పాడు నపుడది మనకు వశ్యమయి యెవరు చెంతకువచ్చినను గ్రోధ మూనక నీపాటనే నే యాలకింపవలయు. అది పరీక్ష కావునఁ జక్కఁగా నీభావమును మదినిలిపి శాస్త్రము మీఱక పాడవలయును." అన, సుదర్శన ప్రసాదపాండ్య మాత్ర మిది విషమపరీక్షయే యని యూర కుంకెను.

శ్రుతి సాయపడగా నారాధిక పాడనారంభించెను. వాద్యగళస్వనము లేకమై వీనుల విందుగ నెసంగెను. ఒక్కరైనను మాటలాడఁజాల కూరకుండిరి. ఇన్ని చిత్ర ప్రతిమ లోక్కచో నెట్లు చేరినవి? అను ననుమానము నది పుట్టించెను. శివశంకరశాస్త్రి, వ్యాళగ్రాహిని గాంచి జాగ్రత్తపడు మనియె. ఆతఁ డించుక పేటికం గదలించెను. భయంకరముగ బుస్సను ధ్వని యెల్లరఁ దల్లడిల్లఁజేసెను. ఇదే యేటిపరీక్ష ! అని యంద ఱనసాగిరి. శాస్త్రి లేచి యార్యులారా! మీరూరకుండుఁడు రాధిక మాకుఁ బ్రియపుత్త్రికవంటిది. ఏమి కీడు రాఁబోదు. ఎవ్వరి కేమి కీడును గలుగదని నమ్ముఁడు. త్వరపడక యించుక యోపికం దెచ్చుకొని పరికింపుఁ డనియె. ఆమాటల కెల్లరు లోఁబడి యూరకుండిరి, రాధిక రాగ మూలాపించెను. కొలఁది నిమేషముల కాభుజంగశబ్దము సన్నగిల్లెను. మఱి కొలది క్షణముల కాపెట్టె మూఁతతీయ ననుజ్ఞ కాఁగా నాతఁ డట్టు లొనరించెను. ఫణియు విస్తృతపణము వెలయించి లేచెను. నేత్రము అగ్నిగోళముల నధఃకరించుచుండెను. మనోధైర్యము మటుమాయము కాగా నెల్లరు చేతులు పిసికి కొనసాగిరి. రాధిక మాత్ర మా కాలాహింగానక తన పని దాఁ జేయుచుండెను. అహితుండికుఁ డేదో యొకమూలికను జేతనుంచుకొని దాని ప్రక్కనే చూ చుచు జాగరూకుఁ డై యుండెను.

కొంత సేపటికిఁ దద్దృషులు తీవ్ర రూపమును వదలేను. నిశ్వాసమారుతములు శీతలము లయ్యెను. ముష్పదాఱంగుళ ముల యెత్తుననుండు ఫణము పదియంగుళములకుఁ దగ్లెను, కన్నులు మూఁతపడియెను. నివాత దీవకళికంబోలి యుండెను, ఎల్లవా రచ్చెరువుపడి చూడసాగిరి మూడుముహూర్తము లనఁగా నాఱుగడియ లట్లే యుండెను. ఆకాలాహికి సృతి కలదా యనుశంక గలుగఁజొ చ్చెను. సర్పమున్న దా యనుకొన సాగిరి శాస్త్రి లేచి యెవరుగాని దానిని దాఁకుఁడు, అది 'యేమియు ననఁజాలదు. రండు రండు. ధీరోత్తములు లెండు. రండు. అని బతిమాలసాగెను. కిందుచూచువారు కొందఱు పర ధ్యానము నభినయించువారు కొందఱు నైరి గాని లేచు వాఁడు గాని, లేవ నుంకించువాఁడు గాని, లేవ నూహించు వారుగాని మందున కందు లేకుండిరి. అహితుండికుఁడే నాలుగుమాఱులు పెట్టెను గదలించెను. ఫణాగ్రమున నడఁ చెను. ఏమియుననక యది శవముగఁ గన్పట్టెను. ఇదేమి మాయయా, ఔషధ ప్రభావమా, యని యేల్ల రచ్చెరువం దుచుఁ జూడసాగిరి. శాస్త్రీ, లేచి యార్యమహాశయులారా! సంగీతశాస్త్ర పరీక్ష యనఁగా నిట్టిది, శంకరాభరణ నామముగల యీ రాగము సర్పములకుఁ బ్రీతికరము. దానియందు షడ్జ స్వరము మయూరాధిదైవతమగుట వానికి విరోధము. ఆ విధ మెఱింగి పాడినఁగాని భుజంగములు తన్మయత్వము నొందవు. ఇపుడీ కాలాహి తన్మయత్వము నొందినది. పాట నిలుపఁగా యథాపూర్వరూపము గలదగును. రాధిక శాస్త్ర విహితపద్ధతిని మీఱక రాగము పాడినదని మన మెఱుంగవలయును. ఇది విషమపరీక్షయే యనక తప్పదు. అహితుండికుఁడు సమర్ధుడు. రాగ మెట్లు పాడినను బాధ లేకుండ నాఫణి నడంపఁ గలఁడు. ఆ విషయ మెఱింగియే యాతనిం బిలువఁ బంచితిమి. వయస్సున నామెకుఁ బదునాల్గవవత్సరము సాగుచున్నది. ఇంత స్వల్పకాలమున నింతటి పాండిత్యము సంగీతమునఁగల్గుట పూర్వ పుణ్యమే యనవలయును. ఉపదేశమాత్రమున సమ్యగ్ద్రహణ శక్తి యీ కుమారికకుఁ గలదు. కావున నీమహాసభలో బహుమానము పొంద నర్హురాలని మనవి చేయుచున్నాఁడను. నా యీభావము మీకెల్ల నంగీకారమయ్యెనేని ఆవిషయ మెఱుక పఱపుఁడని కూరుచుండెను. ఎల్ల రేక వాక్యముగ నంగీ కారమును దెలిపిరి.

తొలుదొలుతం బెద్ద లాశీర్వదించిరి. సువాసినులు మంగళములుగలుగఁ బాటలుపాడి సేసలు చల్లిరి. మహాజనా శీర్వాద మొక్కసారి సభాభవనము పిక్కటిల్లఁ జేసెను. అంతకుముందే యుపసంఘమువా రేకాంతముగఁ బరీక్షించి యుండిరి. ఆసభ్యులభావము ననుసరించి సిద్ధముచేయించిన సువర్ణపతక మొండు తేఁబడియెను. తాంబూలముపైన దాని నునిచి పరీక్షకులు మూవురు సభ్యులకుఁ బ్రతినిధులై యా రాధిక కొసంగి శారదాకరుణాపాత్రతం గాంచి చిరకాల మాయు ర్భాగ్యారోగ్యయశశ్శీలములు గలిగి వృద్ధినొందుమా యని యాశీర్వదించిరి. ఆసమయమున నా కుమారికంగన్న తల్లి దండ్రుల యానందమిట్టిదని యెవ్వరు వర్ణింపఁగలరు? అది శక్య మగుపనియే కాదు. ఐన నొక్కఁడు లేచి,

తే. శీతకరు నుదయంబున ♦ సింధువట్లు,
ఘనతతిం గాంచినమయూర ♦ గణమురీతిఁ,
బరమపూరుషుఁ గన్నట్టి ♦ భక్తుపోల్కి,
నలరుచుండుత జనకుల ♦ హర్ష మెపుడు.

అని దీవించెను పద్య భావము సరసజనహృద్యమని యెల్లరు మెచ్చు కొనిరి. కర్పూరదీపమును రాధికకు నివాళించి తల్లి దండ్రులు ఘోటకశకటమున నింటికిం బిలుచుకొని పోయిరి. ఆసభా గౌరవమును బురస్కరించుకొని యాకన్య పాండితి నలుదెసల వ్యాపించెను.


రెండవ వీచిక.

జాలంధరపురము నెఱుఁగనివారు మహారాష్ట్రులలో లేరనవచ్చును. ఆపురము చంద్రభాగకు సమీపమున నుండెను. శృంగార ప్రధాననగరము కాకున్నను ధనసంపన్న నివాసము మాత్ర మగును. నడుమనడుమ గృహములు పాడుపడియుండుట యది ప్రాచీనకాలమున నత్యున్నతదశ ననుభవించినదని చెప్పక చెప్పుచుండును. ఆచోటుల మరల గృహములు నిర్మింపం బడక యుండుటం బరికింపఁగాఁ గేవల శాస్త్ర విశ్వాసవంతు లందు విశ్లేషించి కలరని తెలియవచ్చును. పాడుపడిన తావుల గృహములు కట్టరాదని వాస్తుశాస్త్ర నియమము గలదు. కావు.