దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుప్పిరిది

103. తిరుప్పిరిది (నన్దప్రయాగ) (జోషిమఠ్) 8

శ్లో. పరిమళ లతికాఖ్యాం నాయకీం వీక్షమాణ
   పరమ పురుషనామా భోగి భోగే శయాన:|
   కలిరిపు మునికీర్త్య: పార్వతీగోచరాంగో
   హిమవతి గిరిరాజే రాజతే ప్రాజ్ముఖాఖ్య:||
   గోవర్దనేంద్ర తీర్థాడ్యే తిరుప్పిరిది పట్టణే|
   మానసాఖ్య సరస్తీరే గోవర్ధన విమానగ:||

వివ: పరమ పురుషన్-పరిమళ వల్లి-గోవర్ధన-ఇంద్ర తీర్థములు. మానస సరస్సు-గోవర్ధన విమానము-తూర్పు ముఖము-భుజంగ శయనము-హిమవత్పర్వతము-పార్వతీదేవికి ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: జోషీమఠ్‌నే తిరుప్పిరిది యందురు. ఈ క్షేత్రము దేవప్రయాగ నుండి 170 కి.మీ. దూరములో నున్నది. మధ్యలో గల నందప్రయాగలో విష్ణుగంగ మందాకినీ నదులు కలయు చున్నవి. అచట నందగోపులు, యశోద కణ్ణన్ సన్నిధులు గలవు.

కుబేరుడు తపమాచరించిన ప్రదేశమే తిరుప్పిరిది. ఇచట ఆది శంకరాచార్యుల వారిచే ప్రతిష్ఠింపబడినట్లుగా ప్రసిద్దమైన నృసింహస్వామి సన్నిధి కలదు. వాసుదేవుల సన్నిధి కలదు. వాసుదేవులు నిన్న తిరుక్కోలములో వేంచేసియున్నారు. వీరి ఆళ్వార్లు కీర్తించినట్లుగా కొందరు చెప్పుదురు.

ఈ జోషిమఠ్ సమీపముననే విష్ణు ప్రయాగ కలదు. అచట నారదునిచే ప్రతిష్ఠింపబడిన సన్నిధి కలదు. దీనికి సమీపముననే పాండుకేశ్వరం గలదు. బదరీ సన్నిధి మూసియుంచు నపుడు ఉత్సవమూర్తులను ఈ పాండికేశ్వరములోని వాసుదేవుల సన్నిధిలో నుంచి తిరువారాధన చేతురు. ఈ పాండికేశ్వరమునకు 25 కి.మీ. దూరమున బదరికాశ్రమము గలదు.

మార్గము: దేవప్రయాగ నుండి 170 కి.మీ.

పా. వాలి మాపలత్తొరుపనదుడల్; కెడవరి శిలై వళై విత్తన్ఱు;
   ఏలనాఱు తణ్డడమ్‌ పొழிలిడమ్బెఱ; విరున్ద నల్లిమయత్తుళ్
   ఆలిమా ముగిలదిర్ దరవరువరై: యగడుఱ ముగడేఱి;
   పీలిమామయిల్ నడ--యుమ్; తడ--వై ప్పిరిది శెన్ఱడైనె--
        తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 1-2-1

The 137

104. వడమధురై (ఉత్తరమధుర) 9

శ్లో. యమునా పరితస్తీరే హ్యుత్తరే మథురా పురే
   భద్రాఖ్యాన విమానస్థ; శ్రీకృష్ణ; ప్రాజ్ముఖ స్థితి:||
   రుక్మిణీ సత్య భామాభ్యాం వసుదేవామరేక్షిత:|
   శ్రీ విష్ణుచిత్త తత్పూను శఠజిత్ కలిహస్తుత:||

వివ: శ్రీకృష్ణుడు-రుక్మిణీ సత్యభామ-యమునా నది- భద్ర విమానము-తూర్పుముఖము-నిలచున్నసేవ-వసుదేవుడు;దేవతలకు ప్రత్యక్షము-పెరియాళ్వార్;ఆండాళ్; నమ్మాళ్వార్;తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈక్షేత్రము ముక్తి ప్రద క్షేత్రములలో నొకటి. డిల్లీకి దక్షిణమున 140 కి.మీ. దూరమున గల "మధురా" స్టేషన్ సమీపమున యమునానదీ తీరమున శ్రీకృష్ణుని అవతార స్థలము కలదు. దీనికి ఉత్తరము 10 కి.మీ.దూరములో గోవర్థనము కలవు. ఆళ్వార్లు కీర్తించిన క్షేత్రమిపుడు కానరాదు. మధురానాథ, ద్వారకానాథ సన్నిధులు ప్రసిద్ధిచెందినవి.(ఇచట ఉ.వే. శ్రీమాన్ గోవర్థనం రంగాచార్యస్వామి వారిచే నిర్మింపబడిన సప్త ప్రాకారములు గల రంగమందిరం దాక్షిణాత్య సంప్రదాయముతో పాంచరాత్రాగ మోక్తముగా నిర్వహింపబడు చున్నది. ఇచట అన్ని సన్నిధులు కలవు)

సర్వ సౌకర్యములు కలవు ఈ క్షేత్రమున గల ముఖ్యమైన స్నానఘట్టము విశ్రాంత్ ఘాట్. ఇచటనొక సన్నిధి నిర్మించి గోపుర శిఖరమున గంటలను కట్టియున్నారు. ప్రతిదినము సాయంకాలము 6 గంటలకు ఇచట నుండి యమునానదికి దీపారాధన జరిపింతురు.

కంసునికోట, కేశవాలయము,(బందే ఖనా) శ్రీకృష్ణుని జన్మస్థానము సేవింపదగినవి.

మార్గము: మదుర జంక్షన్ నుండి (డిల్లీ-ఆగ్రామార్గం) 3 కి.మీ.

పా. ఇదువో పొరుత్త మ్మిన్నాழி ప్పడైయా; యేఱుమిరుమ్‌ శిఱైప్పుళ్
   అదువే కొడియా వుయర్ త్తానే; యెన్ఱెన్ఱేజ్గి యழுదక్కాల్
   ఎదువే యాగ క్కరుదజ్గొ; లిమ్మా--లమ్‌ పొఱైతీర్పాన్
   మదువార్ శోలై యుత్తరమధురై;ప్పిఱన్దమాయనే||
          నమ్మాళ్వార్-తిరువాయిమొழி 8-5-9

                                              138