నీతి రత్నాకరము
Printed by
V. VENKATESWARA SASTRULU
of V. RAMASWAMY SASTRULU & SONS
AT THE 'VAVILLA' PRESS,
Madras - 1939
తొలిపలుకు
సరసమనీషులారా! నీతిరత్నాకరమను నీయాఖ్యాయికను దమ కర్పింపగలిగితని ఇందు నీతిమార్గావలంబకులకు విజయము, తద్విరుద్దమార్గావలంబములను నపజయము గలుగుటయే ప్రధాన భాగము. ఈ విషయములు రెండు నిందు విస్పష్టములగు. విశేషించి భగవత్సహాయము, సాధువుల తోడ్పాటు నీతి మార్గమునకు గలదని యీయాఖ్యాయిక తెలుపును. స్త్రీ పురుషు లన్యోన్యనుగుణప్రేరితులై ప్రేమగలవార లైననే యది చిరకాలము నిలుచుననియు, వేఱొకమార్గమున నది యచిరకాలముననే క్షీణించు ననియు తెలుపుటకే యీచిన్ని పొత్తము వ్రాయబడిన దనియుఁ దేటపడును. జనుల యభిప్రాయము లెట్టులున్నను నీతిమార్గము సర్వపక్షసమాదరణీయమగును గదా. దాని నాశ్రయించఁబూనిన మార్గములు వేఱు వేఱుగా నుండును. ఏమార్గము తుదకు నీతిమార్గమునఁ దన్నాశ్రయించినవానిం జేర్చునో యదియే సన్మార్గ మనబడును అట్టిమార్గములఁ దెలుపు గ్రంథములే బాలురకు నుపకరినరించునవి.
ఇందు నా చేసిన కృషి విశేషించి వ్రాయదగినది కాదు. స్త్రీవిద్య యెట్టిది మంచి దనునది నాయెఱింగినంతవరకు నిందు దెలిపితిని. క్షుద్రమంత్రములు లోనగునవి తొలుదొలుత మేలు గలిగించిన ట్లగవపడినను దుదకు హానిఁ గల్గించునని యీ కథా రూశమున విశదీకరించిన మహాకాళీ బలివలన సంతృప్తినొంది " భక్తులకు వరములొసంగు నన్న ప్రపాదము సత్యేతర మనియ నశాస్త్ర, మనియు స్పష్టపఱిచితిని. విశేషించి దేవతోత్సవము లందుఁ జేరు జనులు భక్తిభావముగల వారు కొలఁది సంఖ్యాకులే' యని తేటపఱచితిని, మూలికలయం దద్భుతశక్తి కలదని తెలియఁ బలికితిని. ఇట్టి విషయములు బాలుర హృదయముల నిలుప వలయు ననియు, దాన సనాత నీతిమార్గము పెంపొందు ననియు, విశేషించి దేవతాభక్తియుఁ బ్రభుభక్తియుఁ గుదురు కొన నవకాశము కలుగుననియు నాయాశయము. తక్కినవిషయములు గ్రంథపఠనమున నే తెలియఁగలను. ఇక్కడ వ్రాయ నవసరము లేదు,
ఈపొత్తమును ముద్రింప గోరఁగనే యంగీకరించి మూడుదినములలో ముద్రించియిచ్చిన యాంధ్ర గ్రంథోద్ధారకులు మ.రా. శ్రీ వావిళ్ల వేంక టేశ్వరశాస్త్రులుగారికీ మూలమున నాకృతజ్ఞతం దెలుపుచున్నాఁడను. కథాసంవిధానమున నెన్నియో లోపములుండును వానినెల్ల నాచే సంస్కరింపఁ జేయభాషాభిమానుల నంజలీ ఘటించి వేఁడుచున్నాఁడను, ఇంకఁ బెంచి వ్రాయ నుద్యమింపక సజ్జనులను దీనికిఁ జేయూత యొసంగ వేడుచు విరమించుచున్నాఁడను.
ఇట్లు సుజన సేవకుడు, జనమంచి శేషాద్రిశర్మ, శ్రీ. శ్రీ. శ్రీ. |