దివ్యదేశ వైభవ ప్రకాశికా/వడమధురై
104. వడమధురై (ఉత్తరమధుర) 9
శ్లో. యమునా పరితస్తీరే హ్యుత్తరే మథురా పురే
భద్రాఖ్యాన విమానస్థ; శ్రీకృష్ణ; ప్రాజ్ముఖ స్థితి:||
రుక్మిణీ సత్య భామాభ్యాం వసుదేవామరేక్షిత:|
శ్రీ విష్ణుచిత్త తత్పూను శఠజిత్ కలిహస్తుత:||
వివ: శ్రీకృష్ణుడు-రుక్మిణీ సత్యభామ-యమునా నది- భద్ర విమానము-తూర్పుముఖము-నిలచున్నసేవ-వసుదేవుడు;దేవతలకు ప్రత్యక్షము-పెరియాళ్వార్;ఆండాళ్; నమ్మాళ్వార్;తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
విశే: ఈక్షేత్రము ముక్తి ప్రద క్షేత్రములలో నొకటి. డిల్లీకి దక్షిణమున 140 కి.మీ. దూరమున గల "మధురా" స్టేషన్ సమీపమున యమునానదీ తీరమున శ్రీకృష్ణుని అవతార స్థలము కలదు. దీనికి ఉత్తరము 10 కి.మీ.దూరములో గోవర్థనము కలవు. ఆళ్వార్లు కీర్తించిన క్షేత్రమిపుడు కానరాదు. మధురానాథ, ద్వారకానాథ సన్నిధులు ప్రసిద్ధిచెందినవి.(ఇచట ఉ.వే. శ్రీమాన్ గోవర్థనం రంగాచార్యస్వామి వారిచే నిర్మింపబడిన సప్త ప్రాకారములు గల రంగమందిరం దాక్షిణాత్య సంప్రదాయముతో పాంచరాత్రాగ మోక్తముగా నిర్వహింపబడు చున్నది. ఇచట అన్ని సన్నిధులు కలవు)
సర్వ సౌకర్యములు కలవు ఈ క్షేత్రమున గల ముఖ్యమైన స్నానఘట్టము విశ్రాంత్ ఘాట్. ఇచటనొక సన్నిధి నిర్మించి గోపుర శిఖరమున గంటలను కట్టియున్నారు. ప్రతిదినము సాయంకాలము 6 గంటలకు ఇచట నుండి యమునానదికి దీపారాధన జరిపింతురు.
కంసునికోట, కేశవాలయము,(బందే ఖనా) శ్రీకృష్ణుని జన్మస్థానము సేవింపదగినవి.
మార్గము: మదుర జంక్షన్ నుండి (డిల్లీ-ఆగ్రామార్గం) 3 కి.మీ.
పా. ఇదువో పొరుత్త మ్మిన్నాழி ప్పడైయా; యేఱుమిరుమ్ శిఱైప్పుళ్
అదువే కొడియా వుయర్ త్తానే; యెన్ఱెన్ఱేజ్గి యழுదక్కాల్
ఎదువే యాగ క్కరుదజ్గొ; లిమ్మా--లమ్ పొఱైతీర్పాన్
మదువార్ శోలై యుత్తరమధురై;ప్పిఱన్దమాయనే||
నమ్మాళ్వార్-తిరువాయిమొழி 8-5-9
103. పరమపురుషన్-తిరుప్పిరిది.
104. శ్రీకృష్ణన్-వడమమధురై.
105. కల్యాణనారాయణన్-ద్వారక.
Kalyana Narayanan - Dwaraka
106. నవమోహనకృష్ణన్-తిరువాయిప్పాడి.
Navamohana Krishnan - Tiruvaippadi 105. శ్రీ ద్వారక 10
శ్లో. శ్రీ గోమతీ పుణ్య సరస్తటస్థే శ్రీ ద్వారకాఖ్య నగరే విరాజన్
కల్యాణ నారాయణ నామధేయ:కళ్యాణదేవ్యా పరిభూషితాజ్గ:||
దివ్యాష్ట మహిషీ నాథో ద్రౌపదీ దృష్టి గోచర:
హేమకూట విమానస్థ: పశ్చిమాభి ముఖానస:|
పరాంకుశ కలిధ్వంసి గోదావిష్ణు మనస్తుత:||
వివ: కల్యాణ నారాయణన్-కల్యాణదేవి-గోమతీదేవి-అష్టమహిషలు-హేమకూట విమానము-పశ్చిమ ముఖము-నిలచున్నసేవ-ద్రౌపతికి ప్రత్యక్షము-నమ్మాళ్వార్-తిరుమంగై ఆళ్వార్-ఆండాళ్-పెరియాళ్వార్ కీర్తించినది.
విశే: ఇయ్యది ముక్తి ప్రద క్షేత్రములలో నొకటి. సన్నిధికి సమీపముననే గోమతీ నది సముద్రములో కలియుచున్నది. అక్కడ నుండి బస్సుమార్గమున పోయి బేటి ద్వారక చేరవలెను. ఇది శ్రీకృష్ణుని నివాస స్థలము. ఇచట 1500 గృహములు కలవు. ఇచట మాలవరులు శంఖ చక్రధారియై వేంచేసియున్నారు. దీనికి 5 కి.మీ. దూరమున శంఖతీర్థము కలదు. ఇచట పెరుమాళ్ళ వక్షస్థలమున పిరాట్టి వేంచేసియున్నారు. రుక్మిణీదేవి ఉత్సవ తాయార్. అనేక సన్నిధులు కలవు. ప్రతిదినము తిరుమంజనము జరుగును. పసిపిల్లవానివలె-రాజువలె-వైదికోత్తమునివలె అలంకారములు జరుగును.
ద్వారక నుండి ఓఘ పోవుమార్గములో 5 కి.మీ. దూరమున రుక్మిణీదేవి సన్నిధి గలదు. ఇదియే రుక్మిణీ కల్యాణము జరిగిన ప్రదేశము. ద్వారక సమీపమున తోతాద్రి మఠము కలదు. విరావన్‌స్టేషన్‌లో దిగి 160 కి.మీ. దూరమునగల రైవతక పర్వతమును చేరవచ్చును. ఇచట అనేక సన్నిధులు గలవు. కృష్ణావతారమునకు ముందుగానే సేవసాయించిన ప్రదేశము. శయనతిరుక్కోలము.
మార్గము:బొంబాయి-ఓగా రైలుమార్గములో ఓగారేవు ముఖద్వారానికి 35 కి.మీ. దూరము. అహమ్మదాబాద్ నుండి బస్‌లు గలవు. అన్నివసతులు కలవు.
పా. కూట్టిలిరున్దు కిళియెప్పోదుమ్ కోవిన్దా! కోవిన్దా! ఎన్నழைక్కుమ్
ఊట్టక్కొడాదు శెఱుప్పనాగిల్ ఉలగళన్దాన్! ఎన్ఱు ఉయరక్కూవుమ్;
నాట్టిల్ తలైప్పழிయెయ్‌ది యుజ్గళ్ నన్మైయిழన్దు తழయిడాదే
శూట్టుయర్ మాడజ్గళ్ శూழ்న్దు తోన్ఱుమ్ తువరావదిక్కెన్నైయుయ్ త్తిడుమిన్.
ఆణ్డాళ్-నాచ్చియార్ తిరుమొழி 0-12-9
139