దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరునీరగమ్‌

మార్ఘము: అష్టభుజ స్వామి సన్నిధికి 1 కి.మీ. నైఋతి దిశగా కలదు.

పా. అన్ఱివ్వులక మళన్ద వశై వేకొల్
   నిన్ఱిరు న్దు వేళుక్కై వీణకర్ వాయ్-అన్ఱు
   కిడన్దానె క్కేడిల్ శీరానై, ముంక--
   క్కడన్దానై నె--మే కాణ్
       పేయాళ్వార్లు- మూన్ఱాన్దిరువన్దాది 34

78. తిరుప్పాడగమ్‌ (కాంచీ) 5

శ్లో. శ్రీమత్పాడగ నామ్ని పట్టణ వరే మత్స్యాఖ్య తీర్థాంచితే
   భద్రాఖ్యాన విమాన మధ్య నిలయ శ్శ్రీ రుక్మిణీనాయక:|
   శ్రీ మత్పాండవ దూతనామక విభు స్సత్యాపతి ప్రాజ్ముఖ
   స్త్వా సీనో హరిత్యాఖ్య తాపన వర ప్రత్యక్షతా మాప్తవాన్||

   శ్రీ భూత మహదాఖ్యాన భక్తిసారై:కలిద్విషా|
   స్తోత్ర పాతీకృతో భాతి భక్తరక్షణ దీక్షిత:||

వివ: పాండవదూత-రుక్మిణీదేవి-సత్యభామ-మత్స్య తీర్థము-భద్ర విమానము-తూర్పు ముఖము-కూర్చున్నసేవ-హరీత మహర్షికి ప్రత్యక్షము-పూదత్తాళ్వార్-పేయాళ్వార్-తిరుమழிశై ఆళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈసన్నిధిలో "అరుళాళప్పెరుమాళ్ ఎంబెరుమానార్" అర్చావతారముగా వేంచేసియున్నారు. ఈ దివ్యదేశము ఏకామ్రేశ్వరుని కోవెలకు పశ్చిమముగా సమీపములోనే కలదు.

మార్గము: గంగైకొండ మండపమునకు సమీపమున కలదు.

పా. కల్లార్ మదిళ్ శూழ்; కచ్చినగరుళ్ నచ్చి; పాడగత్తుళ్
   ఎల్లావులగుమ్‌ వణజ్గ; విరున్ద వమ్మాన్;ఇలజ్గైక్కోన్
   వల్లాళాగమ్‌ విల్లాల్; మునిన్ద వెన్దై, విబీడణఱ్కు
   నల్లానుడైయ నామం శొల్లిల్; నమోనారాయణమే.
          తిరుమంగై ఆళ్వార్లు-పెరియ తిరుమొழி 6-10-4


మంచిమాట

శ్రీరామానుజుల వారి శ్రీపాదములు తప్పవేరు రక్షకము లేదు.

యెంబెరుమానార్ తిరువడిగళే శరణమ్‌

"ఎంబార్"

97

79. తిరునీరగమ్‌ (కాంచీ)6

శ్లో. అక్రూర తీర్థ రుచిచే వీరకాఖ్యాన పట్టణే|
   విలమంగై లతానాథో జగదీశ విభుస్థిత:||
   జగదీశ్వర వైమానే ప్రాజ్ముఖో క్రూర గోచర:||
   పరకాల మునీంద్రేణ సన్నుతో భువి రాజతే||

వివ: జగదీశ్వర పెరుమాళ్-నిలమంగైవల్లి త్తాయార్-అక్రూర తీర్థము-జగదీశ్వర విమానము-తూర్పు ముఖము-నిలచున్నసేవ-అక్రూరనకు ప్రత్యక్షము-తిరుమంగై యాళ్వార్ కీర్తించినది.

విశే:మూలవర్-పుష్కరిణి-సన్నిధి ఎక్కడనున్నవో తెలియవు.ఉత్సవర్ మాత్రము ఉలగళన్ద పెరుమాళ్ సన్నిధి ఉత్తర ప్రాకారములో చిన్న సన్నిధిలో గలరు.

పా. వీరగత్తాయ్ నెడువరైయి నుచ్చి మేలాయ్
           నిలాత్తిజ్గళ్ తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి
   ఊరగత్తాయ్, ఓణ్ తుఱైనీర్ వెஃకావుళ్ళాయ్
           ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుమ్‌
   కారగత్తాయ్ కార్‌వానత్తుళ్ళాయ్ కళ్వా
           కామరుపూజ్కావిరియన్ తెన్బాల్ మన్ను
   పేరగత్తాయ్, పేరాదెన్నె-- నుళ్ళాయ్
           పెరుమానున్ తిరువడియే పేణినేనే
           తిరుమంగై ఆళ్వార్లు-తిరునెడున్దాణ్డగమ్‌ 8


మంచిమాట

ప్రతిబంధకములు

భగవంతుని ఆశ్రయించుటకు ప్రతిబంధకము శరీరము.
ఆచార్యుని ఆశ్రయించుటకు ప్రతిబంధకము పుత్రమిత్రాదులు.
భాగవతులనాశ్రయించుటకు ప్రతిబంధకము ధనాపేక్ష.
కైంకర్య విషయప్రీతికి ప్రతిబంధకము శబ్దాది విషయములందు ప్రీతి.
కావున ముముక్షువు ఈప్రతిబంధకములను తొలగించుకొనుటకు ప్రయత్నింపవలెను.

98

80. నిలాత్తింగళ్ తుండత్తాన్ (కాంచీ) 7

శ్లో. నిలాత్తింగళ్ తుండనామ నగరే రుచిరాకృతా
   నిలాత్తింగళ్ తుండ నాథ శ్చంద్ర పుష్కరిణీయుతే
   పురుషసూక్త విమాన మధిశ్రితో వరుణ దిగ్వదనస్థితి శోభిత:
   సదృశ శూన్య లతా నయన ప్రియో లసతి రుద్రసుత:కలిజిన్నుత:||

వివ: నిలాత్తిజ్గళ్ తుండత్తాన్-వేరొరు వన్ఱిల్లా తాయార్-చంద్రపుష్కరిణి-పురుష సూక్త విమానము-పశ్చిమ ముఖము-నిలచున్నసేవ-రుద్రునకు ప్రత్యక్షము-కలియన్ కీర్తించినది.

మార్గము: ఇది పెద్ద కంచిలో గల దివ్యదేశము. ఈ సన్నిధి ఏకాంబరేశ్వరుని ఆలయములో గలదు. పుష్కరిణి కానరాదు.

పా. నీరగత్తాయ్ నెడువరైయి నుచ్చి మేలాయ్
           నిలాత్తిజ్గళ్ తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి
   ఊరగత్తాయ్, ఓణ్ తుఱైనీర్ వెஃకావుళ్ళాయ్
           ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుమ్‌
   కారగత్తాయ్ కార్‌వానత్తుళ్ళాయ్ కళ్వా
           కామరుపూజ్కావిరియన్ తెన్బాల్ మన్ను
   పేరగత్తాయ్, పేరాదెన్నె-- నుళ్ళాయ్
           పెరుమానున్ తిరువడియే పేణినేనే
           తిరుమంగై ఆళ్వార్లు-తిరునెడున్దాణ్డగమ్‌


మంచిమాట

దుర్గతి

ప్రణవమందలి మధ్యమాక్షరము (ఉ) యొక్క అర్థము(అనన్యార్హ సంబంధము) తెలిసియు ధనవంతులను ఆశ్రయించుచున్నారే!తిరుమంత్రము నందలి మధ్యమపదము (నమ:) యొక్క అర్థము (రక్ర్యరక్షక సంబంధము) తెలిసియు తమరక్షణకై తాము ప్రయత్నించు చున్నారే! తిరుమంత్రమునందలి తృతీయ పదము(నారాయణాయ) అర్ధము (భోక్త్యభోగ్య సంబంధము) తెలిసియు తామే భోక్తలమని భావించుచున్నారే! ఏమి! ఈ సంసారుల దుర్గతి.

-తిరుక్కురుగైప్పిరాన్ పిళ్లాన్.

                                              99