దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరునాగై
19. తిరునాగై (నాగ పట్టణమ్) - 19
శ్లో. సౌందర్య రాజ భగవాన్ తిరు నాగపుర్యాం సారాభిధాన సరసీ తటశోభితాయామ్|
సౌందర్య పూర్వ లతికా మహిషీ సమేత సౌందర్య నామ వరమన్దిర మధ్యవాస:|
సంస్థాన వేష రుచిరో భుజగాధి రాజ: శ్రీ మత్కలిఘ్న మునిసేవిత దివ్యమూర్తి:|
ప్రాచీముఖ:కలిజిదాహ్వయ సూరి కీర్త్య:భక్తేష్ట దాన నిపుణో భువిరాజతేసౌ||
వివ: సొందర్య రాజ పెరుమాళ్-సౌందర్యవల్లి తాయార్-సార పుష్కరిణి-సౌందర్య విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-నాగరాజునకు, తిరుమంగై ఆళ్వార్లకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.
విశే: నాగరాజునకు ప్రత్యక్షమైన స్థలమగుటచే నాగపట్నం అని పేరు కలిగెను. మీన మాసం ఉత్తరా నక్షత్రమున తీర్దోత్సవము. ఈ క్షేత్రమునకు పశ్చిమముగా 10 కి.మీ దూరంలో "తిరుక్కణ్ణంగుడి" యను క్షేత్రము కలదు.
మార్గము: నాగపట్నం ప్రసిద్ది చెందిన పట్నము. వసతులున్నవి. బస్‌స్టేషన్‌కు ఎదుటవీధిలోనే సన్నిధి గలదు. మాయవరం నుండి వచ్చి సేవించుటయు సౌకర్యము.
పా. పొన్నివర్ మేని మరదకత్తిన్ పొజ్గిళంజోది యకలత్తారమ్
మిన్;ఇవర్ వాయిల్ నల్ వేదమోదుమ్ వేదియర్ వానవరావర్ తోழி
ఎన్నైయుం నోక్కి యెన్నల్గులమ్ నొక్కి యేన్దిళజ్గోజ్గెయుం నోక్కుకిన్నార్
అన్నైయెన్కోక్కుమొన్ఱఇజగిన్ఱేన్ అచ్చోవొరు వరழగియవా
తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 9-2-1
20 తిరునఱైయూర్ 20
(కుంభకోణం 10 కి.మీ)
శ్లో. నరయూర్ పరిపూర్ణ నామకే మణిమక్తాఖ్య తరంగిణీ తటే|
త్రిదేశే ప్రధిశాముఖస్థితి: వరనంబిక్కలతా సమన్విత:|
శ్లో. శ్రీనివాసే విమానస్దో మేధావి మునిసేవిత:|
కలిజిమ్మని సంకీర్త్య రాజతే భక్తవత్సల:||
వివ: నంబి-నంబిగై నాచ్చియార్-మణిముక్తానది-శ్రీనివాస విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-మేధావి మునికి ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
విశే: తాయార్లకు ప్రాధాన్యత గల క్షేత్రము. ఇచ్చటి పెరుమాళ్లకు శ్రీనివాసన్, వాసుదేవన్, పరిపూర్ణన్, నంబియను తిరునామములు కలవు. తాయార్ ఉత్సవర్ వంజుళవల్లి. ఇచట పెరుమాళ్లుతోపాటు సంకర్షణ, ప్రద్యుమ్న;అనిరుద్ద;పురుషోత్తములును వేంచేసి యున్నారు. బ్రహ్మకూడ వేంచేసి యున్నారు.
31 రాక్షసుడు అపహరించిన స్వామి వైరముడిని గరుడాళ్వార్ తీసికొని వచ్చు చుండగా ఆ యుద్ధములో కిరీట శిఖిరమందలి మణి అచటనున్న నదిలో పడినది. కావున ఆ నదికి మణి ముక్తా నదియను పేరు వచ్చినది. స్వామి వైరముడి నేటికిని శిఖరము లేక యున్నది. తిరుమంగై ఆళ్వార్లకు పెరుమాళ్లు పంచ సంస్కారములను అనుగ్రహించిన దేశము. ఈ సన్నిధిలో రాతి గరుడ వాహనము కలదు. మొదట నలుగురు స్వాములచే గర్భాలయము నుండి తీసికొని రాబడి, 16 మందిచే వాహన మంటపమునకు, 32 మందిచే అలంకార మంటపమునకు వేంచేపు చేయబడి అచట పెరుమాళ్లను వేంచేపు చేసి అలంకారమైన పిమ్మట 200 మంది శ్రీపాత్తాంగులతో తిరువీధి ఉత్సవము జరుగు సందర్బము అతి విలక్షణమైనది. ఈ ఉత్సవము వైకుంఠ ద్వాదశినాడు; కుంభమాస బ్రహ్మోత్సవములో 5వ రోజున రాత్రి జరుగును.
మార్గము: కుంభఘోణం నుండి టౌను బస్ కలదు. 10 కి.మీ. ఉప్పిలియప్పన్,తిరుచ్చేరైల నుండియు సేవింపవచ్చును.
1. పెడై యడర్త మడ వన్నమ్ పిరియాదు; మలర్కమలమ్
మడ వెడుత్త మదునుకరుమ్ వయలుడుత్త తిరువఱైయూర్
ముడై యడర్త శిరమేన్ది మూవులగుమ్ పలితిరివోన్
ఇడర్ కెడుత్త రువాళినిణై యడియే యడైనెంజే.
2. కులై యార్‌న్ద పళుక్కాయుమ్ పశుజ్గాయుమ్ పాళైముత్తుమ్
తలై యార్‌న్ద విళజ్గముగిన్ తడంజోలై త్తిఱునఱైయూర్
మలై యార్‌న్ద కొలంజోర్ మణిమాడ మిగమన్ని;
నిలై యార నిన్దాన్ఱన్ నీళ్‌కழలే యడై నెంజే
తిరుమంగై ఆళ్వార్ పెరియతిరుమొழி 6-9-1,8
21. నందిపుర విణ్ణగరమ్ 21(కుంభకోణం 10 కి.మీ)
(నాథన్ కోయిల్)
శ్లో. నంది పూర్వ పుర విణ్ణగర్ పురే నంది తీర్థయుజి పశ్చిమాసను:|
నాధనాధ ఇతి నామ సమ్యుతో నంది భక్తశిబిరాజ సేవిత:||
శ్లో. శ్రీమచ్చంపక వల్లీతి నాయక్యా పరిశోభిత:|
మధ్యే మన్దార వైమాన మాప్తే శ్రీ కలిజిన్నుత:||
వివ: విణ్ణగర పెరుమాళ్-నాథ నాథ పెరుమాళ్-చంపకవల్లి తాయార్-నంది పుష్కరిణి-మన్దార విమానము-పశ్చిమ ముఖము-కూర్చున్న సేవ-నందికి శిబికి ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
విశే: ఈ క్షేత్రమునకు తూర్పున 1. కి.మీ. దూరమున నందివనమను చోట
32 18. శౌరి రాజన్-తిరుక్కణ్ణపురం.
Souri Rajan - Tirukkanapuram
19. సౌందర్యరాజన్-తిరునాగై
Soundarya Rajan - Nagapatnam 20. నంబి-తిరునరైయూర్
Nambi - Tirunarayuru
21. నాథ నాథన్-నందిపుర విణ్ణగరం
Nadhanadhan - Nandipura Vinnagaram పెరుమాళ్ల సన్నిధి ఒకటి శిధిలముగా నున్నది. మీనమాసం హస్తా నక్షత్రము, తీర్థోత్సవం. ఈ సన్నిధికి తూర్పున 5 కి.మీ దూరంలో నాచ్చియార్‌కోవెల కలదు. ఈ క్షేత్రమునకు దక్షిణ జగన్నాథమని పేరు.
మార్గము: 1 కుంభఘోణం నుండి టౌన్ బస్ కలదు.2. కుంభకోణం నుండి "కొడుక్కి" అనుచోట దిగి 2 కి.మీ దూరము నడిచియు సన్నిధిని సేవింపవచ్చును.
పా|| తీదఱు నిలత్తొడెరి కాలికొడునీర్ కెళువిశమ్బు మవై యాయ్,
మాశఱు మనత్తి నొడఱక్క మొడిఱక్కై యవైయాయ పెరుమాన్ తాయ్
శెఱువలైన్దు తయిరుణ్డు కుడమాడు తడమార్వర్ తగై శేర్
నాదనుఱై కిన్ఱనకర్ నన్దిపుర విణ్ణ గరుమ్ నణ్ణు మనమే.
తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 5-10-1
22. తిరు విందళూరు 22 (మాయావరం)
(తిరువళందూర్)
శ్లో|| శ్రీ మదిందు సరసీకృతద్భుతా విందళూర్‌పురి సురేన్ద్ర దిజ్ముఖః
దివ్యగంధ వననాథ నామకః చంద్రశాప వినివర్తన ప్రియః
శ్లో|| వేద చక్రపద దేవయానగో వీరనామ శయనావలాంచనః
చంద్రసేవిత తనుర్విరాజతే కౌస్తుభాంశ కలి జిన్ముని స్తుతః
వివ: సుగంధ వననాధుడు, మరువినియమైన్ద పెరుమాళ్, పరిమళ రంగన్ - చంద్రశాప విమోచన నాచ్చియార్ - పుండరీకవల్లి నాచ్చియార్ - వేదచక్ర విమానము - చంద్ర పుష్కరిణి - తూర్పుముఖము - వీరశయనము - చంద్రునకు ప్రత్యక్షము - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
విశే: మీనం హస్త తీర్థోత్సవంగా బ్రహ్మోత్సవం. తులా మాసమున కావేరీ స్నానము మిక్కిలి విశేషము.
మార్గము: ఇది మాయవరం నగరంలో ఒక భాగము టౌన్ బస్ సౌకర్యము గలదు. మాయవరంలో అన్ని వసతులు కలవు.
పా|| నుమ్మైత్తొழுదోమ్ నున్దమ్ పణిశెయ్‌దిరుక్కుమ్ నుమ్మడియోమ్
ఇమ్మైక్కిన్బమ్ పెత్తిమైన్దా యిన్దళూరీరే
ఎమ్మైక్కడితా క్కరుమమరుళి ఆవారెన్ఱి రజ్గి
నమ్మై యొరుకాల్ కాట్టి నడన్దాల్ జాజ్గళుయ్యోమే
తిరుమంగై యాళ్వార్ - పెరియ తిరుమొழி 4-9-1.
33