దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరువాలి తిరునగరి

17. తిరువాలి తిరునగరి

(శీర్గాళి 18 కి.మీ)

శ్లో. దివ్యేలాతని పద్మినీ తటగతే హ్యష్టాక్షరా గారగ:
   భాతి శ్రీ తిరువాలి పట్టణ వరే పాశ్చాత్య వక్త్రాసన:|
   సంప్రాప్తోమృత కుంభ పూర్వ లతికాం శ్రీ కర్దమాలాతని
   ప్రత్యక్షో మణవాళ నాహ్వయ విభు: కీర్త్య: కలిధ్వంసిన:

వివ: వయలాలి మణవాళన్-అమృత ఘటవల్లి తాయార్-ఏవరవన్ శిందై తనక్కినియాన్-అలాతని పుష్కరిణీ-అష్టాక్షర విమానము-పశ్చిమ ముఖము-కూర్చున్న సేవ-అలాతనికి, కర్జమ ప్రజాపతికి ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: తిరుమంగై ఆళ్వార్ల అవతారస్థలమైన తిరుక్కుఱైయలూర్ ఈ క్షేత్రమునకు సమీపమునే గలదు. వృశ్చికమాసములో కృత్తికా నక్షత్రమునకు ముందు పది దినములు వీరి తిరు నక్షత్రము అతి వైభవముగా జరుగును.

తిరువాలి తిరునగరిలో పంగుని(మీనమాసం) ఉత్తరా నక్షత్రము అవసాన దినముగా బ్రహ్మోత్సవము జరుగును. ఈ ఉత్సవములలో ఎనిమిదవ ఉత్సవమునాటి రాత్రి తిరుమంగై ఆళ్వార్ "ఆడల్ మా" అను అశ్వము మీద వేంచేసి పెరుమాళ్ల తిరువాభరణములు అపహరించు సమయమున జరుగు సంవాదము అతి మనోహరముగా నుండును. తిరువాలి తిరునగరి వాస్తవముగా రెండు తిరుపతులు తిరువాలి నుండి తిరునగరి సుమారు 3 కి.మీ దూరములో నున్నది. తిరువాలి యందు నరసింహస్వామి సన్నిధి కలదు. తిరునగరి యందు వయలాలి మణవాళన్ వేంచేసి యున్నారు. ఈ తిరువాలికి దక్షిణమున 7 కి.మీ దూరములో తిరునాంగూరు దివ్యదేశము కలదు. రామానుజ కూటము కలదు.

ఈ క్షేత్రమున వేంచేసియున్న తిరుమంగై ఆళ్వార్ల సౌందర్యము వర్ణానాతీతము. ఆ సౌందర్యమును మణవాళ మామునులు ఇట్లు అభివర్ణించిరి.

అణైత్త వేలుమ్‌, తొழுత కైయుమ్; అழన్దియ తిరునామముమ్; ఓమెన్ఱ వాయుమ్‌, ఉయర్‌న్ద మూక్కుం; కుళిర్‌న్ద ముగముమ్; పరంద విழிయుమ్‌, ఇరన్డు కుழలుమ్‌, శురుండ వళైయుమ్‌, పడిత్తకాతుమ్‌, మలర్‌న్ద కాతు కాప్పుమ్‌, తాழన్ద శెవియుమ్‌, శెఱిన్ద కழுత్తుమ్‌, అకన్ఱ మార్‌పుమ్‌, తిరన్ద తోళుమ్‌;నెళిత్త ముతుకుమ్‌, కువిన్ద విడైయుమ్‌, అల్లి కయఱుమ్‌, ఆళున్దియ శీరావుమ్‌, తూక్కియ కరుజ్గోవైయుమ్‌, తొజ్గలుమ్‌ తనిమాలైయుమ్‌, శాత్తియ తిరుత్తణ్డైయుమ్‌, శతిరాన వీరక్కழలుమ్‌, కున్దియిట్ట కణైక్కాలుమ్‌, కుళిరవైత్త తిరువడి మలరుమ్‌, మరువలర్‌త ముడల్, తుణియ వాళ్ వీశుమ్‌, పరకాలన్ మజ్గై మన్నరాన వడివే.

27

   ఐయనరుళ్ మారి శెయ్యవడియెణై కళ్ వాழிయే
   అన్దుకిలుం శీరావుమ్‌ అణైయుమరై వాழிయే
   మైయిలకు వేలణైత్త వన్మై మిక వాழிయే
   మాఱామలంజ్జలిశెయ్ మలర్‌క్కరజ్గళ్ వాழிయే
   శెయ్యకలనుడనలజ్గల్ శేర్‌మార్‌పుమ్‌ వాழிయే
   తిణ్బుయముమ్‌ పణిమలర్‌న్ద తిరుకழுత్తుమ్‌ వాழிయే
   మైయల్ శెయ్యుముక ముఱువల్ మలర్‌క్కణ్గల్ వాழிయే
   మన్నుముడి తొప్పారమ్‌ వలయముడన్ వాழிయే
   "ఉఱైకழிత్త వాళైయొత్త విழிమడన్దై మాతర్ మేల్,
   ఉరుకవైత్త మనమొழிత్తు వులకழన్దనన్బిమేల్,
   కుఱైయవైత్తుమడలెడుత్త కుఱైయాలాళితిరుమణ
   జ్గొల్లైతన్నిల్ వழிపఱిత్త కుట్రమత్‌త శైజ్గెయాన్,
   మఱైయురైత్త మనిర్దతై మాలురైక్కవవవ్ మున్నే,
   మడియోతుక్కి మనమడక్కి వాయ్ పుతైత్తు ఒన్నలార్,
   కఱైకుళిత్త వేలణైత్తు నిన్ఱనిన్ద నిలైమైయెన్,
   కణ్డై విట్ట కన్ఱిడాతు కలియవాణై యాణైయే"

మార్గము: శీర్గాళి నుండి తిరువెంగాడు పోవుబస్ మార్గములో 8 కి.మీ దూరములో ఈ క్షేత్రము కలదు. వసతులు లేవు.

పా. తూవిరియ మలరుழிక్కి త్తుణైయోడుమ్‌ పిరియాదే
    పూవిరియ మదునగరమ్‌ పాఱివరియ శిఱువణ్డే;
    తీవిరియ మఱైవళఱ్కమ్‌ పుగழாళర్;తిరువాలి
    ఏవరివెఇలై యాను క్కెన్నిలైమై యూరాయే.

    నిలయాళా నిన్ వణబ్గ వేణ్డాయే యాగిలుమ్; ఎన్
    ములై యాళ వొరువాళున్నగలత్తాలాళాయే;
    శిలై యాళా;మరమెయ్‌ద తిఱలాళా తిరుమెయ్య
    మలై యాళా; నీయాళవళై యాళ్మాట్టోమే
            తిరుమంగై ఆళ్వార్ పెరియతిరుమొழி 3-6-1;9

18. తిరుక్కణ్ణపురం - 11

(నన్నిలమ్‌ నుండి 7 కి.మీ)

శ్లోకము :

శ్రీ మత్కణ్ణ పురేతు నిత్య సరసీ సంశోభితే ప్రాజ్ముఖం
దేవ్యా కణ్ణ పురాభిధాన సుయుజా శ్రీశౌరి రాజప్రభుమ్‌ |
వైమానే స్థిత ముత్పలా వతక మిత్యాఖ్యేతు కణ్వేక్షితం
సేవే విష్ణు మనశ్శఠారి కలిజిత్ శ్రీ కౌస్తుభాంశ స్తుతమ్‌ |

వివ: శౌరిరాజ పెరుమాళ్ - కణ్ణపురనాయకి - నిత్య పుష్కరిణి - తూర్పుముఖము - నిలుచున్నసేవ - ఉత్పలావర్తక విమానము - కణ్వ మహర్షికి ప్రత్యక్షము - నమ్మాళ్వార్; కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్ లు కీర్తించినది.

విశే: ఇచ్చట పెరుమాళ్లు శ్రీదేవి, భూదేవి, నీళాదేవి, గోదా దేవులతో వేంచేసి యున్నారు. పెరియ పెరుమాళ్లు(శ్రీరంగనాధుల) మంగళా శాసనం ప్రకారం శ్రీ విభీషణాళ్వార్లకై ప్రతి అమావాస్యనాడు దక్షిణ తిరుముఖ మండలముగా వేంచేసి సేవ సాయింతురు.

ఈ శౌరిరాజ పెరుమాళ్లను తిరుమంగై ఆళ్వార్ "కుణపాల మదయానై"(ప్రాగ్దిశా దిగ్గజము) యని కీర్తించి యున్నారు. మఱియు ఈ క్షేత్రమును "కీయైవీడు"(క్రింది నగరము) అని అభివర్ణించి యున్నారు. (మేలై వీడు శ్రీరంగము) "ఉత్పలావతకమ్" అనియు విలక్షణమైన తిరునామము గలదు. కృష్ణారణ్యక్షేత్రమనియు, సప్త పుణ్య క్షేత్రమనియు పేరు కలదు.

నమ్మాళ్వార్ "మాలై నణ్ణి" అను తిరువాయిమొழிలో (9-10)"మరణమానాల్ వైకున్దం కొడుక్కుం పిరాన్" అని సర్వేశ్వరుని శరణ్యముకున్దత్వ గుణమును(అనగా ఆశ్రితులైన వారికి మోక్షమును ప్రసాదించు గుణమును)కీర్తించిరి. నమ్మాళ్వార్లు తిరువాయి మొழி(9-10)లో నాల్గు పాశురముల వరకు భక్తిని ఉపదేశించి ఈపాశురమున(5) ప్రపత్తిని ఉపదేశించిరి. "తన శ్రీపాదములను ఆశ్రయించిన వారికి సకలవిధ రక్షకుడగును. శరీరావసానమున మోక్షమును ప్రసాదించును. తనను ప్రేమించిన వారికి తాను ప్రేమకై మూర్తి యగును" అని సర్వేశ్వరునకు గల "మోక్ష ప్రదత్వ" గుణమును ప్రకాశింపచేసిరి.

క్రిమి కంఠచోళుడు ఈ సన్నిధి ప్రాకారములు ఆరింటిని ధ్వంసము చేసెను. దానిని సహింప జాలని "అరయరుస్వామి" పెరుమాళ్లతో "ఇంత జరుగుచున్ననూ ఊరకుంటివే! ఇది తగునా!" యని ప్రార్థించియు పెరుమాళ్లు పలుకక పోవుటచే చేతిలోని "తాళమును" స్వామిపైకి విసిరివేసిరి. అంత పెరుమాళ్లు సుదర్శన చక్రమును ప్రయోగించి చోళుని వధించిరట. ఇంద్కు నిదర్శనముగా పెరుమాళ్లు ప్రయోగచక్రముతో వేంచేసి యున్నారు.