దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుక్కణ్ణపురం

18. తిరుక్కణ్ణపురం - 11

(నన్నిలమ్‌ నుండి 7 కి.మీ)

శ్లోకము :

శ్రీ మత్కణ్ణ పురేతు నిత్య సరసీ సంశోభితే ప్రాజ్ముఖం
దేవ్యా కణ్ణ పురాభిధాన సుయుజా శ్రీశౌరి రాజప్రభుమ్‌ |
వైమానే స్థిత ముత్పలా వతక మిత్యాఖ్యేతు కణ్వేక్షితం
సేవే విష్ణు మనశ్శఠారి కలిజిత్ శ్రీ కౌస్తుభాంశ స్తుతమ్‌ |

వివ: శౌరిరాజ పెరుమాళ్ - కణ్ణపురనాయకి - నిత్య పుష్కరిణి - తూర్పుముఖము - నిలుచున్నసేవ - ఉత్పలావర్తక విమానము - కణ్వ మహర్షికి ప్రత్యక్షము - నమ్మాళ్వార్; కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్ లు కీర్తించినది.

విశే: ఇచ్చట పెరుమాళ్లు శ్రీదేవి, భూదేవి, నీళాదేవి, గోదా దేవులతో వేంచేసి యున్నారు. పెరియ పెరుమాళ్లు(శ్రీరంగనాధుల) మంగళా శాసనం ప్రకారం శ్రీ విభీషణాళ్వార్లకై ప్రతి అమావాస్యనాడు దక్షిణ తిరుముఖ మండలముగా వేంచేసి సేవ సాయింతురు.

ఈ శౌరిరాజ పెరుమాళ్లను తిరుమంగై ఆళ్వార్ "కుణపాల మదయానై"(ప్రాగ్దిశా దిగ్గజము) యని కీర్తించి యున్నారు. మఱియు ఈ క్షేత్రమును "కీయైవీడు"(క్రింది నగరము) అని అభివర్ణించి యున్నారు. (మేలై వీడు శ్రీరంగము) "ఉత్పలావతకమ్" అనియు విలక్షణమైన తిరునామము గలదు. కృష్ణారణ్యక్షేత్రమనియు, సప్త పుణ్య క్షేత్రమనియు పేరు కలదు.

నమ్మాళ్వార్ "మాలై నణ్ణి" అను తిరువాయిమొழிలో (9-10)"మరణమానాల్ వైకున్దం కొడుక్కుం పిరాన్" అని సర్వేశ్వరుని శరణ్యముకున్దత్వ గుణమును(అనగా ఆశ్రితులైన వారికి మోక్షమును ప్రసాదించు గుణమును)కీర్తించిరి. నమ్మాళ్వార్లు తిరువాయి మొழி(9-10)లో నాల్గు పాశురముల వరకు భక్తిని ఉపదేశించి ఈపాశురమున(5) ప్రపత్తిని ఉపదేశించిరి. "తన శ్రీపాదములను ఆశ్రయించిన వారికి సకలవిధ రక్షకుడగును. శరీరావసానమున మోక్షమును ప్రసాదించును. తనను ప్రేమించిన వారికి తాను ప్రేమకై మూర్తి యగును" అని సర్వేశ్వరునకు గల "మోక్ష ప్రదత్వ" గుణమును ప్రకాశింపచేసిరి.

క్రిమి కంఠచోళుడు ఈ సన్నిధి ప్రాకారములు ఆరింటిని ధ్వంసము చేసెను. దానిని సహింప జాలని "అరయరుస్వామి" పెరుమాళ్లతో "ఇంత జరుగుచున్ననూ ఊరకుంటివే! ఇది తగునా!" యని ప్రార్థించియు పెరుమాళ్లు పలుకక పోవుటచే చేతిలోని "తాళమును" స్వామిపైకి విసిరివేసిరి. అంత పెరుమాళ్లు సుదర్శన చక్రమును ప్రయోగించి చోళుని వధించిరట. ఇంద్కు నిదర్శనముగా పెరుమాళ్లు ప్రయోగచక్రముతో వేంచేసి యున్నారు. వయాలాలి మణవాళన్‌ పెరుమాళ్ల వద్ద తిరుమంత్రమును పొందిన తిరుమంగై ఆళ్వార్లు ఈ దివ్యదేశములో ఆమంత్ర సిద్ధిని పొందిరి.

ఇచట పెరియ తిరువడి (గరుత్మాన్)గొప్ప తపమాచరించి పెరుమాళ్ల ఎదుట వేంచేసియున్నారు.

ఇచ్చట ప్రతి నిత్యము రాత్రిభాగమున బియ్యముతో సమానముగా నేతినుపయోగించి చేసిన పొంగలిని పెరుమాళ్లు ఆరగింతురు. ఇది మిక్కిలి ప్రభావము గలది.

మార్గము: నాగపట్నం నుండి నన్నిలమ్‌ పోవు బస్‌లో తిరుప్పుగలూర్‌లో దిగి ఒక మైలు నడవాలి. మాయవరం-నల్లూరు బస్‌లో కూడ తిరుప్పుగలూర్ చేరవచ్చును.

   పా|మాలై నణ్ణి తొழுదెழுమినో వినైకెడ;
   కాలై మాలై కమల మలరిట్టు నీర్
   వేలై మోదుమ్‌ మదిళ్‌శూழ తిరుక్కణ్ణ పురత్తు;
   ఆలిన్ మేలాలమరన్దాన్ అడియిణైగళే.
        నమ్మాళ్వార్ తిరువాయిమొழி 9-10-1.

   శిలై యిలజ్గు పొన్నాழி తిణ్బడై తణ్డొణ్ శజ్గ మెన్గిన్ఱాళాల్
   మలై యిలజ్గుతోళ్ నాన్గే మత్తవను కెత్త కాణ్గెనిన్ఱాళాల్
   ములై యిలజ్గు పూమ్బయలై మున్బోడ అన్బోడి యిరుక్కిరిన్ఱాళాల్
   కలై యిలజ్గు మొழிయాళర్ కణ్ణపురత్తమ్మానై క్కణ్డాళ్ కొలో.

   శెరువరై మున్నాశఱుత్త శిలై యన్ఱో కైత్తలత్త తెన్గిన్ఱాళాల్
   పొరువరై మున్బోర్ తొలైత్త పొన్నాழி మత్తిరుకై యెంగిన్ఱాళాల్
   ఒరువరయుమ్‌ నిన్నొప్పారొప్పిలా వెన్నప్పా వెన్గిన్ఱాళాల్
   కరువరుపోల్ నిన్ఱానై క్కణ్ణపురత్తమ్మానై క్కణ్డాళ్ కొలో.
          తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 8-1-1,2

30

19. తిరునాగై (నాగ పట్టణమ్‌) - 19

శ్లో. సౌందర్య రాజ భగవాన్ తిరు నాగపుర్యాం సారాభిధాన సరసీ తటశోభితాయామ్‌|
   సౌందర్య పూర్వ లతికా మహిషీ సమేత సౌందర్య నామ వరమన్దిర మధ్యవాస:|
   సంస్థాన వేష రుచిరో భుజగాధి రాజ: శ్రీ మత్కలిఘ్న మునిసేవిత దివ్యమూర్తి:|
   ప్రాచీముఖ:కలిజిదాహ్వయ సూరి కీర్త్య:భక్తేష్ట దాన నిపుణో భువిరాజతేసౌ||

వివ: సొందర్య రాజ పెరుమాళ్-సౌందర్యవల్లి తాయార్-సార పుష్కరిణి-సౌందర్య విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-నాగరాజునకు, తిరుమంగై ఆళ్వార్లకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.

విశే: నాగరాజునకు ప్రత్యక్షమైన స్థలమగుటచే నాగపట్నం అని పేరు కలిగెను. మీన మాసం ఉత్తరా నక్షత్రమున తీర్దోత్సవము. ఈ క్షేత్రమునకు పశ్చిమముగా 10 కి.మీ దూరంలో "తిరుక్కణ్ణంగుడి" యను క్షేత్రము కలదు.

మార్గము: నాగపట్నం ప్రసిద్ది చెందిన పట్నము. వసతులున్నవి. బస్‌స్టేషన్‌కు ఎదుటవీధిలోనే సన్నిధి గలదు. మాయవరం నుండి వచ్చి సేవించుటయు సౌకర్యము.

పా. పొన్నివర్ మేని మరదకత్తిన్ పొజ్గిళంజోది యకలత్తారమ్‌
    మిన్;ఇవర్ వాయిల్ నల్ వేదమోదుమ్‌ వేదియర్ వానవరావర్ తోழி
    ఎన్నైయుం నోక్కి యెన్నల్గులమ్‌ నొక్కి యేన్దిళజ్గోజ్గెయుం నోక్కుకిన్నార్
    అన్నైయెన్కోక్కుమొన్ఱఇజగిన్ఱేన్ అచ్చోవొరు వరழగియవా
           తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 9-2-1

20 తిరునఱైయూర్ 20

(కుంభకోణం 10 కి.మీ)

శ్లో. నరయూర్ పరిపూర్ణ నామకే మణిమక్తాఖ్య తరంగిణీ తటే|
   త్రిదేశే ప్రధిశాముఖస్థితి: వరనంబిక్కలతా సమన్విత:|

శ్లో. శ్రీనివాసే విమానస్దో మేధావి మునిసేవిత:|
   కలిజిమ్మని సంకీర్త్య రాజతే భక్తవత్సల:||

వివ: నంబి-నంబిగై నాచ్చియార్-మణిముక్తానది-శ్రీనివాస విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-మేధావి మునికి ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: తాయార్లకు ప్రాధాన్యత గల క్షేత్రము. ఇచ్చటి పెరుమాళ్లకు శ్రీనివాసన్, వాసుదేవన్, పరిపూర్ణన్, నంబియను తిరునామములు కలవు. తాయార్ ఉత్సవర్ వంజుళవల్లి. ఇచట పెరుమాళ్లుతోపాటు సంకర్షణ, ప్రద్యుమ్న;అనిరుద్ద;పురుషోత్తములును వేంచేసి యున్నారు. బ్రహ్మకూడ వేంచేసి యున్నారు.

                                             31