దివ్యదేశ వైభవ ప్రకాశికా/నిలాత్తింగళ్ తుండత్తాన్
79. తిరునీరగమ్ (కాంచీ)6
శ్లో. అక్రూర తీర్థ రుచిచే వీరకాఖ్యాన పట్టణే|
విలమంగై లతానాథో జగదీశ విభుస్థిత:||
జగదీశ్వర వైమానే ప్రాజ్ముఖో క్రూర గోచర:||
పరకాల మునీంద్రేణ సన్నుతో భువి రాజతే||
వివ: జగదీశ్వర పెరుమాళ్-నిలమంగైవల్లి త్తాయార్-అక్రూర తీర్థము-జగదీశ్వర విమానము-తూర్పు ముఖము-నిలచున్నసేవ-అక్రూరనకు ప్రత్యక్షము-తిరుమంగై యాళ్వార్ కీర్తించినది.
విశే:మూలవర్-పుష్కరిణి-సన్నిధి ఎక్కడనున్నవో తెలియవు.ఉత్సవర్ మాత్రము ఉలగళన్ద పెరుమాళ్ సన్నిధి ఉత్తర ప్రాకారములో చిన్న సన్నిధిలో గలరు.
పా. వీరగత్తాయ్ నెడువరైయి నుచ్చి మేలాయ్
నిలాత్తిజ్గళ్ తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి
ఊరగత్తాయ్, ఓణ్ తుఱైనీర్ వెஃకావుళ్ళాయ్
ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుమ్
కారగత్తాయ్ కార్‌వానత్తుళ్ళాయ్ కళ్వా
కామరుపూజ్కావిరియన్ తెన్బాల్ మన్ను
పేరగత్తాయ్, పేరాదెన్నె-- నుళ్ళాయ్
పెరుమానున్ తిరువడియే పేణినేనే
తిరుమంగై ఆళ్వార్లు-తిరునెడున్దాణ్డగమ్ 8
మంచిమాట
ప్రతిబంధకములుభగవంతుని ఆశ్రయించుటకు ప్రతిబంధకము శరీరము.
ఆచార్యుని ఆశ్రయించుటకు ప్రతిబంధకము పుత్రమిత్రాదులు.
భాగవతులనాశ్రయించుటకు ప్రతిబంధకము ధనాపేక్ష.
కైంకర్య విషయప్రీతికి ప్రతిబంధకము శబ్దాది విషయములందు ప్రీతి.
కావున ముముక్షువు ఈప్రతిబంధకములను తొలగించుకొనుటకు ప్రయత్నింపవలెను.
80. నిలాత్తింగళ్ తుండత్తాన్ (కాంచీ) 7
శ్లో. నిలాత్తింగళ్ తుండనామ నగరే రుచిరాకృతా
నిలాత్తింగళ్ తుండ నాథ శ్చంద్ర పుష్కరిణీయుతే
పురుషసూక్త విమాన మధిశ్రితో వరుణ దిగ్వదనస్థితి శోభిత:
సదృశ శూన్య లతా నయన ప్రియో లసతి రుద్రసుత:కలిజిన్నుత:||
వివ: నిలాత్తిజ్గళ్ తుండత్తాన్-వేరొరు వన్ఱిల్లా తాయార్-చంద్రపుష్కరిణి-పురుష సూక్త విమానము-పశ్చిమ ముఖము-నిలచున్నసేవ-రుద్రునకు ప్రత్యక్షము-కలియన్ కీర్తించినది.
మార్గము: ఇది పెద్ద కంచిలో గల దివ్యదేశము. ఈ సన్నిధి ఏకాంబరేశ్వరుని ఆలయములో గలదు. పుష్కరిణి కానరాదు.
పా. నీరగత్తాయ్ నెడువరైయి నుచ్చి మేలాయ్
నిలాత్తిజ్గళ్ తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి
ఊరగత్తాయ్, ఓణ్ తుఱైనీర్ వెஃకావుళ్ళాయ్
ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుమ్
కారగత్తాయ్ కార్‌వానత్తుళ్ళాయ్ కళ్వా
కామరుపూజ్కావిరియన్ తెన్బాల్ మన్ను
పేరగత్తాయ్, పేరాదెన్నె-- నుళ్ళాయ్
పెరుమానున్ తిరువడియే పేణినేనే
తిరుమంగై ఆళ్వార్లు-తిరునెడున్దాణ్డగమ్
మంచిమాట
దుర్గతిప్రణవమందలి మధ్యమాక్షరము (ఉ) యొక్క అర్థము(అనన్యార్హ సంబంధము) తెలిసియు ధనవంతులను ఆశ్రయించుచున్నారే!తిరుమంత్రము నందలి మధ్యమపదము (నమ:) యొక్క అర్థము (రక్ర్యరక్షక సంబంధము) తెలిసియు తమరక్షణకై తాము ప్రయత్నించు చున్నారే! తిరుమంత్రమునందలి తృతీయ పదము(నారాయణాయ) అర్ధము (భోక్త్యభోగ్య సంబంధము) తెలిసియు తామే భోక్తలమని భావించుచున్నారే! ఏమి! ఈ సంసారుల దుర్గతి.
-తిరుక్కురుగైప్పిరాన్ పిళ్లాన్.
99 81. ఊఱగమ్ (కాంచీ) 5
శ్లో. తిరువూరగాఖ్య నగరే త్రివిక్రమో వరనాగ తీర్థ రుచిరే స్థితి ప్రియ:
అమృతాభిధాన లతికా సమన్వితో| జలనాథ దిజ్ముఖయుతో విరాజతే||
సారశ్రీకర వైమానం నాగేశాక్ష్యతిధి శ్రిత:|
భక్తిసార కలిద్వేషి స్తుతి భూషణ భూషిత:||
వివ: త్రివిక్రముడు(ఉళగన్ద పెరుమాళ్)-అమృతవల్లి త్తాయార్-నాగతీర్థము-పశ్చిమ ముఖము-నిలచున్నసేవ-సారశ్రీకర విమానము-ఆదిశేషులకు(ఊరగమ్)ప్రత్యక్షము-తిరుమళిశై ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
మార్గము: ఈ క్షేత్రము కంచిలో కామాక్షి కోవెలకు సమీపములో నున్నది. ఈ సన్నిధిలోనే నీరగమ్,కారగమ్-కార్వానం సన్నిధులు కలవు.
పా. కల్లెడుత్తుక్కల్ మారికాత్తా యెన్ఱుమ్
కామారుపూజ్గచ్చి యూరగత్తాయెన్ఱుమ్
విలిఱుత్తు మెల్లియల్‌తోళ్ తోయ్‌న్దా యెన్ఱుమ్
వెஃకావిల్ తుయిలమర్‌న్ద వేన్దే యెన్ఱుమ్
మల్లడర్తు మాకీణ్డ కైత్తలతైన్ మైన్దా వెన్ఱుమ్
శొల్లడుత్త త్తన్ కిళియై చ్చొల్లే యెన్ఱు
తుణైములైమేల్ తుళిశోరచ్చోర్ గిన్ఱాళే.
తిరుమంగై ఆళ్వార్-తిరునెడున్దాణ్డగమ్ 13
మంచిమాట
బంగారమును పుటము వేసినచో అందలి మాలిన్యము తొలగి తూకము తరగిపోవును. కానీ ప్రకాశము అధికమగును. అట్లే ఈ ఆత్మ కూడ జ్ఞాన సంకోచమను మాలిన్యము తొలగించుకొన్నచో జ్ఞాన వికాసమనెడి కాంతి కలుగును. అపుడీ ఆత్మను భగవంతుడు లక్ష్మీదేవితో సమానముగా భావించి ఆదరించును.
"తిరుక్కోట్టియూర్ నంబి""
100