దివ్యదేశ వైభవ ప్రకాశికా/ఊఱగమ్
81. ఊఱగమ్ (కాంచీ) 5
శ్లో. తిరువూరగాఖ్య నగరే త్రివిక్రమో వరనాగ తీర్థ రుచిరే స్థితి ప్రియ:
అమృతాభిధాన లతికా సమన్వితో| జలనాథ దిజ్ముఖయుతో విరాజతే||
సారశ్రీకర వైమానం నాగేశాక్ష్యతిధి శ్రిత:|
భక్తిసార కలిద్వేషి స్తుతి భూషణ భూషిత:||
వివ: త్రివిక్రముడు(ఉళగన్ద పెరుమాళ్)-అమృతవల్లి త్తాయార్-నాగతీర్థము-పశ్చిమ ముఖము-నిలచున్నసేవ-సారశ్రీకర విమానము-ఆదిశేషులకు(ఊరగమ్)ప్రత్యక్షము-తిరుమళిశై ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
మార్గము: ఈ క్షేత్రము కంచిలో కామాక్షి కోవెలకు సమీపములో నున్నది. ఈ సన్నిధిలోనే నీరగమ్,కారగమ్-కార్వానం సన్నిధులు కలవు.
పా. కల్లెడుత్తుక్కల్ మారికాత్తా యెన్ఱుమ్
కామారుపూజ్గచ్చి యూరగత్తాయెన్ఱుమ్
విలిఱుత్తు మెల్లియల్‌తోళ్ తోయ్‌న్దా యెన్ఱుమ్
వెஃకావిల్ తుయిలమర్‌న్ద వేన్దే యెన్ఱుమ్
మల్లడర్తు మాకీణ్డ కైత్తలతైన్ మైన్దా వెన్ఱుమ్
శొల్లడుత్త త్తన్ కిళియై చ్చొల్లే యెన్ఱు
తుణైములైమేల్ తుళిశోరచ్చోర్ గిన్ఱాళే.
తిరుమంగై ఆళ్వార్-తిరునెడున్దాణ్డగమ్ 13
మంచిమాట
బంగారమును పుటము వేసినచో అందలి మాలిన్యము తొలగి తూకము తరగిపోవును. కానీ ప్రకాశము అధికమగును. అట్లే ఈ ఆత్మ కూడ జ్ఞాన సంకోచమను మాలిన్యము తొలగించుకొన్నచో జ్ఞాన వికాసమనెడి కాంతి కలుగును. అపుడీ ఆత్మను భగవంతుడు లక్ష్మీదేవితో సమానముగా భావించి ఆదరించును.
"తిరుక్కోట్టియూర్ నంబి""
100 79. జగదీశ్వరన్-నీరగమ్(కాంచి)
Jagadeswaran - Neeragam
80. నిలాత్తిజ్గళ్ తుండత్తాన్-కాంచి
Neelathingal Tundattan - Kanchi 81. ఉలగళన్ద పెరుమాళ్-ఊరగమ్(కాంచి)
Ulagalanda Perumal - Uragam (Kanchi) 82. తిరువెஃకా (కాంచీ) 9
శ్లో. శ్రీవెஃకా నగరే భుజంగశయన శ్రీసాయిగై పద్మాకరో
ద్దీపే తత్ర యథోక్తకారి భగవాన్ శ్రీవేదసారాహ్వయే
వైమానే వరకోమలాఖ్యలతికా నాథస్తు పశ్చాన్ముఖ:
ప్రత్యక్ష: కణికృష్ణ ధాతృసరసాం భాతి శ్రితేష్టార్థద:||
సరోజాత మహాయోగి భక్తిసార మహర్షిభి:|
కీర్తిత: కలిజిన్నామ మునినాచాపి సాదరమ్||
వివ: యథోక్తకారి(శొన్నవణ్ణం శెయ్‌ద పెరుమాళ్)-కోమలవల్లి-భుజంగ శయనం-పొయిగై పుష్కరిణి-వేదసార విమానము-పశ్చిమ ముఖము-కణికృష్ణునకు బ్రహ్మకు ప్రత్యక్షము-పొయిగై ఆళ్వార్, పేయాళ్వార్, తిరుమళిశై ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
విశే: ఇది పొయిగై ఆళ్వార్ అవతరించిన స్థలము-వారు ఈ దివ్యదేశమున గల పుష్కరిణిలో అవతరించిరి. ఈ రాజ్య పాలకుడు తిరుమళిశై ఆళ్వార్ శిష్యులగు కణికృష్ణుడు అనువారిపై కోపించి రాజ్యము నుండి వెడలగొట్టెను. అంత శిష్యునితో తిరుమళిశై ఆళ్వారు ఊరువిడిచి పోవుచు "కణికణ్ణన్ పోగిన్ఱాన్ కామరపూమ్‌కచ్చి, మణిపణ్ణా నీకిడక్క వేణ్డా" అని అనగానే స్వామికూడా వారితోబాటు బయలుదేరెనట. రాజు భయపడి కణికృష్ణుని ప్రార్థించి వారిని మరల రాజ్యమున ఉండుమని కోరగా ఆళ్వార్లు తిరిగి "కణికణ్ణన్ పోక్కొళిన్దాన్ కామరపూమ్‌కచ్చి మణివణ్ణా నీ కిడక్క వేణ్డుమ్" అని అనగానే స్వామి తిరిగి యథా ప్రకారము వేంచేసిరట. ఈ విధముగా తమభక్తులు చెప్పినది చెప్పినట్లే చేయు స్వామి అగుటచే వీరికి యథోక్త కారియని తిరునామము వచ్చినది. ఇచట స్వామి ఎడమ చేతిమీద శయనించి యుందురు. ఇచట పిళ్లై లోకాచార్యుల వారికి ప్రత్యేకముగా సన్నిధి కలదు. ఈ సన్నిధిలోనే మణవాళ మహామునులు శ్రీభాష్యమును సేవించిరి. ఈ క్షేత్రస్వామి విషయమై శ్రీమద్వేదాంత దేశికులు వేగాసేతు స్తోత్రమును అనుగ్రహించిరి.
పంగుని(మీనం) రేవతి తీర్థోత్సవంగా బ్రహ్మోత్సవము జరుగును. కంచి వరదరాజస్వామి సన్నిధికి 1 కి.మీ దూరములో ఈ సన్నిధి గలదు.
పా. కూన్దలార్ మగిழ்;కోపలనాయ్;వెణ్ణెయ్
మాన్దழన్‌దైయిల్; క్కణ్డు మకిழ்న్దు పోయ్
ప్పాన్దళ్ పొழிయిల్; పళ్లి విరుమ్బియ
వేన్దనై చ్చెన్ఱు కాణ్డుమ్; వెஃకావిలే.
తిరుమంగై ఆళ్వార్లు-పెరియ తిరుమొழி 10-1-7.
101