ధనుర్విద్యావిలాసము/ద్వితీయాశ్వాసము
శ్రీ
ధనుర్విద్యావిలాసము
ద్వితీయాశ్వాసము
క. | శ్రీరఘుకులాబ్ధిసోమా | 1 |
వ. | అవధరింపుము, అట్లు సావధానమనస్కు లగు శౌనకాదులకుం | 2 |
క. | ఆయోధన సమయంబునఁ | 3 |
ఉ. | సాదికినిం బదాతికిని సంగరవేళల నొండుకార్ముకం | 4 |
గీ. | అట్టిసాధనయుగళంబునందు ధరణి | |
| మీనముల మానములఁ గాంచి మెలపు గొలుపు | 5 |
వ. | మఱియును. | 6 |
క. | కంబళములనైననుఁ జి | 7 |
వ. | వెండియు శరగోపనార్హంబులగు తూణీరంబుల భేదంబులును, మానం | 8 |
క. | క్షోణి నుపాసంగంబును | 9 |
వ. | వెండియు. | 10 |
మ. | తనరుం దూణము లాఱుచందముల నందంబందు నందుం గవా | 11 |
గీ. | అగ్గవాజనతూణంబులందు నాల్గు | 12 |
గీ. | ఏకశిఖర మొకటి యీచతుశ్శిఖరంబు | 13 |
ఉ. | సద్రసవద్గవాజిననిషంగచతుష్టయ మాజితేజిపై | 14 |
సీ. | షట్త్రింశదంగుళోచ్ఛ్రయముపై విప్పుగా | |
తే. | చెలు వమరఁ దీర్చునది చతుశ్శిఖరతూణ | 15 |
క. | మూఁతలతోఁ బదిముష్టులు | 16 |
చ. | ఎలమికొలందికై యిడిన యెన్మిదిముష్టులమధ్యనాళమున్ | 17 |
క. | ఒకనారాచమునకు వే | |
| సుకరంబై నాళౌఘ | 18 |
ఉ. | రంజితలీల మేడమొగరంబు తెఱంగు తుఱంగలించురే | 19 |
వ. | ఈ యాఱుతూణంబులం గవాజినతూణంబులు చతుర్విధయుద్ధార్హం | 20 |
ఉ. | కొండి ధ్రువంబుగా మొదటఁ గూర్చిన బాఱెడుచర్మపట్టికా | 21 |
గీ. | అట్లు సార్ధాంగుళము వెడ ల్పమరుచున్న | 22 |
వ. | మఱియును. | 23 |
క. | శిరమున సింహలలాట | 24 |
గీ. | దాని సింహలలాటంబు దరియ మూఁడు | |
| వివరమున పట్టికలు గూర్చి వెడలఁదిగిచి | 25 |
వ. | విను మట్లు క్షురికాకారంబునం దీర్చిన దంతశలాకశీర్షంబునం దన | 26 |
క. | మౌర్వీజ్యాగుణశింజను | 27 |
వ. | అట్టి గుణంబునకు యథానుగుణంబుగా విధానంబు గల దాకర్ణింపుము. | 28 |
సీ. | నరములచేఁ జాగ నారచే నైనను | |
| నవరణమ్ములఁ గూర్చగాఁ దివురు రెండు | 29 |
క. | ధనురాగమోదితంబులు | 30 |
గీ. | నరముచాగనార నాణెంబు గల పట్టు | 31 |
వ. | మఱియు దూరాపాతార్హంబులైన శరాసనంబులకుం గూర్పందగిన | 32 |
గీ. | పరువమై డాలు మేలగు పట్టునూలు | 33 |
వ. | అట్లుం గాక మఱియును. | 34 |
క. | జలముల గోధూమము లిడి | 35 |
సీ. | పదియాఱుముష్టుల బాణాసనమునకు | |
| పదునాల్గుముష్టుల బాణాసనమునకు | |
గీ. | యేకొలందిని గార్ముకం బెసగుచుండు | 36 |
వ. | ఇఁక నంగుళీత్రాణంబుల లక్షణంబులును, తద్వినియోగంబులును, | 37 |
క. | ఈవిద్యకు సాధనములు | 38 |
గీ. | అందు శరధనుర్జ్యాత్రితయంబు కరణి | 39 |
వ. | వెండియు. | 40 |
గీ. | బాతుముక్కురీతిఁ బటుహంసపక్షంబు | 41 |
గీ. | బాతుముక్కురీతి భాసిల్లుచుండెడు | |
| భాతి నమరుచుండు నూతనాభ్యాసికి | 42 |
చ. | పదపడి హంసరొమ్మువలె భాసిలుచుండెడు నంగుళీత్రమున్ | 43 |
ఉ. | ఏనుఁగు నెక్కి సాహిణము నెక్కి రథోత్తమ మెక్కి పోరులం | 44 |
శా. | క్షోణి న్మద్గువిషాణఖండమున సర్గోధాంగచర్మంబునన్ | 45 |
గీ. | ఇందు మొదలిటి మూఁడును హేమరజత | 46 |
గీ. | క్రౌంచచంచుపుటాకృతి గజవిషాణ | 47 |
వ. | ఇట్లు బాతుముక్కుకరణిం బురణించు నంగుళిత్రాణంబునకు విధా | 48 |
క. | పోఁడిమి గజదంత మరుణ | 49 |
వ. | ఇం దొక్కవిశేషంబు గలదు. | 50 |
గీ. | గేడివట్టు లొడ్డగెడవుగాఁ గోసిన | 51 |
వ. | ఇక వర్తులంబగు నంగుళిత్రాణంబునకు విధానం బుపన్యసించెద | 52 |
గీ. | పరిణతంబగు జంబీరఫలమురీతి | 53 |
వ. | ఇంక నశ్వత్రదళాభం బగు నంగుళిత్రాణంబునకు విధానం బుపన్య | 54 |
చ. | చతురస్రంబుగ నాలుగంగుళములున్ చర్మంబు గోధాంగకో | 55 |
ఉ. | జడ్డన హంసరోమువ లెఁ జక్కన గాఁదగు నంగుళీత్రమున్ | |
| రొడ్డదు నిమ్మబ్రద్దవలె నొజ్జలు గుల్కెడు నంగుళీత్రమం | 56 |
వ. | మఱియు నీయంగుళిత్రాణంబులకు గుణలతార్ధాంశంబు లా వునుపం | 57 |
ఉ. | చాపం బెక్కెడు నేర్పు లాఱుతెఱఁగుల్ శాస్త్రానుకూలంబులై | 58 |
వ. | అందు నూతనచాపజ్యారోపణప్రకారద్వయం బుపన్యసించెద | 59 |
చ. | కుడితొడక్రింద వామపదగుల్ఫము నూనుచు వామభాగపున్ | 60 |
ఉ. | అటువలె గోముఖాసనమునందు నరుం డుభయోరుపర్వముల్ | 61 |
వ. | వెండియు నెండల నెండినం గుండలాభంబగు నవీన శార్ఙ్గకోదం | 62 |
క. | అసహాయస్థితి నొక్కరుఁ | 63 |
చ. | కొలఁకు లమర్చి శృంగములఁ గూర్చిన పట్టిక యోగపట్టికా | |
| దొలయఁగ నూరుపర్వముల నూని పిఱందికి మ్రొగ్గ వ్రాలి ని | 64 |
వ. | ఇట్టి నవీనజ్యారోహణంబులను, బూర్వోక్తంబైన మౌర్వీలలామంబు | 65 |
చ. | ఇనుమునఁ గొంకియుం గొలుసు నీవల నావల దావలంబుగా | 66 |
వ. | ఇట్లు పేడెత్తకుండం దరతరంబునం బదిలంబుగా పైపైగొలుసులం | 67 |
చ. | కడిమిమెయిం సుఖాసనము గైకొనుచుం గొమ వామభాగపుం | 68 |
చ. | లలి సమపాదుఁడై నిలిచి లస్తకమున్ వలఱెక్క నూనుచున్ | 69 |
ఉ. | డాపలిప్రక్క నొక్కకొమ డగ్గఱ దక్షిణకూర్పరంబునన్ | |
| డాపలికేలు సాచి ప్రకటంబుగ శార్ఙ్గము నెక్కిడందగున్ | 70 |
గీ. | ఆఱవతెఱంగు ధనురాగమార్థవిదులు | 71 |
క. | మోపుల వలతొడ కొమ నిడి | 72 |
వ. | ఇట్టి యాఱుతెఱంగులు శాస్త్రవిహితంబులై ప్రసిద్ధిగాంచు, మఱియు | 73 |
క. | నిస్తుల మగువింటన్ గుణ | 74 |
గీ. | ఈతెఱంగున శార్ఙ్గంబు లెక్కుపెట్టి | 75 |
ఉ. | బాలసుధాకరుండుఁ బలె భాసిలు శార్ఙ్గము లక్ష్యవేదికా | |
| భ్రూలతికావిలాసమునఁ బోల్పగ నై తగు శార్ఙ్గచాపమున్ | 76 |
వ. | అట్లగుట నెక్కిడిన బాలశశాంకభావంబునం బరిఢవిల్లు శార్ఙ్గంబు | 77 |
శా. | చాపం బెక్కిడునేరుపుల్ దెలిసి యుత్సాహంబునన్ వింటికిన్ | 78 |
క. | సకలకళాపరిణతుఁడై | 79 |
వ. | ఇట్లు కఠినభాగంబు పుచ్ఛంబును, బులకనిభాగంబు శిరంబును గావిం | 80 |
మ. | మెఱయన్ ముష్టి శరాసనంబు నడుమన్ మేలైన తన్ముష్టిపై | 81 |
చ. | సమత్బలశృంగమై తనరు శార్ఙ్గముకోటులలోన నొక్కటై | |
| రమణులహస్తపద్మముల రాజిలు శార్ఙ్గము సాటివచ్చు ని | 82 |
వ. | అట్టి శార్ఙ్గధనుర్లలామంబున కూర్ధ్వాధరవివేచనంబు వలవదు, | 83 |
క. | బాణపు టొరయికచేతన్ | 84 |
వ. | ద్వంద్వసంకులసమరంబులను నిశాసమయంబులను శరసంధానంబున | 85 |
క. | క్షతి శార్ఙ్గము దాల్పఁగ వ | 86 |
వ. | క్రమంబునఁ దల్లక్షణంబులు నిరూపించెద. | 87 |
క. | అంగుష్ఠము వెలిగాఁ జతు | |
| యంగుష్ఠము వాచినయెడ | 88 |
క. | అంగుష్ఠాగ్రంబు ద్వితీ | 89 |
క. | అంగుష్ఠాగ్రమున ద్వితీ | 90 |
మ. | ఇలపై బాణము లేయ నిశ్చలముగా నేస్థానమందైన రా | 91 |
వ. | విను మిందుల నొక్కవిశేషంబు గలదు దూరాపాతనప్రముఖంబు | 92 |
క. | ముంజె య్యెడచేయు సగము | 93 |
క. | కరతలము సగము ముంజే | 94 |
వ. | విను మర్ధచంద్రహస్తంబున వంశభవకార్ముకంబు ధరియించినం | 95 |
గీ. | తనబలిమి కెక్కు డగు విల్లు దాల్చునేని | 96 |
సీ. | అరచేయి నవకోరకాశ్రయంబునఁ బొక్కు | |
తే. | యనుగుణం బైనకార్ముకం బమరఁబట్టి | |
| నీక శింజిని మొరయించి నిలుపుఁగాక | 97 |
వ. | ఇవ్విధంబున కార్ముకముష్టిప్రకారంబులు బ్రవర్తిల్లుచుండు, నింక | 98 |
శా. | ఈశానుండు గుహుండు భార్గవకులాధీశుండు రామక్షమా | 99 |
సీ. | ఎడమపాదము లక్ష్య మెదురుగా మున్నిడ | |
తే. | నిల సమస్థానమున నుండి యడ్డముగను | 100 |
వ. | వెండియు ధనుర్ధరుం డయ్యైస్థానంబుల నిలుచు విన్నాణంబులును | 101 |
మ. | తెఱఁగారం గుడిపాద మడ్డముగ ధాత్రిన్ నిల్పి తద్గుల్ఫముం | 102 |
మ. | తనరారున్ విను మాఱుచందములఁ బ్రత్యాలీఢమం దాద్యమై | 103 |
సీ. | జగతిపై మూరెఁడుజంగగా నిలిచిన | |
తే. | నిత్తెఱంగుల నాల్గింట నెడమపిఱుఁదు | 104 |
వ. | మఱియు నొక్కవిశేషంబు గల దాకర్ణింపుము. | 105 |
సీ. | కుడికాలు వెనుకనుంకున నైదుజేనల | |
తే. | మెలమి గనుపడు నిట్లుగా నివ్విశేష | 106 |
వ. | విను మిందు వైష్ణవంబును స్వస్తికాసనంబునుం గాక శుద్ధప్రత్యా | 107 |
వ. | ఆలీడస్థానవిభాగము. | (ఎ.) 107 |
మ. | కడిమిన్ వామపదంబు ధాత్రిపయిఁ జక్కన్ నిల్పుచుం మూరెఁటన్ | 108 |
వ. | ఈలక్షణానకు కందాళ వెంకటాచార్యులుగారు చెప్పిన పద్యాలు. | 109 |
సీ. | కుడికాలుజంగ మూరెఁ డెడంబుగా సాఁచి | |
| గోధాంగుళిత్రముల్ కొమరారఁ గాఁ బత్రి | |
తే. | శార్ఙ్గమున నేయుధన్వికి సత్త్వ మెడలఁ | 110 |
వ. | వైశాఖస్థానవిభాగము. | 111 |
మ. | పుడమిన్ మూరెఁ డెడంబుగాఁ బదయుగంబున్ నిల్పి వామాంఘ్రికిన్ | 112 |
వ. | ఈ స్థానకంబునకు లక్షణవివక్ష. | 113 |
గీ. | రెండుపదములనడుమ మూరెఁడువెడల్పు | 114 |
వ. | సమస్థానవిభాగము. | 115 |
గీ. | అంగుళద్వయ మెడ ముండునట్లుగాఁగ | 116 |
క. | పాదద్వంద్వము నడుమను | |
| గాఁదగు నూర్ధ్వశరవ్యని | 117 |
వ. | మండలస్థానవిభాగము. | 118 |
గీ. | పదము లిరుగడలును జొప్పి పార్శ్వములను | 119 |
వ. | ఇట్టి స్థానపంచకంబునకు వినియోగంబులు వివరించెద నాకర్ణింపుము. | |
శా. | ఆశంసార్హములై ధరం బరగు ప్రత్యాలీఢ మాలీఢముల్ | 121 |
వ. | ఊర్ధ్వాధస్సమానలక్ష్యవినిభాగము. | (ఎ.) 121 |
గీ. | పార్థ విను పాదచారికి పాదచారి | 122 |
చ. | తరుశిఖరస్థలీఫలపతంగవితానము శైలకూటగో | 123 |
గీ. | ఉన్నతస్థాయి కడుగున నొనరుచుండు | 124 |
గీ. | ధరణిమీఁద భద్రదంతావళముమీఁద | 125 |
వ. | వెండియు నీస్థానపంచకంబున కనుబంధంబులై ప్రతిష్ఠానంబు లనేకం | 126 |
వైష్ణవస్థానకము
గీ. | కుడియడుం గూని డాపలిగుల్ఫమందు | 127 |
స్వస్తికాసనము
క. | ప్రత్యాలీఢపదస్థితి | |
| నత్యంతముఁ గూర్చున్నన్ | 128 |
గతాగతము
క. | వారక ప్రత్యాలీఢప | 129 |
హంసలలితము, పార్శ్వగము, డోలాపాదము, వివర్తనము
సీ. | హంస మేఁగిన రీతి నడుగు లూనుచు నేఁగు | |
తే. | మానితం బగు నీప్రతిష్ఠానమునకు | 130 |
ఏకపాదము
మ. | కమనీయాకృతిఁ జాపరోపముల జాగ్రల్లీలచేఁ బూనుచున్ | 131 |
మయూరతిలకము
| మయూరతిలకం బగున్ మదమయూరభావంబునం | 132 |
వ్యత్యస్తపాదము
మ. | గళమందున్ గటియందు వామచరణస్కంధంబునందుం ద్రిభం | 133 |
భ్రమరీమండలము, చక్రమండలము. అర్ధమండలము
మ. | భ్రమరీమండలమౌ భ్రమభ్రమరవిభ్రాంతిన్ భటుం డేకపా | 134 |
వ. | విను మిట్టి ప్రతిష్ఠానంబులకు వినియోగం బుపన్యసించెద. | 135 |
సీ. | ఇల నుండు కందుకాదుల దూయ నేయఁగా | |
| మిరుగడలఁ గ్రమ్ము శత్రుల నేయుటకును | 186 |
ద్రుతవి. | ఒరుని మార్కొని యొండొకరుండు దా | 137 |
ఇంద్రవ. | సత్యంబుగాఁ బల్కుదుఁ జాపహస్తుం | 138 |
క. | వియదావరణపదస్థితి | 139 |
తే. | దూరపాతిశరంబులం దొడఁగుటకును | 140 |
క. | కుతుకమున నేకపాద | 141 |
చ. | పలువురు పన్నిదంబులను బైకొని బాణము లేయ ధీరుఁడై | 142 |
క. | కోరి సమప్రత్యాలీ | 143 |
చిత్రగతి
మ. | నమపాదప్రముఖాదిమస్థిరచరస్థానప్రతిష్ఠానతా | 144 |
వ. | మఱియును. | (ఎ.) 144 |
సీ. | హస్త్యశ్వరథభూములందు ధనుష్మంతుఁ | 145 |
వ. | వెండియు నొక్కవిశేషంబు గల దాకర్ణింపుము. | 146 |
క. | స్థిరములు చరములు నై ధా | 147 |
వ. | అందుఁ బ్రథమోద్దిష్టంబగు ప్రత్యాలీఢాదిస్థానపంచకంబును వైష్ణవ | 148 |
శా. | స్థానంబుల్ వినియోగలక్షణపరీక్షారూఢి బోధింపగా | 149 |
వ. | అని యడిగిన నాచార్యుండు పార్థుని భక్తిస్నేహంబులకుం దద్దయు | 150 |
క. | నీ వడిగినట్ల యడిగితి | |
| నావినతికిఁ బరితుష్టుం | 151 |
వ. | తత్ప్రకారంబు వినుపించెద నాకర్ణింపుము. | (ఎ.) 151 |
శా. | ఏయేలక్ష్యములందు శాస్త్రనియతం బేస్థానకం బుర్విలో | 152 |
క. | శ్రుతులకు నోంకారము వలెఁ | 153 |
వ. | అని యానతిచ్చి తత్సమయసమాపాదితప్రమోదపరాయత్తచిత్తుండై | 154 |
మ. | క్షితిజాగ్రంబునఁ గృత్రిమం బయిన పక్షిన్ లక్ష్యముంగా సమ | 155 |
వ. | మఱియు నీదృశంబులగు విన్నాణంబులు పెక్కు లుపదేశించినం గృతా | 156 |
క. | సమ మూర్థ్వలక్ష్యగంబై | 157 |
వ. | అనిన నాచార్యుండు పార్థున కిట్లనియె. | 158 |
సీ. | హరిదంతదంతావళావళుల్ సరివచ్చు | |
తే. | నిలిచి క్రిందికి శరములు నిలుపునపుడు | 159 |
వ. | వెండియు వాహనారూఢుం గదిసి శరంబులు నినుచు పాదచారికి | 160 |
సీ. | కర్తరీహంసముఖంబు లరాళంబు | |
| గర్తరీహంసముఖములు వంశజశార్ఙ్గ | |
తే. | నలపతాకాఖ్యహస్తమునందు జుట్న | 161 |
గీ. | మహితతర్జనిమధ్యమామధ్యమమున | 162 |
చ. | బొటమనవ్రేలిమీఁది కణుపుంబయిఁ జుట్టనవ్రేలు వాంచి ప | 163 |
చ. | శర మరివోసి పింజె సరసం బెనువ్రేలు గుణంబుమీఁదుగా | 164 |
క. | రెండవకణు పంగుష్ఠము | 165 |
గీ. | గుణము పెనువ్రేలి మొదలిటి కణుపుమీఁదఁ | 166 |
క. | అంగుష్టాగ్రంబు ద్వితీ | 167 |
గీ. | వసుధ వెలిపట్టు లోపట్టువలె నెసంగుఁ | 168 |
చ. | ఇట్టు లరాళహస్తమున నేర్తెఱ న మ్మరివోసి తీయుచున్ | 169 |
వ. | కర్తరీహస్తంబున ధనురాకర్షణం బెట్టిదనిన. | 170 |
గీ. | ఖగ మదికి మధ్యమాంగుళాగ్రంబు పింజె | 171 |
క. | సరిపట్టున నంగుష్ఠో | 172 |
మ. | అనురాగమ్మున నీకు నీగతి సఖండాఖండభావోల్లస | 173 |
వ. | బాణగ్రహణహస్తనిరూపణము. | 174 |
గీ. | హంసముఖము శిఖర మను హస్తయుగళంబు | 175 |
వ. | అందు హంసముఖహస్తలక్షణంబు నిరూపితం బయ్యె. శిఖరహస్తం | 176 |
క. | అంగుష్ఠం బెడగా నిత | 177 |
డి. | హంసముఖహస్తమున దొన నమరుచున్న | 178 |
మ. | కనదూర్ధ్వాధరభావముష్టికలనాకర్షంబులన్ దోషముల్ | 179 |
గీ. | అదికి గుణముపైఁ బింజకు నవల నివలఁ | |
| నట్లు గానింప గుణము నోరారఁ బింజ | 180 |
క. | ఈరీతిఁ బుంఖ మదుకక | 181 |
క. | పింజమొగమ్మున కొలఁదికి | 182 |
గీ. | కణఁక బాలుండు బిట్టున బెణక నీక | 183 |
క. | సాయక మదికెడువేళ ను | 184 |
క. | ఎడమకు నటువలెఁ ద్రిప్పిన | 185 |
క. | దాపలిముష్టిని నెలకొను | |
| ప్రాపింపఁగ వలపలిచెయి | 186 |
క. | ప్రక్కలు చెక్కులు దృక్కులు | 187 |
గీ. | పింజ సోకినఁ మచ్చఁ బ్రాపించియుండు | 188 |
వ. | మఱియు నీయాకర్షణహస్తచతుష్టయంబునకు సప్తస్థానంబులు గల | 189 |
మ. | బొమ లిమ్మౌ నధరాధరాధరతలంబున్ దక్షిణశ్రోత్రమూ | 190 |
క. | వలజత్రువు వలవీనున్ | 191 |
క. | ముష్టిత్రితయంబున నొక | 192 |
మ. | కర్ణాభ్యర్ణము సోక గాఢధనురాకర్షంబు గావించుచో | 193 |
క. | ఆకర్ణాంతంబుగ ధను | 194 |
గీ. | వామభుజకూర్పరంబున వంపు దీర్చి | 195 |
క. | విను చుబుకాధరమధ్యం | 196 |
వ. | వెండియు దక్షిణజత్రుస్థానంబు వంశభవధనురాకర్ష ణంబునం బాణ | 197 |
సీ. | పలుమొన లధరంబుపై నూనగా రాదు | |
| హొయలుగా వక్షమ్ము బయలు చూపఁగరాదు | |
గీ. | కీళ్ళనరములు బిగువు సోకింపరాదు | 198 |
మ. | శరసంధానవిధానతానకములన్ సంధిల్లు నిద్దోషముల్ | 199 |
వ. | ఇట్లు శరసంధానంబునుం ధనురాకర్షణంబునుం బసమించు నింక శరం | 200 |
సీ. | అలుఁగు లస్తకమున కవలఁ జిక్కఁగఁ జాప | |
గీ. | కణఁకఁ బెనువ్రేలి రెండవకణుపుమీఁద | |
| ఆకణుపు లోనుగా నలుం గమరఁ దివిచి | (ఎ) 200 |
సీ. | క్రందుకయ్యములందుఁ గడిఁదివేఁటలయందుఁ | |
గీ. | తెగువ బాణముల్ ప్రథమద్వితీయములను | 201 |
వ. | విను మియ్యాఱుతెఱంగులం దృతీయంబగు విధంబు శరాగ్రంబునకు | 202 |
సీ. | కడిమి నూర్ధ్వాధరాంగములు కార్ముకమున | |
గీ. | ఆత్మమానసవృత్తితో నాకలించి | 203 |
సీ. | కలశమధ్యగదీపకలికాంకురము లీలఁ | |
గీ. | కడిఁది కుడికంటిచూడ్కి పుంఖమున కలుఁగు | 204 |
క. | సాదులకు నిషాదుల కరి | |
| గాదట్టిచూడ్కి యచలము | 205 |
గీ. | మాట లిఁక వేయు నేటికి మానసంబు | 206 |
వ. | ఇట్లగుటఁ దదేకధ్యానంబున నిశ్చలమనస్కుండై పూర్వోక్తప్రకారం | 207 |
క. | శరపుంఖోద్వేజనమును | 208 |
శా. | ఆకర్ణాంతము కాండముం దివియుచో నర్ధాంగుళం బాశుగం | 209 |
వ. | అం దొక్కవిశేషంబు గలదు. | 210 |
క. | ఎడనెడ నెడమకుఁ గుడికిన్ | 211 |
చ. | అటులు బిగించి పుంఖమున కావలి యీవలియంగుళంబు లొ | 212 |
క. | ముష్టిం బ్రథమము తాన స | 213 |
వ. | అట్లు ప్రథమోద్దిష్టంబులగు పుంఖోద్వేజనంబు వివరింపంబడు నింక | 214 |
క. | శరమోక్షణసమయంబున | 215 |
గీ. | సంతతాభ్యాసవశమున శస్త్రధరుఁడు | 216 |
వ. | తృతీయంబగు చాపోత్సరణంబు వివరించెద నాకర్ణింపుము. | 217 |
క. | ప్రబలు శరమోక్షణంబున | 218 |
క. | బాణ మరివాపితోడనె | 219 |
వ. | విను మిత్తెఱంగులు మూఁడునుం ద్విరదరథపదక్రమశరమోక్షణ | 220 |
ఉ. | మానితముష్టి కార్ముకము మధ్యముఁ బట్టిన నేమి సూచిత | 221 |
క. | శరమోక్షణసమయంబున | 222 |
గీ. | కణఁక నంగుష్ఠనఖర మాకసముఁ జూడ | 223 |
వ. | వెండియు నొక్కవిశేషంబు గలదు. శరాభ్యాసంబు సేయు విన్నా | |
| బుగా నీడవలయు నింక శరాభ్యాసమాసవాసరతారకాయోగకరణ | 224 |
మ. | మును మున్ గార్తిక మార్గశిరమున్ బుష్యంబు మాఘంబు ఫా | 225 |
శా. | హాలిన్ బ్రాతర ధీతికిన్ హిమజలవ్యాసక్తిచేతోమలం | 226 |
సీ. | పన్నిదంబున భంగపరచవచ్చినవాని | |
తే. | నోలిఁ దిథివారతారకాయోగకరణ | 227 |
వ. | వెండియుఁ బురహరస్కందపరశురామప్రముఖులగు మహాపురుషు | |
| నవద్యధనుర్విద్యాసముద్యమంబున మాద్యజ్జంభారిసంబేరమ | 228 |
క. | కార్తికమాది దొమ్మిది | 229 |
క. | తక్కిన మాసత్రయమున | 230 |
గీ. | సకలఋతుయోగ్య మయ్యు వంశజశ రాస | 231 |
క. | నిద్రాసక్తుని కైవడి | 232 |
క. | మొక్కల మానిన వంశజ | |
| మిక్కిలి నడువకయును శర | 233 |
మ. | చను నాషాఢము జ్యేష్ఠమాసమును వైశాఖంబు దూరాభిపా | 234 |
వ. | మఱియు ధనురభ్యాసప్రథమకరణంబులగు తిథివారతారకాయో | 235 |
గీ. | మాఘశుద్ధపక్షంబున మలయు నాఱు | 236 |
గీ. | శుద్ధమున ద్వితీయ శుద్ధతృతీయయు | 237 |
గీ. | బహుళమున ద్వితీయ బహుళతృతీయయు | 238 |
గీ. | వారములను మూఁడువారము ల్కార్ముక | 239 |
సీ. | ధీరసమ్మతమైన తిథిని విల్లుధరించు | |
తే. | నమరు శుభకరకరణంబులందు రంగ | 240 |
వ. | ఇట్లు తీథివారతారకాయోగకరణంబులు ప్రవర్తిల్లు నింక రంగప్రకా | 241 |
క. | ఈ విలువిద్యకు సాధన | 242 |
ఉ. | రంగముఖానుకూలచతురంగము రాజితరాజరాజసా | 243 |
వ. | అట్టి రంగంబునకు నంగంబులై ప్రమాకరణంబును, మదుత్తరణం | |
| చుండు, నట్టి సంస్కారపంచకంబునకు లక్షణప్రపంచంబు వివరించెద | 244 |
సీ. | దక్షిణపశ్చిమోత్తరపూర్వదిగ్విభా | |
గీ. | ద్వారసీమలఁ బచ్చలతోరణములఁ | 245 |
క. | రంగవిధానంబున కివి | 246 |
గీ. | అన వినుచుఁ బార్థుఁ డిట్లను నతనితోడ | 247 |
ఉ. | ఆయము లేని గేహము సహాయము లేని చిరప్రవాస మా | 248 |
క. | ప్రస్తారలక్షణక్రమ | 249 |
గీ. | కంటకాస్థిశిలావళీకలితమైన | 250 |
వ. | అదియునుం గాక. | 251 |
ఉ. | కీకసలోష్టలేశములఁ గిల్బిషభావముఁ గాంచు రంగధా | 252 |
గీ. | ఒడ్డగెడవైన రంగమధ్యోర్వి ధన్వి | 253 |
గీ. | అడుఁగుతాకున భూరజం బడలి మేన | 254 |
క. | జగతి నరిష్టనివారక | 255 |
వ. | అట్టి ధనుఃకళారంగంబునకుం దగినవిధానం బాకర్ణింపుము. | 256 |
గీ. | ఎలమి నిన్నూఱుబారలకొలఁదిఁ బావ | 257 |
క. | పంకరుహనాభ శంకర | 258 |
వ. | తదనంతరంబ. | 259 |
గీ. | హరిహరహిరణ్యగర్భుల నభినుతించి | 260 |
సీ. | వల్మీకతరులతాగుల్మము ల్మాయించి | |
గీ. | కడిది గొడుగులు పడగ లుగ్రంపుటాల | 261 |
క. | ద్వారములు నాలుగును బం | 262 |
మ. | ప్రకటస్ఫారగభీరనీరపరిఖాప్రాకారమున్ హైమమం | 263 |
వ. | ఇవ్విధంబున నంగప్రత్యంగసంగతంబుగా ఖురళీరంగంబు నిర్మింపంజేసి | 264 |
సీ. | కలధౌతజలజాతలలితాతరళితాత | |
| పగడంపు జగజంపు నిగరంపు జిగిపెంపు | |
గీ. | చోళనేపాళపాంచాలగౌళమాళ | 265 |
సీ. | నవయస్కు లుత్సాహసహితులై యొకచాయ | |
గీ. | పణవకాహళతమ్మటపటహశంఖ | 266 |
వ. | వెండియు నాఖండలశుండాలశుండాదండసముద్దండతరభుజాగ్రజాగ్ర | |
| చుచుం బరవాహినీమదకలకలభావలగ్నపరివారితఘంటికా | |
| కమ్ములకుం బ్రహర్షించుచు వేదానువాదమ్ముల మోదమ్ములు | |
| హృద్యానవద్యవిద్యానుద్యోతితప్రశంసులగు విద్వాంసులును, | 267 |
ఉ. | వాసవుఁ డాదిగా ఖచరవర్గ మనర్గళభక్తి నిన్నుఁ గై | 268 |
గీ. | అని వినాయకుఁ బ్రార్థించి యష్టదిశల | 269 |
సీ. | ప్రతిభానుభావ మేర్పఱచుమీ సురరాజ | |
తే. | వకుళవంజుళలవలీలవంగలుంగ | 270 |
వ. | అని యష్టదిక్పాలకుల నారాధించి కల్పోక్తప్రకారంబున హోమ | 271 |
సీ. | నీసఖ్యమునఁ గదా నీరజబంధుండు | |
గీ. | పావనాకార సంశ్రితభయవిదూర | 272 |
వ. | అని యగ్నిభట్టారకు నారాధించి తత్ప్రసాదంబునఁ గృతార్థుండై | 273 |
ఉ. | అమ్మ తపోనుభావనిధి వమ్మ సమస్తము దాల్చు పేటి వీ | 274 |
వ. | అని ధరిత్రిం బ్రార్థించి శరశరాసనానయవంబుల నిష్టదేవతావాహ | 275 |
సీ. | విరివిగా విరిసిన విరజాజిపువులతో | |
గీ. | కలితమృగమదకర్పూరగంధసార | 276 |
వ. | ఇవ్విధంబునఁ బూజించి మఱియును. | 277 |
సీ. | వామశృంగం బల వామదేవుండును | |
గీ. | చక్రహస్తుఁడు సతతము శరముఖంబు | 278 |
వ. | అని యివ్విధంబున శరశరాసనంబులకు నంగరక్షకులు గావించి. | 279 |
సీ. | పాదద్వయము తీర్థపాదుఁడు రక్షించుఁ | |
| బాహువుల్ ప్రోచు గోపాలకశ్రేష్ఠుండు | |
గీ. | అగ్రభాగముఁ గాచు సర్వాగ్రగణ్యుఁ | 280 |
వ. | అని యిష్టదేవతాప్రార్థనంబులు పఠింపుచు మంత్రకవచంబున నవ | 281 |
సీ. | ఏవిద్యపెంపున నీశానదేవుండు | |
| నేకళాపరిణతి నెసఁగ భార్గవరాముఁ | |
తే. | నట్టి విలువిద్య నయమున నభ్యసింపఁ | 289 |
వ. | అని వినుతించి సమీహితమనస్కుడై నిలువం దగు నట్లు కరం | 283 |
క. | బాణాసన తిలకంబును | 284 |
సీ. | శ్రీరస్తు రాజ్యలక్ష్మీసమూర్జితధామ | |
గీ. | అని యిటుల మాగధులగాన మనుదినంబు | 285 |
వ. | అని యివ్విధంబున నాశీర్వదించి యిచ్చు ధనుర్బాణంబులు కరయు | 286 |
మ. | వరదోషాటవిభంగ భంగభవదీవ్యద్దివ్యకల్లోలినీ | 287 |
భుజం. | ఇలాకన్యకారూఢహేలాభిరామా | 288 |
గద్య. | ఇది శ్రీమత్కౌసల్యానందనకరుణాకటాక్షవీక్షణపరంపరాసాదిత | 289 |