దివ్యదేశ వైభవ ప్రకాశికా/కండమెన్ఱుం కడినగర్
102. కండమెన్ఱుం కడినగర్
(దేవప్రయాగ) 7
శ్లో. శ్రీ మన్మంగళ పుణ్యతీర్థ రుచిరే క్షేత్రే ప్రయాగాభిదే
త్వాలింగ్య ప్రియ పుండరీక లతికాం శ్రీ నీలమేఘో విభు:|
రేజే మంగళ దేవయాన నిలయ:ప్రాగ్వక్త్ర సంస్థానగ:
భారద్వాజ మునీక్షిత: కలిరిపు శ్రీవిష్ణుచిత్త స్తుత:||
వివ: నీలమేఘ పెరుమాళ్-పుండరీకవల్లి-మంగళతీర్థం-మంగళ విమానం-తూర్పుముఖము-నిలచున్నసేవ-భరద్వాజమహర్షికి ప్రత్యక్షము-పెరియాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
విశే: ఈ క్షేత్రము హరిద్వారము నుండి హిమవద్గిరికి పోవుదారిలో నున్నది. హరిద్వారము నుండి ఈక్షేత్రమునకు పోవుమార్గములోనే హృషీకేశము కలదు. తపోవనము, లక్ష్మణస్వామి సన్నిధి(లక్ష్మణఝూలా) వ్యాసఘాట్-శ్రీసీతారాముల సన్నిధి కలదు. హరిద్వారము నుండి 100 కి.మీ. దూరములో ఈ కండమెన్ఱుం కడినగర్ క్షేత్రము కలదు. దీనినే దేవప్రయాగ యందురు. కోవెలకు వెనుక హనుమాన్ సన్నిధి గలదు. అలకనందా నది ప్రవహించు దేశము-ఆళ్వార్ కీర్తించిన పెరుమాళ్లను రఘునాథ్‌జీ అందురు.
మార్గము: హృషికేశ్ నుండి బదరీమార్గంలో 70 కి.మీ దూరంలోను హరిద్వార్-బదరీ మార్గంలో 95 కి.మీ. దూరంలోను గలదు.
పా. తజ్గై యై మూక్కుమ్ తమయనై త్తలయుమ్ తడన్దవెన్ దాశరదిపోయ్
ఎజ్గుమ్ తన్ పుకழா విరున్దరశాణ్డ; వెమ్బురుడోత్తమ నిరుక్కై,
కజ్గై కజ్గై యెన్ఱ వాశకత్తాలే; కడువినై కళైన్దిడు కిఱ్కుమ్
కజ్గై యిన్ కఱై మేల్ కైతొழுనిన్ఱ కణ్డమెన్నుమ్ కడినకరే||
పెరియాళ్వార్లు-పెరియాళ్వార్ తిరుమొழி 4-7-1
మంచిమాట
1. ఆశ్రయింప వలసిన వానిని అన్నిటిని ఆశ్రయించి భగవంతుని కూడ ఆశ్రయించుట "భక్తి".
2. విడువ వలసిన వాటి నన్నింటిని విడచి తనను కూడ విడుచుట "ప్రపత్తి".
136 103. తిరుప్పిరిది (నన్దప్రయాగ) (జోషిమఠ్) 8
శ్లో. పరిమళ లతికాఖ్యాం నాయకీం వీక్షమాణ
పరమ పురుషనామా భోగి భోగే శయాన:|
కలిరిపు మునికీర్త్య: పార్వతీగోచరాంగో
హిమవతి గిరిరాజే రాజతే ప్రాజ్ముఖాఖ్య:||
గోవర్దనేంద్ర తీర్థాడ్యే తిరుప్పిరిది పట్టణే|
మానసాఖ్య సరస్తీరే గోవర్ధన విమానగ:||
వివ: పరమ పురుషన్-పరిమళ వల్లి-గోవర్ధన-ఇంద్ర తీర్థములు. మానస సరస్సు-గోవర్ధన విమానము-తూర్పు ముఖము-భుజంగ శయనము-హిమవత్పర్వతము-పార్వతీదేవికి ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
విశే: జోషీమఠ్‌నే తిరుప్పిరిది యందురు. ఈ క్షేత్రము దేవప్రయాగ నుండి 170 కి.మీ. దూరములో నున్నది. మధ్యలో గల నందప్రయాగలో విష్ణుగంగ మందాకినీ నదులు కలయు చున్నవి. అచట నందగోపులు, యశోద కణ్ణన్ సన్నిధులు గలవు.
కుబేరుడు తపమాచరించిన ప్రదేశమే తిరుప్పిరిది. ఇచట ఆది శంకరాచార్యుల వారిచే ప్రతిష్ఠింపబడినట్లుగా ప్రసిద్దమైన నృసింహస్వామి సన్నిధి కలదు. వాసుదేవుల సన్నిధి కలదు. వాసుదేవులు నిన్న తిరుక్కోలములో వేంచేసియున్నారు. వీరి ఆళ్వార్లు కీర్తించినట్లుగా కొందరు చెప్పుదురు.
ఈ జోషిమఠ్ సమీపముననే విష్ణు ప్రయాగ కలదు. అచట నారదునిచే ప్రతిష్ఠింపబడిన సన్నిధి కలదు. దీనికి సమీపముననే పాండుకేశ్వరం గలదు. బదరీ సన్నిధి మూసియుంచు నపుడు ఉత్సవమూర్తులను ఈ పాండికేశ్వరములోని వాసుదేవుల సన్నిధిలో నుంచి తిరువారాధన చేతురు. ఈ పాండికేశ్వరమునకు 25 కి.మీ. దూరమున బదరికాశ్రమము గలదు.
మార్గము: దేవప్రయాగ నుండి 170 కి.మీ.
పా. వాలి మాపలత్తొరుపనదుడల్; కెడవరి శిలై వళై విత్తన్ఱు;
ఏలనాఱు తణ్డడమ్ పొழிలిడమ్బెఱ; విరున్ద నల్లిమయత్తుళ్
ఆలిమా ముగిలదిర్ దరవరువరై: యగడుఱ ముగడేఱి;
పీలిమామయిల్ నడ--యుమ్; తడ--వై ప్పిరిది శెన్ఱడైనె--
తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 1-2-1
137